Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ముఖంపై నీళ్లు పడటంతో ఉలిక్కిపడి లేచాను . ఎదురుగా వొడ్డుపై కృష్ణ ......
శుభోదయం మిత్రమా ........
తల ఊపి , తూర్పు వైపు సైగచేశాడు .
సూర్యోదయ సమయం అంటూ సూర్య నమస్కారం చేసుకున్నాను - స్నానమాచరించి ఒడ్డుకు చేరాను - సమయానికి లేపావు మిత్రమా ...... లేకపోయుంటే సూర్యదేవుడు నడి నెత్తిన వచ్చేన్తవరకూ లేచేవాడిని కాదేమో , అమ్మ ఒడిలో హాయిగా నిద్రపట్టేసింది - అమ్మ వలన మాత్రమే కాదనుకో అంటూ సిగ్గుపడ్డాను .
కృష్ణ సంతోషంతో చిందులువేస్తున్నాడు .
లేదు లేదు తప్పు తప్పు ..... ఇక మహి కాదు కాదు ఆ అమ్మాయి గురించి ఆలోచనే చెయ్యను - అయినా నా మనసు మహి విషయంలో నా మాట వినటమే మరిచిపోయింది - ఆఅహ్హ్ ...... ఆ మధురాతిమధురమైన స్పర్శ ...... వద్దు వద్దు ఆలోచించకు మహేష్ అంటూ లెంపలేసుకున్నాను .
కృష్ణకు మళ్లీ కోపం వచ్చేసింది .
కృష్ణకు కూడా గురువుగారి మాటంటేనే వేదం అయినాకూడా మహికి మద్దుతు ఇస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది - ఇక నా మనసు అయితే సరేసరి .......
మనసు మాటే విను మిత్రమా అన్నట్లు నా కళ్ళల్లోకే చూస్తున్నాడు కృష్ణ ......

నాకు గురువుగారు ఉపదేశించిన కర్తవ్యం తప్ప మరేదానిపై ఆశ లేదు - బయలుదేరాలి మిత్రమా ...... మధ్యాహ్నం లోపు చేరుకోవాల్సిన రాజ్యానికి చేరుకుని , స్వయంవరం రోజుకు పోటీలో పాల్గొనేలా పన్నాగం పన్నాలి - రాత్రికి మళ్లీ ఇక్కడికే వచ్చి విశ్రాంతి తీసుకోవాలి - స్వయంవరానికి ఇక వారం రోజులు మాత్రమే గడువుంది - గురువుగారి ఆశీర్వాదం ఉంటే ఆ మాత్రం రోజులు చాలు అంటూ నడక సాగించాము . 

నిన్న భక్తులతో కిటకిటలాడిన జాతర ప్రదేశం కొద్దిమంది భక్తులతో ప్రశాంతంగా ఉంది , మరొకసారి అమ్మవారి దర్శనం చేసుకుని సామంత రాజ్యం దాటుకుని , ఒకవైపు కొండ మరొకవైపు లోయ గల దారి వెంబడి పళ్ళు తింటూ కృష్ణకు తినిపిస్తూ ప్రయాణం సాగించాము - చాలాదూరం లోయప్రక్కనే ప్రయాణం ......
ఒక్కసారిగా భయంకరంగా కేకలు అరుపులు ...... 
కృష్ణా అంటూ కృష్ణపైకెక్కి కేకలవైపుకు వేగంగా పోనిచ్చాను . 
అంతలోనే కాపాడండి రక్షించండి అంటూ అమ్మాయిల అరుపులు వినిపిస్తున్నాయి.
భీకరమైన లోయగల చిన్న దారి గుండా మరింత వేగంతో పోనిచ్చాను . దారి వెంబడి పాతిక మందిదాకా సైనికులను చావుబ్రతుకులమధ్యన చెట్లకు కట్టేసి ఉన్నారు .
మళ్లీ అమ్మాయిల భయపడిపోతున్న కేకలు ....... , అటువైపుగా పోనిచ్చాను .

