Thread Rating:
  • 3 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సుధా రాణి ( COMPLETED )
****
Update 25

Previous Update 24.1 : https://xossipy.com/thread-48064-post-49...pid4984078
..
రాఘవరావు గారు పిలుస్తున్నారు అని తెలుసుకున్న సుధారాణి వెంటనే తను ఆడుతున్న ఆటను మద్యలోనే వదిలేసి తన పక్కనే ఉన్న రవి , దివ్య మరియు అన్విత లని తన వెంట ఇంట్లోకి తీసుకెళ్లింది. ఇక ఆ ఇంట్లో ఉన్న అందరూ ఆ ఇంటి హాల్ లో ఉన్నారు. ఆ హాల్ మద్యలో రాఘవరావు గారు నిల్చొని ఇండగా ఆయనకి ఎదురుగా సుధారాణి , తన పక్కనే రవి , అన్విత లు నిలబడి ఉన్నారు. అన్వితకి కొంత దూరంలో ఉమ నిలబడి ఉండగా ఉమ పక్కనే దివ్య , రఘు నిల్చొని ఉన్నారు. ఇక సుశీల ఏమో రఘు కి కొంత దూరంలో ఇంకా సరిగ్గా చెప్పాలంటే రాఘవరావు గారి పక్కనే నిల్చొని ఉంది.

( రవి మాటలలో )

నాతో సహా అక్కడ ఉన్న అందరూ ఆ ఇంటి పెద్ద అయిన రాఘవరావు గారి చెప్పబోతున్న మాటలు వినడానికి సిద్దంగా ఉన్నారు. అలా అందరూ సిద్దంగా ఉన్న సమయంలో రాఘవరావు గారు మాట్లాడబోతుండగా ఒక్కసారిగా ‘తాతయ్య నేను వచ్చేశాను’ అని ఒక అమ్మాయి గొంతు నాతో సహా అక్కడ ఉన్న అందరికీ వినిపించింది. ఆ గొంతు విని వచ్చిందో ఎవరు అని అందరూ ఆ ఇంటి గుమ్మం వైపు చూశారు.

నాకు వినిపించిన ఆ గొంతు ఎక్కడో విన్నట్టు నాకు అనిపించి ఎవరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో చూడాలని చూస్తూ ఉండగా నా  చూపు , ఆ ఇంటి గుమ్మంలో నిలబడి ఉన్న ఒక అమ్మాయి దగ్గర ఆగింది. అక్కడ నిల్చొని ఉన్న ఆ అమ్మాయిని గుర్తించడానికి నాకూ పెద్దగా సమయం పట్టలేదు . అక్కడ ఉన్న అమ్మాయిని చూసిన నేను షాక్ లోకి వెళ్ళాను. ఆ అమ్మాయిని చూసిన నాకు ఆ క్షణం ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు అనిపించింది.

నేను ఇంతలా షాక్ అవ్వడానికి కారణం ఆ వచ్చిన అమ్మాయి ఎవరో కాదు విజయవాడలో తనకు ఏమీ కానీ నాకు , ఆశ్రయం కల్పించిన ప్రియ. అవును ఆ వచ్చిన అమ్మాయి నేను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన నా ప్రియనే . ఎవరి జీవితాన్ని అయితే నేను నాశనం చేశాను , అని బాద పడి ఒక లెటర్ రాసి తనకు చెప్పకుండా విజయవాడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలని బస్సు ఎక్కానో , ఆ ప్రియ ఇప్పుడు నా కళ్ల ముందు నిల్చొని నన్నే కోపంగా చూస్తూ ఉంది. అక్కడ ఉన్న నన్ను ప్రియ కచ్చితంగా గుర్తుపట్టినట్టుంది.

ప్రియ అక్కడకి రావడం ఊహించని నేను షాక్ లో ఉండగా , హాల్ లో ఉన్న దివ్య “అక్క ! వచ్చేశావా ! ” అని అంటూ పరిగెత్తుకుంటూ ప్రియ దగ్గరకి వెళ్ళి కౌగిలించుకుంది. దివ్య అలా అక్క అని పిలవడం విని నేను మళ్ళీ షాక్ అయ్యాను.

ఆ వెంటనే ఉమ కూడా దివ్య పక్కకి వెళ్ళి అక్కడకి వచ్చిన ప్రియతో “వస్తున్నా అని ఒక్క కాల్ కూడా చేయకుండా ఒక్కదానివే వచ్చేశావే ప్రియ” అని అడిగింది. అప్పటిదాకా అక్కడకి వచ్చిన ఆ అమ్మాయి నాకు తెలిసిన ప్రియ యేన అనే చిన్న సందేహం ఉనింది కానీ , ఉమ ఎప్పుడైతే ప్రియ అని పిలిచిందో ఆ క్షణం ఆ సందేహం పోయి మొత్తం స్పష్టంగా అర్ధం అయింది. ఇక్కడకి వచ్చింది నాకు తెలిసిన ప్రియ అని.

