Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహితోపాటు నీళ్లపైకి లేచాను . 
దేవుడా ...... మీకేమి జరిగిందోనని ఎంత భయపడ్డానో , మీరు లేని జీవితం నాకెందుకు అంటూ మహి మరింత గట్టిగా చుట్టేసి హృదయంపై తలవాల్చింది .
అందం అమాయకత్వం కలగలసిన అంతులేని ప్రేమను పంచుతున్న మహిని ప్రేమతో చూస్తూనే , ఆహా ....... వెయ్యికోయిలల మధురమైన పలుకు - అమరకాంతుల మయూర అందం - దివినుండి భువికి దిగివచ్చిన దేవకన్య సౌందర్యం ....... 
మహి : ఆగండాగండి దేవుడా ...... , మీరిక పొగడాల్సిన అవసరం లేదు - నా జీవితం మీ పాదాక్రాంతం , ముందు మీరు పైకిరండి , గాయానికి తడి తగలనేరాదు .
నా గురించి తరువాత ముందు నువ్వు నీళ్ళల్లో తడవకూడదు అంటూ అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని పైకిచేర్చి , పైకెక్కాను .
అవునవును ఇద్దరూ తడవకూడదు అంటూ అమ్మాయిలు కంగారుపడుతున్నారు .

మహి : ఇంకా నొప్పిగానే ఉందా దేవుడా ....... , నేను చూడొచ్చా ...... అంటూ కళ్ళల్లో చెమ్మతో ప్రాణంలా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది .
బాధపడకు మహీ ...... , గాయాలన్నీ మానిపోయాయిలే అంటూ చూయించాను .
కంగారుపడుతూనే చూసి స్పృశించి , అమ్మా దుర్గమ్మా ..... అంటూ ప్రార్థించి సంతోషంతో మళ్లీ గుండెలపైకి చేరిపోయింది . ఈ ప్రియురాలికోసమే వచ్చారా .... ? చాలా చాలా సంతోషం వేస్తోంది అంటూ హృదయంపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ ....... అంటూ మళ్లీ మహితోపాటు నీళ్ళల్లోకి పడిపోయాను .
అమ్మాయిల నవ్వులు ఆగడం లేదు .

వెంటనే లేచి మహిని పైకిచేర్చబోతే ...... , ఊహూ ...... అంటూ ముసిముసినవ్వులతో వదలకుండా చుట్టేయ్యడంతో నీళ్ళల్లోనే మరొకవైపుకు నడుచుకుంటూ వెళ్లి మెట్లమార్గంలో పైకివచ్చాను .
మహి ముత్యాలురాలేలా అందంగా నవ్వుతూనే ఈ ప్రియురాలి కోసమే వచ్చారని చెబితే మరింత ఆనందిస్తాను .

చెలికత్తె చామంతివైపు కళ్ళతో సైగచేసి , లేదు లేదు మహీ ...... నేను వచ్చినది నీకోసం కాదు - నానుండి కిందకు దిగితే వారిని వెళ్లి కలుస్తాను .
మహి : ఎవరికోసం అంటూ చెమ్మతో అడిగింది .
నేను వచ్చినది ఈ భువిపైననే అతిలోకసుందరి అయిన ఈ రాజ్యం యువరాణిని కలవడానికి , తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడానికే ఇక్కడకు ప్రయాణం సాగించాను , అనుకోకుండా అంత అందాలరాశి కాకపోయినా అందమైన నిన్ను కాపాడాను . 
చామంతి ముసిముసినవ్వులు నవ్వుతోంది .
మహీ మహీ ...... తొందరగా కిందకు దిగితే మంచిది , ఇలా మనిద్దరినీ యువరాణి చూసిందంటే మొదటికే మోసం వస్తుంది అని లోలోపలే నవ్వుకుంటున్నాను , యువరాణి ...... దేనిపైననో ఆశతో జ్వరంతో బాధపడుతున్నారని - వైద్యుల మందులు పనిచేయడం లేదని , చాలా చాలా మంచివారైన యువరాణి త్వరగా కోలుకోవాలని ప్రార్థించడం - రాజ్యంలోని వైద్యుల మందులు పనిచెయ్యడం లేదని తెలిసి నా మిత్రుడి దగ్గరున్న మూలికలు చేర్చడానికి వచ్చాను . మిత్రమా ...... మూలికలు - ఆయుధాలు ఎక్కడ ? .
ఒక భవనం వైపు సైగచేశాడు కృష్ణ ........

