Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వలపు రంగులు ( Completed Story )
#28
Update 3


వివిద ప్రాంతాలలో ఉన్న ఈ మూడు రకాలైన మనుషుల యొక్క వలపు రంగులతో ఆ రాత్రి ముగిసింది. ప్రశాంతంగా నిద్రపోయిన రవికుమార్ జీవితంలో ఇంకో రోజు మొదలైంది.

( రవి మాటలలో )

మరుసటి రోజు ఉదయం 5 గం.. లకే నేను నిద్ర లేచి, నా పనులన్నీ ముగించుకున్నా.  ఇంటర్వ్యూ కోసం ఫార్మల్ డ్రస్ లో రెఢీ అయ్యి హాల్లోకి వెళ్లబోతుంటే నేనున్న గది తలుపు తెరచుకుంది. నేను చూస్తుండగానే శ్రావణి లోపలకి వచ్చి నేనున్న గదికి గొళ్ళెం పెట్టి  అక్కడే తలుపుకి అనుకోని నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంది.

శ్రావణిని చూసిన నేను, ఆమెతో  “ ఏంచేస్తున్నావ్ , ముందు ఆ గొళ్ళెం తీసేయ్ శ్రావణి ....... ప్లీస్

ఎందుకు బావ బయపడతావ్ , నితో మాట్లాడాలి

ఆ మాట్లాడేది ఏదో తలుపు తీసి కూడా మాట్లాడొచ్చు గా  !  ప్లీస్  శ్రావణి ...... అత్తయ్య కానీ చూస్తే !

మా అమ్మ మీద ఉన్న జాలి నామీద ఎందుకు లేదనే నా ప్రశ్న

నీ ప్రశ్నలు తరువాత నాకు ఇంటర్వ్యూ కి టైమ్ అవుతుంది

నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా !

నిన్ను అవాయిడ్ చేయడమా ...... ! ఆ రోజులు అన్నీ ఎప్పుడోపోయాయి

అలా మాట్లాడకు బావ , అయినా అప్పుడు ఇప్పుడు నేను నీ మరదలినే గా

దయచేసి నన్ను వదిలేయ్ , ఏదో మామయ్య ఉండమన్నాడని వచ్చా ....... ఇలానే నువ్వు మాట్లాడుతుంటే వెళ్లిపోతా”అని తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాను.

నా ప్రవర్తన చూసి “నా మాటలతో నిన్ను బాద పెట్టి ఉంటే క్షమించు బావ” అని వెనక్కి తిరిగి తలుపు తియ్యబోతూ కళ్ళు తిరిగి కింద పడబోయింది. నా శ్రావణిని కింద పడబోతుంది అని తెలిసిన వెంటనే పరిగెత్తు కుంటూ వెళ్ళి తను  పడకుండా పట్టుకున్నా.

శ్రావణి నడవలేని స్తితిలో ఉంది. తనని జాగ్రత్తగా నడిపించుకుంటూ మంచం మీద కూర్చోబెట్టాను. నడవలేని పరిస్తితిలో  కూడా నా దగ్గరకి వచ్చినందుకు నాకు కోపం వచ్చి  “నీకేమైన బుద్దుందా ....... అడుగు తీసి అడుగు పెట్టలేకున్నావ్ ! ఇలాంటి స్తితిలో ఎందుకు వచ్చావ్” అని అడిగితే శ్రావణి మాత్రం నా కోపాన్ని చూసి నవ్వుతూ నా కళ్ళలోకి చూస్తూ

నాకేమైన ఐతే నువ్వు తట్టుకోలేవా ......”

నేను కోప్పడుతూ ఉంటే నవ్వుతున్నావ్

నీ అరుపులోనే కోపం , కానీ నీ కళ్ళలో నా మీద ప్రేమ కనిపిస్తుంది బావ

ప్రేమ ...... ఏంటి జోక్ ఆ” అని అడిగితే , తను

“ నీ ప్రేమ నీ కళ్ళలోనే తెలుస్తుందిగా ...... చూడు నీ కళ్ళలోనుంచి కన్నీరు ఎలా కారుతుందో !”అని సమాదానం ఇచ్చింది.

నా కళ్ళలోనుంచి కన్నీర !!!!

