Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అదేసమయంలో డబల్ కంగ్రాట్స్ మహేష్ అంటూ చేతిని అందుకుంది నా హృదయస్పందన ......
జన్మజన్మల అనుబంధం అన్నట్లు వొళ్ళంతా జలదరించింది - మాటల్లో వర్ణించలేని ఆనందం నేరుగా హృదయం నుండి కళ్ళల్లోకి చేరింది - ఆ అనుభూతిని వర్ణించలేకపోతున్నాను .
" మహేష్ మహేష్ ..... ఏమైంది - కళ్ళల్లో ఏమిటా కన్నీళ్లు " 
కన్నీళ్ళలా కనిపిస్తున్నాయా ...... నెంబర్ 2 , ఇవి ఒక మనిషికి పీక్స్ లో ఆనందం కలిగితే వచ్చే సంతోషపు బాస్పాలు - I am సో సో సో soooooo హ్యాపీ .....
" ఎందుకు ? " 
ఎందుకంటే నీకే తెలియకుండా same to same కన్నీళ్లు నీ కళ్ళల్లో కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ......
" అవునవును ...... నువ్వు చెప్పినట్లుగానే నాకూ ఆ అనుభూతి కలుగుతోంది చాలా బాగుంది అంటూ సంతోషంతో నవ్వింది - చేతినివదిలి సంతోషపు బాస్పాలను తుడుచుకుంది - మహేష్ ....... ఇంతకూ నెంబర్ 2 అని పిలుస్తున్నావేమిటి ? .
రిజిస్టర్ లో నీ నెంబర్ అదేకదా ..... , నువ్వెలాగో పేరు చెప్పడం లేదు అని అలా కంటిన్యూ అయిపోతున్నాను , ఇప్పుడైనా పేరు చెప్పొచ్చుకదా ......
చిరునవ్వే సమాధానం అయ్యింది .
ప్చ్ ప్చ్  .......

మహేష్ ...... అక్కడ ఉన్నావా ? , wait wait వస్తున్నా వస్తున్నా ...... హెడ్ మిస్ట్రెస్ ..... సక్సెస్ సక్సెస్ లిస్ట్ లోని రెండవ ప్రాబ్లమ్ కూడా సక్సెస్ అంటూ అంతులేని ఆనందంతో మాదగ్గరికివచ్చి నాచేతిని అందుకుని థాంక్యూ థాంక్యూ థాంక్యూ అంటూ తెగ ఊపుతున్నారు .
మేడం గారూ ...... నాకెందుకు ఇన్ని థాంక్స్ లు చెబుతున్నారు - ఇంతకూ మీరెవరు ? - మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నామా ? .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... అంటూ తియ్యనైనకోపంతో చేతిపై గిళ్లబోయి నో నో నో అంటూ ఆగి నవ్వుకుంటున్నారు . .
ప్చ్ ప్చ్ మళ్లీ ఫైల్ ....... ok ok మేడం , చెప్పానుకదా మీ లిస్ట్ - మీ సక్సెస్ - మీ సంతోషం ..... అని , ప్చ్ ..... గిల్లోచ్చుకదా అంటూ దీనంగా చూస్తున్నాను - మీ థాంక్స్ లు ఎవరికి కావాలి , నావల్లనే అంటారు నా చిరు కోరికను తీర్చరు .
హెడ్ మిస్ట్రెస్ : అమ్మో జస్ట్ మిస్ ...... , నాతో నీ పప్పు ఉడకదులే ......

" ఏమి కోరిక అంటీ ...... ? "
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ ...... ఇక్కడే ఉన్నావా ? అంటూ గుండెలపైకి తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
తల్లీ ...... తరువాత పేరు ఉంటుంది కదా మేడం , చెప్పండి చెప్పండి ......
హెడ్ మిస్ట్రెస్ : ఓహ్ తన పేరా ...... 
" అంటీ అంటీ ...... అంటూ చేతితో మేడం నోటిని మూసేసి అందమైన నవ్వుతో ఊహూ అంటూ సైగలుచేసింది " .
మేడం గారేమో ...... చిన్న కోరిక తీర్చరు - నెంబర్ 2 ఏమో ..... పేరు చెప్పదు , ఇలాగైతే కష్టం కదా .......
" మహేష్ కోరిక ఏమిటి అంటీ అంటూ నెంబర్ 2 - నెంబర్ 2 ఏమిటి " అంటూ ఒకసారి ఒకరినొకరు అడిగి నవ్వుకున్నారు .
" తెలుసుకుని మరింత గట్టిగా నవ్వుకున్నారు ".
నవ్వుకోండి నవ్వుకోండి ....... 

