Thread Rating:
  • 3 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సుధా రాణి ( COMPLETED )
Update 24.2

ఆ విధంగా రఘుని ఉమ అడగడం రఘు దివ్య పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది. అదే సమయంలో అటు రవి ‘పరమపదసోపాన పటము’ ఆటలో అతి పెద్ద నిచ్చెన ఎక్కాడు. అలా నిచ్చెన ఎక్కడంతో రవికి ఆ ఆటలో గెలుపు సొంతం చేసుకోడానికి కొంత దూరమే ఉంది.

ఇక అటు సుశీల తన గదిలో నిద్రపోతున్న రాఘవయ్య గారిని నిద్రలేపాలా వద్దా అని సందేహిస్తూ ఉండగా అనుకోకుండా తన భర్త కి మెలకువ వచ్చి కళ్ళు తెరచి  చూసేసరికి ఆయన కాళ్ళ దగ్గర ఆలోచిస్తూ ఉన్న సుశీల కనిపించడంతో రాఘవరావు గారు పైకి లేచి సుశీలతో మాట్లాడడం మొదలెట్టాడు. 

ఆయన సుశీలతో మాట్లాడుతూ “సుశీల , ఏంటి ఏదో ధీర్ఘంగా ఆలోచిస్తున్నావు , నాతో ఏమైన మాట్లాడాలా”అని అంటూ ఉండగా తన భర్త గొంతు వినిన సుశీల ఆయన మాటలు విని తన భర్తతో “అవునండి ఒక విషయం గురించి చెప్పాలని వచ్చాను . కానీ మీరు నిద్రపోతుండడంతో ఆగిపోయాను”అని చెప్పింది .

అందుకు ఆయన “నిద్రలేపవచ్చుగా , అలా నిద్ర లేపితే నేను ఏమన్నా అంటానా చెప్పు

ఏమీ అనరు కానీ ఎందుకో చిన్న సంకోచం ,అందుకే ఆగిపోయా

హుం సరే చెప్పండి శ్రీమతి గారు , మీరు చెప్పే ఆ విషయం గురించి వినడానికి నేను సిద్దం

అబ్బా ఏంటండీ ఇప్పుడు పరాచకాలు అడుతున్నారా .... చాలా ముఖమైన విషయం గురించి మీతో మాట్లాడాలి

అవునా సరే అలా అననులే ... ఇంతకీ ఏమిటో ఆ ముఖ్యమైన విషయం

అది మన మనవరాలు దివ్య గురించి ; తన పెళ్లి గురించి

దివ్య పెళ్లి గురించా ! ఇప్పడు తన పెళ్ళికి తొందర ఏమొచ్చింది , అది ఇంకా చిన్న పిల్ల కదే సుశీల

అబ్బో అది చిన్న పిల్ల ఏమీ కాదులే

సరే సరే దివ్య పెళ్లి గురించి అని అంటున్నావు అంటే , ఎవరో అబ్బాయిని చూసి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావని అర్ధం అవుతుంది . ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి

మీకు కూడా తెలిసిన వాడే.. మంచి వాడు కూడా

నాకు తెలుసిన వాడా ఎవరో తెలియడం లేదే ..  అబ్బా త్వరగా చెప్పండి శ్రీమతి గారు

హుం చెపుతున్న ఆ అబ్బాయి మరెవరో కాదు మన రవి

ఎవరు నిన్న సుధారాణి తో మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉంటున్న రవి ఏనా

అవునండి ఆ రవి గురించే నేను మాట్లాడేది . రవి - దివ్య ఇద్దరి జంట చాలా బాగుంటుంది ఒకసారి ఆలోచించండి” అని సుశీల చెప్పడంతో బాగా ఆలోచించి అప్పుడు సుశీలతో చెప్పడం మొదలెట్టాడు.

రాఘవరావు గారు మాట్లాడుతూ “హుం నిజమే సుశీల , రవి దివ్య ఇద్దరి జంట బాగుంటుంది ... కానీ దివ్య మనసులో ఎవరైనా ఉన్నారా ఒకసారి దివ్యని కూడా అడుగు సుశీల ... అలా అడగకుండా మన కూతురు సుధారాణి విషయంలో తొందర పడ్డాము ఇప్పుడు అలా జరగకూడదు

ఇందాక మన కోడలు ఉమతో కూడా రవి దివ్య ల పెళ్లి గురించి ప్రస్తావించి ఉమ ఒప్పుకుంటే దివ్య తో ఒకసారి మాట్లాడి తన అభిప్రాయం చెప్పమని చెప్పాను

హుం ... మంచి పని చేశావు కానీ నాకు చెప్పలేదే

అబ్బా ముందు ఉమతో దివ్య తో మాట్లాడి వారి ఇద్దరికీ సరే అంటేనే కదా పెద్దవారిగా మీకు చెప్పాలి

సరే సరే ఇంతకీ దివ్య ఏమనింది ...

