Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మేడం ...... ఫస్ట్ పీరియడ్ కూడా అయిపోయింది అంటూ అటెండర్ వచ్చారు .
ప్చ్ ప్చ్ ...... అప్పుడే అయిపోయిందా ? అంటూ అంటీ గుండెలపైకి చేయింది బుజ్జిజానకి ......
హెడ్ మిస్ట్రెస్ : తల్లీబుజ్జిజానకీ ...... రెండు నెలల్లో exams , సిలబస్ పూర్తికాలేదని మీరేకదా కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు , ఇప్పటికే ఒక క్లాస్ మిస్ అయ్యింది ...... , నా తల్లికదూ ...... , స్టూడెంట్స్ ....... ఐస్ క్రీమ్స్ తినడం పూర్తయ్యిందా ? మీ పేరెంట్స్ కూడా వెళ్లిపోయారు కదా ......
పిల్లలు : వెహికల్లో బోలెడన్ని ఐస్ క్రీమ్స్ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి హెడ్ మిస్ట్రెస్ ......
హెడ్ మిస్ట్రెస్ : మరి మీ బుజ్జి పొట్టలలో ......
స్టూడెంట్స్ : ఖాళీలేదు హెడ్ మిస్ట్రెస్ ......
హెడ్ మిస్ట్రెస్ : ఖాళీగా ఉండి ఉంటే రోజంతా తింటూనే ఉండేవారన్నమాట అంటూ బుజ్జిజానకితోపాటు నవ్వుకున్నారు , మహేష్ ..... వెహికల్స్ వెళ్లిపోతాయా ? .
ఊహూ ....... , చీకటిపడేంతవరకూ ఇక్కడే ఉంటాయి .
హెడ్ మిస్ట్రెస్ : గుడ్ ...... , ఇదిగో మీ అన్నయ్య - ఆక్కయ్యలు చెబుతున్నారు ...... స్కూల్ వదిలేంతవరకూ ఇక్కడే ఉంటాయని , ఒక పీరియడ్ తరువాత ఇంటర్వెల్ లో తినొచ్చు మరియు ఇంటికి వెళ్ళేటప్పుడు తింటూనే ఎన్నికావాలంటే అన్ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు ...... కాబట్టి ఇప్పుడైతే క్లాసులకు వెళ్ళండి ......
అలాగే మేడం , థాంక్యూ అన్నయ్యా - అక్కయ్యా ..... అంటూ ఉత్సాహంతో క్లాసులవైపుకు పరుగులుతీశారు . 
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ బుజ్జిజానకీ ..... బెల్ కొట్టించనా ? లవ్ యు అంటూ ముద్దుపెట్టారు , అటెండర్ గారూ ......
అటెండర్ : అలాగే మేడం అంటూ వెళ్లి బెల్ కొట్టేటప్పటికి అందరూ బుద్ధిగా క్లాస్సెస్ కు వెళ్లినట్లు గ్రౌండ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది .
హెడ్ మిస్ట్రెస్ : ఆశ్చర్యం ...... , వచ్చి 6 నెలలు అయ్యింది - ఇలా ఎప్పుడూ చూడనేలేదు , అంతా నీవల్లనే మహేష్ ....... , మరింత ఆశ్చర్యం ..... టీచర్స్ అందరూ క్లాస్సెస్ కు వెళుతున్నారు .
జానకి : అవునవును మహేష్ వల్లనే ......
నావల్లనే కదా ...... , అయితే నా చిన్న కోరిక తీర్చండి అంటూ కిందపడిన కర్రను అందించాను .

అదేమీ పట్టించుకోకుండా ...... , తల్లీ బుజ్జిజానకీ ..... నువ్వు క్లాసుకు వెళ్లు , నాకు - మహేష్ కు లిస్ట్ లో మరొక ప్రాబ్లమ్ క్లియర్ చేసే పని ఉంది .
జానకి : నేను నేనుకూడా మీతోపాటే ఉంటాను .
హెడ్ మిస్ట్రెస్ : మరి క్లాస్ ...... చూడు అప్పుడే మీ మాథ్స్ సర్ మీ క్లాసులోకి వెళ్ళిపోయాడు .
జానకి : అంటీ ...... నా మాథ్స్ స్కోర్ ఎంత ? .