ఉమ , తన ముందు ఉన్న ప్రియని అడుగుతూ ఉంటే , ప్రియ మాత్రం ఉమకి సమాదానం చెప్పకుండా నన్నే కోపంగా కొన్ని క్షణాలు చూస్తూ ఉంది. ఆ సమయంలో ప్రియ కళ్ళులో నా మీద ఉన్న కోపం నాకు స్పష్టంగా కనిపించింది.  కోపంతో నిండి ఉన్న ప్రియ కళ్ళుని నేను చూస్తుండగానే ప్రియ కళ్ళు ఒక్కసారిగా కన్నీటితో నిండడం నేను గమనించాను. ఆ క్షణం ప్రియ నామీద నుంచి తన చూపుని ఉమ మీదకి మరల్చి తనని గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలెట్టింది. ప్రియ అలా ఏడుస్తూ ఉంటే ఉమ “ఎందుకే అలా ఏడుస్తున్నావ్ .. ఈ అమ్మ దగ్గరికి వచ్చేసావు కదా ఇక ఆ ఏడుపు ఎందుకు తల్లి” అని ప్రియతో అంటూ ఉంది.

ఎప్పుడైతే ప్రియతో ఉమ ‘ఈ అమ్మ దగ్గరకి వచ్చేసావు కదా’ అని అనిందో ఆ క్షణం నేను గ్రహించిన మరో విషయం ; ప్రియ కూడా ఉమ కూతురు అని  దివ్య , ప్రియ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు అని . ఇంకేముందు నా జీవితం ఒక్క సారిగా తల కిందులు అయింది అని పూర్తిగా అర్ధం అయింది.

ఎప్పుడైతే ప్రియ కూడా ఉమ కూతురు అని , దివ్య అక్క అని నాకు పూర్తిగా అర్ధం అయినా తరువాత నా మనసులో నేను మాట్లాడుకుంటూ ‘దివ్య కళ్ళని , ఉమ కళ్ళని చూస్తూ ఉంటే ప్రియ గుర్తుకురావయడానికి కారణం ఉమ పెద్ద కూతురు ప్రియ కాబట్టి , అలాగే ప్రియ సొంత చెల్లెలు దివ్య కాబట్టి. అందుకే ఈ ముగ్గురి కళ్ళు ఒకేలా ఉండడం నేను గ్రహించాను . ఈ విషయం గురించే ఉమని అడుగుదాం అని అనుకున్నానుగా కానీ అడగాకుండానే సమాదానం దొరికింది . ఇక ఇక్కడ నన్ను చూసిన ప్రియ ఎలా రేయాక్ట్ అవుతుందో ’ అని నా మనసులో అనుకుంటూ ఉన్నాను.

అలా నేను నా మనసులో అనుకుంటూ ఉండగా ప్రియ ఏడవడం గమనించిన ఆ ఇంట్లోని అందరూ ప్రియ దగ్గరకి వెళ్లారు. నాకు కూడా ప్రియ దగ్గరకి వెళ్ళి తనని ఓదార్చాలి అని నా మనసు తపిస్తూ ఉంది కానీ , ప్రియ ముందుకు వెళ్ళడానికి ధైర్యం చాలా లేదు.

సుధారాణి తన కూతురు అన్విత కూడా ప్రియ దగ్గరకి వెళ్ళారు . అయితే ప్రియ వాళ్ళందరినీ పెద్దగా పట్టించుకోకుండా నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటే తన చూపులో నాకు ‘నన్ను వదిలేయాలని నీకు ఎలా అనిపించింది’ అని ప్రియ నన్ను అడుగుతున్నట్టు నాకు అనిపించింది.

ప్రియ చూపుకి నా నుంచి ఎలాంటి స్పందనం లేకపోవడంతో ఏదో ఆలోచనలో పడింది. అప్పుడు రఘు , తన భార్య ఉమతో “అక్కడే నిలబెట్టి అడిగితే అది ఏమని చెపుతుంది ఉమ , ఇంట్లోకి రానివ్వు” అని చెప్పడంతో ఉమ , ప్రియని తీసుకొని నేరుగా నా పక్కన ఉన్న మంచం మీద కూర్చో బెట్టింది.

ప్రియకి ఒక పక్క ఉమ మరోపక్క దివ్య కూర్చోని ఉంటే రాఘవరావు అక్కడే ఒక కుర్చీలో కూర్చుని ప్రియ తో “ఇంటి మీద , మీ అమ్మ మీద అంత  బెంగ పెట్టుకొని ఒంటరిగా అక్కడ ఉండక పోతే ; వారానికి ఒక సారి అయిన వచ్చి పోవచ్చుగా తల్లీ ... నువ్వు వస్తా అంటే మేము వద్దు అని అంటామా చెప్పు” అని అన్నాడు.

ఆ వెంటనే సుశీల మాట్లాడుతూ “ఇంటికి పెద్ద మనవరాలివి , నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నానే” అని అంటూ ఉంటే సుధారాణి ఆశ్చర్యంగా సుశీలతో “మా .. పెద్ద మనవరాలు అని అంటున్నావు ! అంటే ఈ ప్రియ , రఘు అన్నయ్య కి పెద్ద కూతురా ?” అని అడిగింది.

అప్పుడు రఘు గారు “అవును సుధా ప్రియ నాకు పెద్ద కూతురు . బహుశా నీకు ఎప్పుడూ దివ్య గురించే చెప్పడం వల్ల ప్రియ గురించి నీకు తెలియలేదు” అని చెప్పాడు.

