Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
హెడ్ మిస్ట్రెస్ : అలా తినిపించడానికి జానకి అమ్మ లేరు మహేష్ ....... అంటూ ప్రాణంలా ముద్దులుపెడుతున్నారు .
Sorry sorry సో sorry జానకీ ...... అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : అందరిలా అమ్మ ప్రేమను పొందలేకపోయినా కనీసం అమ్మ స్పర్శను కూడా ఆస్వాదించలేకపోయింది .
మేడం ..... ? .
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ ...... , జానకి జన్మించిన రోజునే జానకి అమ్మ స్వర్గస్థులయ్యారు , అమ్మ స్పర్శ - అమ్మ ప్రేమ కనీసం అమ్మను చూడకుండానే పెరిగింది , అమ్మ ప్రేమకోసం బాధపడని రోజంటూ లేదు , జానకీ అని నువ్వు గెస్ చేయగానే అంతులేని సంతోషంతో నిన్ను ఎందుకు కౌగిలించుకుందో తెలుసా ......
" అమ్మ పేరు జానకి " 
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ ...... , జానకి తన అమ్మ పేరు - అలా పిలవగానే ఎంత సంతోషించిందో నువ్వూ చూశావుకదా , ఇలా గుర్తుచేసుకుని మధ్యాహ్నం పూట సరిగ్గా భోజనం కూడా చెయ్యదు - ఒక్కొక్కసారి ముద్దకూడా ముట్టకుండా స్కూల్ వదిలేంతవరకూ భాదపడుతూనే ఉంటుంది .

నెంబర్2 ..... కాదుకాదు జానకీ ...... , అమ్మప్రేమ పొందలేని పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు ...... , నీ బాధను తగ్గించడానికి అపద్దo చెబుతున్నాను అనుకోవద్దు , ఇందాక ఆడిగావు కదా అంటీలూ అంటీలూ అంటావు అమ్మానాన్నల గురించి మాట్లాడవా అని ...... , నేనుకూడా వారి ప్రేమ లేకుండానే పెరిగాను - వారు ఎలా ఉంటారో కూడా తెలియదు - నాకు ఊహ తెలిసేనాటికి అనాధాశ్రమంలో ఉన్నాను .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... అంటే నువ్వు ? .
అవును మేడం అనాధనే ...... , నిన్ననే మా ఇంటి ముందు ఉన్న అంటీలు చెప్పారు నెక్స్ట్ ఇయర్ తో మన ఇండియా జనాభా ..... చైనా జనాభాను మించిపోతుందని , అంతమంది ఉన్న నేను అనాథను ఎలా అవుతాను .
మేడం - జానకి కన్నీళ్ళతో నాచేతిని అందుకున్నారు .

I am happy i am happy జానకీ - మేడం ...... , నన్ను ఎల్లవేళలా కంటికి రెప్పలా చూసుకునే పెద్దమ్మ ఉన్నారు అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను , నిన్ననే అంటీలు - ఆక్కయ్యలను కలిశాను , ఈరోజు మేడం ను - నిన్ను ..... ok ok జానకిని మరియు ఇంతమంది స్టూడెంట్స్ ను కలిశాను ...... , హమ్మయ్యా ...... జానకి నవ్వింది .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ మహేష్ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
జానకీ ...... రెండు విషయాలు చెబుతాను తరువాత నీ ఇష్టం ఇలా రోజూ బాధపడతావో - సంతోషంగా ఉంటావో ....... , మొదటిది నా అనుభవంతో చెబుతున్నాను ...... నాకు తెలిసి కాన్పు రోజున డాక్టర్స్ వచ్చి ఇక ఏమీ చేయలేము తల్లినో - బిడ్డనో ఒక్కరినే కాపాడగలం అని జానకి అమ్మ ప్రక్కన ఉండగానే చెప్పి ఉంటారు , అలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏ తల్లి అయినా ఏమని బదులిస్తారో తెలుసా ...... ? .
