Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
 ఎంత ప్రాణం అయితే వీరా వీరా ...... అంటూ అంతులేని బాధతో విలపిస్తూ నా వెనుకే లోయలోకి దూకబోయింది మహి ....... 
కన్నీళ్లు కారుస్తున్న కృష్ణ వెంటనే స్పందించి అడ్డుపడ్డాడు .
మహీ మహీ ...... నీకేమైనా అయితే అంటూ ప్రేమతో కౌగిలిలోకితీసుకుని ఓదార్చారు స్నేహితులు .......
మహి : ఇక బ్రతికి ఏమి ప్రయోజనం , మనకోసం మనల్ని రక్షించడం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన దేవుడు అంటూ ఏడుస్తూనే ఉంది . 
స్నేహితులు : మహీ మహీ ...... ఇక్కడ ఉండటం అపాయం - ఏక్షణంలోనైనా మిగిలిన బందిపోట్లు రావచ్చు .
మహి : నేను రాను ........
స్నేహితులు : మహీ ....... అలాజరిగితే నీ దేవుడి త్యాగానికి విలువలేకుండా పోతుంది , వెళదాము ........
మిత్రుడిని దేవుడితో పోల్చడం విని కృష్ణ ఆనందించింది - దేవుడు అంటే గుర్తుకువచ్చింది తన మిత్రుడినైన నేను పడినది గంగమ్మ ఒడిలోకి అని , ఆ గంగమ్మ తల్లే చూసుకుంటుంది అని మనసులో ధైర్యం చెప్పుకున్నాడు .

మహిని ...... తన స్నేహితులు లోయ నుండి దూరంగా పిలిపించుకురావడం చూసి , ఈ దాడిలో భయంతో బండిని వదిలి పారిపోయిన గుర్రాల స్థానంలోకి కృష్ణ చేరి లాక్కునివెళ్లింది .
మహి - అమ్మాయిలు వద్దని నడుచుకుంటూ వెళదామని చెప్పినా ....... , కృష్ణ వదలకుండా బండిలోకి ఎక్కించుకుని వారి గమ్యస్థానానికి తీసుకెళ్లాడు ) .
************

కృష్ణ అనుకున్నదే జరిగింది , అంత ఎత్తులోనుండి చేరినది ఎక్కడికి - నదీ దేవత అమ్మ ఒడిలోకి , నీళ్ళల్లోకి చేరగానే నన్ను చుట్టేసిన బందిపోట్లను చెల్లాచెదురుచేసేసింది . 
ప్రాణంలా తన ఒడిలోకి చేర్చుకుంది , అప్పటివరకూ కలిగిన విపరీతమైన నొప్పిస్థానంలో హాయిగా అనిపించింది - కళ్ళు మూతలుపడ్డాయి .
కొన్ని మైళ్ళ దూరం తన ప్రవాహంలో జాగ్రత్తగా తీసుకెళ్లి ఒడ్డుకుచేర్చింది .

ప్రవాహపు ఒడ్డులో ఆడుకుంటున్న పిల్లలు చూసి , గుర్తుపట్టినట్లు అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ వచ్చారు , నేను స్పృహలో లేకపోవడం - రక్తం కారుతుండటం చూసి , అమ్మా - అయ్యా ...... అంటూ బిగ్గరగా కేకలువేశారు .
పొలం పనులు చేసుకుంటున్నవాళ్ళు బిడ్డలూ బిడ్డలూ ...... ఏమిజరిగింది అంటూ ఆతృతతో వచ్చారు . ఏనుగు దాడి నుండి పిల్లలను - పశువుల నుండి మనల్ని కాపాడిన దేవుడు దేవుడు ...... అంటూ వెంటనే జాగ్రత్తగా ఎత్తుకుని అడవిలోని తమ గూడెం కు తీసుకెళ్లి మూలికలతో వైద్యంచేసి కాపాడారు .
*************

