Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఆశ్చర్యం ........ govt స్కూల్ మెయిన్ గేట్ ప్రక్కనే కాంపౌండ్ వాల్ కు ఆనుకుని పాన్ షాప్ అందులో సిగరెట్స్ ...... ఘోరం ఏమిటంటే నాముందే ఇద్దరూముగ్గురు స్కూల్ డ్రెస్సులో ఉన్నవాళ్లు సిగరెట్స్ కొన్నారు ...... సిగరెట్స్ మాత్రమే కాదు మందు ..... మందు మరియు గుట్కాలు కూడా పెద్దవాళ్ళు కొనుక్కుని వెళుతున్నారు - బెల్ట్ షాప్ లా అనిపించింది .
స్కూల్ టైం 9 గంటలకు ఇప్పుడు 9:15 ...... నేనే ఆలస్యం అనుకుంటే స్కూల్ కు వచ్చిన పిల్లలందరూ కూడా క్లాస్సెస్ కు వెళ్లకుండా - ప్లే గ్రౌండ్ లోనూ ఆడుకోకుండా కాంపౌండ్ వాల్ పై కూర్చుని ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు చేసుకుంటున్నారు .
మై గేట్ పూర్తిగా పాడయ్యింది ఎవడు పడితే వాడు ఏకంగా మందు బాటిల్స్ గ్లాసులతో లోపలకువెళ్లి ఒక మూలన తాగేసి బాటిల్స్ ను అక్కడే పారవేసి వెళుతున్నారు .
స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ చాలా చోట్ల కూలిపోయింది , బ్లాక్ హోల్స్ లా కొన్నిచోట్ల రంధ్రాలు - పిల్లలు వాటి ద్వారా అటూ ఇటూ వెళుతూ వస్తున్నారు - కాంపౌండ్ అటువైపు నివాసిస్తున్నవారు ఇదంతా చూసి స్కూల్ గ్రౌండ్ ను చెత్త కుప్ప అనుకున్నారో ఏమో ...... వాళ్ళ వేస్ట్ అంటూ కాంపౌండ్ ఇటువైపుకు దర్జాగా పారబోస్తున్నాను , క్లాస్సెస్ పైకప్పుల పెంకులు చెల్లాచెదురైపోయాయి ఏ క్షణాన క్లాసులో కూర్చున్న పిల్లలపై పడతాయో తెలియదు , మధ్యాహ్న భోజనం పథకం అయితే చెప్పే పరిస్థితులలో లేదు - పాత్రలను ..... మురికిలోనే ఉంచుతున్నారు - త్రాగడానికి ఏర్పాటుచేసిన ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడం దానిచుట్టూ నీరు నిలిచి మురుగులా మారిపోయింది - పిల్లలంతా దాటుకునివెళ్లి అక్కడే నీళ్లు తాగుతున్నారు .
గ్రౌండ్ లో పరిస్థితి ఇలా ఉంటే క్లాస్సెస్ లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది , సరైన బెంచస్ లేవు - బ్లాక్ బోర్డ్ విరిగిపోయాయి - లైట్స్ లేవు ఫ్యాన్స్ సంగతి చరప్పనక్కర్లేదు - టీచర్స్ లేకపోవడంతో పిల్లలంతా చిందులువేస్తున్నారు - టెక్స్ట్ బుక్స్ చింపేసి ఉంటలు చేసి కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు - అప్పుడే దర్జాగా వచ్చిన టీచర్స్ వీటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా ఆఫీస్ కు వెళ్లి నిమిషానికే బయటకువచ్చేశారు ఇకనైనా క్లాస్సెస్ కు వెళతారు అనుకుంటే " సర్ ...... రిజిస్టర్ లో సంతకం పెట్టేసాను బ్యాంకుకు వెళ్ళాలి అని ఒకరు - స్టాక్స్ చెక్ చేసుకోవాలని ఒకరు - మరొకరైతే ఏకంగా ఇక్కడ టీచింగ్ వదిలేసి దగ్గరలోని ప్రైవేట్ స్కూల్లో టీచ్ చెయ్యడానికి వెళుతున్నాను క్లాస్ కు వెయ్యి నువ్వూ ట్రై చెయ్యి అంటూ మరొక టీచర్ ను కూడా తీసుకెళ్లాడు " .......
ఆక్కయ్యలు చెప్పినది నిజమే స్కూల్ మొత్తం గోలగోలగా మార్కెట్ ను తలపిస్తోంది - ముందైతే ఆఫీస్ రూమ్ కు వెళ్లి జాయిన్ అవుదాము జాయిన్ చేసుకునేవాళ్ళు అయినా ఉన్నారో లేదో ....... 
