Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ
8


సూర్యుడు అస్తమించి అప్పుడే చీకటి పడుతున్న వేళ అడవిలోకి గూడ్స్ ట్రైన్ వచ్చి ఆగింది పెద్ద కూత కూస్తూ....

ప్రతి నాలుగు నెలలకోసారి వచ్చే ఆ గూడ్స్ బండి కోసమే అక్కడున్న గుండాలు, ఆ పైన ఏరియా మినిస్టర్లు అందరూ ఎదురు చూసేది, ఆ ట్రైన్ నల్ల దుంగలతొ నింపి ఆఖరి పెట్టేలో ఉన్న  కొన్ని వందల కోట్లు తీసుకుంటారు మరీ...

అది ఎర్ర చందనం కాదు గంధపు దుంగలు కాదు వాటిని ఆఫ్రికా నల్ల దుంగలు అంటారు, ఎర్ర చందనం కంటే విలువైనది ఇక్కడ ఎందుకు మొలిచాయో తెలీదు కానీ అది ఇక్కడున్న రాజకీయ నాయకులకు, ఆ జూవేనైల్ హోమ్ ని సెక్యూరిటీ ఆఫీసర్ల సపోర్ట్ తొ నడుపుతున్న గుండా కమల్ కు వరం అయ్యింది.

కమల్ ఆ జూవేనైల్ హోమ్ ని రెండు భాగాలుగా చేసాడు ఒకటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి అందులో చెడ్డవాళ్ళని తన కింద మనుషులుగా చేర్చుకోడం మిగతా వారిని చిన్న పిల్లలకి హెడ్ లుగా నియమించడం, అలా ఒక్కొక్కడికి కిందా పది మంది పిల్లల్ని చేర్చాడు.

గూడ్స్ ట్రైన్ కూతతొ పాటే అక్కడున్న కమల్ మనుషులందరూ ఈలలు వేయగానే పిల్లల్తో పని చేయించడం మొదలెట్టారు...ముగ్గురు ముగ్గురు కలిసి ఒక దుంగని మోస్తూ ట్రైన్ లో లోడ్ చేస్తుంటే వాళ్ళని మైంటైన్ చేసే అన్నలు కుడా ఒకొక్క దుంగ మోసుకేలుతున్నారు.

వెంటనే అడవిలోకి చీకట్లని చీల్చుకెళ్లే వేగంతొ పరిగెత్తాడు ఒకడు, చీకట్లో సరిగ్గా కనిపించదు కానీ పని చేసే వాళ్ళకోసం వేసిన ఫోకస్ లైట్ల వల్ల వాడి నరాలు తేలిన కండలు... అత్యంత వేగంగా పరిగెత్తడం వల్ల చెమటకి ఆ కండలు మెరుస్తున్నాయి... అంత వేగంగా పరిగెడుతున్న వాడిని చూసి పక్కన ఉన్న జింకలు కూడా దడుచుకుని పక్కకి దూకాయి, ఆరడుగుల కట్ అవుట్, అప్పుడప్పుడే మొలిచిన మీసం కింద ఉండి లేనట్టి గుబురు గడ్డం, విశాలమైన ఛాతి... పర్ఫెక్ట్ వి షేప్ బాడీ... ఇక భుజాలు అయితే వంద కిలోల మనిషిని కూడా అవలీలగా ఎత్తి విసిరేయ్యగల రెక్కలు వాడు వేసుకున్న హాఫ్ షర్ట్ లో ఇంకా బాగా కనిపిస్తున్నాయి...అంతటి పొడుగున్న బాడీ, కళ్ళు మూసి తెరిచే లోగా మాయమయ్యే వేగంతొ పరిగెడుతుంటే మనుషులకే దడ పుడుతుంది ఇక జంతువులు ఎంత అందుకే వాడికి దారినిస్తున్నాయి...... ఎవరో చెప్పనవసరంలేదనుకుంటా వాడే వాసు.....





ఇంతలో ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ పక్కనే పిల్లల్తో పని చేయిస్తున్న రాంబాబు దెగ్గరికి వచ్చి "అన్నా మా గుంపుని మైంటైన్ చేసే వాసు అన్న మళ్ళీ అడివిలోకి వెళ్ళాడు, మాకు భయంగా ఉంది".

