Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
 రోజూకంటే కాస్త ముందుగానే అంటే చీకటి ఉండగానే మేల్కొన్నాను . జీవితాంతం ఇక ఇలానే హాయిగానిద్రపోవాలన్న మాధుర్యపు అనుభూతితో నిద్రపోతున్న మహీ నుదుటిపై పెదాలను తాకించాను .
ఆ చిన్న ముద్దుకే పెదాలపై తియ్యదనంతో మ్మ్మ్ ...... అంటూ నన్ను మరింత అల్లుకుపోయింది .
అంతే తియ్యదనంతో నవ్వుకుని , మహి బుగ్గను ప్రేమతో స్పృశిస్తూ ....... మహీ , నదీ అమ్మ దగ్గరికి వెళ్లివస్తాను - అంతవరకూ హాయిగా నిద్రపో - మన మిత్రుడు తోడుగా ఉంటాడులే అంటూ అతినెమ్మదిగా మహి కౌగిలి నుండి వేరయ్యాను . 
మా మంచి మహి అంటూ పెదాలపై తాకీతాకనట్లుగా చేతితో ముద్దుపెట్టి లేచాను .

ఆ సమయానికి చలి ఎక్కువగా ఉండటం - అప్పటివరకూ నా హృదయంపై వెచ్చగా నిద్రపోయినట్లు నేను వేరవ్వగానే వణకడం చూసి చిరునవ్వులు చిందిస్తూ వెంటనే ప్రక్కనే చేరి మహి చేతిని అందుకున్నాను . లేదు లేదు లేదు వెచ్చగా నిద్రపో మహీ అంటూ బుగ్గపై వెచ్చనైన ముద్దులుపెట్టాను .
ప్రతీ ముద్దుకూ మహి పెదాలపై తియ్యదనం - ముచ్చటేసి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది . మహీ ...... అమ్మ ఒడిలో సూర్యవందనం చేసుకుని వెంటనే వచ్చేస్తాను అంటూ మల్లెమొగ్గలతో ప్రక్కనే రాసి , మహికి వెచ్చదనం కోసం భుజాలవరకూ పూలను దుప్పటిలా కప్పాను . 
వెచ్చగా ఉన్నట్లు అనుభూతి చెందడం చూసి నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి బయలుదేరాను . వెనక్కుతిరిగి మహివైపు చూస్తూనే కాస్తదూరంలో అప్పటికే మేల్కొన్న కృష్ణదగ్గరకు చేరుకుని జాగ్రత్త అంటూ హత్తుకున్నాను . 

వెంటనే వచ్చేయ్యాలి అంటూ పరుగున రక్షణ గోడ దగ్గరకువెళ్లి చెట్టుద్వారా గోడపైకెక్కి , చుట్టూ చూసి నిన్న పైకిలాగిన తీగల ద్వారా చప్పుడు చెయ్యకుండా కిందకుదిగాను .
వీధులలో అక్కడక్కడా కాపలాకాస్తున్న భటుల నుండి ఎలాగోలా తప్పించుకుని నదీప్రవాహం దగ్గరికి చేరుకునేసరికి తెల్లవారింది .
అమ్మా ...... సమయానికి మీ దగ్గరికి చేరేలా అనుగ్రహించారు అంటూ ఆనందంతో ప్రవాహంలోకి అడుగుపెట్టి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడికి వందనం చేసుకున్నాను . అమ్మా ...... మన్నించండి ఈరోజు నుండీ త్వరగా వెళ్లిపోవాలి అక్కడ మీబిడ్డ వేచిచూస్తూ ఉంటుంది అంటూ అమ్మ ఒడిలో స్నానమాచరించాను.

( అదేసమయానికి ఉద్యానవనంలో చెలికత్తెలందరూ ...... సూర్యోదయం అయినా ఇంకా నిద్రపోతున్న మహి చుట్టూ చేరి పూలదుప్పటిలో దేవకన్య అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
ఆ నవ్వులకు మెలకువవచ్చినట్లు దేవుడా దేవుడా అంటూ కలవరిస్తూ కళ్ళుతెరిచింది - ప్రక్కన చూస్తే నేను లేకపోవడంతో లేచి కూర్చుని దేవుడా దేవుడా అంటూ కంగారుపడుతూ చుట్టూ చూస్తోంది .
చెలికత్తెలు : మహీ మహీ ....... శాంతించు శాంతించు , నీ దేవుడు ఇక్కడ అంటూ పూలతో రాసిన వ్రాతవైపు చూయించారు . సూర్యవందనం కోసం నది దగ్గరకు వెళ్ళారు .......
మహి కళ్ళల్లో చెమ్మతో లేచి వ్రాత దగ్గరికి చేరింది . 
చెలికత్తెలు : మహీ మహీ ...... ఏమైంది - త్వరగా వచ్చేస్తారులే అంటూ ఓదారుస్తున్నారు . 
మహి బాధను చూడలేక కృష్ణ దగ్గరికివచ్చాడు . 
మహి : మిత్రమా అంటూ లేచి మెడను చుట్టేసింది . రక్షణ గోడ దగ్గరికి తీసుకెళ్లి ఆశతో ఎదురుచూస్తోంది ) .

