Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ
21


అలా రక్తపు మడుగులొంచి నడుచుకుంటూ ఇంటికి వస్తుంటే చెరువు గట్టు కనిపించి అక్కడికి వెళ్లి నీళ్లలో మునిగాను, చీకటిలో వెన్నల వెలుతురు తప్ప ఇంకెవ్వరు లేరు.

నీళ్లలో పడుకుని కళ్ళు మూసుకున్నాను తెల్లారే వరకు మెలుకువ రాలేదు పక్షుల అరుపులకి మేలుకవా వచ్చి లేచాను తెల్లవారింది కానీ ఇంకా చీకటి పోలేదు కళ్ళు తెరిచి పడుకొనే నా ఒంటి మీద రక్తపు మరకలు తుడుచుకున్నాను.

ఎవరో చెరువు దాటి అటు వైపు వెళుతున్నట్టనిపించి లేచి చూసాను, కళ్ళు తుడుచుకుని చూసాను ఆ ఆకారం పద్మదే తన వెనకాలే వెళ్ళాను, అటు ఇటు చూస్తూ వెళ్లి బస్సు స్టాప్ దెగ్గర చెట్టు చాటున నిల్చుంది.

టైం చూద్దామని జేబులోంచి ఫోన్ తీసాను, రాత్రంతా నీళ్లలో ఉండిపోవడం వల్ల పాడయినట్టుంది, నా పక్క నుంచి పక్క ఊరికి వెళ్లే వాళ్లు మొదటి బస్సుకు టైం అవుతుందని మాట్లాడుకోగా విన్నాను.

వెళ్లి బస్సు వచ్చే దెగ్గర నిల్చున్నాను ఒక ఐదు నిమిషాలకి బస్సు హారన్ వినిపించింది. బస్సు రాగానే చెట్టు చాటు నుండి బైటికి వచ్చి నన్ను చూసి ఆగిపోయింది.

వాసు : ఆగిపోయావే వెళ్ళిపో..

పద్మ : బావా...

వాసు : వెళ్ళు ఇది పోతే మళ్ళీ ఏడింటికే  బస్సు వచ్చేది, రెండు గంటలు మళ్ళీ చెట్టెనక దాక్కోవాలి. నన్ను వదిలేసి నువ్వు ఒక్కదానివే బతికేద్దామని నిర్ణయించేసుకున్నావు మొత్తానికి, నా పద్మ చాలా పెద్దదైపోయింది..

ఏడ్చుకుంటూ నా దెగ్గరికి వచ్చి నన్ను వాటేసుకుంది, కోపంలో అలానే నిల్చుండిపోయాను.. బస్సు వెళ్ళిపోయింది.

పద్మ : బావా.. అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను.. నువ్వలా నా వెనక ఆశగా తిరుగుతుంటే నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదు, చిన్నప్పటి నుంచి నువ్వు తప్ప వేరే ధ్యాస లేదు నాకు... నీకు తెలుసు కదా... ఎందుకో నీకు చెప్పాక మళ్ళీ నీ మొహం చూడాలంటే ఎలాగో అనిపించి ఇలా వచ్చేసాను కానీ నువ్వు కనపడగానే అన్నీ పోయాయి.. నన్ను పట్టుకో.. నన్ను పట్టుకో బావా.. అని ఏడ్చేసింది.

పద్మని వాటేసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాను, నేను తన వెనక తిరుగుతుంటే నా నుంచి దూరం పారిపోవడం గుర్తొచ్చి తన బాధ గుర్తొచ్చి ఇంకా ఏడుపు వచ్చేసింది.. పద్మని బలవంతంగా ఆ నీచులు అనుభవిస్తుంటే ఎలా తట్టుకుందో... అది గుర్తుకు రాగానే పద్మ వాళ్ల అమ్మ గుర్తొచ్చింది అన్నిటికి కారణం అదే దాన్ని వదిలేసి వచ్చాను.. కోపం ఇంకా పెరిగిపోయింది నాకు..

