Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చెల్లెళ్లతోపాటు అక్కయ్య - దేవత లోపలికివెళ్లి స్కూల్ కు ఆలస్యం అవుతుందని త్వరగానే వచ్చేసారు . అక్కయ్య ...... మల్లీశ్వరి గారి దగ్గరకువెళ్లి చెవిలో గుసగుసలాడి వచ్చి నా ప్రక్కన కూర్చుని చుట్టేశారు .
బస్సు రెండు నిముషాలలో నేరుగా స్కూల్ లోపల వెళ్లి ఆగింది .
చెల్లెళ్లు : మొదట అక్కయ్య కాలేజ్ కు కదా మల్లీశ్వరి అంటీ .......
మల్లీశ్వరి గారు : మీ మమ్మీ వచ్చేన్తవరకూ చెల్లెళ్లతోనే ...... స్కూల్ కే పోనివ్వమని మీ ప్రాణమైన అక్కయ్య ఆర్డర్ హాసినీ ..... , మిమ్మల్ని వదిలి కాలేజ్ కే కాదు ఎక్కడికీ వెళ్లరట ......
చెల్లెళ్లు : అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ వచ్చి మాఇద్దరిపై మరియు అక్కయ్యకు మరొకవైపు కూర్చున్నారు .
చెల్లెళ్లు ముద్దులుపెట్టేలోపు అమితానందంతో అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాను .
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా - లవ్ యు లవ్ యు soooo మచ్ అక్కయ్యా ...... అంటూ ముద్దుల వర్షమే కురుస్తోంది , అక్కయ్యా ..... మరి క్లాస్సెస్ ? .
అక్కయ్య : మా బంగారం లాంటి చెల్లెళ్ళ నవ్వులే క్లాస్సెస్ - మిస్ అయితే అవ్వనివ్వండి , అటెండెన్స్ తక్కువై exams రాయనివ్వకపోయినా పర్లేదు మా చెల్లెళ్లతోనే ....... అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
దేవత : లవ్ యు చెల్లీ ...... , exams ఎందుకు రాయనివ్వరో మేమూ చూస్తాములే ....... , మేమంతా వచ్చి కాలేజ్ ముందు నిరాహారదీక్ష చేస్తాము , what do you say హీరో - విక్రమ్ - బుజ్జిచెల్లెళ్ళూ ......
యాహూ యాహూ ...... అంటూ కేకలువేశాము .
మేముకూడా నిరాహారదీక్షలో జాయిన్ అవుతాము అంటూ మల్లీశ్వరి - రాజేశ్వరి వాళ్ళు అన్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు ........

ప్రేయర్ కు టైం అవుతోంది దిగండి దిగండి అంటూ హడావిడి చేస్తూ మొదట దేవత వెనుకే మేమంతా దిగాము .
దేవత : ఏంటి ప్రేయర్ టైం అవుతున్నా అక్కడక్కడా ఒక్కొక్క స్టూడెంట్స్ తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు పైగా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది - ఆశ్చర్యంగా ఉందే ......
అక్కయ్య : అవును అక్కయ్యా ...... ఎప్పుడూ ఈ సమయానికి బయట మెయిన్ రోడ్ వరకూ పిల్లల కేకలు వినిపించేవి .
చెల్లెళ్ళూ - అన్నయ్యలూ ...... అంటూ ఒకరిముఖాలుమరొకరు చూసుకుంటున్నాము .
దేవత : చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... లోపలికివెళదాము అంటూ అక్కయ్య - వైష్ణవి చేతులను అందుకుని లోపల స్కూల్ హాల్లోకి నడిచారు .

సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ....... అంటూ ఒక్కసారిగా సంతోషపు కేరింతలు చప్పట్లు మరియు సంబరాలు .......
మేడం మేడం అవంతిక మేడం అవంతిక మేడం అంటూ స్టూడెంట్స్ నినాదాలతో స్కూల్ మొత్తం దద్దరిల్లిపోతోంది .
కంగ్రాట్స్ కంగ్రాట్స్ congratulations మిస్ అవంతికా ...... అంటూ మేనేజ్మెంట్ ఆ వెంటనే విమెన్ టీచర్స్ నుండి ఫ్లవర్స్ - బొకేస్ వెల్లువెత్తాయి .
దేవత ...... దేవతను చూసి అక్కయ్య ..... షాక్ లో ఉండిపోయారు . ఏమైనా అవ్వనీ అంటూ సన్తహోశంతో చెల్లెళ్లతోపాటు వెళ్లి దేవతకు చిరునవ్వులతో కంగ్రాట్స్ చెప్పి బరువు కాకుండా దేవత చేతిలోని ఫ్లవర్స్ - బొకేస్ ను అందుకుని టేబుల్ పై ఉంచాము , మేమలా తీస్తున్నాము మళ్లీ మళ్లీ విషెస్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి .

మేనేజ్మెంట్ మేడమ్స్ : అవంతికా ...... మా నమ్మకాన్ని నిలబెట్టావు - స్కూల్ కు రాష్ట్రస్థాయిలోనే కాదు నేషనల్ & ఇంటర్నేషనల్ గా గౌరవాన్ని తీసుకొచ్చావు అంటూ అంతులేని ఆనందంతో మళ్లీ కంగ్రాట్స్ చెప్పి తనివితీరడం లేదు అంటూ కౌగిలించుకున్నారు .
దేవత షాక్ నుండి తేరుకుని , మేడమ్స్ ...... ఎందుకు ఈ అభినందనలు అర్థం కావడం లేదు .
మేనేజ్మెంట్ : చెప్పనేలేదు కదూ ....... , అవంతికా .... నువ్వు స్కూల్ తరుపున సబ్మిన్ చేసిన novel " LIFE & TIME " కు స్టేట్ & నేషనల్ బుక్ అవార్డ్స్ తోపాటు ప్రెస్టీజియోస్ " జ్ఞానపీట్ అవార్డ్ " కు ఎంపిక అయ్యింది - ఇక ఇంటర్నేషనల్ గా "బూకర్ ప్రైజ్ " కు కూడానూ ..... ప్రతీ అవార్డ్ లో నీ పేరు కింద మన స్కూల్ నేమ్ ఉండటం ఎంత ఆనందం కలుగుతోందో తెలుసా ..... , వింటున్నావా హెడ్ మాస్టర్ రూమ్ - మా రూమ్ నుండి ఫోన్ రింగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి అంటూ దేవతను అమాంతం పైకెత్తి తిప్పుతున్నారు .
అధిచూసి టీచర్స్ - స్టూడెంట్స్ అందరూ సంతోషంతో చప్పట్లు - కేకలువేస్తున్నారు .

మేడమ్స్ మేడమ్స్ థాంక్యూ థాంక్యూ అంటూనే దేవత కిందకుదిగి అమితమైన ఆనందంతో చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ .......
అక్కయ్యా - దేవతా దేవతా ...... కంగ్రాట్స్ కంగ్రాట్స్ అంటూ సంతోషంతో హత్తుకున్నారు .
లవ్ యు చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ......
దేవతా ...... కంగ్రాట్స్ .....
దేవత : లవ్ యు హీరో - ఆ కేకల మధ్యన చెల్లీ చెల్లీ ...... అంటూ ఏదో చెప్పబోయారు .
అక్కయ్యకు - చెల్లెళ్లకు బుక్ గురించి బామ్మ ద్వారా మొత్తం తెలుసు కాబట్టి , అక్కయ్యా - దేవతా ...... ఈ సంతోషపు అభినందనల మధ్యన ఏమీ వినిపించడం లేదు ముందు స్కూల్ విషెస్ అందుకోండి తరువాత మనం మాట్లాడుకుందాము .

