Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఒక్కనిమిషం ఒక్కనిముషం దేవుడా అంటూ నా పెదాలపై చిరుముద్దుపెట్టి కిందకుదిగింది - చామంతీ చామంతీ ......  మన రెండవ వీరాధివీరుడికి ఆహారం తీసుకొచ్చారా లేదా ......
చామంతి : తీసుకురాకుండా ఎలా ఉండగలం మహీ ...... , ఉద్యానవనంలో తాజాగడ్డి ఉంది , ఇప్పుడు మొక్కజొన్న గింజలు - శనగ గింజలు - ఉలవలు తీసుకొచ్చాము .
మహి : మా మంచి చామంతి అంటూ ప్రక్కనుండి చుట్టేసి వదిలి , పరుగునవచ్చి నా మీదకు చేరింది .
అమ్మో ....... అంటూ గుండెలపై హత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ మిత్రుడి దగ్గరికి చేరుకున్నాము .

మహి ...... నాబుగ్గను కొరికేసి కిందకుదిగివెళ్లి , మిత్రమా ...... మీ నుండి మీ మిత్రుడిని చాలసేపే దూరం చేసాను మన్నించు ........
నాకూ ఇష్టమే అన్నట్లు మహిని నా కౌగిలిలోకి తోసాడు .
మహి సంతోషంతో కృష్ణను ఆప్యాయంగా నిమిరి , కృష్ణ ముందు అన్నిరకాల ధాన్యాలను ఆహారంగా ఉంచింది .
మహి బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , ఒక పాత్రలో వంటలను వడ్డించుకుని తినిపించాను .
మహి : ఊహూ ...... ముందు నా దేవుడు అంటూ పాత్రను చేతిలోకి తీసుకుని ప్రేమతో తినిపించింది - దేవుడా తిను ....... ఒకరోజంతా మీరుకూడా తినలేదని నాకు తెలుసులే ......
ఎలా తెలిసింది మహీ .......
మహి : ఒకరోజంతా తినకపోతే హృదయస్పందన ఎలా ఉంటుందో నాకు తెలిసింది కదా ...... , పాత్రను కింద ఉంచి తన చేతిని ..... నా హృదయంపై - నా చేతిని అందుకుని తన హృదయంపై వేసుకుని ఓకేవిధంగా ఉంది కదా అంటూ నవ్వుతూ చెప్పింది .
మహి నుదుటిపై ముద్దుపెట్టి , అవును నిజమే ....... యువరాణి త్వరగా కోలుకోవాలని ఉదయం నుండీ ...... , ఎంతైనా దేవకన్య కదా పసిగట్టేసింది .

ఒక్కసారిగా కళ్ళల్లో తియ్యనైనకోపంతో నా ఛాతీపై దెబ్బలవర్షం కురిపించి , అలక చెందినట్లు ఎదురుగావెళ్లి గడ్డిపై కూర్చుంది .
నవ్వుకుని , కింద ఉంచిన భోజన పాత్ర అందుకునివెళ్లి మహి ముందు కూర్చున్నాను - మహీ ...... ఆకలేస్తోంది .
మహి వెంటనే పాత్ర అందుకుని అలకతోనే తినిపించింది .
తిని , మహికి తినిపించి ఈ అందమైన అలకకు కారణం ఏమిటో .......
మహి : యువరాణి యువరాణి యువరాణి ...... , ఒక్క స్పర్శతో మీ వొళ్ళంతా జలదరింపులు వేడిసెగలు పుట్టించిన నాపై ఎటువంటి ప్రేమా లేదు .......
అమ్మాయిలు అమ్మాయిలకు ఈర్ష్య అసూయలు ఉంటాయని విన్నాను కానీ , ఈ దేవకన్యపై దేవకన్యనే అసూయపడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే - అలకలోకూడా ముద్దొచ్చేస్తున్నావు మహీ ఉమ్మా ఉమ్మా .......
మహి పెదాలపై అందమైన నవ్వులు ...... , ఏకంగా నామీదకు ఎగబ్రాకి ఒడిలో కూర్చుని , తింటూ ప్రేమతో తినిపించింది .
మహీ ...... మీ స్నేహితులను కూడా తినమని చెప్పు ......
మహి : ఇకపై నాకు - వారికి రాజు మీరే , మీరే చెప్పండి ప్రభూ .......
" రాజు " - " ప్రభువు " ....... అంటూ ఆనందబాస్పాలతో మహివైపే ప్రాణంలా చూస్తున్నాను .

