Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఆ ముద్దులకే మహి స్వర్గపు అంచులదాకా వెళ్ళిపోయింది . నాకు ఊపిరాడనంతలా బొడ్డుపై అధిమేసుకుని కలుగుతున్న మధురానుభూతితో మూలుగుతూనే నా తలపై వాలిపోయింది . ఎవరో దేవుడు స్వయంవరం వరకూ ఆగాల్సిందే అనిచెప్పి శృంగారమైన బొడ్డు కనిపించగానే పిల్లాడికి తియ్యనైన పదార్థం దొరికినట్లు ఆపకుండా చప్పరిస్తూనే ఉన్నారు ..... కానివ్వండి కానివ్వండి అంటూ నా తలపై సంతృప్తితో ముద్దులుకురిపిస్తోంది .
వెంటనే దేవకన్య బొడ్డు మైకం నుండి బయటపడి , సిగ్గుపడుతూనే దేవకన్యను గడ్డిపై కూర్చోబెట్టి తలదించుకుని నాలోనేనే నవ్వుకుంటున్నాను .
మహి : అయ్యో ...... అనవసరంగా గుర్తుచేసానే , లేదు లేదు లేదు మీ దేవకన్య దేహాంలో బొడ్డుని మించిన శృంగార అందాలు - రసాల రుచిని ఆస్వాదించగలరు , మీసొంతమైన ఈ శృంగారాది బొడ్డుకు కాస్త కిందభాగంలో .......
మహీ మహీ మహీ ...... అంటూ నా పెదాలతో తన పెదాలను మూసేసి అక్కడితో కైపెక్కించే మాటలు ఆపుచేసాను - కానీ అప్పటికే నా దేహాంలో జరగాల్సిన పెను మార్పు జరిగిపోయినట్లు వొళ్ళంతా వేడిసెగలు - నిట్టూర్పులతో విలవిలలాడిపోతున్నాను .
మహి : లేచి చిలిపినవ్వులతో నా బుగ్గలను అందుకున్నారు - దేవుడా ....... తమరి తాపం చల్లారాలంటే ఓకేఒకమార్గం అదేంటో ఈపాటికి తమరికీ అర్థమైపోయి ఉంటుంది అంటూ పెదాలపై పైపైన ముద్దులుకురిపిస్తోంది .

మ్మ్మ్ ...... హ్హ్హ్ ...... జలదరిస్తూనే మహి పెదవిపై సున్నితమైన పంటిగాటుపెట్టి , ప్రక్కనే ప్రవహిస్తున్న పిల్లవాగులో నిలువునా చేరిపోయాను . చల్లనైన నీళ్లు తలదగ్గర నుండి అరిపాదాలవరకూ స్పృశిస్తుంటే హాయిగా ఉంది . ఆఅహ్హ్హ్ ..... చల్లగా ఉంది , దేవకన్య ఓకేఒక్కమార్గమే కాకుండా అమ్మ ఒడి చల్లదనం కూడా ఉందిలే అంటూ మహి చేతిపై గిల్లేసాను , అందమైన నడుము - బొడ్డు తో శృంగారాన్ని వోలకబోసి నన్ను వశీకరణం చేసేసుకున్నావు కదూ .......
స్స్స్ స్స్స్ ...... అంటూ రుద్దుకుంటూనే నా గుండెలపైకి నిలువునా చేరిపోయి నవ్వుకుంటోంది . 
మహీ మహీ ...... మళ్లీ తడిచిపోతావు .
మహి : తమరికి మాత్రమేనా వేడిసెగలు అయినా ఈ పిల్ల కాలువలో నా దేవుడే సగం తడుస్తున్నారు ఇక మీ గుండెలపైనున్న నేనెలా తడుస్తాను చెప్పండి .......