రఘు గారు మాటలు వినిన అన్విత “హై అంటే నాకు ఇంకో వదిన కూడా ఉంది అనమాట సూపర్” అని అంటూ నేరుగా ప్రియ దగ్గరకి వెళ్ళి తనకి ఎదురుగా నిల్చొని “ ప్రియ వదినా నా పేరు అన్విత నేను , నీ మేనత్త సుధారాణి అయినా ఈమె ఒక్కగానొక్క ముద్దుల కూతురుని”అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంది.

అలా పరిచయం చేసుకున్న వెంటనే మళ్ళీ ప్రియతో “వదినా నిజం చెపుతున్న నమ్ము . నువ్వు ఏడుస్తూ ఉన్నా కూడా ఎంత అందంగా , ముద్దుగా ఉన్నావు తెలుసా  నీ బుగ్గలు చూస్తూ ఉంటే ముద్దు పెట్టాలని ఉంది.  దివ్య వదిన కన్నా నువ్వే చాలా అందంగా ఉన్నావు తెలుసా వదినా . కావాలంటే నువ్వే చూడు,  నువ్వు వచ్చినప్పటి నుంచి రవి అన్నయ్య నిన్నే కన్ను ఆర్పకుండా ఎలా చూస్తున్నాడో” అని చెప్పింది. అన్విత అలా మాట్లాడుతూ ఉంటే తన ఏడుపు ఆపి అన్విత చెప్పే మాటలు విని నన్ను చూసింది.

ప్రియ నన్ను అలా చూస్తూ ఉండగా నా మనసులో నేను ‘ఓరినాయనో ! ఇందాకటి నుంచి నేను ప్రియని చూడడం అన్విత చూసిందా .. అమ్మో ! అన్నీ గమణిస్తూనే ఉందా ఈ పిల్ల . అయినా ఈ పిల్లేంటి ఇలా అందరి ముందు నేను ప్రియని చూస్తున్న అని చెప్పిందే ! అందరూ ఏమనుకుంటారో’అని నా మనసులో అనుకోని ఆ వెంటనే నేను అన్విత తో “ఆ అమ్మాయి ఎవరా అని అలా చూశాను అన్విత.  అంతే ఇంకేమీ లేదు” అని అన్నాను.

నేను తను ఎవరో తెలియనట్టుగా అనడం వినిన ప్రియ మళ్ళీ ఒక్కసారి చురుగ్గా నా వైపు చూసింది, ఆ చూపు తట్టుకోలేక నా తల దించుకున్నాను. అప్పుడు ప్రియ పైకి లేచి తనకి ఒక పక్క ఉన్న సుధారాణి దగ్గరకి వెళ్ళి తన ముందు నిలబడి తనతో మాట్లాడుతూ “అప్పుడప్పుడు నానమ్మ చెపుతూ ఉంటే నీ గురించి విన్నాను అత్తా . ఒకసారి నిన్ను ఫోటోలో కూడా చూశాను . నిన్ను మన ఇంట్లో చూస్తాను అని అనుకోలేదు .. అసలు ఎలా ఉన్నావు అత్తా” అని అంటూ సుధారాణిని ప్రేమగా హత్తుకుంది.

ప్రియ మాటలు విన్న సుధారాణి “రఘు అన్నయ్యకి దివ్య ఒక్కటే కూతురు అని అనుకున్నాను ప్రియ కానీ ,  దివ్య కన్నా పెద్దదానివి నువ్వు ఉన్నావు అని నాకు తెలియదు . నాకూతురు చెప్పింది నిజం , నువ్వు చాలా చక్కగా అందంగా ఉన్నావు . నువ్వు ఇలా ఏడవడం ఎందుకు చెప్పు” అని అనింది.

అప్పుడు ప్రియ , సుధారాణితో “చాలా రోజుల తరువాత అమ్మ వాళ్ళని చూసేసరికి ఏడుపు వచ్చేసింది అత్త..  ఇక ఏడవను” అని చెప్పి తన కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి తన తాతయ్య రాఘవరావు గారితో “ఇందాక మీరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు , మద్యలో నేను డిస్టర్బ్ చేశానా తాతయ్య” అని అంటే అందుకు రాఘవరావు గారు “అలా ఎం లేదులే తల్లి నువ్వు ఇంటికి వచ్చేశావ్ చాలా సంతోషంగా ఉంది మళ్ళీ హాస్టల్ కి వెళ్లిపోవుగా” అని అడిగాడు.

అప్పుడు ప్రియ తన దగ్గరకి వెళ్ళి తనతో “లేదు తాతయ్య నా కోర్సు అయిపోయింది ఇక ఇక్కడే మీతోనే ఉంటాను . పైగా  నాకు కావాల్సిన అందరూ ఇక్కడే ఉన్నారు ఇక ఎక్కడికీ వెళ్ళను” అని చెప్పి మరొక సారి నా వైపు చూసి మళ్ళీ రాఘవరావు తో “ఇందాక ఏదో చెప్పబోతూ ఆపేసావుగా తాతయ్య ఇప్పుడు చెప్పండి నేను కూడా వింటాను” అని చెప్పి తన నానమ్మ సుశీల దగ్గరకి వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది.