చామంతి : నేనొకదానిని ....... , రెండురోజులుగా అటువైపు సైగలుచేస్తూనే ఉన్నా నేనే పట్టించుకోలేదు , క్షమించు క్షమించు అంటూ చెలికత్తెలందరితోపాటువెళ్లి తీసుకొచ్చింది .
మహీ ....... మూలికలను యువరాణికి చేర్చాలి కాబట్టి .......
మహి : చిరుకోపంతో కాబట్టి ....... 
కాబట్టి కిందకుదిగితే అంటూ నవ్వుకుంటున్నాను .
మహి : అంటే నేనే యువరాణినని ఈ దేవుడికి తెలియదా ? .
ఊహూ .......
మహి : మీరు అపద్ధం చెప్పినా హృదయమంతా నేనే నిండిన మీ హృదయం చెప్పకనే చెబుతోందిలే అంటూ మళ్లీ హృదయంపై ముద్దుపెట్టింది . 
ఆఅహ్హ్హ్ ....... ఈసారి నీళ్ళల్లోకి పడిపోకుండా మిత్రుడు అడ్డుకున్నాడు .
మిత్రమా ...... మంచిపనిచేశావు - మహి ఇన్నిసార్లు తడవకూడదు .
మహి నవ్వుకుని , ఎందుకు తడవకూడదు ? .
జ్వరం వచ్చిందికదా ....... , ( మహి నవ్వడం - వీరాధివీరా అంటూ చామంతి ముందుకురావడం ) అయ్యో దొరికిపోయానే ....... 
మహి తియ్యనైనకోపంతో మెడను చుట్టేసిన చేతులతో ప్రేమతో దెబ్బలవర్షం కురిపించింది .
ఆఅహ్హ్ ...... హ్హ్హ్ ...... దెబ్బలను అమితమైన ఆనందంతో ఆస్వాదిస్తూనే క్షమించు క్షమించు యువరాణీ గారూ ......
మహి : యువరాణి కాదు నీ మహి - నీ పాదదాసి అంటూ సంతోషంతో కేకలువేస్తూ ఏకమయ్యేలా చుట్టేసింది .

ఇక కానివ్వండే ఇంకా చూస్తున్నారే అంటూ చామంతి సైగచెయ్యగానే , చుట్టూ చెలికత్తెలు మాపై పూలవర్షం కురిపిస్తూనే ఆకాశంలోకి తారాజువ్వలను వదలడంతో ఆ అద్భుతాన్ని వీక్షించి సంబరపడిపోతూ నా బుగ్గపై అంతులేని ప్రేమతో ముద్దుపెట్టింది .
అద్భుతం యువ ....... మహీ ....... , ముద్దుపెట్టవచ్చా ? .
కోపంతో దెబ్బలవర్షం - దెబ్బలపై అంతులేని ముద్దులు .......
అలాగే అలాగే , నా మనసులోని మధురమైన మాట చెబుతాను - ఎప్పుడైతే జాతరలో నిన్ను స్పృశించానో ....... ఆ క్షణమే నా జీవితం నువ్వైపోయావు మహీ , నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టాను .
మహి : తియ్యనైన జలదరింపుకు లోనైనట్లు కళ్ళతోనే వ్యక్తపరిచి , అంతులేని సంతోషంతో నానుండి కిందకుదిగి ఆఅహ్హ్ ....... అంటూ నన్ను చుట్టేసి అందమైన నవ్వులతో హృదయంపై ముద్దులుపెడుతూనే నీళ్ళల్లోకి పడిపోయింది .

వెంటనే లేచి , అయ్యో అయ్యో జ్వరం అదికూడా పెద్ద జ్వరం ...... ఈ సౌందర్యరాశి ఏమో పదేపదే నీళ్ళల్లో తడుస్తోంది అంటూ వదలకపోవడంతో ఎత్తుకునే పైకిచేరాను . నిన్నూ ...... అంటూ నుదుటితో ప్రేమగా నుదుటిని స్పృశించాను , చామంతీ ...... మూలికల కషాయం సిద్ధమా ? .
చామంతి : ఎప్పుడో వీరాధివీరా .......
మహి : నాకిక ఏ కషాయం అవసరం లేదు , నా దేవుడి కౌగిలే మందు అంటూ మరింత గట్టిగా కౌగిలించుకుంది .

