Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మంజరి : ప్రభూ ...... అలాగైతే ముందు ఈ ముగ్గురి యువరాజుల రాజ్యాలలో ........ ఖచ్చితంగా ఉండదు ఉండి ఉంటే ఈపాటికి గురువుగారిని మరింత బాధపెట్టి ఉండేవారు .
అవును ఈ మూడు రాజ్యాలలోనేకాదు చుట్టూ ఉన్న సామంతరాజ్యాలలో కూడా లేనట్లే అంటూ ప్రవాహం వైపుగా సాయంత్రం వరకూ ఎక్కడా ఆగకుండా ప్రయాణించి కొత్తరాజ్యానికి చేరుకున్నాము .
మిత్రమా ...... నిన్ను ఇబ్బందిపెట్టాను .
మిత్రుడు : మహికోసం తప్పదు అన్నట్లు నన్ను స్పృశించాడు .
మిత్రుడిని ప్రేమతో హత్తుకుని దాహం తీర్చుకో అంటూ మంజరితోపాటు ప్రవాహంలోకి చేరాను - నీరు త్రాగబోతే నీళ్ళల్లో మహి ప్రతిరూపం ...... 
మంజరి : నా కళ్లల్లో వెలుగుని చూసి , ప్రభూ ...... మహి కదూ .
అవును మంజరీ ...... ఇక్కడకూడా ఈ ప్రవాహం వెంబడి ఎక్కడో మహి దాహం తీర్చుకుంది - అంటే మనం సరైన దిక్కులోనే ఉన్నాము .
మంజరి : అయితే మహి ...... ఈరాజ్యంలో ఉండనూవచ్చు , ప్రభూ ...... మీరు అదిగో ఆకొండపైకి చేరండి నేనువెళ్లి రాజభవనంలోని మందిరాలతోపాటు అంగుళం అంగుళం వెతికి సంతోషమైన వార్తతో వస్తాను . 
జాగ్రత్త మంజరీ ....... , అపాయం సంభవిస్తే ......
మంజరి : సంకేతంగా శబ్దాలు చేస్తానులే ప్రభూ ...... , మీరేమీ కంగారుపడకండి - ఇదొక్కటే మార్గమని నాకు తెలియదా ...... అంటూ ఆశతో ఎగురుకుంటూ పెద్ద రాజభవనం వైపుకు వెళ్ళింది .
అమ్మా పరాశక్తీ ...... మంజరికి మీరే తోడుగా ఉండాలి అంటూ కంగారుపడుతూ పైనుండి చూస్తున్నాను .