అని నా కళ్ళు చేత్తో తాకితే , తాను చెప్పింది నిజమే. నాకు తెలియకుండానే నా కళ్ళలో నుంచి కన్నీరు కారుతుంది. బహుశా ఇందాక శ్రావణి కిందపడబోతుంటే చూసి తను  ఏమైపోతుందో అని కాబోలు.  నా కన్నీరు తుడుచుకొని తనతో

నీకోసం ఏమీ ఏడవటం లేదు. ఇందాక ఏదో కంట్లో పడునట్టు ఉంది . అందుకే ఆ కన్నీరు” అని తన కళ్ళలోకి చూడకుండా పక్కకి చూస్తూ అన్నాను. అప్పుడు శ్రావణి నాతో

ఏ బావ , నా మోహం చూడడానికి కూడా నీ మనసు అంగీకరించడం లేదా !” అని అంటే నా మనసులో ఏదో గుచ్చుకున్నటు అనిపించింది. తన మాటలకి నేను 

అదేం లేదే

మరి నన్ను చూడకుండా పక్కకి చూస్తావే” అని సూటుగా అడిగితే నేను ఏమీ చెప్పలేక

అవన్నీ ఆడగకు , అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పలేదే ! నాకు టైమ్ అవుతుంది నేను వెళ్ళాలి

నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్తున్నావ్ గా , ALL THE BEST చెపుదాం అని” మళ్ళీ నాతో  “ALL THE BEST FOR YOUR JOB బావ

అని చెయ్యి చాపి పైకి లేవడానికి ప్రయత్నించింది. తాను లేవలేక ఇబ్బంది పడుతుంటే నా చెయ్యిని ఆదారంగా ఇచ్చి తనని పైకి లేపి

అస్సలు  పైకి లేవలేక పోతున్నావ్ , ఇబ్బందిగా ఉందా శ్రావణి

ఒక చేత్తో తన పొట్టని పట్టుకొని ఇంకో చెయ్యి నా చేతులో వేసి మరలా నా వైపు చూస్తూ “చాల ఇబ్బందిగా ఉంది

ఎన్నో నెల

వారం క్రితం 9 దో నెల పెట్టింది, బావ”అని నా కళ్ళలోకి చూడలేక బాదతో తల దించుకుంది.

ఎందుకే తల దించుకుంటున్నావ్ ,నా మరదలు తల దించుకోకూడదు .....”అని తన తన తల పైకి ఎత్తి తన కళ్ళలోకి చూస్తూ అడిగా.

అప్పుడు తను “ అన్నీ అనుకున్నటు జరిగి ఉంటే , నీ బిడ్డని మోసే దాన్ని...... కానీ ఇప్పుడు ఇలా

జరిగింది  ఏదో జరిగింది అవన్నీ అమర్చిపోయి పుట్టే బిడ్డతో హాయిగా ఉండరా”అని తనని ప్రేమగా హత్తుకున్నాను.

ఇక నేను శ్రావణి ని తీసుకొని హాల్లోకి వచ్చాను. నేను తనని తీసుకు రావడం అత్తయ్య కానీ, మామ్మయ్య కానీ చూస్తే ఏమంటారో అని బయపడుతూ హాల్లోకి వచ్చాను. మేము హాల్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఎవ్వరూ లేరు. దాంతో నా కంగారూ పోయి శ్రావణి ని సోఫాలో కూర్చోబెట్టి తనతో

ఇక నేను వెళ్తాను”అని అంటే శ్రావణి

వెళ్తాను కాదు ,వెళ్లొస్తాను అని అను” అని నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. శ్రావణి అనిన మాటకి బదులు ఏమి చెప్పాలో తెలియక ఓ చిరునవ్వు నవ్వి
అత్తయ్య కి చెప్పి వెళదాం అని తన కోసం చూసా.

అత్తయ్య కిచెన్ లో ఉంటే వెళ్ళి తననో నేను వెళ్తున్నాను అని చెపితే , అత్తయ్య ......  టిఫిన్ చేసి వెల్లమని చెప్పింది . అంత టైమ్ లేదని నేను అత్తయ్యకి చెప్పేసి బయలుదేరాను.


బయటకి వచ్చిన నేను నేరుగా మెట్రో స్టేషన్ లో ట్రైన్ ఎక్కి తిన్నగా   హైటెక్ సిటీ లోగి, అక్కడ  ఉన్న SS GROUPS బిల్డింగ్ దగ్గరకి వెళ్ళాను.  అవును నేను
SS GROUPS లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ అవకాశాలు ఉంటే అప్లై చేశా. అక్కడ నుంచే నాకు ఇంటర్వ్యూ కి రమ్మని లెటర్ వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఇక్కడికి వచ్చేశా.