స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా వచ్చి దేవతకు పూలు అందించి విషెస్ తెలుపుతున్నారు .
థాంక్యూ థాంక్యూ స్టూడెంట్స్ అంటూ దేవత ఆనందాలకు అవధులే లేకపోయాయి.
మేనేజ్మెంట్ : స్టూడెంట్స్ స్టూడెంట్స్ ...... మీ ప్రియమైన మేడం , మీ మీ క్లాస్సెస్ కు వచ్చినప్పుడు విష్ చెయ్యవచ్చు , బయట ఆర్గనైజేషన్స్ నుండి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి మన అవంతిక మేడం ను సన్మానించుకోవాలని , ముందు మనమా వాళ్ళమా ...... ? .
మనమే మనమే ...... అంటూ కేకలతో స్కూల్ దద్దరిల్లిపోయింది .
మేనేజ్మెంట్ : Thats మై స్టూడెంట్స్ - ప్లీజ్ ప్లీజ్ స్టూడెంట్స్ అందరూ ఆడిటోరియం కు వెళ్ళాలి ......
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కేకలువేస్తూ వెళ్లారు .
మేనేజ్మెంట్ : అవంతికా ...... రెడీ కదా ? .
దేవత : మేడమ్స్ can you give me 5 మినిట్స్ ? .
మేనేజ్మెంట్ : Take your own time అవంతికా - మేము సంతోషంతో వేచి చూస్తాము - మా రూమ్ లో రిలాక్స్ అవ్వు ఎంతైనా ఇది స్వీటెస్ట్ షాక్ కదా కానీ కాస్త తొందరగా ఆడిటోరియం కు వచ్చెయ్యి అంటూ వదిలి వెళ్లారు .

దేవత : చెల్లీ ...... అదీ అదీ ......
అక్కయ్య : అదీలేదు - ఇదీ లేదు ....... అక్కడ మీరంటే ఇష్టమైన బుజ్జి బుజ్జి స్టూడెంట్స్ ను వెయిట్ చేయించడం ఏమీ బాగోలేదు , మేనేజ్మెంట్ రూమ్ కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు వెళదాము పదండి , మా అక్కయ్యకు జరగబోవు సన్మానం చూడాలని ఇక్కడ మేము పిచ్చెక్కిపోతుంటేనూ ...... లవ్ యు తమ్ముడూ ఉమ్మా .....
అవునవును దేవతా దేవతా ...... అంటూ చెల్లెళ్ళ ఆనందం అంతేలేదు . అన్నయ్యా ...... లవ్ యు లవ్ యు సో మచ్ - వెనుక సీట్స్లో కూర్చుని ఎంజాయ్ చేస్తాము .
దేవత : కంగారుపడుతూనే లవ్ యు చెప్పారు .
అక్కయ్య : అక్కయ్యా ...... " LIFE & TIME " మీ లైఫ్ అని బామ్మ చెప్పారు - బుక్ కంప్లీట్ చెయ్యడానికి ఎంత ఆరాటపడ్డారో కూడా తెలుసు .......
దేవత : కానీ ......
అక్కయ్య : అదిగో మళ్లీ ...... కానీ లేదు ఏమీ లేదు - ముందు వెళదాము పదండి .
దేవత : చెల్లీ ......
అక్కయ్య : Ok ok మీ కంగారుని పోగొట్టడానికి మాదగ్గర మంత్రం ఉందికదా ...... , చెల్లెళ్ళూ ..... అంటూ దేవతను కుర్చీలో కూర్చోబెట్టి , నలుగురూ ఒకేసారి నుదుటిపై - బుగ్గలపై - పెదాలపై ముద్దులుపెట్టేశారు , అందరి నవ్వులతో దేవతకూడా నవ్వేశారు , అక్కయ్యా ..... ఇక దైర్యంగా కదలండి .
దేవత : లవ్ యు చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... , మీ ముద్దులకు ఇప్పుడు మనసు కుదుటపడింది . ఇంటిలో నువ్వు చెప్పిన మహాద్భుతం ఎంత ఆనందాన్ని పంచుతోందో మాటల్లో వర్ణించలేను అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
అక్కయ్య : అంతా పెద్దమ్మ మరియు నా నా ( తమ్ముడి ) అనుగ్రహం అంటూ నావైపు ప్రేమతో కన్నుకొట్టి వెళదాము పదండి ......