హెడ్ మిస్ట్రెస్ : 100 ఔట్ ఆఫ్ 100 .......
సూపర్ సూపర్ బుజ్జిజానకీ అంటూ విజిల్ వెయ్యబోయి క్లాస్సెస్ క్లాస్సెస్ అంటూ లెంపలేసుకుని , కంగ్రాట్స్ చెప్పాను .
జానకి : థాంక్యూ మహేష్ ....... , అంటీ ..... క్లాస్సెస్ కంటే నేను చాలా చాలా ముందు ఉన్నానని తెలుసుకదా ....... , కావాలంటే ఇంటికివెళ్లాక మరొక గంట ఎక్కువ ప్రిపేర్ అవుతాను కావాలంటే అమ్మమ్మకు కాల్ చెయ్యండి .
హెడ్ మిస్ట్రెస్ : నా తల్లి గురించి నాకు నమ్మకం ఉందిలే అంటూ ప్రేమతో కౌగిలించుకున్నారు .
జానకి : లవ్ యు అంటీ ...... , అంటీ ...... ఈరోజే జాయిన్ అయిన మహేష్ క్లాస్సెస్ ? అంటూ ముసిముసినవ్వులు నవ్వుతోంది .
హెడ్ మిస్ట్రెస్ : అవునుకదా ..... , మహేష్ క్లాసుకువెళ్లు ......
మీకు ఏది సంతోషం అయితే నాకూ అదే సంతోషం ...... అంటూ వాటర్ బాటిల్ అందుకుని కదిలి నవ్వుకుంటున్నాను .
జానకి : అంటీ .......
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ మహేష్ మహేష్ .......
What మేడం ...... 
హెడ్ మిస్ట్రెస్ : నువ్వులేకుండా మేము ఏమిచెయ్యగలం , నువ్వు క్లాస్ అటెండ్ అవ్వడమూ కావాలి - మాతోపాటు ఉండాలి .
నాకైతే బుజ్జిజానకి రాసుకున్న లిస్ట్ లోని అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి , అమ్మ తిరిగిన ఈ స్కూల్ ఒక ఆదర్శపాఠశాలగా మారిపోయాక బుజ్జిజానకి పెదాలపై సంతోషాన్ని చూడటం , ఇక క్లాస్సెస్ అంటారా ..... ఇన్నిరోజులు మిస్ అయ్యాను మరొక క్లాస్ మిస్ అయితే ఏమీకాదు , మిస్ అయిన క్లాస్సెస్ మీరు - జానకి టీచ్ చేయరా ఏమిటి ? .
హ్యాపీగా హ్యాపీగా ...... , మహేష్ ..... అమ్మకోసం అన్నావుకాదూ అంటూ సంతోషంతో నా హృదయంపై చేతితో ముద్దుపెట్టింది .
హమ్మయ్యా ...... పట్టుకున్నాను , ఇకనుండీ మరింత జాగ్రత్తగా ఉండాలి రండి ఆఫీస్ రూమ్ కు వెళదాము అన్నారు మేడం ......
వన్ మినిట్ మేడం అంటూ పరుగునవెళ్లి మోడీ కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి అందించాను .
థాంక్యూ థాంక్యూ ....... మ్మ్మ్ మ్మ్మ్ యమ్మీ ........

హెడ్ మిస్ట్రెస్ : బుజ్జిజానకి మేడం ...... హెడ్ మిస్ట్రెస్ సీట్లో కూర్చోండి .
జానకి : అమ్మ అడుగుజాడల్లో నడిచిన మీరు కూర్చోవడమే అమ్మకు - నాకు ఇష్టం , నాకూ ..... అమ్మ మరియు మీలా ఇక్కడే టీచర్ - హెడ్ మిస్ట్రెస్ లా పనిచేయడం ఇష్టం కానీ అమ్మకు ..... నన్ను టాప్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చూడాలన్నది కోరిక అని నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మమ్మతో చెప్పారట , అమ్మ కోరిక తీర్చి అమ్మ స్కూల్ కు నావంతు సహాయం చేస్తాను .
బ్రేవో బ్రేవో ....... బుజ్జిజానకీ అంటూ చప్పట్లుకొట్టాను .
