Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రోజూలానే సూర్యోదయానికి ముందే లేచాను . 
కృష్ణ ...... నాకంటే ముందుగా లేచి చుట్టూ జాగ్రత్తగా చూస్తున్నాడు .
కృష్ణా ....... అసలు నిద్రపోయావా లేదా అంటూ హత్తుకున్నాను . క్షమించు ఇకనుండీ వంతులవారీగా .......
ఊహూ ....... అంటూ స్పృశించాడు .
ఇదేమీ బాలేదు కృష్ణా ....... నేనంటే నీకు ఎంత ప్రాణమో నువ్వుకూడా నాకు అంతే ప్రాణం కదా .......
నామాటలేమీ పట్టించుకోకుండా కొలనులోకి వెళ్ళాడు .
నిన్నూ అంటూ నవ్వుకుంటూనే వెళ్లి సూర్య వందనం చేసుకుని స్నానమాచరించి , ఆయుధాలు - వస్తువులన్నింటినీ తీసుకుని ప్రయాణం సాగించాము .

నిన్నటి కంటే మరింత ఉత్సాహం వచ్చినట్లు కృష్ణ మరింత వేగం పెంచాడు . అరణ్యంలో అక్కడక్కడా ఆగి ఆగి వెళుతూ చీకటిపడ్డాక నీటి ప్రవాహం ప్రక్కన విశ్రాంతికి ఆగాము .
బరువులన్నీ దింపి కృష్ణా ...... హాయిగా విశ్రాంతి తీసుకో , నేను సాధన చేసుకోవాలి అన్నాను .
మంచి ప్రాణాళికనే పన్నావు మహేష్ అన్నట్లు ఒకచూపు చూసాడు కృష్ణ .......
నవ్వుకుని బహు బాణాల విలు విద్య - కత్తిసాము ...... సాధన చేసి పడుకున్నాను.

అలా దాదాపు వారం రోజులపాటు పటం సహాయంతో దట్టమైన అరణ్యాలు - కొండలు - ప్రవాహాలు - చిన్న చిన్న రాజ్యాలు దాటుకుని చిన్న గురువులు చెప్పిన సామంత రాజ్యం చేరుకున్నాము . కృష్ణా ...... నీవల్లనే కేవలం నీవల్లనే అనితరసాధ్యమైన ప్రయాణాన్ని సాగించి గమ్యాన్ని చేరుకున్నాము అంటూ మెడను చుట్టేసి ముద్దుపెట్టాను .
కృష్ణ ఆనందం అవధులులేనట్లు గెంతులువెయ్యడం చూసి ముచ్చటేసింది .

దట్టమైన అరణ్యపు కొండలు - కొండల పాదాలదగ్గర ఈ సామంత రాజ్యం - రాజ్యం ముందు మైదానం - అల్లంత దూరంలో పెద్ద లోయ ....... చూడముచ్చటగా ఉంది .
రాజ్యం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ బయట అంటే మైదానంలో జనాల హడావిడి కనిపిస్తోంది - అందరూ సంబరాలు చేసుకుంటున్నారు - ఎక్కడ చూసినా పూలతో అలంకరణ కనివిందు చేస్తోంది .
ఈ ఆనందాలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని జనాల మధ్యలోకివెళ్ళాను . ఒకవైపున బుజ్జి బుజ్జి పిల్లలు సంతోషంగా ఆడుకోవడం చూసి వాళ్ళ దగ్గరికివెళ్ళాను . అరణ్యం నుండి ఆహారం కోసం తీసుకొచ్చిన పళ్ళను పిల్లలకు అందించాను .
ధన్యవాదాలు ధన్యవాదాలు అన్నయ్యా చాలా తియ్యగా ఉన్నాయి అంటూ ఇష్టంగా తింటున్నారు .

సంతోషించి , పిల్లలూ ...... ఏమిటీ కోలాహలం - సంబరాలు ? .
పిల్లలు : అమ్మవారి జాతర అన్నయ్యా ...... 
అవునా ....... అందుకేనా ఇంతమంది జనం ......
ఇప్పుడేమి చూసారు సాయంత్రానికి ఇసుక వేస్తే రాలనంత జనం చేరుతారు - కోరికలు తీర్చే అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి చుట్టుప్రక్కల రాజ్యాల ప్రజలు తండోపతండాలుగా రాబోతున్నారు , నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే జాతరను రాజుగారు అంగరంగవైభవంతో జరిపిస్తారు , నీకూ కొరికలుఉంటే వెళ్లి కోరుకో నాయనా అమ్మ తప్పకుండా తీరుస్తుంది అంటూ ఒక బామ్మ చెప్పింది .
ఉంది బామ్మా ఒకేఒక కోరిక మా గురువుగారి కోరిక - ఇప్పుడే వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటాను అంటూ జనాలను దాటుకుంటూ అమ్మవారి మందిరం చేరుకున్నాను . కృష్ణను చెట్టుకింద ఉండమని చెప్పి మందిరంలోపలికివెళ్ళాను - అందమైన రెండు కళ్ళు నన్ను గమనిస్తున్నాయని అప్పటికి నాకు తెలియదు .

