Thread Rating:
  • 3 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సుధా రాణి ( COMPLETED )
#4
-*****-
Update 01


వసంత కాలం .... గురువారం, సాయంత్రం 5 గం .. 30 నిముషాలు .......

***



ఓ నా ప్రాణ చెలి,  నా ప్రియ !

నీ పేరుకు తగ్గట్టే నువ్వు ప్రియమైన దానివి . నువ్వు ఎల్లప్పుడూ నా మేలు కోరుకున్నావు.  నీకు ఏమీ కానీ నాకు ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చావు . ఎలాంటి కల్మషం లేని అమ్మాయివి నువ్వు .

అలాంటి నీ జీవితాన్ని నేను నాశనం చేశాను. నేను చేసిన పని మన్నింపు కోరలేనిది. అందుకనే నా మొహం కూడా నీకు చూపించకుండా దూరంగా వెళ్లిపోతున్నా .....

ప్రణాళికా బద్దంగా వెళ్లిన నా జీవితం వృదాగా మిగిలింది. నేను ఆశించిన జీవితం నాకు దొరకలేదు. అసలు ఎలాంటి ఫలితం నాకు కనపడలేదు .నా ఆశలు ఆశలుగానే మిగిలిపోయాయి .... అందుకే ఇక జీవితం ఎలా ఉండాలో ముందుగా ఆలోచించి దానికి తగిన ప్రణాళిక సిద్దం చేసుకోవడం కన్నా కాలంతో పాటు ప్రయాణిస్తూ ముందుకు సాగడం ఉత్తమం ..... అని గ్రహించాను.

జీవితంలో నీకు కనపడనంత దూరంగా వెళ్లిపోతున్నా .....

నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ప్రియ ..... ఇది వరకటిలా ఎప్పుడూ నీ పెదాలపై చిరునవ్వు ఉండాలని మనసారా కోరుకుంటున్న  నీ ఏమీ కాని రవికుమార్ ......
 



ప్రియ ఉన్న ఇంట్లోనే నేను ఉన్నాను. అదే ఇంట్లో ఒక  గదిలో నేల మీద కూర్చొని చేతికి దొరికిన ఒక పుస్తకంలో మద్య పేజీ చించి ఈ ఉత్తరం రాసి ఇంకో రూమ్ లోకి వెళ్ళాను. ఆ రూమ్ లో ప్రశాంతంగా శరీర అలసటతో నిద్రపోతున్న నా ప్రాణానికి ప్రాణం అయిన ప్రియ పక్కన ఈ ఉత్తరం పెట్టి తన నుదుటి మీద ప్రేమతో ముద్దు పెట్టుకొని వెనక్కి చూడకుండా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాను. అలా బయటకి వచ్చిన నేను నేరుగా విజయవాడ బస్ స్టాండ్ కి నడుచుకుంటూ వెళ్ళా.  సుమారుగా రెండు గంటలు నడక ద్వారా నడిచి బస్ స్టాండ్ కి చేరాను.

ఎందుకో ఆటోలో బస్ స్టాండ్ కి వచ్చే డబ్బులు ఉన్నా కూడా నేను ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ వచ్చేశాను.
రద్దీ రద్దీ గా ఉన్న విజయవాడ బస్ స్టాండ్ లో వైజాగ్ బస్ ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ  బస్సులు ఆగి ఉన్న ఫ్లాట్ ఫామ్ కి వెళ్ళి అక్కడ నిలబడ్డాను.

విజయవాడ నుంచి వైజాగ్ కి వెళ్ళే బస్సులు ముడు నా ముందు ఆగి ఉన్నాయి. ఏ బస్సులో ఎక్కాలో ఆలోచిస్తూ ఉన్నా.  ఇలా ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం నా జీవితంలో జరగడంలేదు కాబట్టి ఈ ముడు బస్సులలో ముందుగా ఏ బస్సు హారన్ మొగిస్తాదో ఆ బస్సు ఎక్కుతా అని అనుకున్నానో లేదో నా ముందు ఉన్న బస్సు హారన్ మోగించింది.

అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ luxury బస్ లో ఎక్కి ఖాళీగా ఉన్న సీట్ లో కూర్చున్నాను. బస్ లో జనాలు తక్కువగా ఉన్నారు. నా పక్కన ఉన్న సీట్ లో ఇంకా ఎవ్వరూ కూర్చోలేదు. ‘అయిన ఎవరు కూర్చుంటే ఎం’ అని మనసులో అనుకోని నా చేతిలో ఉన్న ఒకే ఒక్క బట్టల బ్యాగ్ ని నా సీట్ పైన లగేజ్ పెట్టుకొనే స్తలంలో పెట్టుకొని కిటికిలో నుంచి బయట చూస్తూ ఉన్నాను.

నేను చాలా తీక్షణంగా కిటికీ నుంచి అలా బయట చూస్తూ ఉండగా నేను ఉన్న బస్ లో పట్టీల శబ్దం నాకు వినిపించింది. ఎవరో ఒక ఆమె కాళ్ళకి పట్టీలు వేసుకొని బస్ లోకి ఎక్కుతునట్టు అనిపించింది . నాకు పట్టీలు వేసుకున్న అమ్మాయిలు అన్నా ఆడవారు అన్నా చాలా ఇష్టం . అందుకే ఆమె ఎవరో చూడాలని అనిపించి జనాలు బస్సులోకి ఎక్కే వైపు చూస్తూ ఉన్నా.

అప్పుడే నాకు , ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని అదే రంగు డిజైన్ పట్టు జాకెట్ వేసుకొని , నడుమును తాకుతూ వత్తుగా ఉన్న కురులను ముందుకు వేసుకొని ఒక చేతిలో బ్యాగ్ , మరొక చేతిలో బహుశా టికెట్ పట్టుకొని సీట్ నెంబర్ వెతుక్కుంటూ ఒక మద్య వయస్సు ఉన్న ఆమె నా వైపే వస్తూ ఉంది.

ఆమె వయసు బహుశా ఒక 35 పైన ఉండవచ్చు . చక్కని ముఖ వచ్చస్సు తో , చూడ చక్కగా అందంగా ఉన్న ఆమె యాదృచ్చికంగా నేను కూర్చున్న సీట్ దగ్గరకి వచ్చి ఆగింది. లగేజ్ పెట్టుకునే దగ్గర ఉన్న సీట్ నెంబర్ ను చూసిన ఆమె  ‘హమ్మయ్యా’ అనేలా ఒక నిట్టూర్పు విడిచి మొదటి సారిగా అక్కడ కూర్చొని ఉన్న నన్ను చూసింది. 

ఒక్క క్షణం పాటు మా ఇద్దరి కళ్ళు ఒకరిని ఒకరు తెలియకుండానే పరిచయం చేసుకున్నాయి. ఆమెను నేను చూడడం ఇదే తొలి సారి. బహుశా ఆమె నన్ను చూడడం ఇదే తొలి సారి అనుకుంటా. ఎప్పుడు అయితే నేను ఆమెను చూశానో , అప్పటిదాకా నాలో ఉన్న ఒక వెలితి , ఆమె చక్కని ముఖమును చూసిన వెంటనే నాలో కొత్త సంతోషం ఆనందం రెండూ కలిసి ఒక రకమైన భావన ఏర్పడింది. ఆ భావన నాలో నుంచి క్రమేణి ఆమె మీదకి వెళుతూ ఉంది.

కానీ అదే క్షణంలో నన్ను చూసిన ఆమెకు అప్పుడే వచ్చిన సంతోషం మాయం అయి ఆమె ముఖములో ఒక అలజడి నాకు కనిపించింది. బహుశా ఆమె పక్కన నేను కూర్చోవడం తనకి ఇష్టం లేదేమో లేక అబద్రతా భావం కలిగింది ఏమో?

