Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
( రాజు కోపంతో రాజమందిరం చేరుకుని దొరికినదానిని పగలగొట్టేస్తున్నాడు - సైన్యాధ్యక్షుడా ...... ఏమిచేస్తావో ఎంతమందితో వెళతావో తెలియదు వాడు సూర్యోదయాన్ని చూడకూడదు - వాడు బ్రతికి ఉన్నంతసేపూ నాకు మనస్సాoతి లేదు - ఆహారంలో విషం కలిపి అయినా చంపేయ్యండి ......
సైన్యాధ్యక్షుడు : చిత్తం ప్రభూ ......
అది కుదరని పని ప్రభూ ...... అంటూ మంత్రి వచ్చాడు - ఇప్పటివరకూ మనకు మద్దతిస్తున్న ప్రజలంతా కూడా వాడి వీరత్వానికి గులాం అయిపోయారు పైగా మన చుట్టుప్రక్కల రాజ్యాల నుండి వచ్చిన ప్రజలు తరువాతి పోటీలకోసం - ఆ పోటీలలో అతడి వీరత్వం చూడటం కోసమే రావాలని చర్చించుకుంటున్నారు - ఖచ్చితంగా మూడు పర్యాయాలలో పోటీలు నెగ్గి స్వేచ్ఛను మీ వరాలను పొందుతాడని అనుకుంటున్నారు .
రాజు : తదుపరి పోటీలు మలి ఏడాదికే కదా ......
మంత్రి : అవును ప్రభూ ...... , మలి ఏడాది జరిగే పోటీలలో వీడు కనుక లేకపోతే మనం నిర్వహించే పోటీలను ఎవ్వరూ నమ్మరు - వీక్షించడానికి రారు - పోటీల ద్వారామన రాజ్య ఆదాయం ఎంతో తెలుసా అంటూ ఒక సైగ చెయ్యడంతో రాజు ముందు కుప్పలు కుప్పలుగా సంపదను కురిపించారు భటులు ....... , ఈ సంపదతో మన రాజ్యం ఎంతకైనా విస్తరించుకుంటూ వెళ్ళవచ్చు - మనమే పెత్తనం కావచ్చు ........ , ఇలాంటి పరిస్థితుల్లో గనుక మనం అతడిని ఏమైనా చేస్తే మీపైననే వస్తుంది - క్షమించండి మిమ్మల్ని పిరికి రాజు అంటారు - గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్న రాజ్యాలు మనపై దండెత్తుతాయి .
రాజు : లేదు లేదు అలా జరగడానికి వీలులేదు - అయితే మనం వాడిని ఏమీచెయ్యలేమా ? - చిలుక వినలేదుకదా ...... దాని మాటలకు నిద్రకూడా రాదు .
భటులు : లేదు ప్రభూ .......
మంత్రి : ఏమిచేసినా పోటీలలోనే చెయ్యాలి ప్రభూ ...... , 12 పక్షముల సమయం ఉంది వాడి అంతుచూసే వీరాధివీరులను తయారుచేద్దాము .
రాజు : అవును తయారుచేద్దాము - అంతవరకూ వాడిని చీకటి కారాగారంలోనే చిత్రహింసలు పెట్టండి కానీ చంపకండి ) .

