Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మంజరి చెప్పినట్లుగా ఎవ్వరికీ అనుమానం కలగకుండా నిటారుగా కూర్చుని వీధులలోని ఏర్పాట్లను తిలకిస్తూ , సైనికుల పాహారాలో వెళుతున్న యువరాజుల వెనుకే రాజ్యపు మహాద్వారాన్ని చేరుకున్నాను .
అక్కడి పిలుపులను బట్టి బయట రాజ్య సైన్యాధ్యక్షుడు మరియు మంత్రిగారు - ద్వారంలోపల ఏకంగా ప్రభువుల వారే యువరాజులను రాచమర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు .
అందరూ అయిపోవడంతో చివరన కాస్త భింకంతోనే మహాద్వారం దగ్గరికి వెళ్ళాను.
సైన్యాధ్యక్షుడు : మంత్రిగారూ ...... , హిడుంభి రాజ్యపు యువరాజు రానే వచ్చారు - ఒంటరిగా వచ్చారు - వీరి దగ్గర రాజముద్ర కూడా ఉంది .
మంత్రిగారు : యువరాజా ...... మిమ్మల్ని ఆపినందుకు క్షమాపణలు - మా సామ్రాజ్యపటంలో మీ రాజ్యం ఎక్కడ ఉందో తెలియరాలేదు .

ఇలాకాదు నటనను ఎక్కుపెట్టాల్సిందే , స్వయంవరానికి ఆహ్వానించి ఇలా అవమానిస్తారా ? , దక్షిణ భారతదేశంలోనే అత్యంత ధనిక రాజ్య యువరాజునే ఆపుతారా ఎంత ఎంత ....... ధైర్యం ......
మంత్రిగారు : యువరాజా యువరాజా ...... శాంతించండి శాంతించండి , ఒంటరిగా వచ్చినందువలన అనుమానించాల్సి వచ్చింది .
అందరి యువరాజుల్లా సైనికుల రక్షణతో రావాల్సిన అవసరం నాకులేదు - నేనే వారికి రక్ష ........
మంత్రిగారు : యువరాజా ...... ప్రభువుల చెంతకు తీసుకునివెళతాను రండి .
ప్రభువు : మంత్రిగారూ ...... ఏమి జరిగింది ? .
మంత్రిగారు : ప్రభూ ...... హిడుంభి రాజ్యపు యువరాజు , రాజ ముద్రిక కూడా ఉంది ప్రభూ .......
ప్రభువు : రాజముద్రిక ఉంటే రాజ్యం ఉన్నట్లే ....... , స్వయంవర సమయం ఆసన్నమయ్యింది , యువరాజులను వేచి ఉండేలా చెయ్యడం భావ్యం కాదు , హిడుంభి యువరాజా ...... వీరుచేసిన అపరాధానికి నేను క్షమాపణలు చెబుతున్నాను , మీకు చంద్ర రాజ్యం తరుపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము రండి స్వయంవర పోటీలకు మేమే స్వయంగా పిలుచుకునివెళతాము .
మిత్రుడిని ...... సైనికులు తీసుకెళ్లారు .
మిత్రమా .......
ప్రభువు : యువరాజా ...... మీ అశ్వానికి ఏలోటూ లేకుండా చూసుకుంటారు .
సంతోషం మహాప్రభూ ....... , మీ రాజ్యం గొప్పతనం - మీ రాకుమారి అందచందాలు విని ఉత్సాహంతో వచ్చాము .
ప్రభువు : మహా సంతోషం యువరాజా ...... , ముందు మా ఆతిధ్యం స్వీకరించండి అంటూ ఘనంగా ఏర్పాటుచేసిన విందుకు తీసుకెళ్లారు , అప్పటికే యువరాజులంతా ఫలహారాలు స్వీకరిస్తున్నారు .
రాజ మందిరాలు అంటే ఇంత మహాద్భుతంగా ఉంటాయా ఎటుచూసినా అత్యద్భుతమైన అలంకరణలు అంటూ పెదాలపై చిరునవ్వుతో చుట్టూ చూస్తున్నాను - చినప్పటినుండీ ఈ ప్రదేశమంతా తిరుగుతూ ఆడుకుంటూ పెరిగి ఉంటుంది నా దేవకన్య అంటూ ఆనందిస్తున్నాను .