మార్నింగ్ 9 గం. ఇంటర్వ్యూ అని చెపితే నేను గంట ముందుగా వెళ్ళి వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నా. నేను వెళ్ళే టప్పటికే ఓ 20 మంది అక్కడికి వచ్చి ఉన్నారు. ఈ జాబ్ వస్తుందో లేదో ఆనే ఆందోళనలోఉన్నా. సమయం గడుస్తూ ఉంటే నాలో ఆందోళన పెరుగుతూ ఉంది. నా ఆందోళనకి ఇంకో కారణం నాకు ఇదే మొదటి ఇంటర్వ్యూ, అక్కడకి వచ్చిన వారంతా చాలా experience ఉన్న వారిలా ఉన్నారు. అందులో బహుశా నేను మాత్రమే అనుభవం లేని వాడిలా ఉన్నా.

నేను ఆ వెయిటింగ్ రూమ్ లో ఉండగా అక్కడకి ఒక అమ్మాయి వచ్చి మాతో
Hi everyone . My name is Sarita . నేను మన SS GROUPS లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి GM గా వర్క్ పనిచేస్తున్నా” అని ఆమెని పరిచయం చేసుకొని మళ్ళీ మాతో “ మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు మిమ్మలని ఎలాంటి క్వషన్స్ ఆడగము. మీరందరికి కామన్ గా మా  ప్రాజెక్టు details ఇస్తున్నాం. అవన్నీ చూసుకొని మీరు ఓ ప్రెసెంటేషన్ ఇవ్వాలి. మరో 15 నిముషాలలో మిమ్మలని ఒక్కొక్కరిగా పిలుస్తాం”అని చెప్పి వెళ్ళిపోయింది. 

పేరు మోసిన కంపనీ అంటే ఏమో అనుకున్నా, వాళ్ళ విదానాలు చూస్తే అది నిజమని అనిపిస్తుంది. నేను వెళ్ళిన ఇంటర్వ్యూ లో కొన్ని ప్రశ్నలు అడుగుతారు అని అనుకుంటూ ఉంటే వాళ్ళేమో వాళ్ళ కొత్త ప్రాజెక్టు కి  సంబందించిన కొన్ని వివరాలు చెప్పి ఒక్కొకరిని విడిగా  ప్రెసెంటేషన్ ఇవ్వమని చెప్పారు. సరే జరిగేది ఏదో జరుగుతుందని నేను ఆ ప్రెసెంటేషన్ కోసం సిద్దపడ్డాను.

ఒక్కొకరిని పేరు పెట్టి పిలుస్తూ ఒక హాల్ లోకి తీసుకెళ్తున్నారు. నా ముందు ఉన్న వారి వంతు వస్తూ ఉంది. నా వంతు ఇంకా రాలేదు. దాదాపుగా అందరూ వెళ్ళి వాళ్ళ ప్రెసెంటేషన్ ఇస్తున్నారు. మామూలుగా ముందుగా ప్రెసెంటేషన్ ఇచ్చే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, దానికి ఒక కారణం అక్కడ వినే వాళ్ళకి మొదట్లో ఓపిక ఉంటుంది. అదే చివర చెప్పే వాళ్ళని పెద్దగా పట్టించుకోరని నా అభిప్రాయం.

ఇక్కడ నన్ను చివరలో పిలిచేలా ఉన్నారు. ఐయినా నేను అనుకున్న ప్రతీ మాట వాళ్ళకి చెప్పాలని తీర్మానించుకున్నా. చివరిగా నా వంతు వచ్చింది. నేను ఊహించినట్టే అందరికన్నా చివర నేను ప్రెసెంటేషన్ ఇవ్వడానికి వెళుతున్నా. నేను ఆ సెమినార్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కాళీ గా ఉన్న రూంలో కొన్ని కెమెరాలు ఉన్నాయి. అవి తప్ప అక్కడ ఇంకెవ్వరూ మనుషులు లేరు. నేను వెళ్ళగానే స్పీకర్ లో నన్ను ప్రెసెంటేషన్ స్టార్ట్ చేయమని ఎవరో వాయిస్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు చెప్పడంతో నేను నా ప్రెసెంటేషన్ మొదలెట్టా.

