Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఎన్నిరోజులు స్పృహకోల్పోయానో నాకే తెలియదు , ప్రాణాలు పోతున్నట్లు కేకలు - భయంతో అరుపులు వినిపించడం అంతలో పెద్ద శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడిలేచాను . 
ఆ పెద్ద శబ్దానికి కారణం చెరశాల ప్రధాన ద్వారం బద్దలై చెల్లాచెదురవడం ...... , అందులోనుండి వచ్చినవారు కాపాలాకాస్తున్న భటులపై ఏమాత్రం కనికరం చూయించకుండా కత్తులతో దాడిచేస్తున్నారు - రక్తం ఏరులై పారసాగింది .
చెరశాలల్లో ఉన్న బందిపోట్లు ..... హై హై నాయకా - మిత్రమా అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు . వాళ్ళతో చేతులుకలిపి మీరొచ్చి కాపాడతారని తెలిసే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాము .
మేము వచ్చేసాము మిత్రులారా ...... ఇక ఈ రాజ్యం మనదే , రండి మనల్ని అడవిపాలు చేసిన ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేసి ఆక్రమించేద్దాము - రాజుని మన కాళ్ళకింద చేర్చి వాడి కళ్ళముందే రాజ్యంలోని ప్రజల మానప్రాణాలను తీసి ఆనందిద్దాము అంటూ తాళాలను బద్దలుకొడుతున్నారు .
బందిపోట్లు బయటపడి కత్తులు చేతబట్టి కోపంతో ఊగిపోతున్నారు .

చెరశాల బందిపోట్లు : నాయకా - మిత్రులారా ....... ఆ తాళాన్ని తెరవకండి , మన యువరాణీ బంధ ప్రణాళికను అడ్డుకుని మేమంతా ఇక్కడ నరకంలోకి చేరేలా చేసినది వాడే ......
బందిపోట్లు : అయితే వీడిని ఇక్కడికిక్కడే ముక్కలుముక్కలు చేసేస్తాము అని కోపంతో రగిలిపోతున్నారు .
చెరశాల బందిపోట్లు : నాయకా ...... వీడిని అంత సులభంగా చంపరాదు , ఈ రాజ్యాన్ని చేజిక్కించుకున్న తరువాత వీడి సంగతి చూద్దాము , మనం ఎంత నరకాన్ని అనుభవించామో అంతకంతా వీడు అనుభవించాలి - అధిచూసి మేము రాక్షసానందం పొందాలి .
మీ ఆశలు ఆశలుగానే మిగిలిపోతాయి .
బందిపోట్లు : కాళ్ళూ చేతులూ కట్టివేయబడినా - మనం ఇంతమందిమి ఉన్నా ఎంత దైర్యంగా మాట్లాడుతున్నాడు చూసారా ...... ? , తాళాలు తెరవండి వీడి సంగతి ఇప్పుడే చూస్తాము .
చెరశాల బందిపోట్లు : వాడికి ఉన్నదే అది మిత్రులారా ...... , ఇతడి ఒక్కచేతిని కట్టివేయడానికి పాతికమంది భటులు కూడా ఇంత శ్రమించారో కళ్లారా చూసాము , చివరికి మత్తుమందు పెడితేకానీ ....... 
నావైపుకు వచ్చిన బందిపోట్లు వెనుకడుగు వెయ్యడం చూసి నవ్వుతున్నాను .
బందిపోట్లు : వీడి సంగతి రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న తరువాత చూద్దాము - అక్కడ మన వారికి మన సహాయం కావాలి రండి .
చేరశాలలోని బందిపోట్లు : నాయకా ...... ఒక నలుగురిని ఇక్కడ ఉంచడం ఎందుకైనా మంచిది అంటూ నలుగురిని కాపలా ఉంచి వెళ్లారు .

