Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహి : కృష్ణ జింకలు కృతజ్ఞతలు తెలిపాయి - ఏనుగులు కృతజ్ఞతలు తెలిపాయి , నా సంతోషం కోసం ఇన్నిచేసిన నా దేవుడికి నేనుమాత్రం కృతజ్ఞతలు తెలుపుకోవాలికదా ........
నేనే ...... నా దేవకన్య సర్వస్వం అయినప్పుడు ఇక కృతజ్ఞతలు దేనికి అంటూ ముద్దుపెట్టాను .
మహి : అయితే .......
ఊహూ ...... ఆ ఒక్కటీ ....... నా ముద్దుల దేవకన్య మనసులోని శృంగార కోరిక ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే స్వయంవరం దాకా ఆగాల్సిందే అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను .
మహి : స్వయంవరం స్వయంవరం అంటూ నా గుండెలపై ప్రేమదెబ్బలు కురుస్తున్నాయి .
ప్రతీ దెబ్బకూ దేవకన్య పెదాలపై ముద్దుతో ఆనందిస్తున్నాను .
మహి : మీ దేవకన్యను ఎలా చల్లార్చాలో నా దేవుడికి బాగా తెలుసు అంటూ అందమైనవ్వులతో నా గుండెలపైకి చేరింది - ( కానీ నా ప్రయత్నాలు మాత్రం ఆపనుగా ...... నా దేవుడితో స్వయంవరం లోనే ఎలాగైనా ఏకమైపోతాను అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటోంది ) .

దాహం తీర్చుకున్న ఏనుగులు వెనుతిరిగాయి - గజరాజు మాదగ్గరికివచ్చి ఇద్దరినీ తొండంతో ఆశీర్వదించి ఎక్కమన్నట్లు కూర్చుంది .
మహీ ...... అంటూ వెనుక చూయిస్తూనే ఎత్తుకుని అమాంతం ఏనుగుపైకి చేర్చి వెనుకే ఎక్కాను . 
ఏనుగు లేచి నిలబడింది .
మహి : కిందకుచూసి భయపడి వెంటనే నా చేతులను తన చుట్టూ వేసుకుంది - మిత్రమా మిత్రమా ...... అంటూ సంతోషిస్తోంది . దేవుడా దేవుడా ఒక్కక్షణం ఒక్క క్షణం .......
నాకు కాదు నిన్నే దేవతగా అనుకుంటున్న గజరాజుకు విన్నవించుకో అంటూ ప్రాణంలా వెనకనుండి కౌగిలించుకుని కురులపై ముద్దుపెట్టాను .
మహి : నేనేమీ దేవతను కాదు నా దేవుడు మాత్రమే మా దేవుడు అంటూ నా చేతిపై ముద్దుపెట్టింది - గజరాజా గజరాజా ...... ఒక్క క్షణం ఆగు .
గజరాజుతోపాటు చుట్టూ నడుస్తున్న ఏనుగులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి .
చెప్పానా ....... నా దేవకన్య ఇప్పుడు ఈ ఏనుగులన్నింటికీ దేవత అని ......
మహి ఆశ్చర్యపోయి సంతోషంతో వెనక్కు తలతిప్పి ముద్దులుకురిపించింది . జింకలు - బుజ్జి జింకలకు ముద్దులతో వీడ్కోలు తెలిపి , గజరాజా ...... ఇక వెళ్లొచ్చు అంటూ పొంగిపోతోంది .
చిరునవ్వులు చిందిస్తూ స్వారీచేస్తున్న నా దేవకన్యను వెనకనుండి ప్రేమతో చుట్టేసి బుగ్గపై ముద్దులుకురిపిస్తూ ఎత్తులోనుండి అడవి అందాలను చూయిస్తూ ఆనందిస్తున్నాను .