హెడ్ మిస్ట్రెస్ : నవ్వుకుంటాములే ...... , మహేష్ ...... " లిస్ట్ - సక్సెస్ - సంతోషం " అన్నావే అవి నావి కాదు తల్లి ...... నెంబర్ 2 వి అంటూ తన మొబైల్ అందుకుని సేవ్ చేసుకున్న లిస్ట్ చూయించారు . 
నెంబర్ 2 లిస్ట్ మీతో ఎలా మేడం ...... ? .
హెడ్ మిస్ట్రెస్ : అదొక పెద్ద కథ , ఆకలి ఆకలి అంటూ స్టూడెంట్స్ మధ్యలోనుండి తెగ కేకలువేశావుగా పదా ముందు తిందాము .
అవునవును మీ తల్లి నెంబర్2 కూడా తినాలికదా ...... 
హెడ్ మిస్ట్రెస్ : అలా ఎందుకు పిలుస్తున్నావు ? .
మరి పేరు చెప్పమనండి ....... , సంతోషంగా అపురూపంగా పేరుతోనే పిలుస్తాను .
నా హృదయస్పందన నవ్వుకుని , గెస్ చెయ్యి మహేష్ - ఓన్లీ వన్ గెస్ .......
ఇలాచెప్పావు బాగుంది నెంబర్ 2 ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని , తన కళ్ళల్లోకే కన్నార్పకుండా చూస్తున్నాను , ప్లీజ్ ప్లీజ్ నెంబర్2 కదలకు ......
" Ok అంటూ మనసు పులకించేలా అందంగా నవ్వుతోంది - ఒక్క చాన్స్ మాత్రమే ......."
తెలిసిపోయింది తెలిసిపోయింది ...... , నాకు ప్రాణమైన పేర్లు ఇప్పటికి ( అంటీలు ముగ్గురు - మేడం ) నాలుగు - ప్రియమైన పేర్లు ( ఆక్కయ్యలు ) మూడు  ఉన్నప్పటికీ ప్రాణం కంటే ఎక్కువైన పేర్లు మూడు అందులో ఒకరు మా పెద్దమ్మ ఇక రెండు ఉన్నాయి వాటిలో తప్పకుండా ఒకరు అయిఉంటుంది , నెంబర్2 తప్పుగా అనుకోకపోతే నా హృదయంపై చేతిని వెయ్యగలవా ? , నీకు ఇష్టం లేకపోతే ...... అనేంతలో ......
నా చేతిని నా హృదయంపైనుండి లాగేసి , నా బుజ్జిహృదయంపై అరచేతినివేసింది - తియ్యదనంతో నవ్వుతోంది .
ఆఅహ్హ్ ...... అంటూ కళ్ళు మూతలుపడటంతో చేతులను విశాలంగా చాపి నన్ను నేను మైమరిచినట్లు - వర్ణనకు సాధ్యం కాని మధురానుభూతితో వెనక్కు పడిపోబోయాను .......
మహేష్ మహేష్ ...... అంటూ జాగ్రత్తగా పట్టుకుని , ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ .... మహేష్ ok కదా అంటూ నిలబెట్టి నా ప్రక్కనే నిలుచున్నారు .
" తెలిసింది అన్నావుకదా మహేష్ ..... ఎంతసేపు అంటూ తియ్యనైన నవ్వులు " 
రెండు ప్రాణం కంటే ఎక్కువైన పేర్లు ...... , నెంబర్2 ...... తప్పుగా మాట్లాడితే మేడం కిందపడిన కర్రలతో కోపం తగ్గేదాకా కొట్టు - నీ చేతిపై చేతిని వెయ్యొచ్చా ? అంటూ కళ్ళు బిగుతుగా మూసుకుని అడిగాను - ప్లీజ్ ప్లీజ్ .......
" హ్యాపీగా వెయ్యొచ్చు ...... , ఇంత మంచివాడిని ఎందుకు కొడతాను "
తనతో నిండిపోయిన నా హృదయంపై చేతిని ఉంచిన నా హృదయస్పందన చేతిపై చేతినివేశాను - మధురాతిమధురమైన అనుభూతితో ఆఅహ్హ్ ...... అంటూ మళ్లీ పడిపోబోతే మేడం పట్టుకుని నిలబెట్టి నవ్వుకుంటున్నారు .......
థాంక్యూ మేడం ....... , కళ్ళుమూసుకునే ఆదా ఇదా ఆదా ఇదా ...... ఇక ఆలస్యం చెయ్యను నెంబర్2 చెప్పేస్తున్నాను - నీ పేరు " జానకి " ...... 
నా హృదయంపై ఉన్న నెంబర్2 చెయ్యి వెనక్కు తీసుకుంది .
కళ్ళుమూసుకునే ప్చ్ ప్చ్ ...... కాదన్నమాట , sorry నెంబ ...... అనేంతలో ......
" థాంక్యూ థాంక్యూ ....... మహేష్ అంటూ కౌగిలింత " 
చిన్న చేతి స్పర్శకే మైమరిచిపోయాను - కౌగిలింతకు స్వర్గం దాకా వెళ్ళిపోయాను 
......
అమ్మో ...... ఇద్దరిని పట్టుకోవడం కాస్త కష్టమే , మహేష్ మహేష్ ....... స్పృహలోకి రా .......
నావల్ల కావడం లేదు మేడం ...... , జానకి కరెక్ట్ అన్నమాట యాహూ యాహూ ...... అంటూ సంతోషంతో కేకలువేస్తూ కలుగుతున్న మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ కళ్ళుతెరిచాను .
Sorry sorry మహేష్ అంటూ వెనక్కు వెళ్ళింది .
లేదు లేదు ...... , జానకీ ...... ఏమిటా కన్నీళ్లు ? - నావల్లనేనా ఉండు నాకు దెబ్బలుపడాల్సిందే అంటూ కిందపడిన కర్రను అందుకున్నాను .
" ఆనందబాస్పాలకు - కన్నీళ్లను తేడా తెలుసుకదా ...... , ఇవి నువ్వు చెప్పినట్లుగా పీక్స్ ఆనందం - అందమైన ఉద్వేగం కలిగినప్పుడు వచ్చే ఆనందబాస్పాలు ....... , థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ ...... , ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదు మహేష్ ....... , డబల్ థాంక్స్ - త్రిబుల్ థాంక్స్ ...... కాదు కాదు వంద వేలు లక్ష కోటి థాంక్స్ మహేష్ ..... అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది .
జానకీ ....... నాకు అర్థం కావడం లేదు . 
జానకి : మహేష్ ...... నువ్వు అలా పిలిచిన ప్రతీసారీ ఎంత ఆనందం కలుగుతోందో తెలుసా ? , ఇలాంటి మధురానుభూతి ఉందని కూడా తెలియదు అంటూ మేడం గుండెలపైకి చేరింది .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ జానకీ ......
జానకి : అంటీ ఉమ్మా ...... 
జానకి : మీ ఇద్దరికీ ఆకలివేస్తోంది కదూ ...... , స్వయంగా నేనే వడ్డించుకుని వస్తాను ఉండండి ......
జానకి అంతులేని స్వచ్ఛమైన ఆనందాన్ని చూస్తూ వెనుకే వెళ్ళాను - మేడం ..... మా వెనుకే ఫాలో అయ్యారు .