( మహీవాళ్ళు ...... కృష్ణను ఎక్కడికి తీసుకువెళ్లారో చూసి ఆశ్చర్యపోయాడు . 
కృష్ణను తమ దగ్గరే ఉంచుకుని ఆప్యాయంగా చూసుకున్నారు .
సమయం గడుస్తున్నా ...... మహి బాధ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు .
స్నేహితులు ఎంత ఓదార్చినా ప్రయోజనం లేకపోయింది .
మహేష్ కు మీ దేవుడికి ఏమీకాదు అని ఎలాచెప్పాలో తెలియక కృష్ణకూడా బాధపడుతున్నాడు
మహి తల్లిదండ్రులు ...... బందిపోట్ల దాడిని తెలుసుకుని వాళ్లపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మహి బాధకు కారణం ఏమిటో తెలుసుకోవడం లేదు .
తెలుసుకున్నా ...... పరువు గురించి ఆలోచిస్తారు తప్ప , వీరధివీరుడైన దేవుడిని ఆహ్వానించి ఉండరు అని లోలోపలే బాధపడుతోంది ) .
*****************

స్పృహలోకివచ్చేసరికి కుటీరంలో మంచంపై ఉన్నాను . నొప్పి ఉన్నా లేచి కూర్చున్నాను - బయట చీకటిగా ఉంది .
అన్నయ్యా అన్నయ్యా ....... , అమ్మా - అయ్యా ...... అన్నయ్య లేచారు అంటూ పిలుచుకునివచ్చారు .
బాబూ బాబూ ....... లేవకు లేవకు గాయాలు మానడానికి మరొకరోజైనా విశ్రాంతి తీసుకోవాలి అంటూ లోపలికివచ్చారు .
మరొక రోజైనానా ..... ? , అయ్యా - అమ్మా ...... ఇక్కడకు ఎలా వచ్చాను ? , వచ్చి ఎన్నిరోజులయ్యింది ? .
ప్రవాహంలో కొట్టుకుని రావడం పిల్లలు చూడటంతో రక్షించగలిగాము .
మీరుణం తీర్చుకోలేనిది - ఇంతకూ ఎన్నిరోజులవుతోంది అమ్మా .......
రెండు రోజులు అవుతోంది బాబూ ....... , కాసేపట్లో తెల్లారుతుంది , మా పిల్లలు ఇలా ప్రాణాలతో ఉన్నారంటే నీవల్లనే .......
రెండు రోజులయ్యిందా ...... ? , నేను వెంటనే వెళ్ళాలి అంటూ పైకిలేచి స్స్స్ అన్నాను .
బాబూ ........ , నొప్పితో నడవటం కష్టం .......
వెళ్ళక తప్పదు అమ్మలూ ....... , సమయం లేదు ( ఇక ఐదురోజులు మాత్రమే ఉన్నాయి ) నా బట్టలు .......
అవి చిరిగిపోయాయి బాబూ ...... , వీటిని నీకోసమే తయారుచేసాము అని కొత్త బట్టలు అందించారు .
సంతోషం అమ్మా ...... , మీరుణం తీర్చుకోలేనిది .......
 మీరెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవచ్చా ..... ? .
" నంది " రాజ్యానికి అమ్మలూ ........
బాబూ ....... అంతదూరం ఈ పరిస్థితులలో వెళ్లడం అసాధ్యం - మాకొక అవకాశం ఇస్తే తెప్పలలో జాగ్రత్తగా చేర్చుతాము .
ఇంతవరకూ చేసిందానికే మీకు ఋణపడిపోయాను - ఒకపని చెయ్యండి ఆ తెప్పల దగ్గరికి తీసుకెళ్లండి - నేను ఒంటరిగా వెళతాను .
మీ గురించి నిన్ననే చూసాము కానీ కానీ ...... సరే బాబూ అంటూ ఆహారం - మూలికలతోపాటు ఒడ్డుకు తీసుకెళ్లారు . నాతోపాటు కాస్త దూరం వరకూ వేరు వేరు తెప్పలలో వచ్చి మీరు నిజంగా దేవుడే జాగ్రత్త అనిచెప్పి వెనుతిరిగారు .

