Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహి : త్వరగా త్వరగా .......
కిందకుదిగి మహిని కిందకుదించాను . నదీఅమ్మ ప్రవాహానికి ఇరువైపులా పలుచని పొగమంచులో చుట్టూ కనుచూపుమేరవరకూ రంగురంగుల గులాబీపూలతోపాటు అందమైన పూలచెట్లు కనులకు వీనులవిందు చూస్తుండటం చూసి నా నడుమును చుట్టేసి ముద్దులుకురిపిస్తోంది . 
నాకు కాదు మహీ ఈ ముద్దులన్నీ మంజరికే చెందాలి అంటూ సౌండ్ చేస్తూ చేతిపైకి పిలిచాను .
ఎగురుకుంటూ వచ్చి నా వేలిపై కూర్చుంది . 
మంజరి : మహీ ...... ముద్దులన్నీ మన దేవుడికే .......
మంజరీ ....... నువ్వు లేకపోయుంటే మేము ఇటువైపు వచ్చేవాళ్ళమో కాదో - చుట్టూ ఇంత అద్భుతమైన ప్రకృతిని చూసి మన దేవకన్య పెదాలపై ఈ ఆనందాలకు ఏకైక కారణం నువ్వే అంటూ ముద్దుపెట్టాను .
మంజరి : సరేలే మహీ ఎలాగో రాత్రికి ముద్దులేముద్దులుకదా .......
రాత్రికి ముద్దులు ఏమిటి ? .
మహి : అదే దేవుడా ...... , ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చుతారుకదా అదేవిషయం చెబుతోంది అంటూ మంజరి నెత్తిపై సున్నితంగా మొట్టికాయవేసింది .
మంజరి : అంతే అంతే ప్రభూ .......

దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి , ప్రక్కనే ఉన్న ఎర్రటి అందమైన గులాబీని అందుకుని మహి కురులలో ఉంచాను .
మంజరి : అతిలోకసుందరిలా ఉన్నావు మహీ .......
అవును మహీ ...... దివినుండి దేవకన్యలా ఉన్నావు , నా దేవకన్య వలన అంతటి అందమైన పువ్వుకు మరింత అందం వచ్చింది .
మహి : పోండి దేవుడా ....... 
ఆఅహ్హ్ ....... సిగ్గులో మరింత ముద్దొచ్చేస్తున్నావు అంటూ గాలిలో ముద్దులువదులుతూ వెనక్కు వెనక్కువెళ్లి హృదయంపై చేతినివేసుకుని పూలపైకి వాలిపోయాను .
దేవుడా అంటూ పరుగునవచ్చి ఛాతీపై ప్రేమతో దెబ్బలుకురిపిస్తూ నామీదకు వాలిపోయింది మహి .........
మహీ మహీ మహీ అంటూ ఇరువైపులా రెండుచేతులతో లిల్లీ పూలను అందుకుని పూలవర్షం కురిపించి ప్రేమతో గుండెలపైకి హత్తుకున్నాను .
మహి : దేవుడా ....... ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో వర్ణించలేను ఈరోజంతా ఇక్కడే ఉండిపోవాలని ఉంది .
యువరాణీ కోరిక - రాత్రికి కూడా ఇక్కడే ఉండిపోదాము - చంద్రుడి వెన్నెలలో పూల అందం మరింత అద్భుతం కదా .......
మహి : అవునవును .......
చూద్దాము చంద్రుడి వెన్నెలలోనైనా ఈ అద్భుతమైన పూలవనం ...... నా దేవకన్య అందానితో పోటీపడగలదో లేదో .......
మహి : దేవుడా ....... అంటూ అందమైన సిగ్గులతో ఆనందిస్తూ పులకించిపోతోంది .
అయినా నా దేవకన్య అందానికి సరసాటి అయినది ఈ ప్రపంచంలోనే లేదు .
మహి : దేవుడా ...... అంటూ ప్రేమతో కొడుతూనే పరవశించిపోతోంది .
నిజం మహీ ...... కావాలంటే మంజరిని అడుగు .......
మంజరి : మహిని మించిన అందం ఈ భువిపైన లేనేలేదు - నాకంటే బాగా ఎవరు చెప్పగలరు ........
అంతే సంతోషంతో ఆకాశానికి వినపడేలా కేకలువేస్తూ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెడుతున్నాను .