అయ్యో ..... నా దేవకన్య ఆకలి గురించే మరిచిపోయాను అంటూ తనను ఎత్తుకుని పైకిలేచాను .
మహి : దేవుడా ...... వెనుకంతా తడిచిపోయింది ఇప్పుడైనా బట్టలు మార్చుకోండి .
నా దేవకన్య పంచిన వెడిసెగలకు ........
మహి : అర్థమైంది అర్థమైంది ఆవిరైపోతుంది కదూ ...... అంటూ బుగ్గపై కొరికేసింది.
స్స్స్ ...... , నన్నుకాదు మహీ ...... పళ్ళను తినాలి .
మహి : నాకు ద్రాక్ష కూడా కావాలి .
లేదు లేదు లేదు .......
మహి : కావాలి కావాలి కావాలి ....... కావాలి అంతే , పైకెత్తoడి బుద్ధిగా ద్రాక్షమాత్రమే కత్తిరిస్తాను - ఇంతకుముందులా చెయ్యనంటే చెయ్యను .
నమ్మబుద్దికావడం లేదే అంటూనే దేవకన్య పెదాలపై ముద్దుపెట్టి , పైకెత్తాను .
మహి : మా మంచి దేవుడు అంటూ నోరూరుస్తున్న ద్రాక్ష గుత్తిని కత్తిరించింది . 
గట్టిగా పట్టుకో మహీ ..... కిందపడితే చెల్లాచెదురైపోతాయి అంటూ దించబోతే ......
వద్దు వద్దు వద్దు నేను దిగుతాను అంటూ నాకళ్ళల్లోకే శృంగారంగా చూసి కన్నుకొట్టి , బొడ్డుని నా పెదాలపై తాకించడమే కాకుండా తన మెత్తనైన ఛాతీ అందాలను నా ముఖంపై - ఛాతీపై అధిమేస్తూ కిందకుదిగింది . 
ఆ మెత్తదనానికి - తియ్యనైన అనుభూతికి కదలకుండా నిలబడిపోయాను .
మహి : చిలిపిదనంతో నవ్వుకుని దేవుడా దేవుడా ...... అంటూ కదిలించింది .

నాకు అప్పుడే సందేహం వచ్చింది , నిన్నూ నిన్నూ ...... ఆగు ఆగు అక్కడే ఆగు మహీ .......
ఊహూ ..... ఆగనంటే ఆగను అంటూ పరుగులుతీసింది .
మహీ ...... ఏమైనా గుచ్చుకుంటాయి అంటూ వేగంగా పరిగెత్తి గుండెలపైకి తీసుకున్నాను - గుండుపై కూర్చోబెట్టి మోకాళ్లపైకి చేరి పాదాలను స్పృశించి ఏమీకాలేదు అంటూ అరిపాదాలపై ముద్దులుపెట్టాను .
దేవుడా అంటూ మోకాళ్ళమీదకు జారి నా గుండెలపైకి చేరింది మహి ......
ఎలాంటి వీరాధివీరుడైన - స్వర్గంలోని దేవుళ్లయినా ....... వాళ్ళ సౌందర్యరాశి అందాలముందు ఇలా మొకరిల్లాల్సిందే - ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన యుద్ధాలలో సగానికిపైగా యుద్ధాలు అందమైన అమ్మాయిల కోసమే జరిగాయని గ్రంథాలు చెబుతున్నాయి అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
తియ్యదనంతో నవ్వుకుంది ........

ఇక చిలిపిఅల్లరి చెయ్యకుండా బుద్ధిగా తినాలి అంటూ ఎత్తుకునివెళ్లి వాగు ప్రక్కనే కూర్చోబెట్టి పళ్ళను ముందు ఉంచి ఎదురుగా కూర్చున్నాను . తినండి నా ముద్దుల యువరాణీ .......
మహి : ఊహూ ...... అంటూనే క్షణంలో నా ఒడిలోకి చేరిపోయింది , నా దేవుడు ప్రేమతో తినిపించాలి - చేతితో కాదు ........
చేతితోకాకుండా మరెలా ........
మహి : ముందు మిత్రుడికి ఆహారం ......
నేను ఎప్పుడో తినడం మొదలెట్టాను అంటూ దూరంగా పచ్చని గడ్డిని తింటున్నట్లు సైగలుచేశాడు .
మహి సంతోషించి , అందమైన నవ్వులతో ఒక ద్రాక్షపండుని నా పెదాలకు అందించింది - నేను నోటిలోకి తీసుకునేలోపు నా పెదాలను మూసేసి సగం ద్రాక్షను కొరికింది ఇలా అంటూ ....... , నా పెదవి నుండి జారుతున్న ద్రాక్షారసాన్ని నాలుకతో జుర్రేసుకుని మ్మ్మ్ ...... అంటూ లొట్టలేస్తోంది .
చేప పిల్లకు ఈత నేర్పించాలా ...... నేనుకూడా దేవకన్య పెదవి నుండి జారుతున్న రసాన్ని పెదాలతో అందుకుని మరింత తియ్యగా ఉంది అంటూ కళ్ళుమూసుకుని ఆస్వాధిస్తున్నాను .
దేవకన్య పట్టరాని ఆనందంతో నా పెదాలపై ఆపకుండా ముద్దులుకురిపిస్తోంది . అలా పళ్లన్నింటినీ పెదాలద్వారా తినిపించుకుని ఆనందించాము .

