Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అప్పటివరకూ ఈగలు తోలుకుంటున్నట్లు సెక్యూరిటీ - జూ స్టాఫ్ సంతోషంతో సర్ సర్ అంటూ కేకలువెయ్యడంతో జూ మేనేజ్మెంట్ బయటకువచ్చి , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ కమిషనర్ సర్ - మా విజ్ఞప్తిని మన్నించినందుకు అంటూ ఆనందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు . 
మీడియాకు సమాచారం అందినట్లు వరుసగా వెహికల్స్ వచ్చి ఆగడంతోపాటు మైకులన్నీ సర్ ముందు ప్రత్యక్షము అయ్యాయి .
విశ్వ సర్ : ఇప్పుడు మాట్లాడవలసినది నేనుకాదు - నా మాటను గౌరవించి దైర్యంగా ఇక్కడకు వచ్చిన ఈ స్టూడెంట్స్ ....... , మైకులు వాళ్ళ ముందు ఉంచడం భావ్యం .......
అలాగే సర్ అలాగే సర్ అంటూ మైకులన్నింటినీ స్టూడెంట్స్ వైపుకు చేర్చారు . టీచర్స్ ....... కమీషనర్ గారు ఎలా ఒప్పించారు ? - ఎందుకు వచ్చారు ? ....... అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది .
టీచర్స్ అందరూ సిగ్గుపడటం చూసి దేవత ముందుకువెళ్లారు - సిటీ కమిషనర్ గారు చెప్పినట్లు నిజమైన ధైర్యవంతులు మా స్టూడెంట్స్ - వారు దైర్యంగా అడుగు ముందుకువెయ్యడం వల్లనే తోడుగా మేము రావడం జరిగింది సో ఈ ప్రశ్నలన్నీ మా స్టూడెంట్స్ ను అడగడం భావ్యం .
మీడియా : అలాగే మేడం - స్టూడెంట్స్ అంటూ ప్రశ్నల వర్షం కురిసింది .
స్టూడెంట్స్ అందరూ సిగ్గు - భయం వలన తలలు దించుకుని నవ్వుకుంటున్నారు . 
టీచర్స్ అయిన మేమే మైకుల ముందు మాట్లాడటానికి సంశయించాము పిల్లలుకదా - హలో బుజ్జిహీరోగారూ ....... మీ అల్లరి ప్రతాపం ఇప్పుడు చూయించండి కమాన్ కమాన్ .......
అన్నయ్యా ...... మన దేవత చిలిపి కోరిక తీర్చాల్సిందే అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : చిలిపి కోరికనా ? కాదు కాదు కాదు ......
చెల్లెళ్లు : మాకు చిలిపి కోరికనే అంటూ నవ్వుకున్నారు .

మీడియా : స్టూడెంట్స్ ...... మైకు ముందు వచ్చి మాట్లాడే ధైర్యం ఒక్కరికీ లేదా ? .
మా అన్నయ్యకు ఉంది అంటూ చేతినిపైకెత్తారు చెల్లెళ్లు .......
అంతే మహేష్ మహేష్ అన్నయ్య అన్నయ్య అంటూ కేకలతో దద్దరిల్లిపోతోంది - కేకలు ఆగడం లేదు .
ఇదీ మా అన్నయ్య క్రేజ్ అంటూ ముద్దులుపెట్టారు చెల్లెళ్లు .......
మీడియా చుట్టూ చూస్తూ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అంటూ మైకులు నా ముందు ఉంచారు - స్టూడెంట్ ...... wow స్కూల్ హీరో అన్నమాట , నీ పేరేంటి అంటూ ఒక విలేఖరి అడిగారు .
ఆ విలేఖరికి మొట్టికాయలు పడ్డాయి మిగతా విలేఖరుల నుండి ......
Yes yes yes జూలో ఉన్న జంతువులన్నీ బెదిరిపోయేలా కేకలువేస్తున్నారు కదూ మహేష్ మహేష్ అంటూ .......
అవునవును మహేష్ మహేష్ అంటూ స్టూడెంట్స్ అందరూ నవ్వుకున్నారు .

మీడియా : మహేష్ - స్కూల్ హీరో ...... కమిషనర్ సర్ మిమ్మల్ని ఏమనిచెప్పి ఒప్పించారు - ఎందుకు వచ్చారు .