పద్మ నా ఆవేశం తాలుకు ఊపిరి గమనించిందేమో ఒక్కసారిగా నా పెదాలు అందుకుంది అలా ఎంత సేపు ముద్దు పెట్టుకున్నామో తెలీదు కానీ ఆ ముద్దుల్లో ఉన్నంత ప్రేమ ఎన్ని జన్మల తపస్సు చేసినా దొరకదు అనిపించింది నిజంగానే నేను అదృష్టవంతుడిని పద్మ నా జీవితంలో ఉండడం.

ఇంతలోనే నా వెనకాల రమ అత్త, అన్నయ్య, అమ్మ వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని చూసి హమ్మయ్య అనుకున్నారు... ఆ చప్పుడు విని మా ఇద్దరి పెదాలు దూరమయ్యాయి.

కవిత : పద్మా అలా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోవచ్చా, నువ్వు ఒక్క నిమిషం కనపడకపోతే చూడు ఎంతలా కంగారు పడ్డామో.. అని పద్మని కౌగిలించుకుంది.

అమ్మ కోపంగా పద్మని చూడటం గమనించాను తన చేతిలో ఏదో చీటీ ఉంది, నాకు అర్ధమైంది.. పద్మ ఏడుస్తూ అమ్మ ముందుకి వెళ్లి నిల్చుంది మౌనంగా.. చాచి పెట్టి కొట్టింది చెంప మీద... అమ్మ కళ్ళలో నీళ్లు... పద్మ అమ్మని హత్తుకుపోయింది ఇద్దరు వాటేసుకుని ఏడ్చుకున్నారు.

నేను అటు వైపు నడుస్తుండడం చూసి ప్రణీత అడిగింది "ఎక్కడికి అన్నయ్య?" అని.

అమ్మ పద్మతో పాటు అందరూ నా వైపు చూసారు.

వాసు : ఇప్పుడే వస్తాను.

అన్నయ్య : రవళి కోసమా?

వాసు : లేదు..

రమ : నువ్వెళ్ళినా అక్కడ ఎవ్వరు లేరు వాసు.. ఆ వరదరాజులు గాడి భార్య తన తమ్ముడితో పుట్టింటికి పంపించేసాడు ఇక ఆ రవళి బతికి లేదు.

వాసు : ఏమైంది?

రమ : మీ అన్న చంపేసాడు.

వాసు : (ఆశ్చర్యంగా) అన్నయ్యా... అంటూ తన వైపు చూసాను.

అర్జున్ : హా... మన పద్మ కి అన్యాయం చేసిన ఏ ఒక్కరు బతికి ఉండటం నాకు ఇష్టం లేదు.. అని పద్మ దెగ్గరికి వెళ్లి తన నుదిటి మీద ముద్దు ఇచ్చి నా దాకా నడిపించుకుంటూ వచ్చి తన చెయ్యి నా చేతిలో పెట్టాడు.. అమ్మతో సహా అందరూ ముందుకు నడుస్తుంటే వాళ్ళతో పాటే పద్మ చెయ్యందుకుని ఇంటికి నడుస్తున్నాను.

వాసు : పద్మా చూసావా.. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే బాధ పడేది నేను ఒక్కడినే కాదు.. చూడు అమ్మ ఎలా ఏడ్చేసిందో.. ఎప్పుడు సౌమ్యంగా ఉండే పెద్ద బావ ఒకరిని చంపేసాడు.. కవితక్క వాళ్ల అన్నా నాన్న చనిపోయారన్న బాధకంటే నువ్వు ఇంట్లోనుంచి వచ్చేసావని బాధ పడుతుంది.. ఇంకెప్పుడు మమ్మల్ని ఇలా ఏడిపించకు.

పద్మ ఇంకేం మాట్లాడలేదు.. ఇంటికి వెళ్ళిపోయాము అందరం.. ఆడవాళ్లందరూ టిఫిన్ చెయ్యడానికి వెళ్లిపోయారు పద్మని నా రూమ్ లో ఒళ్ళో పడుకోబెట్టుకుని తన కురులు సర్దుతూ నిద్ర పోయేవరకు జో కొట్టి.. తను పడుకోగానే చిన్నగా తన కింద దిండు పెట్టి వదిన దెగ్గరికి వెళ్ళాను.

