Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అంటీలను చూడకుండా ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 4 గంటలదాకా ఉండలేనేమో అనుకున్నాను కానీ అనుక్షణం ముగ్గురు అంటీలను గుర్తుచేసే అందమైన హెడ్ మాస్టర్ మరియు తన చిన్న చిరునవ్వుతోనే హృదయమంతా ఆక్రమించేసిన సీనియర్ ....... ఆఅహ్హ్ నెంబర్ 2 ను తలుచుకుంటేనే పెదాలపై అమితమైన ఆనందం ...... , 10th క్లాస్ దగ్గరికి వచ్చేసామా ...... నా హృదయస్పందన వినిపిస్తోంది అంటే వచ్చేసినట్లే అంటూ విండో దగ్గరికివెళ్లి , శ్రద్ధగా క్లాస్ వింటున్న తనను చూస్తూనే ఉండాలనిపిస్తోంది . ఆఅహ్హ్హ్ ..... పెద్దమ్మా , నన్నుకూడా 10th క్లాసులో చేర్పించి ఉండొచ్చుకదా - మీరు ఏమిచేసినా నా మంచికే అని తెలుసులే ........
అనుకున్నాను అనుకున్నాను జాయిన్ అయినవెంటనే క్లాస్ కు రాకుండా ఇక్కడే ఆగిపోతావని అంటూ చెవుని పిండేస్తూ 9th క్లాస్ లోపలికి తీసుకెళ్లారు సైన్స్ టీచర్ ........
నవ్వుతూనే వెళ్లి వెనుక బెంచ్ లో కూర్చున్నాను - అంటే సైన్స్ టీచర్ సెకండ్ పీరియడ్ మనదే అన్నమాట ...... 
టీచర్ : స్టూడెంట్స్ ....... న్యూ జాయినింగ్ , అచ్చు మీలానే అల్లరి పిల్లాడు , పేరు పేరు .......
మహేష్ సర్ ......
టీచర్ : మహేష్ ....... , చూద్దాము ఈ క్లాస్ అయినా శ్రద్దగా వింటాడో లేడో .......
మీగురించి తెలుసుకున్నాను - మీ క్లాస్ వినకపోతే మిస్ అయినట్లే అంటూ సైలెంట్ గా కూర్చుని బోర్డ్ వైపు చూస్తున్నాను .
టీచర్ : చూద్దాము మహేష్ అంటూ క్లాస్ స్టార్ట్ చేశారు - టీచింగ్ ఆసక్తిగా ఉంది .

కొద్దిసేపటి తరువాత ఎస్క్యూస్ మీ సర్ అంటూ అటెండర్ లోపలికివచ్చి టీచర్ తో మాట్లాడి వెళ్ళిపోయాడు .
టీచర్ : మహేష్ come here ...... , మహేష్ ..... ఇవి స్కూల్లో జాయిన్ అయినట్లుగా ఫార్మ్స్ - ఇవి govt టెక్స్ట్ బుక్స్ ....... , కొత్తవి లేవని పాతవే పంపించారు అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పమన్నారు .
బుక్స్ పాతవి అయితేనేమి సర్ ....... , సిలబస్ ముఖ్యం కానీ ...... , రెండింటిలో ఒక్కటే ఉంటుంది కదా ........
టీచర్ : గుడ్ మహేష్ - తీసుకుని వెళ్లి కూర్చో .......