ఆదిపరాశక్తి అవతారంలోని అమ్మవారిని చూడగానే ధైర్యం - పరాక్రమం - శక్తి రెండింతలు అయ్యింది , అచ్చు నదీ దేవత అమ్మనే చూసినట్లు చాలా చాలా సంతోషం వేసింది , అమ్మా ...... నీ బిడ్డకు ఇలా దర్శనం ఇచ్చారా అంటూ భక్తితో మొక్కుకున్నాను , అమ్మా ....... నాకోరిక ఏమిటో తెలిసిందే కదా అతి తొందరగా తీరేలా ఆశీర్వదించండి అంటూ అమ్మ ముందు మోకరిల్లాను , అమ్మవారి హారతి - తీర్థ ప్రసాదాలు స్వీకరించాను , బయట ప్రాణ స్నేహితుడు ఉన్నాడని ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాను .

బయట జనాల పరుగులు కేకలు ....... అటువైపు చూస్తే జాతరలో అమ్మవారిని ఊరేగించే ఏనుగు జనాలవైపుకు భయంకరంగా దాడిచేస్తోంది . 
చాలా మంచి ఏనుగు - అమ్మవారి ప్రతిరూపంలా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది - ఎందుకు ఇలా చేస్తోంది పరిగెత్తండి పరిగెత్తండి అంటూ కేకలువేస్తున్నారు .
చేతిలోని ప్రసాదాన్ని గుడిలోపల ఉంటూ భయంతో వనికిపోతున్న ఒకరికి ఇచ్చి , మధమెక్కిన ఏనుగును ఎలా దారిలోకి తీసుకోవాలో తెలుసుకాబట్టి పరుగులుతీస్తున్న జనాలకు వ్యతిరేకంగా మీదకు దూసుకొస్తున్న ఏనుగు దగ్గరకే వెళ్ళాను . 
చేతిని ముందుకు చాచి దూరంగా వస్తున్న ఏనుగు కళ్ళల్లోకి చూస్తూ ఏనుగు బాష మాట్లాడుతూ శాంతిపచెయ్యడానికి ప్రయత్నించాను . 
ఏనుగు తన తలను విధిలిస్తూ దూసుకొచ్చి నామీదకు ఎక్కేయ్యబోతుంటే ప్రక్కకు ఎగిరాను . 
ఏనుగు తినరానిదేదో తిన్నదని అగ్ని గోళాలుగా మారిన కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోయింది . ఈ పరిస్థితులలో ఏనుగును నియంత్రించలేము ప్రక్కకు తప్పుకోండి ప్రక్కకు తప్పుకోండి అంటూ ఏనుగు వెంబడి పరుగులుతీస్తూ కేకలువేస్తున్నాను .

జనాలందరూ ప్రక్కకు తప్పుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు . అంతలోనే పిల్లలు పిల్లలు అంటూ తల్లులు కేకలువేస్తున్నారు .
చూస్తే నేను పళ్ళు ఇచ్చిన పిల్లలు - బుజ్జాయిలు ...... ఏనుగు పరిస్థితి గురించి తెలియక భలే భలే ఏనుగు అంటూ పరుగులుతీస్తున్న ఏనుగు దారిలోనే సంతోషంతో గెంతులేస్తున్నారు . 
పిల్లలూ పిల్లలూ ప్రక్కకు వెళ్ళండి అంటూ కేకలువేస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో , ఏనుగు వెనుకే వేగంగా పరుగులుతీస్తూ కృష్ణా ...... అంటూ కేకవేసాను .
నా ప్రక్కకు రాగానే కృష్ణపైకి - కృష్ణపై సంచీలో ఉన్న ఆయుర్వేద మూలికలు అందుకుని ఏనుగుపైకి ఎగిరాను . ఏనుగు విధిల్చడంతో పట్టుతప్పి పడిపోబోయి ఆ అమ్మవారి ఆశీస్సుల వలన ఏనుగుపైకి చేరి మూలికల రసం పిండి ముందుకు వీలైనంత వొంగి రెండు కళ్ళల్లోకి చేరేలా చేసి , ఏనుగుపై వాలి తనకు తెలిసేలా స్పృశిస్తున్నాను .
మూలికలు మరియు ఆప్యాయతకు ఏనుగు వెంటనే నియంత్రణలోకివచ్చి సరిగ్గా పిల్లల ముందు ఆగిపోయింది .