వదిన ఒక్కటే కిచెన్ లో పని చేసుకుంటుంది వెళ్లి పక్కనే నిల్చున్నాను, నన్ను చూసి ఏంటి అని సైగ చేసింది..

వాసు : అదీ..

కవిత : ఏం చెప్పకు.. నాకు నీ మీద కోపం లేదు.

వాసు : అది కాదు వదినా, ఎంతకాదన్నా నీకు మీ నాన్న అన్నయ్య... వాళ్ళని చంపింది నేనే.. ఇక్కడ నువ్వు రోజు నా మొహం చూడక తప్పదు..

కవిత : అందుకని..

వాసు : ఒక వేళ ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే.. నువ్వు అన్నయ్యా...

కవిత : (కోపంగా) వాసు.. అలా మాట్లాడకు.. నిన్న నువ్వు కోపంగా వెళ్ళినప్పుడే నాకు తెలుసు.. నిజమే కొంత బాధ పడ్డాను కానీ చేసిన పాపం పండక తప్పదు, ఎంతో మంది ఉసురు పోసుకున్నారు. ఇక ఇన్నేళ్లు దూరంగా ఉన్న అన్నతమ్ములని విడతీస్తానని ఎలా అనుకున్నావ్.

వెళ్ళు ఎక్కువగా అలోచించి బాధపడకు, జరిగేందేదో జరిగిపోయింది ఇక నుంచి అందరం ఆనందంగా ఉండటానికి ప్రయత్నిద్దాం.

అక్కడనుంచి బైటికి వచ్చాను అమ్మ కనిపించింది మొత్తం విన్నట్టుంది.. నేరుగా నా రూమ్ కెళ్ళి డోర్ పెట్టేసి పద్మని కౌగిలించుకుని పడుకున్నాను... వాళ్ల అమ్మని చంపినందుకు ఒక్క మాట కాదు కనీసం తన చూపులో కూడా తేడా తెలియనివ్వలేదు.. అదీ నా పద్మ.. వెచ్చగా కళ్ళు మూసుకున్నాను.
Like Reply


Messages In This Thread
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:10 PM
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:11 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 05:35 PM
RE: సీతా.....! రామ్ - by Alpha@84 - 05-05-2022, 05:49 PM
RE: సీతా.....! రామ్ - by svsramu - 05-05-2022, 06:08 PM
RE: సీతా.....! రామ్ - by sailuhot - 05-05-2022, 07:00 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 07:27 PM
RE: సీతా.....! రామ్ - by naga8121 - 05-05-2022, 07:50 PM
RE: సీతా.....! రామ్ - by Lraju - 05-05-2022, 08:32 PM
RE: సీతా.....! రామ్ - by Uday - 05-05-2022, 09:20 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 09:23 PM
RE: సీతా.....! రామ్ - by vg786 - 05-05-2022, 10:03 PM
RE: సీతా.....! రామ్ - by kummun - 05-05-2022, 10:08 PM
RE: సీతా.....! రామ్ - by Zen69 - 05-05-2022, 10:47 PM
RE: సీతా.....! రామ్ - by BR0304 - 05-05-2022, 10:54 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 11:27 PM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:42 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:34 AM
RE: రాణి.....! రామ్ - by Akmar - 06-05-2022, 06:43 AM
RE: రాణి.....! రామ్ - by Thorlove - 06-05-2022, 07:34 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 09:37 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 06-05-2022, 09:59 AM
RE: రాణి.....! రామ్ - by solomon - 06-05-2022, 10:39 AM
RE: రాణి.....! రామ్ - by utkrusta - 06-05-2022, 04:53 PM
RE: రాణి.....! రామ్ - by Dhamodar - 06-05-2022, 07:10 PM
RE: రాణి.....! రామ్ - by mahi - 07-05-2022, 03:07 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 10-05-2022, 11:44 AM
RE: వాసు గాడి వీర గాధ - by Takulsajal - 08-07-2022, 11:01 AM



Users browsing this thread: 1 Guest(s)