దూరంగా కొంతమంది కాదు చాలామంది అమ్మాయిలను బంధించినట్లు తాళ్లతో కట్టేసి కొండపైకి లాక్కుని వెళుతున్నారు .
దారిలో మరికొంతమంది భటులు రక్తంతో విలవిలలాడుతున్నారు .
ఇంతమంది సైనికుల ప్రాణాలకు అపాయం కలిగించి వదలండి వదలండి అంటూ ప్రాధేయపడుతున్న అభం శుభం తెలియని అమ్మాయిలను లాక్కుని వెళుతున్నారు అంటే ఖచ్చితంగా రాక్షసుల్లాంటి మనుషులే ....... 
విల్లు అందుకుని ఆ రాక్షసుల పాదాలపై బాణాల వర్షం కురిపించాను . 
నొప్పితో కేకలువేస్తూ నేల కోరుగుతున్నారు . వారి దగ్గరకు చేరుకుని కత్తి తీసి ప్రాణాలకు అపాయం కాకుండా నిలబడటానికి రానట్లు దాడి చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాను .
ఒకవైపు బాణాలు కురిపిస్తూనే దొరికిన వాణ్ణి దొరికినట్లుగా నేలకొరిగిపోయేలా చేస్తూ అమ్మాయిల దగ్గరికి చేరుకున్నాను . చూస్తే జాతరలో చూసిన అమ్మాయిలే ....... ముఖం ముసుగులో ఉన్న అమ్మాయిని మధ్యలో ఉంచుకుని తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు . 
క్షణాలపాటు అలా చూస్తుండిపోయాను .

అంతలో ఒకడు వెనకనుండి పొడవడానికి రావడం చూసి వీరా అంటూ అడ్డుగా వచ్చింది మహి .......
మహిని చుట్టేసి తిరిగాను - వీపులో కత్తిదిగింది , అమ్మా ...... అంటూ నొప్పిని భరిస్తూ మహిని అమ్మాయిల చెంతకు చేర్చాను . 
పొడిచిన వ్యక్తిని ఒక్కదెబ్బతో కొండ పాదాలదగ్గరకు చేరేలా చేసాను .
మహీ ....... మీకేమీ కాలేదు కదా నాతోపాటు రండి - ఇంతకూ ఎవరు వీళ్ళు ? .
ఒక అమ్మాయి : బందిపోట్లు - మహిని ఎత్తుకుపోవడానికి వచ్చారు .

అంతలో ఎవర్రా మీరు ..... , నిన్న జాతరలో ఎవడో వీరాధివీరుడట - ఇప్పుడేమో నువ్వు , ఇంతమందిమి ఉన్నా ఏమాత్రం భయపడకుండా ఒక్కడివే ఎదురు నిలిచి పోటు పడినా రక్తం కారుతున్నా వాళ్ళను రక్షించాలని చూస్తున్నావు . నెలల తరబడి ప్రణాళిక రచించి ఎట్టకేలకు మా రోజు వచ్చిందని సంతోషపడుతుంటే అడ్డుపడుతున్నావు , నీకొక అవకాశం ఇస్తున్నాము వెంటనే వాళ్ళను మాకు అప్పగించి ప్రాణాలు కాపాడుకో లేదా .......
ఊహూ ....... నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ వీళ్ళను రక్షించకుండా వెళ్లను . 

వీరా ...... వెళ్లిపో అంటూ మహి వచ్చి రక్తం కారకుండా చేతులను అడ్డుపెట్టింది - మాకోసం మీ ప్రాణాలమీదకు తెచ్చుకోకండి వీళ్ళు రాక్షసులు .......
మహీ ...... " వీరా " అని పిలిచావుకదా , వదిలి వెళ్ళిపోతే వీరుడిని ఎలా అవుతాను నువ్వు వెనుకకువెళ్లు అని పంపించి కిందపడిన కత్తిని అందుకుని రెండు కత్తులతో అడ్డుగా నిలబడ్డాను .

