Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నేనుమాత్రం నా అతిలోకసుందరి ఊహాలతో హాయిగా విశ్రాంతి తీసుకున్నట్లు ఆవ్ ...... అంటూ ఆవలిస్తూ లేచి కూర్చుని కళ్ళుతెరిచాను .
తొలి సూర్యకిరణాలు నేరుగా నాపై పడుతుండటం చూసి లేచి సూర్యవందనం చేసుకున్నాను .
ఎదురుగా సోదరుడు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి నావైపే చూస్తున్నాడు .
సోదరా ...... సూర్యోదయం అయ్యిందికదా పోటీల దండోరా మ్రోగలేదా అని అడిగాను .
ఆ ...... అంటూ పూర్తిగా నోరుతెరిచి కదలకుండా ఉండిపోయాడు .
సోదరా సోదరా ...... అంటూ నవ్వుకున్నాను .
వీరాధివీరా ....... మొన్నేమో వందకుపైగా కొరడా దెబ్బలు కొట్టినా మరుసటిరోజుకు సిద్ధం అయిపోయారు నిన్నేమో కత్తి గాట్లు భీకరమైన పోటీలో పూర్తిగా అలసిపోయారు ..... అయినా సూర్యోదయ సమయానికి లేచి నిలబడమే కాకుండా పోటీలు ప్రారంభం కాలేదా అని అడుగుతున్నారు అంటూ ఆశ్చర్యపోతూనే లేచివచ్చి , నావీపుపై చుట్టిన గుడ్డలను తీసేసి చూసి మరింత ఆశ్చర్యపోయాడు , వీరాధివీరా ...... అందరూ దేవుడని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది - కత్తి గాట్లు నయమైపోయాయి - పక్షముల ముందు కత్తిగాట్లు పడ్డాయేమో అన్నట్లు పూర్తిగా ....... , మందు వేసుకోలేదు - కుట్లూ వెయ్యనేలేదు .......
సోదరా ...... దాహం వేస్తోంది .
వెంటనే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు . 
సోదరా ...... నీళ్లే నాకు మందు - నదీఅమ్మా అంటూ ప్రార్థించి నీటిని త్రాగాను - ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది , ఇంతకూ పోటీల గురించి చెప్పనేలేదు .
భటుల సమాచారం ప్రకారం ...... మీపై రాజు చాలా చాలా కోపంతో ఉన్నాడట - రాజు ఆజ్ఞను ధిక్కరించి గర్జించిన నిన్ను ఎలాగైనా చంపాలని - ఈ రాజ్యంలో ఉన్న రాక్షసుల్లాంటి సైనికులను నువ్వు మట్టికరిపించడంతో అంతకుమించిన రాక్షసుల్లాంటి వారిని కేంద్రీకరించడం కోసం చుట్టూ ఉన్న అన్ని రాజ్యాలకు - సామంత రాజ్యాలకు వర్తమానం పంపించారట , అలాంటివారు దొరికేంతవరకూ పోటీలు తాత్కాలికంగా నిలిపివేయ్యబడ్డాయి , ఈ వీరాధివీరుడు ...... రాజు కల్లోకి కూడా వెళ్లి ఇబ్బందిపెట్టినట్లు రాత్రంతా నిద్రపోలేదని సమాచారం - కానీ ఇక్కడ మాత్రం ఈ వీరాధివీరుడు హాయిగా నిద్రపోయారు అనిచెప్పడంతో నవ్వుకున్నాము , ఇనుప ద్వారం దగ్గరికివెళ్లి మిత్రులారా ...... మన దేవుడు లేచాడు పోటీలకు సిద్ధంగా ఉన్నారు అంటూ సంతోషంతో కేకలువేశాడు .
" వీరుడు - వీరాధివీరుడు - దేవుడు ........ " అంటూ చీకటి కారాగారం దద్దరిల్లిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
రాజమందిరం వరకూ వినిపించినట్లు రాజుకు మరింత కోపం తెప్పించినట్లు కొద్దిసేపటి తరువాత పెద్ద మొత్తంలో సైనికులు వచ్చి ఆపమని బెదిరిస్తూ ద్వారాలవైపు కొడుతున్న ఆపడం లేదు - సైనికులు మా ద్వారం దగ్గరకు చేరుకుని నేను సిద్ధంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయి భయపడుతూ వెనక్కు వెళ్లిపోయారు - ఈ విషయాన్ని వెంటనే మహారాజుకు చెప్పాలి అంటూ గుసగుసలాడుకుంటూ వెళ్లిపోయారు నలుగురు ....... , రేయ్ బానిసల్లారా ...... మీరు కేకలువెయ్యడం ఆపకపోతే రెండు రోజులు ఆహారం పెట్టము .
సోదరులు : రెండురోజులు కాకపోతే వారం రోజులు పెట్టకండి - ఈ చీకటి కారాగారంలోకి తోసేసిన తరువాత తొలిసారి సంతోషం కలుగుతోంది - ఈ సంబరాలలో ఆకలి అన్నమాటే కలగదు అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా నినాదాలతో హోరెత్తిస్తున్నారు - తోటి సోదరుడు కూడా చిరునవ్వులు చిందిస్తూ నినాదాలు చేస్తున్నాడు .

