Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రాత్రంతా గురువుగారి పాదసేవలో తరించి పాదాల దగ్గరే నిద్రపోయాను . తెల్లవారుఘామున లేచిచూస్తే నాకంటే ముందుగానే గురువుగారు లేచి జోకొడుతుండటం జీవితంలో మరిచిపోలేని అనుభూతి .
గురువుగారు వెంటనే చెమ్మను తుడుచుకున్నారు .
వెంటనే లేచి గురువుగారి పాదాలదగ్గరకు చేరాను . పాదాలను స్పృశిస్తూ గురువుగారూ ....... మహేష్ వెళ్లకు అని ఒక్కమాట చెప్పండి ఆగిపోతాను , నాకు రాజ్యంపై - ఆ అందాలరాశిపై ఎటువంటి .........
గురువుగారు : లేదు లేదు లేదు అలా కానే కాదు మహేష్ , అయినా నా ఇష్టమైన శిష్యుడి గురించి ఈ గురువుకు తెలియదా చెప్పు , ఇవి నువ్వు దూరం వెళుతున్నావన్న బాధతో వచ్చిన కన్నీళ్లే అయినా నువ్వు గొప్పస్థాయికి చేరబోతున్నావన్న ఆనందబాస్పాలు కూడా అంటూ ఆనందంతో చెప్పారు , మహేష్ ....... రాజ్యం ఎలాగో నీ పాదాల చెంతకు చేరక తప్పదు అంతటి వీరుడు నా శిష్యుడు కానీ ఆ అందాలరాశి నీకోసమే పుట్టి నీ గురించే కలలు కంటూ ఆశతో జీవిస్తోంది .
గురువుగారూ ...... అంటూ సిగ్గుపడ్డాను .
గురువుగారు : అంటే నా శిష్యుడికి ఇష్టమే అన్నమాట చాలా సంతోషం - అంతటి అతిలోకసుందరి ...... ఈ వీరాధి వీరుడి సొంతం కావాల్సిందే , దిగ్విజయుడివై విరాజిల్లు మహేష్ .......
మీ ఆశీర్వాదం ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంతో సాధిస్తాను గురువుగారూ .......
గురువుగారు : ఆనందించి , ప్రయాణపు సమయం ఆసన్నమైనది మళ్లీ వచ్చి పరమశివుడి అనుగ్రహం పొందాలికదా అంటూ నదికి చేరుకున్నాము .

సూర్య వందనం చేసుకుని , నదీ దేవత అమ్మ ఒడిలో ప్రేమను పొందుతూ స్నానమాచరించాను . 
అమ్మా ...... వెళ్ళొస్తాను , అంతవరకూ గురువుగారిని జాగ్రత్తగా చూసుకుంటూ సమాచారం ఇవ్వాలి , ఇది మీ బిడ్డగా కోరుతున్న తొలి కోరిక అంటూ నీటిని త్రాగాను .
గురువుగారు ఆనందించి , నదీ దేవతా ...... నీబిడ్డను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ప్రార్థించారు .
గురుకులం చేరుకున్నాము . గురువుగారూ ...... కృష్ణ కూడా దేవిడి చెంతకు .
గురువుగారు : ఎంతమాట నాకు కావాల్సినది కూడా అదేకదా మహేష్ - శివుడి అనుగ్రహం ఇద్దరికీ ఉండాలి .
ప్రయాణంలో - కర్తవ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుగ్రహించమని భక్తితో ప్రార్థించాము . 
గురువుగారు ...... మా ఇద్దరికీ వీరతిలకం దిద్ది హారతిని అందించారు .

