Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహీ - ప్రభూ ....... రాజమాత వేంచేస్తున్నారు అంటూ చామంతి వచ్చింది .
రాజమాత : తల్లీ మహీ ........ 
అమ్మా ...... అంటూ వెళ్లి గుండెలపైకి చేరింది .
రాజమాత : తల్లీ ...... అల్లుడుగారిని భోజన మందిరానికి తీసుకురా - మీ తండ్రిగారు వేచి చూస్తున్నారు , భోజనాల తరువాత పెళ్లికార్యక్రమాలు మొదలవుతాయి , మీ తండ్రిగారు మాటిచ్చినట్లుగా వివాహ సాంప్రదాయంలోని ప్రతీదీ జరిపించబోతున్నారు , నేను వెళుతున్నాను అల్లుడుగారిని తొందరగా తీసుకురా ........
మహి : అలాగే అమ్మా ...... మీరు వెళ్ళండి , పెళ్ళిపనులు మొదలవబోతున్నాయి అంటూ అందమైన సిగ్గుతో నా కౌగిలిలోకి చేరింది , మొదట మిత్రుడికి ఆహారం అందించి వెళదాము . ఉద్యానవనంలోకి వెళ్లి మిత్రుడికి ఇష్టమైన ఆహారాన్ని చేకూర్చి , మిత్రమా ...... ఏమైనా అవసరం అయితే మంజరి ద్వారా కబురు పంపు స్వయంగా నేనే వస్తాను అనిచెప్పి భోజన మందిరానికి తీసుకెళ్లింది .

లోపలికి అడుగుపెట్టగానే అలా చూస్తూ ఉండిపోయాను - మహీ ....... 
మహి : ఇకనుండీ నాదేవుడు భోజనం చేసేది ఇక్కడే అంటూ మహారాజు గారి ప్రక్కన తీసుకెళ్లి కూర్చోబెట్టింది .
మహారాజు : అల్లుడుగారూ ....... మీ భోజనమందిరానికి తగ్గదేనా ? , మన క్షత్రియులలో సహజమే కదా అంటూ ఎన్ని రకాల వంటలు ఉన్నాయో అన్నిరకాల వడ్డించారు - వడ్డించేవారిని ఆపి నా దేవకన్యే స్వయంగా వడ్డించింది .
మాహారాజు - రాజమాత మురిసిపోతున్నారు . 
మహి : నా దేవుడికి నా చేతితో తినిపించాలని ఉంది .
వద్దు వద్దు మహీ ...... మొదటికే మోసం వస్తుంది .
మహి : అందుకే ఆగిపోయాను అంటూ అందమైన నవ్వులతో వడ్డిస్తూనే తిన్నది .
మహారాజా ....... వంటలు బహు రుచిగా ఉన్నాయి .
మహారాజు : కృతజ్ఞుణ్ణి యువరాజా ...... , ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తోంది , క్షత్రియులలో నీ అంతటి వీరుడిని చూడనేలేదు , వివాహం పూర్తయిన వెంటనే పట్టాభిషేకం చేయించి నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను మహారాణీ ........
మహారాణి : మీ ఇష్టం ప్రభూ ........
మహారాజు : క్షత్రియుల గొప్పదనం పెంచారు అల్లుడుగారూ .......
క్షత్రియుడు క్షత్రియుడు అని పదేపదే అంటుండటం విని మహివైపు తప్పుచేస్తున్నట్లుగా చూసాను .
మహి : పట్టాభిషేకం తరువాత క్షత్రియుడివి అయిపోతారు ప్రభూ ....... , నేనున్నానుకదా అంటూ చేతిపై ముద్దుపెట్టింది . 