మహి ఆనందిస్తూనే దేవుడా ...... మీ అందాలరాశికి ఒక చిలిపికోరిక కలిగింది .
నా సౌందర్యరాశి కోరిక తీర్చడంలో మరింత ఆనందం చెప్పు మహీ .......
మహి : తమరు కురిపించిన ఈ లిల్లీ పూల వర్షం లానే ......
అయిపోయాను అంటూ మహి నుదుటిపై నుదుటితో తాకించాను .
మహి : నా దేవుడికి ...... నా మనసులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది అంటూ వొళ్ళంతా జలదరించేలా హృదయంపై ముద్దుపెట్టి చిలిపిదనంతో నవ్వుతోంది .
మహీ ....... కోరిక తీరేసరికి చీకటిపడిపోతుందేమో - బాగా అలసిపోతాము .......
మహి : ఎవరు అలసిపోతారు ? .
నేనే నేనే ....... కోరిక కోరిన నా దేవకన్య ఎలా అలసిపోతుంది చెప్పు - యువరాణి కదా అన్నీ పెద్ద పెద్ద కోరికలే కోరుతుంది .
మహి : మనకు కావాల్సింది కూడా అదేకదా - చీకటిపడాలి చంద్రుడి వెన్నెలలో పూలవనం అద్భుతాన్ని కనులారా వీక్షించాలి - అయినా చీకటిపడ్డాక నా దేవుడి అలసటను అమృతంతో తీరుస్తానుకదా - చివరన ఆ అమృతం కూడా దక్కక పూర్తిగా అలసిపోయేది నేనుమాత్రమే అంటూ కొంటె నవ్వులు నవ్వుతూ నా హృదయంలో వొదిగిపోయింది .
రాత్రి ఏమిటో ? - అమృతం ఏమిటో ? ...... నాకైతే అర్థం కావడం లేదు అంటూ మహి నుదుటిపై పెదాలను తాకించి ప్రేమతో కౌగిలించుకున్నాను .
స్వయంవరం తరువాత తెలుస్తుందలే ప్రభూ ....... అంటూ మాచుట్టూ సంతోషంతో ఎగురుతోంది - ప్రభూ ....... మీ దేవకన్య కోరిక తీరాలంటే వెంటనే మొదలుపెట్టాలి చీకటిపడేలోపు చివరన ఉన్న కొలనులోని తామరపూలవర్షం కూడా కురిపించాలికదా - ఆ అందమైన దృశ్యాలను కనులారా వీక్షించి వెళ్లి చెలికత్తెలకు వివరించాలికదా .......

మంజరీ ఏమిటి అన్నావు - కొలనులో తామరపూల వర్షం కదా ...... హమ్మయ్యా అంతవరకూ అలసిపోయి అమ్మ ఒడిలో చేరామంటే చాలు హుషారు ఉత్సాహం వచ్చేస్తుంది .
మహి : అవునవును అమ్మప్రేమ అలాంటిది మరి - ఆ తరువాత జరిగే కార్యానికి ఆ మాత్రం ఉత్సాహం ఉండాలిలే - అమ్మా ...... ఈరాత్రికి ఇలా ప్రణాళిక పన్నారన్నమాట ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ న హృదయంలో తలదాచుకుని సిగ్గులోలికిపోతోంది .
మహీ ....... ఇలా సిగ్గుపడ్డప్పుడల్లా ముద్దొచ్చేస్తావు తెలుసా అంత అందంగా ఉంటావు .
మహి అందమైనకోపంతో చూస్తుండటం చూసి నవ్వుకుని , ఇదిగో ఇదిగో సిగ్గుల బుగ్గలపై ముద్దులు - తియ్యనైన కోపపు పెదాలపై ముద్దులు ........
అందమైన నవ్వులతో నామీదకు ఎగిరింది .

