Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఇక్కడ రాజు ఆజ్ఞ ప్రకారం నన్ను ..... పాతాళం లాంటి ప్రదేశంలో ఉండే చెరశాలకు తీసుకెళ్లారు - ఆ ప్రదేశం చూడటానికే భయ కంపితం లా ఉంది .
భటులు : ఇది నరకంలాంటిది - అడవుల్లో ఉంటూ రాజ్యం పై దండెత్తడానికి వచ్చిన బందిపోట్లను ఇక్కడే బంధించి నరకం చూయిస్తాము - మహారాజు గారు నిన్ను ఇక్కడే ఎవ్వరికీ తెలియకుండా బంధించమన్నారు - ఇక ఆహిడుంభి యువరాజు అయితే సంకెళ్లతో కట్టెయ్యమన్నాడు ఎందుకో తెలియదు భయంకరంగా ఉండే ద్వారం తెరవగానే ........
రేయ్ రేయ్ ...... మనవాళ్ళు మరికొంతమంది దొరికినట్లున్నారు - ఈ రాజుగాడిని ఊరికే వదలకూడదు అంటూ చెరశాలల్లో కోపంతో ఊగిపోతున్నారు .
భటులు : మీ బందిపోట్లకు మళ్లీ దాడి చేసే ధైర్యం ఎక్కడుంది - ఈసారి దాడి చేసినవాళ్లను అక్కడికక్కడే పాతేస్తాము కానీ ఇప్పటికే సరిపోని ఈ నరకంలోకి ఎందుకు తీసుకొస్తాము .
బందిపోట్లు : ఒక్కసారి వదలండి మేమేంటో చూయిస్తాము .
భటులు : అలా చూయించే ఇక్కడ బిక్కుబిక్కుమంటూ నరకాన్ని చూస్తున్నారు - ఇంకనూ మీకు బుద్ధిరాలేదు , ఇతడెవరో తెలిస్తే మీరు మరింత కోపంతో రగిలిపోతారు , రాకుమారిణి బంధించాలని దాడి చేసి ఎవరితోనైతే చావుదెబ్బలు తిన్నారో అతడే ...... , రాజ్య ద్రోహానికి పాల్పడటం వలన ఈ నరకంలోకి అడుగుపెడుతున్నాడు .
బందిపోట్లు : వాడా వాడా ...... ఒక్కసారి ఒక్కసారి ఈ తాళాలను తెరవండి వాడిని ముక్కలుముక్కలుగా చేసి మాకోపం చల్లార్చుకుంటాము - ఏళ్ళు ఏళ్ల తరబడి పథకం ప్రకారం దాడి చేస్తే అలా వచ్చి రక్షించి మమ్మల్ని ఈ నరకంలో చేరేలా చేసాడు .
భటులు : చూశావా వీరా ...... నీపై ఎంత కోపంతో ఉన్నారో కాబట్టి బుద్ధిగా ఉండి వీళ్ళతోపాటు నీకు రాజుగారు ఉరిశిక్ష ఎప్పుడు విధిస్తారో అని వేచిచూస్తూ కూర్చో , ఎందుకంటే ఈనరకం కంటే ఉరిశిక్షనే హాయిగా ఉంటుంది .
బందిపోట్లు : అవును అవును మమ్మల్ని వదిలెయ్యండి లేదా చంపేయ్యండి అంటూ కేకలువేస్తున్నారు .
భటులు : నవ్వుకుని , ఖాళీగా ఉన్న ఒకేఒక నరకపు గదిలో కాళ్ళు చేతులనూ ఇరువైపులా గోడలకు సంకెళ్లతో బంధించి తాళాలువేసి వెళ్లిపోయారు .

మొత్తం చీకటిగా మారిపోయింది - మహీ ...... నన్ను మన్నించు నావలన నువ్వు ఇబ్బందులు పడబోతున్నావు - నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కలుస్తాను , దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో నిన్ను నాదానిని చేసుకున్నాను - ఆ అమ్మే మళ్లీ మన ఇద్దరినీ కలుపుతారు , కానీ పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమేనా ..... ? , అమ్మా దుర్గమ్మా ...... నాకు ఏమైనా పర్లేదు మీ చూపు ఎల్లవేళలా మీ బిడ్డ మహిపై ఉండేలా చూడండి అంటూ ప్రార్థించాను - గురువుగారూ ...... మీరు కోరిన ఏకైక కోరికను తీర్చలేని ఈ అసమర్థుడిని మన్నించండి అంటూ బాధపడుతున్నాను .