భోజనాలు పూర్తయ్యాక , అల్లుడుగారూ ...... పెళ్ళిపనులు మొదలుపెట్టాలి పెళ్లిపీఠలపై కూర్చునేంతవరకూ ఒకరినొకరు చూసుకోకూడదు అన్నది సాంప్రదాయం , ఇద్దరినీ వేరువేరు మందిరాలలో పెళ్ళికొడుకు - పెళ్లికూతురిలా ముస్తాబు చెయ్యాలి . అల్లుడుగారి కోరిక ప్రకారం చెలికత్తెలు సిద్ధం చేస్తారు మహి మందిరంలో - నా బంగారుతల్లిని స్వయంగా నేనే పెళ్లికూతురిని చేసి తరిస్తాను వెళదామా తల్లీ .......
మహి : అమ్మా మీరువెళ్లండి వెనుకే వస్తాను . రాజమాత వెళ్లిపోగానే గుండెలపైకి చేరింది - సాయంత్రం వరకూ మిమ్మల్ని చూడకుండా ఉండలేనే .......
నవ్వుకుని నా దేవకన్య బుగ్గలను ప్రేమతో అందుకున్నాను - అంతవరకూ గుర్తుండేలా అంటూ చేతులను బుగ్గలమీదనుండి నా దేవకన్య వయ్యారమైన నడుముపైకి చేర్చి నొక్కేస్తూ నామీదకు లాక్కుని తేనెలూరుతున్న పెదాలపై ఘాటైన ముద్దుపెట్టి ప్రేమను తెలియజేశాను . 
ఆఅహ్హ్హ్ ....... మ్మ్మ్ ...... చాలు ప్రభూ చాలు అంటూ ఆ ముద్దుమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తనను తాను మైమరిచినట్లు రాజమాత వెనుక వెళ్లిపోతోంది .
తియ్యదనంతో నవ్వుకున్నాను .
ప్రభూ ప్రభూ ...... అన్నీ సిద్ధం చేసాము .
సోదరీమణులారా పదండి అంటూ వెనుకే మహి మందిరానికి చేరుకున్నాను .

రోటిని పూజించి రోటిలో పసుపు దంచడంతో పెళ్ళిపనులు మొదలయ్యాయని చంద్రిక సన్తహోశంతో8 పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది . పసుపు వినాయకుడిని తయారుచేసి వివాహ కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ ఎటువంటి విజ్ఞాలూ రాకూడదని పూజించారు మహారాజు - రాజమాత ...... , ఇక ప్రభువులను పెళ్ళికొడుకుగా చెయ్యవచ్చు అక్కడ మహిని కూడా పెళ్లికూతురిని చేసేస్తున్నారు .
సోదరీ ....... ఇంకా ప్రభువు ఏమిటి ఇక మీ సోదరుణ్ణి కదా , సోదరా అని ప్రేమతో పిలవచ్చు కదా .......
చెలికత్తెలందరూ ఉద్వేగానికి లోనయ్యారు . కృతజ్ఞులం ప్రభూ .......
అదిగో మళ్లీ .......
సంతోషం సోదరా అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా చేతులను అందుకుని ఉద్యానవనంలోని పెళ్ళిపందిరి కింద బుజ్జి తోడు పెళ్లికూతురుతోపాటు  కూర్చోబెట్టి పసుపు నీళ్లతో మొదలెట్టి పెళ్ళికొడుకును చేశారు . ఎదురుగా పెళ్ళిపెద్దలుగా మిత్రుడు - మంజరి తెగ ఆనందిస్తున్నారు .
నాకోసం అప్పటికప్పుడు సిద్ధం చేయించిన వస్త్రాలను అందించడంతో లోపలికివెళ్లి వేసుకున్నాను - పెళ్ళికొడుకులా అందంగా ముస్తాబు చేశారు .