మంజరి శుభవార్తతో వచ్చేలోపు తనకు ఇష్టమైన పళ్ళను సిద్ధంగా ఉంచాలని చుట్టూ చూసి అరణ్యంలో ఉన్న చెట్ల నుండి పళ్ళను తీసుకొచ్చాను - మిత్రుడికి తినిపించబోతే ...... మంజరి వచ్చాకనే అన్నట్లు రాజ్యం వైపుకు చూస్తోంది .
పూర్తి చీకటిగా మారిపోయింది ఘడియలు గడిచిపోతున్నా మంజరి జాడ లేదు - మంజరిని ఎవరూ గమనించకూడదు - మంజరి జాగ్రత్తగా రావాలి అంటూ ప్రార్థిస్తుండగానే అర్ధరాత్రి దాటిపోతోంది - మిత్రమా ...... ఇక వేచిచూసి లాభం లేదు అంటూ విల్లుని - కత్తిని చేతబట్టి మిత్రుడిపైకి చేరేంతలో ........
శాంతించండి శాంతించండి మహాప్రభూ ....... నాకోసమే అంతపెద్ద రాజ్యంపై ఒక్కరే దండెత్తడానికి సిద్ధమవుతున్నట్లున్నారే అంటూ మంజరి వచ్చి నా భుజంపైకి చేరింది .
మంజరీ మంజరీ ...... నీకేమీ కాలేదుకదా అంటూ చేతుల్లోకి సున్నితంగా తీసుకుని గమనిస్తున్నాను .
మంజరి : నాకేమీ కాలేదు ప్రభూ కంగారుపడకండి ....... , ప్రభూ ..... సగం రాజ్యం మొత్తం వెతికినా మహి జాడలేదు , నిద్రపోవడానికన్నట్లు మిగతా రాజ మందిరాలు మూతపడ్డాయి , ఉదయం వరకూ అక్కడే వేచి ఉండాలనుకున్నాను , మీగురించి తెలిసి మళ్లీ ఉదయం వెళ్ళొచ్చులే అని వచ్చేసాను .
ఇప్పటికే ప్రాణం కంటే ఎక్కువైన ఒకరిని దూరం చేసుకున్నాను - మాఇద్దరి ప్రాణమైన మా మంజరిని కూడా పోగొట్టుకోలేము ...... 
మంజరి : చాలా సంతోషం వేస్తోంది ప్రభూ ...... , మహి కనిపించే ఆనందం కోసం ఎదురుచూస్తున్నాను .
ఆ సంతోషం దగ్గరలోనే ఉంది మంజరీ ...... , అలా కలిసినప్పుడు నువ్వులేకపోతే నన్ను దగ్గరికైనా రానివ్వదు , మన నలుగురం ఒక కుటుంబం ఏ ఒక్కరు లేకపోయినా తట్టుకోలేను .
మంజరి : ప్రభూ ...... ఉదయం కూడా ఆలస్యం అవ్వవచ్చు , ఇలా వెంటనే రణరంగానికి సిద్ధం కాకండి .
ఆలస్యం అయ్యేకొద్దీ ఈ హృదయస్పందన మారిపోతుంది మంజరీ ...... , నాకు తెలియకుండానే సిద్ధం అయిపోతాను , ఒకసారి తప్పుచేశానన్న భావనతో శాంతంగా ఉండి ప్రాణసమానమైన మహిని దూరం చేసుకున్నాను , మళ్లీ అలాంటి తప్పును చేసి మిమ్మల్ని కూడా దూరం చేసుకోలేను , నీకోసం తియ్యనైన పళ్ళు తీసుకొచ్చాను నువ్వు - వస్తేనేకానీ తిననని మిత్రుడు కూడా తినలేదు అంటూ తినిపించాను .
మంజరి : ప్రభూ ..... మీరు తింటేనే మేమూ తినేది - ఇక్కడ మీరు తింటేనే మనకు తెలియనిచోట ఉన్న మహి తింటుంది .
అయితే తింటాను మంజరీ ...... , అమ్మా ...... మహి తినేలా మీరే చూసుకోవాలి అంటూ ప్రార్థించి తిని అక్కడే విశ్రాంతి తీసుకున్నాము . మహి వస్తువులను హృదయంపై హత్తుకుని మహి ఊహాలతో నిద్రపోవడం కష్టమైనా మహి వస్తువులు జోకొడుతున్నట్లు నిద్రపట్టేసింది .