మహి : అతిత్వరలో నాకు మాత్రమే కాదు ప్రజలందరికీ ప్రభువు కాబోతున్నారు - గురువుగారి కోరికను తీర్చబోతున్నారు .
నీ మాటలు వింటుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది యువరాణీ .......
మహి : అయితే .......
అయితే ........
మహి : అయితే ...... అంటూ నా ఎడమ చేతిని ఎడమచేతితో అందుకుని నాకళ్ళల్లోకే శృంగారం ఒలకబోస్తూ చూస్తూ వేళ్లపై ఒక్కొక్క ముద్దుపెడుతోంది .
ఆఅహ్హ్ ..... అలా చూడకు దేవకన్యా , వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది అంటూ నుదుటితో నుదుటిపై తాకించాను .
మహి : స్స్స్ .......
చిరునవ్వులు చిందిస్తూ ముద్దలు తినిపించాను .

తృప్తిగా తిన్నాము - దేవుడా ...... ఉద్యానవనం అంటే ఇష్టం అన్నారుకదా చుట్టూ చూయిస్తాను రండి .......
అంతకంటే ఆనందమా మహీ ...... అంటూ ఎత్తుకోబోయాను .
మహి : యే యే ..... ఉమ్మా ఉమ్మా ..... ఇప్పుడు వద్దులే దేవుడా , నా దేవుడి చేతిని చుట్టేసి నడవాలని ఆశకలిగే ఉద్యానవనం చూయించాలనుకున్నాను అంటూ రెండుచేతులతో నాచేతిని చుట్టేసి భుజంపై తలవాల్చింది .
మహి కురులపై ముద్దుపెట్టి ఉద్యానవనంలో నడిచాము .
ఉద్యానవనం అందాలు - చిన్నప్పటి నుండీ ఉద్యానవనంలో అనుభూతులను చెబుతుంటే .......
మహి సంతోషాన్ని హృదయమంతా నింపుకుంటున్నాను .
మహి : నేను చెప్పేది వినడం లేదు అంటూ మళ్లీ అందమైన అలక .......
అలకలోకూడా ముద్దొచ్చేస్తున్నావు మహీ ఉమ్మా అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను - నా దేవకన్య సంతోషంలో ...... వినడం కాదు కళ్లారా తిలకించాను - అత్యద్భుతం అంటూ అమాంతం ఎత్తుకున్నాను .
మహి : అయ్యో ...... అనవసరంగా కోప్పడ్డానే , పెద్ద శిక్షనే పడాలి వంద ముద్దులు అంటూ ముఖమంతా కురిపిస్తోంది మధ్యమధ్యలో బుగ్గలను కొరికేస్తోంది .
ఈ శిక్షలో నాకూ భాగం అన్నమాట అంటూ నవ్వుకున్నాము .

చెలికత్తెలు : మహీ ...... మాకు నిద్రవస్తోంది మేమువెళ్లి పడుకుంటాము .
మహి : వెళ్ళండి వెళ్ళండి తొందరగా వెళ్లిపోండి .
చెలికత్తెలు : ఇన్నిరోజులూ ...... మీ కలల రాకుమారుడిని కలవరిస్తూ మమ్మల్ని నలిపేసేవారు ఇప్పుడైతే ఏకంగా దేవుడే దిగివచ్చారు కదా ఇక మాతో పని ఏముంది ........
మహి ముసిముసినవ్వులు నవ్వుతోంది .