సంకెళ్లను ఎంత లాగినా ప్రయజనం లేకపోయింది .
అంతలో ప్రభూ ప్రభూ ....... అంటూ మంజరి కాపలా కాస్తున్న భటులను తప్పించుకుని లోపలికివచ్చింది .
బందిపోట్లు : రేయ్ రేయ్ మాట్లాడే చిలుక పట్టుకోండి పట్టుకోండి ...... , తాళం పగలగొట్టండి ...... - పెద్ద తాళం పగలడం లేదు ప్రత్యేకంగా ఇంతపెద్ద తాళం వేశారు అంటే వీడితో జాగ్రత్తగా ఉండాలి - రేయ్ అక్కడ చనిపోయిన భటులతో తాళాలు ఉంటాయి తీసుకురండి .
మంజరీ మంజరీ ...... మహి జాడ తెలిసిందా ? - మిత్రుడు ఎలా ఉన్నాడు ? .
మంజరి : మన్నించండి ప్రభూ ...... , దట్టమైన అరణ్యంలో మహి వెళ్లిన త్రోవ కనిపెట్టలేకపోతున్నాను - మిత్రుడిని ..... చెలికత్తెల సహాయంతో బయటకుచేర్చాను , సైన్యాధ్యక్షుడితోపాటు సగం మంది సైనికులు మహి అన్వేషణ కోసం వెళ్లారని - మహారాజు ...... మహి కనిపించలేదన్న దుఃఖం లో ఉన్నారని తెలుసుకుని గోతికాడ నక్కలా కాచుకున్న బందిపోట్లు భటుల - ప్రజల ప్రాణాలను తీస్తూ రాజభవనం వైపుకు వెళుతున్నారు .
మహి రాజ్యం ..... సంతోషంగా ఉండాలికానీ ఇలా కాకూడదు అంటూ సంకెళ్లను లాగుతున్నాను .
బందిపోట్లు : రేయ్ తొందరగా తెరవరా ...... , ఏ తాళమో తెలియడం లేదురా , రేయ్ ...... పెద్ద తాళం అంటూ తీసి లోపలికివచ్చి కత్తులు - బల్లెం లతో మంజరిని పొడవడానికి ప్రయత్నిస్తున్నారు .
మంజరి : ప్రభూ ప్రభూ ....... మీరు బయటపడితేనే మహిని కనిపెట్టగలం .
మంజరీ జాగ్రత్త ...... 
మంజరి : నాకేమైనా పర్లేదు మిమ్మల్ని తప్పించడానికే వచ్చాను తాళం వాళ్ళతోనే తెరిపించాను అంటూ నలుగురి నుండి తప్పించుకుంటూ అక్కడక్కడే ఎగురుతోంది .
బందిపోట్లు : ఎంత మోసం ...... రేయ్ నలుగురూ ఒకవైపునుండి దాడిచేస్తూ మూలకు చేర్చి చంపేద్దాము అంటూ నవ్వుకుంటున్నారు .
మంజరీ మంజరీ ...... బయటకువెళ్లిపో ......
మంజరి : నా ప్రభువుని ఇలాంటి పరిస్థితులలో వదిలి ప్రాణాలు దక్కించుకోలేను , జీవితమో - మరణమో ...... మీ ఇద్దరితోనే ......
మంజరీ వద్దు వెళ్లిపో .......
బందిపోట్లు : అదీ అదీ అలా మూలకు చేర్చి పొడిచేద్దాము - దగ్గరికి చేరుకున్నాము - మాతోనే ఆటలా ........
మంజరీ మంజరీ ....... , అమ్మ పరాశక్తీ సాంభవీ అంటూ బలమంతా కూడదీసుకుని  సంకెళ్లను లాగాను - అమ్మ అనుగ్రహించినట్లు ఏనుగు పాదాలను కట్టివేయడానికి ఉపయోగించే ఎడమ చేతి సంకెళ్లు గోడను చీల్చుకుని వచ్చేసాయి .
నలుగురు బందిపోట్లు అప్రమత్తం అయ్యేంతలో ...... , ఎడమచేతి సంకెళ్లతో నెలకొరిగేలా చేసాను , ప్రాణాలతోనే వదిలేసాను . మంజరీ మంజరీ ...... నీకేమీ కాలేదు కదా అంటూ భుజం పై ఉంచుకుని కుడిచేతిని - పాదాలను కట్టివేయబడిన సంకెళ్లను అవలీలగా తెంచుకుని , బందిపోట్ల చేతుల్లోని తాళాలతో సంకెళ్ళ నుండి విముక్తుణ్ణి అయ్యాను .