థాంక్యూ చెప్పి వెళ్లి కూర్చున్నాను . సైన్స్ టెక్స్ట్ బుక్ తప్ప మిగతా టెక్స్ట్ బుక్స్ బ్యాగులో ఉంచుకుని , జాయినింగ్ ఫార్మ్స్ చూస్తున్నాను - వాటిలో చివరన " స్కూల్ - స్టూడెంట్స్ మారాలంటే చెయ్యవలసినవి " అన్న లిస్ట్ ఉన్న లెటర్ కనిపించింది - లిస్ట్ చదివితే నేను ...... స్కూల్లోకి ఎంటర్ అయినప్పుడు ఏవైతే గమనించానో వాటితోపాటు మరికొన్ని ఉన్నాయి , అంటే నేను హెడ్ మాస్టర్ రూమ్ కు ఎంటర్ కాకముందు ఈ లిస్ట్ నే చూస్తూ బాధపడుతున్నారన్నమాట - అంటే మేడం కళ్ళల్లో చెమ్మకు కారణం ...... , నా జాయినింగ్ ఫార్మ్స్ తోపాటు ఈ లెటర్ కూడా జతకలిసి నాదగ్గరకు చేరింది - పెద్దమ్మ చేర్చి ఉంటారు - అంటే మనం రంగంలోకి దిగాల్సిన సమయం ఇంత త్వరగా వచ్చేసిందన్నమాట , పెద్దమ్మా ...... మీ ఆజ్ఞను కాదంటానా చెప్పండి , హెడ్ మిస్ట్రెస్ మరింత మంచివారన్నమాట - ఏదో అంటీలలా అందంగా ఉన్నారని అనడం లేదు , నాతో మాట్లాడిన విధానం అంతకంటే ముఖ్యంగా ఈ లిస్ట్ చాలు వారి మంచితనం - నిజాయితీ తెలియజెయ్యడానికి .......
అంతలో స్కూల్ బెల్ మ్రోగింది - టీచర్ ...... క్లాస్ పూర్తిచేయకముందే ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంటూ బయటకు పరుగులుతీశారు .
టీచర్ : నువ్వొక్కడివి ఉన్నావన్నమాట - రేపటి నుండి నువ్వూ ఇంతేలే ...... , govt స్కూల్ మేనేజ్మెంట్ అంటే ఇంతే .......
హెడ్ మిస్ట్రెస్ గారు .......
టీచర్ : నో నో నో ...... స్కూల్ - స్టూడెంట్స్ మార్పుకోసం హెడ్ మిస్ట్రెస్ గా జాయిన్ అయిన తొలిరోజు నుండీ సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తూనే ఉన్నారు వీలు కావడం లేదు , ముందు టీచర్స్ మారితేనేకదా స్టూడెంట్స్ అటుపై స్కూల్ మార్పు చెందేది ...... , మన హెడ్ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే , ఈ స్కూళ్ళోనే చదివి ఈ సంవత్సరమే నెల ముందు ఈ స్కూల్ కే హెడ్ మాస్టర్ గా వచ్చారు - ఇలా మారిపోయి ఉండటం చూసి బాధపడని రోజు లేదు - మార్చడానికి govt ఆఫీసస్ చుట్టూ తిరగని రోజు లేదు - మన మేడం ను కలెక్టర్ గారిని కలవకుండా చేస్తున్నారు ఆఫీసర్స్ ...... ఎప్పటికి మారుతుందో ఏమిటో అంటూ బాధపడుతూ వెళ్లారు .

నా జాయినింగ్ ఫార్మ్స్ బ్యాగులో పెట్టి స్కూల్ బ్యాగును క్లాసులోనే ఉంచి , లిస్ట్ తీసుకుని నేరుగా ఆఫీస్ రూమ్ కు చేరుకున్నాను , May i come in మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : Not now మహేష్ అంటూ టేబుల్ కింద వెతుకుతున్నారు .
థాంక్యూ మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : నేను లోపలికి రమ్మనలేదు ......
నేను కూడా ఎంటర్ అవ్వనేలేదు మేడం అంటూ నవ్వుతున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : మరి థాంక్స్ దేనికి ? .
నన్ను చూడకుండానే నా మాటలు గుర్తుపట్టి మహేష్ అని పిలిచినందుకు ......
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో పిలవలేదు ......
మేడం ....... 
హెడ్ మిస్ట్రెస్ : పిలిచే ఉంటాను నాకు తెలియకుండా ......