అప్పుడు సుశీల మాట్లాడుతూ “అవునండి ఈ సమయంలో నా పెద్ద మనవరాలు ప్రియ లేదే అని అనుకున్నా . కానీ ఆ దేవుడు నా మొర ఆలకించి దీన్ని ఇక్కడికి పంపించాడు ఒక అసలు విషయం చెప్పండి” అని చెప్పింది.

అప్పుడు రాఘవరావు గారు ముందుగా తన కొడుకు రఘు గారితో “రఘు మరి నీకు నీ భార్యకి ఇష్టమే కదా” అని ఆయనతో అడిగితే అందుకు రఘు గారు “నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న అమ్మకి మీకు సమ్మతమే కాబట్టి ఇక్క సుధారాణి తో మాట్లాడండి” అని చెప్పాడు.

అప్పుడు సుధారాణి “ఏవిషయం గురించి నాన్న ?” అని అడుగుతూ ఉంటే రాఘవరావు గారు అసలు విషయం చెప్పడం మొదలుపెడుతూ సుధారాణితో “నీ అన్నయ్య రఘు చిన్న కూతురు దివ్యకి , ఇప్పుడు మనతో ఉంటూ నీ పక్కన ఉన్న,  నీ భర్త అన్నయ్య కొడుకు రవికి పెళ్లి చేస్తే బాగుంటుంది అని మీ అమ్మ అనుకుంది. ఆ విషయం నాకు చెప్పి నా నిర్ణయం అడిగింది సుధా .

నాకు కూడా రవి అయితే దివ్య కి సరైన జోడీ అని అనిపించి , నేను కూడా ఒప్పుకున్నాను. ఇక దివ్య తల్లి తండ్రి అయినా రఘు , ఉమ ఇద్దరికీ ఇష్టమే ; అని వాళ్ళే నాకు చెప్పారు . చివరిగా నీ నిర్ణయం , మరి ముఖ్యంగా రవి నిర్ణయం చెపితే బాగుంటుంది అని మిమ్మల్ని పిలిచాను” అని అసలు విషయం చెప్పాడు.

ఎప్పుడైతే రాఘవరావు గారు దివ్య కి నాకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అని అన్నాడో అప్పుడు మళ్ళీ షాక్ లో కి వెళ్ళాను. ఈ పెళ్లి అనే ప్రస్తావన వస్తుంది అని అనుకున్నా కానీ ఇంత త్వరగా అదికూడా రాఘవరావు గారే స్వయంగా అడగడం తో ఆశ్చర్యపోయాను.

దివ్య తో పెళ్లి గురించి నాతో అడిగే అవకాశం వస్తుంది అని మాత్రమే అనుకున్నా , ఆ సందర్భం వచ్చిన తరువాత ఏమని సమాదానం చెప్పాలో ఆలోచించలేదు. దివ్యని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఉందోలేదో కూడా నాకు తెలియడం లేదు. ఇప్పడు ఈ రాఘవరావు గారికి ఏమని సమాదనం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను.

నేను అలా మౌనంగా ఉండగా మళ్ళీ రాఘవరావు గారు సుధారాణి తో “చూడు సుధా , ఒక సారి నీ ఇష్టం తెలుసు కోకుండా నీకు పెళ్లి సంబందం తెచ్చి గతంలో ఒకసారి పొరపాటు చేశాను . మళ్ళీ అదే పొరపాటు చేయకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. అందుకే ముందుగా దివ్య అభిప్రాయం తెలుసుకోమని సుశీలని అడిగితే , దివ్యకి కూడా రవిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పింది , అని నాకు చెప్పింది.

దివ్యకి ఈ పెళ్లి ఇష్టం అని రవిని బలవంత చేయడం లేదు . రవి ఇష్టాన్ని  , నీ ఇష్టాన్ని  ఇంకా నీ భర్త ఇష్టాన్ని  నాకు చెపితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం” అని అన్నాడు.

తన నాన్న మాట్లాడుతూ ఉంటే సుధారాణి నుంచి ఎలాంటి సమాదానం రావడం లేదు. నాకు దివ్యకి పెళ్లి అని వినిన దగ్గర నుంచి మౌనంగా ఉంది. తన కూతురు సుధా మౌనంగా ఉండేసరికి రాఘవరావు గారు “ఏమి సుధా ఏమీ మాట్లాడడం లేదు ... మౌనంగా ఉన్నావు” అని అడిగినా సుధారాణి మాత్రం ఏదో ధీర్ఘం గా ఆలోచిస్తున్నట్టు నాకు అనిపించింది.

అప్పుడు రాఘవరావు గారు నా వైపు చూసు నాతో మనవడా , నీ మనసులో దివ్య ఉందా లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది సూటిగా చెప్పవచ్చు . అలాగే ఈ పెళ్లి నీకు ఇష్టమా కాదా అని కూడా చెప్పు” అని నాతో అన్నాడు.

ఆయన నన్ను అడుగుతూ ఉంటే పోనీ నేను ఏమైన చెపుదాం అని అంటే ఏమిని చెప్పాలో తెలియడం లేదు. ఈ పరిస్తితి నుంచి నన్ను సుధారాణిని ఎవరైనా బయట పడేలా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉండగా అప్పుడు ప్రియ మాట్లాడుతూ “మీరు చెప్పాలి అని అనుకున్న విషయం సుధారాణి అత్తకి , రవి బావకి చెప్పారు కదా తాతయ్య , ఇక వాళ్ళకి ఆలోచించుకోడానికి కొంత సమయం ఇవ్వండి. ఇలా సడన్ గా పెళ్లి అని అంటే ఎవరూ వెంటనే చెప్పలేరుగా , రవి బావ కూడా అంతేగా తాతయ్య. పైగా అత్త ఒక్కటే తీసుకునే నిర్ణయం కాదుగా , మామయ్యతో మాట్లాడి చెప్పాలిగా . ఒక సారి ఆలోచించండి ” అని తనకి తోచిన మాటని చెప్పింది.