ప్రేమతో గుండెలపై ఎత్తుకుని లిల్లీపూల దగ్గరనుండి రంగురంగుల గులాబీ మొక్కల దగ్గరకువెళ్ళాను - దివినుండి దిగివచ్చిన దేవకన్యా ఇలా నాపై ఉంటే నా ముద్దుల దేవకన్యపై పూలవర్షం కురిపించగలనా ....... ? .
మహి : ప్చ్ ...... నాకు అవ్వాకావాలి - బువ్వా కావాలి దేవుడా ....... అంటూ గోముగా చెప్పి మరింత ప్రేమతో చుట్టేసింది .
దేవకన్య అందమైన కోరికలు తీర్చడంలో ఆనందమే ఆనందం - మొదట పూలవర్షం కురిపిస్తాను దేవకన్య తనివితీరాక గుండెలపై ఎత్తుకుని మరొక అందమైన పూలదగ్గరికి ముద్దులతో ఎత్తుకునివెళతాను .
మహి : దేవుడు పూలవర్షం కురిపిస్తే దేవుడి ప్రియమైన దేవకన్య ముద్దులవర్షం కురిపిస్తుంది ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... 
మహిని కిందకుదించి చుట్టూ పెరిగిన అన్ని రంగుల గులాబీ పూరేకులను అందుకుని చిరునవ్వులు చిందిస్తున్న దేవకన్యపై వర్షంలా కురిపించాను .
చేతులను విశాలంగా చాపి ఆనందిస్తూనే దోసిల్లలో అందుకుని నాపై కురిపించి అమితానందంతో నా గుండెలపైకి చేరింది .
మహీ ...... ఈ ఆనందం చూస్తూ జీవితాంతం బ్రతికేయ్యొచ్చు అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను . 
మహి : ఎత్తుకో ........
ఇష్టంగా మహీ అంటూ హృదయంపైకి తీసుకున్నాను - ఆ దృశ్యాన్ని చూసి మంజరి ...... గులాబీ రేకుని అందుకుని మాపైకి వదిలింది .
రెట్టింపు ఆనందంతో పెదాలు ఏకం చేసి ముందుకు నడిచాను .

మధ్యమధ్యలో కృష్ణపైనున్న సంచీలోనుండి పళ్ళు అందుకుని మహికి - మంజరికి అందిస్తూ మల్లెపూలు - చామంతిపూలు - మందారపూల ........ ఇలా అక్కడున్న అన్నిరకాల అందమైన పూల వర్షం కురిపిస్తూ చివరికి చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది .
కొలను చివరన ఉన్న పూలమొక్కలనుండి పూలు అందుకుని పులకించిపోతున్న దేవకన్యపై కురిపించాను .
మహి : దేవుడా ....... పూర్తయ్యింది - ఇక మంజరి బయలుదేరే సమయం ఆసన్నమయ్యింది అంటూ నా గుండెలపైకి రాబోతే ......
మహిని అక్కడే ఉండమని ఆపాను .
మహి : దేవుడా .......
కొన్ని క్షణాలుమాత్రమే మా బంగారం కదూ - మంజరీ అంటూ సైగచెయ్యగానే దేవకన్య భుజంపైకి చేరింది - చాలా అందం అంటూ కృష్ణ నుండి తెల్లనైన వస్త్రం - రంగురంగుల పూలనుండి సేకరించిన రంగులతో పూలవనం మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్న చిత్రాన్ని గీసి ఒక అనుభూతితో చూస్తున్నాను .
మహి : దేవుడా దేవుడా చూయించండి చూయించండి మీలో మీరు మురిసిపోతే ఎలా అంటూ పరుగునవచ్చి నన్ను చుట్టేసింది , నాకంటే అందంగా ఉంది - ఒసేయ్ మంజరీ నువ్వుకూడా - మిత్రమా కృష్ణా వెనుక నువ్వుకూడా అంటూ చూయించి పరవశించిపోతోంది - ముద్దులుకురిపిస్తోంది .
మంజరికి నచ్చినట్లు నా బుగ్గపై ముద్దుపెట్టి సంతోషంతో ఎగురుతోంది .
మహి : ఒసేయ్ మంజరీ ఎగిరింది చాలు చీకటిపడుతోందికదా ఇక జాగ్రత్తగా వెళ్లు .........
మంజరి : తమరి సయ్యాటకు ఆలస్యం అవుతుందని చెప్పు మహీ ...... , వెళతానులే ...... - ప్రభూ త్వరగా చిత్రపటాన్ని ఉంచండి వెళ్లిపోతాను .
నవ్వుకున్నాను - మంజరీ ...... జాగ్రత్తగా వెళ్లు తెలుసుకదా ......
మంజరి : తెలుసు ప్రభూ ...... నదీఅమ్మ ప్రవాహం వెంబడే వెళతాను . 
మంజరీ ...... ఇంతకూ సయ్యాట అన్నావు ఏమిటి ? .
మంజరి : స్వయంవరం తరువాతనే ప్రభూ అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి బయలుదేరింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 10-08-2022, 06:32 PM



Users browsing this thread: 49 Guest(s)