Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మా అడుగుల చప్పుడు విని , నాయకా నాయకా అంటూ మహారాజు మందిరపు ద్వారాన్ని తట్టి ..... మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకున్నట్లు మనవాళ్లంతా వచ్చేస్తున్నా........రు అంటూనే వాళ్ళవైపుకు దూసుకువస్తున్న నిన్నుచూసి అలా కదలకుండా ఉండిపోయారు నాతోపాటు చెరశాలలో ఉన్న బందిపోట్లు ....... , వీడిని చెరశాలలోనే ముక్కలు ముక్కలు చేయాల్సింది ...... మంత్రి - సైనికులు - ప్రజలు అందరినీ విడిపించేశాడు అంటూ నావైపుకు కత్తులతో వచ్చారు .
ఆగండాగండి ఒకసారి చావుదెబ్బతిన్నారు - మళ్లీ మిమ్మల్ని కొట్టడానికి నాకు చేతులుకూడా రావడం లేదు అంటూ ఒకడి చేతిని వెనక్కుతిప్పాను .
వాడి అరుపులు మిగతావాళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయారు .
సైనికులారా ...... ఒక్కదెబ్బకూడా కొట్టకండి - వాళ్ళు చెరశాలలో అనుభవించిన నరకం చాలు అనడంతో పట్టుకుని తాళ్లతో బంధించారు .

అంతలో మంత్రిగారు ..... మహారాజు మందిరం ద్వారం దగ్గరికివెళ్లి ప్రభూ ప్రభూ ....... అంటూ తలుపుతట్టారు .
( విన్నావా ....... మహారాజా ఇక మీ రాజ్యం అన్నది చరిత్ర ఇక భవిష్యత్తు అంతా మాదే అంటూ రాక్షసనవ్వులతో తలుపులుతెరిచారు బందిపోటు నాయకుడు ) .
మహామంత్రితోపాటు సైనికులు లోపలికివెళ్లి ఆశ్చర్యపోతున్న బందిపోట్ల నాయకులను బంధించారు - మహారాజు వొంట్లోకి దిగబోతున్న కత్తిని ఆపారు .
మహారాజా అంటూ మహారాణి వెళ్లి గుండెలపైకి చేరారు .
మహామంత్రి : మహావీరా ...... నీ వేగమే మహారాజు గారిని రక్షించింది - మరొక్క క్షణం ఆగి ఉంటే జరగాల్సిన అనర్థం జరిగిపోయి ఉండేది అంటూ లోపలికి పిలిచారు . ప్రభూ ...... మన రాజ్యాన్నీ - మిమ్మల్నీ రక్షించినది ఎవరో తెలుసా అంటూ మందిరం నుండి బయటకుతీసుకొచ్చారు .

మహారాజు - మహారాణి : మహేశ్వరుడు ....... అల్లుడుగారు - అల్లుడుగారు మమ్మల్ని క్షమించండి అంటూ వచ్చి ఏమాత్రం మోహమాటపడకుండా నాకు దండాలు పెడుతున్నారు .
మహారాజా ...... అంటూ ఆపాను - మీరు గొప్పవారు .
మహారాజు : అల్లుడుగారూ ...... నేను చేసిన పాపానికి చావు వరకూ తీసుకెళ్లాడు ఆ పైవాడు - నేను చేసినదానికి నా ప్రాణాలు పోవాల్సింది .
ప్రభూ ...... అంతా అమ్మవారి అనుగ్రహం , మీలో మార్పు వచ్చిందని తెలుసుకున్నాను చాలా సంతోషం .......
మహారాజు : తెలుసుకునేసరికి యువరాణిని దూరం చేసుకున్నాము - ఎక్కడ ఉందో ఎలా ఉందో అంటూ కుమిలిపోతున్నారు .
ప్రభూ ....... బాధపడకండి , మహి ఎక్కడ ఉన్నా అమ్మవారు తోడుగా ఉంటారని నా నమ్మకం .