అది వినిన రాఘవరావు గారు “నిజమే ప్రియ , చెప్పాపెట్టకుండా పెళ్లి అని అంటే కొంత సందేహం లో పడతారు , అవును ఆ విషయమే మర్చిపోయా. నువ్వు అన్నట్టు రవికి కాస్త సమయం ఇస్తే ఆలోచించుకొని తన నిర్ణయం చెపుతాడు ” అని ప్రియకి చెప్పి , వెంటనే తన కూతురు సుధారాణి తో “ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదులే సుధా . నువ్వు అల్లుడు గారి మాట్లాడి అప్పుడు చెప్పు” అని అన్నాడు.

అప్పుడు సుశీల కూడా “అవును సుధా ,పెళ్లి అంటే మీ ఆయనతో మాట్లాడి తీసుకోవాల్సిన నిర్ణయం కదా నేను కూడా ఆలోచించలేదు . మీ నాన్న చెప్పినట్టు కాస్త సమయం తీసుకొని అప్పుడే చెప్పు” అని చెప్పింది. వాళ్ళిద్దరూ  చెపుతూ ఉంటే ఇంకా సుధారాణి ఏమీ మాట్లాడడం లేదేమి అని తన వైపు చూశాను.

సుధారాణి ఇంకా మౌనంగా ఉండడంతో దివ్య తన అత్తతో మాట్లాడుతూ “ఎందుకు అత్తా అలా మౌనంగా ఉన్నావు . నిజంగా మామతో మాట్లాడాలి అని మౌనంగా ఉన్నావా లేక రవి బావకి నేను సరిపోనని ఏమీ చెప్పడం లేదా . రవిబావ ని నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అత్త” అని అడిగింది.

దివ్య అలా అడిగేసరికి అప్పుడు సుధారణి  మాట్లాడడం మొదలుపెడుతూ “అలా ఏమీ కాదు దివ్య , అయిన నీకేం తక్కువ చెప్పు ఇంకా చెప్పాలి అంటే నిన్ను రవి పెళ్లి చేసుకోవడం వాడి అదృష్టం. నీకు రవికి పెళ్లి చేయడం నాకు ఇష్టమే దివ్య కానీ ..” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఆపేసింది.

సుధారాణి అలా ఆపేసారికి ఉమ మాట్లాడుతూ “ఇష్టం అని చెప్పి మళ్ళీ కానీ అని అంటావె సుధా నీ మనసులో ఏముందో చెప్పు” అని అడిగింది. ఉమ అల అడిగిన తరువాత సుధారణి ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకొని నేరుగా రాఘవరావు దగ్గరకి వెళ్ళి ఆయన కాళ్ళని పట్టుకుంది. సుధారాణి అలా రాఘవరావు గారి కాళ్ళు పట్టుకోవడంతో ఆయనతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.

అలా ఆశ్చర్యపోయిన రాఘవరావు గారు కంగారుగా తన కూతురు సుధారాణి తో “ఏమైంది సుధా , నువ్వెందుకు ఇలా నా కళ్ళు పట్టుకున్నావు” అని అడుగుతూ ఉంటే సుధారాణి తల పైకెత్తి వాళ్ళ నాన్నని చూస్తూ ఆయనతో “
నన్ను క్షమించండి నాన్న మీతో ఒక అబద్దం చెప్పాను. నిజానికి ఈ రవి , మా ఆయన అన్నయ్య కొడుకు కాదు. నా భర్త కి అసలు అన్నయ్యే లేడు. ఈ రవి నిన్ననే నాకు బస్సులో పరిచయం అయ్యాడు . నేను నిన్న ఒక పని మీద వైజాగ్ వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. మా ఆయనకి ఏమో ముఖ్యమైన పని ఉండడంతో నేను ఒంటరిగా వైజాగ్ కి బస్సులో వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

ఆ బస్సులో ఈ రవి నా పక్క సీట్ లో ఉన్నాడు . ఎవరో ఏమిటో నాకు పెద్దగా తెలియకపోయినా ఆడవారి మీద ఈ అబ్బాయికి ఉన్న మర్యాద గౌరవం నేను గ్రహించి రవితో పరిచయం చేసుకున్నాను. కొద్ది గంటలలోనే నాకు మంచి స్నేహితుడిలా అయ్యాడు . అప్పుడే మా ఆయన ద్వారా సుశీల అమ్మకి బాగాలేదు అని తెలిసి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు . ఎలాగైనా తొందరగా వైజాగ్ వెళితే బాగుండు అని అనుకుంటూ ఉండగా బస్సు మద్యలోనే ఆగిపోయింది.