గురువుగారూ మహేష్ ...... శుభవార్త అంటూ చిన్నగురువులు పరుగునవచ్చారు , గురుకులపై అపార నమ్మకం ఉండే ముఖ్యమంత్రి నుండి స్వయంవరం గురించిన సమాచారం సేకరించాము , ప్రయాణ దూరం 900 మైళ్ళు ...... ఆ దారిని చూయించే దిక్సూచి - పటం ఇదిగో మహేష్ , అతికష్టమైన ప్రయాణం .......
గురువుగారి కోరిక తీర్చడంలో గురువుగారి ఆశీర్వాదంతో ఆ కష్టాలన్నీ సునాయాసంగా చేధించుకుంటూ గమ్యం చేరుకుంటాను .
చిన్న గురువులు : అంతటి వీరుడువని మాకు తెలుసులే ...... , ఇదిగో ఇది ఆ పెద్ద రాజ్యానికి దగ్గరలో ఉన్న అతిచిన్న సామంత రాజ్యం - నువ్వు ఇక్కడ నుండే అనుకున్నది సాధించే వ్యూహాలు పన్నాలి ఎందుకంటే రాజ్యంలోకి వెళితే ఎవరైనా గుర్తుపట్టే ప్రమాదం ఉంది . 
అవసరమైన గొప్ప సమాచారం గురువులూ ....... 
చిన్న గురువులు : అయినాకూడా జాగ్రత్తపడాల్సినవి దృష్టిలో ఉంచుకోవాల్సినవి ఉన్నాయి మహేష్ ...... , ఆ రాజ్యాన్ని ఎలాగైనా తమ గుప్పిటలోకి తీసుకోవాలని చాలా ఏళ్లుగా భయంకరమైన రాక్షసుల్లాంటి అడవి మనుషులు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు వాళ్ళతో జాగ్రత్త - పరాయవ్యక్తి అని తెలిస్తే చిత్రహింసలు పెట్టి చంపేస్తారు .
అలాంటివాళ్లకు భయపడితే నేను .... గురువుగారి ప్రియతమ శిష్యుడిని ఎలా అవుతాను .
చిన్న గురువులు : ఆ ధైర్యం మాకూ ఉందిలే కానీ కాస్త జాగ్రత్త , ఇక అతిముఖ్యమైంది ఏమిటంటే ఏమిటంటే ....... ఆ రాజ్యపు రాజుకు మన రాజులలానే అహంకారం , అలా అని చెప్పలేము కానీ తన కూతురిని యువరాజుకే ఇవ్వాలని రాజులే గొప్పవారన్న నమ్మకం .......
గురువుగారు : మన శిష్యుడు అంతకన్నా గొప్పవాడు , సరైన సమయానికి వాళ్లకు తెలుస్తుందిలే , ఇక ఆలస్యం చెయ్యడం మంచిదికాదు మహేష్ ...... , ఈ విషయం యువరాజులకు తెలిస్తే అపాయం .
గురువుగారూ ....... అంటూ హత్తుకుని , తప్పదు కాబట్టి ఆశీర్వాదం తీసుకున్నాను.
గురువుగారు : దిగ్విజయుడివై అతిలోకసుందరిని రాజ్యాన్ని పొందాలి అంటూ ఆశీర్వదించారు .
చిన్న గురువులు : రాజువై వచ్చి ఈ యువరాజులను ఓడించి అహంకారాన్ని అణిచివెయ్యాలి .
గురువుగారు : యువరాజులను గురుకులం పోటీలలోనే ఓడించాడు - తోటి స్నేహితుడిని పోటీలో లేకుండా చేశారు అంటే ఎంత భయపడ్డారో తెలిసిందే - మహేష్ ....... నీ గమ్యం ఈ యువరాజులు కాదు , రాజువై రాజ్యాన్ని - వీలైనంతమంది ప్రజలను సంతోషపెట్టడం అది గుర్తుపెట్టుకో ...... , ఇక వెళ్లు ......
అలాగే గురువుగారూ అని ఆశీర్వాదం తీసుకుని , పరమశివుడిని మొక్కుకున్నాను . ఆయుధాలతో స్వారీకి సిద్ధంగా ఉన్న కృష్ణగాడిపైకి ఎక్కి బయలుదేరాను .

దాదాపు పద్దెనిమిది ఏళ్ల తరువాత గురుకులం - గురుకుల అరణ్యం నుండి బయట ప్రపంచానికి ప్రయాణం సాగించాను .
గురుకులానికి చుట్టూ ఉన్న రాజ్యాలలో రెండు మూడు రాజ్యాల ద్వారా కాకుండా రాజ్యం చూట్టూ కష్టమైన దారిలో జాగ్రత్తగా బయటపడ్డాను . గురువుగారి గురుదక్షిణ కోరిక తీర్చడం కోసం కాస్త తగ్గడంలో బాధ ఏమాత్రం అనిపించలేదు . కొద్దికొద్దిసమయానికే కృష్ణ నుండి కిందకుదిగి నడక సాగించాను .
అంతదానికే కృష్ణకు కోపం వచ్చేసేది , నేనున్నది ఎందుకు ఎక్కు అంటూ ఎక్కి స్వారీ చూసేంతవరకూ వదిలేవాడు కాదు , నవ్వుకుని ఇద్దరమే మాట్లాడుకుంటూ వేగంగా ముందుకువెళ్లాము . 
ఆరోజుకు చీకటి పడటం - ఉదయం నుండీ దాదాపు వంద మైళ్ళకు పైగా ప్రయాణించడం వలన కృష్ణకు విశ్రాంతి కావాలి కాబట్టి అరణ్యంలో చిన్న కొలను ప్రక్కన ఆగాము . 

కృష్ణతోపాటు నీటిని సేవించి , విశ్రాంతి తీసుకోమనిచెప్పి ఆహారం తీసుకొచ్చాను , కృష్ణకు తినిపించబోతే గుర్రుగా ఉన్నాడు . 
ఎందుకో అర్థమై నవ్వుకున్నాను - నేనొక్కడినే వెళ్ళాను నాకేమైనా అవుతుందనా ....... నా ప్రాణ స్నేహితుడు ఉదయం నుండీ దున్నపోతులా ఉన్న నన్ను మోసాడు కదా ...... ఈమాత్రం కూడా చేయకపోతే ఎలా , తినవా ....... నువ్వుమాత్రమే కాదు నేనుకూడా జాగ్రత్తగా చూసుకోమని గురువుగారు చెప్పారుకదా అంటూ బుజ్జగించడంతో తినింది , మా మంచి కృష్ణ అంటూ ఇద్దరమూ తిన్నాము , నేలపై పడుకున్న కృష్ణపై తలవాల్చి గురువుగారిని సేవించుకునే సమయం అంటూ మాట్లాడుతూనే హాయిగా నిద్రపోయాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-07-2022, 10:06 AM



Users browsing this thread: 45 Guest(s)