హెడ్ మిస్ట్రెస్ : బుజ్జిజానకి బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి ఆనందించారు , మహేష్ ...... లిస్ట్ లో థర్డ్ ప్రాబ్లమ్ ఏమిటి ? .
జానకి : స్కూల్ ఆవరణ మార్పు అంటీ .......
లిస్ట్ తయారుచేసిన బుజ్జిఅమ్మనే ఇక్కడ ఉన్నారు ....... 
జానకి : " బుజ్జిఅమ్మ " ...... అంటూ పరవశించిపోతోంది .

హెడ్ మిస్ట్రెస్ : మార్పు ఎలా మహేష్ - జానకీ ..... , DEO ఆఫీస్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రయోజనం లేదు , దాదాపు 5 సంవత్సరాల స్కూల్ ఫండ్స్ ...... స్కూల్ నే చేరలేదు .
ఆ ఫండ్స్ అన్నింటినీ ఆఫీసర్స్ ..... పందికొక్కుల్లా తినేసిఉంటారు మేడం ...... , కాల్ చేయండి మేడం - ఈసారి కాల్ చేసి కలెక్టర్ ను కలవబోతున్నాము అని ఒక అపద్దo చెప్పండి ........
హెడ్ మిస్ట్రెస్ : ఇలా ఎప్పుడో చేయాల్సింది సూపర్ మహేష్ ....... , స్కూల్ మారడం కోసం ఎన్ని అపద్దాలు చెప్పినా తప్పులేదు అంటూ సీట్లో కూర్చున్నారు .
జానకి : లవ్ యు అంటూ అంటూ మేడం బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , సూపర్ అంటూ నావైపు సైగచేసి నవ్వుతోంది .

హెడ్ మిస్ట్రెస్ : ఏమాత్రం ఆలోచించకుండా స్కూల్ ల్యాండ్ లైన్ నుండి స్ట్రెయిట్ గా DEO ఆఫీస్ కు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశారు .
హలో ఎవరు ? .
హెడ్ మిస్ట్రెస్ : నేను ************ govt high school నుండి హెడ్ మిస్ట్రెస్ ను మాట్లాడుతున్నాను . 
చెప్పండి మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : మా స్కూల్ డెవలప్మెంట్ కోసం వెచ్చించిన ఫండ్స్ ను గత 5 సంవత్సరాలుగా ఇచ్చామని చెప్పి మధ్యలోనే మీరు తినేస్తున్నారని తెలుసు - ఇక్కడ స్కూల్ లో ఎటువంటి మార్పు లేదు - రేపు ఉదయం స్కూల్ ప్రేయర్ మొదలయ్యేలోపు ఎక్కడ నుండి తీసుకొస్తారో తెలియదు ఫండ్స్ దేనికోసమైతే అలాట్ అయ్యాయో ఆ పనులన్నీ మొదలవ్వాలి ....... , ప్రేయర్ పూర్తయ్యేలోపు మీరు వర్క్ లో లేకపోతే ఈ ఫైల్ తీసుకుని టోటల్ స్టూడెంట్స్ అందరితోపాటు నేరుగా కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లిపోతాము - కలెక్టర్ గారిని కలిస్తే ఏమౌతుందో మీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను అంటూ వాళ్ళ రిప్లై కూడా వినకుండా కాల్ కట్ చేసేసారు . వెంటనే కాల్ వచ్చినా రిసీవ్ చేసుకోలేదు ........
స్టూడెంట్స్ తోపాటు కలెక్టర్ ఆఫీస్ కు wow అంటూ బుజ్జిజానకి వైపు హైఫై కోసం చెయ్యి ఎత్తి sorry అంటూ వెనక్కుతీసుకున్నాను .
జానకి : Sorry దేనికి ఒక హైఫై కాదు నీకు ఇష్టమైనన్ని కొట్టుకో అంటూ నా చేతిని అందుకునిమరీ కొట్టి చేతిని దించనేలేదు .
నేనుకూడా అంటూ హెడ్ మిస్ట్రెస్ కూడా ట్రై చెయ్యడంతో ఆనందించాము .