ముందుగా ఇక్కడకువచ్చి మా ఉద్దేశ్యం అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు మీడియాకు ...... మా స్టూడెంట్స్ అందరి తరుపున ధన్యవాదాలు .
మీడియా : థాంక్యూ థాంక్యూ ...... స్కూల్ హీరో అనడంలో తప్పే లేదు మహేష్ .
నో నో నో మీడియా బ్రదర్స్ - సిస్టర్స్ ...... మన సిటీ కమిషనర్ విశ్వ సర్ ఇచ్చిన ధైర్యంతో ఇష్టపడి వచ్చిన నా స్నేహితులు - తమ్ముళ్లు - చెల్లెళ్లు - నా ప్రాణమైన చెల్లెళ్లు అంటూ చెల్లెళ్ళ చేతులను అందుకుని ముద్దులుపెట్టి , అందరూ అందరూ బుజ్జి హీరోలే ...... టీచర్స్ కూడా అంటూ ధైర్యం ఎలా వచ్చిందో ఏమో దేవతవైపు కన్నుకొట్టాను . 
అంతే దేవత కళ్ళు ...... భద్రకాళీ అవతారంలా మారిపోవడం చూసి , చెల్లెళ్ళూ ...... అంటూ భయంతో దాచుకున్నాను .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా అన్నయ్యా అంటూ వైష్ణవి - హాసిని నా చేతులను చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
వర్షిని : ఒసేయ్ అంటూ హాసిని భుజంపై కొరికేసింది .
హాసిని : స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకుంటూనే , లవ్ యు లవ్ యు బుజ్జి మేడం గారూ ...... మీరే చుట్టేసి ముద్దులుపెట్టండి అంటూ మళ్లీ నా బుగ్గపై ముద్దుపెట్టి , వర్షిణిని నా ప్రక్కన చేర్చి వెళ్లి దేవత ప్రక్కన చేరి నవ్వుకుంటోంది .
లేడీ విలేఖరులు : సో స్వీట్ ఆఫ్ యు ...... , ఇక్కడ ఏమిజరిగిందో మాకు అర్థమైపోయింది అంటూ సంతోషించారు . మహేష్ ...... చెప్పు స్టూడెంట్స్ అందరూ ఎందుకు వచ్చారు ? .

కొన్నిరోజులుగా సిటీని మనమంతా చూస్తూనే ఉన్నాముకదా - అంతదాకా ఎందుకు 9 గంటలకే తెరుచుకుని పిల్లలు - పేరెంట్స్ తో కిటకిటలాడాల్సిన జూ ఇంతవరకూ తెరుచుకోనేలేదు - ఈ జూ నమ్ముకుని ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నారో వారందరూ నాలుగు రోజులుగా రోజుకు ఒక పూటే తిని సర్దుకుంటున్నారు - వారందరికీ మునుపటిలా పని కల్పింసీబీ ఆకలితీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో మన సిటీని టెర్రరిస్ట్ అటాక్స్ నుండి ప్రాణాలకు తెగించి సేవ్ చేసిన కమిషనర్ సర్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్లు 24/7 నిద్రాహారాలు మాని సిటీని కంటికి రెప్పలా ఎలా కాపు కాస్తున్నారో మా పిల్లలకంటే మీమీడియాకే బాగా తెలుసు - ఈ జూ ఒక్కటే కాదు సిటీలో ఇలాంటి govt - ప్రైవేట్ కార్యాలయాలను నమ్ముకుని జీవించే పేద కుటుంబాలు వందల - వేలు - లక్షల్లో ఉన్నాయి , వారందరికీ పనులు లభించి కష్టపడి పనిచేసి కూలీలతో ఇంటికివెళ్లి తమ కుటుంబాలను పోషించుకోవాలి - వాళ్ళపిల్లలు ..... మాలా స్కూల్స్ లో చదువుకోవాలనే ఉద్దేశ్యంతో కమిషనర్ గారు ఈ బృహత్కార్యాన్ని చెప్పట్టినట్లు చెప్పగానే , స్టూడెంట్స్ అందరూ వెంటనే ok చెప్పేసాము అంటే జూ - జూ అనిమల్స్ కూడా ఒక కారణం అనుకోండి ........
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు - కమిషనర్ గారు సెక్యూరిటీ ఆఫీసర్లు చప్పట్లతో ఆనందిస్తున్నారు .
సూపర్ అన్నయ్యా అంటూ చెల్లెళ్లు ముద్దులుపెట్టారు .