సంతోషం ఏమిటి అంటే , దివ్య మనసులో కూడా రవి అంటే ఇష్టం ఉందంట తనకి రవిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పింది

మరి ఇక ఆలస్యం దేనికి సుధారాణి కి ఒక మాట చెప్పి రవిని కూడా అడిగేస్తే ఒక పని అయిపోతుంది

అంటే దివ్య రవిలకి పెళ్లి చేయడంలో మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవా

ఒకటే ఉంది , మన అబ్బాయి రఘు అలాగే కోడలు ఉమ ఇద్దరికీ ఇష్టమే అయితే నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు . నాకు కూడ ఈ పెళ్లి ఇష్టమే” అని సమాదనం చెప్పాడు.

తన భర్త రవి దివ్య ల పెళ్ళికి ఒప్పుకోవడంతో సంతోషంగా తన భర్త తో “ఓహో అదేనా .... ఇందాకే ఉమకి చెప్పి రఘు తో దివ్య రవి ల పెళ్లి గురించి మాట్లాడి వాడి నిర్ణయం తెలుసుకోమని చెప్పి పంపాను . ఈ పాటికి మన కోడలు రఘు తో మాట్లాడి ఉంటుంది . రఘు ఒప్పుకోని ఉంటాడు అని అనుకుంటా . నేను అనుకున్నట్టు రఘు పెళ్ళికి ఒప్పుకొని నేను అనుకున్నది నిజం అయి ఈ పెళ్లి జరిగితే , మన దివ్య మన కళ్ల ముందే ఉంటుంది” అని చెప్పింది .

ఆ వెంటనే రాఘవరావు గారు  కూడా “నిజంగా, నువ్వు కోరుకున్నట్టు ఈ పెళ్లి జరిగితే మన మనవరాలు ఇక్కడే ఉంటుంది

అవునండి దివ్య రవి ఇక్కడే మన కళ్ల ముందే ఉంటారు ఇక మీకు ఇష్టమే కదా

నాకు ఇష్టమే సుశీల . ఇక నువ్వు రఘు ఒప్పుకున్నాడో లేదో తెలుసుకో” అని అన్నాడు .

అప్పుడు సుశీల “సరే అండి ఇక నేను వెళ్ళి ఆ సంగతి కనుక్కుంటాను” అని చెప్పి ఆ గది నుంచి బయటకి వచ్చింది. అక్కడ రఘు నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో రాఘవరావు గారు కూడా సుశీల వెనకే ఆ గది నుంచి బయటకి వచ్చాడు.

రాఘవరావు గారు రవి దివ్య ల పెళ్ళికి ఒప్పుకోవడం ఇటు రవి తను ఆడుతున్న ‘పరమపదసోపాన పటము’  ఆటలో గెలుపు సాధించడం ఒకేసారి జరిగింది.

అయితే ఇక్కడ ఉన్న వింత ఏమిటి అంటే రవి గెలుపు తన ఒక్కడిడే కాకుండా అక్కడ ఉన్న సుధారాణి, దివ్య ఇంకా అన్విత ల గెలుపు లాగా అనుభూతి చెందుతూ ఆ ముగ్గురూ కేరింతలతో రవి గెలుపును ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. 

అటు రఘు ఇంకా ఉమ ఇద్దరూ కూడా రాఘవరావు గారి నిర్ణయం తెలుసుకోవాలని హాల్లో కూర్చొని సుశీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఆ నలుగురూ హల్లో కి రావడం తో దివ్య రవిల పెళ్ళికి రఘు ఒప్పుకున్నాడు అని రాఘవరావు గారికి , రాఘవరావు గారు ఒప్పుకున్నాడు అని రఘు ఇంకా ఉమ లకి తెలిసి సుశీల - రాఘవరావు , ఉమ - రఘులు చాలా సంతోషించారు .

ఇక చివరిగా ఆ ఇంటి పెద్ద రాఘవరావు గారు తన కూతురు సుధారాణితో రవి మరియి దివ్య లకి పెళ్లి చేయాలని అనుకున్న సంగతి చెప్పి సుధారాణి అభిప్రాయం , రవి నిర్ణయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే సుశీల ని వెళ్ళి సుధారాణి ని రవిని హాల్లోకి తీసుకురమ్మని రాఘవరావు గారు చెప్పడంతో వారు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళిన సుశీల తన భర్త రాఘవరావు గారు పిలుస్తున్న సంగతి చెప్పింది.  

కథ ఇంకా కొనసాగుతుంది ......
Next Update 25 : https://xossipy.com/thread-48064-post-49...pid4986376
Like Reply


Messages In This Thread
RE: సుధా రాణి - by Ravi9kumar - 03-07-2022, 05:25 PM
RE: సుధా రాణి - by Ravi9kumar - 03-07-2022, 05:25 PM
RE: సుధా రాణి - by Ravi9kumar - 03-07-2022, 05:27 PM
RE: సుధా రాణి - by The Prince - 03-07-2022, 05:28 PM
RE: సుధా రాణి ~ New Update on 05 October 2022 ~ - by Ravi9kumar - 12-10-2022, 10:54 AM



Users browsing this thread: 2 Guest(s)