రేయ్ రాజ్యద్రోహీ ...... ఎవరైనా ఈ చెత్త రాజ్యానికి ద్రోహం చేస్తే వారు మాకు సన్నితులైపోతారు కానీ నువ్వుమాత్రం ఎప్పటికీ మాకు శత్రువే , అవకాశం లభిస్తే నిన్ను చంపకుండా వదలము , ఆరోజు మా పథకం ప్రకారం యువరాణిని బంధించి ఉంటే ఇప్పుడు మా పరిస్థితులు వేరేలా ఉండేవి ....... , తరతరాలుగా ఎంత వివక్షకు లోనౌతున్నామో మాకు మాత్రమే తెలుసు ...... , ఈ రాజ్యాన్ని ఎప్పటికైనా మా సొంతం చేసుకుంటాము .
( మీ పరిస్థులైతే చూసి నాతోపాటు యువరాణే చలించిపోయింది - ముఖ్యంగా మీ పిల్లలను చూసి , మీకు మంచి జీవితాన్ని అందించాలనే కోరుకుంది అంటూ మనసులో అనుకున్నాను ) 

అంతలో మళ్లీ నరకద్వారం తెరుచుకుంది . భటులతోపాటు హిడుంభి యువరాజు నేరుగా నాదగ్గరికివచ్చి తాళాలు తెరవమని ఆజ్ఞాపించాడు - ఒక రాజ్యానికి యువరాజునైన నన్నే తప్పుడు దారిలో పంపించి నా స్థానంలో ఈ రాజ్యానికి వచ్చి అనుకున్నది సాధిస్తావా ...... ఒక యువరాజుకు ఇలా చేస్తే ఊరికే వదులుతారు ఆనుకున్నావా అంటూ నా వెంట్రుకలను వెనక్కులాగి మోకాలిపై కొట్టాడు .
అమ్మా .......
హిడుంభి యువరాజు : ఇలానే ఇలానే నువ్వు నొప్పితో ఎంత గట్టిగా కేకలుపెడితే అంత సంతోషంగా ఉంటుంది నాకు ....... , భటులారా ఒక యువరాజుని మోసం చేస్తే ఎలా ఉంటుందో ఈ మోసగాడికి తెలియాలి వంద కొరడా దెబ్బలు కొట్టండి ........ మీరు మీరు కాదు మా భటులు - మా భటులు కొడితే నాకు మరింత ఆనందం ....... ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండలేను - వీడి కేకలు బయటవరకూ వినిపించాలి అంటూ మరొక దెబ్బవేసి రాక్షస నవ్వులతో బయటకువెళ్లాడు . 

మా యువరాజుగారినే తప్పుడు తోవలో - కీకారణ్యంలోకి పంపిస్తావా ....... ఎన్ని ఇబ్బందులుపడ్డామో తెలుసా , దానికి నీ కేకలే సమాధానం అంటూ కొరడాతో కొట్టారు . 
అమ్మా అమ్మా ...... అంటూ నా కేకలకు బయట ఉన్న యువరాజే కాకుండా చెరశాలలో ఉన్న బందిపోట్లు తెగ ఆనందిస్తున్నారు . 
నా కేకలు ...... మంజరి చెవులకు చేరినట్లు పంజరంలో విలవిలలాడిపోతోంది . 
మంజరిని చూసి చెలికత్తెలు నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక బాధపడుతున్నారు .
స్పృహ కోల్పోయేంతవరకూ కొట్టి యువరాజా యువరాజా అంటూ వెళ్లి పరిస్థితిని వివరించారు .
హిడుంభి యువరాజు : వాడు చనిపోకూడదు ఈ నరకంలోనే మరింత నరకాన్ని అనుభవించాలి , సంకెళ్లు తీసేసి మూలన పడేయ్యండి ....... , క్షత్రియులు అంటే ఏమిటో తెలిసిరావాలి - మన ప్రయాణానికి అన్నీ ఏర్పాట్లూ సిద్ధమేనా ? .
సిద్ధమే యువరాజా ...... , కానీ యువరాణీవారు స్పృహలో లేరు .
హిడుంభి యువరాజు : మా వాహనంలో జాగ్రత్తగా తీసుకెళతాము మహామంత్రీ ....... , ఆలస్యమయ్యేకొద్దీ ప్రమాదం మీకే ......
మహామంత్రి : మహారాజు గారి కోరిక కూడా ఇదే యువరాజా ....... , తెల్లవారిలోపు ఈ సమస్య నుండి భయటపడాలని ఆశిస్తున్నారు , యువరాజా ...... మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలని కాదు ఈ రాజ్యాల పటంలో మీ రాజ్యం ఎక్కడ ఉందో గుర్తిస్తే ..........
హిడుంభి యువరాజు : లోలోపలే కోపాగ్నికి లోనై బయటకుమాత్రం ఎంతమాట మహామంత్రీ ఇదిగో మీపటంలో లేని పడమరవైపున - మా రాజ్యం చుట్టూ 1000 మైళ్ళ వృత్తంలో తెలియని రాజ్యమంటూ లేదు - మీ ప్రయాణంలో వారే స్వయంగా మా రాజ్యానికి చేరుస్తారు ఎందుకంటే అక్కడ మాదే పెద్ద రాజ్యం ధనికవంతమైన రాజ్యం ........
మహామంత్రి : ఎంతమాట యువరాజా ...... ఊరికే తెలుసుకోవడానికి అడిగాను . 
హిడుంభి యువరాజు : మా ప్రయాణానికి వారం రోజులు పడుతుంది - మీరు సామంతరాజులను పంపించి రేపే బయలుదేరారంటే మా తరువాతి రోజున మా రాజ్యం చేరుతారు - అంగరంగవైభవంతో వివాహం జరుగుతుంది .
సంతోషమైన మాట చెప్పారు యువరాజా రండి అన్నీ ఏర్పాట్లూ సిద్ధంగా ఉన్నాయి అంటూ సింహ ద్వారం దగ్గరికి పిలుచుకునివెళ్లారు . 
వజ్ర వైఢూర్య బంగారు మణులతో నిండిన గుర్రపు వాహనంలో స్పృహలో లేని మహిని పడుకోబెట్టారు .
రాజమాత కడుపు తీపితో ఎంత వారించినా పట్టించుకోకుండా , మూడో కంటికి తెలియనియ్యకుండా పంపించేశారు - విషయం బయటకువెళ్లిందో మీ ప్రాణాలు పోతాయి అని చెలికత్తెల నోటికి తాళం వేసి యువరాణిని ఓదారుస్తూ లోపలికివెళ్లారు .