ఆడిటోరియం వైపుకు టర్న్ అవ్వగానే , మేనేజ్మెంట్ మేడమ్స్ స్వయంగా ఆడిటోరియం వరకూ పిలుచుకునివెళ్లారు - వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతులేకుండా ఉంది - ఆడిటోరియం వరకూ వారి మొబైల్స్ రింగ్ అవుతూనే ఉన్నాయి .
మేనేజ్మెంట్ : అవంతికా ...... నిన్న సాయంత్రం నుండీ ప్రశంసలు ఆగడమే లేదంటే నమ్ము - ఇలా నిన్ను సర్ప్రైజ్ చెయ్యాలని చెప్పలేదు sorry ......
అక్కయ్య : నో నో నో మేడమ్స్ ...... , అక్కయ్య likes it ......
మేనేజ్మెంట్ : Sorry sorry you are ......
దేవత : మై లవ్లీ సిస్టర్ కావ్య మేడమ్స్ ......
మా అక్కయ్య కూడా మేడమ్స్ ......
మేనేజ్మెంట్ : Ok ok స్టూడెంట్స్ - లవ్లీ & బ్యూటిఫుల్ - నైస్ టు మీట్ యు కావ్యా ..... , సన్మానం తరువాత మనమంతా కలిసి మాట్లాడుకుందాము .
అక్కయ్య : నైస్ టు మీట్ యు మేడమ్స్ - you క్యారి ఆన్ ......
మేనేజ్మెంట్ : థాంక్యూ కావ్యా , ఆడిటోరియం లోపలికి పిలుచుకునివెళ్లారు .

టీచర్స్ - స్టూడెంట్స్ అందరూ లేచి చప్పట్లతో స్వాగతం పలికారు . అవంతికా - కావ్యా ...... Please have a seat అంటూ ఆడిటోరియం ముందు వరుసలో ఉన్న VIP సోఫాలలో కూర్చోబెట్టారు .
దేవత - అక్కయ్య : చెల్లెళ్ళూ ..... అంటూ ఇద్దరి మధ్యలో మరియు ఒడిలో కూర్చోబెట్టుకున్నారు .
చెల్లెళ్లు - అక్కయ్య : అన్నయ్యా - తమ్ముళ్లూ ...... , అన్నయ్యా ..... సోఫాలన్నీ ఉల్ మాపై కూర్చోండి .
దేవత : మహేష్ - విక్రమ్ ...... కూర్చోండి .
చెల్లెళ్ళూ - అక్కయ్యా - దేవతా ...... వెనుకకువెళ్లి ఫ్రెండ్స్ తోపాటు కేకలువేస్తూ ఎంజాయ్ చెయ్యాలికదా .......
మేనేజ్మెంట్ మేడం : నో నో నో ఈ ఫంక్షన్ లో అయితే కాదు - మీ మేడం ఎంత స్పెషల్ నో మీరూ అంతే స్పెషల్ అంటూ డోర్ వైపు సైగలుచేశారు .
అంతే స్కూల్ స్టాఫ్ మరొక సోఫా తీసుకొచ్చి దేవత సోఫా ముందు వేశారు .
మేనేజ్మెంట్ మేడం : సిటీ హీరో కూర్చో .......
మేడమ్స్ ....... మేడం ముందు - మేడం ..... మీరు ముందుకు రండి మేము వెనుక కూర్చుంటాము .
చెల్లెళ్లు : నో నో నో మా అన్నయ్యే మా హీరో మా ధైర్యం - మీరే ముందు ......
దేవత : బుజ్జిచెల్లెళ్ళు చెప్పారుకదా కూర్చోండి .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ అంటూ హాసినిని ప్రాణాంలా హత్తుకుని ముద్దులుపెట్టారు - తమ్ముడూ ...... దేవతనే చెప్పారుకదా కూర్చో ......
అలాగే అక్కయ్యా అంటూ తమ్ముడితోపాటు కూర్చున్నాను .