ఎదురుగా విందు స్వీకరిస్తున్న మా గురుకులానికి మూడువైపులా గల రాజ్యాల రాజకుమారులు - వెంటనే స్థంభం వెనుక దాక్కున్నాను , రేయ్ ...... ఇప్పుడు నువ్వు గురుకుల మహేష్ కాదు యువరాజు మహేష్ - మారువేషంలోనూ ఉన్నావుకదా ఇంకెందుకు భయం , ఒకసారి వాళ్ళ దగ్గరకే వెళ్లి ప్రయత్నిద్దాము అంటూ పండు అందుకుని తింటూ దగ్గరికివెళ్ళాను .
ప్రతీ యువరాజు ...... వాళ్ళ వాళ్ళ సైన్యాధ్యక్షులతో ఎలాగైనా స్వయంవరం గెలవాలి - అతిలోకసుందరిని చేబట్టాలి అంటూ పట్టపగలే కలలు కంటుండటం విని నవ్వు వస్తోంది , అందులో మా రాజకుమారులేమీ తీసిపోలేదు .
రాజకుమారులు : గురుకులంలో ఎలాగో మన ప్రభావాన్ని చూయించలేకపోయాము - ఎలాగైనా ఈ విశ్వసుందరిని మనలో ఎవరో ఒకరం గెలుచుకోవాలి , ఆ మహేష్ తప్ప మనతో సమానమైన వీరుడు ఎవ్వడూ ఉండడు - గురువుగారు కష్టపెట్టినా యుద్ధవిద్యల్లో నైపుణ్యాన్ని నేర్పించారు . 
మా రాజకుమారులు నిద్రలోనూ నా గురించే ఆలోచిస్తారు అన్నమాట - గురువుగారూ ...... మీకు పాదాభివందనం .

అంతలో ప్రభువు మాటలు వినిపించాయి .......
రాజకుమారులారా ....... నా ఆహ్వానాన్ని మన్నించి ఇంతదూరం స్వయమవరానికి విచ్చేసినందుకు చంద్ర సామ్రాజ్యం తరుపున స్వాగతం సుస్వాగతం ....... , మా స్వాగతం - ఆతిధ్యం నచ్చిందనుకుంటాను .......
అందరూ సంతోషంతో కేకలువేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు .
ప్రభువు : కృతజ్ఞుణ్ణి , ఈ స్వయంవరం కేవలం యువరాణీ కోసం మాత్రమే కాదు యువరాణిని గెలుపొందినవారు నా తదుపరి ఈ రాజ్యాన్ని కూడా చేజిక్కించుకోబోతున్నారు .
సంతోషపు కేకలు ఎల్లలు దాటుతున్నాయి .
ప్రభువు : సంతోషం సంతోషం ...... , మీరు ఇక్కడ ఉన్నంతసేపూ మీ సేవలో తరిస్తాము , మీ సంతోషమే మా సంతోషం , స్వయంవరం అన్నది మన క్షత్రియ ఆచారాలలో ఒకటి కాబట్టి గెలుపోటములను ఆనందంతో స్వీకరించాలని కోరుచున్నాను , స్వయంవరం తరువాత కూడా మీరు మాకు ఆత్మీయులే ఎన్నిరోజులైనా మీసేవలో పునీతం అవుతాము .
చాలా బాగా చెప్పారు ప్రభూ ....... , మీ ఆతిధ్యం ఇప్పుడు మీ మాటలు ...... మమ్మల్ని చాలా సంతోషపెట్టాయి .
ప్రభువు : చాలా సంతోషం యువరాజా ...... , ప్రక్కనున్న క్రీడా మైదానంలో కాసేపట్లో స్వయంవర పోటీలు జరపబడుతాయి - పోటీలుకాదు ఒకేఒక పోటీ , అందరూ హాజరుకావాల్సినదిగా మనవి ........ , ఒకరు గొప్ప ఒకరు చిన్న అని మాకు తేడాలు లేవు - తమరు వచ్చిన సమయాన్ని బట్టి ఒక్కొక్కరినీ పోటీలో పాల్గొనే అవకాశం ఇస్తాము , చివరన వచ్చిన యువరాజుకు చివరగా అవకాశం .......
ఒకవైపు వరుసగా ద్వారాలు తెరుచుకున్నాయి - బయటకు వెళ్ళిచూస్తే చిన్న క్రీడా మైదానం చుట్టూ యువరాజులు తమ వంతు వచ్చేన్తవరకూ విలాసవంతంగా కూర్చువడానికి అన్నీ ఏర్పాట్లూ చేశారు , ఎదురుగా కాస్త ఎత్తులో ప్రభువు వచ్చి కూర్చుని అందరినీ ఆశీనులు కమ్మని ఆహ్వానించారు - ప్రక్కనే పరదా వెనుక నా దేవకన్య ఉన్నదని నా మనసుకు తెలిసిపోయి అటువైపే ప్రేమతో చూస్తున్నాను .
ఆశ్చర్యం ....... మారువేషంలో ఉన్న నన్ను కనిపెట్టేసినట్లు పరదా చాటునవచ్చి గాలిలో ముద్దు విసరడం చూసి తెగ ఆనందపడిపోతున్నాను .

పోటీ ప్రారంభం అన్నట్లు చుట్టూ శబ్దాలు వినిపిస్తున్నాయి - యువరాజులందరూ వెళ్లి విలాసవంతమైన సింహాసనాల్లో కూర్చుంటున్నారు .
నా అదృష్టం నా దేవకన్యకు ఎదురుగా ఉన్న సింహాసనం ఖాళీగా ఉండటంతో వెళ్లి కూర్చుని అటువైపే చూస్తున్నాను , అంతటి రాజ్యపు శబ్దాలు మరియు చుట్టూ కోలాహలం మధ్యన కూడా నా దేవకన్య నవ్వులు నా మనసుకు తెలిసి హృదయంపై చేతినివేసుకుని అనుభూతి చెందుతున్నాను - అదిచూసినట్లు నవ్వుల ఘాడత అంతకంతకూ పెరుగుతూనే ఉంది .