నేను 15 నిమిషాలు దాకా ప్రెసెంటేషన్ ఇచ్చాను. ఆ తరువాత అక్కడ నుంచి వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని ఉన్నా. కొద్దిసేపటికి ఇందాక వచ్చిన ఆ సరిత ఆనే అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి కూడా వచ్చింది. ఆమె పేరు నికిత అని చెప్పి మాతో

ఇక ఈ ఇంటర్వ్యూ అయిపోయింది. మీరిక వెళ్ళవచ్చు. మరో మూడు రోజులలో మీ రిసల్ట్స్ ఏందో అని మీకందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళు మాత్రమే రావాలి” అని చెప్పి వాళ్లిద్దరూ వెళ్లిపోయారు. 

వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ విన్నాక ఇక ఈ జాబ్ నాకు రాదు అని నిర్ణయించుకున్నా. నేను ఆ SS GROUPS బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మద్యానం 1 గం అయ్యింది. ఉదయం టిఫిన్ కూడా చేయలేదు అందుకనే బాగా ఆకలేసి ఒక హోటల్ లో భోజనం చేయడానికి వెళ్ళాను.



రవి ఇంటర్వ్యూ కి వెళ్ళిన  SS GROUPS కంపెనీ సౌజన్య , సంపత్ లదే. అక్కడ జరిగిన ఇంటర్వ్యూకి వచ్చిన వారి ప్రెసెంటేషన్ రికార్డు చేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా కాన్ఫరెన్స్ రూంలో ఓ నలుగురు కూర్చొని చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వారు మరెవరో కాదు SS GROUPS MD అండ్ C E O అయిన సౌజన్య, సంతోష్ వారిద్దరితో పాటు  సంపత్ కూడా ఉన్నాడు. వారితో పాటు ఆ కంపెనీకి కొత్తగా ఒక ప్రాజెక్టు ఇచ్చిన client. ఆమె పేరు స్వర్ణ కుమారి. ఆమె సౌజన్య కి ( relative ) బందువు కూడా.

అక్కడ ఉన్న సంతోష్ మరియు సంపత్ ల వయస్సు బహుశా 28 లోపాలే ఉండవచ్చు , సౌజన్య కి కూడా వారితో సమాన వయస్సు  ఉండవచ్చు . అలాగే అక్కడ ఉన్న సౌజన్య బందువు అయిన స్వర్ణ కుమారి  వయస్సు 45 దాకా ఉండవచ్చు.  అలా ఆ నలుగురు కలసి ఆ ప్రెసెంటేషన్ వీడియోస్ చూస్తూ ఒక్కొకరి performance చూస్తూ ఉన్నారు.

అక్కడ అలా జరుగుతూ ఉండగా రవి తన భోజనం పూర్తిచేసుకొని  ఇక జాబ్ తనకి రాదని నిర్ణయిచ్చుకొని , ఆ హైదరాబాద్ లో ఉండటం వృదా అని తిరిగి వైజాక్ కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. చివరిగా అత్తయ్య మామయ్య లకి ఒక మాట చెప్పి బట్టలు తీసుకొని వెళ్ళడానికి సిద్దామయ్యాడు.

( రవి మాటలలో )

నేను తిన్నగా అత్తయ్య ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి ఇంటి వరండాలో శ్రావణి కింద కూర్చొని ఉంటే అత్తయ్య తనకి జడ వేస్తూ  మాట్లాడుకుంటూ ఉన్నారు.

నేను కాళ్ళు కడుక్కొని ఆ వరండాలో  నుంచి ఇంట్లోకి వెళుతూ ఉంటే  అత్తయ్య నాతో

ఇంత లేటు అయ్యిందే ......... ఏమైనా తిన్నావా !

