Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అంటీలు చిరునవ్వులు చిందిస్తూ టాటా చెబుతుంటే అక్కయ్యలు ముగ్గురూ స్కూటీలలో నన్ను దాటుకుని ముందుకు వెళ్లిపోవడం చూసి హమ్మయ్యా ...... వదిలేసి వెళ్లిపోయారులే అనుకుని లోపలికి వెళ్లిపోయారు .
ప్చ్ ...... మళ్లీ అంటీల దర్శనం సాయంత్రానికే అన్న చిరు నిరాశతో బస్టాప్ వైపుకు నడిచాను .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... నిన్ను విడిచి ఎలా వెళతాము చెప్పు ఎక్కు వెళదాము .
ఊహూ ....... అంటీలకు టేస్ట్ చెయ్యడానికి కూడా మిగల్చకుండా మొత్తం తినేశారుగా , నేను బస్సులో వస్తానులే అంటూ ముందుకు నడిచాను .
అక్కయ్యలు : అయ్యో తమ్ముడూ ...... 10 మందికి సరిపోయేంత తీసుకొచ్చి ఇలా అలక చెందితే ఎలా చెప్పు , ఎంత తిన్నా రెట్టింపు అవుతూనే ఉంది , మావల్ల కాక నీ అంటీలు తినేలా ఉంచేసే వచ్చాములే ......
నిజమా అక్కయ్యలూ .......
అక్కయ్యలు : ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్ ....... , కావాలంటే చూడు అంటూ వీడియో కూడా చూయించారు మొబైల్లో .......
నేను తీసుకొచ్చినప్పుడు అంత బరువుకూడా లేదే ........
అక్కయ్యలు : ఏమో మరి , ఒక్కటిమాత్రం చెప్పగలం అమ్ములు అదే అదే నీ ప్రాణమైన అంటీలు ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు .
నాకైతే నమ్మకం లేదు అక్కయ్యలూ ....... , నేనంటేనే ఇష్టం లేదు ఇక నేను తీసుకొచ్చిన టిఫిన్ ఎలా టేస్ట్ చేస్తారు చెప్పండి .
అక్కయ్యలు : మేము లొట్టలేస్తూ తింటున్నప్పుడు అమ్మల నీ అంటీల నోరూరడం గమనించాములే తప్పకుండా తింటారు - రికార్డ్ అయ్యేలా సెట్ చేసే వచ్చాములే - సాయంత్రం నువ్వే చూస్తావుగా .......
అదే నిజమైతే బాగుండు - థాంక్యూ థాంక్యూ అక్కయ్యలూ ........ 
అక్కయ్యలు : హ్యాపీ కదా అయితే వాగ్దేవి స్కూటీ ఎక్కు .......
హ్యాపీగా ఎక్కుతాను అక్కయ్యలూ ....... , కానీ అంటీల వాక్కు పాటించాలి కదా ........ , నేను బస్సులోనే వస్తాను వెళ్ళండి .
అక్కయ్యలు : అంటీ అంటీ అంటీ ....... , నిన్ను ఎలా ఎక్కించుకోవాలో మాకు తెలుసులే ....... , నువ్వు తినాల్సిన టిఫిన్ ను నువ్వు తినకుండా నీ అంటీలకోసం తీసుకొచ్చావని తెలుసులే , నువ్వు గనుక స్కూటీ ఎక్కితే నీ అంటీలు వండిన టిఫిన్ ..........
ఏ స్కూటీ ఏ స్కూటీ ఎక్కాలో ఆర్డర్ వెయ్యండి అక్కయ్యలూ ఎక్కేస్తాను అంటూ అక్కయ్యల మాటకూడా పూర్తికాకముందే ఆతృతతో బదులిచ్చాను .
అక్కయ్యలు : అదీ అలారా దారికి అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి నవ్వుకున్నారు , ముందైతే బస్టాప్ టర్నింగ్ లో ఉన్న మా అంటీ ఇంట్లో నీకు స్వయానా మాచేతులతో తినిపించాక బయలుదేరదాము .