హెడ్ మిస్ట్రెస్ : డాక్టర్స్ ...... నాకేమైనా పర్లేదు నా బిడ్డను బ్రతికించండి అంటూ ప్రాధేయపడుతుంది అంటూ ఆనందబాస్పాలతో చెప్పారు .
జానకీ ...... ఒకసారి మీ అంటీ కళ్ళల్లోకి చూడు , జానకి అమ్మగారు కూడా అంతే సంతోషంతో చెప్పి ఉంటారు , అమ్మలకు ...... బిడ్డలు చల్లగా ఉండాలన్నదే సంతోషం కాబట్టి ...... , జానకి అమ్మ వారి ఆయువునంతా పోసి నీకు సంతోషంతో జన్మనిచ్చి అపురూపంగా గుండెలపైకి తీసుకుని తల్లీ ...... నీలో నేను బ్రతికే ఉంటాను - నిన్ను అనుక్షణం కాపు కాస్తూనే ఉంటాను అని ముద్దుపెట్టి ........ కన్నీళ్లను తుడుచుకుని జానకి చేతిని సున్నితంగా అందుకున్నాను .
జానకి : మహేష్ ....... నన్ను అమ్మ స్పృశించారా ? .
హెడ్ మిస్ట్రెస్ : తన ప్రాణాన్ని గుండెలపై హత్తుకుని ముద్దుకూడా పెట్టి ఉంటారు జానకీ .......
జానకి : అంటీ - మహేష్ ...... చాలా ఆనందం వేస్తోంది అమ్మ ప్రేమను పొందానని తెలిసి చాలా చాలా ఆనందం వేస్తోంది అంటూ అంటీ గుండెలపైకి చేరింది .
హెడ్ మిస్ట్రెస్ : నిన్ను ప్రాణం కంటే ఎక్కవగా ముద్దుపెట్టకుండా ఎలా ఉంటారు జానకీ అంటూ ముద్దులుకురిపిస్తున్నారు .
జానకి : ఆనందిస్తూనే ....... మహేష్ మహేష్ మరొకటి ఏమిటి ? అంటూ ఆతృతతో అడిగింది .

హెడ్ మిస్ట్రెస్ ప్రేమతో గోరుముద్దలు కలిపి తినిపిస్తారు తింటేనే చెబుతాను .
జానకి : అంటీ ...... 
హెడ్ మిస్ట్రెస్ : ఇదిగో ఇదిగో ఇప్పుడే తినిపిస్తాను జానకీ ...... అంతకంటే అదృష్టమా ...... , థాంక్యూ థాంక్యూ మహేష్ ...... అంటూ ప్రేమతో తినిపించారు .
జానకి : మహేష్ నువ్వూ తిను ......
Yes yes జానకీ ..... థాంక్యూ థాంక్యూ అంటూ తిన్నాను .
జానకి : ఇష్టంగా తింటున్నాను కదా చెప్పు మరి ? ......

చెబుతా చెబుతా ...... , రెండవది వచ్చేసి పెద్దమ్మ ద్వారా తెలుసుకున్నాను - ఏమిటంటే ...... మనం ఇక్కడ అమ్మను తలుచుకుని చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉంటే పైన స్వర్గంలో ఎక్కడ స్వర్గంలో చెప్పు చెప్పు .....
జానకి - మేడం : స్వర్గంలో అంటూ ఆనందిస్తున్నారు .
అవును స్వర్గం నుండి చూస్తూ మురిసిపోతారు - అదే మనం బాధపడుతుంటే అమ్మలు నరకంలో ......
జానకి : వద్దు వద్దు మహేష్ ....... అంటూ మేడం ను గట్టిగా హత్తుకుంది .
అవును జానకీ ...... మన బాధనే వారికి నరకం - నిన్ను పైనుండి అలా చూస్తూ ఎంత బాధపడతారో .......
జానకి : లేదు లేదు లేదు ఇంకెప్పుడూ బాధపడను , అమ్మను తలుచుకుని సంతోషంగా ఉంటానుకదా ...... , అమ్మ స్వర్గంలో సంతోషంగా ఉండాలి .......
అలా ఉండాలంటే నువ్వు చెప్పినట్లుగానే ఉండాలి ఇక నీఇష్టం ......