ఇద్దరూ ...... మధ్యాహ్న భోజనం వరుసలలోనే నిలబడ్డారు . జానకీ - మేడం ...... మీరు క్యారెజీ తెచ్చుకోరా ? .
జానకి : మహేష్ ...... నువ్వు అలా పిలిచిన ప్రతీసారీ పులకించిపోతున్నాను తెలుసా ...... , ఒట్టి థాంక్స్ లతో సరిపెడుతున్నాను sorry sorry .......
మేడం : మాఇద్దరికీ ...... స్టూడెంట్స్ తినే ఫుడ్ తినడమే ఇష్టం .......
మళ్లీ టచ్ చేశారు మేడం - జానకీ ....... , నేనుకూడా ఇక్కడే తినాలన్నది పెద్దమ్మ ఆజ్ఞ - నాకూ ఇష్టమే అనుకోండి .......
జానకి : జానకీ జానకీ జానకీ ...... అంటీ నావల్ల కావడం లేదు అంటూ పట్టరాని ఆనందంతో మళ్లీ మేడం గుండెలపైకి చేరింది .
హెడ్ మిస్ట్రెస్ : ఎంజాయ్ జానకీ ...... , మళ్లీ నిన్ను ఇలా చూస్తాననుకోలేదు , మహేష్ మళ్లీ బిగ్ బిగ్ థాంక్స్ .......
మేడం ..... మీ థాంక్స్ లు తీసుకుని మీ ఆఫీస్ రూంలో ఉంచుకోండి .......
హెడ్ మిస్ట్రెస్ : ఇంతకుముందు నీకోరిక తీరుద్దామనుకున్నాను - మా తల్లి జానకికి ఇంత ఆనందం పంచాక ఇక నెవర్ అంటే నెవర్ అంటూ తియ్యదనంతో నవ్వుతున్న జానకి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి నవ్వుకుంటున్నారు , అదిగో మనవంతు వచ్చింది .......
జానకీ ...... మీ అంటీ కౌగిలోనే ఉండు , నేనున్నానుకదా అంటూ మూడు ప్లేట్లు అందుకుని వడ్డించుకున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ జానకీ ...... అదే ప్లేసేనా ? .
జానకి : ప్లీజ్ అంటీ ........
హెడ్ మిస్ట్రెస్ : నీఇష్టం - కానీ కంట్రోల్ చేసుకోవాలి , మహేష్ ...... అదిగో అక్కడ బుజ్జి స్టూడెంట్స్ కు వాళ్ళ అమ్మలు ప్రేమతో గోరుముద్దలు తినిపిస్తారో అక్కడ ..... 
హెడ్ మిస్ట్రెస్ వారి ఆజ్ఞ అంటూ వారి వెనుకే వెళ్లి , స్టోన్ బెంచస్ పై కూర్చున్న ఇద్దరికీ ప్లేట్స్ అందించి ఎదురుగా కూర్చున్నాను .