మహి : ప్రకృతి అమ్మ - నదీ అమ్మ అందాలను చూఇస్తానని తీసుకొచ్చి ఇక్కడే ఘడియలు సమయాన్ని వృధాచేశారు .
నేనా ...... ? అంటూ నవ్వుతూనే దేవకన్యను ఎత్తుకుని పైకిలేచాను . ఇలా వెయ్యడంతో వచ్చిన కృష్ణపై మహిని కూర్చోబెట్టి మహి చేతిని ముద్దుపెడుతూనే నదీ ప్రవాహంవైపుకు నడిచాను .
మహి : మిత్రుడిపై భారం వెయ్యడం భావ్యం కాదు నేనూ నడుస్తాను దేవుడా .......
ఊహూ ఊహూ ...... అంటూ కృష్ణ దిగడానికి ఒప్పుకోవడం లేదు . 
మహీ ...... మిత్రుడు చెప్పినది నిజం - సుకుమారంగా పెరిగిన యువరాణి ఈ అడవిలో నడవడం కష్టం - నీకు ఏమైనా అయితే ఇద్దరమూ బాధపడతాము .
మహి : నాకు ...... నా దేవుడి చేతిని చుట్టేసి గుండెలపైకి చేరి ఈ అందాలను వీక్షించాలని ఆశగా ఉంది మరి .......
నువ్వూ ...... ఎక్కు మిత్రమా అంటూ కృష్ణ సైగలుచేస్తున్నాడు .
మహి : మిత్రమా ...... లేదు లేదు లేదు నాకు ఎలాంటి ఆశ లేదులే , దేవుడా కదలండి .
ఎక్కేంతవరకూ కదిలేదేలేదు - దీనిలో ఇద్దరి మాటా విన్నాను - నేనున్నది దేనికి - నా శక్తి గురించి తెలియదా అన్నట్లు చూస్తోంది .
నాకంటే మొండి అంటూ దేవకన్య వెనుకకు ఎక్కి ప్రేమతో చుట్టేసాను - ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది మిత్రమా ఉమ్మా ఉమ్మా .......
మహి : మిత్రమా బరువుగా ఉన్నాము కదూ ....... 
ఊహూ ...... అంటూ ఉత్సాహంతో ముందు కాళ్ళను పైకెత్తి కేకలువేస్తూ వేగంగా ముందుకు కదిలింది .
మహి భయంపై ప్రక్కనుండి నాచేతిని గట్టిగా పట్టుకుంది . కొద్దిదూరం వెళ్ళాక ఉత్సాహంతో కేకలువేస్తోంది - మిత్రమా ...... చాలా చాలా సంతోషంగా ఉంది తనను చుట్టేసిన నా చేతులను చుట్టేసి పచ్చని అందాలను - నదీ ప్రవాహాన్ని ఆస్వాధిస్తోంది .

నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రయాణిస్తూ పచ్చని గడ్డి మైదానాలను - మధ్యమధ్యలో పడుతున్న వర్షపు చునుకులను ఆగిన తరువాత కనిపించే అందమైన పొగమంచు వాతావరణాన్ని వీక్షిస్తూ ముందుకువెళ్లాము . 
దేవుడా ...... నాకు అడవిలోపలికి కూడా వెళ్లాలని ఉంది .
యువరాణీ వారి ఆజ్ఞ అన్నానో లేదో ....... నదీ ప్రవాహం నుండి మరొకవైపుకు అడవిలోపలికి దారి మరల్చాడు కృష్ణ ....... 
నేలపై చిన్న చిన్న సెలయేళ్ళు - ఆకాశాన్ని తాకుతున్న పెద్ద పెద్ద వృక్షాలు వాటిపై పక్షుల అందమైన కిలకిలరావాల శబ్దాలకు మహి పులకించి నా చేతిపై మధ్యమధ్యలో వెనక్కు తిరిగి బుగ్గపై ముద్దులుపెడుతూ ఆనందిస్తోంది - దేవుడా ....... ఇంత ఆనందాన్ని ఎప్పుడూ ఆస్వాదించనేలేదు అంటూ పక్షుల శబ్దాలకు అనుగుణంగా అంతే తియ్యనైనస్వరంతో వాటితో కలిసి శాబ్ధాలుచేస్తూ ఆనందిస్తోంది . మిత్రమా మిత్రమా ...... ఆగు ఆగు - దేవుడా కొలను కొలనుచుట్టూ అందాలు అదిగో అక్కడ అక్కడ కృష్ణ జింకలు కృష్ణ జింకలు కొలనులోని నీళ్లు తాగుతున్నాయి అంటూ సంతోషం పట్టలేక చప్పట్లుకొడుతోంది .