దేవుడా ...... పళ్ళు పళ్ళు చేతికి అందుతున్నాయి అంటూ చెట్ల నుండి అందుకుని చుట్టూ నడుస్తున్న బుజ్జి ఏనుగుల దారిలో వేస్తూ అవి తినడం చూసి ఆనందిస్తూ నాకు తినిపించి నా నోటి ద్వారా తింటోంది దేవకన్య ....... 
అలా అందే ప్రతీ చెట్టు నుండి పళ్ళు తింటూ ఏనుగుల స్థావరానికి చేరుకున్నాము . అక్కడ ఈ ఏనుగులకు రెండింతలు ఉండటం చూసి మహి మరింత ఆనందిస్తోంది - దేవుడా ...... ఇన్ని ఏనుగులను ఒకేసారి చూస్తాననుకోలేదు అంటూ నా బుగ్గపై ముద్దులుకురిపిస్తోంది . దేవుడా ...... అడవిలోకి ఇంతదూరం వచ్చాము .
చాలా లోపలికి వచ్చాము మహీ .......
మహి : నాకు మరింత లోపలికి వెళ్లాలని ఉంది .
మహీ ....... అదీ మరీ చీకటి పడితే ..... సరే నా దేవకన్య ఇష్టమే నా ఇష్టం అంటూ కురులపై ముద్దుపెట్టాను .
మహి : ఆ ఒక్కటీ తప్ప ఏ కోరికైనా తీరుస్తారు అంటూ చేతిపై కొరికేసింది . నవ్వుకుని గజరాజా ...... నీపై స్వారీ గొప్ప అనుభూతిని కలిగించింది - కిందకు దిగుతాము .
గజరాజు తగ్గడంతో కిందకుదిగాము .

మహి నా బుగ్గపై ముద్దుపెట్టి , ధన్యవాదాలు గజరాజా ....... 
అంతలో బుజ్జి ఏనుగులన్నీ మా చుట్టూ చేరాయి . మేమంటే ఇంత ఇష్టమన్నమాట అంటూ ఆప్యాయంగా స్పృశిస్తోంది - నొప్పిలేనట్లు నడుస్తున్న బుజ్జి ఏనుగు దగ్గరకు సంతోషంతో వెళ్లి దేవుడు వైద్యం చేశారుమరి అంటూ మురిసిపోతోంది . ఇక వెళతాము మీరు మీ అమ్మల చెంతకు చేరండి అంటూ అమితమైన ఆనందంతో పులకించిపోతూ నా చేతిని చుట్టేసింది - దేవుడా ఇక వెళదాము .
యువరాణీ ఆజ్ఞ అంటూ ఎత్తుకునివెళ్లి కృష్ణపై కూర్చోబెట్టాను - కృష్ణ ముందుకు కదలకపోవడంతో సరే అంటూ నవ్వుకుని మహి వెనుక ఎక్కాను .
మహి : మిత్రమా ...... ఉమ్మా ఉమ్మా , ఏనుగులకు సంతోషంతో వీడ్కోలు తెలుపుతూ ముందుకుసాగాము .

ముందుకు సాగుతున్నకొద్దీ ....... అడవి అందాలు మరింత పచ్చదనంతో కనులవిందుచేస్తున్నాయి . చెట్లపై ఇంతకుముందెన్నడూ వీక్షించని రంగురంగుల అందమైన పక్చులు - చుట్టూ చిన్న చిన్న జంతువులను చూసి మరింత ఆనందిస్తోంది నా దేవకన్య .......
దేవుడా దేవుడా ...... నా ముద్దుల దేవుడా అంటూ ఒక్కసారిగా నావైపుకు తిరిగి ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ పెదాలపై తియ్యనైన ముద్దులుకురిపిస్తూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది . 
మ్మ్మ్ ఆఅహ్హ్హ్ ....... హాయిగా ఉంది దేవకన్యా అంటూ అంతే ఘాడంగా కౌగిలించుకున్నాను - మ....హీ ....... అడవి అందా....లు చూడాలంటే అటువై.....పుకు తిరగా....లి అంటూ కలుగుతున్న మాధుర్యానికి తడబడుతూ చెప్పాను .
మహి నవ్వుకుని , నాకు ఇలాగే బాగుంది - జీవితాంతం నా దేవుడి కౌగిలిలో ఉండిపొమ్మన్నా ఉండిపోతాను , ప్రకృతి అందాలను వెనకనుండి చూస్తానులే అంటూ నా మెడపై - చెవిపై ముద్దులుపెడుతోంది .
మ్మ్మ్ ...... ఆఅహ్హ్హ్ హ్హ్హ్ ...... మహీ వద్దు వద్దు ....... నాకేదే....దో అయి.....పోతోంది .
మహి : అయిపోతే ఏదైనా చేసేయ్యండి అంటూ నా చెవితమ్మెను నోటిలోకి తీసుకుంది .
స్స్స్ ....... అంటూ తియ్యదనంతో జలదరిస్తూ మరింత గట్టిగా హత్తుకుని నన్ను నేను మరిచిపోయాను . 
ఎంతదూరం ప్రయాణం సాగించాడో కృష్ణ ప్రవాహం దగ్గరికి తీసుకెళ్లాడు .