ఆ తిన్నా అత్త

జాబ్ సంగతి ఏమైంది రా

అది వచ్చేట్టు లేదత్తా” అని అంటే , పక్కనే ఉన్న శ్రావణి నాతో

అసలేమయింది  బావ , వాళ్ళు ఏమన్నారు !” అని అంటే నేను

మూడు రోజులలో రిసల్ట్స్ గురించి ఇన్ఫార్మ్ చేస్తారు అని చెప్పారు ....... కానీ ఆ జాబ్ వస్తది అని నాకు నమ్మకం లేదు .  అందుకే ఇంటికి వెళ్దామని అనుకుంటున్నా అత్తయ్య  ”అని అత్తయ్య కి సమాదానం చెప్పాను. అప్పుడు అత్తయ్య నాతో

నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇక్కడ ఉండటం లేదు. అందుకే వెళ్తాను అని అంటున్నావ్” అని అంటే నేను

అలాంటిది ఏమీ లేదు అత్త, నా మనసులో ఏమీ లేదు ........ అయినా ఏదో మనసులో పెట్టుకోడానికి ఏముంది ”అని సమాదానం చెప్పా. అప్పుడు మళ్ళీ అత్తయ్య నాతో

నువ్వు మనస్పూర్తిగా అంటుంటే , ఆ మూడు రోజులు ఇక్కడే ఉండి , ఆ రిసల్ట్ చుకొని అప్పుడు బయలుదేరుతావో లేదో నిర్ణయించుకో” అని సూటిగా చెప్పేసింది.

అత్తయ్య అలా చెప్పగానే నేను ఏమి మాట్లాడాలో అర్ధం కాక మౌనంగా ఉంటే , నా ముందే ఉన్న శ్రావణి అత్తయ్య తో  

మా ..  నిజంగా బావ మనసులో ఏదీ లేకుంటే ఇక్కడే ఉంటాడు లేదా మనసులో ఏదో పెట్టుకొని ఉంటే వాల్ల ఇంటికి వెళ్ళిపోతాడు”  అని చెప్పింది.

ఇక అక్కడ నుంచి వెళ్ళితే వాళ్ళు అన్నట్టు నా మనసులో ఏమో ఉందని నిర్ణయించుకుంటారని ఈ మూడు రోజులు  అక్కడే ఉండటానికి సిద్దమయి లోపలకి పోటు ఉంటే శ్రావణి నాతో

బావ కాస్త నీ చెయ్యి అందివ్వవా , నేను పైకి లేస్తా” అని కింద కూర్చొని తన చేతిని పైకి చాపింది. నేను నా చేతిని ఆదారంగా ఇచ్చి జాగ్రత్తగా తనని పైకి లేపి లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చబెట్టా. అక్కడ నుంచి నేను ఆ గెస్ట్ రూమ్ లికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు నిద్రపోయాను.

ఆ రాత్రి భోజణాలు చేస్తుంటే మామయ్య నా ఇంటర్వ్యూ గురించి అడిగి తెలుసుకున్నాడు. అత్తయ్య అన్నట్టే  మామయ్య కూడా ఆ మూడు రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళమని చెప్పాడు.   

 
మరుసటి రోజు నేను కాస్త ఆలస్యంగా 10 గం .. లకు నిద్ర లేచాను. నేను లేచేటప్పటికి  మామయ్య ఆఫీసు కి వెళ్ళిపోయాడు. నేను హాల్లోకి వెల్లగానే అత్తయ్య ఎక్కడికో బయటకి వెళుతూ నాతో

రే రవి, నేను కూరగాయల మార్కెట్ కి వెళ్ళి త్వరగా వచ్చేస్తా. ఇంట్లో మీ మామయ్య కూడా లేడు. శ్రావణి ఒక్కటే ఉంది. దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో , దానికి డెలివరీ డేట్ దగ్గర పడింది. జాగ్రత్త ......” అని అని చెప్పి మార్కెట్ కి వెళ్ళింది.  

అత్త వెళ్ళాక నేను హాల్లో కూర్చొని tv చూస్తూ ఉంటే శ్రావణి తన రూమ్ లోనుంచి వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంది. నేను తన రూమ్ డోర్ దగ్గరకి వెళ్ళి తనతో

అత్త, బయటకి వెళ్ళింది శ్రావణి ...... ఏమయినా కావాలా” అని అంటే తాను

కాస్త లోపలకి రా బావ
అని నన్ను పిలిచింది. నేను తలుపు తీసుకొని లోపలకి వెళ్లా. శ్రావణి అక్కడ మంచం మీద కుర్చీని ఉంది . నేను దగ్గరకి వెళితే నాతో “బావ , నాకు ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే తీసుకురా

ఉండు వెళ్ళి చూసి వస్తా”అని కిచెన్ దగ్గరకి వెళుతూ ఉంటే నా చెయ్యి పట్టుకొని నను అపి  “బావ నేను హాల్లోకి వస్తా , కాస్త సాయం చేయవా” అని
అడిగే సరికి నేను నా చేతిని అందించి జాగ్రత్తగా పైకిలేపి మెల్లగా నడిపించుకుంటూ హాల్లో కూర్చోపెట్టి కిచెన్ లోకి వెళ్ళాను.