బయటనుండి ప్రజల ఆహాకారాలు - ప్రాణ కేకలు వినిపిస్తున్నాయి . మంజరీ ...... రాజ్యంలోని ప్రజలతోపాటు బందిపోట్లు కూడా అమాయకులు , వారు ఎదుర్కొన్న పరిస్థితులు - కష్టాలు వారిని ఇలా రాక్షసులుగా మార్చాయి , ఇరువురిలో ఎవరు గెలిచినా - ఓడిపోయినా ...... ప్రాణ నష్టం అధికంగా జరుగుతుంది , మహికి అది ఏమాత్రం ఇష్టం లేదు , ఎలాగైనా ఆపాలి యుద్ధాన్ని యుద్ధంతోనే ఆపగలం అంటూ కత్తిని అందుకున్నాను .
అంతలో మిత్రుడు ఘీంకరిస్తూ వేగంగా మాదగ్గరికివచ్చాడు .
మిత్రమా మిత్రమా ....... నువ్వు సురక్షితమే కదా - ఎంత బాధపడ్డావో నీ కన్నీటి ధారల గుర్తులను చూస్తుంటేనే అర్థమైపోతోంది అంటూ ప్రాణంలా హత్తుకుని , మంజరీ ..... జాగ్రత్తగా పట్టుకో అంటూ పైకెక్కి , పద మిత్రమా అంటూ లంకించాను - మిత్రుడిపై ఉన్న విల్లు బాణాలను అందుకున్నాను .

బందిపోట్లు ...... ప్రజలను లాగిపడేస్తూ ఆస్తులను ద్వoసం చేస్తూ నగలు - నాణేలను దోచుకుంటున్నారు . భటుల - ప్రజల - పిల్లల ప్రాణాలను , స్త్రీల మానాలను తియ్యడానికి ప్రయత్నిస్తున్న బందిపోట్ల చేతులు కాళ్ళు కదలడానికి వీలులేకుండా బాణాలను సంధిస్తూ ముందుకు దూసుకుపోతున్నాను .
ప్రజలు దండాలుపెడుతున్నారు - భటులు వారి ఆయుధాలను అందుకుని కిందపడిన బంధిపోట్లను చంపబోతే బాణాలతో ఆపాను , వెంటనే తాళ్లతో కట్టిపడేస్తున్నారు - ఉన్న కొద్దిమంది భటులు నావెనుకే పరుగునవస్తున్నారు .
అలా బంధిపోట్లను నిలువరిస్తూ రాజభవనం సింహద్వారం దగ్గరికి చేరుకున్నాను .

అదేసమయానికి అప్పటికే పెద్దమొత్తంలో చేరిన బందిపోట్లు సింహద్వారాన్ని పెద్ద పెద్ద దుంగలతో బద్ధలుకొట్టి అడ్డువచ్చిన సైనికులను పొడిచేస్తూ లోపలికిదూసుకువెళుతున్నారు .
అడ్డుపడిన మహామంత్రిని కిందపడేసి కొడుతున్నారు - సింహ ద్వారంపై ఉన్న చంద్ర రాజ్య పతాకాన్ని కూల్చేసి బందిపోట్ల పతాకం రెపరేపలాడేలా చేసి భయంకరంగా కేకలువేస్తూ రాజమందిరం వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు .

రాజమందిరం పైనుండి వీక్షిస్తున్న మహారాజు మహారాణీ ఏమిచెయ్యాలో తెలియక భయపడుతున్నట్లు తెలుస్తోంది - లోపలికివెళ్లిపోయారు , సామంతరాజులు వచ్చి సహాయం చేసే సమయం కూడా లేదని వారికి తెలిసిపోయినట్లుంది .
బందిపోట్ల నాయకులు : రేయ్ మహారాజా ...... ఈసారి నువ్వు ఎక్కడ దాక్కున్నా వదలము - మీ రాజ్యం రహస్యమార్గాలన్నీ ఇప్పుడు మా ఆధీనంలో ఉన్నాయి - ఇక్కడ నుండి ఎక్కడికీ వెళ్లలేవు - మిత్రులారా ...... మీరు బయట ఉన్నవారిని వెంబడించి చంపేయ్యండి మేమువెళ్లి మహారాజు - మహారాణీ సంగతి చూస్తాము అంటూ నలుగురైదురు లోపలికివెళ్లారు .

నాతోపాటు వచ్చిన భటులు - ప్రజలు అధిచూసి , మహారాజు గారే ఓటమిని ఒప్పుకున్నారు - మన సింహద్వారం రక్షణ కవచం మరియు పతాకం కూలిపోయాలి - చంద్ర రాజ్యంలో తొలిసారి శత్రువుల జెండా ఎగురుతోంది ..... మరణం ..... మరణమే ఇది అంటూ గుసగుసలాడుకుంటున్నారు .
లోపల అయితే బందిపోట్లు ..... అడ్డువచ్చిన వారిని పొడిచేస్తూ - దొరికినవాటిని నాశనం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు .

ఇక ఇక్కడే ఉంటే భార్యా పిల్లలు అని ఒక్కరూ మిగలరు , పిల్లలను ..... బానిసలను చేస్తారు - ఆడవాళ్లను ...... గుర్తుచేసుకుంటేనే భయం వేస్తోంది . ప్రాణాలనైనా వదలాలి లేదా పారిపోవాలి ...... మరణం మరణం అంటూ పరుగులుతీస్తున్నారు .
చంద్ర సేనా ....... పారిపోతారా ....... ఎక్కడికని పారిపోతారు , సామంత రాజ్యాలకు - అడవిలోకి ...... ఇప్పుడు ఈ రాజ్యం రేపు సామంత రాజ్యాలు అటుపై అడవిని ఆక్రమించుకుంటారు , అప్పుడు ఎక్కడికి పరుగులుతీస్తారు , ప్రాణాలనైనా వదలాలి అనుకుంటున్నారుకదా ఆ ప్రాణాలు ఫనంగా పెట్టి పోరాడి మీ బార్యాబిడ్డలకు స్వేచ్ఛను కానుకగా ఇవ్వండి , స్వేచ్ఛను మించిన సంపద మరొకటి ఉండదు .
మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దది అనుకోవడం మరణం .......
రణరంగంలో చావుకైనా పిరికితనంతో పరుగులుతియ్యడం మరణం ......
మీ తల్లీ - భార్యా - బిడ్డల మానప్రాణాలను తీయాలని చూస్తున్న ఈ బందిపోట్లకు భయపడటం మరణం .........
మంజరి : ప్రభూ .......
నావైపుకు దూసుకువస్తున్న బాణాన్ని పట్టుకుని దానిని ఎక్కుపెట్టిన వాడి తొడలోకి దూసుకుపోనిచ్చాను - వాడువేసిన కేకలకు సగం ధైర్యం వచ్చినట్లు కిందపడిన ఆయుధాలను అందుకున్నారు సైనికులు ప్రజలు .......
" వాళ్ళు ఇవ్వాలనుకున్న మరణాన్ని జయించడానికి మీకు తోడుగా ఈ మహేశ్వరుడు ముందుకు అడుగేస్తున్నాడు ......... 
నా ప్రాణం కంటే ఎక్కువైన నా మహి .... మీ యువరాణి నడిచిన నేల ఏమాత్రం విద్వాంసం కాకుండా ఆపడానికి నేను వెళుతున్నాను - యువరాణి అంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు ...... అంటూ మావైపుకు వస్తున్న బంధిపోట్ల పాదాలలో గుచ్చుకునేలా ఒకేసారి బాహుబాణాలను సంధిస్తూ చెప్పాను .
యువరాణి నడయాడిన రాజ్యాన్ని రక్షించడానికి - తను ...... మీలో చూడాలనుకున్న సంతోషాలను తిరిగి తీసుకురావడానికి నేను ముందుకువెళుతున్నాను ....... నాతో వచ్చేదెవరు ? .
సైనికులు : మేము ...... , మహేశ్వరుడా ...... మీ వీరత్వం - పరాక్రమం ఎలాంటిదో స్వయంవరంలో చూసాము .
నాతో చచ్చేదేవరు .......
నేను నేను .......
ఆ మరణాన్ని దాటి నాతోవచ్చి గెలిచేదెవరు ........
ప్రజలు : మేము మేము అంటూ సింహద్వారం వైపుకు దైర్యంగా వెళ్లి అడ్డువచ్చినవారిని అడ్డుకుంటున్నారు .
మహీ ....... నీ పుట్టింటిని ఏమీ కానివ్వను - జై పరాశక్తి అంటూ ముందుకు దూసుకుపోతూ అడ్డువచ్చిన బంధిపోట్లను గాయపరుస్తూ , సైనికులు - ప్రజలకు మరింత ధైర్యామిచ్చేలా ఒక్క బాణంతో బందిపోట్ల పతాకం నేలకొరిగేలా సాధించాను .