మహామంత్రి : సైనికులారా ...... వీరందరినీ కారాగారంలో పడేయ్యండి .
మహారాజు : మన రాజ్యం పైనే దండెత్తి మన ప్రజలను - సైనికులనే చంపుతారా ....... , ఊరికే ఉంటే మళ్లీ మళ్లీ ఇలానే చేస్తారు అందరికీ ఒకేసారి ఉరిశిక్ష అమలుపరచండి .......
మహారాజా ...... మీకు ఎదురువెళ్లాలని కాదు తప్పుగా మాట్లాడితే మన్నించండి . మహారాజా ...... మన రాజ్యప్రజలే కాదు తరతరాలుగా బందిపోట్లు కూడా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు మీవలన - మహి చెప్పింది ఈ బందిపోట్లు ఒకప్పుడు ఈరాజ్య సామంతరాజ్యంలో ప్రజాలేనని ...... , కొంతమంది సామంతరాజ్య రాజులవలన వీరంతా రాజ్యద్రోహులయ్యారని , అప్పటినుండీ కొండాకోనల్లో సరైన ఆహారం - వస్త్రాలు లేక కష్టాలు అనుభవించీ అనుభవించీ ఈ రాజ్యంపై శత్రుత్వం పెంచుకున్నారు , మహారాజా ...... అరణ్యంలోని గుహలలో వీరి పిల్లల పరిస్థితులను చూసి ఉంటే మీరు ఇలా ఆజ్ఞాపించరు , యువరాణి చూసి చలించిపోయింది - దేవుడా ...... మీరు రాజైన వెంటనే వీరికి న్యాయం చెయ్యాలి అంటూ మాట తీసుకుంది . 
మహారాజు : నా బంగారుతల్లి దేశ సంచారం చేసిందా ? .
చెలికత్తెలు : అవును ప్రభూ ..... అంటూ జరిగినదంతా వివరించారు .
మహారాజా ...... యువరాణిపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ..... , వీరికి స్వేచ్ఛను ప్రసాధించండి - ఒక ప్రదేశాన్ని ఇచ్చి గృహాలు గురుకులాలు నిర్మించి ఇవ్వండి - మీ సామంత రాజ్యాంగా ఒక హోదాను ఇవ్వండి - వ్యవసాయానికి భూమి ఇవ్వండి - హస్తకళా నైపుణ్యాలను నేర్పించండి , ఇప్పటికే కొన్ని తరాల వృధా అయిపోయాయి కొత్త తరానికి భవిష్యత్తును ఇవ్వండి ....... , ఇది నేను కోరుతున్నది కాదు మీ ప్రాణమైన యువరాణి మనసులో ఉన్నది ఇక మీ ఇష్టం సెలవు .......
మహారాజు సైగచెయ్యగానే అందరినీ విడుదల చెయ్యడంతో , మహావీరా అంటూ అందరూ నాముందు మొకరిల్లారు .
చెరశాల బందిపోట్లు : మేము ...... నీ ప్రాణాలు తియ్యాలనుకుంటే నువ్వు మాకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నావు - నీ అంతటి వీరుడిని ఇంతవరకూ చూడనేలేదు అంటూ జయజయనాదాలు చేస్తున్నారు .
మహారాజు : మంత్రిగారూ ...... వెంటనే మహేశ్వరుడు కాదు కాదు అల్లుడుగారు చెప్పినట్లుగా అమలుపరచండి , అడవుల్లో ఉన్న మిగతా బంధిపోట్లను కాదు కాదు చంద్ర రాజ్య సామంత రాజ్య ప్రజలను సాదరంగా తీసుకురండి అంటూ వెళ్లి నాయకులకు క్షమాపణలు చెప్పి కౌగిలించుకున్నారు .
నాయకులు : మహారాజా ...... మీరు క్షమాపణలు చెప్పడం ఏమిటి ఇకనుండీ మీ సామంతరాజ్యాంగా మీ సేవలో ఉంటాము .
మహారాజు : సేవలో కాదు కలిసిమెలిసి ఉందాము అంటూ సంతోషాలను పంచుకున్నారు .