అంటీల చేత తింటే హ్యాపీ కానీ ........
అక్కయ్యలు : కానీ అంటూ కోపంతో చుట్టూ చేరి ఉడికిపోతున్నారు .
కూల్ కూల్ అక్కయ్యలూ ....... , అధీఅధీ మనం తింటూఉంటే అక్కడ కాలేజ్ - స్కూల్ కు టైం అవుతుంది , మీరు డ్రైవ్ చేస్తూ ఉండండి నేను వెనక్కు తిరిగి తింటూ ఉంటాను .
అక్కయ్యలు : మాట మారుస్తున్నావు కదూ ...... , ఎప్పుడూ అంటీలు అంటీలు అంటీలు ....... స్కూల్ కు ఆలస్యం అవుతుంది కాబట్టి ఒప్పుకుంటున్నాము అంటూ నా స్కూల్ బ్యాగ్ అందుకుని ముందు ఉంచుకుని ఎక్కమన్నారు .
అంటీల టిఫిన్ ముగ్గురు అంటీలవీ కావాలి .
అక్కయ్యలు : మూడు బాక్స్ లు పట్టుకుని బ్యాలన్స్ చేస్తూ తినడం కష్టం కదా ......
ఆ సంగతి పెద్దమ్మ ....... అదే అదే నేను చూసుకుంటానులే అక్కయ్యలూ , మీరైతే అంటీలు చెప్పినట్లు జాగ్రత్తగా పోనివ్వండి , మీకేమయినా అయితే అంటీలు తట్టుకోలేరు అధిచూసి నా ఈ బుజ్జి హృదయం తట్టుకోలేదు .
అక్కయ్యలు : అంటే అమ్మలు బాధపడతారని తప్ప మాకేమైనా నువ్వు ఫీల్ అవ్వవు అన్నమాట .
అంటీల ఆశీర్వాదం ఉన్నంతవరకూ మా అక్కయ్యలకు ఏమీకాదు .
అక్కయ్యలు : ఇందుకు కాదూ నువ్వంటే ఇష్టం అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
నాకు కావాల్సింది మీ ముద్దలు కాదు ........
అక్కయ్యలు : నిన్నూ నిన్నూ నిన్నూ అంటూ సున్నితంగా మొట్టికాయలు వేసి , మూడు టిఫిన్ బాక్సస్ అందించారు , ఎలా తింటావో నీ ఇష్టం అంటూ స్కూటీలు ఎక్కారు .
థాంక్యూ అక్కయ్యలూ ...... wow అంటీల చేతి అద్భుతమైన టిఫిన్ జై పెద్దమ్మ అంటూ తలుచుకుని స్కూటీలో మరొకవైపుకు ఎక్కి కూర్చున్నాను , ఎడమచేతితో మూడింటినీ బ్యాలన్స్ గా పట్టుకుని ఇష్టంతో తింటూ మ్మ్ మ్మ్ మ్మ్ ఇది వాసంతి అంటీ చేతిటిఫిన్ - ఇది కాంచన అంటీ చేతి టిఫిన్ - ఇది సునీత అంటీ చేతి టిఫిన్ ఒకదాని మించి మరొకటి అమృతమే అంటూ లొట్టలేస్తూ తింటున్నాను . 
నేనెలా తింటానోనని కావ్య - స్వాతి అక్కయ్యలు వెనుకే ఫాలో అవుతూ చూసి అవాక్కవుతున్నారు , ఒసేయ్ వాగ్దేవి ఎంత చక్కగా తింటున్నాడో ముచ్చటేస్తోంది తెలుసా అలాగే జాగ్రత్తగా స్టడీగా పోనివ్వు .
వాగ్దేవి అక్కయ్య : అలాగా అయితే ok తమ్ముడు తినడమే కదా మనకు కావాల్సింది .
థాంక్యూ అక్కయ్యలూ ....... దేవలోకపు అమృతంతో సమానంగా ఉన్నాయి .