10th క్లాస్ క్లాస్రూం విండో దగ్గరికి చేరుకోగానే హృదయస్పందన వినసొంపుగా నా చెవులవరకూ వినిపించసాగింది - మనసు సంతోషంతో పులకించిపోసాగింది - అడుగులు ఆగిపోయాయి ........ మనకోసం ఎవరో ఎవరో ఇక్కడ పరితప్పిస్తున్నట్లు హృదయస్పందన ద్వారా తెలుస్తోంది , కళ్ళు వెతకడం మొదలుపెట్టాయి - లోపల ..... 10th క్లాస్ exams దగ్గర పడుతున్నాయి కాబట్టి సగం మంది బుద్ధిగా చదువుకుంటున్నారు మిగతా సగం వారిని డిస్టర్బ్ చేస్తున్నాము అనికూడా జ్ఞానం లేకుండా గోలగోలచేస్తున్నారు - చదువుకుంటున్న వాళ్ళనూ గోల చెయ్యడానికి లాగుతుండటం వారిపై పేపర్స్ విసురుతుండటం చూసి ఆగలేకపోయాను . 
నేరుగా లోపలకువెళ్లి డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళ తలలపై బుద్ధిలేదా బుద్ధిలేదా అంటూ మొట్టికాయలువేశాను అంతకూ విననివాళ్ళ వీపులు విమానం మ్రోగడంతో ఆ సౌండ్స్ కు నొప్పితాలూకు కేకలకు అందరూ సైలెంట్ అయ్యి నావైపుకు తిరిగారు , మీరెలాగో చదువుకోవడం లేదు - బుద్ధిగా చదువుకుంటున్న వాళ్ళను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు గాడిదల్లా ఉన్నారు బయటకు వెళ్లి ఆడుకోండి - మీకంటే ఆ పిల్లలే నయం బయట ఆడుకుంటున్నారు .
నువ్వు ఎవర్రా చెప్పడానికి అని మీదకు వచ్చిన వాడి చేతిని వెనక్కు తిప్పాను .....
నొప్పి నొప్పి నొప్పి ....... 
వాడి కేకలకు కాంసెంట్రేట్ తో చదువుతున్న బాయ్స్ & గర్ల్స్ మావైపుకు చూసారు -  ఆఅహ్హ్ ....... గుండెల్లో స్వీటెస్ట్ పెయిన్ ...... , వాడి చేతిని అలాగేపట్టుకుని మరొకచేతిని హృదయంపై వేసుకుని తననే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
అందం - అమాయకత్వం కలగలిసినట్లు నావైపే చూసి నవ్వడం చూసి నా బుజ్జిహృదయం జివ్వుమంది ...... 
నొప్పి నొప్పి నొప్పి ....... బయటకు వెళ్లిపోతాము బయటకు వెళ్లిపోతాము ......
గుడ్ అంటూ తననే అపురూపంగా చూస్తూ వదలగానే ...... అందరూ బయటకు పరుగులుతీశారు .
అందరితోపాటు తానూ ...... థాంక్స్ చెప్పగానే , కలిగిన ఆనందం ...... ఆఅహ్హ్ అంటూ వెనక్కుపడిపోయాను - సపోర్ట్ గా బెంచ్ ఉండటంతో పడిపోలేదు అంతే ....... 
మీరు మీరు చదువుకోండి చదువుకోండి ఎవ్వరూ రాకుండా నేను చూసుకుంటానుగా అంటూ హృదయంపై చేతినివేసుకుని తననే చూస్తూ ఉండిపోయాను అక్కడనుండి కదలలేకపోయాను , తనను చూస్తున్నంతసేపూ ...... హృదయం - మనసు పరవశించిపోతున్నాయి .
మరుక్షణమే టీచర్ వచ్చినట్లు చదువుకుంటున్న సగం మంది లేచి విష్ చెయ్యడంతో తనూ మిగతావారూ లేచి విష్ చేశారు - అంతమందిలో తన వాయిస్ మాత్రం నేరుగా హృదయాన్ని తాకి సంజీవినిలా నా ఆయుష్షును మరికొంతకాలం పెంచేసినట్లు వొళ్ళంతా హాయిగా అనిపిస్తోంది .
టీచర్ : స్టూడెంట్ ...... , ఈ క్లాసులో నిన్నెప్పుడూ చూడనేలేదే , వెళ్లి కూర్చో .......
Sorry sorry సర్ నేను 9th క్లాస్ ....... 
టీచర్ : అయితే ప్రక్క క్లాసులోకి వెళ్లు ......