నా వల్ల ఆమె ఎందుకు ఇబ్బంది పడడం అని అనుకోని, నేను కూర్చున్న సీట్ లోనుంచి పైకి లేచి ఆమెతో “ ఇది లేడీస్ సీట్ అని నాకు తెలియదు పైగా నాకు రిసర్వేషన్ కూడా లేదు మేడమ్ , నేను వెళ్ళి వెనుక కూర్చుంటాను” అని ఆమెతో చెప్పి పైకి లేచి పైన పెట్టిన నా బ్యాగ్ తీసుకోబోతుండగా ఆమె నాతో మొదటి సారి మాట్లాడింది.
ఆమె తియ్యని మృధువైన గొంతు వింటూ ఆమె చెప్పే మాటలు వినడం మొదలెట్టాను. ఆమె నాతో “ నిజం చెప్పాలి అంటే మొదట నేనే మిమ్మల్ని వెనక్కి వెళ్ళమని అడుగుదాం అనుకున్నా , కానీ మీరే వెనక్కి వెళ్తాను అని చెప్పి వెనక్కి వెళ్ళడానికి సిద్దం అయ్యారు . ఈ ఒక్క మాట చాలు మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలుసుకోడానికి. పర్లేదు నాకు ఇబ్బంది లేనంత వరకు మీరు నా పక్క సీట్ లోనే కూర్చోండి” అని నవ్వుతూ చెప్పి తను తెచ్చుకున్న బ్యాగ్ ఇదివరకు నేను పెట్టిన స్థానంలో పెట్టి , నా చేతిలో ఉన్న నా బ్యాగ్ ను తనే చొరవతో తీసుకొని తన బ్యాగ్ పక్కన పెట్టి తన సీట్ లో కూర్చుంది .

నా వయసు 25 సంవత్సరాలు, అంటే నేను  తన కంటే చిన్న వాడిని అయిన కూడా ఆమె మర్యాదగా ‘మీరు’ అని సంభోదించడం బట్టి ఆమె మనసు ఎలాంటిదో అర్ధం అయింది.

ఆమె గురించి తెలుసుకుందాం , ఆమెతో పరిచయం పెంచుకుందాం అని మనసులో ఉన్నా కూడా వద్దు అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ కిటికీ నుంచి బయటకి చూస్తూ ఉన్నాను. కొన్ని నిముషాలకే నేను ఉన్న బస్ స్టార్ట్ అయింది. బస్ తో పాటు నా కొత్త జీవితం కూడా ప్రారంబం అయింది అని మనసులో అనుకోని కళ్ళు మూసుకుని చిన్న కునుకు వేశాను.

శరీరం అలయలేదు కానీ మనసు బాగా అలిసిపోవడం వలన వెంటనే నిద్ర పట్టేసింది. ఎన్నో గంటలు నిద్రపోయినట్టు అనిపించింది కానీ సరిగా ఒక గంట నిద్రపోయాను. నిద్ర లేచేటప్పటికి నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పడే పుట్టిన ఒక బాబులా నా మనసు కేరింతలు వేయడానికి సిద్దంగా ఉంది.

మనిషికి నిద్ర అనే వరం ఇచ్చిన దేవుడికి ఒక థాంక్స్ చెప్పుకొని ఎక్కడ దాకా బస్ ప్రయాణం అయిందో అని చూస్తూ ఉన్నా. అలా చూస్తూ ఉండగా వెంటనే బస్ ఒక ఫ్యామిలీ డాబా దగ్గర రాత్రి భోజనం చేయడానికి ఆగింది. బస్సులో ఉన్న అందరూ ఒక్కొక్కరిగా దిగుతూ ఉన్నారు. నా పక్కన ఉన్న ఆమె కూడా నా వైపు ఒక సారి చూసి ఒక చిన్న నవ్వు నవ్వి తను కూడా దిగడానికి సిద్దం అయింది.

మద్యానం నుంచి నేను అస్సలు అన్నం తినలేదు. కనీసం మంచి నీళ్ళు కూడా తాగలేదు. అప్పడు అంటే నా మనసులో చెప్పుకోలేని బాద ఉండడంతో సాయంత్రం ఆకలి వేయలేదు. కానీ ఇప్పుడు విపరీతంగా ఆకలి వేస్తూ ఉంది. ఇందాక నా దగర ఉన్న చిల్లర అంతా తీసి ఈ బస్ టికెట్ కోసం ఖర్చుపెట్టను.