మహారాజా ....... యువరాణి మందిరానికి వెళ్లేందుకు అనుమతిని ఇస్తారా ? .
మహారాజు : అల్లుడుగారో ...... ఇకనుండీ మీరే మహారాజు - ఈ రాజ్యమే మీది .....
మహి లేని రాజ్యం ...... అంటూ కన్నీళ్ళతో మంజరితోపాటు మా మందిరానికి వెళ్ళాను - వెనుకే చెలికత్తెలు వచ్చారు .
మహి వస్త్రాలను హృదయంపై హత్తుకుని నా దేవకన్య స్పర్శను ఆస్వాధిస్తున్నాను - మహీ ...... ఎక్కడ ఉన్నావు అంటూ కన్నీరు ఆగడం లేదు .
చామంతి : ప్రభూ ...... మిమ్మల్ని చూడాలని ఎంతగానో ఆరాటపడ్డారు - అమ్మవారి చెంతన చేరి మీరు సురక్షితంగా ఉండాలి అంటూ ప్రార్థిస్తూనే స్పృహకోల్పోయారు .

స్పృహకోల్పోయిన బిడ్డను ఎలాంటి వాడితో - ఎక్కడికి పంపించానో తెలియని మూర్ఖ మహారాజుని అంటూ బాధపడుతున్నారు మహారాజు .
మహారాజా ...... బాధపడి ప్రయోజనం లేదు - నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను - మహి ఎక్కడ ఉన్నా మీ చెంతకు చేర్చుతాను .
మహారాజు : మహికి ..... మమ్మల్ని చేరడం కంటే నిన్ను చేరడమే సంతోషం - మీసంతోషమే మా సంతోషం అల్లుడుగారూ - ఈ సత్యం అప్పుడే తెలుసుకుని ఉంటే ఇప్పుడు ఇంతమందిమి బాధపడే అవసరమే ఉండేదికాదు - ఈ తల్లి కడుపు కోతను ...... క్షమించండి మహారాణీ ......
రాజమాతా ....... మీకు మాటిస్తున్నాను , మళ్లీ మీకు కనిపించేది మీ బిడ్డతోనే ...... , ఆ అమ్మవారిపై భారం వేసి దైర్యంగా ఉండండి .
మహారాణి : అల్లుడుగారూ ...... మీ మాటలు విన్నాక ఆశ చిగురిస్తోంది .