నీళ్ల చప్పుడు పెద్దగా వినిపిస్తుండటంతో దేవకన్య తియ్యనైన మాయనుండి బయటపడి కళ్ళుతెరిచాను . ఎదురుగా కాస్త దూరంలో ....... మహీ మహీ ఒకసారి అలా చూడు ......
మహి : నాకు ...... నా కౌగిలి వలన కలుగుతున్న మాధుర్యం తప్ప ఏదీ అవసరంలేదు - ఎటువైపూ చూడను మ్మ్మ్ మ్మ్మ్ అంటూ మరింత గట్టిగా అల్లుకుపోతోంది .
అంతకంటే అదృష్టమా దేవకన్యా ...... , నేనెక్కడికీ వెళ్లను కదా నా కౌగిలిలోనుండే ఒకసారి ఆ అందాలను చూడు మహీ .......
మహి : ఉదయం నుండీ ప్రకృతి అందాలను తనివితీరా తిలకిస్తూనే ఉన్నాము కదా ........
ఆ అందాలన్నీ ఒకఎత్తు అయితే ఇప్పుడు చూసేది మరొక ఎత్తు మహీ ...... ఒక్కసారి అటువైపు చూడు మా బుజ్జికదూ - మా బంగారం కదూ అంటూ నుదుటిపై పెదాలను తాకించాను . 
మహి : నా దేవుడి కౌగిలింతలోని మాధుర్యాన్ని సైతం త్యాగం చేసి చూడబోతున్నాను - అబ్బురపరిచేలా ఉండకూడదు కొరికేస్తాను అంటూ బుగ్గపై కొరికేసి నన్ను హత్తుకునే వెనక్కు తలతిప్పి చూసింది . ఎదురుగా జలపాతపు సౌందర్యాన్ని చూసి ఆహా ...... అద్భుతంగా ఉంది అంటూ సంతోషంతో నానుండి జలపాతం వైపుకు తిరిగింది .

అమ్మ జలపాతం ...... ఈ దేవకన్య అంత అందంగా ఉంది అంటూ కిందకుదిగి దేవకన్యను ఎత్తుకున్నాను . 
మహి ....... నా మెడను చుట్టేసి అమ్మ జలపాతమే అందంగా ఉంది అంటూ నా బుగ్గపై ముద్దులుపెడుతూ కనులారా తిలకిస్తోంది . దేవుడా ...... మనం అడవిలోపలికి కదా ప్రయాణించింది చివరికి నదీ అమ్మను ఇంత అందమైన జలపాతాన్ని ఎలా చేరాము .
బహుశా ....... నదీప్రవాహం మలుపులుతిరుగుతూ అడవి అంతా పచ్చగా ఉండేలా చూసుకుంటోంది కాబోలు ....... 
మహి : అయితే అడవిలో ఎటువైపు వెళ్లినా నదీ అమ్మను చేరుకుంటాము అన్నమాట - ఇంకా ఒడ్డునే ఆగిపోయారే సౌందర్యమైన జలపాతపు అమ్మ దగ్గరికి తీసుకెళ్లరే ........