రాంబాబు : మీరు పని ఆపొద్దు, వెళ్ళండి వాసు వచ్చేస్తాడు అని వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించేసాడు కానీ లోపల రాంబాబుకి కూడా టెన్షన్ గా ఉంది.

ఎందుకంటే వాసు ఇలా వెళ్లడం ఇది మూడో సారి, ఇంతకముందు కుడా ఇలా అడివి మొత్తం తిరిగేవాడు దార్ల కోసం కానీ పది నిమిషాల్లో ఎవ్వరికి అనుమానం రాకుండా వచ్చేసేవాడు కానీ సంవత్సరం ముందు మొదటి సారి మేము పిల్లల్ని మైంటైన్ చెయ్యడానికి వచ్చినప్పుడు మమ్మల్ని పట్టించుకోడం మానేశారు చీకట్లో అందరి దృష్టి పిల్లల మీదే ఉండేది కానీ ప్రతీ గంటకి ఒకసారి పెద్ద వాళ్ళని చెక్ చెయ్యడానికి మా పైన ఇంకొకరిని పెట్టాడు కమల్, అదే వాసు మొదట వాసు ప్లేట్ తొ కొట్టినవాడే వాడికి వాసుకి అస్సలు పడదు ఎప్పుడు ఎదురు పడినా కొట్టుకోడమే... అయినా వాసుని ఎందుకు సహిస్తున్నారంటే... మేమంతా ఒక్క దుంగ మొయ్యటానికే కష్టం అయ్యే రోజుల్లో వాసు ఒక్కడే మూడు దుంగలని మోసే వాడు...

ఇప్పుడు కూడా అందరి కంట్రోల్ లో పది మంది పిల్లలు మాత్రమే ఉంటే వాసు ఒక్కడే ముప్పై మందిని కంట్రోల్ చేస్తాడు ... వాడి కష్టంతోనే కమల్ దెగ్గర మంచి పనిమంతుడు అనే పేరు సంపాదించుకున్నాడు...

ఇప్పుడు నేను ఎందుకు టెన్షన్ పడుతున్నానంటే సంవత్సరం క్రితం మొదటి సారి మెయింటైన్ చెయ్యడానికి వచ్చినప్పుడు వాసు ఎటు వెళ్ళలేదు గమనిస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడు పది నిముషాల టైం మాత్రమే దొరికే వాసుకి ఇక నుంచి గంట వరకు టైం ఉందని తెలుసుకున్నాడు.... ఆ తరువాత నాలుగు నెలల వరకు వాసుకి అడవిలో పది నిముషాలు సమయం దొరికినా ఎటు  వెళ్లే వాడు కాదు చుట్టు పక్కల దార్లు అన్నీ తిరిగేసాడు అందుకే మళ్ళీ గూడ్స్ బండి కోసం వెయిటింగ్.....ఎనిమిది నెలల క్రితం రెండో సారి ట్రైన్ లోడ్ చెయ్యడానికి వచ్చినప్పుడు వాసు అడివిలోకి పరిగెత్తాడు అలా అరగంట పరిగెత్తిన వాసుకి మూడు దార్లు కనిపించాయి... మొదటి దారిలో వెళ్ళాడు పది నిమిషాలకి తిరిగి మా దెగ్గరికే తీసుకొచ్చింది.... మళ్ళీ నాలుగు నెలల వరకు వాసు బుద్ధిగా దుంగలు కొట్టడం, ఎవడైనా అల్లరి చేస్తే వాడిని కొట్టడం, మూడో సారి లోడ్ చేసేప్పుడు ఈ సారి రెండో దారిలో వెళ్ళాడు కానీ అది మూసుకుపోయిన దారి అవడం వల్ల మళ్ళీ నిరాశ గానే వెనక్కి వచ్చాడు....కానీ ఇప్పుడు వెళ్ళింది మూడో దారి మేము తప్పించుకోడానికి దారి ఉందా లేదా అన్న టెన్షన్ ఒకటి అయితే వాసు గంటలో వచ్చేస్తాడా లేదా అన్నది ఇంకో టెన్షన్.