( భటులు ...... సైన్యాధ్యక్షుడుకు , సైన్యాధ్యక్షుడు ...... రాజుకు విషయం తెలియజేశాడు .
రాజు : ఒక్కరోజులో సిద్ధం అయిపోయాడా అంటూ ఆశ్చర్యం మరొకపక్క వాణ్ణి చంపలేమా అంటూ అసహనం .......
మహారాణి ...... మంజరిని మచ్చిక చేసుకోవడం కోసం తన మందిరానికి తీసుకొచ్చినట్లు ...... , చెప్పానుకదా రాజా ...... మా మహారాజు దేవుడితో సమానం - మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా మరుసటిరోజుకు సిద్ధం అయిపోతారు - తప్పయిందని ఒప్పుకుని మమ్మల్ని వదిలితే మేమే వెళ్లిపోతాము - అతిముఖ్యమైన పనిపై రాజ్యాలను దాటుకుంటూ వెళుతున్నాము .
రాజు : ఏమిటీ ...... తప్పయిందని ఒప్పుకోవడమా ? , నా కంఠంలో ప్రాణం ఉండగా అలాచెయ్యను మిమ్మల్ని కలవనివ్వను ......
మంజరి : సమయమే సమాధానం చెబుతుంది - మా మహారాజు క్షేమం అని తెలియచేసినందుకు సంతోషం అంటూ పంజరంలో చిందులువేస్తోంది .
రాజు తలపట్టుకుని కోపంతో ఊగిపోతున్నాడు - చెలికత్తెలూ ...... చిలుకను తీసుకెళ్లి .......
మంజరి : తీసుకెళ్లి చీకటి గదిలో ఉంచండి - దీనిమాత్రం మీకు ధన్యవాదాలు రాజా ....... , మా మహారాజు చీకటి కారాగారంలో ఉంటూ నేను ఇలా రాజమందిరంలో ఉండటం తగదు , మా మహారాజు వచ్చి నన్ను తీసుకెళ్లేంతవరకూ చీకటి గదిలోనే ఉంచాలని మనవి .
అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు - చెలికత్తెలు ...... మంజరిని తీసుకెళ్లి చీకటి గదిలో ఉంచారు ) .