హెడ్ మిస్ట్రెస్ : నెక్స్ట్ వచ్చేసి రేపు పేరెంట్స్ మీటింగ్ గురించి ...... , ఏ ఏ విషయాలు చర్చించాలి అంటూ మరొక లిస్ట్ రెడీ చేసుకున్నారు .
అంతలో ఇంటర్వెల్ బెల్ మ్రోగింది .......
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ బుజ్జిజానకీ - మహేష్ ...... 15 మినిట్స్ రెస్ట్ తీసుకుని ఫైనల్ పీరియడ్ కు మీ మీ క్లాస్సెస్ కు అటెండ్ అవ్వండి .
అలాగే అంటీ అంటూ కౌగిలించుకుంది జానకి ....... , మహేష్ ...... నాకు - అంటీకి మరొక ఐస్ క్రీమ్ కావాలి .
అదీ అలా ఆర్డర్ వెయ్యండి చిటికెలో తీసుకొస్తాను అనిచెప్పి బయటకు నడిచాను , అంటీలు గుర్తుకువచ్చి కాన్ఫరెన్స్ కాల్ కలిపాను .
" మళ్లీ చేశావా ..... ? , హలో ఎవరు మీరు ? , కాల్ చేసి మాట్లాడరే ? , మాకు కోపం వస్తోంది కట్ చేసేస్తున్నాము " 
ముసిముసినవ్వులు నవ్వుకున్నాను - What ...... ? లంచ్ టైం లో అక్కయ్యల నుండి 10 - 10 - 10 కాల్స్ చేసినట్లు అలర్ట్స్ ....... , రీ డయల్ ఆప్షన్ లో ఉంచేసాముకదా అప్పుడు చేసి ఉంటారు అనుకుని మొబైల్ జేబులో ఉంచుకున్నాను , మూడు స్పెషల్ ఐస్ క్రీమ్స్ తీసుకుని ఆఫీస్ రూమ్ చేరుకున్నాను.
జానకి : మహేష్ చిటికెలో వచ్చేస్తాను అని ఎప్పుడూ చెప్పకు - మరొక నిమిషంలో రాకపోయుంటే నేనే వచ్చేసేదానిని అంటూ రెండు ఐస్ క్రీమ్స్ అందుకుని మేడం కు ఇచ్చింది చిరుకోపంతో .......
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... ఈ 10 మినిట్స్ లో 10 సార్లైనా డోర్ దగ్గరకువెళ్లి చూసింది .
నిజమా బుజ్జిజానకీ ...... ఆఅహ్హ్ ......
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో హమ్మయ్యా ...... డోర్ కు ఆనుకున్నావా అంటూ నవ్వుకున్నారు .
జానకి : లేదులే అంటూ నవ్వుకుని తింటోంది .
లేదంటే ఔననిలే ...... అంటూ మురిసిపోతున్నాను .
మహేష్ - మహేష్ ...... వెరీ వెరీ టేస్టీ ......
మీకోసం స్పెషల్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను - అవును సూపర్ ......
తినడం పూర్తవడం ఆలస్యం బెల్ కొట్టేశారు .

జానకి : బెల్ కొట్టారుకదా పదమరి మన మన క్లాస్సెస్ కు ...... , నువ్వు కదిలితేనే నేనూ కదిలేది .......
అలాగే అంటూ నవ్వుకుంటూ క్లాస్సెస్ చేరుకున్నాము . ప్చ్ ప్చ్ ..... వెళ్లు క్లాస్ ముఖ్యం అంటూ నా బుజ్జి హృదయంపై చేతితో ముద్దుపెట్టి , లోపలికి తుర్రుమంది .
అంత ఇష్టంతో ముద్దుపెట్టాక ఇక నా క్లాస్ కు ఎలా వెళతాను - తను ఫీల్ అవ్వకూడదని లోపలికివెళుతున్న స్టూడెంట్స్ మధ్యలో దాబెట్టుకునివెళ్లి తన చిరునవ్వులు కనిపించేలా ప్రక్కన కూర్చున్నాను .
టీచర్ లోపలికివచ్చి సోషల్ స్టడీస్ లోని టాపిక్ ను బోర్డ్ పై రాసి టీచ్ చేస్తున్నారు .
టూ ఈజీ అన్నట్లు , కిటికీ వైపే చూస్తోంది .