చామంతి : అవును వీరాధివీరా ...... , అప్పటివరకూ ఏడుస్తూ కలవరిస్తూ మంచంపై అటూ ఇటూ కదలటం కూడా వీలుకాలేదు - మీరు వచ్చారని తెలపగానే విశ్వమంత శక్తితో లేచి ఎలా పరుగులుతీసిందో మీరే చూశారుకదా ..... , మీ అంతులేని ప్రేమ చాలు ........
చాలా సంతోషం మహీ ...... అంటూ ప్రేమతో కౌగిలించుకున్నాను . చామంతీ ..... కనీసం తడిని అయినా తుడవండి .
చామంతి : అలాగే వీరాధివీరా అంటూ పరుగునవెళ్లి తువాళ్ళు తీసుకొచ్చారు .
మహీ ...... వదిలితే తుడుస్తారు లేకపోతే మరింత అపాయం ......
మహి : ఊహూ ...... జీవితాంతం వదలనే వదలను , నా దేవుడి కౌగిలిలో అపాయమా అంటూ వొళ్ళంతా జలదరించేలా ముద్దుపెట్టింది . ఆఅహ్హ్ ...... అంటూ తొలిసారి మహితోపాటు ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను . 
సిగ్గుతో చెలికత్తెలందరూ అటువైపుకు తిరిగారు - నా మిత్రుడైతే ఎప్పుడో ........

చామంతీ ...... ఆ తువాళ్ళు నాకివ్వు - మహీ ...... నేనైనా తుడవనా ? , నీకు జ్వరంతోపాటు జలుబుచేస్తే ఈ హృదయంతోపాటు రాజ్యంలోని ప్రజలంతా బాధపడతారు .
తలెత్తి నాకళ్ళల్లోకే తియ్యనైనకోపంతో చూస్తూ దెబ్బలవర్షం కురిపిస్తోంది .
చామంతి : వీరాధివీరా ...... తెలిసే దెబ్బలు తింటున్నారు కదా ...... ఆనందించండి ఆనందించండి అంటూ సంతోషంతో ఇచ్చి వెళ్ళిపోయింది .
దేవకన్యలాంటి మహి దెబ్బలు తినాలన్నా అదృష్టం ఉండాలి .
మహి : అందమైన సిగ్గుతో దెబ్బలు కురిపించిన చోట ముద్దులు కురిపిస్తూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది .

జలపాతం లాంటి మహి కురులను మరియు ముఖాన్ని సున్నితంగా తుడిచాను - మహీ ..... బట్టలుకూడా మార్చుకోవాలికదా చూడు పూర్తిగా తడిచిపోయావు .
మహి : కొద్దిసేపైనా ఇలా ఉండనివ్వు , మీరేమి చెప్పినా వదలనంటే వదలను అంతే అంటూ ఛాతీపై ప్రేమతో కొరికేసింది .
ఆవ్ .......
చామంతీ ...... మీ యువరాణి చాలా చాలా మంచిదని నువ్వు - ప్రజలంతా అంటున్నారు , నాకైతే అలా అనిపించడం లేదు నువ్వే చూస్తున్నావుకదా చూడు కొడుతోంది - కోరుకుతోంది .......
మహి : గిల్లుతాను కూడా ...... , ఇకనుండీ నా సర్వస్వం మీరే , గిళ్లడం మాత్రమే కాదు నాకోరికలన్నీ తీచుకుంటాను అంటూ మళ్లీ చిలిపిగా కొరికింది .
స్స్స్ ........
మహితోపాటు చెలికత్తెలందరూ నవ్వుకుంటున్నారు . వీరాధివీరా ...... ఇలాంటి మహి గురించి చిన్నప్పటి నుండీ తోడుగా ఉంటున్న మాకు కూడా తెలియదు , ప్రాణమైన దేవుడు కనిపించగానే ........ అంటూ ఆనందిస్తున్నారు . మహీ ...... నీ దేవుడు కూడా తడిచిపోయాడు కదా ......
వద్దు వద్దు వద్దు గుర్తుచెయ్యకు చామంతీ మళ్లీ దెబ్బలు మొదలుపెడుతుంది .
మహి : అవునన్నట్లు తలఊపుతూ మురిసిపోతోంది . బట్టలు మార్చుకోవాలనుకుంటే నన్ను ఎత్తుకునే యువరాణీ మందిరానికి తీసుకెళ్లమను ....... , వెళ్లు నా దేవుడికి వస్త్రాలు రెడీ చెయ్యి ......
అలాగే మహీ ........