తెలియకుండానా ...... Why మేడం ? .
హెడ్ మిస్ట్రెస్ : ఎందుకా ...... , నానుండి దెబ్బతినకుండా వెళ్లను అని సవాల్ చేసి వెళ్ళావుకదా , అప్పటి నుండీ అదే ఆలోచన .......
యాహూ ...... yes yes yes ......  ( మేడం కు తెలియకుండానే మేడం మనస్సు నన్ను తలుచుకుంటోంది అంటే నాకులానే అక్కడ కూడా కొట్టేసుకుంది అన్నమాట - మేడం కే ఇంకా తెలియరాలేదు ) , మేడం ముందైతే మీ కళ్ళల్లో చెమ్మను తుడుచుకోండి - ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గమనించాను .
హెడ్ మిస్ట్రెస్ : అలాంటిదేమీ లేదు అంటూనే తుడుచుకున్నారు - ఇంతకూ ఎందుకు వచ్చావు నేనైతే కొట్టను - కొమ్ములు వస్తే రానివ్వు చూద్దాము .
నవ్వుకున్నాను - కొమ్ములు వస్తే బాగోరు మేడం ...... , ఎందుకు వచ్చాను అంటే మీరుదేనికోసమైతే కిందా మీదా వెతుకుతున్నారో అది నాదగ్గర ఉంది అంటూ లెటర్ చూయించాను .
హెడ్ మిస్ట్రెస్ : నాదగ్గరకు వచ్చి లాక్కున్నారు - ఇచ్చావుగా ఇక వెళ్లు అంటూ విండో దగ్గరకువెళ్లి మెయిన్ గేట్ దగ్గర షాపులోనుండి ఇద్దరముగ్గురు స్టూడెంట్స్ సిగరెట్స్ కనుక్కోవడం చూసి బాధపడుతున్నారు .
లిస్ట్ రాసుకుని - నిజాయితీ ఉంచుకుని ఇలా బాధపడటం ఏమీ బాగోలేదు మేడం , వాటికి తోడు కాస్త ధైర్యం తోడైతే మీరు కలలు కంటున్న మార్పువైపుకు అడుగులువెయ్యవచ్చు .......
హెడ్ మిస్ట్రెస్ : అవును ఆ ధైర్యమే కావాలి - ఆడదాన్ని ఏమిచెయ్యగలను చెప్పు - స్కూల్లోని టీచర్స్ స్టూడెంట్స్ కూడా నామాట వినడం లేదు .......
ఘాన్సీ లక్స్మీభాయి ఆడవారే - రుద్రమదేవి ఆడవారే - సరోజినీ నాయుడు విజయలక్ష్మి పండిట్ దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ....... ఇలా చెప్పుకుంటూ పోతే వందలమంది ఆడవారు దేశ స్వాతంత్రోద్యమంలో పోరాడి విజయ శంఖారావం మ్రోగించినవారే ...... , మీరు ఎందులో తక్కువ చెప్పండి .
హెడ్ మిస్ట్రెస్ : అవును తక్కువే కాదు - మగవారితోకూడా తక్కువ కాదు ......., అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ......
మీవెనుక పెద్దమ్మ - నేను ఉంటాము , దైర్యంగా ముందుకు దూసుకుపోండి .......
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... ఇంతకూ పెద్దమ్మ ఎవరు ? .
మీలాంటి నిజాయితీగా ఉండేవారికి ధైర్యాన్ని ఇచ్చే దేవత - పెద్దమ్మను మనసులో తలుచుకోండి - అడుగు ముందుకువెయ్యండి .......
హెడ్ మిస్ట్రెస్ : ముందైతే నువ్వు లోపలికిరా మహేష్ ....... , పెద్దమ్మా ...... స్కూల్ బాగుకోసం నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని ప్రార్థించి , చీరకొంగును ముందుకు తీసుకుని నడుముభాగంలో చిక్కించుకున్నారు , మహేష్ ..... లిస్ట్ పట్టుకుని ఒక్కొక్కటీ గుర్తుచెయ్యి .......