వాటి దగ్గరకు వెళ్లాలని - వాటితో ఆడుకోవాలని ఉందికదూ వాటికంటే అందమైన నా దేవకన్యకు ........
మహి : నా మనసులో ఏముందో నా దేవుడికి ఇట్టే తెలిసిపోతుంది అంటూ వెనక్కుతిరిగి పెదాలపై ముద్దుపెట్టింది - అయినా వాటికంటే నేనేమీ అంత అందంగా లేనులే అంటూనే నా అందమైన పొగడ్తలు మురిసిపోతున్నట్లు నవ్వుతూనే ఉంది .
దేవకన్యతోపాటు నవ్వుకుని భోజన సమయం కూడా అయ్యింది అంటూ కిందకుదిగి దేవకన్యను కిందకుదించాను .
మహి : నా చేతిని చుట్టేసి త్వరగా తీసుకెళ్లండి , తీర్చమన్న ఆకలి తీర్చరు అంటూ సిగ్గులోలికిపోతోంది .
ప్రేమతో మొట్టికాయవేసి అలా ఆలోచించడం మానవా ...... ? - ఎంత ప్రాధేయపడినా ఆజ్ఞవేసినా అదిమాత్రం స్వయంవరం తరువాతనే ......
మహి : అదీ చూద్దాము దేవుడా - నా వంతు ప్రయత్నాలు అయితే ఆపనంటే ఆపను అంటూ ప్రేమతో నా బుగ్గపై ముద్దుపెట్టింది .
నవ్వుతూనే గుంపుగా కొలనులో దాహం తీర్చుకుంటున్న కృష్ణజింకల దగ్గరికి వెళ్ళాము .
మహి : ఆహా ...... ఒక్కసారి ఇన్ని జింకలను చూస్తుంటే చాలా చాలా సంతోషం వేస్తోంది - పెద్దవాటివైపుకు కాదు అదిగో అక్కడ చెంగు చెంగున వాళ్ళ అమ్మల చుట్టూ గెంతులేస్తున్న బుజ్జి జింకల దగ్గరికి ........

జింకలు అన్నాకూడా భయం అన్నమాట నా ముద్దుల దేవకన్యకు .......
మహి : భయమే మరి , కానీ నా దేవుడు ప్రక్కనే ఉంటే పెద్ద పులి - సింహం ఒకేసారి వచ్చినా భయపడను .
అవంటే నాకూ భయమే మహీ .......
మహి : నా వీరాధివీరుడి గురించి నాకు తెలుసులే , నిన్నారాత్రి జూలువిదిల్చిన సింహంపై స్వారీ చేసిన విషయం వినలేదు అనుకున్నారా ? .
అంటే అప్పుడు గురువుగారు ప్రక్కనే ఉన్నారు . 
మహి : ఆ తరువాత ఆ తరువాత .......
అవికూడా చెప్పేసానా అంటూ సిగ్గుపడ్డాను .
మహి : నా దేవుడి అందమైన బాల్యం మొత్తం నా హృదయంలో భద్రపరుచుకున్నానుకదా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టివెళ్లి , ఆప్యాయంగా రెండు అందమైన బుజ్జి జింకలను ఎత్తుకుని ముద్దుచేస్తూ ఆనందిస్తోంది .