యువరాణీ ఆజ్ఞ అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , అమాంతం రెండుచేతులతో ఎత్తుకున్నాను .
మహి : ఒక్క క్షణం ఒక్క క్షణం అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , కిందకుదిగి కృష్ణ దగ్గరికివెళ్ళింది . కృష్ణను ఆప్యాయంగా నిమురుతూ లోపలికి రమ్మని ఆహ్వానించింది .
కృష్ణ : ఊహూ ...... నాకు ఇక్కడే ఉద్యానవనంలోనే బాగుంది అంటూ గెంతులువేస్తోంది .
చామంతి : మహీ ...... రెండురోజులనుండీ ఎంత లోపలికి రమ్మన్నా రావడం లేదు .
మహీ ...... కృష్ణకు పచ్చదనం అంటేనే ఇష్టం .
మహి : నాకుకూడా ....... , నేనుకూడా ఇకనుండీ ప్రేమతో కృష్ణ అని పిలవచ్చా ? .
సంతోషంతో గెంతులువేశాడు .
మహి సంతోషంతో నాచేతిని చుట్టేసి , కృష్ణా ...... ఈ ఉద్యానవనం మొత్తం నీదే - నీ ఇష్టం వచ్చినదగ్గరికి వెళ్లు ఆనందించు ........
కృష్ణ సంతోషంతో ఉద్యానవనం చుట్టూ పరిగెత్తుతోంది . అదిచూసి మహి సంతోషంతో కేకలువేసి నా బుగ్గపై చేతితో ముద్దులు కురిపిస్తోంది - ఊ ..... చూస్తున్నారే ఎత్తుకోండి అంటూ చేతులను విశాలంగా చాపింది .
బరువున్నావు మహీ .......
అంతే కళ్ళల్లో మధురమైన కోపం .......
లేదు లేదు లేదులే అంటూ కళ్లపై చేతులతో ముద్దులుపెట్టి , ప్రేమతో ఎత్తుకున్నాను.
మహి : యాహూ ...... అంటూ నా మెడను చుట్టేసి బుగ్గపై ముద్దులుకురిపిస్తూనే ఉంది , పాతికమంది రాక్షసులను అవలీలగా ఎత్తిన నా దేవుడికి నేను బరువునా అంటూ చిలిపికోపంతో బుగ్గపై కొరికేసింది .
స్స్స్ ....... , ప్చ్ ప్చ్ ...... చిన్నప్పటినుండీ నా దైవమైన గురువుగారు కూడా ఒక్క దెబ్బ కొట్టలేదు , కొన్ని ఘడియాల్లోనే .......
మహి : నేను చెబుతాను నేను చెబుతాను , కొట్టాను - కొరికాను - గిల్లాను ...... ఇక రక్కేసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను , ఇంతటి వీరాధివీరుడు చెంత ఉంటే ఒక అమ్మాయికి ఇలానే అనిపిస్తుంది - అప్పుడే అయిపోలేదు ముందు ముందు ఇంకా చూస్తారుగా ...... అంటూ నవ్వుతోంది , దేవుడా ....... ఇకనుండీ నాకుకూడా గురువుగారు ...... దైవంతో సమానం - గురువుగారూ ...... మీ శిష్యుడిని నా ప్రియమైన దేవుడిని కోరికే అవకాశం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ........
అమ్మో అమ్మో ....... ఇలాంటి కృతజ్ఞతల గురించి నేనెక్కడా విననేలేదు .......
మహి నవ్వులు ఆగడంలేదు ....... 
మహీ ....... జీవితాంతం ఇలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది అంటూ నుదుటిపై పెదాలు తాకించి ప్రాణంలా హత్తుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-07-2022, 10:16 AM



Users browsing this thread: 61 Guest(s)