ఇంకా ఏమయినా ఉన్నాయా అని నా జోబి లో చూసుకుంటే ఒకే ఒక్క 2000 రూపాయల నోటు ఉంది. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో అని ఆలోచిస్తూ ఉంటే ఉదయం ప్రియ ఈ 2000 , నా ప్యాంటు జోబిలో పెట్టిన విషయం గుర్తుకు వచ్చింది.

తను ఇచ్చిన ఆ డబ్బులే ఇప్పుడు నా ఆకలి తీర్చబోతుందా అని మనసులోనే అనుకుంటూ బస్సు దిగి నేరుగా హోటల్ కౌంటర్ దగ్గరకి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వమని అడిగి నా దగ్గర ఉన్న 2000 నోటు ఇచ్చాను.

నేను ఇచ్చిన 2000 నోటు చూసి ఆ హోటల్ కౌంటర్ లో ఉన్న వ్యక్తి నాతో ‘చిల్లర లేదు 30 రూపాయల చిల్లర ఇవ్వు లేకుంటే వెళ్లిపో’ అని చెప్పాడు. నా దగ్గర అస్సలు చిల్లర లేదు ఇప్పడు ఎలా చెయ్యాలి అని మనసులో బాద పడుతూ ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తిని ‘నా దగ్గర అస్సలు చిల్లర లేదు, ఉదయం ఎప్పుడో తిన్నాను, చాలా ఆకలిగా ఉంది.  మీరే ఎలాగోలా చిల్లర ఇవ్వండి లేదా ఈ మొత్తం డబ్బులు అయిన తీసుకోండి’ బతిమాలుతూ ఉన్నాను.

కానీ ఆయన నా దగ్గర ఉన్న ఆ 2000 మొత్తం అయిన తీసుకోవడం లేదు కనీసం అతను ఏమాత్రం నా వైపు మొగ్గు చూపడం లేదు. నా దరిద్రం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు అని అనిపించింది .
ఇక అతను ఇచ్చేలా లేడు ఇప్పుడు ఈ రెండు వేల కి చిల్లర ఎవరిని అడగాలి , అయిన ఎవరినైనా అడిగే ఓపిక కూడా లేదు నీరసం కూడా వచ్చేసింది.

ఇక చేసేది ఏమీ లేదు అని అనుకోని వెనక్కి వెళ్దాం అని నిర్ణయించుకొని వెనక్కి తిరుగుతుండగా నా వెనుక నుంచి ఒక ఆమె ఆ హోటల్ కౌంటర్ లో ఉన్న వ్యక్తి చేతికి 30 రూపాయలు డబ్బులు ఇస్తూ అతనితో “ ఈ డబ్బులు తీసుకొని ఆయనకి ప్లేట్ ఇడ్లీ ఇవ్వు” అని చెప్పింది.

నా కోసం డబ్బులు ఇస్తున్న ఆమె ఎవరో అని వెనక్కి తిరిగి చూసా ,ఆమె ఎవరో కాదు బస్సులో నా పక్కన కూర్చున్న ఆమె. అంటే నేను ఇందాకటి నుంచి నాకు ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి కి మద్య జరిగిన సంభాషణ మొత్తం వినినట్టుగా ఉంది.

మొహమాటం తో ఆమె కొని ఇప్పించిన ఆ ఇడ్లీ వద్దు అని ఆకలితో ఉండలేను అందుకని ఆ ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆ హోటల్ వ్యక్తికి ఇవ్వబోయిన 2000 నోటు ఆమెకి ఇవ్వబోయాను. అంతే .. అప్పటిదాకా నవ్వుతూ నా కళ్ళలోకి చూసిన ఆమె మొహంలో ఒక్క సారిగా నాకు బద్రకాలి కనిపించింది.

ఆమె కోపానికి ఎక్కడ కలిపోతానేమో అనేంత బయం వేసి వెంటనే ఆ డబ్బులు నా షర్ట్ జోబిలో పెట్టేసి ఆమెతో “ వద్దు డబ్బులు ఇవ్వను లెండి , దయచేసి మీ కోపం తగ్గించుకొని ఇదివరకు నవ్వుతూ ఉన్నట్టు నవ్వండి” అని కొద్దిగా బయంతో అన్నాను.