ఆఅహ్హ్ ...... నాకోసమే నాకోసమే ఖచ్చితంగా నాకోసమే అంటూ సంతోషంతో గాలిలో తేలిపోతున్నాను .
ఒకసారి కాదు రెండుసార్లు కాదు నిమిషానికి ఒకసారి అలా 40 సార్లకు పైగానే కిటికీ వైపు పదేపదే చూస్తూ నిరాశ చెందుతుండటం చూసి ఎంత ఆనందం కలిగిందో మాటల్లో వర్ణించలేను .
సమయమే తెలియనట్లు లాంగ్ బెల్ కొట్టేశారు ...... 

పెదాలపై చిరునవ్వులతో మొదట లేచింది బుజ్జిజానకి - ఆత్రంలో బ్యాగు సరిగ్గా లాక్ చేయకపోవడం వలన జామెట్రీ బాక్స్ కిందపడిపోవడంతో లోపల ఐటమ్స్ అన్నీ చెల్లాచెదురుగా చెరొకవైపుకు వెళ్లాయి . అయ్యో ..... అంటూ కిందకు వొంగి ఒక్కొక్కటే వెతుకుతూనే కిటికీవైపు చూస్తోంది .
హెల్ప్ చెయ్యబోయి అలా చూడటం మరింత కిక్కివ్వడంతో ఆగిపోయి అపురూపంగా కన్నార్పకుండా చూస్తున్నాను .
అన్నింటినీ తీసుకుని బాక్స్ లో ఉంచి బ్యాగ్ లాక్ చేసి పైకి లేచేసరికి స్టూడెంట్స్ ఒక్కరూ లేరు - సైలెంట్ ...... , అంటీ - మహేష్ ...... అంటూ భయపడుతోంది .
తన ఆత్రం చూసి ఎక్కడ తగిలించుకుంటుందోనని ఉఫ్ఫ్ ...... అంటూ చిన్నగా విజిల్ వేసాను .
జానకి : మహేష్ ...... ఇక్కడే ఉన్నావా ? హమ్మయ్యా అంటూ తన కళ్ళల్లో మెరుపు ......
అలా స్నేహంతో ముద్దుపెట్టి లోపలికివచ్చేస్తే నా క్లాస్ కు ఎలా వెళ్లగలను - నా స్నేహితురాలి సేఫ్టీ చూసుకోవాలికదా - ఇప్పుడుచూడు ఎవ్వరూ లేకపోవడంతో భయపడేదానివి ......
జానకి : నిజంగా భయమేసింది , ముందే చెప్పొచ్చుకదా ...... నిన్నూ ......
నాకు కావాల్సింది కూడా అదే అంటూ లేచి కళ్ళుమూసుకుని చేతులను విశాలంగా చాపాను .
క్షణాలు ..... నిమిషమైనా దెబ్బలు లేవు , నవ్వులు వినిపించడంతో కళ్ళు తెరిచిచూస్తే ఎదురుగా బుజ్జిజానకితోపాటు మేడం ...... , ఆ ఒక్కటీ అడక్కు మహేష్ అంటూ సంతోషంతో నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : అంటీ ..... ఏమిజరిగిందో తెలుసా ? , ఎంత భయం వేసిందో - మహేష్ క్లాసులోనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది అంటూ మేడం గుండెలపైకి చేరింది .
హెడ్ మిస్ట్రెస్ : అందరూ వెళ్ళాక ఆఫీస్ రూమ్ లాక్ చెయ్యాలికదా అప్పుడప్పుడూ నాకూ భయమేస్తుంది .
నేనొచ్చేసానుకదా ఇక భయమేల ...... 
థాంక్యూ - థాంక్యూ ....... , రియల్ బుజ్జిహీరో అంటూ ఇద్దరూ ఒకేసారి దిష్టితీశారు.

తల్లీ ...... తల్లీ మహీ ......
జానకి : అమ్మమ్మ వచ్చింది , మహేష్ ...... మా అమ్మమ్మ వచ్చింది అంటూ బ్యాగుని అక్కడే వదిలేసి బయటకు పరుగులుతీసింది .
మేడంతోపాటు నవ్వుకుని బ్యాగుని తీసుకుని వెనుకే వెళ్ళాము .