Yes మేడం ...... , మొదటిది షాపువాడు సిగరెట్స్ - మందు - గుట్కా లాంటివి అమ్మకుండా వార్నింగ్ ఇవ్వడం .......
హెడ్ మిస్ట్రెస్ : ఆఫీస్ రూంలో ఉన్న కర్రలలో లావుపాటి రెండు కర్రలను తీసుకుని నాకూ ఒకటి అందించి " OPERATION SCHOOL MISSION STARTS " మహేష్ పదా అంటూ ఘాన్సీ - రుద్రమదేవిలా కదిలారు .
కమింగ్ మేడం అంటూ మేడం వాటర్ బాటిల్ అందుకుని వెనుకే ఫాలో అయ్యాను .

మేడం ...... 10th క్లాస్ మీదుగానే వెళ్లడం చూసి ఉత్సాహంతో వెళ్ళాను - విండో దగ్గర ఆగి చూస్తే లోపల ఎవ్వరూలేరు - ఇంటర్వెల్ కదా ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు అంటూ చుట్టూ చూస్తూనే మేడం వెనుక మెయిన్ గేట్ చేరుకున్నాను .
అంతలో ఇంటర్వెల్ అయిపోయినట్లు బెల్ మ్రోగింది - అయినా ఒక్కరూ క్లాస్సెస్ వైపుకు వెళితే ఒట్టు , అధికాదు అన్నట్లు మేడం ముందే నా ఎత్తు ఉన్న స్టూడెంట్ సిగరెట్టు కొనడం చూసి మేడం కోపం పాతాకస్థాయికి చేరుకుంది , స్టూడెంట్స్ ..... సిగరెట్స్ పారేసి బుద్ధిగా క్లాస్సెస్ కు వెళ్ళండి అన్నారు .
హెడ్ మిస్ట్రెస్ - టీచర్స్ చెబితేనే వినలేదు ఇక మీరు చెబితే వింటామా అంటూ మత్తులో తూగుతూ బదులిచ్చారు .
రేయ్ రేయ్ ...... వచ్చినది హెడ్ మిస్ట్రెస్ మేడమే రా అంటూ మరొకడు చెప్పాడు .
ఎవరైతే మనకేంటి అంటూ తూగుతూనే బదులిచ్చి సిగరెట్టు అంటించుకున్నాడు .
మేడం ...... బుద్ధిగా వెళ్లి ఉన్న కొద్దిపాటి పిల్లలకు పాఠాలు చెప్పుకోండి పాఠాలు అంటూ షాపువాడితోపాటు మరొక నలుగురు అలానే తూగుతూ రాక్షసుల్లా నవ్వుకుంటున్నారు .

మేడం ...... ఆ మత్తు సిగరెట్టు వలన వచ్చినది కాదు మత్తుపదార్థాల వలన వచ్చినది - అది ఇంకా ప్రమాదం ...... , మత్తుపదార్థాలు కూడా అమ్ముతున్నారు , వీరిని వెంటనే హాస్పిటల్లో చేర్చాలి .
హెడ్ మిస్ట్రెస్ : మత్తుపదార్థాలా ...... ? అంటూ కళ్ళల్లో చెమ్మ - కోపం ......
ఇంకా ఆలోచిస్తున్నారు ఏమిటి మేడం - కళ్ళల్లో చెమ్మతో ఉపయోగమేమీ లేదు - మీ వెనుక ముందు ...... పెద్దమ్మ - నేను ఉన్నాము .
హెడ్ మిస్ట్రెస్ : పెద్దమ్మను తలుచుకున్నారు , గోడపై కూర్చున్న స్టూడెంట్స్ వైపు కోపంతో చూస్తూ క్లాస్సెస్ కు వెళ్ళమని చెప్పారు .