ఒక మేనేజ్మెంట్ మేడం స్టేజి మీదకువెళ్లి మైకు అందుకున్నారు . గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ - టీచర్స్ ...... Ok ok మీ అవంతిక మేడం అంటే మీకు ఎంత ఇష్టమో మీ సంతోషం - కేకలే చెబుతున్నాయి , Few మినిట్స్ few మినిట్స్ ...... మీ అవంతిక మేడం మరియు తను రాసిన బుక్ గురించి మాట్లాడబోతున్నాను మీరు సైలెంట్గా ఉంటే , అలా అని స్పీచ్ ఇవ్వనులే బ్రీఫ్ గా explain చేస్తాను అంతే ...... 
నవ్వులు వెల్లువిరిసాయి ......
మేనేజ్మెంట్ మేడం : థాంక్యూ - టీచర్స్ ...... మన స్టూడెంట్స్ well disciplined - ప్రౌడ్ ఆఫ్ యు స్టూడెంట్స్ ......
స్టూడెంట్స్ : థాంక్యూ థాంక్యూ ...... మేడం .....
మేనేజ్మెంట్ : సంతోషంతో నవ్వుకుని , మన మేడం అవంతిక ..... అవంతిక అని నా పెదాలపై పలికిన ప్రతీసారీ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను .
సంతోషంతో చప్పట్లు ......
మేనేజ్మెంట్ : ఏదో మన మేడం అని పొగడటం లేదు - అవార్డ్స్ వచ్చిన విషయం తెలియగానే అర్ధరాత్రివరకూ నిద్రపోకుండా చదివాను , చదువుతుంటే కుతూహలం అంతకంతకూ పెరుగుతూనే ఉంది నిద్ర హుష్ కాకి అయిపోయింది .
మళ్లీ నవ్వులు ......
మేనేజ్మెంట్ : Yes yes నాకూ అంతే ఆనందం కలిగింది . ప్రస్తుత బిజీ & పొల్యూటెడ్ లైఫ్ లో ప్రపంచంలోని ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిన బుక్ మన అవంతిక మేడం " LIFE & TIME " అని ప్రౌడ్ గా చెబుతున్నాను . ఇక బుక్ గురించి " మన జీవనం గురించి మన జీవన సమయం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు , కంటికి కనిపించని కణం నుండి సూర్యుడు - గ్రహాలు ఉంద్భవించడం ,వేరే గ్రహాలలో జీవం ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి మన భూమిని example గా తీసుకున్నారు , భూమిపై వాతావరణం ..... వాతావరణం వలన నీరు ..... నీరు వలన జీవం - మొక్కలు ఉద్భవించి మానవులు - జంతువులుగా పరిణామం చెందడం వివరించిన విధానం అద్భుతం మహాద్భుతం ....... , ఇక ఇక్కడే మన పతనం మనమే సృష్టించుకుంటున్నాము , నాగరికత - అభివృద్ధి పేరుతో అందమైన అద్భుతమైన భూమిని పొల్యూషన్ తో ఎలా మళ్లీ మొదటి పరిణామం దగ్గరకే ఎలా చేరుకోవడానికి ఎలా నాశనం చేసుకుంటున్నామో మీరే స్వయంగా తెలుసుకోవాలి " . 
స్టూడెంట్స్ : మేడం మేడం ...... చెప్పొచ్చుకదా ......
మేనేజ్మెంట్ : నేను చెబుతుంటేనే ఎంత ఆసక్తితో విన్నారో ఇక మీరే స్వయంగా చదివి తెలుసుకుంటే ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేను - ప్రస్తుత విద్యార్థులే రేపటి పౌరులు , మీ మేడం ఏదైతే జరగకూడదని ఆనుకుంటున్నారో దానిని ముందుకు తీసుకెల్లే బాధ్యత మీ పైననే ఉంది .
స్టూడెంట్స్ : మేడం మేడం ..... బుక్స్ బుక్స్ ......
మేనేజ్మెంట్ : అక్కడికే వస్తున్నాను స్టూడెంట్స్ ...... , అవంతికా మేడం ...... మీ అనుమతి లేకుండా సిటీలోని అన్నీ ప్రింటింగ్స్ లో దాదాపు టెన్ థౌజండ్ కాపీస్ ప్రింట్ చేయించాము - ప్రింట్ చేయించాము కానీ మీ అనుమతి లేకుండా సెల్ చెయ్యము .
టీచర్స్ : టెన్ థౌజండ్ ? - టెన్ థౌజండ్ ? అంటూ ఆశ్చర్యం షాక్ చెందుతున్నారు .
మేనేజ్మెంట్ : ఏమి చేయమంటారు మరి అవార్డ్స్ వచ్చిన విషయం ప్రపంచానికి తెలియగానే రాత్రికి రాత్రి అన్ని ఆర్డర్స్ వచ్చాయి - ఈరోజుకు పాతిక వేలకు చేరినా ఆశ్చర్యం లేదు - ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్వర్క్స్ లలో ట్రేండింగ్ లో ఉంది అంటూ స్క్రీన్ పై చూయించారు .
Wow wow .......
మేనేజ్మెంట్ : స్టూడెంట్స్ - టీచర్స్ ...... స్కూల్ తరుపున మీ అందరికీ బుక్స్ చేరేలా ఏర్పాట్లుచేసాము , ఖర్చునంతా స్కూల్ హ్యాపీగా భరిస్తుంది .
దేవత : మేడం .......
మేనేజ్మెంట్ : Wait wait అవంతికా ...... , నీ మాటలకోసం స్టూడెంట్స్ తోపాటు మేమూ ఆశతో ఎదురుచూస్తున్నాము , స్టూడెంట్స్ ప్రియాతిప్రియమైన మరియు జ్ఞానపీఠ అవార్డ్ & బుకర్ ప్రైజ్ గ్రహీత మిస్ అవంతికను స్టేజి మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను . టీచర్స్ అందరూ స్టేజి మీదకు పిలుచుకునిరావాలి - నా ఫ్రెండ్స్ మిగతా స్కూల్ మేనేజ్మెంట్ ..... మిస్ అవంతికను స్కూల్ తరుపున ఘనంగా సన్మానించుకోవాలని కోరుతున్నాను .