ఇంత అందమైన - సుగుణాల రాశి యువరాణీగా ఉండటం ఈ రాజ్యం అదృష్టం , ఆ అదృష్టం మొత్తం నా సొంతమవడం ...... అంటూ మురిసిపోతూ ప్రాణంలా హత్తుకున్నాను . చామంతీ చామంతీ ...... ఆగండి ఆగండి ఒక్క నిముషం , మహీ ....... నాకు ప్రకృతిలో పడుకోవడం అలవాటు .......
మహి : అంటే వెళ్లిపోతారా అంటూ భద్రకాళీ కళ్ళతో చూస్తోంది .
భయపడి , లేదు లేదు లేదు ఉద్యానవనంలోనే పడుకుంటాను అని చెప్పబోతున్నాను మహీ ....... 
మహి : అలా అయితే సంతోషమే ....... , ఉద్యానవంలో పడుకోవడం కోసం వాళ్ళను ఎందుకు ఆపడం , మనకు అడ్డు కదా .......
చెలికత్తెలు : అంతేలే మహీ ...... అంటూ నవ్వుకుంటున్నారు .
అధికాదు మహీ ...... నువ్వుకూడా ......
మహి : నేను కూడా .......
అదే అదే నువ్వుకూడా వెళ్లి లోపల మెత్తనైన పాన్పుపై హాయిగా పడుకో , నేనిక్కడ ........
మాటలు కూడా పూర్తికాకముందే దెబ్బలవర్షం కురుస్తోంది - కళ్ళల్లో చెమ్మ ....... , దేవుడా చెప్పానుకదా ఇకనుండీ మీరే ...... నా సర్వస్వం , కష్టసుఖాలన్నీ మీతోనే అనిచెప్పానుకదా ...... , నా దేవుడి గుండెలపై హాయిగా నిద్రపోతానని ఇంతకుముందే చెప్పానుకదా ....... , మీరు వెళ్లండే .......
మన్నించు మన్నించు యువరాణీ ...... , నా దేవకన్య కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క చూసినా నా ప్రాణం .......
మహి ..... నా నోటిని మూసేసి ఊహూ అంటూ వదలనంతలా అల్లుకుపోయింది .
ఆనందించి , ఒక్క నిమిషం కిందకుదిగు మహీ .......
మహి : ఊహూ ఊహూ ...... అంటూ మరింత గట్టిగా చుట్టేసింది - భుజంపై కొరికేస్తోంది .
స్స్స్ స్స్స్ ...... నవ్వుకున్నాను , పంపించడానికి కాదు మహీ , ఒక్క నిమిషం ఓకేఒక్కనిమిషం అంటూ చామంతి చెంతకు చేర్చాను . నా బంగారం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , పూలవనం దగ్గరికివెళ్లి పూలన్నీ సమకూరుస్తున్నాను .
నన్నుచూసి మహి - చెలికత్తెలు వచ్చి , ఎందుకు ఏమిటి అని అడగకుండా పెద్దమొత్తంలో పూలు కోశారు . 
బుట్టలలో పూలను తీసుకునివెళ్లి పూలవనం మధ్యలోని గడ్డిపై పూలతో పాన్పును తయారుచేసాను .
మహికి ఎందుకో అర్థమై చామంతిని చుట్టేసి ప్రేమతో నావైపే చూస్తోంది .
మహీ మహీ ...... అంటూ చెలికత్తెలంతా ఆశ్చర్యపోయారు .

దివినుండి దిగివచ్చిన దేవకన్యా ....... అంటూ చేతిని చాపాను .
మహి : ఇక మీరు వెళ్లండే అంటూ తోసేసి , క్షణంలో నా కౌగిలిలోకి చేరిపోయింది .
సుకుమారంగా పెరిగిన యువరాణీని నేలపై పడుకోనిస్తానా అంటూ కురులపై ముద్దుపెట్టి హత్తుకున్నాను .
అప్పటికే కృష్ణ దూరంగా పడుకోవడం చూసి ఆనందించి , ఇద్దరమూ పూలపాన్పుపైకి చేరాము . 
మహి : దేవుడా ....... వొళ్ళంతా సీతాకోకచిలుకలు ఎగురుతున్నంత సంతోషం కలుగుతోంది అంటూ అంతులేని ఆనందంతో పులకించిపోతూ నా గుండెలపైకి చేరింది . దేవుడా ...... మీ చిన్నప్పటి సంగతులు వింటూ నిద్రపోవాలని ఉంది .
యువరాణి ఆజ్ఞ వెయ్యడం - నేను చెప్పకపోవడమూనా అంటూ రెండుచేతులతో చుట్టేసి ముద్దులుపెడుతూ నవ్వుకుంటూ హాయిగా నిద్రలోకిజారుకున్నాము ..............
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-07-2022, 10:21 AM



Users browsing this thread: Shiva@123, 66 Guest(s)