తడి వస్త్రాలతోనే అంతే జాగ్రత్తతో రక్షణగోడను చేరుకున్నాను .
మహి చాకచక్యంగా ఇటువైపు భటులెవరూ కాపలాగా రాకుండా చేయడంలో సఫలీకృతం అయ్యిందనే చెప్పుకోవాలి లేకపోతే క్షణం కూడా వదలకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు - ఇకనేమి కంగారుపడకుండా లోపలికి వెళ్ళవచ్చు అంటూ దర్జాగా పైకెక్కాను . 

పైనుండి మహి పడుకున్న స్థలంలో చూస్తే లేదు - తీగలను పైకి లాగుతూ కిందకుచూస్తే ....... కృష్ణను ఆప్యాయంగా స్పృశిస్తున్న మహి ...... , కళ్ళు - పెదాలపై కోపం ..... ఎవరిపై ఇంకెవరిపై నాపైననే అన్నమాట అయిపోయాను అంటూ నవ్వుకున్నాను . 
చప్పుడు చెయ్యకుండా కిందకుదిగాను . నా ఉనికిని ముందుగానే పసిగట్టినట్లు కృష్ణ కదలికలు తెలిసిపోతున్నాయి . చెట్టు చాటున మహి వెనుకకు చేరి కురులపై ముద్దుపెట్టాను .
" దేవుడా ....... " అంటూ మరుక్షణంలో నావైపుకు తిరిగి హృదయంపైకి చేరిపోయింది . ఎంత కోపం వచ్చిందో తెలుసా ...... మిమ్మల్ని చూడగానే ఏమిటి ఇలా కరిగిపోయాను అంటూ ఛాతీపై ప్రేమతో కొడుతోంది .
మహీ ...... తడిచిపోయి ఉన్నాను .
మహి : అయినా పర్లేదు అంటూ మరింత గట్టిగా అల్లుకుపోయింది .
ఆనందిస్తూనే మహి బుగ్గలను అతిసున్నితంగా అందుకుని , కళ్ళల్లో చెమ్మ చూస్తుంటే కోప్పడినట్లుగా లేదు ........
మహి : నాదేవుడిని చూడకుండా ఒక్కక్షణం కూడా ఉండలేను మరి , నదీ అమ్మ దగ్గరికి నన్నూ తీసుకెళ్ళొచ్చు కదా .......
అంతెత్తు ఉన్న రక్షణ గోడవైపుకు చూసాను .
మహి : వీరాధివీరుడి ప్రియురాలిని ఇంతకు రెండింతల గోడను కూడా అవలీలగా దాటేస్తాను చూస్తారా చూస్తారా ........
నమ్ముతున్నాను నమ్ముతున్నాను మహీ ..... ఎంతైనా దివినుండి దిగివచ్చిన దేవకన్యవు కదా అంటూ కౌగిలిలోనే బంధించాను .
దేవకన్య : మీ దేవకన్యను కాదు కాదు పాద దాసీని .......
మహీ ........ నీ స్థానం ఇక్కడ అంటూ హృదయంవైపు చూయించి నుదుటిపై ముద్దుపెట్టాను - నిన్ను బాధపెట్టాలని కాదు .
మహి : నా దేవుడిని వదిలి ఒక్కక్షణం కూడా ఉండలేను - భటులు చూస్తే అపాయం - మీకేమైనా జరిగితే ఈ ప్రాణం నిలువదు .......
మహీ ....... ఊహూ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నాను .
మహి : మీరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా వెళ్ళవచ్చు - నేనూ వస్తాను కాదనకండి .
చెలికత్తెలు : మహి ప్రక్కనే ఉంటే రాజ్యంలో ఎవ్వరూ ఏమీచెయ్యలేరు వీరా ...... , పాపం అన్నీ వసతులూ గల పంజరంలో బ్రతుకుతోంది - అలా స్వేచ్ఛగా ప్రకృతిలోకి తీసుకెళ్లగలరు ...... , మీరు వచ్చేన్తవరకూ ఇక్కడ మేము చూసుకుంటాము .