ఉదయం అత్త చేసిన ఇడ్లీలు ఉంటే ప్లేట్ లో పెట్టుకొని హాల్లోకి వచ్చి శ్రావణి కి ఇస్తుంటే,  శ్రావణి నాతో
బావ నీ చేత్తో తినిపించి చాల రోజులైంది , నాకు తినిపించవా”అని ప్రేమగా అడిగితే కాదనలేక తినిపించడం మొదలెట్టా.

ఒక ఇడ్లీ పూర్తిగా తిని రెండో ఇడ్లీ తినిపిస్తూ ఉంటే శ్రావణి ఒక చేతితో తన కడుపుని పట్టుకొని ఇంకో చేత్తో నా చేతిని గట్టిగా పట్టుకొని అరిస్తూ “బావ , కడుపు నొప్పిగా ఉంది, అమ్మా ...... నొప్పి . బావ” అని మళ్ళీ నాతో

బావ ....... బయంగా ఉంది, డెలివరీ పెయిన్స్ లా ఉన్నాయి. అమ్మకి ఫోన్ చేయవా....... , నొప్పి ...... నొప్పి బావ ” అని ఏడుస్తూ ఉంది. నేను నా ఫోన్ తీసుకొని అత్తకి ఫోన్ చేశా. తాను వెంటనే వస్తున్న అని చెప్పి ఒక hospital ఫోన్ నెంబర్ ఇచ్చింది. నేను ఆ hospital కి ఫోన్ చేసి విషయం చెపితే ఓ లేడి డాక్టర్ వెంటనే ఇక్కడికి తీసుకురమ్మన్నారు.

Hospital కి వెళ్తున్న విషయం అత్తకి చెప్పి, నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రావణిని నా చేతులతో ఎత్తుకొని అక్కడే ఇంట్లో ఉన్న వాళ్ళ కార్ లో వెనుక పనుకోబెట్టి నేను డ్రైవ్ చేసుకుంటూ ఆ hospital కి తీసుకెళ్లా. మేము అక్కడకి చేరుకో గానే నేను ఫోన్ చేసిన ఆ లేడి డాక్టర్ శ్రావణి ని చకప్ చేసి వెంటనే డెలివరీ చేయాలని తనని ఆపరేషన్ theater లోకి తీసుకెళ్లారు.

అత్తకి విషయం చెప్పి ఎక్కడుందో తెలుసుకుంటే అత్త , ట్రాఫిక్ లో ఇరుక్కుంది, అక్కడకి రావడానికి ఆలస్యం అయ్యేట్టుగా ఉందని  చెప్పి శ్రావణి ని జాగ్రత్తగా చూకోమని  ఫోన్ పెట్టేసింది. ఇక నేను ఆ ఆపరేషన్ theater దగ్గరకి వెళ్ళాను. అక్కడ నా చేతికి ఒక ఫోరం ఇచ్చి నా సైన్ అడిగారు. నేను guardian ప్లేస్ లో జాగ్రత్తగా సైన్ చేసి ఇచ్చా. వాళ్ళు వెంటనే తనకి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలెట్టారు.

ఆ ఆపరేషన్ theater బయట ఉన్న నాకు శ్రావణి అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ అరుపులు విని అప్పటి దాకా ధైర్యం గా ఉన్న నాకు శ్రావణి కి ఏమైనా అవుతుందేమో అని బయం మొదలైంది. అలా బయపడుతూ ఉన్న నా దగ్గరకి ఆపరేషన్ theater నుంచి లేడి డాక్టర్ బయటకి వచ్చి

ఇక్కడ రవి ఎవరు”అని అడిగితే నేను

నేనే డాక్టర్”అని అన్నా . అప్పుడు ఆమె

చూడండి రవి, శ్రావణి బాగా బయపడుతూ ఉంది. పైగా తన డెలివరీ కస్టంగా ఉంది. నిన్ను తన వెంటే ఉండమని ఆడుగుతూ ఉంది. సో మీరు లోపలకి వచ్చి తన దగ్గరే ఉంది దైర్యం చెప్పండి ”అని చెప్పింది. అది విన్న నేను

నేనా

అవును , ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పదండి” అని నా చెయ్యి పట్టుకొని లోపలకి తీసుకెళ్లింది.