అమ్మని చూడాలి అని క్యాబ్ లో వెళ్ళడానికి సిద్దం అయ్యాను కానీ ఒంటరిగా క్యాబ్ లో వెళ్ళడానికి బయం వేసింది. ఆడదాన్ని అయినా నేను ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అని నాకు తోడుగా ఈ రవి నాతో రాడానికి సిద్దం అయ్యాడు . పెద్దగా పరిచయం లేని అబ్బాయిని వెంట పెట్టుకు వచ్చాను అని అందరూ అనుకోకూడదు అని అలా మా ఆయన అన్నయ్య కొడుకు అని అబద్దం చెప్పాను. కానీ రవి చాలా మంచి వాడు నాన్న. నన్ను ఒంటరిగా పంపించడం మంచింది కాదు అని నాతో క్యాబ్ లో రావడమే కాదు తను రాత్రి అంటా నిద్ర పోకుండా నన్ను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకున్నాడు. 

నేను ఆడిన ఈ అబద్దాన్ని ఇప్పుడు మీకు చెప్పడానికి కారణం , ఇప్పటికైనా ఈ నిజం చెప్పక పోతే ఇంకా పెద్ద తప్పు చేసిన దాన్ని అవుతాను. ఈ నిజం మీకు తెలిసి నన్ను మళ్ళీ ఎక్కడ వెళ్లిపో అని అంటారో అని చాలా బయపడ్డాను. అందుకే ఈ నిజం దాచాను . కానీ ఇప్పుడు మన ఇంటి అమ్మాయిని రవికి ఇచ్చి పెళ్లిచేయడానికి సిద్దం అయ్యాక కూడా అసలు నిజం చెప్పక పోతే నన్ను నేను క్షమించుకోలేను. 

మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ నిజం మీకు చెప్పకుండా దాచితే , రేపు ఒకానొక రోజు నేను రవి గురించి నేను చెప్పింది అబద్దం అని తెలిసి వాడిని ఎక్కడ తప్పుగా అర్ధం చేసుకుంటారో అని చాలా బయం వేసింది నాన్న. నా మంచికోరి నన్ను కంటికి రెప్పలా చూసుకొని మీ దగ్గరకి క్షేమంగా తీసుకొచ్చిన రవిని తప్పుగా అర్ధం చేసుకోవడం నేను తట్టుకోలేను . అలా జరగ కూడదు అని మీతో అంతా చెప్పేస్తున్నాను . ఈ నిజం విని మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం , నేను చెప్పిన అబద్దానికి ప్రతిఫలంగా మీరు ఎలాంటి శిక్ష వేసిన బారిస్తా అంతేకాని నన్ను మళ్ళీ మీనుంచి వెళ్లిపో అని చెప్పద్దు నాన్న ” అని తను ఆడిన అబద్దాన్ని చెప్పేసి తన నాన్న ఏమని జవాబు చెపుతాడో అని అలాగే తల దించుకొని కళ్లదగ్గరే ఉంది ఎదురుచూస్తూ ఉంది.

సుధారాణి చెప్పిండి వినిన రాఘవరావు గారు కొంత సేపు మౌనంగా ఉండిపోయాడు. నేను కూడా ఈ ఇంటి వారి దగ్గర ఈ నిజం దాచానుగా మరి నేను కూడా క్షమాపణలు అడగడం ఉత్తమం అని గ్రహించి రాఘవరావు గారితో మాట్లాడబోతుండగా ఆయనే నాతో ముందుగా మాట్లాడుతూ “ అంటే రవి , నీకు అమ్మ నాన్న లేరు అని మాతో చెప్పింది కూడా అబద్దమేనా ?” అని అడిగాడు .

ఆయన అలా అడుగుతూ ఉంటే నన్ను ఇంత ప్రేమగా చూసుకున్న వీరి దగ్గర నిజం దాచి వీరిని మోసం చేశానేమో అని నా మనసులో ఒక బాద ఏర్పడింది. ఈ బాద పోవాలంటే నేను వీరి దగ్గర నిజం దాచాను అని ఒప్పుకోవాలి అని నిర్ణయించుకొని ఒక అడుగు ముందుకు వేసి నా రెండూ చేతులు జోడించి అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చొని నా తల దించుకొని వారితో “అందరూ నన్ను క్షమించండి , నేను సుధారాణి గారి భర్త , అన్నయ్య కొడుకు కాదు అనే సంగతి మీ దగ్గర దాచి నందుకు నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. నేను మీ దగ్గర దాచిన నిజం ఆ ఒక్కటే.

అంతేకానీ నాకు అమ్మా నాన్న లేరు అని నేను చెప్పిన మాట అక్షర సత్యం. నా దురదృష్టం వల్ల నా తల్లి తండ్రి నా చిన్నప్పుడే చనిపోయారు . అప్పటి నుంచి ఎవరూ లేని వాడిగా ఒంటరి జీవితం గడుపుతూ ఉండేవాడిని . అలా ఒంటరి బతుకు సాగిస్తున్న గాలికి కొట్టుకుపోతున్న నా జీవితంలోకి అనుకోకుండా ఈ సుధారాణి గారు రావడం వల్ల ఈమె ద్వారా మీ ఇంటికి , మీ దగ్గరకి చేరుకున్నా.