అన్నా ...... గుర్తుకొచ్చింది నిన్నటి వీరాధివీరుడు ఇతడే - దగ్గర నుండి చూసాను అంటూ ఒక బందిపోటు గుసగుసలాడాడు .
బందిపోటు నాయకుడు : ఆ వీరాధివీరుడువి నువ్వేనన్నమాట , ఏనుగు - దున్నపోతులకు మందుపెట్టి అందరి దృష్టి మరల్చి వీళ్ళను ఎత్తుకుపోదామనుకుంటే మొత్తం నాశనం చేసావు .
మహీ మహీ ...... అంటూ అమ్మాయిలంతా భయపడుతున్నారు .
బందిపోటు దొంగ : ఇప్పుడెలా రక్షిస్తావో చూస్తాను , రేయ్ ముందు వీడిని చంపేయ్యండి - వీడి చావు ఎలా ఉండాలంటే మనమంటే రాజ్యాలన్నీ భయపడాలి , దాడి చెయ్యండి .
మా గురువుగారు మీలాంటి రాక్షసుల గురించి చెప్పి నన్ను తయారుచేసి పంపించారు - మీ ప్రాణాలను తియ్యను కానీ లేవకుండా చేస్తాను అంటూ చుట్టుముట్టిన వాళ్ళందరినీ క్షణాలలో కూల్చేశాను , రేయ్ ఇక మిగిలింది నువ్వే ........
బందిపోటు నాయకుడు : నీ వీరత్వాన్ని తక్కువగా అంచనావేశాను ఇప్పుడుచూడు అంటూ ఒక ఈల వేసాడు . 
కొండకు మూడువైపుల నుండీ పదులసంఖ్యల్లో రాక్షసుల్లాంటి బందిపోట్లు చుట్టుముట్టారు . 
మహి : వీరా వీరా అంటూ నావైపుకు రాబోయింది . 
చేతితో సైగచేసి ఆపాను .
బందిపోటు నాయకుడు : రాక్షస నవ్వులు నవ్వి , చంపేయ్యండి అంటూ సైగచేశాడు.
మూడువైపుల నుండీ నామీదకు దూకుతున్న వాళ్ళను ఎదుర్కొంటున్నాను . అంతలో కృష్ణగాడు జతకలిసి కొడుతుంటే కిందకు పడిపోతున్నారు .

ఇంత ఆలస్యమా మిత్రమా .......
నా అవసరం లేదనిపించింది వీరా అంటూ సైగలుచేశాడు .
అమ్మాయిలను చూసుకో మిత్రమా ...... 
సరేనన్నట్లు వెళ్ళాడు .
బందిపోటు నాయకుడు : రేయ్ వాడు చంపడు కాబట్టి దైర్యంగా అందరూ కలిసి వాడిని పట్టుకోండి ( పాతికమందికి పైగా కలిసి కష్టపడి కదలకుండా పట్టుకున్నారు పిడిగుద్దులు గుద్దుతున్నారు ) - వీడు ఉండగా వాళ్ళను అపహరించి మన గమ్యాన్ని చేరడం అసాధ్యం - అలాగే గట్టిగా పట్టుకోండి చంపకండి రేయ్ నీ ముందే వీళ్ళను చంపి నిన్నూ మట్టుపెడతాను .

అది జరగనివ్వను , స్త్రీలు - పిల్లలు దేవతలతో సమానం అని గురువుగారు ఉపదేశించారు , నేను ప్రాణాలతో ఉండగా అది అసాధ్యం , నా ప్రాణాలర్పించయినా కాపాడుతాను , మిత్రమా ...... వారిని జాగ్రత్తగా వారి గమ్యానికి చేర్చు - " హారహారమహాదేవ " ....... అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకరించి నన్ను పట్టుకున్న పాతికమందితో అమ్మాయిలవైపు వెళుతున్న బందిపోటు నాయకుడి వైపుకు వేగంగా కదిలి అందరమూ లోయలోకిపడిపోయేలా దూకేసాను .
వీరా ...... అంటూ మహి ప్రాణమైన పిలుపు - మిత్రుడి అరుపులు వినిపించి పెదాలపై చిరునవ్వులతో అత్యంత ఎత్తునుండి ప్రవాహంలోకి పడిపోయాను .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-07-2022, 10:09 AM



Users browsing this thread: 1 Guest(s)