నవ్వుకుని , సిటీలో ఉన్న అందరికీ ఒకటి విన్నవించుకోవాలనుకుంటున్నాను ఇది మన సిటీ మనం పుట్టి పెరిగిన సిటీ , మనమే భయపడి బయటకు రాకపోతే వైజాగ్ అద్భుతమైన అందాలను వీక్షించడానికి మన ఇతర జిల్లా ప్రజలు - ఇతర రాష్ట్రాల ప్రజలు మరియు ఫారినర్స్ ఎలా వస్తారు చెప్పండి , టూరిజం నమ్ముకునికూడా వేల కుటుంబాలు జీవిస్తూనే ఉంటాయి - వాళ్ళు రెండుపూటలా తినడం తినకపోవడం మనచేతుల్లోనే ఉంది - మన సిటీ కమిషనర్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎలాగైతే ప్రాణాలకు తెగించి ఏ ఒక్క ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎలా అయితే మోస్ట్ డేంజరస్ టెర్రరిస్టుల నుండి మనల్ని రక్షించారో ఇకనుండి కూడా అలానే రక్షిస్తారని నమ్మి పిల్లలమైన మేము మా టీచర్స్ దైర్యంగా బయటకువచ్చాము - ఇక సెక్యూరిటీ ఆఫీసర్లపై నమ్మకం ఉంచి తోటి పేద ప్రజల ఆకలి తీర్చడానికి దైర్యంగా బయటకు రావడం లేదా బిక్కుబిక్కుమంటూ ఇళ్ళల్లోనే ఉండిపోతాము అనడం మీ ఇష్టం - కమిషనర్ సర్ , సెక్యూరిటీ అధికారి థాంక్యూ థాంక్యూ అంటూ సెల్యూట్ చేసాను .
అంతే చెల్లెళ్లు - స్టూడెంట్స్ - టీచర్స్ - జూ స్టాఫ్ ...... అందరూ అందరూ చప్పట్లు - విజిల్స్ - కేకలువేసి సెక్యూరిటీ ఆఫీసర్లకు సెల్యూట్ చేశారు .
సెక్యూరిటీ ఆఫీసర్లంతా ...... ప్రౌడ్ గా ఫీల్ అవుతూ మా స్టూడెంట్స్ కు సెల్యూట్ చేశారు .
మీడియా : మహేష్ ....... నువ్వు స్కూల్ హీరోనే కాదు సిటీకే హీరో - ఎంత అద్భుతంగా మాట్లాడావు , మిమ్మల్ని చూసైనా సిటీ ప్రజలంతా దైర్యంగా బయటకువస్తారని ఆసిద్దాము - మహేష్ మహేష్ .......
మీడియా బ్రదర్స్ & సిస్టర్స్ ...... మా స్టూడెంట్స్ అంతా జూ దగ్గరకువచ్చి నిమిషాలు గడిచిపోయాయి - జూ దగ్గరికివచ్చి ఇంతసేపు కంట్రోల్ చేసుకోవడమే గ్రేట్ - మరొక్క ప్రశ్న ఆడిగారంటే ఇక అంతే మనల్ని తోసుకుంటూ డోర్స్ బద్దలు కొట్టుకుని వెళ్లిపోయేలా ఉన్నారు ఒకసారి మా ఫేసస్ చూసి మాట్లాడండి .
అమ్మో నిజమే అంటూ మైక్స్ అందుకుని ప్రక్కకువెళ్లబోయారు . 

చెల్లెళ్లు : ఒక్కనిమిషం ఒక్క నిమిషం అంటూ మైక్స్ పట్టుకుని అక్కయ్యా - బామ్మలూ - మమ్మీ - అంటీ ...... అన్నయ్య స్పీచ్ చూశారుకదా చూసే ఉంటారులే , ఎంజాయ్ ఎంజాయ్ ఉమ్మా ఉమ్మా ........
వన్ మినిట్ బామ్మలూ - మేడమ్స్ - అంటీ - అంకుల్ ....... మొదటగా మీరే బయటకువచ్చి అందరికీ స్ఫూర్తినివ్వండి , క్యాబ్ లో జూ దగ్గరకు వచ్చెయ్యండి , అంటీ ...... మురళి ఇక్కడే ఉన్నాడు మీరూ వచ్చెయ్యండి - మిమ్మల్ని చూసి నాలుగురోజులుగా ఇళ్ళల్లోనే ఉన్న మన ఏరియా వాళ్లంతా బయటకువస్తారు - మీరంటే గౌరవం అందరికీ ...... , ఫ్రెండ్స్ - బ్రదర్స్ - సిస్టర్స్ ...... sorry sorry మరొక నిమిషం వేస్ట్ చేసినందుకు ........