అక్కయ్యలు : అంటే మేము దేవలోకపు అమృతం కంటే టేస్టీ అయిన టిఫిన్ తిన్నామన్నమాట .......
నాకైతే మా అంటీల చేతి టిఫిన్స్ అద్భుతం అంటూ కుమ్మేస్తున్నాను అంటీలను తలుచుకుంటూ ....... , పెద్దమ్మ వల్లనే అక్కడ టిఫిన్ రెండింతలు అయ్యిందన్నమాట లవ్ యు పెద్దమ్మా అలాగే అంటీలు టేస్ట్ చెయ్యడం మాత్రమే కాదు తృప్తిగా తినేలా చూడండి అంటూ తలుచుకున్నాను , స్కూల్ కు చేరుకునేలోపు ఇష్టంగా తృప్తిగా తిన్నాను .

హమ్మయ్యా తమ్ముడు ఫుల్ గా తినేశాడు అంటూ స్కూటీలు స్టాండ్స్ వేసి వచ్చి నీళ్లు అందించారు .
థాంక్యూ అక్కయ్యలూ ....... 
అక్కయ్యలు : స్కూల్ లోపలికి చూసి ఏంటి తమ్ముడూ హడావిడి ? .
స్కూల్ ప్రాబ్లమ్స్ పై చర్చించడానికి స్టూడెంట్స్ పేరెంట్స్ ను పిలిపించారు మా హెడ్ మిస్ట్రెస్ మేడమ్ , అందుకే అందరి పేరెంట్స్ వచ్చారు , నాకు ..... అంటీలు తప్ప ఎవరూ లేరు అంటీలు రారన్నారు కదా .......
అక్కయ్యలు : ఎప్పుడు ఆడిగావు ? .
మీరు లోపల టిఫిన్ తింటున్నప్పుడు అడిగాను .
అక్కయ్యలు : నువ్వంటేనే మాకు ఇష్టం లేదు ఇక నీతోపాటు స్కూల్ కు ఎలా వస్తాము అన్నారన్నమాట .
అవును అక్కయ్యలూ .......
అక్కయ్యలు : నీ అంటీలు రాకపోతేనేమి మేమోస్తాము పదా అంటూ నా చేతులు అందుకున్నారు .
నో నో నో అంటీలే రావాలి మీరు వద్దు .
అక్కయ్యలు : ఏమిటీ ఏమిటీ ఏమిటీ .......
కూల్ కూల్ కూల్ అక్కయ్యలూ ....... , నావలన మీ క్లాస్సెస్ మిస్ అయ్యాయని అంటీలకు తెలిస్తే ఇక ఏమైనా ఉందా , నేను విరోధిని అయిపోతాను ఇంటి దగ్గరకు కూడా రానివ్వరు , మీరు లేకపోయినా ఉండగలను కానీ ........
అక్కయ్యలు : అమ్మలను చూడకుండా ఉండలేవు ....... తెలుసులే అంటూ కాస్త కోపంతోనే బుగ్గలపై గిల్లేసారు - అవునుకదా మావలన అలా జరగడం మాకూ ఇష్టం లేదు .
అర్థం చేసుకున్నందుకు థాంక్యూ అక్కయ్యలూ ....... , అయినా ఇక్కడ ఎందుకు ఆపారు కాలేజ్ దగ్గర ఆపాల్సింది , నేను నడుచుకుంటూ వచ్చేవాడిని కదా ...... పదండి పదండి వదిలేసి వస్తాను అంటూ బ్యాగు అందుకున్నాను .
అక్కయ్యలు : పర్లేదులే మేము వెళతాము నువ్వు లోపలికివెళ్లు .......
ముందు మీరువెళ్లండి , వన్ మినిట్ వన్ మినిట్ అక్కయ్యలూ ....... ఒకటి అడుగుతాను ఫీల్ అవ్వకూడదు .
అక్కయ్యలు : అడుగు ఏదైనా అడుగు ఏమాత్రం ఫీల్ అవ్వము , మా తమ్ముడు అనుకున్నాము కాబట్టి ఏమైనా అడగొచ్చు .......