మహీ ....... ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నావా ? .
మహి : నా దేవుడితోకలిసి - మిత్రుడితోపాటు ....... అంటూ సంతోషంతో నవ్వింది .
నా దేవకన్య ఎప్పుడూ ఇలా అందంగా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి దానికోసం ఏమైనా చేస్తాను ఇంతదూరం అయినా వెళతాను అంటూ తియ్యదనపు పెదాలపై ముద్దుపెట్టాను .
మరింత అందంగా సిగ్గుపడింది .
ఆఅహ్హ్హ్ ...... జీవితాంతం ఈ సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోగలను - ఆ అదృష్టాన్ని ప్రసాధిస్తుందా నా దేవకన్య ......
అందమైనకోపంతో ఛాతీపై కొడుతోంది .
అలాగే అలాగే మహీ ...... అంటూ నుదుటిపై పెదాలను తాకించి అమాంతం రెండుచేతులతో ఎత్తుకున్నాను - నా ప్రియమైన దేవకన్యకు ...... గోడను ఎక్కే సమయం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు - గట్టిగా పట్టుకో ........
మహి : అవసరం లేదు అంటూ మహి చిరునవ్వులు చిందిస్తూ మెడను చుట్టేసి బుగ్గపై - పెదాలపై ముద్దులు కురిపిస్తోంది .

చామంతి : మిగతా చెలికత్తెలను పంపించేసి , ప్రభూ ....... అంటూ ఒక మూలన ఉన్న గోడదగ్గరికి తీసుకెళ్లి గోడపై ఒకచోట రహస్యంగా ఉన్న నొక్కు నొక్కింది . 
భూతల్లి రహస్యమార్గం తెరుచుకుంది .
మహి : ప్రతీ రాజ్యంలో రాజ్యానికి నాలుగువైపులా రాజు - రాణి - యువరాణినైన నాకు మాత్రమే తెలిసేలా ఇలాంటి మార్గాలు ఉంటాయి .
ఏదైనా అనుకోని అపాయం జరిగేంతలో జాగ్రత్తగా వేరేచోటకు చేరుకోవడానికి అన్నమాట మంచి ఉపాయమే .......
చామంతి : ప్రభూ ...... ఈ మార్గం నేరుగా నదీప్రవాహం దగ్గరికి చేర్చుతుంది - మళ్లీ ఈ ద్వారం ద్వారానే లోపలికిరావచ్చు , మహీ ...... రాగానే మొదటగా నీ కళ్ళు - ముఖాన్నే చూస్తాను - పువ్వులా పరిమళించాలి .
మహి : పోవే నాకు సిగ్గేస్తోంది అంటూ నా గుండెల్లో తలదాచుకుని పులకించిపోతోంది . నా పెదాలపై ముద్దుపెట్టి కిందకుదిగి మిత్రమా ..... ముగ్గురమూ వెళుతున్నాము - నీ మిత్రుడు ..... మనల్ని వదిలివెళ్లినా మనం వదలనే కూడదు సరేనా ........
కృష్ణ : సంతోషంతో తల ఊపాడు .
చామంతి : ప్రభూ ..... అంటూ కాగడ అందించింది - మహీ ..... అవసరమైన వస్త్రాలు అంటూ సంచి అందించింది . 
నామీద ఉంచు అంటూ కృష్ణ సైగచేశాడు .
మహీ ...... జాగ్రత్త అంటూ మెట్లమార్గంలో కిందకుదిగాను - వెనుకే మహి - కృష్ణ వచ్చారు .
ఇద్దరు మనుషులు సులువుగా నడవగలిగే ద్వారంలో వందల అడుగుల తరువాత ద్వారం చేరుకున్నాము . 
మహి : దేవుడా ...... ఇదిగో తాళాలు ఇది బయటకు - ఇది లోపలకు .......
మహి పెదాలపై ముద్దుపెట్టి , తాళం తెరిచాను .

