Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అన్నయ్యా అన్నయ్యా ...... బార్బీ డ్రెస్సెస్ తడిచిపోయాయి చూడండి - ఈసమయంలో గనుక పెద్దమ్మ వస్తే .......
బుజ్జాయిలూ ...... మరొక డ్రెస్సెస్ కూడా ఉన్నాయికదా ......
బుజ్జాయిలు : కదా ...... , అన్నయ్యా ...... మీరు పెద్దమ్మకోసం తెచ్చిన పట్టుచీరను పెద్దమ్మ గదిలో ఉంచాము , అయితే పెద్దమ్మ ఇప్పుడే రావాలి - పాపం మా అన్నయ్య ఉదయం నుండీ వెయ్యికళ్ళతో ప్రాణం కంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు .
బుజ్జాయిలు అలా అనడం ఆలస్యం , మహేష్ ...... బుజ్జిహీరో బుజ్జాయిలూ ...... ఎక్కడ ఉన్నారు అంటూ దూరం నుండి మధురమైన పెద్దమ్మ పిలుపు .......
పెద్దమ్మ పెద్దమ్మ ....... బుజ్జాయిలూ పెద్దమ్మ వచ్చేసారు - ఉమ్మా ఉమ్మా ...... .
బుజ్జాయిలు : మరి మేమంటే ఏమనుకుంటున్నారు - ok ok మీరు పెద్దమ్మ దగ్గరకు వెళ్ళండి - మేము అటువైపునుండి వెళ్లి డ్రెస్సెస్ మార్చుకుని వచ్చేస్తాము .
బుజ్జాయిలూ ....... ఉదయం రెడీ అయినట్లుగానే రెడీ అవ్వాలి .
బుజ్జాయిలు : డబల్ ok అంటూ బుజ్జి చేప పిల్లల్లా ఈదుకుంటూ అటువైపు ఒడ్డుకు చేరుకున్నారు .

ఫ్రెండ్స్ ....... ఎంజాయ్ అనిచెప్పి వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకుచేరి పెద్దమ్మా పెద్దమ్మా అంటూ పరుగున పెద్దమ్మ దగ్గరికి చేరుకున్నాను .
ఎన్నాళ్ల విరహమో అన్నట్లు ఇద్దరమూ ఒకరి కౌగిళ్ళలో మరొకరం ఏకమైపోయాము , పెద్దమ్మా - బుజ్జిహీరో పెద్దమ్మా - బుజ్జిహీరో ........
ఇద్దరమూ నవ్వుకున్నాము - పెద్దమ్మా ....... అంత ముఖ్యమైన పని ఏమిటి , ఉదయం అనగా వెళ్లి ఇప్పుడు వచ్చారు అంటూ పెదాలపై కొరికేసాను .
పెద్దమ్మ : స్స్స్ ...... అంటూ అందమైన నవ్వులతో నా పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టారు - బుజ్జి ...... హీరో ....... అంటూ సాగదీసిన పెద్దమ్మ కళ్ళల్లో చెమ్మ .........
అంటే అంటే ....... ఆ ముఖ్యమైన పని అమ్మో అమ్మో " did a మిస్టేక్ - i did a మిస్టేక్ - did a మిస్టేక్ ........ , మీరు స్వర్గంనుండి పిలుపు వచ్చింది అన్నప్పుడే అర్థం చేసుకోవాలి did a మిస్టేక్ - i did a మిస్టేక్ " సామిరంగా అంటూ ఉదయం అనగా వచ్చాను చీకటిపడేలోపు గెంటేస్తున్నారు ........ , నా ప్రాణమైన పెద్దమ్మను వదిలి వెల్లనంటే వెళ్లను అంటూ తడి బట్టలతోనే వెళ్లి చెట్టు కింద బండపై అటువైపుకు తిరిగి కూర్చున్నాను .

పెద్దమ్మ కన్నీళ్లను తుడుచుకుని వచ్చి ప్రక్కనే కూర్చున్నారు - నా బుజ్జిహీరోకు దూరంగా ఉండటం నాకుమాత్రం ఇష్టమా చెప్పు , నిన్ను వదిలి ఒంటరిగా పడుకోవడం ఎంత కష్టమో ....... అంటూ ప్రాణంలా హత్తుకున్నారు , తప్పదు బుజ్జిహీరో ...... 
ఎవరు పెద్దమ్మా ...... ఆజ్ఞ వేసినది - ఆ స్వర్గాధిపతేనా ...... అవసరమైతే అతనినే ఎదురిస్తాను .
పెద్దమ్మ : నేనెప్పుడో ఎదురించేదానిని కానీ నువ్వు భువిపైకివెళ్లి పూర్తి చేయాల్సిన కార్యం విని నన్ను కట్టిపడేసింది - హృదయాన్ని కదిలించేసింది , ఇక తప్పని పరిస్థితుల్లో గుండెను రాయిచేసుకుని ఒప్పుకున్నాను , నా మాట న బుజ్జిహీరో మన్నిస్తాడాని నాకు తెలుసు .......
నా పెద్దమ్మ మాటే నాకు వేదం - ఇక్కడికిక్కడే ప్రాణాలు వదిలేయమంటే సంతోషంగా .......
పెద్దమ్మ : అలాంటి మాటలు అన్నావో దెబ్బలుపడతాయి - నువ్వు లేకుండా నేనుండగలనా చెప్పు - నీ వల్లనే కదా నా మనసు మళ్లీ పరిమళించినది అంటూ కొట్టి వెంటనే ముద్దులవర్షం కురిపించి కౌగిలించుకున్నారు .
లేదు లేదు ఇంకెప్పుడూ అలా మాట్లాడను అంటూ చిరునవ్వులు చిందిస్తూ గట్టిగా చుట్టేసాను - సరేలే పెద్దమ్మా ...... ఒక వారం తరువాత వెళతానులే ......