కళ్లపై సూర్యకిరణాలు పడటంతో మేల్కొన్నాను . కళ్ళు తెరవడం ఆలస్యం .....
ప్రభూ ...... శుభవార్తతో వస్తాను అంటూ మంజరి ..... రాజభవనం వైపుకు ఎగురుకుంటూ వెళ్లిపోతోంది .
జాగ్రత్త మంజరీ ..... 
అలావెళ్లిన మంజరి మిట్ట మధ్యాహ్నం సమయానికి నిరాశతో వచ్చింది . ప్రభూ ..... మిగిలిన సగం రాజభవనంతోపాటు ఎవరికీ కనిపించకుండా మళ్లీ మొత్తం ఒకసారి వెతికినా మహి జాడ కనిపించలేదు .
బాధపడకు మంజరీ ...... , ఈ పెద్ద రాజ్యం చుట్టూ ఐదారు సామంతరాజ్యాలు ఉన్నాయని పశువుల కాపరుల ద్వారా తెలుసుకుని పటాన్ని కూడా తయారుచేసాను కానీ హిడుంభి పేరుతో ఏ రాజ్యం లేదని చెబుతున్నారు .
మంజరి : ఆ యువరాజు మోసగాడు ప్రభూ - రాజ్యం పేరు కూడా తప్పుగా చెప్పి ఉండొచ్చు , ముందైతే పదండి ప్రభూ ...... ఆ సామంతరాజ్యాలలో మన మహి మరియు ఆ మోసగాడు ఎక్కడ ఉన్నాడో కనిపెడదాము .
అలాగే మంజరీ అంటూ భుజంపై ఉంచుకుని చుట్టూ ఉన్న ఒక్కొక్క సామంతరాజ్యానికి చేరుకోవడం - మంజరి గుట్టుచప్పుడు కాకుండా రాజభవనంలోకి వెళ్లి రాజమందిరాలలో రెండు మూడుసార్లు మహికోసం అన్వేషించడం చివరికి నిరాశతో తిరిగిరావడం ....... , అలా ఆ సామంతరాజ్యాలన్నీ వెతికేసరికి రెండు పక్షాల సమయం పట్టింది .

చివరి సామంతరాజ్యం కూడా వెతికి బాధపడుతూ నదీఅమ్మ చెంతకు చేరాము . అమ్మా ...... మాఇద్దరి మధ్యన ఈ విరహం ఇంకెంతకాలం అంటూ నీళ్ళల్లోకి చేరాను .
వెంటనే పైకిలేచి మంజరీ ...... అన్నాను .
మంజరి : మిత్రమా కృష్ణా ...... ప్రవాహం వెంబడి ఉన్న మరొక రాజ్యానికి చేరుకోవాలి వెంటనే ......
ముందు కాళ్ళను అంతెత్తుకు పైకిలేపి సిద్ధం అంటూ ఎక్కమని హుషారుగా పిలిచాడు .
మంజరి కూడా మిత్రుడి తలపైకి చేరింది - పరుగునవెళ్లి మిత్రుడిమీదకు చేరి వేగంగా మరొక రాజ్యాన్ని చేరుకునేసరికి రెండురోజులుపట్టింది .

అక్కడకూడా ప్రధాన రాజ్యం మరియు రాజ్యం చుట్టూ ఉన్న సామంతరాజ్యాలలో మంజరి వెతికి నిరాశతో వెనుతిరివచ్చింది . చివరి సామంతరాజ్యం వెతికిన తరువాత మరింత ముందుకు ప్రవహిస్తున్న ప్రవాహం చెంతకు చేరగానే , మహి ఇంకా ముందుకువెళ్లినట్లు తెలియజెయ్యడంతో దక్షిణ భారతదేశం వెడల్పునా ఉన్న ఒక్కొక్క ప్రతీ రాజ్యాన్ని - సామంతరాజ్యాలను వెతుకుతూ ఎలా గడిచిపోయిందో బాధలోనే సంవత్సర కాలం గడిచిపోయింది .

అలా నదీ అమ్మ సహాయంతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యానికి చేరుకున్నాము , కొండపైనుండి అంతపెద్ద రాజ్యాన్ని - లక్షల్లో ప్రజలను మరియు అడుగుకొక సైనికుడిని చూసి ఆశ్చర్యపోయాము . 
మంజరీ ...... ఈ సామ్రాజ్యాన్ని క్షుణ్ణoగా వెతకాలి అంటే ఎంత సమయం పట్టేనో ........
మంజరి : అందుకే ఇప్పుడే బయలుదేరతాను ప్రభూ ...... , ఆలస్యం అవ్వవచ్చు కంగారుపడకండి .......
కాస్త జాగ్రత్త మంజరీ .......
చిత్తం ప్రభూ అని బదులిచ్చి ఆశతో వెళ్లిన మంజరి , గడియలైనా రోజులైనా వెనుతిరిగిరాకపోవడంతో కంగారుపడుతూ రాజ్యంలోకివెళ్ళాను - ఎవ్వరికీ అనుమానం రాకుండా రాజభవనం సింహద్వారం చేరుకున్నాను , అక్కడ ఉన్న రక్షణ చూస్తేనే అర్థమైపోయింది అనుమతి లేకుండా ఒక్క అడుగుకూడా లోపలకువెయ్యలేమని .......