జలపాతం దగ్గరికి వెళ్లడం లేదు .......
మహి : ఎందుకు ఎందుకు ...... అమ్మదగ్గరికి అమ్మదగ్గరికి అంటూ నా గుండెలపై ప్రేమతో కొడుతూ గింజుకుంటోంది .
ఎందుకా ...... నువ్వు మిట్ట మధ్యాహ్నం నావైపుకు తిరిగి అలా కౌగిలించుకున్నావా ఇద్దరమూ అడవినే మైమరిచిపోయాము మళ్లీ స్పృహలోకివచ్చినది సూర్యాస్తమయానికే ...... చీకటిపడేలోపు యువరాణీగారు యువరాణీ వారి మందిరంలో ఉండాలికదా ...... , నదీ ప్రవాహం వెంబడి ప్రయాణించామంటే చీకటిపడేలోపు చేరుకోవచ్చు - మన మిత్రుడి అసలుసిసలైన వేగాన్ని చూడవచ్చు యువరాణీ గారు అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
మహి : మ్మ్మ్ ...... మరి జలపాతంలో అమ్మఒడిలో జలకాలాట ........
రేపు సూర్యోదయ సమయానికల్లా జలపాతం దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నీ వీరాధివీరుడిది ........ 
మహి : ఈరోజు సూర్యాస్తమయం నుండి రేపు సూర్యోదయం వరకూ ఆగాలా ...... నావల్ల కాదు , తల్లీ - మహీ తల్లీ - బంగారూ ....... తొందరగా నీ దేవుడితోపాటు నా ఒడిలోకి రా అంటూ అమ్మ ప్రేమతో పిలుస్తోంది వినిపించడం లేదా ? . 
పెదాలపై చిరునవ్వుతో దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టాను - అదికాదు మహీ ..... చీకటిపడేలోపు చేరుకోవాలికదా - ప్రవాహం వెంబడి అంటే చుట్టు తిరిగివెళ్లాలి ఆలస్యం అవుతుంది .
మహి : నదీ అమ్మ ఒడిలో చేరకుండా నేను రానంటే రాను - ఒక్కసారి ఓకేఒక్కసారి దేవుడా అంటూ ముద్దులుపెడుతోంది .
ఇంత మధురమైన ముద్దులుపెడితే ........
మహి : ఉమ్మా ఉమ్మా ఉమ్మా దేవుడా అంటూ కిందకుదిగి నాచేతిని అందుకుని జలపాతం వైపుకు లాగుతోంది .
అదిగో చీకటిపడుతోంది అంటే సూర్యాస్తమయం అయిపోయి చాలసేపే అయ్యిందన్నమాట ........
మహి : నాకదంతా తెలియదు , ఇప్పుడైతే ఆలస్యం చేస్తున్నది తమరే .......
నిజమే ....... తొలిసారి కోరిక కోరినప్పుడే అమ్మఒడిలోకి చేరి ఉంటే ఈపాటికి బయలుదేరిపోయేవాళ్ళము .
మహి నవ్వుకుని నాచేతిని లాగుతోంది .

మహీ మహీ ...... అలాచూడు అలాచూడు రంగురంగుల అందమైన రామచిలుక మనవైపుకే ఎగురుకుంటూ వస్తున్నట్లు అనిపిస్తోంది .
మహి : అనిపించడం ఏమిటి దేవుడా మనవైపుకే వస్తోంది - మంజరీ ....... అంటూ చేతివేలుని చూయిస్తూ చేతిని పైకెత్తింది .
ఆశ్చర్యంగా మాదగ్గరికే వచ్చి మహి వేలుపై కాకుండా తలపై ముక్కుతో పొడిచి నేరుగా నా భుజంపైకి చేరింది . మరింత ఆశ్చర్యంగా నా బుగ్గపై ముద్దుకూడాపెట్టింది .
సంతోషంతో చిలుకను సున్నితంగా స్పృశించి వేలుపైకి తీసుకున్నాను - చిలుకా ..... నీ అంత అందమైన చిలుకను నేను నా ప్రయాణంలో దాటిన ఏ అడవిలోనూ చూడలేదు ముద్దొచ్చేస్తున్నావు నా దేవకన్యలా అంటూ తియ్యనైనకోపంతో రుసరుసలాడుతున్న దేవకన్యకు గాలిలో ముద్దు వదిలి చిలుకకు ముద్దుపెట్టాను .