ఆ కోపాన్ని చూసి సగం మంది వెళ్లారు - సగం మందికి భయం భక్తి లేనట్లు పట్టించుకోకుండా అలానే కూర్చున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : వెళతారు వెళతారు అంటూ షాప్ దగ్గరికి వెళ్లారు , 

షాప్ వాడు : రండి రండి మేడం ...... , స్కూల్ కు హెడ్ మిస్ట్రెస్ గా వచ్చినప్పటి నుండీ నా షాపులో ఏమీ కోనేలేదు - ఇక్కడ అన్నీ ఉన్నాయి అంటూ తేడాగా మాట్లాడుతున్నాడు .
హెడ్ మిస్ట్రెస్ : నేనొచ్చాను కదా ఇక నీ షాప్ ఇక్కడ ఉండదు , స్కూలుకు హాఫ్ కిలోమీటర్ వరకూ సిగరెట్స్ - మందు అమ్మకూడదని తెలియదా ? వాటితోపాటు గుట్కా - మత్తుపదార్థాలు కూడా అమ్ముతున్నావు - వాటివల్ల పిల్లలకు చాలాప్రమాదం , వెంటనే నీ షాప్ మూసేసి వేరే ఎక్కడైనా పెట్టుకుంటే నీకే మంచిది .
షాప్ వాడు : ఆ విషయాన్ని మీ స్టూడెంట్స్ కు చెప్పుకోండి - నా షాప్ ఎక్కడ పెట్టుకోవాలో నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మేడం ముందే పోకిరీలతోపాటి మత్తుమందు సేవించాడు , ఇలాంటిదే మీ స్టూడెంట్స్ ముగ్గురికి ఇచ్చాను అదిగో స్వర్గం చూస్తున్నారు చూడండి అంటూ మళ్లీ రాక్షస నవ్వులు నవ్వుతున్నారు .

ఇంకా ఆలోచిస్తారు ఏంటి మేడం నాకొస్తున్న కోపానికి ........
హెడ్ మిస్ట్రెస్ : ఇంతవరకూ హెడ్ మిస్ట్రెస్ లా చెప్పాను వినలేదు ఇక ఘాన్సీ - రుద్రమదేవిలా వినపడేలా చెప్పాల్సిందే అంటూ షాప్ వాడి చెవ్వు గువ్వుమనేలా లావుపాటి కర్రతో ఒక్క దెబ్బవేశారు .
గింగిరాలు తిరిగినట్లు మత్తు ఎక్కువై షాప్ లోనే పడ్డాడు .....
మావాడినే కొడతావా ఎంత ధైర్యమే నీకు అంటూ ఏకంగా ఆ నలుగురూ మీదకు వచ్చారు .
మర్యాద మర్యాద ...... ఈ స్కూల్ కే హెడ్ మిస్ట్రెస్ రా మేడం గారు అంటూ మోకాళ్ళు విరిగేలా పాదాలపై దెబ్బలమీద దెబ్బ వేసాను .
నొప్పికి తాళలేక మోకాళ్లపై కూర్చుని దండం పెడుతున్నారు .
ఇంతలో షాపు లోపల పడిన వాడు వెనుకవైపునుండి మేడం మీదకు వచ్చాడు . 
మేడం ఊరికే ఉంటారా ..... , పెట్టెలలో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ ను అందుకుని పగలగొట్టి వాడివైపుకు చూయించారు .
అంతే వాడు భయంతో మిగితావాళ్ళతో కలిసి మోకాళ్లపైకి చేరాడు .
అంతే గోడపై ఆసక్తితో చూస్తున్న స్టూడెంట్స్ అందరూ అమ్మబాబోయ్ హెడ్ మిస్ట్రెస్ హెడ్ మిస్ట్రెస్ అంటూ క్లాస్సెస్ వైపుకు పరుగులుతీశారు - మత్తుపదార్థాలు తీసుకున్న ముగ్గురు స్టూడెంట్స్ షాక్ లో కదలకుండా భయపడుతున్నారు .