అంతలో సింహద్వారం నుండి 10 - 15 మంది అమ్మాయిలు బయటకువచ్చారు . చిలుక చిలుక అంటూ వాళ్ళ గుసగుసలకు వెనువెనుకే నడిచాను .
అమ్మాయిలు : చిలుక ఎంత అందంగా ఉందో తెలుసా ..... , ఎంత ముద్దుముద్దుగా మాట్లాడుతోందో ...... , దాదాపు సగం భటుల సహాయంతో వలలు వేసిమరీ పట్టించారు మహారాజుగారు - బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండటంతో పంజరంలో బంధించి మహారాణికి బహూకరించారు - అంత అందమైన బహుమతి లేదన్నట్లు ప్రాణంలా చూసుకుంటున్నారు - వదిలితే ఎగిరిపోయేలా ఉందని పంజరంలోనే బంధించేసి స్నేహాన్ని పెంచుకుంటున్నారు .
ఆ మాటలు వినగానే గుండె ఆగిపోయినంత పని అయ్యింది  - ఎలాగైనా మంజరిని రక్షించాలని రాజ్యం మొత్తం చుట్టేసి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి , మొదట దేవకన్యను ఇప్పుడేమో దేవకన్యకు ప్రియమైన మంజరిని దూరం చేసుకున్నాను లేదు లేదు ఇక్కడనుండి వెళితే మంజరితోనే వెళ్ళాలి మిత్రమా అంటూ ఏ దారినీ వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను .

కొన్నిరోజులుగా రాజ్యంలో అనుమానంగా తిరుగుతున్నానన్న కారణంతో పెద్దమొత్తంలో సైనికులు నన్ను చుట్టుముట్టారు .
మిత్రమా ...... మనపై అనుమానం కలిగినట్లు ఉంది - నీకు దారిని ఏర్పరుస్తాను వెళ్లిపో అంటూ కత్తిని అందుకున్నాను .
అంతే సైనికులంతా నాపైకి ఆయుధాలను ఎక్కుపెట్టారు - ఆయుధాన్ని వదిలెయ్యమని హెచ్చరిస్తున్నారు .
చావైనా - బ్రతుకైనా ....... మిత్రుడితోనే అన్నట్లు నన్ను అంటిపెట్టుకునే ఉండిపోయాడు మిత్రుడు .
మిత్రుడు ...... అడుగడుగునా ప్రమాదం పొంచి ఉన్న బయట ఉండటం కంటే రాజ్యంలోని గుర్రపు శాలలో ఉండటం మంచిది అనుకుని కత్తిని కిందకుజార్చేసి సైనికులకు లొంగిపోయాను - మిత్రమా ...... దైర్యంగా ఉండు ఎప్పటికైనా మనం మళ్లీ కలుస్తాము అని హామీ ఇచ్చాను .
నన్ను తాళ్లతో బంధించి సింహద్వారం ద్వారా లోపలికి లాక్కెళ్లి సైన్యాధ్యక్షా ..... రాజ్యం చుట్టూ అనుమానంగా తిరుగుతున్నాడు అంటూ కొద్దిమంది వెనుక నిలబెట్టారు - మిత్రుడిని మరొకవైపుకు తీసుకెళ్లారు .

