Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లి , తొలిసారి నా ప్రాణమైన నా దేవకన్యను కలిసినచోటైన చంద్ర రాజ్య సామంతారాజ్యపు నదీప్రవాహంలో మునిగాను , అమ్మా ...... ఎంతకాలం అయ్యింది మీ ఒడిలోకిచేరి - మీ బిడ్డ క్షేమమే కదా అంటూ నీటిలోనే కన్నీటిపర్యంతం అయ్యాను , ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రాణ సఖికి సంతోషాన్ని పంచలేకపోయాను - వివాహం అయిన రోజునే బాధపెట్టాను దూరం చేసుకున్నాను , మీ బిడ్డ ఎక్కడ ఉందో ఎంత బాధపడుతోందో ........ అంతా నా వల్లనే - నేను కలవకపోయి ఉంటే మహి ...... యువరాణిలా రాజమందిరంలో తల్లి ఒడిలో సంతోషంగా ఉండేది , ఎలాగైనా సరే మహిని కలవాలి అంటూ ఒంటిపై వస్త్రాలను వదిలేసి పైకిలేచాను .
ఇన్నిరోజుల చెరశాల నరకం నుండి బయటపడినట్లు హాయిగా - నా దేవకన్య లేని నరకంలోకి అడుగుపెట్టినట్లుగా కళ్ళల్లో చెమ్మతో ఒడ్డుకుచేరాను . 
మహీ ..... నువ్వు రూపొందించిన వజ్రవైఢూర్య క్షత్రియ వస్త్రాలను నిన్ను కలిసిన తరువాతనే దరిస్తాను అంటూ గురుకుల వస్త్రాలనే ధరించి , మంజరితోపాటు మహి భక్తితో కొలిచే పరాశక్తి పాదాల చెంతకు చేరాను , అమ్మా ...... మిమ్మల్నే దైవంగా పూజించే మీ బిడ్డ ఎక్కడ ఉందో అక్కడికి మీరే చేర్చాలి - మీమీదనే భారం వేసి వెళుతున్నాను అంటూ అమ్మవారి కుంకుమను తీసుకుని బయలుదేరాను .

మంజరి : ప్రభూ ...... మీవల్లనే మహికి ఇన్ని కష్టాలు అని బాధపడకండి - ఆ అమ్మ మనల్ని మహి చెంతకు చేరుస్తుంది .
మంజరీ ...... నా మనసులో అనుకున్నది - ప్రార్థించినది ....... 
మంజరి : నాకెలా తెలుసానుకుంటున్నారా ...... ? , మీ మనసు - హృదయం నిండా ఉన్నదే మహి కాబట్టి , అక్కడి నుండి బయటకువస్తున్న ఈ కన్నీళ్లే చెబుతున్నాయి . బాధపడకండి ప్రభూ ...... ఒకటిమాత్రం ఖచ్చితంగా చెబుతాను మిమ్మల్ని కలిసిన తరువాతనే మహి పెదాలపై సంతోషాలు పరిమళించాయి - ప్రక్కనే ఉండి చూసాను కాబట్టి చెబుతున్నాను .
నిజమా మంజరీ ...... అంటూ మనసు కాస్త కుదుటపడింది .
మంజరి : ప్రభూ ...... మీ సంతోషమే మహి సంతోషం , మీకోసం ఎన్నిరోజులైనా ప్రాణంలా ఎదురుచూస్తూ ఉంటుంది . 
నాకు తెలుసు మంజరీ ....... , కానీ ఆ యువరాజు ...... మహిని ఎన్ని కష్టాలకు గురిచేస్తున్నాడో తలుచుకుంటేనే హృదయం బద్దలైపోతోంది .
మంజరి : మీ ప్రేమ బలం - అమ్మవారి అనుగ్రహం ఉండగా అలా జరగనే జరగదు ప్రభూ .......
మంజరీ ...... నీ మాటలు నిజం అయితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు అంటూ ప్రేమతో స్పృశించాను - అమ్మవారిని ప్రార్థించాను .