నేను లోపలికి వెళ్ళగానే నన్ను చూసిన శ్రావణి తన చెయ్యి చాపుతూ నాతో “బయంగా ఉంది బావ , నా దగ్గర ఉండు”అని అంటూ ఉంటే నేను తన దగ్గరకి వెళ్ళి తన చేతిని పట్టుకొని తనతో

నీ కేమీ కాదు , నెనున్నాగా ......”అని అంటూ దైర్యం చెపుతూ ఉన్న.

అలా నేను దైర్యం చెపుతూ తన చేతిని గట్టిగా పట్టుకొని ఉంటే , ఆ డాక్టర్ డెలివరీ చేయడానికి సిద్దమైంది. మునుపటి కన్నా శ్రావణి గట్టిగా నొప్పితో అరుస్తూ తన బిడ్డని కడుపు లో నుంచి బయటకి తీసుకురాడానికి ప్రయత్నిస్తూ ఉంది.

నేను మొదటి సారి నా జీవితంలో పురుటి నొప్పులను వింటూ ఉన్నా. ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం ఎంత కస్టమో అప్పుడే అర్ధమైంది. శ్రావణి కి , తన బిడ్డకి ఏమీ కాకూడదని ఆ దేవుడిని వేడుకుంటూ ఉన్నా. ఆ గది మొత్తం శ్రావణి పురుటి నొప్పులతో నిండి ఉంటే కొద్ది సేపటికి నా శ్రావణి బాదకు ఫలితంగా ఓ బిడ్డ ఏడుపుతో ఆ గది నిండిపోయింది.

ఎప్పుడైతే బిడ్డ ఏడుపు వినపడిందో శ్రావణి అరవడం మాని ఆ బిడ్డని చూడడానికి ఆరాటపడుతూ ఉంది. నా మొర విన్నట్టుగా ఆ దేవుడు శ్రావణి బిడ్డకి ఏమీ కాకుండా డెలివరీ అయ్యేట్టుగా చేశాడు.

మొత్తానికి నా శ్రావణి ఓ మగ బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారింది. బిడ్డ ఆరోగ్యంతో ఉన్నాడని డాక్టర్ మాట వినిన శ్రావణి అలసిపోయి అలాగే బెడ్ మీద మైకం లోకి వెళ్ళింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే అన్న మాట వినిన నేను ఆ ఆపరేషన్ theater లో నుంచి సంతోషం తో బయటకి వచ్చి కుర్చీలో కూర్చున్నా.
కొద్దిసేపటికి తరువాత శ్రావణిని, బిడ్డని స్పెషల్ వార్డ్ కి మారుస్తారు అని ఆ లేడి డాక్టర్ బయటకి వచ్చి నాతో చెప్పి వెల్లిపోయింది. ఆ డాక్టర్ వెళ్ళిన వెంటనే అక్కడికి అత్త, మామయ్య ఇద్దరు వచ్చారు. వారిద్దరికీ శ్రావణి కి మగ బిడ్డ పుట్టాడు అని చెప్పాను. నా మాట విని వాళ్ళిద్దరూ ఎంతొ సంతోషించారు.

కొద్దిసేపటికి మేము ముగ్గురం శ్రావణి ఉన్న స్పెషల్ రూమ్ లోకి వెళ్ళాము. లోపల సంతోషం తో బిడ్డకు పలుస్తున్న శ్రావణి ఉంది. పాలు ఇస్తుంది కాబట్టి నేను మామయ్య బయటే ఉన్నాం. మరో కొద్ది సేపటికి ఆ రూమ్ దగ్గరకి శ్రావణి భర్త, అత్త మామలు కూడా వచ్చారు .

ఇక అక్కడ ఉండాలంటే నా మనసు అంగీకరించక అక్కడ నుంచి వచేద్దామని నిర్ణయించుకొని చివరి సారిగా బయట నుంచే శ్రావణి సంతోష మైన మొహాన్ని చూసి నేరుగా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేశా.  