పెద్ద సంఖ్యలో భటులు వచ్చి మా అందరినీ కారాగారంలో వదిలి రెండుమూడు తాళాలు వేయడమే కాకుండా మూడింతల భద్రతను కట్టుదిట్టం చేశారు , బానిసలారా ...... వాడికి మద్దతు ఇచ్చి మహారాజు గారి కోపాగ్నికి లోనయ్యారు , తదుపరి పోటీలవరకూ వాడితోపాటు మీకు చిత్రహింసలే .......
ఈరోజు కలిగిన ఆనందంతో పోలిస్తే అలాంటి చిత్రహింసలు మాకు వెంట్రుకతో సమానం ....... , వీరా వీరాధివీరా ...... నినాదాలతో కారాగారం దద్దరిల్లిపోతోంది .
క్షమించండి మిత్రులారా ....... నావలన మీరుకూడా .......
అలాంటిదేమీ లేదు వీరా ...... , ఈ కారాగారంలో ఉండటంతో పోలిస్తే ఆ చిత్రహింసలేమీ మమ్మల్ని బాధించవు , అయినా ఒకసారి చుట్టూ చూడండి మహారాజు మందిరానికి ఎలాగయితే కాపలా ఉంటారో అంతకు రెట్టింపు మనకు కాపలాగా ఉన్నారు అంటే మనం మహారాజు కంటే గొప్పవారం అన్నట్లే కదా ......
మిత్రులంతా నవ్వుకున్నారు .
అందరితోపాటు నవ్వుకుని నా దేవకన్య స్మృతులలో నిద్రకు ఉపక్రమించాను , కళ్ళు మూతలుపడగానే నా ప్రియాతిప్రియమైన ప్రాణమైన దేవకన్యతో విహారానికి వెళ్లినప్పటి మధురమైన స్మృతులు మెదులుతున్నాయి - నా దేవకన్య తియ్యనైన చిలిపిపనులు పెదాలపై చిరునవ్వులు పూయిస్తున్నాయి - రోజంతా ఎంతో ఆహ్లాదంగా విహరించి  చీకటిపడేసరికి అలసిపోయినట్లు స్నానమాచరించడానికి నదీ అమ్మ ఒడిలోకి చేరాము , గంగమ్మ ఒడిలో నా దేవకన్య ..... నన్ను ముద్దుల మైకంలోకి తీసుకెళ్లి వస్త్రాలను ప్రవాహానికి వదిలేసి స్వర్గపు శృంగార డోలికలో ముంచిన మాధుర్యం మనసుకు తెలుస్తోంది - దానికి మించిన తృప్తి జననిపై లేదన్నట్లు వొళ్ళంతా పులకించి పారవశ్యం పొందుతోంది , మహీ నా హృదయదేవీ అంటూ సిగ్గుతో అంతులేని ఆనందంతో లేచాను - ముద్దుకే ఒప్పుకోలేదని నదీఅమ్మ సహకారంతో ఇంతటి తియ్యనైన ద్రోహానికి పాల్పడ్డావన్నమాట అంటూ సిగ్గుపడుతూనే ఉన్నాను - అందుకే ఆరాత్రి జరిగినది గుర్తులేదు , ఆ మాధుర్యం మళ్లీ మళ్లీ ఆస్వాదించాలన్నట్లు వెంటనే కళ్ళుమూసుకున్నాను , అలా నా దేవకన్య తొలిరేయి శోభన మాధుర్యపు ఊహాలతో కారాగార జీవితాన్ని కొనసాగించాను . 

తరువాతి రోజు నుండి శిక్షించడానికని కొండల్ని బద్దలు కొట్టడానికి గుట్టలు - చెట్లు నరకడానికి అడవికి తీసుకెళ్లినప్పుడు తప్పించుకోవడానికి చాలా సందర్భాలు ఉన్నప్పటికీ నాతోపాటు తోడుగా ఉన్న సోదరులందరికీ కూడా స్వేచ్ఛ లభించాలని ఆగిపోయాను , రోజురోజుకూ పెరుగుతున్న శిక్షలను తట్టుకుంటూ రోజులు గడపసాగాను , రోజంతా ఎంత పనిచేసినా చీకటిపడేసరికి కారాగారం చేరి నీటిని సేవించి శయనించగానే దెబ్బలు మానిపోయి ఊహల్లోకి వచ్చే మహి మధురస్మృతులలో కష్టాన్నంతా మరిచిపోయి చిరునవ్వులు చిందించడం చూసి మిత్రులంతా ఆశ్చర్యపోయేవారు .
వీరాధివీరా మేము అనుభవించే శిక్షను రెండింతలుగా అనుభవిస్తున్నావు , చీకటిపడేసమయానికి ఈ ఆనందం ఎలా ? అంటూ ఒకరోజు అడిగారు .
మనకు ప్రియమైన - ప్రాణమైనవారిని ఎన్నటికైనా కలుస్తాము అన్న ఆశ ఉంటే చాలు వారితో గడిపిన మధురానుభూతులే మన ఆనందాలు కారణం అవుతాయి -  ఆరోజంటూ వస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు ప్రయత్నించండి .
కొద్దిసేపటి తరువాత అవును అవును వీరాధివీరా హాయిగా ఉంది , సంతోషం చాలా చాలా సంతోషం , మా తల్లిదండ్రులను బార్యాపిల్లలను మళ్లీ కలవడం కంటే సంతోషం మరొకటి లేదు , వారి ఊహాలతోనే ధైర్యంగా జీవిస్తాము .