మంత్రిగారూ ....... ఇంతకాలం ఎక్కేక్కెడకు వెళ్లారు - ఇప్పుడు మన సైన్యాధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు .
మహామంత్రి : భటులారా ...... రాజ్యాల పటాన్ని తీసుకురండి . 
క్షణంలో మా ముందు ఉంచారు .
మహామంత్రి : మహారాజా ...... 
మంత్రిగారూ ...... మహేశ్వరుడు అని పిలవండి .
మహారాజు : మహామంత్రీ ........ మహారాజు అనే పిలవండి - మహి కోరుకున్నది అదేకదా ......
మహామంత్రి : మహారాజా ...... స్వయంవరం కోసం 500 మైళ్ళ పరిధిలోని మరియు దేశంలోని పెద్ద రాజ్యాలకు ఆహ్వానం పిలిచాము కాబట్టి ఆ రాజ్యాలన్నీ ........
మంత్రిగారూ ....... ఆ పరిధిలో ఉన్నట్లయితే ఆ హిడుంభి యువరాజు ఇలా చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కాబట్టి మనం మహికోసం వేతకాల్సినది ఈ 500 మైళ్ళ పరిధికి అటువైపు ఉన్న రాజ్యాలలో ...... , వాళ్ళును నేను కలిసినది తూర్పు - దక్షణం వైపునుండి వస్తున్నప్పుడు నేను అటువైపు వెళతాను .
మహామంత్రి : మీరు చెప్పినదే నిజం మహారాజా ...... , అందుకే ఇప్పటివరకూ యువరాణి జాడను కనిపెట్టలేకపోయాము .
మహారాజు : చెలికత్తెలు ఎప్పుడో చెప్పారు - ప్రభూ ...... మహారాజు వల్లనే సాధ్యం అని , అదే నిజమైంది ....... ఇప్పుడే నలువైపులా ఉన్న రాజ్యాలకు సైనికులను పంపించి నేనూ ఒకవైపుకు వెళతాను , మహామంత్రీ ..... మహారాజు ప్రయాణానికి పరివారాన్ని సిద్ధం చెయ్యండి .
అలా వెళితే మహిని ఎప్పటికీ చేరుకోలేము మహారాజా ...... , మన రాజ్యాల పటంలోని వారుకాబట్టి సహకరించారు , బయటి రాజ్యాలు అలా వుండరు కాబట్టి సామాన్యుడిలానే వెళ్ళాలి , నా గురించి ఆలోచించకండి నాకు తోడుగా మంజరి - మిత్రుడు ఉన్నాడు .
మంజరి : నన్ను వదిలేసి వెళతారని కోప్పడుతున్నాను .
నువ్వులేకుండా వెళితే మహి దగ్గరకు రానివ్వదు కదా మంజరీ ....... మార్గం చూయించాల్సినది కూడా నువ్వేకదా ......
మంజరి : ఆజ్ఞ ప్రభూ ....... 
నవ్వాలని ఉంది మంజరీ ...... కానీ మహి లేని నవ్వు అంటూ కన్నీటిని తుడుచుకున్నాను , చామంతీ - మందాకినీ ...... నా ప్రాణాలర్పించైనా మీ స్నేహితురాలిని కనిపెడతాను .
చెలికత్తెలు : కలిసి రావాలి మహారాజా అంటూ మహి ప్రియమైన వస్తువులను - మహి ..... నాకోసం సిద్ధం చేసిన వస్త్రాలను అందించారు .
మహారాజా ...... సెలవు అంటూ మంజరితోపాటు బయటకువచ్చాను .

మహేశ్వరుడు మహేశ్వరుడు మహారాజు మహారాజు ....... అంటూ నినాదాలతో రాజ్యం దద్దరిల్లిపోసాగింది , చంద్ర రాజ్య సైనికులు ప్రజలు మరియు కొత్త సామంతరాజ్య ప్రజలు ఒకరికొకరు కలిసిపోయారు . 
నామాటను గౌరవించి మీరంతా కలిసిపోయినందుకు చాలా చాలా సంతోషం ......
మహారాజా మహారాజా ...... అంటూ నాతోపాటు చెరశాలలో ఉన్నవారు నాదగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నారు .
స్వయానా వాళ్ళ దగ్గరికివెళ్ళాను .
మహారాజా ...... యువరాణిగారికోసం సగం సైన్యం వెళ్లిందని దొంగతనంగా రాజ్యంపై దండెత్తి చాలా పెద్ద తప్పుచేసాము - ఈ తప్పును సరిచేసుకునేందుకు యువరాణిగారిని వెతకడం కోసం మేమంతా బయలుదేరుతున్నాము . 
చాలా సంతోషం - అంతకంటే ముందు మీవాళ్ళందరినీ మీకు కేటాయించిన ప్రదేశానికి తీసుకొచ్చి స్థిరపడండి - అదే యువరాణికి మరింత సంతోషాన్ని కలిగిస్తుంది - యువరాణి వచ్చే సమయానికి మీరు ఎంత సంతోషంతో ఉంటే తను అంత ఆనందిస్తోంది .
మహారాజా ...... మీరు నిజంగా దేవుడు , మహారాజుకి జై మహారాజుకి జై అంటూ జయజయనాదాలు చేస్తూ దారిని వదిలారు .
మిత్రుడిపైకి ఎక్కి , మిత్రమా - మంజరీ ...... తూర్పు - దక్షిణాన ఉన్న రాజ్యాలన్నీ వెదికైనా మన మహిని కనిపెట్టాలి హుర్రే అనడంతో పరుగులుపెట్టింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2022, 10:34 AM



Users browsing this thread: 9 Guest(s)