Yes సర్ అంటూ దీనంగా తనవైపు చూస్తున్నాను .
9th క్లాస్ అయ్యుండి 10th క్లాస్ స్టూడెంట్స్ ను కొట్టావంటే గ్రేట్ అన్నట్లు కళ్ళతోనే తెలియజేస్తోంది . 
పెదాలపై తియ్యదనం - సిగ్గు ....... , ఒక్కొక్క అడుగు బయటకు పడుతున్నకొద్దీ ..... హృదయవేగం పెరుగుతూపోతోంది , వెళ్లకురా అంటూ గోలగొలచేస్తోంది , సర్ ....... మీరు మాథ్స్ బాగా explain చేస్తారని విన్నాను ......
టీచర్ : నేను సైన్స్ టీచర్ ను కదా ...... 
అందరితోపాటు తనూ నవ్వుతోంది .
( మీ టీచింగ్ అంటే సరిపోయేది మాథ్స్ అని చెప్పాలా ? ) yes yes sorry sorry సర్ ...... మీరు సైన్స్ బాగా టీచ్ చేస్తారని విన్నాను సర్ - నేను ఈరోజే జాయిన్ అవుతున్నాను - మీ క్లాస్ వినవచ్చా ? .
టీచర్ : ఈరోజు జాయిన్ అవుతున్నావా ? , షాకింగ్ ...... నా టీచింగ్ బాగుంటుంది అని ఎవరు చెప్పారు అంటూ మురిసిపోతున్నారు .
సర్ బుట్టలో పడినట్లే ...... , బుద్ధిగా చదువుకుంటున్న ఈ స్టూడెంట్స్ సర్ ......
టీచర్ : Are you స్టూడెంట్స్ ? .
మేమా అంటూ ఆశ్చర్యంతో చూస్తోంది .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ........
తను : Yes సర్ అంటూ అందరితోపాటు నవ్వకుంది .
ఆఅహ్హ్ ....... ఆ నవ్వులో ఏదో మ్యాజిక్ ఉన్నట్లు హృదయంపై చేతినివేసుకుని అలా చూస్తుండిపోయాను .
టీచర్ : అయితే వెళ్లి కూర్చో ఇప్పటికే ఆలస్యం అయ్యింది .
థాంక్యూ థాంక్యూ సర్ అంటూ తన చూడచక్కనైన నవ్వులు కనిపించేలా తనకు ఒక యాంగిల్ లో వెనుక కూర్చున్నాను - బోర్డ్ వైపు కాకుండా తననే చూస్తున్నాను - క్షణక్షణానికీ ఆనందం రెట్టింపవుతూనే ఉంది .

Now అటెండెన్స్ అంటూ టీచర్ చెప్పగానే ....... , తన పేరు తెలిసిపోతుందని తియ్యనైన గిలిగింత కలిగింది . 
Yes సర్ yes సర్ ఫస్ట్ అటెండెన్స్ .......
టీచర్ : సైలెన్స్ ......
Sorry sorry సర్ ....... , అంతలోనే నిరాశ ...... పేర్లు పిలవకుండా నెంబర్స్ పిలిచి అటెండెన్స్ వేస్తున్నారు ప్చ్ ప్చ్ .......
నా గుసగుసలు వినిపించినట్లు ....... తను మాత్రమే నావైపుకు తిరిగి ఏమైంది అంటూ కళ్ళతోనే అడిగింది .
ఆఅహ్హ్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు వాలిపోవడం చూసి ఆశ్చర్యంతో నవ్వుతోంది .
ఆ కళ్ళు ఏంటో కానీ నన్ను ఆకర్షించేస్తున్నాయి . 

టీచర్ : నెంబర్ 2 ......
ప్రెజెంట్ సర్ అంటూ తన స్వీట్ వాయిస్ , అంతే ఆ క్షణం నుండీ నెంబర్ 2 నా ఫెవరేట్ అయిపోయింది . 
అటెండెన్స్ తరువాత క్లాస్ స్టార్ట్ అవ్వడంతో తనతోపాటు అందరూ శ్రద్ధగా వింటున్నారు - ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా విరిగిపోయిన బెంచ్ పైననే మోచేతిని ఆనించి తననే కన్నార్పకుండా చూస్తూ హృదయమంతా నింపుకుంటున్నాను - ఎంతసేపు చూసినా తనివితీరడం లేదు .
నా చూపుల ఘాడత తనకు తెలిసినట్లు మధ్యలో రెండుమూడుసార్లు నావైపు చూసినప్పుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ కనురెప్పకొట్టాను . 