మంజరి : అదిగో ప్రభూ ...... ఆ యువరాజుని తప్పుడు దారిలో పంపించిన కొండచరియలు విరిగిపడిన ప్రదేశం .......
అవును మంజరీ ...... దారిని బాగుచేసినట్లున్నారు సామంతరాజ్య ప్రజలు అంటూ దాటుకుని వారిని కలిసిన ప్రదేశం దగ్గర కిందకుదిగాను . మంజరీ ....... ఈదారి గుండానే వచ్చారని తెలుస్తోంది - ఆ రాజ్యాన్ని గుర్తించే రాజ చిహ్నాన్ని లాగేసుకున్నాడు - ఎటువంటి ఆధారం లేకుండా గుడ్డిగా మహిని వెతుకుతూ వెళ్ళాలి , ఆ అమ్మవారే మనల్ని సరిఅయిన దారిలో తీసుకువెళ్లాలని ప్రార్థించడం కంటే ఏమీ చేయలేము అంటూ బాధపడ్డాను .
మంజరి : ప్రభూ ...... మీ ఇద్దరిమధ్యన ఉన్న స్వచ్ఛమైన ప్రేమనే మిమ్మల్ని ఏకం చేస్తుంది .
మంజరీ ...... నీ మాటలే నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి - నువ్వు లేకపోయి ఉంటే కృంగిపోయేవాడిని .......
మంజరి : నా జీవితం ...... నా ప్రభువుకే అంకితం అని ఎప్పుడో నిర్ణయించుకున్నాను , సంతోషమైనా ...... కష్టమైనా ...... మీతోపాటే .......

అలా కొండలు - కోనలు - నదీప్రవాహాలు దాటుకుంటూ పగలూ - రాత్రీ పట్టించుకోకుండా ఎక్కడా విశ్రమించకుండా ప్రతీ రాజ్యాన్నీ - సామంత రాజ్యాన్నీ చేరుకోవడం ...... , ప్రభూ ...... నేనే స్వయంగా రాజమందిరాలలో రెండుమూడుసార్లు చూసాను ఈ రాజ్యంలో లేదు - ఈ సామంతరాజ్యంలో లేదు అని మంజరి ఖచ్చితంగా చెప్పడంతో ముందుకువెళ్ళసాగాను .
మంజరీ ....... ఇంతదూరం కూడా వచ్చావన్నమాట ...... 
మంజరి : నా బుల్లి గుండెలో ఉన్నది మీరిద్దరు మాత్రమే ప్రభూ ...... , మీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను , మీరిద్దరూ కలిసి సంతోషంగా జీవించడం చూస్తూ హాయిగా మీతోపాటే ఉండిపోతాను .

రోజులు - వారాలు - పక్షములు గడిచిపోతున్నాయి కానీ మహి జాడ కనిపించడం లేదు . 500 మైళ్ళ పరిధిలో తూర్పు - దక్షిణాన ఉన్న రాజ్యాలన్నింటినీ మరొకసారి వెతుకుతూ కొన్ని పక్షముల తరువాత ఒక సూర్యోదయ సమయాన నా గురుకుల అరణ్యాన్ని చేరుకున్నాను . 
మంజరీ ...... వివాహం అయిన తరువాతిరోజునే మహి ఇక్కడికి చేరుకుని గురువుగారి ఆశీస్సులు తీసుకోవాలని ఆశపడింది .
ప్రభూ ...... మన గురుకులం చేరుకున్నామా ? అంటూ మంజరి మాటల్లోకూడా సంతోషం లేకపోయింది .
అవును మంజరీ ....... , గురువుగారు కోరిన ఒకేఒక కోరికను తీర్చలేకపోయాను - ఏ ముఖం పెట్టుకుని గురువుగారిని చూడగలను అంటూ నదీఅమ్మ ఒడ్డున ఆగాను కన్నీళ్ళతో .......
మంజరి : ప్రభూ ...... ప్రవాహం దగ్గరికి ఎవరో వస్తున్నారు .
గురుకులం నుండే అయిఉంటుంది అంటూ చూస్తే చిన్న గురువుగారు ....... 