అంతలో పది పదిహేను మంది దిట్టమైన సైనికులు చక్రాల బండిని అతికష్టంగా ఒకవైపు లాగుతూ మరొకవైపు తోసుకుంటూ వచ్చి , క్రీడా మైదానం మధ్యలో ఏర్పాటుచేసిన నీటి అలంకరణ ప్రక్కనే ఉంచి నీరసంగా వెళ్లిపోయారు .
ఏంటి ప్రభూ ....... ఇంత చిన్న బండిని ఇంతమంది సైనికులు లాక్కొచ్చారు అంటే మీ రాజ్యంలో సైనికులు ఇంత బలహీనమా అంటూ యువరాజులంతా నవ్వుకుంటున్నారు .
నాకైతే అలా అనిపించలేదు - ఉత్కంఠతో చూస్తున్నాను .
ప్రభువు : రాజకుమారులు అలా మాట్లాడటంలో తప్పులేదు , రాజకుమారులు ఎంతటి వీరులో ఈ పోటీతో తెలిసిపోతుంది అంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చి అందరి నోళ్ళూ మూయించారు . మహామంత్రీ .......
మహామంత్రీ : చిత్తం ప్రభూ అంటూ ప్రక్కనే కూర్చున్నవారు లేచి ముందువచ్చారు - రాజకుమారులారా ....... చూసేదంతా అపద్ధము కాదు , అక్కడ మీరు బండిని చూస్తున్నారు కానీ దానిపైనున్న ధనుస్సును చూడటం లేదు , రామాయణంలో సీతా స్వయంవరంలో ఆ రాముడు విరిచిన ధనస్సుతో ఈ ధనస్సు ఏమాత్రం తక్కువకాదు - ఇక ఆలోచించుకోండి , నిజం చెబుతున్నాను మా యువరాణీ మాత్రం సీతనే తనను పొందే రాముడు మీలోనే ఉన్నాడని భావిస్తున్నాము .
నా దేవకన్య సీతా సమానమైనదన్నమాట అంటూ నా దేవకన్యవైపు మరింత ప్రాణంలా చూస్తున్నాను - అందమైన నవ్వులు వినిపించి పులకించిపోతున్నాను .
మహామంత్రి : మా రాజ్యం తరతరాలుగా ఈ ధనుస్సు మాతోనే ఉండిపోయింది - ఎక్కడ నుండి ఎలావచ్చిందో ఎవ్వరికీ తెలియదు - చరిత్ర ప్రకారం మాత్రం దేవలోకం నుండి వర్షపు రూపంలో భువిపైకి చేరి మా నదీ ప్రవాహంలో మా రాజ్యాన్ని చేరిందని - అప్పట్లో బాహుబలుల్లాంటి పాతికమంది పైనే సైనికులు అప్పటి మా ప్రభువు గారితోపాటు దీక్ష చేబట్టి హోమాలు జరిపించి ఒడ్డు నుండి రాజ్యంలోకి చేర్చారు - సమస్య ఏమిటంటే ధనస్సు విల్లులు ఉన్నాయికానీ ఎక్కుపెట్టే తాడు ఎక్కడ ఉందో ఇప్పటివరకూ ఏ ప్రభువులూ తెలుసుకోలేకపోయారు - మీరూ వెళ్లి చూడవచ్చు ................. 
యువరాజులతోపాటు వెళ్లి చూసాను - ఆశ్చర్యం అద్భుతం .......
మహామంత్రి : మరి సీతలాంటి సుగుణాలరాశి అయిన మా యువరాణిని మరియు మా రాజ్యాన్ని పొందే వీరుడు ...... ఆ ధనస్సుని ఎత్తి విల్లు ఎక్కుపెట్టి పైన తిరుగుతున్న బంగారు చేపలను కొట్టగలగాలి - ఇదే స్వయంవర పోటీ .......
అదేంతపని మహామంత్రీ ....... వరుసప్రకారం పిలవండి , మా తరువాత యువరాజులకు కష్టం లేకుండా ఇంటికి సాగణంపై యువరాణిని - రాజ్యాన్ని మాసొంతం చేసుకుంటాము అంటూ ఉత్సాహం చూపుతున్నారు .
మహామంత్రి : రాకుమారులారా నెమ్మది నెమ్మది , పోటీకి ఈ ఉత్సాహమే కావాల్సినది , తమ తమ సింహాసనాల్లో ఆశీనులు కండి - మహారాజా .......
ప్రభువు : పోటీ మొదలెట్టండి ....... 
రాజ్యం నలువైపులా దండోరా మారుమ్రోగిపోతోంద .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2022, 10:25 AM



Users browsing this thread: 56 Guest(s)