జానకి : అమ్మమ్మా అమ్మమ్మా ...... అంటూ పరుగునవెళ్లి స్కూటీ దిగిన తన అమ్మమ్మ గుండెలపైకి చేరింది .
తల్లీ ..... తల్లీ మహీ ...... నేను చూస్తున్నది నిజమేనా ? అంటూ ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులుకురిపిస్తున్నారు , తల్లీ ...... నిన్ను ఇలా మళ్లీ చూస్తాననుకోలేదు - మీ తాతయ్య చూస్తే ఎంత ఆనందిస్తారో ...... నా తల్లీ నా బంగారుకొండ నా ప్రాణం ....... అంటూ ముద్దులు ఆపడంలేదు .
హెడ్ మిస్ట్రెస్ : మీ జానకినే అంటీ ....... 
అమ్మమ్మ : కూతురి పేరు వినగానే ఉద్వేగానికి లోనైనట్లు ..... జానకినా ? అంటూ బుజ్జిజానకి బుగ్గలను అందుకుని ఆశ్చర్యపు సంతోషంతో చూస్తున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : బుజ్జిజానకి అంటీ ......
జానకి : అవును అమ్మమ్మా ...... , ఈ ఆనందాలకు కారణం మహేష్ అంటూ జరిగింది మొత్తం వివరించింది .
అమ్మమ్మ : బాబూ మహేష్ అంటూ దగ్గరికివచ్చి చల్లగా ఉండు నాయనా అంటూ దీవించారు .
అమ్మమ్మా ...... ఇకనుండీ బుజ్జిజానకి హ్యాపీగా ఉంటుంది - మీరుకూడా బుజ్జిజానకి అనిపిలిస్తే ఫుల్ హ్యాపీ .....
అమ్మమ్మ : చాలా సంతోషం మహేష్ ...... , బుజ్జిజానకీ ......
జానకి : అమ్మమ్మా ...... అంటూ సంతోషంతో చుట్టేసింది .
అమ్మమ్మ : ఈసంతోషం చూడాలని మీ తాతయ్య నేను మొక్కని దేవుడంటూ లేరు - బుజ్జిదేవుడి రూపంలో వచ్చి మా కోరిక తీర్చారన్నమాట ...... , మీ తాతయ్య వేచిచూస్తున్నారు వెళదామా ? .
జానకి - మేడం : బుజ్జిదేవుడన్నమాట అంటూ ఆనందిస్తున్నారు .
అమ్మమ్మ : మహేష్ ..... నీరుణం తీర్చుకోలేనిది .
తీర్చుకోవచ్చు అమ్మమ్మా ....... అంటూ బుజ్జిజానకి బ్యాగును స్కూటీలో ఉంచాను .
జానకి : అమ్మమ్మా ...... వెళదాము పదా .....
అమ్మమ్మా అమ్మమ్మా ......
మేడం నవ్వులు ఆగడం లేదు
జానకి : వినకు అమ్మమ్మా ...... , ఏమిటో నేను చెబుతాను పదా ...... 
నాకోరిక తీర్చారన్నమాట సరే ...... , బుజ్జిజానకీ ...... " HAPPY NEW YEAR " .
బుజ్జిజానకి :  ఈ ఆనందంలో ఆ సంగతే మరిచిపోయాను అంటూ దగ్గరికివచ్చి happy new year మహేష్ - happy new year అంటీ ...... విష్ చేసింది .
హెడ్ మిస్ట్రెస్ : Happy new year బుజ్జిజానకీ - Happy new year మహేష్ ......
Happy new year మేడం ......
బుజ్జిజానకి : తాతయ్య ఎదురుచూస్తూ ఉంటారు రేపు ఉదయం కలుద్దాము మహేష్ ...... , తొందరగా వచ్చెయ్యి ...... , అంటీ బై .....
హెడ్ మిస్ట్రెస్ : బై తల్లీ ...... ఉమ్మా .

అమ్మమ్మ : తల్లీ జానకీ..... ఎప్పుడు వీలుకుదిరితే అప్పుడు మహేష్ ను ఇంటికి పిలుచుకునిరా ...... , ఇష్టమైనవన్నీ చేసిపెడతాను .