అయ్యో వాటర్ మరిచిపోయాను , జానకీ - మేడం ...... ఇప్పుడే తీసుకొస్తాను .
జానకి : జానకి జానకి జానకి ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ పులకించిపోతోంది - మహేష్ ...... నేనూ వస్తాను .
నేనేమీ వాటర్ క్యాన్ తీసుకురావడం లేదు జానకీ ...... , నా క్లాస్రూంలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళుతున్నాను , నువ్వు ......
జానకి : నువ్వు అని పిలవకు ...... జానకీ అనే పిలువు ......
జానకీ ......
జానకి : ఆఅహ్హ్ ..... అంటీ అంటూ సంతోషంతో చుట్టేసింది .
జానకీ ...... మీ అంటీతో ఉండు - చిటికెలో తెచ్చేస్తానుగా ...... అంతవరకూ తింటూ ఉండండి . ఫాస్ట్ గా వెళుతూ ....... అంటీలను చూసి మాట్లాడి కోప్పడి గంటలు అయిపోయింది ఒకసారి కాల్ చేద్దాము - పెదాలపై చిరునవ్వుతో ముగ్గురికీ ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్ చేసాను .
హలో ..... అంటూ వాసంతి అంటీ - హలో ...... అంటూ సునీత అంటీ - హలో ..... అంటూ కాంచన అంటీల మధురమైన స్వరాలు వినిపించగానే వొళ్ళంతా తియ్యదనం , తియ్యనైన నవ్వులతో గప్ చుప్ గా వారి స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నాను .
" సునీతా - వాసంతీ - కాంచన ...... నువ్వు ? నువ్వు ? నువ్వు ? , ముగ్గురికీ కాన్ఫరెన్స్ కాల్ చేసి ఎవ్వరూ మాట్లాడరేమిటి హలో హలో హలో ..... రాంగ్ నెంబర్ ఏమో అని కట్ చేసేసారు " .
ముసిముసినవ్వులు నవ్వుకుని మళ్లీ కాన్ఫరెన్స్ కాల్ చేసాను ......
ఈసారి కాస్త కోపం తో కట్ చేశారు .
మళ్లీ మళ్లీ కాల్ చేస్తూ అంటీల స్వరాలను ఎంజాయ్ చేస్తూనే క్లాస్రూంలోకివెళ్లి బాటిల్ తీసుకుని బయటకునడిచాను .

భౌ ...... అంటూ డోర్ చాటున దాక్కున్న జానకి భయపెట్టింది .
ఉలిక్కిపడి వెంటనే నవ్వుకున్నాను .
జానకి : మహేష్ ...... భయపడ్డావు భయపడ్డావు .
జానకీ వచ్చేశావా ? అంటూ నవ్వుతున్నాను ........
జానకి : చిటికెలో వస్తాను అనిచెప్పి రాలేదు కదా అందుకే నేనే వచ్చేసాను . 
అదీ అదీ అంటీల ఫోన్ అంటూ రీడయల్ ఆప్షన్ ఆన్ చేసి చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకున్నాను కేవలం అంటీల వాయిస్ మాత్రమే వినిపించేలా సెట్ చేసి జేబులో ఉంచుకున్నాను - అంటీ వాళ్ళు కట్ చేయగానే ఆటోమేటిక్ గా ముగ్గురికీ కాన్ఫరెన్స్ కాల్ వెళ్లిపోతోంది .
జానకి : బాటిల్ ఇవ్వు పట్టుకుంటాను - కలిసినప్పటి నుండీ చూస్తున్నావు అంటీలూ అంటీలూ అంటున్నావు తప్ప అమ్మ నాన్న అనడం లేదు .
ఎంత భయపడ్డానో తెలుసా ...... , జానకీ ..... తింటూ మాట్లాడుకుందాము రా అంటూ నవ్వుతూనే చేరుకున్నాము .