ఉదయమంతా కష్టాలు - చిత్రహింసలు , చీకటిపడగానే అందరి ముఖాలలో ఆనందంతో రోజులు గడిచిపోసాగాయి .
భటులు కూడా రోజూ కొట్టి కొట్టి అలసిపోయినా మహారాజు ఆజ్ఞల వలన ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులలో హింస పెట్టేవారు , అలా మరొక పోటీలకాలం కూడా వచ్చినట్లు దండోరా మ్రోతతో తెలిసింది .
ఈసారి ఎలాంటి క్రూరమైన పోటీలు నిర్వహిస్తారో అన్నట్లు కారాగార సోదరులంతా కంగారుపడుతుంటే , రెండో పోటీలు వచ్చేసాయని ఇక మిగలబోయేది ఒకటే అంటూ సంతోషంలో నేనున్నాను .

ఆరోజు రానే వచ్చింది - భటులు వచ్చి మొత్తం కారాగారంలో ఉన్న వారందరినీ సంకెళ్లతో బంధించి మొండి ఆయుధాలను చేతులకు అందించి పోటీ స్థలంలోకి తీసుకెళుతున్నారు - బానిస వీరాధివీరా ఇప్పుడు ఇప్పుడు నీ సోదరులుగా భావిస్తున్న వీరందరినీ కాపాడుకుంటూ నీ ప్రాణాలను నిలబెట్టుకుంటూ ఎలా పోటీలు నెగ్గుతావో చూస్తాము - మహారాజుగారి పన్నాగం ఎలా ఉంది .
సోదరులందరినీ కాపాడుకోవడం ఎలా అంటూ కంగారు మొదలైంది - అందరివైపు చూస్తున్నాను .
వీరాధివీరా ...... మాగురించి ఆలోచించకు - నీతోపాటు జీవించిన ఈ సమయం చాలు - సంతోషంగా ప్రాణాలొదిలేస్తాము - పరులకోసం బ్రతకడం ఎలానో నేర్పించావు - మరొక జన్మ ఉంటే నీకు మిత్రులుగా జీవించాలని ఉంది అంటూ సోదరులు సంతోషంగా చెప్పారు .
మీలాంటి మిత్రులకు దూరం కావడానికి ఏమాత్రం సిద్ధంగా లేను - నా ప్రాణాలు అడ్డు వేశయినా మిమ్మల్ని రక్షిస్తాను - మిత్రులారా ...... నేను చెప్పినట్లు చేస్తే మనమంతా ప్రాణాలతో విజయం సాధించవచ్చు .
ఆజ్ఞ వీరాధివీరా అంటూ సోదరులలో ఆశ చిగురించినట్లు చిరు సంతోషాలు వెళ్లువిరిసాయి .
మీగురించి మీ ప్రాణాల గురించి కాకుండా ప్రక్కనున్న మిత్రుల ప్రాణాలకు రక్షణగా ఉంటే చాలు .
అర్థమైంది వీరాధివీరా ...... నా ప్రాణాలను ఫణంగా పెట్టైనా నా మిత్రుడిని రక్షించుకుంటాను - నేను ...... నా మిత్రుడిని - నేను ......  నా మిత్రుడిని ....... మహారాజు పన్నాగానికి మించిన ప్రణాళిక , హై హై వీరాధివీరా ...... వీరాధివీరా వీరాధివీరా వీరాధివీరా ....... అంటూ రాజ్యం నినాదాలు చేస్తూ రాక్షస క్రీడాస్థలానికి చేరాము .