సైన్యాధ్యక్షుడు ...... ఒక్కొక్కరినే విచారిస్తూ వారి తప్పులకు అనుగుణంగా శిక్షలువేస్తూ కారాగారంలో పడెయ్యమని అదేశాలిస్తున్నాడు .
నావంతు రావడంతో సైన్యాధ్యక్షుడి ముందుకు తోసారు ........
సైన్యాధ్యక్షుడు : ఎవరు నువ్వు ? , ఏ రాజ్యం నుండి వచ్చావు ? , మా రాజ్యంలో ఎందుకు తిరుగుతున్నావు ? .
ఒక మహారాజుగా అపద్ధం చెప్పకూడదు అని , నేను మన దేశం మధ్యలో ఉన్న చంద్ర రాజ్య మహారాజునని - ఒకరిని అన్వేషిస్తూ రాజ్యాలు తిరుగుతున్నానని - కొన్నిరోజుల క్రితం వారిని వెతకడానికి రాజభవనంలోకి వెళ్లిన అందమైన చిలుకను మీ మహారాజు బంధించి మహారాణీ గారికి బహుకరించిడంతో దిక్కుతోచని స్థితిలో రాజ్యంలోనే తిరుగుతున్నాను .
నేను చెప్పినదంతా విని సైన్యాధ్యక్షుడితోపాటు సైనికులు కూడా నవ్వుకుంటున్నారు - నిజం చెప్పమని కొరడా దెబ్బలు కొట్టారు .
మళ్లీ మళ్లీ అదే నిజం అని దైర్యంగా చెప్పాను .
సైన్యాధ్యక్షుడు : మహారాజు - మహారాణి గురించే ప్రస్తావించాడు అంటే రాజద్రోహమే - వీడివల్ల అపాయం పొంచి ఉన్నది కాబట్టి వీడిని తీసుకెళ్లి పోటీలకోసం తయారుచేస్తున్న యోధుల చెరశాలలో పడేయ్యండి - మరొకసారి ఇలానే చెబితే చావుని పరిచయం చేసేలా కొరడా దెబ్బలు కొట్టండి - ప్రాణం మాత్రం పోకూడదు పోటీలలో పోయే తొలిప్రాణం వీడిదే కావాలి - వీడు వదలండి వదలండి అంటూ ప్రాధేయపడటం చూసి మహారాజు గారితోపాటు ప్రజలందరూ నవ్వుకోవాలి , చంద్ర రాజ్య మహారాజట - చిలుక కోసం వచ్చాడట అంటూ నవ్వుకుంటున్నాడు .

సైనికులు : రేయ్ ...... దొంగతనం చెయ్యడానికి వచ్చాను అని ఒప్పుకో కొన్నిరోజులు సాధారణ శిక్షను అనుభవించి వెళ్లిపోవచ్చు ...... , ఇలా మళ్లీ బాదులిచ్చావంటే రాజుగారు నిర్వహిస్తున్న అతి భయంకరమైన యోధుల పోటీలలో కుక్క చావు చస్తావు అంటూ చీకటి కారాగారంలోకి తీసుకెళ్లారు .
మరొక సైనికుడు : చివరిసారిగా అడుగుతున్నాము ఎవరు నువ్వు ? - ఎందుకు వచ్చావు ? .
ఒక రాజ్య మహారాజుగా అపద్ధం చెప్పకూడదు అంటూ నా సమాధానం మారలేదు .
సైనికులు : ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అంటూ చేతులను కట్టేసి చావుని పరిచయం చేసేలా స్పృహకోల్పోయేలా కొరడా దెబ్బలు కొట్టి , తాళ్లను విప్పి నేలపై పడేసారు , రేపు సూర్యోదయం కాగానే రాజు గారు - ప్రజలందరి సమక్షంలో నువ్వు అస్తమిస్తావు అనిచెప్పి తాళం వేసుకుని వెళ్లిపోయారు .
మహిని - మంజరిని దూరం చేసుకున్న నొప్పి - బాధతో పోలిస్తే ఈ దెబ్బల నొప్పికి ఏమాత్రం బాధనిపించడం లేదు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 23-11-2022, 10:23 AM



Users browsing this thread: 47 Guest(s)