మహేష్ మహేష్ ....... నువ్వేనా ? , భగవంతుడా ....... మహేష్ నువ్వు క్షేమమే కదా , నిన్ను రాజ్యద్రోహం నెపంతో కారాగారంలో బంధించారని మన యువరాజులు వచ్చి గురువుగారిని బాధపెట్టి రాక్షసానందం పొందారు , స్వయంవరంలో గెలుపొందినది నువ్వే అని యువరాజులకు తెలిసి నిన్ను పంపించిన గురువుగారిని చాలా ఇబ్బందిపెట్టారు .
గురువుగారిని ఇబ్బందిపెట్టారా అంటూ గురుకులం వైపుకు వెళ్లబోయాను .
చిన్న గురువుగారు : మహేష్ ఆగు , నువ్వు బాధపడతావని చెప్పడం లేదు - నిన్ను పంపించిన కారణంతో గురువుగారిపై కూడా రాజ్యద్రోహీ అని ముద్రవేసి చెరశాలలో కూడా ఉంచారు .
గురువుగారూ ...... అంటూ కన్నీళ్లు ఆగడం లేదు .
చిన్న గురువుగారు : కంగారుపడాల్సిన అవసరం లేదు మహేష్ ....... , గురువును చెరశాలలో ఉంచడం పాపం అని మహారాజులు తప్పయింది క్షమించమని గురుకులంలో వదిలారు , ఇక ఎప్పుడూ ఇలా చెయ్యకండి యువరాజులను బాధపెట్టడం మాకుకూడా ఇష్టం లేదు అంటూ గురువుగారిదే తప్పు అన్నట్లు వెళ్లిపోయారు . గురువుగారు ...... ఆక్షణమే అగ్నిజ్వాలపై ప్రతిజ్ఞ చేశారు - " మన మహేష్ గురించి నాకు తెలుసు ఎలాగైనా చెరశాల నుండి నిజాయితీగా బయటపడతాడు రాజ్యానికి రాజై నాదగ్గరికివచ్చి నా గౌరవాన్ని పెంచుతాడు - ఏ యువరాజులైతే అధికారం ఉందని ఇలా చేశారో వాళ్ళను నా పాదాలచెంతకు చేరుస్తాడు అంతవరకూ మహేష్ ను కలవనే కలవను ....... " .

మంజరి : చిన్న గురువుగారూ ...... అదేంతపని , గురువుగారు చెప్పినట్లుగానే చంద్ర రాజ్య మహారాజుగారే వారి తప్పును తెలుసుకుని మన్నించమని కోరి , అఖండమైన చంద్ర రాజ్యాన్నే ఈ ప్రభువు పాదాలచెంతకు చేర్చి మహారాజుగా ఉండమని కోరుకున్నారు . ఒక్క చిటికెతో యువరాజులను ..... గురువుగారి పాదాల చెంతకు చేరుస్తాడు .
చిన్న గురువుగారు : సంతోషం మహేష్ ...... , అలా జరిగితే గురువుగారికి సగం సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది .
గురువుగారూ ........
చిన్న గురువుగారు : రాజ్యం తోపాటు నువ్వు అంగరంగవైభవంతో వివాహం చేసుకున్న యువరాణీ సమేతంగా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటేనే కదా గురువుగారికి సంపూర్ణమైన ఆనందం ....... , నువ్వు కారాగారావాసం చెందావని మన రాజ్యాలకు సమాచారం అందగానే నువ్వే నని నిర్ధారించుకుని కోపంతో ఊగిపోతూ యువరాజులు వచ్చి స్వయంవరం గురించి వివాహం గురించీ చెబుతుంటే గురువుగారు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు ....... , " రాజ్యం - యువరాణి " రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా గురువుగారి ప్రతిజ్ఞ తీరదు , నాకు తెలుసు నువ్వు ...... గురువుగారిని కలవకుండా వారి పాదసేవ చేసుకోకుండా ఉండలేవని కానీ కలిసి మరింత బాధకు గురిచేస్తావో లేక రాజ్యం - యువరాణి సమేతంగా వచ్చి గురువుగారికి అంతులేని సంతోషం పంచుతావో నిర్ణయం నీదే అదిగో గురువుగారు వస్తున్న చప్పుడు అవుతోంది .
నాకు ...... నా గురువుగారి సంతోషమే కావాలి అంటూ మంజరి - మిత్రుడితోపాటు పొదలచాటుకు చేరుకుని , గురువుగారి సేవకు ఎలాగో నోచుకోలేను కనీసం గురువుగారిని దర్శించుకుంటాను అంటూ బాధపడుతున్నాను .