మమ్మల్ని చూసినవెంటనే అదిగో మన వీరుడొచ్చాడు , వీరా వీరాధివీరా ...... నీ వీరత్వాన్ని చూడటానికే వచ్చాము , వీరాధివీరా వీరాధివీరా వీరాధివీరా ....... అంటూ రాజ్యం మొత్తం దద్దరిల్లేలా హోరెత్తించారు నలుమూలల రాజ్యాల నుండి వచ్చిన వీక్షకులు .
హోరెత్తిన ప్రతీసారీ మహారాజు కళ్ళు ఎర్రబడుతున్నాయి , ఏమీచెయ్యలేక కోపాన్ని మాత్రం వ్యక్తపరుస్తున్నాడు , నాచావును వెంటనే చూడాలన్నట్లు పోటీలకు పచ్చ జెండా ఊపాడు .

ఢమరుక శబ్దాలు మొదలయ్యాయి - భయంకరమైన కేకలతో ఏడడుగులకు పైనే ఉన్న రాక్షసుల్లాంటి పదిమంది క్రూరాతి క్రూరమైన ఆయుధాలను చేతబట్టి మాముందుకు వచ్చి నిలబడ్డారు - విచిత్రమైన కేకలువెయ్యడం చూస్తుంటేనే సోదరులందరిలో వణుకు మొదలయ్యింది - కొంతమందైతే వెనక్కు పరుగు తియ్యడానికి ప్రయత్నించి సంకెళ్ళ వలన పడిపోవడం చూసి మహారాజు నవ్వుకుంటున్నాడు .
మిత్రులారా ...... ప్రక్కనున్న మిత్రులను కాపాడండి కలిసి పోరాడండి వాళ్ళు పది మంది మనం వందమంది విజయం మనదే ........
నువ్వే మా ధైర్యం వీరాధివీరా ........ అంటూ ఆయుధాలతో సంకెళ్లను కొడుతూ పోటీకి సిద్ధం అన్నట్లు మోత మ్రోగిస్తున్నారు - దానికి తోడు వీక్షకులంతా మావైపునే ఉన్నారు .

మహారాజుకు మళ్లీ కోపం వచ్చినట్లు నరమాంస భక్షకులారా బానిసలందరినీ చంపేయ్యండి - వారి మాంసాలను తినెయ్యండి - విజయం సాధిస్తే అడవిలో ఉన్న మీ గుహల దగ్గరకే నర మాంసాన్ని పంపిస్తాను .
మహారాజు మాటలకు పిచ్చెక్కిపోయినట్లు శబ్దాలు చేస్తూ మామీదకు ఎగబడ్డారు .
సంకెళ్లు వేరుచేసే సమయం కూడా లేకపోవడంతో మాలో చాలామందిని గాయపరిచారు - నేనున్నానన్న ధైర్యంతో సంకెళ్ళ నుండి విముక్తి పొంది అదే ధైర్యంతో గుంపులు గుంపులుగా నరమాంస భక్షకులపై విరుచుకుపడ్డారు - నెత్తురు చిందిస్తూనే పట్టుదలతో ఎదురొడ్డుతున్నారు .
వీరాధివీరా ...... అందరినీ ఒడిసిపట్టేసాము అనేంతలో మళ్లీ నగారా మ్రోగింది . 
పదిమందిని మించిన ముగ్గురు నరరూపరాక్షసులు భయంకరమైన ఆయుధాలతో పరుగునవస్తున్నారు - ఇప్పుడేమి చేస్తావు బానిసా అంటూ మహారాజు రాక్షస నవ్వులు నవ్వుతున్నాడు .
అవును వాళ్ళు గనుక పదిమంది పట్టుని బెడిసికొట్టారో మాలో ఒక్కరం జీవించము అని తెలిసి రెండు కత్తులు పట్టుకుని ముగ్గురికి అడ్డుగా నిలబడి చాలాసేపు పోరాడి వొళ్ళంతా రక్తంతో చివరికి ముగ్గురినీ నేలకొరిగేలా చేసాను - ఆ ధైర్యంతో సంతోషంలో మిత్రులందరూ ఒడిసిపట్టిన వాళ్ళందరినీ నేలకొరిగేలా చేసి నరమాంస భక్షకులు బ్రతికి ఉండకూడదు అని పొడిచి చంపేసి విజయ సంతోషంలో వీరాధివీరా వీరాధివీరా ...... కేకలువేస్తూ నావైపుకు వస్తున్నారు .