జానకి కళ్ళుతుడుచుకుని , అంటీ అంటీ తినిపించండి .......
జానకి ...... మొదట నిన్ను తినమని ఎందుకు చెప్పానో తెలుసా ? .
హెడ్ మిస్ట్రెస్ : నాకు తెలుసు నాకు తెలుసు ....... , ఏ బుజ్జి జానకి తింటేనే స్వర్గంలో ఉన్న జానకి అమ్మ తినేది .......
జానకి : అవునా అంటీ ...... ? .
హెడ్ మిస్ట్రెస్ : అవును జానకీ ....... , మొదటిదాని మాదిరి మహేష్ అనుభవంతో ఈ విషయం చెప్పి ఉంటే నేనూ నమ్మెదానిని కాదు - పెద్దమ్మ చెప్పారన్నారు చూడు ఎవరైనా నమ్మాల్సిందే , రుజువు నేనే నిన్నటికీ ఇప్పటికీ తేడా చూస్తూనే ఉన్నావుకదూ .......
జానకి : నేనే నమ్మలేకపోయాను , ఉన్నట్టుండి మా అంటీ రుద్రమదేవిలా మారిపోవడం అంటూ సంతోషంతో నవ్వుకున్నారు , ఇలా అడుగుతున్నానని ఫీల్ అవ్వకండి ఇంతకూ పెద్దమ్మ ఎవరు అంటీ - మహేష్ .......
అనాధలకు అమ్మలాంటివారు జానకీ ...... , పేదరాసిపెద్దమ్మ కథలు వినే ఉంటావు చిన్నప్పుడు .... 
జానకి : అమ్మమ్మ చెబుతూ నిద్రపుచ్చేవారు .....
వారే పెద్దమ్మ ..... , నీలో ఉంటారు - నాలో ఉంటారు - మేడం లో ఉంటారు ......
హెడ్ మిస్ట్రెస్ : ఉన్నారు ఉన్నారు ...... , పెద్దమ్మే నా ధైర్యం ...... థాంక్యూ పెద్దమ్మా .......
జానకీ ...... స్వర్గంలో జానకి అమ్మ - పెద్దమ్మ కలిసే ఉంటారని నా నమ్మకం ......
జానకి : అయితే పెద్దమ్మ నాకుకూడా అమ్మే అంటూ బుజ్జి హృదయంపై ముద్దుపెట్టుకుంది సంతోషంతో ........

జానకి : మహేష్ ..... మేము తింటున్నాము కానీ నువ్వు తినడం లేదు .
రెండవది చెప్పకపోయుంటే కొట్టేలా ఉన్నావు చెబుతూ ఎలా తినగలను చెప్పు .....
జానకి : Sorry sorry అంటూ మేడంతోపాటు నవ్వుతోంది - ఇక డిస్టర్బ్ చెయ్యములే తిను ......
ట్యాంక్ చుట్టూ నీరు చేరడం వలన బుజ్జిస్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ..... ప్లేట్స్ కడగడం కోసం - నీరు తాగడం కోసం ఇబ్బందిపడుతుండటం చూసి ఒక్క నిమిషం జానకీ అంటూ లేచి పరుగుపెట్టాను , పిల్లలూ ...... wait wait అక్కడే ఉండండి పాచి ఉంది జారి పడిపోతారు అంటూ బాటిల్లో వాటర్ పడుతున్నాను - ట్యాంక్ లోపలకూడా పాచి ఉన్నట్లు బాటిల్లోకి చేరింది - పిల్లలూ ...... ప్రస్తుతానికి ప్లేట్స్ మాత్రమే కడుగుదాము నిమిషంలో ఫ్రెష్ వాటర్ తోపాటు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ రాబోతున్నాయి .
పిల్లలు : ఐస్ క్రీమ్స్ వస్తున్నాయి అంటే నిమిషం ఏమిటి ఎంతసేపైనా ఉంటాము అన్నయ్యా అన్నయ్యా ......