నో నో నో మహేష్ మహేష్ అన్నయ్య అన్నయ్య ...... అంటూ దద్దరిల్లిపోయింది .

జూ చీఫ్ ఆఫీసర్ : కమిషనర్ - మహేష్ - స్టూడెంట్స్ - టీచర్స్ - మీడియా ...... వైజాగ్ జూ తరుపున హృదయపూర్వక స్వాగతం , మీ వలన మళ్లీ జూ కళకళలాడబోతోందన్న నమ్మకం కలుగుతోంది - స్టాఫ్ ...... పిల్లలందరికీ కొద్దికొద్దిసేపట్లో ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ - స్నాక్స్ ...... అందిస్తూనే ఉండాలి , త్వరగా త్వరగా గేట్స్ ఓపెన్ చెయ్యండి - వన్ మోర్ వన్ మోర్ మినిట్ , స్టూడెంట్స్ ...... మీడియా కవర్ చేస్తోంది కాబట్టి రూల్స్ ప్రకారం సెక్యూరిటీ చెక్ చేసి పంపిస్తాము so that ప్రజలందరికీ నమ్మకం కుదురుతుందేమో .......
Yes yes yes అంటూ క్షణాలలో 15 - 20 rows గా క్రమశిక్షణతో నిలబడ్డాము .
వెరీ వేర్ గుడ్ స్టూడెంట్స్ - స్టాఫ్ ..... తొందరగా కానివ్వండి . చక చకా సెక్యూరిటీ వే మెషీన్స్ ఆన్ చేసి rows ముందుకు వచ్చారు .

సూపర్ సూపర్ బుజ్జిహీరో అంటూ విశ్వ సర్ వచ్చి సంతోషంతో అమాంతం పైకెత్తారు - ప్రౌడ్ ఆఫ్ యు బుజ్జిహీరో - ఒక్క స్పీచ్ తో అందరిలో చలనం కలిగించావు .
చెల్లెళ్లు : లవ్ యు డాడీ - అంకుల్ ...... , డాడీ - అంకుల్ ...... అన్నయ్యను కిందకుదించండి కిందకుదించండి ఫస్ట్ మేము అంటూ చుట్టేసి ముద్దులుపెట్టారు .
విశ్వ సర్ : నవ్వుకుని , మీ బామ్మలు ఇక్కడకు రావడానికి వెహికల్ పంపించాను , మన బుజ్జిహీరో ఉండగా నేను ఉండాల్సిన అవసరం లేదు సిటీ మొత్తం తిరుగుతూ అలర్ట్ చెయ్యాలి అంటూ వెళ్లిపోయారు .

ఆనందించి , దేవతవైపు ఆశతో చూస్తున్నాను - నన్నుచూసి చిరునవ్వులు చిందిస్తూ చెల్లెళ్లు కూడా చూస్తున్నారు .
దేవత : ఎందుకు చూస్తున్నారో నాకు తెలుసులే ....... , గుడ్ గుడ్ బుజ్జిహీరో ......
చెల్లెళ్లు : గుడ్ మాత్రమే సరిపోదు ముద్దుకూడా పెట్టాలి .
ఆశ్చర్యంగా సరే అంటూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు దేవత ...... 
ఆఅహ్హ్ ...... అంటూ పడిపోబోతే చెల్లెళ్లు పట్టుకుని నవ్వుతూ చప్పట్లుకొడుతున్నారు .
దేవత : ఎందుకు బుజ్జిచెల్లెళ్ళూ ...... మీ అన్నయ్య మినీ బస్సులోలా ఫీల్ అవుతున్నాడు - మీరేమో సంతోషంతో గెంతులువేస్తున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యకు ముద్దుపెట్టారుకదా అందుకే ఈ సంతోషం .......
దేవత : ముద్దా ...... ? , నేనెప్పుడు పెట్టాను నో నో నో ...... , పెడితే బుజ్జిదేవుడికి పెడతాను కానీ ఈ అల్లరి బుజ్జిహీరోకు ఎందుకు పెడతాను .
చెల్లెళ్లు : మామూలు ముద్దుకాదు దేవతా ...... , ప్రేమతో ఘాడమైన ముద్దుపెట్టారుకదా .......