ఎక్కడనుండి దూసుకువచ్చాయో ముందు నుండి రెండు బాణాలు ఛాతీలోకి దిగాయి .
ఆహ్హ్ ..........
వీరాధివీరా .......
మోసం - ద్రోహం - మహారాజు పిరికిపంద అంటూ వీక్షకులంతా అలా చూస్తుండిపోయారు .
నోట్లో నుండి కారుతున్న రక్తంతో యా ...... అంటూ కేకలువేస్తూ రెండు బాణాలను బయటకు లాగి మహారాజువైపు గర్వంగా అడుగులువేశాను .
మహారాజు భయపడిపోయినట్లు సైగ చేయగానే వెనకనుండి బాణాలు దూసుకువచ్చి వెన్నులోకి దిగాయి .
ఆహ్హ్ ...... మహీ అంటూ నేలతల్లి ఒడిలోకి చేరాను .
వీరాధివీరా అంటూ మిత్రులందరూ చుట్టూ చేరారు - బ్రతికే ఉన్నాడు వీరాధివీరుడు ఇంకా బ్రతికే ఉన్నాడు .
మహారాజు : ఇంకా బ్రతికే ఉన్నాడా ...... ? , ఈ క్షణం కోసమే సిద్ధం చేసిన చివరి నరమాంస భక్షకుడిని పంపండి , ముందు వీరుడైన బానిసను తరువాత చుట్టూ ఉన్న బానిసలను ...... , భటులారా .......
భటులు వచ్చి మిత్రులందరినీ బంధించారు .
అలాగే అన్నట్లు రాక్షస శబ్దాలతో నావైపుకు వస్తున్న మృగాన్ని సంకెళ్లు ఉన్నా అడ్డుపడుతున్న సోదరులను ప్రక్కకు లాగేస్తూ నా దగ్గరికి చేరుకున్నాడు - నా తలను నరకడం కోసం మనిషి బరువున్న రాక్షస గొడ్డలిని పైకెత్తి మహారాజువైపు చూసాడు .
మహారాజు ...... గొంతు తెగ నరకమని ఆజ్ఞాపించడం , ఆజ్ఞ అన్నట్లు చుట్టూ ఉన్న వీక్షకుల వైపుచూసి రాక్షస నవ్వులతో క్రీడామైదానం మొత్తం ఘీంకరిస్తూ సిద్ధం అయ్యాడు .

 " నా ప్రియదేవుడా ....... మీకు అపజయమా ? , మీరులేక నేను జీవించగలనా ? , నా చావు మీ కౌగిలిలో - మీ చావు నా కౌగిలిలో మాత్రమే , మీరాక కోసమే వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాను అంటూ పెదాలపై నా దేవకన్య ముద్దు " .
రాక్షసుడి గొడ్డలి నా మెడను తాకేంతలో ...... నేలకొరిగిన కత్తితో వాడి తలను నరికి విజయ గర్వంతో మహారాజు ఎదుట నిలబడ్డాను చిరునవ్వులు చిందిస్తూ ........ 
 వాడి చావు కేక రాజ్యం మొత్తం వినిపించింది - మహారాజు అవాక్కై అలా నిలబడిపోయాడు .
వీరా వీరాధివీరా అంటూ సంకెళ్లతో వచ్చి నన్ను పైకెత్తి విజయ సంబరాలు చేసుకున్నారు . 
మిత్రులందరిపై స్పృహకోల్పోయాను .
నీళ్లు నీళ్లు అందుకోండి - వీరాధివీరుడికి వెంటనే నీళ్లు కావాలి అంటూ తోటి చెరశాల మిత్రుడు కేకలువేస్తున్నాడు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 23-11-2022, 10:29 AM



Users browsing this thread: 9 Guest(s)