అసలు , సుధారాణి గారిని ఒంటరిగా క్యాబ్ లో పంపించడం నా మనసుకి ఇష్టం లేక ఆమెకు తోడుగా వచ్చి ఆమెను క్షేమంగా మీ దగ్గరకి చేర్చడం తో నేను అనుకున్న పని పూర్తయిపోయింది. అప్పుడే నేను నా దారిన వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను.

కానీ ఎప్పుడూ ఎలాంటి బందాలకి , అనురాగాలకి , అప్యాయతలకి నోచుకోని నాకు ఒక్కసారిగా తాతయ్య, అమమ్మ ,మామ, అత్త , మరదలు , చెల్లి అని కొత్త కొత్త బందాలతో మంచి మనుషులు అయిన మీరు , నేను కోరుకోకుండానే నాకు దొరకడంతో ప్రపంచం మొత్తాన్ని  జయించినట్టు అనుకున్నాను.

అలా అనుకోకుండా నాజీవితం లోకి వచ్చిన మిమ్మల్ని వదులుకోవాలని అనుకోలేదు.అందుకే నేను మీకు ఏమీ కాను అనే నిజం దాచాను. అంతేకానీ మిమ్మల్ని మోసం చెయ్యాలనే ఉద్దేశంతో కాదు , అలాంటి ఉద్దేశం నాకు లేదండి. నన్ను నమ్మండి. నా వల్ల ఎవ్వరికీ ఎప్పుడూ ఎలాండి కీడు జరగకూడదు అని అనుక్షణం కోరుకుంటూ ఉంటాను. అంతేకానీ నాలాంటి ఏకాకికి ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్చమైన మీ ప్రేమని నాకు పంచిన మిమ్మల్ని మోసం చేయాలని కలలో కూడా అనుకోలేదు. దయచేసి మీరందరూ నా తప్పును మన్నించండి” అని నా బాదని నా మనసులో ఉన్న మాటలు మొత్తం చెప్పేసాను.

నేను అలా ఆ ఇంట్లో అందరికీ చెపుతూ ఉండగా నాకు తెలియకుండా నా మనసులో బాద వల్ల నా కళ్ళలో చెమ్మ చేరి ఆ చెమ్మ కన్నీరుగా మారి బయటికి రావడం మొదలయ్యాయి. నేను ఏడుస్తున్న సంగతి నాకు తెలిసి నా ఏడుపు అపుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడ నా వల్ల అస్సలు కావడం లేదు. నా ఏడుపు ఆపుకోలేని స్తితిలో నేను ఉండగా నా ముందుకు రాఘవరావు గారు వచ్చి నన్ను పైకి లేపి నా కళ్ళలోకి చూస్తూ ఒక్కసారిగా నన్ను గట్టిగా హత్తుకుని నాతో “ఇదివరకే ఒకసారి నీకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ నా మనస్పూర్తిగా మళ్ళీ చెపుతున్న ; నీకు ఎవరూ లేరు అని అనకు . ఇప్పుడు నీకు ఈ తాతయ్య ఉన్నాడు నా కుటుంబం కూడా ఉంది . ఇక నుంచి నీకు అందరూ ఉన్నారు . ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంట్లో ఒకడివి మరి ముఖ్యంగా నా పెద్ద మనవడివి.

నువ్వు దివ్యతో పెళ్ళికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఎప్పటికీ నా మనవడివే నేను నీకు తాతయ్యనే ఇంకోసారి మీరు అని నన్ను వేరు చేసి మాట్లాడావో బాగుండదు అయిన మన మద్య క్షమాపణలు ఏంటి వింత కాకపోతే ఇంకెప్పుడూ ఇలా చేయకు ” అని చెప్పి నన్ను చాలా ప్రేమగా ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. నన్ను తన నాన్న క్షమించాడు అని గ్రహించిన సుధారాణి సంతోషంతో పైకి లేచింది. 

ఆయన నను గట్టిగా హత్తుకుని నాతో అన్న ఆ మాటలకి ఆ క్షణం నా మనసులో ఉన్న బాద మొత్తం పోయినట్టుగా నాకు అనిపిస్తూ నా మనసులో ఉన్న బరువు మొత్తం దిగిపోయి తేలిక అయ్యినట్టు నాకు అనిపించి నా మనసు మొత్తం ప్రశాంతంగా మారింది.

ఆ క్షనం రాఘవరావు గారి వెనుక ఉన్న సుధారాణి కళ్ళలోకి చూశాను . తన తండ్రి నన్ను తన ఇంటి మనిషి అని అన్నందుకు నా సుధారాణి మొహంలో సంతోషాన్ని , ఆ కళ్ళలో కాంతి చూసి చాలా సంతోషించాను. అదే సమయంలో సుధారాణి పక్కకి ప్రియ , దివ్య ఇద్దరూ వచ్చి సంతోషంగా ఉన్న నన్ను చూసి ఆ ఇద్దరూ కూడా సంతోషించారు.

నన్ను హత్తుకున్న తరువాత రాఘవరావు గారు తన కూతురు సుధారాణి వైపుతిరిగి తనతో “క్షమాపణలు చెప్పేంతగా ఎలాంటి తప్పు నువ్వు చేయలేదు అని నేను నమ్ముతున్నాను . ఒక వేల తప్పు చేసిన నిన్ను శిక్షించి నా నుంచి దూరం చేసుకోలేను సుధా , ఒక్కగానొక్క కూతురివి ఈ వయసులో నిన్ను దూరం చేసుకొని నేను ఉండగలనా . నువ్వు చెప్పిన అబద్దం లో ఎలాంటి మోసం లేదు అని నాకు అర్ధం అయింది తల్లీ ”అని చెప్పాడు. తన నాన్న తనని అర్ధం చేసుకున్నాడు అని సుధారాణి చాలా సంతోషంగా ఉంది. 