టీచర్స్ రావడంతో చెల్లెళ్లు - అక్కయ్య లేచి కంగారుపడుతున్న దేవతకు ముద్దులతో ధైర్యం పంచి సంతోషంతో పంపించారు .
మేనేజ్మెంట్ మేడం అనౌన్స్ చేసినప్పటికీ నుండీ స్టూడెంట్స్ తోపాటు నేను - తమ్ముడు లేచి చప్పట్లు కొడుతూనే ఉన్నాము .
టీచర్స్ ..... స్టేజి మీదకు తీసుకెళ్లడం - మేనేజ్మెంట్ సాలువాలతో సత్కరించి స్కూల్ తరుపున జ్ఞాపికను బహూకరించారు .
మేనేజ్మెంట్ : తొలి బుక్ ను స్వయంగా స్టూడెంట్స్ ముందు ప్రదర్శించి , కొన్నిరోజులుపాటు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమన్న సిటీని మళ్లీ సాధారణ స్థితికి చేర్చిన సిటీ రియల్ హీరో మహేష్ కు బహుకరించాల్సినదిగా కోరుకుంటున్నాము .
ఇక చెల్లెళ్లు - అక్కయ్య ఊరుకుంటారా లేచిమరీ చప్పట్లు కొట్టడం కేకలువేస్తున్నారు , మా ఫ్రెండ్స్ ...... మహేష్ మహేష్ అంటూ - స్టూడెంట్స్ అందరూ ...... అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ ఆడిటోరియం టాప్ లేచిపోయేలా కేకలువేస్తున్నారు .
మేనేజ్మెంట్ : హీరో మహేష్ ...... ఏమో అనుకున్నాను - మీ మేడం కంటే పాపులర్ నువ్వు welldone welldone కమాన్ కమాన్ స్టేజి మీదకు రా ......