మహీ మహీ ...... ఒక్కనిమిషం అంటూ కృష్ణను పిలిచి సంచీలో ఉన్న తెల్లని గుడ్డను మరియు రంగురంగుల మొక్కల నుండి రంగురంగుల రసాలను అందుకుని , జింకలను ఎత్తుకుని ఆనందిస్తున్న దేవకన్య అందమైన చిత్రాన్ని రూపొందించి చూయించాను .
పెదాలపై తియ్యదనం - వెలిగిపోతున్న కళ్ళతో జింకలను ఎత్తుకునే నాదగ్గరికివచ్చి , నా వీరాధివీరుడికి చిత్రకళ కూడా తెలుసన్నమాట అద్భుతంగా ఉంది , ఈ చిత్రాన్ని రూపొందించినందుకుగానూ నా దేవుడికి సర్వస్వాన్ని సమర్పించుకోవచ్చు అలా పొదలలోకి వెళదామా దేవుడా ........
ప్రేమతో మొట్టికాయవేశాను . 
స్స్స్ ...... అంటూనే ముసిముసినవ్వులతో నా గుండెల్లో దాచుకుంది .

అంతలో జింకలన్నీ చెల్లాచెదురుగా పరుగులుతీసాయి - బుజ్జి జింకలు తల్లులు మాత్రం మా వెనుక భయపడుతూ దాక్కున్నాయి . 
ఆశ్చర్యపోయి ఏమిటా అనిచూస్తే గుంపుగా పెద్ద పెద్ద ఏనుగులు దాహం తీర్చుకోవడానికన్నట్లు కొలనువైపుకు వస్తున్నాయి . 
మహికూడా భయపడి నావెనుకకువెళ్లి దాక్కుంది . 
మహీ ...... పెద్దపులి - అడవిరాజు వచ్చినా భయపడను అన్నావు .
మహి : అన్నానుకదా ...... అయినా నా దేవుడు ఉండగా నాకేంటి భయం , బుజ్జి జింకలూ ...... ఇక మీ అమ్మలతోపాటు వెళ్లిపోండి అంటూ ముద్దులుపెట్టి తల్లుల దగ్గరకు చేర్చింది - బెదురుతూనే నా ప్రక్కకువచ్చి నాచేతిని చుట్టేసింది . బుజ్జి జింకలు మరియు తల్లులు ....... మిగతా జింకలతోపాటు పారిపోకుండా కొలనువైపుకు ఆశతో చూస్తున్నాయి - అయ్యో ...... నా వలన బుజ్జి జింకలు దాహమే తీర్చుకోలేదు దేవుడా ఇప్పడెలా - తప్పంతా నాదే అంటూ బాధపడుతోంది .
జింకలవైపుచూస్తూ దిగులుచేందుతున్న నా దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి , దేవకన్య చేతివేళ్ళతో చేతివేళ్ళను పెనవేసి , కొలను దగ్గరికి చేరుకున్న ఏనుగులరాజుకు అతిదగ్గరగావెళ్లి తొండాన్ని ఆప్యాయంగా స్పృశిస్తూ , స్పర్శ ద్వారా విషయాన్ని తెలియజేశాను .
వెంటనే బాధపడుతున్న దేవకన్య తలపై తొండంతో ఆశీర్వదించింది . 
మహీ ....... నీ ప్రార్థన ఫలించింది - ఇక నీఇష్టం .......
మహి : నా దేవుడు నిజంగా దేవుడే అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టివెళ్లి , బుజ్జిజింకలను ఎత్తుకుని వాటి తల్లులతోపాటు నీళ్లదగ్గరికి తీసుకెళ్లి తృప్తిగా దాహం తీర్చుకోండి అంటూ పచ్చని ఆకులను కూడా తినిపించి నాదగ్గరికివచ్చి చేరింది . 

జింకలను ఇబ్బందిపెట్టకుండా వాటికి అటూ ఇటూ దాహం తీర్చుకుంటున్నాయి ఏనుగులు ........ 
ఏనుగుల వెనుక ఏనుగులు వచ్చిన కొద్దిసేపటి తరువాత ఒక బుజ్జి ఏనుగు - తల్లి ఏనుగు నెమ్మదిగా వస్తున్నాయి కారణం బుజ్జి ఏనుగు ఒక పాదానికి గాయమైనట్లు ఎత్తిపట్టుకుని మూడు పాదాలతోనే వస్తుండటం .
మహి : దేవుడా ........
కళ్ళతోనే వెళ్లు అంటూ సైగచేసాను .
మహి వడివడిగా వెళ్లి పాదం వైపు చూసి కళ్ళల్లో చెమ్మతో తొండాన్ని అందుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్లి నీళ్ల దగ్గర వదిలింది , దేవుడా ...... కొస్సిగా ఉన్న చెక్క గుచ్చుకున్నట్లుగా ఉంది రక్తం కారుతూనే ఉంది - కళ్ళల్లో కన్నీళ్లు కూడా కారుతున్నాయి అంటూ ఆప్యాయంగా స్పృశిస్తూ కంగారుపడిపోతోంది .  
ఒక్క నిమిషం మహీ అంటూ చుట్టూ పెరిగిన ఔషధాల్లాంటి మొక్కలనుండి ఆకులను అందుకుని గుడ్డతోపాటు బుజ్జి ఏనుగు దగ్గరికి చేరాను . ఆకులను బండరాయిపై ఉంచి మహీ రసం ఊరేలా నూరమన్నాను .
మహి అరచెయ్యి పరిమాణంలో ఉండే గుండ్రటి రాయిని అందుకుని చెప్పినట్లే చేస్తోంది .