ఒక్క నిమిషం చాలు పిల్లలూ అంటూ పెద్దమ్మను ప్రార్థించాను . పిల్లలూ ..... ప్లేట్స్ - క్యారెజీ ఇవ్వండి అంటూ వాళ్ళతోపాటు శుభ్రం చేస్తున్నాను . 
ఎప్పుడు వచ్చిందో ఏమిటో జానకి కూడా హెల్ప్ చేస్తోంది - పిల్లలూ ...... జారిపోతారు అని మీ అన్నయ్య చెబుతున్నాడు కదా అక్కడే ఆగండి .
నవ్వుతూ పిల్లలకు హెల్ప్ చేస్తున్నాము .
పిల్లల అమ్మలు ...... థాంక్స్ చెప్పడం చూసి జానకి ఆనందం మరింత పెరిగింది .

అలా పూర్తయ్యిందో లేదో వాటర్ బాటిల్స్ వెహికల్ - కూల్ డ్రింక్స్ వెహికల్ తోపాటు పెద్ద ఐస్ క్రీమ్ వెహికల్ స్కూల్ లోపలివచ్చాయి .
పిల్లలు : అమ్మా అమ్మా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ....... 
అమ్మలు : మీ స్కూల్ దగ్గరికి ఐస్ క్రీమ్ వస్తుందని తెలియక డబ్బు తీసుకురాలేదు - సాయంత్రం ఇంటికి వెళ్ళాక కొనిస్తాములే .......
పిల్లలూ ...... అవి సొసైటీ స్పాన్సర్ వెహికల్స్ , వాటర్ బాటిల్స్ తోపాటు కూల్ డ్రింక్స్ - ఐస్ క్రీమ్స్ ఫ్రీ .......
పిల్లలు : ఫ్రీ నా ? .
ఒకటి కాదు రెండు కాదు మీ ఇష్టమైనన్ని తినొచ్చు - మీరు అడగడం ఆలస్యం ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు వెళ్ళండి వెళ్ళండి .......
పిల్లలు : చాలే చాలే అమ్మా అంటే వినకుండా తినిపించావు - ఇప్పుడు చూడు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినలేము అంటూ గిల్లేసి పరుగులుతీశారు .
అమ్మలు : తల్లీ - కన్నా ...... ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకూడదు .
జానకి : ఏమీకాదులే అమ్మలూ ...... , ఎండ ఉందికదా ఎన్ని తిన్నా కోల్డ్ చెయ్యదు .
అమ్మలు : మీఇష్టం అంటూ నవ్వుకున్నారు .
పిల్లలు ...... వాటర్ బాటిల్ వెహికల్ మరియు కూల్ డ్రింక్స్ వెహికల్ దగ్గరికి ఒక్కరూ వెళ్ళలేదు అందరూ ఐస్ క్రీమ్ వెహికల్ నే చుట్టుముట్టారు .
పిల్లలూ ...... అందరికీ ఎన్నికావాలంటే అన్ని ఇస్తాము సరేనా అంటూ రెండు చేతులకు రెండు రెండు ఐస్ క్రీమ్స్ అందిస్తున్నారు .
అమ్మలు : పిల్లలూ ...... ముందు నీళ్లు తాగాలి .
జానకి : అమ్మలూ ...... ఐస్ క్రీమ్స్ తిన్నాక చేరేది అక్కడికే మీరేమీ కంగారుపడకండి అనిచెప్పి ఆనందిస్తోంది .
ఆఅహ్హ్ ..... జానకీ , నీ నవ్వుని చూస్తే చాలు ఈ బుజ్జిహృదయం గాలిలో తెలిపోతుందనుకో ......
జానకి : మరింత అందంగా నవ్వుతోంది .
అమ్మో ఆకలి ఆకలి అంటూ మేడం వైపుకు అడుగులువేశాను .
పిల్లలు రెండురెండు ఐస్ క్రీమ్స్ పట్టుకుని థాంక్యూ థాంక్యూ అన్నయ్యా అంటూ తింటున్నారు .