వొళ్ళంతా కొరడా దెబ్బలతో స్పృహలోకి రావడానికి రెండు రోజుల సమయం పట్టింది , అటుపై ఆ చీకటి చెరశాలలో పగలు ఎప్పుడో - రాత్రి ఎప్పుడో కూడా తెలియలేదు , భటులు వచ్చి కాసిన్ని మెతుకులు మావైపుకు విసిరేసి వెళ్లిపోయేవారు , బయట ఏమిజరుగుతోందో ఎవ్వరికీ తెలియదు .
అనుక్షణం మహి గురించే ఆలోచిస్తున్నాను - నా దేవకన్యతో గడిపిన మూడురోజుల మధురానుభూతులను తలుచుకుంటూనే జీవిస్తున్నాను - నా జీవితం ఇక్కడైతే ముగిసిపోదని నాకు తెలుసు - మహికి మాటిచ్చాను ఒక్కటిగా జీవిస్తాము ఒక్కటిగా ప్రాణాలను వదిలేస్తాము అని ...... , అమ్మా దుర్గమ్మా ...... మీ బిడ్డ ఈ రాజ్యంలో ఉన్నా - ఎక్కడ ఉన్నా కంటికి రెప్పలా చూసుకోండి - నదీఅమ్మా ....... చల్లగా చూసుకో తల్లీ .......

కొంత కాలం తరువాత ఒక రోజున చెరశాల ద్వారం తెరుచుకుంది .
బందిపోట్లు అంతా ఆశతో వెలుగువైపు చూస్తూ కేకలువేస్తున్నారు - అమ్మాయిలు వచ్చారురోయ్ పట్టుకోండి పట్టుకోండి .......
చామంతీ - మందాకినీ ...... ఇక్కడికి ఎందుకువచ్చారు , రేయ్ ఎవరైనా పట్టుకుంటే చంపేస్తాను .
బందిపోట్లు : వొళ్ళంతా రక్తపు ముద్ద అయ్యేలా కొరడాలతో కొట్టినా ఎంత దైర్యంగా మాట్లాడుతున్నావురా ...... ఏదీ చంపు చూద్దాము అంటూ గోల గోల చేస్తున్నారు .
చామంతీ - మందాకినీ ...... జాగ్రత్త , ఇక్కడ నుండి వెళ్లిపోండి .
చెలికత్తెలు : పర్లేదు ప్రభూ ...... మిమ్మల్ని కలిసే వెళతాము , రేయ్ ఒక్కరే మీ అందరినీ అడ్డుకుని మా యువరాణిని రక్షించి మిమ్మల్ని ఇక్కడకు చేర్చినది అప్పుడే మరిచిపోయారా ..... ? , వీరుడు ఎప్పటికీ వీరుడే మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను , తప్పుచేసారని ఒప్పుకుని ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు కానీ లేకపోతే వారి వీరత్వాన్ని ఆపే శక్తి ఈ రాజ్యం మొత్తం ఏకమైనా సరిపోదు - పట్టుకోవడం కాదు తాకే ధైర్యం చెయ్యండి చూద్దాము ......
అంతే బందిపోట్లు మారు మాట్లాడకుండా తలలుదించుకున్నారు .
చెలికత్తెలు : ఈమాత్రం భయం ఉండాలి అంటూ నాదగ్గరికివచ్చి తాళం తెరిచి లోపలికివచ్చారు .
వెనుకే పదిమందిదాకా భటులువచ్చి ఒకచేతికి గోడకున్న సంకెళ్ళువేసి చామంతీ ...... మీకున్న సమయం కొన్ని క్షణాలు మాత్రమే మహారాజుకు తెలిస్తే చాలా ప్రమాదం తెలుసుకదా అనిచెప్పి తాళం చెవితోపాటు వెళ్లిపోయారు .