దేవత : లేదు లేదు లేదు .......
హాసిని : లేదు లేదు లేదు అన్నా ముద్దుపెట్టేశారు ఇక ఏమీ చేయలేరు అంటూ నవ్వుకుంటున్నారు , అలాంటి అంతటి ప్రియమైన ముద్దుకు అక్కయ్యకు - మాకే పెట్టలేదు తెలుసా ...... అన్నయ్య రియల్లీ లక్కీ ఇక్కడే కదా దేవత ముద్దుపెట్టినది అంటూ పోటీపడిమరీ నా బుగ్గపై ముద్దుపెడుతున్నారు .
దేవత : నో నో నో బుజ్జిహీరో ...... నా ముద్దు నాకు ఇచ్చెయ్యి అంటూ కాస్త వొంగి బుగ్గను చూయించారు - నో నో నో ...... అనేంతలో .......
చెల్లెళ్లు ...... అక్కయ్య అంటూ పెదాలను కదిలించి గుర్తుచేయ్యడంతో అయోమయంతోనే ధైర్యం చేసి ముద్దుపెట్టేసాను .
దేవత : నాకు బుద్ధేలేదు అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఇలా ఎలా మాట్లాడేస్తున్నాను - బుజ్జిహీరో ...... నిన్నూ నిన్నూ అంటూ కొడుతున్నారు .
చెల్లెళ్లు : మీరు ఎంతకొట్టినా అన్నయ్యకు దెబ్బనే తెలియదు దేవతా ....... ఒక ముద్దు మీరు పెట్టారు - ఒక ముద్దు అన్నయ్యను పెట్టమన్నారు , అన్నయ్య ఎప్పుడో అలా అలా గాలిలో తేలిపోతూ ముద్దులను ఫీల్ అవుతున్నారు .
దేవత : ప్చ్ ప్చ్ ...... నాకేదో అయ్యింది - లేకపోతే ఇలా ముద్దులు అంటూ బుగ్గపై తుడుచుకుంటున్నారు .
చెల్లెళ్లు : అంతా పెద్దమ్మ మాయ దేవతా ...... , మేమే ఇలా జరగాలని భక్తితో కోరుకున్నాము అలానే జరిగింది .
దేవత : అవునా ...... అంటే పెద్దమ్మ గురించినది అంతా నిజమేనన్నమాట లేకపోతే ఈ అల్లరి పిల్లాడికి నేనెందుకు ముద్దులుపెడతాను , అప్పుడు బస్సులో ఇప్పుడు ఇలా అంటూ బుగ్గపై తుడుచుకుంటూనే ఉన్నారు , పోండి చెల్లెళ్ళూ ...... నా తొలి ముద్దును బుజ్జిదేవుడికే పెట్టాలని మరియు తొలి ముద్దును బుజ్జిదేవుడి నుండే పొందాలని ఎంతలా ఆశపడ్డాను .
చెల్లెళ్లు : మీకోరికనే తీర్చామన్నమాట - అన్నయ్యే ..... బుజ్జిదేవుడు అని తెలిసాక మీరుకూడా చాలా సంతోషిస్తారు అంటూ హైఫై కొట్టుకుని సంతోషం పట్టలేక నా బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
దేవత : ఏంటి చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : అదే అదే దేవతా ...... , ఎంత రుద్దుకున్నా చెరగని తియ్యనైన ముద్దు - అక్కడ చేరుపుకున్నా మా మొబైల్ లో జీవితాంతం ఉండిపోతుంది .
దేవత : చూసానులే మీరు మొబైల్స్ కూడా బయటకు తియ్యలేదు - ఇక వీడియో .........
చెల్లెళ్లు : మీరు చెప్పినది నిజమే - పెద్దమ్మను తలుచుకున్నామంటే ....... పెద్దమ్మా అంటూ ప్రార్థించి ఏకంగా పెట్టడం - పెట్టించుకోవడం రెండూ చూయించారు .
దేవత షాక్ చెంది హాసిని మొబైల్ లాక్కుని డిలీట్ చేసేస్తానులే .......
వైష్ణవి : మరి మా మొబైల్ లో ఎలా డిలీట్ చేస్తారు దేవతా అంటూ చూయించారు .