నాప్రియాతిప్రియమైన దేవకన్య ఊహాలతో రోజులు వేగంగా గడిచిపోసాగాయి . పోటీల గురించి అందరమూ మరిచిపోయాము అనుకునేంతలో ఒక ఉదయం పోటీలనగారా మ్రోగింది .
సోదరుడి ముఖంలో భయం .......
అంతలో కారాగారపు పెద్ద ద్వారం తెరుచుకుంది - భారీగానే సైనికులు లోపలికివచ్చి ఒక్కొక్క గదిలోనుండి ఇద్దరిద్దరిని బయటకు లాగారు - ఆ ఇద్దరిద్దరి ఒక్కొక్కచేతికి గోలుసులువేసి ఏకం చేశారు . 
సైన్యాధ్యక్షుడు వచ్చి ప్రజలందరి ముందు నీ చావు చూడటం కోసమే ఇలా ప్రణాళిక రచించాము - ఇప్పుడు నీ కుడిచెయ్యితో ఇంతకుముందులా సులభంగా పోరాడలేవు - రాజు ముందు మోకరిల్లి ప్రాణాలు వదులు అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క మొండి కత్తులను మరియు బాణాల నుండి రక్షణ పొందడానికి డాలును అందించి పైన క్రీడా సంగ్రామం మధ్యలోకి తీసుకెళ్లి వదిలారు .
సోదరుడు ఎలా అన్నట్లు గజగజవణుకుతున్నాడు - సోదరుడితోపాటు మిగతావారందరూ కూడానూ ........

క్రీడా ప్రాంగణం చుట్టూ రెట్టింపు జనాలతో నిండిపోయినట్లు హోరెత్తిపోతోంది , సగం మంది చంపెయ్యాలి చంపెయ్యాలి ...... అంటూ మిగతా సగం మంది వీరుడా - వీరాధివీరుడా గెలవాలి అంటూ కేకలువేస్తున్నారు .
పోటీలు నిర్వహిస్తున్న రాజు పరివారం ముందుకువచ్చి , పోటీల చరిత్రలో రెండవరోజుకు చేరడం ఇదే ప్రథమం - రాజ్య ప్రజలకు మరింత వినోదం పంచడం కోసం మన మహారాజుగారు మన సోదర రాజ్యాలనుండి వీరాధివీరులైన యోధులను రప్పించారు .
ఒక్కసారిగా క్రీడా ప్రాంగణం నలువైపులా ఉన్న నాలుగైదు పెద్ద పెద్ద ద్వారాలు తెరుచుకున్నాయి .
అన్ని ద్వారాలు తెరుచుకున్నాయి అంటూ ప్రజలంతా ఉత్కంఠతో చూస్తూ కేకలువేస్తున్నారు .

సోదరులారా ........ మీలో ఎవరికైనా యుద్ధాలలో పాల్గొన్న అనుభవం ఉందా ? అని అడిగాను .
వీరాధివీరా అంటూ ముగ్గురు నలుగురు చేతులు పైకెత్తారు .
మీ సహాయం ముఖ్యం ......
సోదరులారా ...... ఆ ద్వారాల నుండి ఎవరు - ఏమిటి లోపలికి వచ్చినా ...... మనం ప్రాణాలతో బయటపడాలంటే మనమంతా కలిసి ఎదుర్కోవాలి అదొక్కటే మార్గం ...... మీకు అర్థం అయ్యిందా ? .
అందరూ భయంతోనే తలలుఉపారు .
మనం కలిసి పోరాడితే అందరమూ అందరమూ ప్రాణాలతో బయటపడగలం .

ప్రజలందరి వినోదం కోసం రప్పించిన చోళ సామ్రాజ్య యోధులు ....... అంటూ ఒక ద్వారం వైపు చూయించడంతో ఒక రథం అందులో నలుగైదుగురు ఆయుధాలను ఊపుకుంటూ వచ్చి మాచుట్టూ తిరుగుతున్నారు .
చోళ యోధులు చోళ యోధులు అంటూ హోరెత్తిపోయింది .
తదుపరి మైసూరు సామ్రాజ్య యోధులు ...... అంటూ మరొక ద్వారం వైపు చూయించడంతో రాక్షసుల్లాంటి యోధులు రాక్షస ఆయుధాలతో రథంలో వచ్చి చుట్టూ తిరుగుతున్నారు .
మిగతా ద్వారాలనుండి వచ్చే రాజ్యాలలో హిడుంభి రాజ్యపు యోధులు వస్తే బాగుండు అని చూసిన నాకు నిరాశనే మిగిలింది మిగతా ద్వారాలనుండి వేరు వేరు సామ్రాజ్యపు రథాలు యోధులు వచ్చి ఒకరి వెనుక మరొకరు భయకంపితం చేసేలా తిరుగుతున్నారు - అసలు అలాంటి పేరుతో రాజ్యం ఉందో లేదో ...... ఉన్నా లేకున్నా మహి సంతోషంగా ఉండాలి అంటూ హృదయంపై చేతినివేసుకుని ప్రార్థించాను .
ఒక్కొక్క రథం ప్రవేశించిన ప్రతీసారీ ప్రజలు ఉర్రూతలూగిపోతూ కేకలువేస్తున్నారు .