మహి : దేవుడా ...... కాస్త కష్టపడాలి - ఎప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి తెరిచినట్లు గుర్తు .
అంతే తెరవడం ఆపేసి కళ్ళల్లో చెమ్మతో మహి బుగ్గలను ప్రాణంలా అందుకున్నాను - ఈ రహస్య మార్గం గుండా వచ్చావు అంటే అంటే .......
మహి : అవును మీ మనసులో అనుకుంటున్నది నిజమే ....... , ఇప్పటిలానే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అడవిలో నివసించే బందిపోట్లు నా పదేళ్ల వయసులో ఒకసారి రాత్రి సమయంలో నలువైపుల నుండీ ఒకేసారి దాడిచేశారు - నిద్రపోతున్న భటులు అప్రమత్తం అయ్యేలోపు రక్షణగోడలోపలికి ప్రవేశించేశారు . 
నాన్నగారు భయపడి అమ్మతోపాటు నన్ను - అమ్మ చెలికత్తెను - చామంతిని , మేము వెళ్లము అంటున్నా ఈ రహస్యమార్గంలో పంపించారు . 
బందిపోట్లు ఇక మా సైన్యాధ్యక్షుడిని - నాన్నగారిని చంపి రాజ్యాన్ని చేజిక్కించుకోవడమే తరువాయి , అంతలో వాళ్ళు పెద్ద తప్పుచేయ్యడం ( రాజ్యానికి నేనంటే నేనంటూ వాళ్ళలోనే రెండు సమూహాలు గొడవపడటం ) చూసి నాన్నగారు వెంటనే అప్రమత్తం అయ్యి ఎంతోమంది సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టి వారిని తరిమికొట్టేశారు - ఆ దాడిలో రెండువైపులా చాలా చాలా ప్రాణనష్టం జరిగింది , ఆ దాడినుండి ఆ బందిపోట్లు ఇప్పటికీ కొలుకోలేక ఇప్పటికీ చిన్న చిన్న దాడులు చేస్తూనే ఉన్నారు , శక్తిని కూడదీసుకుంటూనే ఉన్నారు , అలాంటి దాడి నుంచే కదా నా దేవుడు తన దేవకన్యను ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడింది అంటూ నా గుండెలపైకి చేరింది సంతోషంతో .......
మహీ ...... చిన్నప్పుడు నీకేమీ కాలేదు కదా ......
మహి : పెద్దయ్యాక ఎలాగో నీ దేవుడు ప్రాణంలా చూసుకుంటాడు ఈ ఒక్కసారికీ ఇక్కడ దాచుకో అని నా బుజ్జి మనసు అప్పుడే చెప్పింది - అక్షరాలా నా మనసు చెప్పిందే జరిగింది దేవుడా అంటూ పాదాలను పైకెత్తి నాకళ్లపై ముద్దుపెట్టింది . 
నా దేవకన్యను ఎవరైనా చేరాలంటే ముందు నన్ను దాటాలి అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
మహి : అమితమైన ఆనందంతో నన్ను చుట్టేసి , ముందు మనం ఈ రహస్య మందిరం నుండి బయటపడాలి దేవుడా అంటూ నవ్వుతోంది .
అవును నా దేవకన్యకు ఉక్క కూడా పోస్తోంది అంటూ నుదుటిపైనుండి బుగ్గపైకి జారుతున్న చెమట చుక్కను పెదాలతో అందుకుని లొట్టలేస్తూ వెళ్లి తాళం తీసి అవలీలగా ఉక్కు ద్వారాన్ని తెరిచాను .

ఒక్కసారిగా చల్లటి గాలి లోపలికిరావడంతో హాయిగా అనిపించింది .
కృష్ణ మొదట బయటకువెళ్లి అటూ ఇటూ చూసి అపాయమేమీ లేదన్నట్లు సైగలుచేశాడు .
మహీ మహీ అంటూ చేతిని అందించాను . 
ఆశ్చర్యంగా కదలకుండా నన్ను - ఉక్కు ద్వారాన్ని పదేపదేచూస్తోంది .
మహీ మహీ ...... ఏమైంది ఏమిటలా చూస్తున్నావు అంటూ వెనక్కువెళ్ళాను .బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దులు కురిపిస్తున్నాను .
మహి : అప్పట్లోనే నలుగురం కలిసి ఘడియలపాటు ఎంత కష్టపడి ప్రయత్నించినా కనీసం కదలను కూడా కదలలేదు - అలా చిటికెలో తీసేసావు అంటూ నా కండలను నొక్కుతోంది . ఇవి కండలా లేక కొండలా అంటూ కొరికేసింది .
స్స్స్ ....... 
మహి : కొండలుకాదు కండలే అంటూ తియ్యదనంతో నవ్వుతూ నా గుండెలపైకి చేరింది .
బహుశా ఆరోజు తాళం తెరిచి ఉండరు అందుకే ఎంత ప్రయత్నించినా తెరుచుకుని ఉండదు . 
మహి : తాళం తీసినప్పుడు ఇప్పుడొచ్చిన శబ్దం నలుగురూ ప్రయత్నించినప్పుడు కూడా వచ్చింది దేవుడా ...... , ఎంతైనా నా దేవుడు ..... వీరాధివీరుడు ఉమ్మా ఉమ్మా అంటూ కండలపై ముద్దులుపెట్టి మురిసిపోతూ ....... నా చేతిని చుట్టేసి బయటకు నడిపించింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 21-07-2022, 06:59 PM



Users browsing this thread: 52 Guest(s)