చామంతీ - మందాకినీ ...... మహి మహి మంజరి ఎలా ఉంది అంటూ ఆతృతతో అడిగాను .
చెలికత్తెలు : ప్రభూ .......
ఇక ఎప్పటికీ ప్రభువును కాను కాలేను చామంతీ ...... 
చెలికత్తెలు : మీరు ఎప్పటికీ మా ప్రభువే అంటూ కన్నీళ్లు కారుస్తూ కొరడా దెబ్బలపై వెన్నను రాస్తున్నారు .
వద్దు వద్దు చామంతీ ...... , మహిని బాధపెట్టాను - ఈ నొప్పి ఎప్పటికీ ఇలానే ఉండాలి , మహి మహి ఎలా ఉందో చెప్పండి .
చెలికత్తెలు : ఎక్కడ ఉందో ఎలా ఉందో ...... మహారాజు - మహారాణికే తెలియదు ప్రభూ ...... , ఇక మంజరి అయితే ఆరోజు నుండీ పంజరంలోనే మీ ఇద్దరినే తలుచుకుంటూ బాధపడుతోంది .
చామంతీ - మందాకినీ ...... ఏమంటున్నారు ? .
చెలికత్తెలు : అవును ప్రభూ ...... , ఆ హిడుంభి యువరాజు చెప్పినట్లుగా పడమర దిక్కున అక్కడ అలాంటి రాజ్యమే లేదట ...... , వివాహానికని సర్వసైన్యంతో వెళ్లిన మహారాజుగారు నిరాశ బాధతో వెనక్కువచ్చి వారం రోజులయ్యింది . 
చామంతీ ...... నాకంతా అయోమయంగా ఉంది .
చెలికత్తెలు : ఆ రాజ్యాన్ని - మహిని అన్వేషించడానికి పడమర దిక్కుకే కాదు నలుదిక్కులకూ సైన్యాలను తరలించారు , అయినా మహి జాడ తెలియనేలేదు ప్రభూ ....... , మాహారాజా - రాజమాత కృంగిపోతున్నారు .

మంజరి సహాయం తీసుకోవాల్సింది .
చెలికత్తెలు : ఆ ప్రయత్నం కూడా విఫలమైంది ప్రభూ ...... , మహి జాడను కనిపెట్టలేకపోయింది , ఆ మోసగాడు ...... మహిని చాలాదూరం తీసుకెళ్లిపోయినట్లున్నాడు - మీరే కనిపెట్టగలరని చెప్పినా నమ్మడం లేదు .
అంతలో మంజరి ఆ వెనుకే పట్టుకోండి పట్టుకోండి అంటూ భటులు లోపలికివచ్చారు .
చెలికత్తెలు : పర్లేదు ......
భటులు : చామంతీ ...... త్వరగా కానివ్వండి అనిచెప్పి వెళ్లిపోయారు .

మంజరీ మంజరీ .......
మంజరి : ప్రభూ ప్రభూ ...... మీదేవకన్యను కనిపెట్టలేకపోతున్నాను నన్ను మన్నించండి - చుట్టూ ఉన్న రాజ్యాలన్నింటినీ తిరిగినా లేదు అంటూ కన్నీళ్ళతో చెప్పి బాధపడుతోంది .
ఇంత జరిగాక ఇక ఇక్కడే ఉండలేను అంటూ సంకెళ్లను తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను .
మంజరి ముక్కుతో పొడుస్తోంది - చెలికత్తెలు కూడా సంకెళ్లను లాగుతున్నారు .
ఆ చప్పుళ్లకు పెద్ద మొత్తంలో భటులువచ్చి , చెలికత్తెలను బయటకు లాగేసి , అతికష్టం మీద మత్తుమందుపెట్టి నా మరొకచేతినికూడా కట్టేసి తాళం వేసుకుని వెళ్లిపోయారు .
మహీ మహీ ....... అంటూ కేకలువేస్తూనే స్పృహకోల్పోయాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2022, 10:32 AM



Users browsing this thread: 9 Guest(s)