అంతే ఒక్కసారిగా జై చంద్ర రాజ్యం జై చంద్ర రాజ్యం అంటూ మరింత ధైర్యంతో సింహద్వారం ఆక్రమించిన బంధిపోట్లను చెల్లాచెదురుచేస్తూ నాతోపాటు లోపలికి దూసుకువచ్చారు .
అధిచూసి ఒంటిలోకి కత్తులు దిగిన సైనికులు లేచి తమ శక్తికొలది పోరాడుతున్నారు .
బందిపోట్లు ఆక్రమించిన సమయంలో సగం సమయం లోపు మళ్లీ చంద్ర రాజ్యాన్ని దక్కించుకున్నట్లు సింహ ద్వారంపై చంద్ర రాజ్య పతాకం రేపరేపలాడటం చూసి అందరిలో ఆనందాలు వెల్లువిరిసాయి , ఎక్కడికక్కడ బంధిపోట్లను తాళ్లతో బంధించేస్తున్నారు .
కిందకుదిగి పోట్లతో కిందపడిన మంత్రిగారిని లేపి , వైద్యులను పిలిపించమని చెప్పాను .
మహామంత్రి : నాకేమీ కాలేదు మహావీరా ...... అంటూ కౌగిలించుకుని , మహేశ్వరుడు ..... చంద్ర రాజ్య కాబోయే మహారాజు అంటూ కత్తిని పైకెత్తగానే .....
మహేశ్వరుడు మహేశ్వరుడు ....... నినాదాలతో రాజ్యం దద్దరిల్లిపోసాగింది .
మహామంత్రి : ప్రభూ ....... , మీవల్లనే మహి జాడ తెలుస్తుందని చెలికత్తెలు చామంతి మందాకినీ మహారాజు గారిని ఒప్పించి నిన్ను విడుదల చేసేంతలో బందిపోట్లు దండయాత్ర చెయ్యడం జరిగింది .
మంజరి : అవును ప్రభూ ...... , అది చెప్పడానికి వచ్చేన్తలో ఇదంతా జరిగిపోయింది , మహారాజు పూర్తిగా మారిపోయారు , ఆయనకు ఇప్పుడు మహి తప్ప రాజ్యప్రతిష్ట పరువు ఏదీ ఎక్కువకాదు - చాలా కృంగిపోయారు ఇక మహారాణి పరిస్థితి వర్ణనాతీతం .......
మహామంత్రి : మహావీరా ...... , ఈ విషయం తెలియక లోపల ఆ బందిపోట్ల నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ....... , వారి ఏకైక లక్ష్యం మహారాజుని చంపడం ......
అంతే లోపలికి పరుగులుతీసాను - వెనుకే మంత్రిగారితోపాటు సైనికులు ప్రజలు పరుగుపెట్టారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2022, 10:33 AM



Users browsing this thread: 59 Guest(s)