జానకి : నాకు తెలియదా అమ్మమ్మా ...... , మహేష్ బై .......
రేపు కలుద్దాము బుజ్జిజానకీ ..... అంటూ ఒక చేతిని బుజ్జిహృదయంపై వేసుకుని మరొకచేతితో టాటా చెప్పాను , wait wait బుజ్జిజానకీ వన్ మినిట్ అంటూ పరుగునవెళ్లి మూడు ఐస్ క్రీమ్స్ తీసుకుని ఒకటి దాచుకుని వచ్చాను - అమ్మమ్మా ...... మీకు తాతయ్యగారికి ......
జానకి : మరి నాకు ..... ఈ ఈ ఈ .
నవ్వుకుని దాచుకున్నదానిని అందించాను .
జానకి : నా మహేష్ గురించి నాకు బాగా తెలుసు - Once again Happy new year అంటూ నా బుజ్జిహృదయంపై ముద్దుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిపోయింది .
ఆఅహ్హ్హ్ .......

హెడ్ మిస్ట్రెస్ : పట్టుకున్నానులే ఇక నువ్వూ వెళ్లు మహేష్ - బై అంటూ ఆఫీస్ రూమ్ వైపు నడిచారు .
మీదెబ్బ టేస్ట్ చెయ్యకుండా ఎలా బై చెప్పగలను అంటూ నా క్లాస్రూంలోకివెళ్లి బ్యాగు భుజాలపై వేసుకుని నేరుగా ఆఫీస్ రూమ్ దగ్గరకువెళ్లి May i come in మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : దెబ్బలుపడతాయి ఇంకొకసారి లోపలికిరావడానికి పర్మిషన్ ఆడిగావంటే , నేను ఉన్నా లేకపోయినా నువ్వు - జానకి ఎప్పుడైనా నేరుగా లోపలికివచ్చేయ్యొచ్చు అంటూ కోపంతో చూస్తున్నారు . 
ఆ దెబ్బలే కదా మేడం నాకు కావాల్సింది - నేను రెడీ ......
హెడ్ మిస్ట్రెస్ : అమ్మో కేర్ఫుల్ గా ఉండాలి లేకపోతే జానకి బాధపడుతుంది .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేడం ........
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో మహేష్ అంటూ నవ్వుకుంటూనే ఆఫీస్ రూమ్ కీస్ తీసుకుని హ్యాండ్ బ్యాగు సర్దుకుంటున్నారు .
అంతేనా మేడం ......
హెడ్ మిస్ట్రెస్ : అంతే మహేష్ ....... అనిచెప్పి అటువైపుకు తిరిగారు .
ఫైనల్ గా బ్రతిమాలుకుంటున్నాను ......
హెడ్ మిస్ట్రెస్ : ఫైనల్ గా బదులిస్తున్నాను - దెబ్బలు తప్ప ఏమైనా అడుగు ......
దెబ్బనే కావాలి ఇలాకాదు అంటూ సైడ్ కు వెళ్లి మేడం బుగ్గపై ముద్దుపెట్టాను .
అంతే చెంప చెళ్ళుమంది దెబ్బ కాస్త గట్టిగానే ...... - మహేష్ మహేష్ ...... sorry sorry - నా చెంప ఎర్రగా కందిపోవడం చూసి మేడం కళ్ళల్లో చెమ్మ ......
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ మేడం - ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది అంటూ చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చాను .

నిమిషం తరువాత మేడం బాధపడుతూనే బయటకువచ్చారు .
మేడం ...... నేను లాక్ చేస్తాను అంటూ అందుకుని డోర్స్ వేసి లాక్ చేసి కీస్ అందించాను .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... ఇంకా వెళ్లలేదా ? .
మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి అదికూడా అప్పుడప్పుడూ భయంవేస్తుంది అని చెప్పాక ఎలా వెళ్లగలను మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : ఇంత మంచివాడిని కొట్టాను - ఇంకా నా వేలి గుర్తులు అలానే ఉన్నాయి అంటూ బాధపడుతూ చెప్పారు .
మేడం ...... మీరు దేనిగురించి మాట్లాడుతున్నారు - ఈ దెబ్బే కదా రేపు ఉదయం వరకూ మిమ్మల్ని గుర్తుచేస్తూ ఉండేది .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... నొప్పివేస్తోందా ? .