భయపడకండి సోదరులారా - భయమే మనల్ని సగం చంపేస్తుంది .
పోటీ ప్రారంభం అంటూ రాజు చేతితో సైగచెయ్యగానే ...... ఒక రథం మమ్మల్ని విచ్చిన్నం చెయ్యడానికి మా మీదుగా వచ్చింది .
సోదరులారా కలిసి ఉండండి కలిసి ఉండండి - ఒక్కటిగా నిలబడండి అనడంతో రథానికి దారిని వదిలి మళ్లీ గుంపుగా చేరారు .
మాపైకి రథాలనుండి బాణాలు - ఈటెల వర్షం కురుస్తోంది నలువైపుల నుండి , ఇద్దరికి చేతులలో మరొకరికి పాదాలలో బాణాలు గుచ్చుకున్నాయి .
చంపేయ్ చంపేయ్ అంటూ చుట్టూ కేకలు .......

సోదరులారా ...... డాలులను అడ్డుగా ఉంచుకోండి , నిలువు వరుసలుగా నిలబడి గోడలను నిర్మించండి .
మావైపుకు దూసుకువస్తున్న బాణాలను డాలులతో అడ్డుపెడుతూ చుట్టూ గోడను నిర్మించాము .
బాణాలు - ఈటెలను ...... డాలులు అడ్డుకుంటున్నాయి .
వీరాధివీరా - వీరులారా పోరాడండి అంటూ మాకు మద్దతిస్తూ వస్తున్న ప్రజల కేకలకు కాస్త ఊరట లభిస్తోంది .
డాలులకు గుచ్చుకున్న ఈటెలను అందుకుని రెడీగా ఉండండి అనిచెప్పడంతో సోదరులంతా దైర్యంగా తీసుకున్నారు .
బాణాలతో లాభం లేదనుకుని ఒక రథం మా గోడలను బద్ధలుకొట్టడానికి వచ్చింది .
ఒక్కటిగా నిలబడండి ........
మా బృందం కదలకపోవడంతో రథమే ప్రక్కకు వెళ్ళిపోయింది .
మాతోపాటు ప్రజలు నవ్వుకున్నారు .
అలాగే అలాగే సోదరులారా ....... , మరొక రథం వస్తోంది అలాగే ఉండండి అలాగే ఉండండి వచ్చేస్తోంది డాలులను ఏటవాలుగా ఉంచి రక్షణ కల్పించుకోండి .
అంతే రథం వైపు ఉన్న సోదరులు నాతోపాటు డాలులను ఏటవాలుగా పెట్టి రథపు చక్రాలకు అడ్డుగా పెట్టడంతో ....... రథం చుట్లు తిరుగుతూ ఎగిరిపడింది .
ప్రజలతోపాటు రాజు అలా చూస్తుండిపోయాడు .
వీరాధివీరులు అంటూ కేకలు ........
గోలుసులను భీకరమైన ఆయుధాలతో తెంపుకుని , సోదరులారా ...... చంపకండి చావుని పరిచయం చెయ్యండి చాలు అనిచెప్పడంతో నావెనుకే వచ్చి కాళ్ళు చేతులను విరిచేశారు .
వీరాధివీరుడు దయగలవాడు ........