ఆ తరువాత మళ్ళీ తాతయ్య నాతో “ఇదిగో మనవడా దివ్య తో నీకు పెళ్లి ఇష్టమా లేదా అని ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు , నీకు ఎంత టైమ్ కావాలో అంత తీసుకొని నీ నిర్ణయం చెప్పు ఇందులో ఎవ్వరూ నిన్ను బలవంతం చేయరు ”అని చెప్పాడు.

అప్పుడు ప్రియ మాట్లాడుతూ “హుం అబ్బా కొద్ది క్షణాలు నీ మాటలతో నన్ను ఏడిపించేసావుగా బావ” అని అనింది. అప్పుడు సుశీల తన మనవరాలు ప్రియతో “అదేంటి ప్రియ నువ్వు కూడా బావ అని అంటున్నావే” అని అగిడితే అందుకు బదులుగా ప్రియ “అదేంటి నాన్నమ్మ బావ అంటే ఏమైంది ! రవి బావని చూస్తుంటే నాకన్న పెద్ద అని నాకు అనిపించి బావ అని అన్నాను ఎ నేను అలా పిలవకూడదా” అని అడుగుతూ ఉంటే దివ్య “అవును , బావ ప్రియ అక్క కన్నా పెద్ద . అప్పుడు అక్క  కూడా బావ అని పిలవచ్చు నువ్వు అలాగే పిలువు అక్క” అని అందరి నిర్ణయాన్ని తనే పెద్ద కారిగా  చెప్పింది.

ఆ వెంటనే మళ్ళీ ప్రియ “ఇప్పటికే బావ అలసి ఉన్నాడు కొద్ది సేపు తనకి రెస్ట్ ఇవ్వండి” అని ప్రియ చెప్పడంతో రాఘవరావు గారు నాతో “అవును రవి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో” అని నాతో చెప్పి సుధారాణి కూతురు అన్విత తో “అన్విత రవి అన్నయ్యని గదిలోకి తీసుకెళ్ళు” అని చెప్పి చివరిగా సుధారాణి తో “ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో సుధా” అని చెప్పాడు. ఆ తరువాత తన కొడుకు రఘు తో కలిసి బయట పనిమీద వెళ్తున్నా అని సుశీల గారితో చెప్పి ఇంటి నుంచి ఆ ఇద్దరూ కలిసి బయటకి వెళ్ళారు.

ఆ విధంగా రాఘవరావు గారు , రఘు గారు ఇద్దరూ వెళ్లిన తరువాత ప్రియ తన పక్కనే ఉన్న దివ్య తో “ఏమే దివ్య నా కన్నా వెనక పుట్టి అప్పుడే పెళ్ళికి రెఢీ అయిపోతావ నీతో చాలా మాట్లాడాలి పద” అని దివ్యని ఉమ గదిలోకి తీసుకెళ్తూ ఒకసారి నన్ను చూసి ఒక అందమైన నవ్వు నవ్వి ఆ గదిలోకి వెళ్ళింది.

తన చెల్లెలు దివ్య తో నాకు పెళ్లి చేయాలని తన వాళ్ళు అనుకుంటున్న సంగతి స్వయంగా విని కూడా మామూలుగా మాట్లాడుతూ ఉన్న ప్రియ ప్రవర్తన నాకు వింతగా ఉందే ! ఈ పెళ్లి ప్రస్తావన వచ్చిన వెంటనే ప్రియ నన్ను ప్రేమిస్తున్న సంగతి అందరికీ చెప్పేస్తుంది అని అనుకున్న కానీ అలా చెప్పలేదు. ఒకవేల తనని వదిలి నేను దూరంగా వెళ్ళిపోడానికి నిర్ణయించుకున్నందుకు నా మీద చాలా కోపంతో ఉందేమో ? ఏమే ఈ సందేహాలు తీరాలంటే ముందు ప్రియతో ఒంటరిగా మాట్లాడాలి’ అని అనుకోని ప్రియ దగ్గరకి వెళ్లాలని అనుకున్నాను.  కానీ తన దగ్గరకి వెళ్ళడానికి ఇంకా  ధైర్యం సరిపోక అక్కడే హాల్ లో ఉన్న మంచం మీద కూర్చున్నాను. 

కథ ఇంకా కొనసాగుతుంది ......
Like Reply


Messages In This Thread
RE: సుధా రాణి - by Ravi9kumar - 03-07-2022, 05:25 PM
RE: సుధా రాణి - by Ravi9kumar - 03-07-2022, 05:25 PM
RE: సుధా రాణి - by Ravi9kumar - 03-07-2022, 05:27 PM
RE: సుధా రాణి - by The Prince - 03-07-2022, 05:28 PM
RE: సుధా రాణి ~ New Update on 12 October 2022 ~ - by Ravi9kumar - 14-10-2022, 11:18 AM



Users browsing this thread: 3 Guest(s)