దేవత ...... మైకులో మాట్లాడుతున్న మేడం దగ్గరికివెళ్లి చెవిలో గుసగుసలాడారు .
మేనేజ్మెంట్ : స్మాల్ కరెక్షన్ - మన అవంతిక మేడం ఒక కోరిక కోరారు - ఏమిటంటే తొలి బుక్ ను వారి ప్రాణమైన సిస్టర్స్ కావ్య మరియు వైష్ణవి హాసిని వర్షిణీ విక్రమ్ ద్వారా ఆవిష్కరించి వారి చేతులమీదుగానే సిటీ రియల్ హీరోకు అందించాలని ......
చప్పట్లు మారుమ్రోగాయి .
మేనేజ్మెంట్ : మిస్ కావ్యా & స్టూడెంట్స్ ...... కమాన్ కమాన్ .
ఆనందంతో అక్కయ్య - చెల్లెళ్ళవైపు చూసాను .
నలుగురూ సంతోషంతో నవ్వుకుని దేవతకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , నా చేతులను అందుకుని స్టేజి మీదకు తీసుకెళ్లారు . దేవతను కౌగిలించుకుని , దేవత కోరిక ప్రకారం పెద్ద పెద్ద బాక్సస్ నుండి బుక్ అందుకుని నాకు అందించి స్టేజి పైననే ముద్దులు కురిపించారు .
ఆడిటోరియం అరుపులతో దద్దరిల్లిపోయింది .

మేనేజ్మెంట్ : మీ అన్నాచెల్లెళ్ల ప్రేమను సిటీ మొత్తం ఎప్పుడో వీక్షించి ఆనందించారు - ప్రేమ ఆప్యాయతలు అంతులేనివి అంటూ ప్రపంచానికి చాటుతున్నందుకు అభినందనలు స్టూడెంట్స్ ...... , అవంతికా ...... ఇవి వేరు వేరు సిటీస్ నుండి బుక్స్ ఆర్డర్ కోసం పంపిన చెక్స్ , more than 10 lakhs & మన స్కూల్ స్టూడెంట్స్ కోసం స్కూల్ తరుపున ఆర్డర్ బుక్స్ ప్రైస్ అంటూ మరొక చెక్ అందించారు - ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మీ మేడం మాట్లాడుతారు అంటూ మైకు అందించి , కావ్యా - స్టూడెంట్స్ ..... మీరే చీఫ్ గెస్ట్స్ కూర్చోండి అంటూ స్టేజీపై సీట్స్ చూయించారు .
చప్పట్లు - కేకలు .......
అక్కయ్యను కూర్చోబెట్టి , చెల్లెళ్లతోపాటు పరుగునవచ్చి కింద సోఫాలో కూర్చున్నాము - మాతోపాటు స్టూడెంట్స్ అంతా నవ్వుకుంటున్నారు - అక్కయ్య తియ్యనైనకోపంతో మావైపు చూస్తున్నారు - నవ్వుకుని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాము.