ఆ సాయంత్రమే శ్రావణి తన బిడ్డని తీసుకొని భర్త తో కలసి అత్తయ్య ఇంటికి వచ్చింది. ఇల్లంతా బందువుల సంతోషాలతో నిండి ఉంది. ఆ రాత్రికే వైజాగ్ వెళ్లాలని నిర్ణయించుకొని అత్తయ్య కి చెప్పాను. నా మనసులోని బాద అర్ధం చేసుకున్న అత్త ఏవిదమైన అభ్యంతరం వ్యక్తం చేయకుండా సరే అని నేను వెళ్ళడానికి ఒప్పుకుంది.

ఇక నేను నేరుగా బస్ స్టేషన్ కి వెళ్ళి బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. అలా ఎదురు చూస్తూ ఉండగా నాకు తెలియని ఓ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేశా , అవతల నుంచి ఓ అమ్మాయి మాట్లాడుతూ

WE are calling from SS GROUPS , are you Mr. Ravikumar

yes , చెప్పండి !”

నిన్న మీరు ఇంటర్వ్యూ కి వచ్చారుగా

ఆ అవునండి

కంగ్రాట్స్ .....  ఆ job కి  మీరు సెలెక్ట్ అయ్యారు. ఈవెనింగ్ 8 o clock కి SS GROUPS మెయిన్ ఆఫీసు కి వచ్చి MD గారిని కలవండి

ఈ రోజేనా

అవును , త్వరగా రండి

అని కాల్ cut చేసింది. ఇంటికి వెళ్లాలని అనుకున్న నాకు సడన్ గా ఈ జాబ్ వచ్చినందుకు సంతోషించలో బాద పడాలో అర్ధం కాక అయోమయ స్తితిలో హైటెక్ సిటీ లో ఉన్న SS GROUPS  మెయిన్ ఆఫీసు కి బయలుదేరాను.
Like Reply


Messages In This Thread
RE: వలపు రంగులు - by ramd420 - 24-02-2022, 09:38 PM
RE: వలపు రంగులు - by Ramee - 24-02-2022, 10:27 PM
RE: వలపు రంగులు - by prash426 - 25-02-2022, 12:31 AM
RE: వలపు రంగులు - by srungara - 25-02-2022, 12:44 AM
RE: వలపు రంగులు - by Banny - 25-02-2022, 12:39 PM
RE: వలపు రంగులు - by utkrusta - 25-02-2022, 02:38 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:02 AM
RE: వలపు రంగులు - by cherry8g - 26-02-2022, 11:57 AM
RE: వలపు రంగులు - by Ravi9kumar - 26-02-2022, 11:59 AM
RE: వలపు రంగులు - by utkrusta - 26-02-2022, 12:43 PM
RE: వలపు రంగులు - by Madhu - 26-02-2022, 02:25 PM
RE: వలపు రంగులు - by Omnath - 26-02-2022, 04:47 PM
RE: వలపు రంగులు - by vg786 - 26-02-2022, 05:11 PM
RE: వలపు రంగులు - by svsramu - 26-02-2022, 05:39 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:01 PM
RE: వలపు రంగులు - by Pk babu - 26-02-2022, 08:26 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 26-02-2022, 10:18 PM
RE: వలపు రంగులు - by nari207 - 27-02-2022, 12:41 AM
RE: వలపు రంగులు - by vg786 - 27-02-2022, 12:47 AM
RE: వలపు రంగులు - by ramd420 - 27-02-2022, 09:30 PM
RE: వలపు రంగులు - by Madhu - 28-02-2022, 04:06 PM
RE: వలపు రంగులు - by Venrao - 28-02-2022, 04:55 PM
RE: వలపు రంగులు - by utkrusta - 28-02-2022, 04:57 PM
RE: వలపు రంగులు - by nari207 - 28-02-2022, 05:35 PM
RE: వలపు రంగులు - by svsramu - 28-02-2022, 06:09 PM
RE: వలపు రంగులు - by vg786 - 28-02-2022, 06:39 PM
RE: వలపు రంగులు - by kummun - 28-02-2022, 08:40 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 28-02-2022, 08:42 PM
RE: వలపు రంగులు - by Sivaji - 28-02-2022, 08:59 PM
RE: వలపు రంగులు - by ramd420 - 28-02-2022, 09:25 PM
RE: వలపు రంగులు - by raja9090 - 01-03-2022, 02:03 AM
RE: వలపు రంగులు - by Pk babu - 01-03-2022, 06:39 AM



Users browsing this thread: 10 Guest(s)