నాకెందుకు చెబుతున్నారు - వెహికల్స్ కు చెప్పండి ..... ( వాటికి చెబితే వాటిని పంపించిన పెద్దమ్మకు చెప్పినట్లే అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను ) .

జానకి ...... నా ప్రక్కనే నడుస్తూ , నావైపుకే పదేపదే చూస్తోంది .
ఏమైంది జానకీ అలాచూస్తున్నావు ? అంటూ మేడం ఎదురుగా కూర్చుని తింటున్నాను - మేడం ..... జానకికి తినిపించి మీరూ తినండి - లంచ్ టైం పూర్తయ్యే సమయం అయ్యింది .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ జానకీ ...... ఎందుకు మహేష్ ను డౌట్ గా చూస్తున్నావు అంటూనే తినిపించారు .
జానకి : అదికాదు అంటీ ...... , పిల్లలూ ..... ట్యాంక్ వాటర్ బాగోలేవు ఒక్క నిమిషం ఆగండి వాటర్ తోపాటు కూల్ డ్రింక్స్ మరియు ఐస్ క్రీమ్స్ వస్తాయి అన్నాడు , చెప్పడం ఆలస్యం వచ్చేసాయి .
నేనెప్పుడు అన్నాను జానకీ .....
పిల్లలకోసం నువ్వు పరిగెత్తినప్పుడే నేనూ వెనుక వచ్చాను - అంతా విన్నాను .
హెడ్ మిస్ట్రెస్ : అవునా జానకీ ......
జానకి : అవును అంటీ ......
ఓహ్ ఆదా ....... అదీ అదీ ఈ సొసైటీ వారు రోజుకొక స్కూల్లో పిల్లలకు ఉచితంగా వీటిని స్పాన్సర్ చేస్తున్నారు . 
జానకి : నువ్వు చెప్పగానే సరిగ్గా ......
జానకీ మధ్యలో డిస్టర్బ్ చెయ్యకుండా పూర్తిగా విన్నాక మాట్లాడాలి - ఎలా కవర్ చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు .
జానకి : ఏంటి ఏంటి కవర్ కవర్ ....... ok ok సైలెంట్ చెప్పు చెప్పు ......
కవర్ కవర్ ...... yes yes రోజుకొక స్కూల్ కవర్ చేస్తూ వెళుతున్నారు - ఈ విషయం నాకెలా తెలిసింది అంటే మన స్కూల్ కు దగ్గరగా అంటే దగ్గరగా కాదు నెక్స్ట్ ఉన్న govt స్కూల్లో చదువుతున్న నా ఫ్రెండ్ చెప్పాడు ఇలా నిన్న వెహికల్స్ వచ్చాయి ఐస్ క్రీమ్స్ ఎన్నైనా తినొచ్చు కుమ్మేసాను అని , నెక్స్ట్ మన స్కూల్ ..... మామూలుగా అయితే లంచ్ టైం కు వచ్చేస్తారు అనిచెప్పాడు కాస్త ఆలస్యం అయ్యింది అంతే అంతే , నా అదృష్టం ..... నేను అలాచెప్పాను ఇలా వచ్చేసాయి అంతే ఇందులో నా గొప్పతనం ఏముంది ......
జానకి : భలే కవర్ చేసావు ......
జానకీ ..... what what ? .
జానకి : అదే అదే భలేగా కవర్ చేస్తున్నాయి వెహికల్స్ అంటున్నాను అంటూ మేడంతోపాటు డౌట్ గా నవ్వుకుంది , ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ ఉందని నాకు తెలియనే తెలియదు .
హెడ్ మిస్ట్రెస్ : అసలు ఇలాంటి సొసైటీ ఉందని హెడ్ మిస్ట్రెస్ అయిన నాకే తెలియదే ...... something something ......
అన్నీ మీకే తెలుసని అనుకోకండి .
హెడ్ మిస్ట్రెస్ : అదైతే నిజమే ...... , నాకంటే నీకే బాగా తెలుసు - కొన్ని గంటల్లో చాలానే చెప్పావనుకో ........
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-11-2023, 09:01 AM



Users browsing this thread: rk031423, 24 Guest(s)