హెడ్ మిస్ట్రెస్ : ఏమైంది అంతలా నవ్వుతున్నారు ? .
నథింగ్ నథింగ్ మేడం ...... , జానకీ ...... ప్లీజ్ ప్లీజ్ ......
హెడ్ మిస్ట్రెస్ : జానకీ చెప్పు చెప్పు ...... అంటూ ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు .
జానకి : అంటీ ...... మీరేమో మహేష్ వలనే ధైర్యం వచ్చింది అంటూ తెగ పొగిడారు - భౌ అనగానే భయపడిపోయాడు ......
ఉలిక్కిపడ్డాను అంతే అంతే ......
జానకి : అవును అంతే అంతే అంటూ నవ్వుతూనే ఉంది .
జానకీ ...... తింటూ ఎంతసేపైనా నవ్వు - నీ నవ్వులు ఎంతసేపైనా చూడొచ్చు అంత అందంగా ఉంటాయి .
హెడ్ మిస్ట్రెస్ : అవునవును అంటూ జానకి నుదుటిపై ముద్దుపెట్టారు , జానకీ నీకొక విషయం చెప్పనా ...... నేను లిస్ట్ చూసి బాధపడుతుండటం చూసి నాతోకూడా ఇలానే అన్నాడు .
ఇద్దరూ నవ్వుకున్నారు .
జానకి : నాకు తెలిసి మహేష్ ..... తనచుట్టూ ఉన్నవాళ్లను హ్యాపీగా ఉంచుతాడు .
థాంక్యూ థాంక్యూ ...... , జానకీ - మేడం ..... తినండి చుట్టూ అందరూ తినేస్తున్నారు చూడండి .

జానకి : Ok మహేష్ ....... , అంటీ ...... నేను అటువైపు కూర్చుంటాను .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ జానకీ ...... వద్దులే రోజూలా ఎమోషనల్ అవుతావు అంటూ ప్రేమతో కౌగిలించుతున్నారు .
జానకి : ప్లీజ్ ప్లీజ్ అంటీ .......
మేడం ...... జానకి కోరికప్రకారం ఇటువైపు వచ్చి కూర్చోండి - నేను దూరంగా వెళ్లి కూర్చుంటానులే .......
జానకి : దూరంగా కూర్చోమని మేము చెప్పామా ..... ? , మా ప్లేస్లో కూర్చోవచ్చుకదా ....... అంటూ చిరుకోపంతో చెప్పింది .
Sorry sorry థాంక్యూ కూల్.కూల్ అంటూ లేచివెళ్లి కూర్చున్నాము . అంటీల కోపం తెలుస్తూనే ఉంది - చిలిపిగా నవ్వుకుంటున్నాను , sorry అంటీలూ ...... మీ వాయిస్ వినకుండా ఉండలేను .

హెడ్ మిస్ట్రెస్ : తల్లీ తల్లీ ..... బాధపడకు బాధపడకు అంటూ జానకి కన్నీళ్లను తుడుస్తూ ప్రేమతో ఓదారుస్తున్నారు .
మేడం చెప్పినట్లుగానే జానకి కళ్ళల్లో కన్నీళ్లు - తనను అలా చూసి హృదయం చలించిపోయింది - మేడం మేడం ...... ఏమైంది ? జానకి కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఎందుకు ? ఇంతవరకూ సంతోషంగా నవ్విందికదూ అంటూ నాకళ్ళల్లో చెమ్మతో అడిగాను హెడ్ ఫోన్ ను కిందకు జార్చేసాను .
హెడ్ మిస్ట్రెస్ : రోజూ ఇలానే మహేష్ ...... , లంచ్ సమయానికి ఇదే ప్లేస్లో కూర్చుని నీవెనుక బుజ్జి స్టూడెంట్స్ కు వాళ్ళ అమ్మలు ప్రేమతో గోరుముద్దలు తినిపించడం చూసి ఇలా ఎమోషనల్ అయిపోతుంది .
జానకీ ...... నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసి మేడంతోపాటు నేనూ తట్టుకోలేను , పని ఉండి రాలేకపోయారేమో ....... రాత్రికి నీ ఇష్టప్రకారమే ప్రేమతో తినిపిస్తారులే .....
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-11-2023, 08:59 AM



Users browsing this thread: 24 Guest(s)