పిల్లల తల్లిదండ్రులు పరుగునవచ్చి పిల్లలను తమ గుండెలపైకి తీసుకున్నారు - నాకు దండాలు పెడుతున్నారు ,  జనాలంతా చుట్టూ చేరి జయజయనాదాలు చేస్తున్నారు .
ఏనుగును పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చి , అమ్మవారి దయవలన ఎవ్వరికీ ఏమీ కాలేదు అని సంతోషించి , ఏనుగుపై లేచినిలబడి అమ్మవారికి మొక్కుకున్నాను .

ఒక అపాయం తప్పింది అనుకునేంతలో రాజ్యం ప్రహరీగోడను సైతం పడగొట్టి వందల్లో దున్నపోతులు - ఆవులు ....... జనాలవైపుకు మధమెక్కిన ఏనుగులానే అగ్ని గోళాలైన కళ్ళతో అడ్డుగా ఉన్న జాతర అంగళ్లను నాశనం చేసుకుంటూ జనాలవైపుకు పరుగులుతీస్తున్నాయి .
వెంటనే అందరినీ తప్పుకోమని కేకలువేస్తూ కిందకుదిగాను . ఆ దున్నపోతుల వేగానికి భూతల్లి సైతం కంపిస్తోంది .
జనాలంతా మరింత భయంతో కేకలువేస్తున్నారు . 

ఆపడానికి ఒకటీ రెండు పశువులు కాదు వందలుగా మీదకు వస్తున్నాయి . వెంటనే కృష్ణపై ఉన్న విల్లు - బాణాలను అందుకుని ఒకేసారి రెండు బాణాలను కోణంలో జాతర కోసం అమ్మవారి గుడి ముందు పెద్దమొత్తంలో ఉంచిన పసుపు కుంకుమ వైపుకు వదిలాను .
దారివెంబడి కుంకుమ పసుపు దట్టంగా కమ్ముకోవడం - అమ్మవారి తిలకమైన కుంకుమ పశువుల కళ్ళల్లో పడగానే అన్నీ ఖాళీగా ఉన్న దారిలోకి మరిలాయి , చివరగా ఉన్న నాలుగైదు దున్నపోతులకు దారి స్పష్టంగా కనిపించడంతో మావైపుకు పరుగులుతీస్తున్నాయి .
జనాలంతా కేకలువేస్తూ ప్రక్కకు తప్పుకున్నారు - ముసుగులో ఉన్న ఒక అమ్మాయి తప్ప ........

మహీ మహీ ....... అంటూ ప్రక్కకు జరిగిన అమ్మాయిలు కేకలువేస్తున్నప్పటికీ ఆ అమ్మాయి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నావైపుకే చూస్తున్నట్లు అనిపించింది .
అంతలో దున్నపోతులు కొమ్ములు విధిలిస్తూ దగ్గరికి వచ్చెయ్యడంతో మహి మహి అంటూ అమ్మాయిలు ...... ఆ అమ్మాయి దగ్గరికి చేరుకోబోయారు . 
వద్దు వద్దు అంటూ చేతితో సైగలుచేస్తూ పరుగునవెళ్లి ఆ అమ్మాయి చేతిని అందుకుని నామీదకు లాక్కుని ప్రక్కకు ఎగిరాను . అదృష్టవశాత్తూ గడ్డిపై పడటంతో అమ్మాయికి ఎటువంటి దెబ్బలు తగల్లేదు .
అంత జరిగినా ....... ముసుగులోపలనుండి నన్నే చూస్తున్నట్లు కదలకుండా నాపైనే ఉండిపోయింది .
క్షమించండి క్షమించండి అంటూ లేవబోయినా ప్రక్కకు కదలనే కదలకపోవడం చూసి ఆశ్చర్యపోయాను .
మహీ మహీ ...... అంటూ అమ్మాయిలు వచ్చి దెబ్బలేమీ తగల్లేదు కదా అంటూ లేపారు .
లేపమని అన్నానా అంటూ చుట్టూ అమ్మాయిలను కొట్టడం చూసి నవ్వుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-07-2022, 10:07 AM



Users browsing this thread: 6 Guest(s)