షాప్ వాడు : మాకు రౌడీలు తెలుసు ఒక్క కాల్ చేస్తే వస్తారు .
హెడ్ మిస్ట్రెస్ : రమ్మను రా ...... , చూశావా స్టూడెంట్స్ అందరూ బుద్ధిగా ఎలా క్లాస్సెస్ కు వెళ్ళారో ...... , నీకు రౌడీలు తెలిస్తే నాకు పెద్దమ్మ తెలుసురా ...... మహేష్ ఏమంటావు అంటూ హైఫై కొట్టి , ఇప్పుడు ఇప్పుడు మేడం రాక్షస నవ్వులు నవ్వుతున్నారు .
అంతే స్కూల్ మొత్తం వినిపించేలా విజిల్ వేసాను .
హెడ్ మిస్ట్రెస్ : బుద్ధిగా వెల్లమంటే వెళ్ళలేదు , ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ల దాకా తీసుకొచ్చావు అంటూ 100 కు మరియు 108 కు కాల్ చేశారు , అటెండర్ గారూ ...... వీళ్ళ ముగ్గురి పేరెంట్స్ కు కాల్ చెయ్యండి .
అటెండర్ : అలాగే మేడం అంటూ స్టూడెంట్స్ నెంబర్స్ కోసం ఆఫీస్ రూమ్ వైపుకు పరుగులుతీశారు .
అయ్యబాబోయ్ సెక్యూరిటీ ఆఫీసర్లు అంటూ పరుగులుపెట్టబోయిన ఐదుగురు కదలకుండా మోకాళ్లపై మరొక దెబ్బవేశాము - అడుగుకూడా వెయ్యలేక నేలకొరిగారు ........ 
మేడం ...... సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేన్తవరకూ ఇక ఎక్కడికీ వెళ్లలేరు .

15 నిమిషాలలో సెక్యూరిటీ అధికారి జీప్ మరియు అంబులెన్స్ ఒకేసారి వచ్చాయి . 
మేడం కంప్లైంట్ ఇవ్వడంతో , పిల్లలు చదువుకునే స్కూల్ ముందు పిల్లలకే మత్తుపదార్థాలు అమ్ముతారా అంటూ మరొక నాలుగు దెబ్బలువేసి జీప్ లోకి ఎక్కించారు - పిల్లలను ..... వారి పేరెంట్స్ తోపాటు అంబులెన్స్ లో హాస్పిటల్ కు పంపించారు . మేడం గారూ ...... చాలా మంచిపని చేశారు - నా పేరు విశ్వ SI - మళ్లీ ఎవరైనా ఇబ్బందిపెడితే 100 తోపాటు నాకూ చెయ్యండి అని నెంబర్ ఇచ్చారు , బాబూ ..... నువ్వేంటి అంతపెద్ద కర్ర పట్టుకున్నావు ? .
హెడ్ మిస్ట్రెస్ : ఇంతటి ధైర్యాన్ని ఇచ్చినది ఈ పిల్లాడే సర్ ...... , మహేష్ లేకపోయుంటే ఇది ఇలానే కంటిన్యూ అయ్యేది , ఈ క్రెడిట్ మొత్తం మహేష్ కే చెందాలి ......
లేదు లేదు SI సర్ ...... , నేను వెనుక ఉన్నాను అంతే ......
SI సర్ : బ్యాక్ స్టేజ్ బుజ్జిహీరో అన్నమాట ...... , నా నెంబర్ నువ్వుకూడా ఉంచుకో , గుడ్ గుడ్ బుజ్జిహీరో ...... అంటూ భుజంపై తట్టి షాప్ కు సీల్ వేశారు - అయిపోయార్రా మీరు అంటూ వెళ్లిపోయారు .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 18-10-2023, 03:23 PM



Users browsing this thread: 33 Guest(s)