అక్కడ మహికి మంగళ స్నానం చేయించి పట్టువస్త్రాలతో పెళ్లికూతురిలా మార్చి , మహి చేతులమీదుగా గౌరీ పూజ చూయిస్తున్నారు .
నన్నే ప్రాణంలా తలుచుకుంటూ పూజ పూర్తి చేసింది .
అక్కడ - ఇక్కడ పండితులు సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలన్నీ పూర్తిచేసేటప్పటికి పెళ్లి సమయం ఆసన్నమయ్యింది .
పండితులు : రాకుమారా ...... ఇదిగో ఈ పెళ్లివస్త్రాలను ధరించి అలంకరించుకుని వస్తే మేళతాళాల మధ్యన పెళ్ళిమండపానికి తీసుకెళతాము .
ఇదేమాటను మహికి చెప్పగానే , నన్ను చూడబోతున్నానన్న ఆనందంలో రాజమాత బుగ్గపై సంతోషంతో ముద్దుపెట్టి , రాజమాత మందిరంలోకి వెళ్లి పెళ్ళిచీరను కట్టుకుంది . 
తల్లీ ఇలా కూర్చో అంటూ అద్దం ముందు కూర్చోబెట్టి వజ్రవైఢూర్యాలు పొడగబడిన ఆభరణాలతో నిలువెల్లా అలంకరించి మురిసిపోతున్నారు .
ఇక్కడ సోదరీమణులు ....... నన్ను పెళ్ళికొడుకులా అలంకరించి తలపాగా ఉంచి , మహి చూడగానే మీ మీదకు చేరుతుందేమో సోదరా ......
సోదరీ ...... మహీ ఎలా ఉంటుందో ? .
అక్కడ అందంగా అలంకరించిన మహిని చూసుకుని ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు రాజమాత ........
మహి : చిరునవ్వులు చిందిస్తూ ....... అమ్మా తండ్రిగారిని పిలవండి అనిచెప్పి , ఇద్దరి పాదాలకు నమస్కరించింది .
సంతోషం తల్లీ ....... అంటూ లేపి గుండెలపైకి తీసుకుని మురిసిపోయారు .

ప్రభూ ...... ముహూర్త సమయం ఆసన్నమవుతోంది - మేళతాళాల మధ్యన సంబరంలా కాబోవు మహారాజుగారిని పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళుతున్నారు .
మహామంత్రిగారూ ...... కొద్దిపాటి సమయంలో అన్నీ అనుకున్నట్లు జరిపించిన మీ ప్రతిభకు ధన్యవాదాలు .......
మహామంత్రి : కృతజ్ఞుణ్ణి ప్రభూ .......
మహి : తండ్రిగారూ ...... తొందరగా తీసుకెళ్లండి .
మహారాజు : అంతటి వీరుడిని అల్లుడుగా చేసుకోవడం అంటే నాకూ ఆత్రంగానే ఉంది తల్లీ ...... అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు . నిన్ను బుట్టలో కూర్చోబెట్టుకుని ఎత్తుకునివెళ్లడానికి మీ మావయ్యలు సిద్ధంగా ఉన్నారులే ....... 
సంతోషం తండ్రిగారూ అంటూ సిగ్గుపడింది .

మేళతాళాల మధ్యన సోదరీమణులు ...... ప్రధాన ఉద్యానవనంలోని అమ్మవారి దేవాలయం ఎదురుగా సిద్ధం చేసిన పెళ్ళిమండపానికి తీసుకెళ్లారు , నాతోపాటు మిత్రుడు - మంజరి వచ్చారు .
కొద్ది గడియాల్లోనే అంతటి అద్భుతమైన కళ్యాణమండపాన్ని సిద్ధం చేసిన కళాకారులకు ధన్యవాదాలు తెలుపుకోవాల్సినదే ....... , విద్యుత్ దీపాలు - కాగడాల వెలుగులలో పూలతో అలంకరించిన పెళ్ళిమండపాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడంలేదు .......
మహారాజు వారు స్వయంగా వచ్చి , అప్పటికే విచ్చేసిన సామంతారాజులకు వీరాధివీరుడు నా అల్లుడుగారు అంటూ పరిచయం చేస్తూ వెళ్లి పెళ్ళిమండపంలో కూర్చోబెట్టారు .
రాజ్య ప్రజలంతా మహేశ్వరుడు మహేశ్వరుడు అంటూ జయజయనాదాలు చేస్తున్నారు .
అప్పుడే బుట్టలో కూర్చుని వస్తున్న మహి విని అంతులేని ఆనందంతో పరవశించిపోతోంది . నా ఎదురుగా పెళ్లిపీఠలపై కూర్చోబెట్టగానే మాఇద్దరి మధ్యన ఉన్న పరదా చాటున తొంగితొంగిచూస్తోంది .