అంతలోనే బెల్ మ్రోగడంతో ...... టీచర్ క్లాస్ పూర్తిచేశారు - స్టూడెంట్ స్టూడెంట్ ........ నాక్లాస్ ఇష్టమని చెప్పి ఒక్కక్షణం కూడా బోర్డ్ వైపు చూడనేలేదు .......
అందరితోపాటు తనూ నవ్వుతోంది .
తలదించుకుని నవ్వుకున్నాను .
టీచర్ : జాయిన్ అవ్వాలన్నావు కదా రా ఆఫీస్ రూమ్ వరకూ వదులుతాను కమాన్ కమాన్ ...... నేను మరొక క్లాసుకు వెళ్ళాలి .
తనవైపు చూస్తూనే సర్ తోపాటు బయటకువెళ్ళాను . 
టీచర్ : అదిగో చివరగా ఉన్నదే ఆఫీస్ రూమ్ ముందు వెళ్లి జాయిన్ అవ్వు ...... , ఉన్నది చాలన్నట్లు మరొకడు ఈ స్కూల్ ఎప్పటికి మారెనో ......
అంటే ఇలాంటి మంచి టీచర్స్ కూడా ఉన్నారన్నమాట గుడ్ గుడ్ అంటూ మళ్లీ ఒకసారి క్లాస్ లోపలికి చూసాను - అంతలోనే మళ్లీ చదువులో నిమగ్నమైపోయి ఉండటం చూసి డిస్టర్బ్ చేయకూడదని ఆఫీస్ రూమ్ వైపుకు నడిచాను - ఫస్ట్ పీరియడ్ అయిపోయినా సగం స్టూడెంట్స్ గ్రౌండ్ & కాంపౌండ్ గోడలమీదనే ఉండటం చూస్తూనే ఆఫీస్ రూంలోకివెళ్ళాను .

టీసీ తోపాటు అవసరమైనవాటిని స్కూలుబ్యాగులోనుండి తీసి ఎదురుగా కనిపిస్తున్న మేడం దగ్గరకువెళ్ళాను - మేడం ...... న్యూ జాయినింగ్ .......
" ఇయర్ మధ్యలోనా ...... ? , ఇక్కడున్నవాళ్ళు చాలదన్నట్లు నువ్వుకూడానా ? , హెడ్ మిస్ట్రెస్ సంతకం కావాలి లోపలికివెళ్లు " 
Ok అంటూ డోర్ దగ్గరికివెళ్లి May i come in మేడం అన్నాను .
ఫైల్స్ చూస్తూనే Yes come in అన్నారు .
థాంక్యూ హెడ్ మిస్ట్రెస్ మేడం అంటూ లోపలికివెళ్లి , న్యూ జాయినింగ్ కోసం మీ సంతకం కావాలన్నారు .
న్యూ జాయినింగ్ ఈ మిడ్ ఇయర్ లోనా అంటూ నావైపు చూసి కన్నీళ్లను తుడుచుకున్నారు హెడ్ మిస్ట్రెస్ .........
అంటీలను చూసినంత ఆనందం కలుగుతోంది , తెలుసుకదా ఆటోమేటిక్ గా కుడి చెయ్యి హృదయంపైకి చేరిపోయింది - నా చేతిలో సర్టిఫికెట్స్ అన్నీ నేలపైకి చేరాయి .
హెడ్ మిస్ట్రెస్ : బాబూ బాబూ ....... 
మేడం స్వీట్ వాయిస్ వినిపిస్తోంది కానీ మైండ్ మాత్రం వారినే చూస్తూ ఉండిపోయింది .
హెడ్ మిస్ట్రెస్ : స్టూడెంట్ స్టూడెంట్ అంటూ లేచివచ్చిమరీ కిందపడిన సర్టిఫికెట్స్ తీసుకోవడం చూసి , sorry sorry మేడం అంటూ సడెన్ గా కిందకూర్చునే సమయంలో తలలు గుద్దుకున్నాయి .
స్స్స్ - స్స్స్ ...... అంటూ ఇద్దరమూ నవ్వుకుని రుద్దుకుంటూనే పైకిలేచాము .
మేడం దెబ్బ బహు తియ్యగా అనిపించి నవ్వుతూనే ఉన్నాను . 
మేడం : స్టూడెంట్ నొప్పివేస్తోందా ? స్టూడెంట్ స్టూడెంట్ ...... అంటూ నా కళ్ళ ముందు చేతిని ఊపుతున్నారు , ప్రయోజనం లేక భుజం కదిల్చారు .
స్వీట్ షాక్ కొట్టినట్లు జలదరించాను , sorry sorry మేడం .......
మేడం : ఎవరిని దేనిని చూస్తున్నావు అంతలా ......