అంతలో సూర్యవందనం చేసుకోవడానికి గురువుగారు రానే వచ్చారు - నా కళ్ళల్లోలానే గురువుగారి కళ్ళల్లోకూడా బాధ ప్రస్ఫూటంగా కనిపించి కళ్ళల్లోనుండి కన్నీళ్లు ధారలా కారసాగాయి .
కొన్నిక్షణాలవరకూ నేను నిలుచున్న చోటును దాటుకుని వెళ్లబోయి ఒక్కసారిగా ఆగిపోయి , చుట్టూ చూస్తున్నారు .
ఆ క్షణం అనిపించింది గురువుగారి మనసులో నా స్థానం ...... , కన్నీళ్లు ...... ఆనందబాస్పాలుగా మారిపోతున్నాయి - మంజరి ఎగురుకుంటూ వెళ్లి గురువుగారి పాదాలకు నమస్కరిస్తోంది .
గురువుగారు : ఆశ్చర్యం అంటూ మంజరిని అపురూపంగా చేతిలోకి తీసుకుని సున్నితంగా స్పృశించి స్వేచ్ఛగా జీవించు అంటూ ఎగురవేశారు చిరు సంతోషంతో ........
మంజరి ఎగురుకుంటూ వచ్చి నాభుజంపైకి చేరింది - సంతోషం చాలా సంతోషం మంజరీ ...... గురువుగారి పెదాలపై చిరు సంతోషాన్ని చిగురింపచేశావు - ఇక యువరాణీ సమేతంగా వచ్చి గురువుగారి ఆశీర్వాదం తీసుకుని సంపూర్ణ సంతోషాన్ని అందించే బాధ్యత మనపై ఉంది .

చిన్న గురువుగారు : గురువుగారూ ..... ఏమైంది ? .
గురువుగారు : మనసుకు దగ్గరైన వ్యక్తి దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తోంది అంటూ మరొకసారి చుట్టూ చూసి దైవేచ్చ అంటూ ప్రవాహంలోకి అడుగుపెట్టి సూర్యవందనం చేసుకుని స్నానమాచరించి గురుకులం వైపుకు వెళ్లిపోయారు .
పొదలనుండి బయటకువచ్చి గురువుగారి అడుగుజాడలను స్పృశించి ఆనందం పొందాను - గురువుగారూ ..... నావల్ల మీరుకూడా ఇబ్బందులకు గురి అవుతున్నారు .
చిన్న గురువుగారు : దిగులుచెందకు మహేష్ ...... , బాధ తాత్కాలికం - సంతోషం శాశ్వతం ....... , గురువుగారి ప్రతిజ్ఞను తీరిస్తే ఇక అందరికీ సంతోషాలే , ఇక నాకు సెలవు .......
గురువుగారిని జాగ్రత్తగా చూసుకోండి - గురువుగారి ప్రతిజ్ఞను తీర్చే కలుస్తాను అంటూనే అమ్మా అమ్మా ...... అంటూ కన్నీళ్ళతో నదీఅమ్మ ఒడిలోకి పూర్తిగా చేరాను . ఆశ్చర్యం ...... నాకళ్ల ముందు నా దేవకన్య - మహీ మహీ ....... అంటూ చుట్టూ చూసిపైకిలేచాను - ఎక్కడా లేదు , మహీ మహీ అంటూ మళ్లీ అమ్మ ఒడిలోకి చేరాను ....... నీళ్ళల్లో దేవకన్య ప్రతిరూపం - అమ్మా ...... అంటూ కళ్ళుమూసుకున్నాను పెదాలపై సంతోషం ....... , నీళ్ళల్లోనుండి పైకిలేచి మంజరీ - మిత్రమా ...... మన మహి ఆరోజున ఇటువైపుగా ప్రయాణిస్తూ ఇక్కడే ఎక్కడో దగ్గరలో దాహం తీర్చుకుంది అంటే ఇటువైపుగానే వెళ్ళింది - ప్రవాహం వెంబడి రాజ్యాలలోనే ఉండి ఉంటుంది అంటూ సూర్యవందనం పూర్తిచేసుకుని తడి వస్త్రాలతోనే మిత్రుడిపైకి చేరి వేగంగా బయలుదేరాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 23-11-2022, 10:21 AM



Users browsing this thread: 52 Guest(s)