పండితులు ...... మాఇద్దరితో పూజ జరిపించి , పరదాను తొలగించారు .
ఎదురుగా పట్టువస్త్రాలు - నిలువెల్లా ఆభరణాలతో పెళ్లికూతురిగా నా దేవకన్యను హృదయంపై చేతినివేసుకుని అలా కన్నార్పకుండా ప్రేమతో చూస్తుండిపోయాను .
నా చూపులకు మహి సిగ్గుపడటం చూసి హృదయం పులకించిపోతోంది .
నన్నుకూడా అందంగా ముస్తాబు చేసినందుకుగానూ ...... చామంతిని పిలిచి బుగ్గపై ముద్దుపెట్టడం చూసి ఆనందించాను - నా భుజంపైనే ఉన్న మంజరిని అందమైనకోపంతో ఒసేయ్ మంజరీ ...... మన దేవుడి దగ్గరే ఉండిపోయావు కదూ ..... ఒక్కసారైనా నాదగ్గరికి రానేలేదు .
నవ్వుకుని , మంజరీ ...... వెళ్లు .
మంజరి వెళ్లి మహి భుజంపై వాలి , మహి బుగ్గపై ముద్దుపెట్టింది , మహీ ...... నాకే అసూయ వేసేంత అందంగా ఉన్నావు తెలుసా ? , పాపం మన దేవుడు ఎంత నియంత్రించుకుంటున్నారో ......
మహి చిలిపిదనంతో నవ్వుతోంది .

పండితుల మంత్రాలు - మేళతాళాలు - పూలవర్షం అన్నింటినీ మరిచిపోయి నా దేవకన్య సౌందర్యం మైకంలో పడిపోయినట్లు ,పండితులు చెయ్యమన్నదల్లా తెలియకుండానే చేస్తూ పోతున్నాను , మహి అందం - ఆనందం - సిగ్గు ...... నన్ను ఎల్లలులేని సంతోషాలకు చేర్చింది . 
మంత్రాలు పూర్తవడం - ముహూర్త సమయం దగ్గరపడటంతో భజంత్రీలు భజంత్రీలు అంటూ పండితులవారు నాచేతిని తాళిని అందివ్వడంతో నా దేవకన్య మైకం నుండి బయటపడ్డాను .
తాళి అందుకుని లేచి అతిథులందరికీ మరియు మిత్రుడికి చూయించి నా దేవకన్య నుదుటిపై మంజరికి ప్రేమతో ముద్దుపెట్టి మూడుముళ్లు వేసి మెడపై చిన్నగా గిల్లి కూర్చున్నాను .
మాపై కురుస్తున్న అక్షింతలు - పూలవర్షంలో నా దేవకన్య స్స్స్ ..... అంటూ కొంటె కోపంతో చూస్తుండటం చూసి భలే ముచ్చటేసింది . 
తరువాత హోమం చుట్టూ ఏడడుగులు - పాలపాత్రలో ఉంగరపు సయ్యాట - బంతి ఆట - పెద్దల ఆశీర్వాదం - భోజనాలు ...... ఇలా సాంప్రదాయం ప్రకారం వివాహం అంగరంగవైభవంతో పూర్తయ్యింది , ప్రతీ ఆచారానికి మహి పెదాలపై అంతకంతకూ ఆనందం పెరుగుతూనే ఉంది - ఒక అమ్మాయికి తను కోరుకున్న వ్యక్తి వరుడుగా లభిస్తే కలిగే ఆనందాన్నే మహి అనుభూతి చెందుతోంది .

మహారాజు - రాజమాత మరియు పండితుల ఆశీర్వాదం తీసుకుని , మిత్రుడి దగ్గరకువెల్లి సంతోషాలను పంచుకున్నాము .
జంటగా చేతులను పెనవేసుకుని మంజరితోపాటు దేవాలయానికి వెళ్లి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము .
నాకళ్ళల్లో ఒక్కసారిగా చెమ్మ .......
మహి : ప్రభూ ....... గురువుగారి ఆశీర్వాదం తీసుకోలేదనే కదా అంటూ గుండెలపైకి చేరింది - ప్రభూ ....... తెల్లవారగానే గురువుగారి దగ్గరకు వెళ్లే ఏర్పాట్లుచేయిస్తాను - ఇద్దరమూ వెళ్లి ఆశీర్వాదం తీసుకుందాము .
సంతోషంతో మహి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .

బయటకువచ్చిచూస్తే అతిథులందరూ ...... భోజనాలు పూర్తిచేసుకుని రాజభవనంలో ఏర్పాటుచేసిన విశ్రాంతి భవనాలకు చేరుకుంటున్నారు . చివరగా మహారాజు మహామంత్రి చెలికత్తెలతో కలిసి భోజనాలకు కూర్చున్నాను . 
అందరి సమక్షంలో సంతోషాల మధ్యన ఒకరికొకరం ప్రేమతో తినిపించుకుని ఆనందించాము . 
భోజనాల తరువాత మహారాజువారు ...... పండితులతో మాట్లాడటం చాటుగా విన్నట్లు చామంతి సిగ్గుపడుతూ వచ్చి , మహీ మహీ ...... మరికొద్దిసేపట్లో శోభనానికి మంచి ముహూర్తం ఉన్నట్లు ముచ్చటిస్తున్నారు .
మహి సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది .
అంతలో రాజమాత వచ్చి తల్లీ ....... తెలిసిపోయినట్లుంది ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు - అల్లుడుగారూ ...... ఒక ఘడియలో శోభనపు వస్త్రాలలో నీ శ్రీమతిని నీముందుంచుతాను .
మహి వదల్లేక వదల్లేక వదిలి వెనక్కు తిరిగితిరిగి చూసి సిగ్గుపడుతూనే వెళ్ళింది .
చామంతి : సోదరా ...... మీ మందిరంలో వస్త్రాలు ఉంచాము రండి అంటూ పిలుచుకునివెళ్లి , తలుపులువేసుకోండి మహి వచ్చేస్తుంది అంటూ లోపలికివదిలి తలుపులు వేసుకున్నారు .
మల్లెపూల సువాసన గుప్పుమనడంతో వెనక్కు తిరిగిచూస్తే ఎప్పుడు సిద్ధం చేశారో గదిమొత్తం పూలతో - క్రొవ్వొత్తులతో శోభనపు గదిలా అలంకరించబడింది , ఇక పాన్పు అయితే శృంగారభరితం ....... ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది . 
మంజరి : అమ్మో ...... ఇక నేను ఇక్కడా ఉండనేకూడదు , ఉద్యానవనంలోని మన మిత్రుడి దగ్గరకువెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అనిచెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది .
నవ్వుకుని బల్లపై ఉన్న తెల్లని వస్త్రాలను అందుకుని స్నానపు గదిలోకివెళ్లి స్నానం చేసి వస్త్రాలు ధరించి పూలతో అలంకరించిన పాన్పుపై కూర్చుని నా దేవకన్యకోసం ఆశతో ఎదురుచూస్తున్నాను ...........

కొద్దిసేపటికే అంటే శోభన ముహూర్తానికి ముందే ........ , ద్వారాన్ని గట్టిగా బాదుతున్న చప్పుళ్ళు వినిపించాయి . 
ఆ చప్పుళ్ళు వింటుంటేనే ఏదో జరగరానిది జరగబోతోందని మనసులో సంకోచంతో వెళ్లి ద్వారం తెరిచాను . ఎదురుగా మహారాజు ....... 
మహారాజా ........
మహారాజు : కళ్ళల్లో కోపాగ్నితో ...... , నువ్వు క్షత్రియుడివేనా ? అని ముక్కుసూటిగా అడిగారు .
ప్రభూ ...... 
మహారాజు : మహేశ్వరా ..... నిజం చెప్పు , నువ్వు క్షత్రియుడివా కాదా ? .
ప్రభూ ....... 
తడబడుతుంటే ఇంకా అడుగుతారేంటి మహారాజా అంటూ హిడుంభి యువరాజు నాముందుకువచ్చాడు .
నానుండి మాట రాలేదు ....... అలా చూస్తుండిపోయాను ..........
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2022, 10:30 AM



Users browsing this thread: 57 Guest(s)