దాహం తీర్చుకుంటున్న బుజ్జిఏనుగు పాదాన్ని సున్నితంగా అందుకుని , ఆప్యాయంగా స్పృశిస్తూ ...... మహి నూరగానే , నొప్పివేస్తుందని స్పర్శద్వారానే తెలియజేసి అరిపాదానికి గుచ్చుకున్న చెక్కను లాగేసాను .
నొప్పితో కేకలువేస్తూ విలవిలలాడిపోతున్న బుజ్జిఏనుగును ...... మహి ఆప్యాయంగా స్పృశిస్తూ నొప్పిని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది .
అయిపోయింది అయిపోయింది అంటూ పెద్దమొత్తంలో పసరును ఆకులతోపాటు గాయంపై ఉంచి గుడ్డను చుట్టాను .
అంతవరకూ చెక్కవలన కలిగిన నొప్పి పూర్తిగాతగ్గినట్లు రక్తంతో పాటు కన్నీళ్లు కూడా ఆగిపోవడం చూసి మహి ఆనందాలకు అవధులులేవు . నొప్పి తగ్గిందా బుజ్జి ఏనుగూ ....... అంటూ హత్తుకునివెళ్లి కృష్ణపై సంచీలో ఉన్న పళ్లన్నింటినీ తెచ్చి , అప్పటికే సంతోషంతో చుట్టూచేరిన బుజ్జిఏనుగులకు తినిపించి ఆనందిస్తోంది .
బుజ్జిఏనుగు దాహం తీర్చుకుని కాస్త ఇబ్బందిగానే అయినా అడుగులువెయ్యడం - దేవకన్య దగ్గరికి చేరి బుజ్జి తొండంతో దేవకన్య చేతిని అందుకుని బుజ్జి ఏనుగుల దగ్గరికి తీసుకెళ్లింది - బుజ్జి ఏనుగులన్నీ తమ స్నేహితుడి నొప్పి స్థానంలో సంతోషాన్ని చూసి దేవకన్య చుట్టూ చేరి తొండాలతో కృతజ్ఞతలు తెలుపుతున్నాయి .
మహి : దేవుడా దేవుడా .......
మహీ ...... కాసేపు అలాగే ఉండు అంటూ మరొక గుడ్డ అందుకుని బుజ్జిఏనుగుల మధ్యన చిరునవ్వులు చిందిస్తున్న నా అందమైన దేవకన్య చిత్రాన్ని గీసి చూయించాను . 
గాలిలో ముద్దుల వర్షమే కురిసింది .

బుజ్జి ఏనుగు నెమ్మదిగా నడవడం చూసి , తల్లి ఏనుగు ఆనందబాస్పాలతో బుజ్జిఏనుగుని అక్కున చేర్చుకుని మహిని తొండంతో ఆశీర్వదించింది . 
మహి : నన్నుకాదు మన దేవుడిని అంటూ తల్లి ఏనుగును ఆప్యాయంగా స్పృశించి వచ్చి నా గుండెలపైకిచేరి తెగ మురిసిపోతోంది - నా వీరాధివీరుడికి వైద్యం కూడా తెలుసన్నమాట అంటూ బుగ్గపై కొరికేసింది - ఇందుకోసం అయితే .......
నా దేవకన్య ఏమి కోరిక కొరబోతోందో నాకు తెలుసులే అన్నట్లు కళ్ళతోనే వ్యక్తపరిచి పెదాలను పెదాలతో మూసేసాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 21-07-2022, 07:01 PM



Users browsing this thread: 70 Guest(s)