మేడం మేడం ...... ఇంత సంతోషంతో నవ్వుతుంటే నొప్పివేస్తోందా అని అడుగుతారేమిటి ? , ఒకేఒక స్కూటీ ఉందంటే అది మీదే అన్నమాట ....... ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటూ స్కూటీవరకూ వదిలాను , మేడం ...... I am happy అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను - నేను ఆడిగినవెంటనే కొట్టి ఉంటే ఇంతవరకూ వచ్చేదే కాదు ....... ఏమాత్రం ఆలోచించకుండా జాగ్రత్తగా వెళ్ళండి .
హెడ్ మిస్ట్రెస్ : అవును తప్పంతా నాదే ......
అదిగో మళ్లీ ...... , ముందు మీరు వెళ్ళండి .
హెడ్ మిస్ట్రెస్ : నువ్వు ఎక్కడికి వెళ్ళాలి .......? .
చాలాదూరం మేడం ..... , బస్ స్టాప్ ఇక్కడే కదా నెనువెళతాను మీరువెళ్లండి ఒక్క నిమిషం అంటూ పరుగునవెళ్లి మేడం ఇంటిలో ఎంతమంది ఉన్నారో తెలియక బోలెడన్ని ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి అందించాను .
హెడ్ మిస్ట్రెస్ : నవ్వేశారు ...... , మహేష్ ..... మాఇంట్లో మా బుజ్జి బాబు - అత్తయ్యా మావయ్య .......
బుజ్జిబాబు ...... , మీ అంత క్యూట్ గా ఉంటాడు .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ ...... 3rd ఇయర్ , నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్లోనే జాయిన్ చేస్తాను .
మరి సర్ ...... ? .
మేడం కళ్ళల్లో చెమ్మ - ఇక్కడ లేడు అంటూ కాస్త కోపంగానే బదులిచ్చారు , సరే అయితే నవ్వించేశావు జాగ్రత్తగా ఇంటికివెళ్లు అంటూ నా బుగ్గను స్పృశించారు .
ఇష్టమైనదే కదా మేడం ..... టాటా అంటూ పంపించాను , అలా వెనుకకు చూడకండి మేడం బై ...... , ఆఅహ్హ్ తియ్యనైన నొప్పి ...... అంటూ స్పృశించుకుంటూ బయటకు నడిచాను - అంటీలకు కాల్ చేసాను - అంటీల కోపపు వాయిస్ విని నవ్వుకున్నాను , అంటీలను ఐస్ క్రీమ్స్ రా అంటూ మళ్లీ వెహికల్ దగ్గరకువెళ్ళాను . అన్నా ...... స్టూడెంట్స్ అందరికీ సరిపోయాయా ? .
అన్న : ఏంటి మహేష్ తెలియనట్లు అడుగుతున్నావు - ఇది స్వర్గపు ఐస్ క్రీమ్ వెహికల్ అంటూ ఒక ఐస్ అందుకున్నారు మారుక్షణంలో ఆ ప్లేస్ లో రెండు ఐస్ క్రీమ్స్ ప్రత్యక్షం అయ్యాయి - స్టూడెంట్స్ అందరూ ఇష్టమైనన్ని ఇంటికి తీసుకెళ్లారు .
Wow ..... లవ్ యు లవ్ యు పెద్దమ్మా ...... , అన్నా ....... మూడు కోన్ ఐస్ క్రీమ్స్ ఇవ్వండి మా అంటీ వాళ్లకు ...... థాంక్యూ , సేఫ్టీ కి మరొక మూడు ఇవ్వండి అంటూ వాటిని బ్యాగులోఉంచుకుని బై చెప్పడంతో ఒక్కసారిగా మాయం అయిపోయాయి .
అటెండర్ ...... క్లారూమ్స్ అన్నింటికీ తాళాలు వేస్తుండటం చూసి చేతులలో ఐస్ క్రీమ్స్ తో అంటీలను గుర్తుచేసుకుని వచ్చేస్తున్నాను అంటూ బయటకునడిచాను .
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-11-2023, 09:04 AM



Users browsing this thread: 9 Guest(s)