నేనేమీ చేయకపోయినా నదీ దేవత అమ్మే ప్రవాహానికి వ్యతిరేకంగా గమ్యం వైపుకు తీసుకెళుతోంది . 
అంతలో సూర్యోదయం అవ్వడంతో అమ్మ ఓడిలోకిచేరి సూర్య నమస్కారం చేసుకున్నాను , అంతవరకూ ఉన్న నొప్పి నీళ్ళల్లోకి దిగగానే క్షణాలలో మాయమైపోయింది 
గురువుగారు చెప్పినది నిజమే " మహేష్ ...... నీకు ఏకష్టం వచ్చినా నదీ దేవత దగ్గరికి వెళ్లు అని చెప్పడం " .
ఎందుకమ్మా ...... నేనంటే అంత ఇష్టం మీకు అంటూ నీటిని సేవించి ప్రయాణం సాగించాను .
సగం రోజుకుపైగా పట్టాల్సిన ప్రయాణ సమయాన్ని కొన్ని ఘడియలలోనే చేర్చారు .

తెప్పలోనుండే రాజ్యాన్ని ఎటుచూసినా పచ్చని పంటలను చూసి ఆశ్చర్యపోయాను . నా ఏడు రోజుల ప్రయాణంలో ఇంతపెద్ద రాజ్యాన్ని చూడనేలేదు - మహీవాళ్ళు సామంత రాజ్యం నుండి ఈ రాజ్యం వైపే ప్రయాణించారు మధ్యలో ఏ రాజ్యం కానీ గ్రామం కానీ లేదుకాబట్టి , ఇంత పెద్ద రాజ్యంలో దృష్టిలో పడకుండా మొదట నా మిత్రుడిని ఎలా వెతకడం అటుపై కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న యువరాణిని ఎలా కలవడం ...... , ముందు అయితే నా మిత్రుడిని కలుసుకోవాలి అంటూ ఒడ్డుకు చేరుకున్నాను , అమ్మా ..... వెళ్ళొస్తాను అని నీటిని స్పృశించి రాజ్యంలోకి వెళ్ళాను - మధ్యాహ్నం వరకూ మాఇద్దరికీ తెలిసిన శబ్దాలతో వెతికినా ప్రయోజనం లేకపోయింది - అసలు నా మిత్రుడు ఇక్కడే ఉన్నాడా అన్న అనుమానం కలిగింది 

ప్రతీ వీధిలో యువరాణీ గురించే మాట్లాడుకుంటున్నారు , రెండు రోజులుగా యువరాణి పెద్ద జ్వరంతో బాధపడుతున్నదని - ఏడుస్తూనే ఉన్నదని , రాజ్యపు వైద్యుడితోపాటు రాజ్యంలోని పెద్ద పెద్ద వైద్యులు చుట్టుప్రక్కల సామంతరాజ్యం నుండి వచ్చిన వైద్యులు వైద్యం చేసినా ప్రయోజనం లేకపోయిందని , ఇంతపెద్ద జ్వరం అయినా మందులతో నయం అయిపోయేది కానీ తగ్గడం లేదు అంటే వేరే బలమైన కోరిక ఉందేమోనని , యువరాణి చాలా చాలా మంచివారు రాజు - రాణిలలా కాదు త్వరగా నయమవ్వాలని ప్రతీఒక్కరూ ప్రార్థిస్తున్నారు .

యువరాణికి జ్వరమా ...... అంటూ బాధవేసింది , తొందరగా నయమవ్వాలని అమ్మవారిని - పరమ శివుడిని ప్రార్థించాను . 
గురువుగారు ఇచ్చిన మూలికలతో ఘడియలలో నయమైపోతుంది - ఆ మూలికలన్నీ మిత్రుడి దగ్గరే ఉన్నాయే ఇప్పుడెలా .......
 అంతలో ఒక ఆలోచన వచ్చింది రాజ్యానికి ప్రక్కనే రాజ్యం కంటే ఎత్తులో ఉన్న కొండ మీదనుండి ప్రతీ గృహపు ఖాళీస్థలాలలోకి చూస్తే మిత్రుడు ఎక్కడ ఉన్నాడో కనిపిస్తుంది అనుకుంటూనే వేగంగా కొండమీదకు చేరాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-07-2022, 10:15 AM



Users browsing this thread: 71 Guest(s)