ఒక సోదరుడి కాలికి బాణం గుచ్చుకుంది .
ఈటెను తిప్పి బాణం వదిలిన వాడివైపు విసరడంతో రథం నుండి ఎగిరి కిందపడ్డాడు .
బాణపు నొప్పితో విలవిలలాడుతున్న సోదరుడి మీదకు మరొక రథం దూసుకురాసాగింది .
పెద్దాయనను కాపాడుకోలేకపోయాను - ఒక్కప్రాణం కూడా పోకూడదని పరుగునవెళ్లి ఎగిరి ఒకప్రక్కకు లాక్కునివెళ్ళాను .
వీరాధివీరుడు వీరాధివీరుడు ప్రాణాలను సైతం లెక్కచెయ్యడు .
మమ్మల్ని వెనక్కు తిరిగి చూస్తూ ముందు వస్తున్న రథాన్ని చూసుకోకపోవడంతో చక్రాలు తగిలి కారాగారపు ద్వారంలోపలికి విచ్చిన్నం అవుతూ దూసుకుపోయింది .
సోదరుడు : రెండు ఖతం ఇక మిగిలినది రెండే ...... , వీరాధివీరా ఇక ఏమాత్రం భయపడము నువ్వు ఎలా చెబితే అలా చేస్తాము అంటూ ఒక్కటిగా జతకట్టారు .
అడ్డుగా వచ్చిన రథం పట్టు తప్పినట్లు అడ్డుగా పడిపోయి దూసుకుంటూ వెళ్లి గోడలను గుద్దుకుంది .
ఇక మిగిలినది ఒక్కటే వీరా ......... అంటూ రథం నుండి కిందపడిన వాళ్ళను లేవకుండా చేశారు .

సోదరులారా సగం సగం అటువైపు ఇటువైపు నిలువు వరుసలుగా జతకట్టండి .
అంతే పరుగునవెళ్లి చివరి రథం నా నియంత్రణలోకి వచ్చేలా నిలబడ్డారు - ముక్కలు అయిన రథాలను అడ్డుపెట్టారు .
అయినాకూడా చివరి రథం తప్పించుకోవడంతో వెనుకే పరుగులుతీసాను - ప్రయోజనం లేకపోవడంతో మిత్రమా ...... సహాయం అన్నట్లు కేకలువేశాను .
గుర్రపు శాలలో కట్టివేయబడి ఉన్నా తెంపుకుని క్రీడా ప్రాంగణంలోకి దూసుకువచ్చాడు .
మిత్రమా అంటూ పరుగునవెళ్లి ఎక్కి హత్తుకున్నాను . అటువైపు అంటూ రథం వెనుకే వేగంగా పోనిచ్చాను - నేలపై గుచ్చుకుని నిలబడిన ఈటెను అందుకుని వెనక్కు తిప్పి విసరడంతో రథం వెనకనుండి బాణాలు సంధిస్తున్న వాడు ఎగిరిపడ్డాడు .
సోదరులారా అంటూ రథం కంటే వేగంగా పోనిచ్చి రథం స్వారీ చేస్తున్న వాడిని తికమకపెట్టడంతో , సోదరులు అడ్డుపెట్టిన రథాన్ని గుద్దుకుని గాలిలో చుట్టూ తిరుగుతూ నేలకొరిగింది .
మిత్రుడికి ముద్దుపెట్టి , రాజువైపు విజయ సంకేతం చూయించి విజయానందంతో కేకలువేస్తున్న సోదరుల దగ్గరికి చేరుకున్నాను , మిత్రమా ....... నువ్వు నాతో ఉండటం చాలా చాలా ప్రమాదం - నామీద ఉన్న కోపంతో నిన్ను ఏమైనా చెయ్యొచ్చు - నీకేమైనా అయితే మహి తట్టుకోలేదు  - ఈ ఒక్కసారికీ నామాట విని వెళ్లు ......
నన్ను స్పృశించి జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు .
అంతే సోదరులంతా వచ్చి ప్రజల సంతోషాలతోపాటు కేకలువేస్తూ వచ్చి నన్ను అమాంతం ఎత్తేసి విజయ సంబరాలు చేసుకున్నారు .
రాజు అయితే పోటీ పరివారంపై కోప్పడి వెళ్ళిపోయాడు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 23-11-2022, 10:26 AM



Users browsing this thread: 52 Guest(s)