కరెక్ట్ గా చెకింగ్ చెయ్యడానికి ఇంకా ఐదు నిముషాలు ఉందనగా పిల్లలు కేకలు మొదలయ్యాయి... రాంబాబు హమ్మయ్య అనుకున్నాడు.

వాసు మోస పీల్చుకుంటూ ఒక్క సారిగా జారీ అదే వేగంతొ మూడు దుంగలని ఒక భుజానికి, ఇంకో రెండు దుంగలని ఇంకో భుజం మీద వేసుకుని లోడ్ చెయ్యడం మొదలు పెట్టాడు.... వాసుని చూసిన పిల్లలు కూడా ఇక మాకు ఏ భయం లేదన్నట్టు ఉత్సాహంగా పనిచెయ్యడం మొదలుపెట్టారు.

తెల్లారే వరకు ట్రైన్ లోడ్ చేసి అది వెళ్లిపోయాక అందరూ హోమ్ కి చేరుకొని, రెస్ట్ తీసుకోడానికి వెళ్లిపోయారు, ట్రైన్ లోడ్ చేసిన వారం అంతా ఏ పని చెయ్యరు... అంతా ఎంజాయ్మెంట్ లో మునిగితేలుతారు.

అందరూ ఎవరి సెల్ లోకి వాళ్లు వెళ్లిపోయాక రాంబాబు దెగ్గరికి వెళ్ళాడు వాసు...

రాంబాబు : వాసు ఏమైనా దారి దొరికిందా?

వాసు : మూడో దారిలో అరగంట పరిగెత్తితే ఒక కాలువ కన్పించింది దాని ప్రవాహవేగం చూస్తుంటే కత్చితంగా చెరువు కానీ జలపాతం కాని ఉండి ఉండాలి... బాగా తిని రెడీగా ఉండు ఈరోజే మనకి ఇక్కడ ఆఖరి రోజు....

రాంబాబు : మరీ వీళ్ళ సంగతి?

వాసు : అవన్నీ తరువాత ముందు నాకు బైట చాలా పనులున్నాయి... ఇప్పుడు వీళ్ళని గెలికితే మన వెంట పడతారు కాబట్టి ఈ రాత్రికి మనం ఇద్దరమే వెళ్తున్నాం రెడీగా ఉండు.
Like Reply


Messages In This Thread
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:10 PM
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:11 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 05:35 PM
RE: సీతా.....! రామ్ - by Alpha@84 - 05-05-2022, 05:49 PM
RE: సీతా.....! రామ్ - by svsramu - 05-05-2022, 06:08 PM
RE: సీతా.....! రామ్ - by sailuhot - 05-05-2022, 07:00 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 07:27 PM
RE: సీతా.....! రామ్ - by naga8121 - 05-05-2022, 07:50 PM
RE: సీతా.....! రామ్ - by Lraju - 05-05-2022, 08:32 PM
RE: సీతా.....! రామ్ - by Uday - 05-05-2022, 09:20 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 09:23 PM
RE: సీతా.....! రామ్ - by vg786 - 05-05-2022, 10:03 PM
RE: సీతా.....! రామ్ - by kummun - 05-05-2022, 10:08 PM
RE: సీతా.....! రామ్ - by Zen69 - 05-05-2022, 10:47 PM
RE: సీతా.....! రామ్ - by BR0304 - 05-05-2022, 10:54 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 11:27 PM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:42 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:34 AM
RE: రాణి.....! రామ్ - by Akmar - 06-05-2022, 06:43 AM
RE: రాణి.....! రామ్ - by Thorlove - 06-05-2022, 07:34 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 09:37 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 06-05-2022, 09:59 AM
RE: రాణి.....! రామ్ - by solomon - 06-05-2022, 10:39 AM
RE: రాణి.....! రామ్ - by utkrusta - 06-05-2022, 04:53 PM
RE: రాణి.....! రామ్ - by Dhamodar - 06-05-2022, 07:10 PM
RE: రాణి.....! రామ్ - by mahi - 07-05-2022, 03:07 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 10-05-2022, 11:44 AM
RE: వాసు గాడి వీర గాధ - by Takulsajal - 18-06-2022, 09:31 PM



Users browsing this thread: 3 Guest(s)