దేవత : అమ్మో అమ్మో ...... , తీసుకో హాసినీ అంటూ డిలీట్ చేయకుండానే మొబైల్ ఇచ్చేసారు , అంతా చేసి ఏమీ తెలియని అమాయకుడిలా ఎలా చేతులుకట్టుకుని నిలుచున్నాడో చూడు ఈ అల్లరి పిల్లాడు అంటూ బుగ్గను గిల్లేసారు .
స్స్స్ స్స్స్ .... ముసిముసినవ్వులు నవ్వుకుని , నిజంగా నాకూ ఏమీ తెలియదు మేడం , అంతా చెల్లెళ్లు - పెద్దమ్మ ....... అంటూ చెల్లెళ్ళవైపు లవ్ యు అంటూ కన్ను కొట్టాను .
దేవత : అవునవును , పెద్దమ్మను నమ్మకపోవడం నాదే తప్పు ...... , ఇందులో నీ తప్పులేదులే అంటూ బుగ్గపై స్పృశించారు .
చెల్లెళ్లు : తప్పులేదని స్పృశిస్తే చాలదు దేవతా ...... 
దేవత : మరింకేంటి ముద్దుపెట్టమంటారా ఏమిటి .......
చెల్లెళ్లు : అవునవును అంటూ తలలు ఊపారు .
దేవత : సరే గట్టిగా గిల్లినది నేనే కాబట్టి అంటూ మళ్లీ ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ...... అంటూ పడిపోతున్న నన్ను జాగ్రత్తగా పట్టుకుని , సంతోషంలో గోలగోల చేస్తున్న స్టూడెంట్స్ మధ్యన యాహూ యాహూ ...... అంటూ కేకలువేస్తూ చిందులువేస్తున్నారు .
దేవత : చిన్న జర్కుతో ....... , ఏంటి మళ్లీ ముద్దుపెట్టేసానా - పెద్దమ్మను తలుచుకున్నారు కదూ అంటూ చెల్లెళ్లతోపాటు నా బుగ్గపై గిల్లేసి తియ్యనైనకోపంతో అటువైపుకు తిరిగారు .
చెల్లెళ్లు స్స్ స్స్ స్స్ అంటూ రుద్దుకుంటూనే నా బుగ్గలపై ముద్దులుపెట్టి , అన్నయ్యా ...... ఆల్రైట్ కదా అంటూ నిలబెట్టి దేవత ముందుకువెళ్లారు - లవ్ యు లవ్ యు our స్వీటెస్ట్ గాడెస్ ...... ఇన్నిరోజులూ అన్నయ్యను బోలెడన్ని దెబ్బలు కొట్టారుకదా , ఈ ఒక్కరోజు దెబ్బలకు బదులు ముద్దులుపెడితే ఎలాఉంటుంది అని ఇలాచేసాము sorry లవ్ యు లవ్ యు అంటూ గుంజీలు తీస్తున్నారు .
దేవత పెదాలపై ఒక్కసారిగా చిరునవ్వులు పరిమళించి ముగ్గురినీ హత్తుకున్నారు - అధికాదు మై స్వీటెస్ట్ బుజ్జిచెల్లెళ్ళూ ...... చెప్పానుకదా నా తొలి ముద్దు ......
చెల్లెళ్లు : అన్నయ్య బుజ్జిదేవుడికే పెట్టాలని కోరిక అంటూ తొంగిచూసి నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు - లవ్ యు అక్కయ్యా ....... ఒక పనిచేద్దాము అన్నయ్యకు బుగ్గపై తొలిముద్దు పెట్టేసారు ఇక వెనక్కు తీసుకోలేము కాబట్టి బుజ్జిదేవుడు అన్నయ్యకు పెదాలపై తొలిముద్దు పెట్టేయ్యండి .
దేవత : ఒక్కసారిగా సిగ్గుపడి అలాగే అన్నట్లు చెల్లెళ్లను మరింత ప్రేమతో కౌగిలించుకుని పులకించిపోతున్నారు . 
చెల్లెళ్లు : దేవతకు ఇష్టమే అన్నమాట - బుజ్జిదేవుడు అన్నయ్యా ...... వింటున్నారా ? ఎక్కడ ఉన్నా తొందరగా దేవత ముందుకు వచ్చెయ్యండి అంటూ మిక్కిలి సంతోషంతో దేవతను చుట్టేశారు .
పెదాలపై ...... అంటూ స్వీటెస్ట్ షాక్ లో ఉండిపోయాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-03-2022, 10:40 AM



Users browsing this thread: 25 Guest(s)