నేను బయపడ్డాను అని గ్రహించిన ఆమె ఒక్క సారిగా గట్టిగా నవ్వింది. ఆమె నవ్వులో ఉన్న చిలిపి తనం , ఆమె ముఖములో ఉన్న మాదుర్యం అనుభూతి చెందుతూ ఆమె చక్కని నవ్వును చూస్తూ నా బయం తగ్గించాను.
ఆ క్షణం ఆమె నవ్వును చూస్తూ అలానే జీవితాంతం ఉండాలి అనే భావన నా మనసులో కలిగింది . నా వెనుక ఉన్న ఆమె నన్ను తాకుంటూ ముందుకు వచ్చి ఇంకో రెండు ప్లేట్ ఇడ్లీ తీసుకొని నాతో “ అటు వెళ్ళి ఈ ఇడ్లీ కలిసి తిందామ” అని అని నాకంటే ముందుగా నడుస్తూ నడక సాగించింది.

ఏదో ఒక శక్తి తనతో పాటు ఉన్నట్టు ఆ శక్తికి నేను ఆకర్షణ అవుతూ ఆమె వెంట నడుచుకుంటూ వెళ్ళాను. ఇద్దరం కలిసి ఒక రెండు కుర్చీలు మాత్రమే ఉన్న ఒక టేబల్ దగ్గరకి వెళ్ళి అక్కడ కూర్చున్నాము.
ఆమెతో ఏదో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నా కానీ ముందు నా ముందు ఆమె ఇప్పించిన ఇడ్లీ తినాలని ఆశ కలిగి ఏమీ మాట్లాడకుండా ఒక ముక్క ఇడ్లీ తుంచి తిన్నాను.

ఆకలి మీద ఉన్న వారికి రుచితో పనిలేదు అని అన్నట్టు ఆ ఇడ్లీ రుచి నాకు తెలియకుండానే కొద్ది నిమిషాలలో నా ప్లేట్ లో ఉన్న నాలుగు ఇడ్లీలు తినేశాను. అయిన నా ఆకలి తిరకపోయే సరికి పోయి ఇంకో ప్లేట్ తెచ్చుకుందాం అని అనుకున్నా కానీ నా దగ్గర మళ్ళీ ఆ 2000 నోటు మాత్రమే ఉంది అని గుర్తుకు వచ్చి ఆగిపోయాను.

ఎవరో చెప్పినట్టు యాదృచ్చికంగా నా ముందు ఉన్న ఆమె తను తెచ్చుకున్న రెండు ప్లేట్ లలో నుంచి ఒక ప్లేట్ నా ముందుకి జరిపి నాతో “ ఇందాక మీ మాటలు విన్నా , ఉదయం ఎప్పుడో తిన్నారు అని అన్నారుగా ..... అందుకే మీ కోసమే అని ఇంకో రెండు ప్లేట్ లు extra తెచ్చాను. కానీ ఒక ప్లేట్ నేను తినడం స్టార్ చేశా . ఇదిగో మీకోసం తెచ్చిన ఇంకో ప్లేట్ ..... ఏమీ ఆలోచించ కుండా ముందు ఈ ఇడ్లీ తినేయండి” అని చెప్పి మళ్ళీ ఒక చక్కని నవ్వు నవ్వింది.

ఆ నవ్వు కోసం అయిన తినేద్దాం అని నిర్ణయించుకొని ఆమె ఇచ్చిన ఇంకో ప్లేట్ ఇడ్లీ కూడా తినడం మొదలెట్టి తినేసి పక్కనే ఉన్న నీళ్ళు తాగి అప్పుడు ఆమెతో “చాలా థాంక్స్ మేడమ్ , మీ  రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటంలేదు” అని మొదట చెప్పాల్సిన మాట అంతా తినేశాక చెప్పాను.

కథ ఇంకా కొనసాగుతుంది ......

Like Reply


Messages In This Thread
RE: సుధా రాణి - by Ravi9kumar - 03-07-2022, 05:25 PM
RE: సుధా రాణి - by Ravi9kumar - 03-07-2022, 05:25 PM
RE: సుధా రాణి - by Ravi9kumar - 03-07-2022, 05:27 PM
RE: సుధా రాణి - by The Prince - 03-07-2022, 05:28 PM



Users browsing this thread: 4 Guest(s)