ధన్యవాదాలు చాలా సంతోషం వీరాధివీరా - దేవుడా - ప్రభూ ...... అంటూ రామచిలుక నా దేవకన్య స్వరానికి ఏమాత్రం తగ్గనంతలా తియ్యనైన పలుకులు పలికింది .
మరింత ఆశ్చర్యపోయి కన్నార్పకుండా అలా చూస్తుండిపోయాను .
దేవకన్య తియ్యదనంతో నవ్వుతూ వచ్చి నా గుండెలపైకి చేరింది .
చిలుక : దేవుడా దేవుడా ....... అంటూ మళ్లీ నాభుజం మీదకు చేరి బుగ్గపై ముద్దులుపెడుతోంది .
తేరుకుని చిలుకా ...... స్వరంలో నా దేవకన్యతో పోటీపడుతున్నావు తెలుసా ? .
చిలుక : పలుకులు నేర్చుకున్నదే మీ దేవకన్యతో దేవుడా ...... 
ఓహో అర్థమైంది అర్థమైంది మంజరీ అని పిలిచింది కదూ ....... , మంజరీ ...... అంటూ చేతివేలిపైకి తీసుకుని మళ్లీ ముద్దుపెట్టాను , క్షమించు మంజరీ ...... నిన్ను - దేవకన్యను చూస్తూ ముద్దులుపెట్టకుండా ఉండలేను అంటూ దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టాను .
చిలుక : మా అదృష్టం దేవుడా ...... , కానీ మీ దేవకన్య గురించి నాతో మాట్లాడకండి .

మహి : నేనేమి చేసాను మంజరీ అంటూ ముద్దుపెట్టబోతే ఎగిరి నా మరొక భుజంపైకి చేరింది .
చిలుక : ఎందుకా ....... , నీ కలల రాకుమారుడి గురించి ప్రతీ విషయం నాతోనేకదా మాట్లాడేదానివి .......
మహి : అవును కదా .......
చిలుక : మరి నీ దేవుడిని జాతరలో చూసిన విషయం చెప్పావా ? లేదు - మన దేవుడికోసం నువ్వు జ్వరంతో విలవిలలాడిపోతుంటే ప్రేమతో చూసుకున్నది ఎవరు ? నేను - అలాంటిది నీ దేవుడు రాగానే ప్రక్కనే ఉన్న నన్ను రమ్మని కూడా పిలవకుండా పరుగునవెళ్లిపోయావు , సరేలే స్నేహితురాలు పిలవాల్సిన అవసరం లేదు అని వీలైనంత తగ్గి నేనే ఉద్యానవనంలోకి వచ్చాను - నన్ను మన దేవుడికి పరిచయం చేయకపోగా కనీసం నావైపు కన్నెత్తి కూడా చూడలేదు ....... , ఏళ్లుగా కలవరిస్తున్న దేవుడు కనిపించారు కాబట్టి దేవుడి కౌగిలిలో మైమరిచిపోయావు సరే భోజనం చేసేటప్పుడు - పడుకునేటప్పుడు అయినా మంజరీ అంటూ పిలిచి దేవుడికి పరిచయం చేస్తావేమో అని ఆశపడ్డాను , దేవుడు రూపొందించిన పూలపాన్పుపై హాయిగా పడుకుండిపోయావు , అదికూడా సరే కనీసం ఉదయమైనా గుర్తొచ్చానా అప్పుడు కూడా పరిచయం చెయ్యలేదు ........
మహి నవ్వులు ఆగడం లేదు ........
చిలుక : అందుకే ఇక లాభం లేదనుకుని నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నాను - ఇకనుండీ నీ ప్రాణం కంటే ఎక్కువైన ఈ దేవుడే నా దేవుడు - నా సేవలన్నీ ఇక మన దేవుడికే ........
మహి : అంతకంటే సంతోషం ఏముంటుందే మంజరీ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి వేలితో స్పృశించబోతే కొరికేసింది .
చిలుక : నాకోపం చల్లారేవరకూ ఇంతే - నా ముద్దులన్నీ మన దేవుడికి మాత్రమే సొంతం ........