దేవత ..... అక్కయ్యవైపు - చెల్లెళ్ళవైపు చూసి , మేనేజ్మెంట్ - టీచర్స్ - స్టూడెంట్స్ కు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు . నిజం చెబుతున్నాను ఈ బుక్ కంప్లీట్ చెయ్యడానికి దాదాపు కొన్ని సంవత్సరాలు పట్టింది - సగమే పూర్తి చెయ్యగలిగాను , ఏ దేవుడి అనుగ్రహం వల్లనో కానీ ఒక్కరాత్రిలో పూర్తిచెయ్యగలిగాను .
ఇంకెవరు ఆ దేవుడు మా అన్నయ్యే అంటూ ముద్దులుపెట్టారు చెల్లెళ్లు - అక్కయ్య నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
నేను కాదు చెల్లెళ్ళూ ...... పెద్దమ్మ పెద్దమ్మ .
చెల్లెళ్లు : ష్ ష్ పెద్దమ్మకు ఎందుకు క్రెడిట్ ఇస్తున్నారు అవసరమే లేదు - క్రెడిట్ మొత్తం మా అన్నయ్యకే అంటూ ముద్దులుపెట్టారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ...... అంటూ చెల్లెళ్లు బుగ్గలను రుద్దుకుంటున్నారు - పెద్దమ్మా ..... కొరికినా సరే క్రెడిట్ మొత్తం మా అన్నయ్యకే - మనం మనం మళ్లీ మాట్లాడుకుందాము అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

దేవత : ఆ దేవుడికి నాజీవితాంతం రుణపడి ఉంటాను - ఇక ఆ దేవుడి వలన నన్ను చేరిన ఈ డబ్బును అంటూ అక్కయ్య - చెల్లెళ్ళవైపు చూసి అనాధ శరణాలయాలకు అందించబోతున్నాను - ఈ అమౌంట్ నే కాదు బుక్ ఆర్డర్స్ ద్వారా వచ్చే అమౌంట్ మొత్తాన్ని శరణాలయాలకే చేరుస్తాము .
అంతే ఆడిటోరియం లో ఉన్నవాళ్ళంతా కొన్ని నిమిషాలపాటు చప్పట్లు ఆపకుండా అభినందిస్తున్నారు .
మొదట అక్కయ్య ఆ వెంటనే మేనేజ్మెంట్ మేడమ్స్ - లేడీ టీచర్స్ వెళ్లి దేవతను కౌగిలించుకుని అభినందించారు .
మేనేజ్మెంట్ : బుక్ తో చైతన్యం పంచి హీరో అయ్యావు ఇప్పుడు ఏకంగా దేవతవు అయ్యావు అవంతికా ...... ప్రౌడ్ ఆఫ్ యు .
అక్కయ్య : నా తమ్ముడు ఎప్పుడో చెప్పాడు దేవత అని ......
దేవత : అన్నాడు అంతే , మొదట దేవతను చేసింది మన బుజ్జిదేవుడు గుర్తుపెట్టుకో చెల్లీ ......
అక్కయ్య : Ok అంటూ నావైపు చూసి ఆనందిస్తున్నారు . అక్కయ్యా ..... బామ్మలు కూడా చూస్తున్నారు చూడండి .
దేవత : ఎలా - ఎప్పుడొచ్చారు చెల్లీ ......
అక్కయ్య : మేనేజ్మెంట్ సర్ప్రైజ్ అనగానే , మన హీరో ..... బామ్మలకు కాల్ చేసేసాడు రమ్మని ....... , ఆనందబాస్పాలతో ఎంత మురిసిపోతున్నారో చూడండి .
దేవత : చూసి ఆనందిస్తున్నారు . అందరూ ప్రపంచం గురించి ఆలోచించేలా అద్భుతమైన మాటలు చెప్పారు దేవత ......
చప్పట్లతో మారుమ్రోగిపోయింది .
మేనేజ్మెంట్ : అవంతికా ..... స్కూల్ మాత్రమే కాదు ప్రపంచం నీ మాటలు వింటోంది అంటూ మీడియా కెమెరాలవైపు చూయించారు . మీడియాకు ధన్యవాదాలు ...... మీకోసం బుక్స్ పంపిస్తున్నాము - స్టూడెంట్స్ ..... మీ అందరికీ మీ క్లాస్సెస్ లో డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి - డిసిప్లిన్ గా క్లాసులకు వెళ్ళండి ok .....
OK ok మేడమ్స్ అంటూ లైన్స్ లో క్లాస్సెస్ వైపుకు వెళ్లారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 27-04-2022, 05:02 PM



Users browsing this thread: 35 Guest(s)