పెద్దమ్మ : స్వర్గాధిపతి ఆజ్ఞల ప్రకారం రేపు రోజు మారేలోపు ......
మారేలోపు .......
పెద్దమ్మ : అర్ధరాత్రి 12 గంటలలోపు భువిమీదకు చేరుకోవాలి లేకపోతే మళ్లీ 12 పక్షాలు కుదరనే కుదరదు .
అయితే అప్పుడే తీరికగా వెళతాను పెద్దమ్మా .......
పెద్దమ్మ : అధికాదు బుజ్జిహీరో .......
ఏదీకాదు పెద్దమ్మా ...... , వెళతాను వారం రోజుల తరువాత .......

పెద్దమ్మ : సరే ఈ మాట అదిగో అక్కడ నా బుజ్జిహీరో పూలవనంలో కూర్చున్న ఒక అమ్మను కలిసొచ్చి చెప్పు - నువ్వొక్కడివే వెళ్ళాలి వెళ్లు బుజ్జిహీరో అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
ఈ ప్రాణమైన ముద్దుతోనే సగం ఒప్పించేశారు పెద్దమ్మా - మీ హృదయాన్నే కదిలించిన సంఘటన అని అర్థమైపోతోంది చూద్దాము అంటూ పెద్దమ్మ చేతిని వదల్లేక వదల్లేక వెళ్ళాను .

పూలవనంలో నేను పెంచిన మొక్కలకు వారి కన్నీళ్ళతో కలిపి ఒక అమ్మ నీళ్లు పోస్తుండటం చూసి , అమ్మా ...... అని పిలిచాను .
మహేష్ అంటూ కన్నీళ్లను తుడుచుకుని సమాధానమిచ్చి ఆనందిస్తున్నారు - బాబూ ...... అంటూ ఇంతకుముందు కలవకపోయినా నేనే వారి సర్వస్వం అన్నట్లు నా బుగ్గలను తల్లిప్రేగు ప్రేమతో స్పృశిస్తూ మురిసిపోతున్నారు , నువ్వేనా బాబూ మహేష్ అంటే ఒకసారి కౌగిలించుకోవచ్చా అని అడిగారు .
మీకు సంతోషమైతే నాకు ఇష్టమే అమ్మా ......
" అమ్మ ....... " నువ్వు పిలుస్తుంటేనే కన్నప్రేగు కదిలిపోతోంది - " ఆ కన్నప్రేగు ప్రేమ " ప్రేమను పొందడం కోసమే నీదగ్గరకు ఆర్థిస్తూ వచ్చాను మహేష్ .......
అర్థించడం ఏమిటి అమ్మా ...... , ఇంతకూ మీరెవరు ? - మీపేరేమిటి ? - నన్ను కలవడానికి గల కారణం ఏమిటి ? .
" నా పేరు జానకి " , " నేను ఒక అమ్మను కానీ నా కడుపున పుట్టిన బిడ్డ ప్రేమను పొందలేకపోయిన దురదృష్టవంతురాలిని  " , నా బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను కనీసం చూడలేకపోయిన అభాగ్యురాలిని అంటూ తల్లడిల్లిపోతున్నారు .
అంటే అమ్మా ........
అవును మహేష్ ....... ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి ......
అమ్మా అమ్మా ...... అంటూ చలించిపోతున్న హృదయంతో అమ్మను కూర్చోబెట్టి , త్రాగడానికి అమృతం ఇచ్చాను .

జానకి అమ్మా ...... సమాధానపరచుకోండి - ఈ అమ్మ కోరిక తీర్చాలని ఫిక్స్ అయిపోయి , అమ్మా ....... మీ ముఖంలో సంతోషం పరిమళించడానికి నన్ను ఏమిచెయ్యమంటారో చెప్పండి .
జానకి అమ్మ : నీ మంచితనం గురించి పెద్దమ్మ చెప్పారు - ఎదుటివారి కళ్ళల్లో సంతోషం నింపడానికి ఎంత దూరం అయినా వెళతావని కూడా చెప్పారు .
అది పెద్దమ్మ మంచితనం - పెద్దమ్మ ప్రేమను పొందినవారెవరైనా ఇలానే చేస్తారు , అమ్మా ...... ఆజ్ఞ వెయ్యగలరు .
జానకి అమ్మ : దాదాపు 15 సంవత్సరాల నా హృదయంలోని బాధను తొలగించే మహానుభావుడు నువ్వే అని ఉదయమే స్వర్గం నుండి పిలుపువచ్చింది - స్వర్గంలో మహా మహా గొప్ప వ్యక్తులు దేవుళ్ళు ఉన్నప్పటికీ నా కోరిక తీర్చే అర్హత కేవలం కేవలం నీకు మాత్రమే ఉందని విధాత ప్రకటించారు .
విధాతనా ...... ? , అమ్మా అమ్మా ...... అదేంటో త్వరగా త్వరగా చెప్పండి - నా హృదయవేగం అమాంతం పెరిగిపోతోంది .
జానకి అమ్మ : నా బుజ్జిదేవుడి హృదయ స్పందనను కంట్రోల్ చెయ్యడానికి ఈ అమ్మ లేదూ అంటూ ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నారు . మహేష్ ....... నువ్వు భువిపైకి వెళ్లి ఏమిచెయ్యాలంటే అంటూ ( ........................................................................................................................................................................................................................................................................................... ) హృదయంపై ప్రాణంలా స్పృశిస్తూ చెప్పారు .
అంతే షాక్ లో ఉండిపోయాను .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 29-09-2023, 09:43 AM



Users browsing this thread: rk031423, 26 Guest(s)