థాంక్యూ అక్కయ్యలూ , అక్కయ్యలూ ...... మీరు ఎంతో ముచ్చటగా ఉంటారు కానీ మీ ఒంటిపై ఒక్క జ్యూవెలరీ కూడా లేదు -కలిసిన రోజు నుండీ గమనిస్తూనే ఉన్నాను - మీరు ధరిస్తే వాటికే అందం వస్తుంది , మనసులోని మాట ఆడిగేసాను తప్పైతే క్షమించండి .
అక్కయ్యలు : నిజమే అంటూ బాధపడుతున్నారు - కళ్ళల్లో చెమ్మ కూడా చేరింది .
అంతే గుండె జిల్లుమంది , అక్కయ్యలూ ....... మీరు బాధపడితే .......
అక్కయ్యలు : నీ అంటీలు బాధపడతారనే కదా , ముందైతే ఇది చెప్పు నగలు మేమువేసుకోలేదని ఫీల్ అవుతున్నావా లేక నీ అంటీలు వేసుకోలేదని ఫీల్ అవుతున్నావా ? .
అదీ అదీ అంటూ లోలోపలే .......
అక్కయ్యలు : మాకు తెలుసు మాకు తెలుసు నీ అంటీల గురించే కదా అంటూ బుగ్గలపైననే కాకుండా చేతులపై కూడా గిల్లేసారు .
స్స్ స్స్ ..........
అక్కయ్యలు : ఇంతేమరి అంటూ నవ్వుకుంటున్నారు . 
కావ్య అక్కయ్య : చాలా చాలా నగలు ఉన్నాయి తమ్ముడూ కానీ మా స్టడీస్ మరియు నాన్నల బిజినెస్ కోసం తాకట్టు ఉంచాల్సి వచ్చింది అంటూ బాధతో చెప్పింది .
అక్కయ్యలు : కావ్యా ...... మన స్టడీస్ పూర్తికాగానే విడిపించుకుందాములే , తమ్ముడూ...... మొదట నీ అంటీలనే అలంకరిస్తాములే హ్యాపీనా ఇక వెళ్ళు .
అక్కయ్యలూ అక్కయ్యలూ మరొక నిమిషం అంటూ బ్యాగులోనుండి చాక్లెట్ లు తీసి అందించాను .
అక్కయ్యలు : పట్టరాని ఆనందంతో థాంక్యూ థాంక్యూ థాంక్యూ తమ్ముడూ అంటూ అందుకుని బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నారు .
అంటీలకు ఇవ్వడానికని బ్యాగులో పెట్టుకుని మరిచిపోయాను అక్కయ్యలూ , సాయంత్రం ఇంతకు మించినవి ఇస్తానులే అంటూ అంటీలను తలుచుకుంటున్నాను .
అంతే ఒక్కసారిగా ముద్దులు ఆపి ముద్దులు పెట్టినచోటనే గిల్లేసి , అంటీ అంటీ అంటీ ....... అంటూ కాస్త కోపంతోనే వెళ్లిపోతున్నారు .
అక్కయ్యలూ నెమ్మదిగా వెళ్ళండి అంటూ వెనుకే వడివడిగా వెళ్ళాను .
అక్కయ్యలు ఆగి సరేలే నువ్వు వెళ్ళు .......
మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే అక్కడ అంటీలు హ్యాపీ మీరు లోపలికి వెళ్ళండి అంటూ అక్కయ్యలు కాలేజ్ లోపలికి వెళ్లేంతవరకూ చూసి చేతిని ఊపి గుండెలపై చేతినివేసుకుని స్కూల్ గేట్ దగ్గరికి చేరుకున్నాను , స్టూడెంట్స్ - పేరెంట్స్ తో హడావిడి హడావిడిగా ఉంది స్కూల్ గ్రౌండ్ .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 03-12-2023, 09:08 AM



Users browsing this thread: 2 Guest(s)