ఇంకెవరిని మేడం మిమ్మల్నే ....... అదే అదే మేడం ...... మీ సంతకం కోసం చూస్తున్నాను .
మేడం : మిడ్ ఇయర్ లో జాయిన్ అవుతున్నావు ? .
జాయిన్ కాకూడదా మేడం .......
మేడం : నా ఉద్దేశ్యం అలాకాదు , స్కూల్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వవచ్చు , ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్ కు వస్తే అంత మంచిది కాదా దేశానికి .......
ఆ ఒక్క మాటతో హెడ్ మిస్ట్రెస్ గారిపై అభిప్రాయం - గౌరవం ఎవరెస్టుని చేరింది .
మేడం : ఏ ఊరు - ఏ స్కూల్ నుండి వచ్చావు అని , టీసీ లో ఉంటాయనుకో అంటూ నవ్వుకున్నారు .
ఆఅహ్హ్ ...... హృదయంపై చెయ్యి ......
మేడం : ఏమైంది ? .
నథింగ్ నథింగ్ మేడం ....... 
మేడం : ఆ సంగతులన్నీ బ్రేక్ లో చూస్తాను - ఇప్పటికే సెకండ్ పీరియడ్ స్టార్ట్ అయి ఉంటుంది , క్లాసుకు వెళ్లు జాయినింగ్ సంగతి నేను పూర్తిచేసి అటెండర్ ద్వారా పంపిస్తాను .
వెళ్ళాల్సిందేనా ...... మేడం ? ప్చ్ .......
మేడం పెదాలపై చిరునవ్వు ...... స్స్స్ గట్టిగానే గుద్దుకున్నాము , స్టూడెంట్ ..... టీసీ చూసి మహేష్ ...... నీకూ నొప్పివేస్తోందా ? అని అడిగారు .
స్వీట్ పెయిన్ గురించి ఎప్పుడైనా విన్నారా మేడం ......
మేడం : స్వీట్ పెయిన్ ? .
నాకు అలాంటి పెయిన్ వేస్తోంది అంటూ నవ్వుతూ చెప్పాను .
మేడం : మాటలు బాగానే మాట్లాడుతున్నావు ఇక వెళ్లు - క్లాస్ మిస్ అవుతావు ........
ఎక్కడికి వెళ్ళేది మేడం , ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయని తెలియదా మీకు ......
మేడం : తెలుసు తెలుసు కానీ అవసరం లేదు - నువ్వూ ఇలాంటివి నమ్మకు ......
నమాకాలలో సంతోషమైనవాటిని నమ్మాలి - బాధపెట్టేవాటిని వదిలెయ్యాలి , మీ గుద్దు నాకు సంతోషాన్ని పంచింది ప్లీజ్ ప్లీజ్ మేడం .......
మేడం : అమ్మో ...... మొదటి దెబ్బనే గట్టిగా తగిలింది - పెద్దలు చెప్పినట్లుగా రెండవసారి మరింత గట్టిగా గుద్దుకోవాలి , నావల్ల కాదు .......
మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .......
మేడం : నో అంటే నో క్లాసుకు వెళ్లు ......
నెత్తిపై కాకపోతే అదిగో ఆ బెత్తంతో చేతిపై - ఒంటిపై ...... మీ ఇష్టం ఎక్కడైనా కొట్టండి , మీ దెబ్బ స్వీట్ గా ఉంది .....
మేడం : What ...... ? అంటూ ఆశ్చర్యపోతూనే నవ్వుకుంటున్నారు .
అలా నవ్వకండి మేడం రెండు దెబ్బలు తినాల్సివస్తుంది .
మేడం : నో నో నో ...... వెళ్లు వెళ్లు ...... అంటూ డోర్ వరకూ వదిలారు .
మేడం ....... మీనుండి దెబ్బ తినికానీ ఇంటికి వెళ్లను - ఒక దెబ్బ తినడానికి ఇంతలా ఎప్పుడూ బ్రతిమాలలేదు ......
మేడం : మహేష్ ...... కోపం వచ్చేస్తుంది అంటూ నవ్వుతూనే క్లాసుకు వెళ్ళమని చేతితో చూయించి , నావైపు చూస్తూ చూస్తూనే వెళ్లి కూర్చున్నారు . 
మేడం ....... నా మాటంటే మాటే , మీనుండి ఎలాగైనా దెబ్బ తినే ఇంటికివెళతాను , ఇప్పుడైతే మీరు ఆర్డర్ వేసినట్లుగా క్లాసుకు వెళుతున్నాను .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 18-10-2023, 03:22 PM



Users browsing this thread: 19 Guest(s)