మంజరీ .......
చిలుక : దేవుడా ...... మీరేమి చెప్పబోతున్నారో నాకు తెలుసు - దయచేసి కాసేపు బెట్టు చెయ్యనివ్వoడి .......
అలా అయితే అలాగే మంజరీ అంటూ ముద్దుపెట్టి , దేవకన్యను ప్రేమతో హత్తుకున్నాను .
చిలుక : ముందు పరిచయం - నా పేరు ...... మీ దేవకన్య చెప్పేసిందిగా అంటూ ఎగురుతూ వెళ్లి దేవకన్య పెదవిపై కొరికేసింది . ( స్స్స్ ...... ) నా పేరు మంజరి - ఈ ముద్దుపేరు పెట్టినది మీ అందమైన దేవకన్యనే .......
ముద్దు ముద్దు పేరు మంజరీ అంటూ దేవకన్య పెదాలపై నేనుకూడా కొరికేసాను .
మహి : స్స్స్ స్స్స్ .......
మంజరి సంతోషంతో అటూ ఇటూ ఎగిరి మళ్లీ భుజంపైకి చేరింది . నా బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవకన్య ...... మాఇద్దరివైపు తియ్యనైనకోపంతో చూస్తోంది - మిమ్మల్నీ అంటూ నా పెదవిపైకొరికేసి నవ్వుతోంది .
స్స్స్ ....... నొప్పి తియ్యగా ఉంది మహీ అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .

మంజరి : దేవుడా ...... నిన్న సాయంత్రం నుండీ చూస్తున్నాను , ఈ దేవకన్య ...... మిమ్మల్ని ప్రేమతో వీరాధివీరా - దేవుడా - ప్రభూ ...... అంటూ పిలుస్తోంది మీ పేరు ఏమిటి అంటూ ముద్దుముద్దుగా అడిగింది .
మహి : అవును నిజమే నా దేవుడి పేరు తెలుసుకోవడమే మరిచిపోయాను - అందుకే మంజరి ఎప్పుడూ నా ప్రక్కన ఉండాల్సిందే అంటూ గాలిలో ముద్దులు వదిలింది .
మంజరి : దీనికేమీ తక్కువలేదు .......
మహి : నవ్వుకుని , దేవుడా ...... మీ నామధేయం ? .
నా అందమైన దేవకన్య నామధేయమే ....... , " ఆ లోకమాత పరమేశ్వరి నామధేయం మహేశ్వరి నా దేవకన్య అయితే ....... "
మహి : " కోరిన వరాలను కటాక్షించే ఆ పరమశివుడి నామధేయం మహేశ్వరుడు ...... నా దేవుడు " అన్నమాట అంటూ నాకళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ హత్తుకుని సంతోషం పట్టలేక హృదయంపై ముద్దులుకురిపిస్తోంది .
అవును మహేశ్వరీ అంటూ అంతే సంతోషంతో నుదుటిపై పెదాలను తాకించాను .
మంజరి : "మహేశ్వరి - మహేశ్వరుడు " ముద్దుగా " మహి - మహేష్ " అన్నమాట ఒకరికోసమేఒకరు పుట్టారన్నమాట అంటూ మా ఇద్దరి ఆనందంతో మా బుగ్గలపై ముద్దులుపెట్టి మురిసిపోతోంది .
ఇద్దరమూ చిరునవ్వులు చిందిస్తూ ఒకరినొకరం ప్రాణంలా చూసుకుని , మంజరికి ఒకేసారి ముద్దుపెట్టాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 21-07-2022, 07:02 PM



Users browsing this thread: 46 Guest(s)