Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
దెబ్బలుపడతాయి అంటారుకానీ కొట్టడం లేదు అంటూ దేవత ముందుకువెళ్లి బుగ్గను చూయించాను .
అన్నయ్యను కొడితే వెంటనే మమ్మల్ని కూడా కొట్టాలి అంటూ చెల్లెళ్లు - తమ్ముడు ...... దేవత చుట్టూ చేరారు .
ఒక్క అల్లరి పిడుగుతోనే కష్టం అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఐదుగురు తయారయ్యారా ? ( అక్కయ్య - మిస్సెస్ కమిషనర్ నవ్వులే నవ్వుకు ) కరెక్షన్ చెయ్యాలి వెళ్ళండి వెళ్ళండి అంటూ మా బుగ్గలను గిల్లేసారు .
చాలు దేవతా చాలు , ఈరోజుకు కాదు కాదు ఈపూటకు చాలు యాహూ ..... అంటూ ప్రక్కనే ఉన్న అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి బయటకు పరుగుతీసాను .
అన్నయ్యా అన్నయ్యా ...... తొందరగా వచ్చేయ్యాలి అంటూ చెల్లెళ్లు మెయిన్ గేట్ వరకూ వెనుకే వచ్చారు .
లవ్ యు చెల్లెళ్ళూ ........

వెళుతున్న నాప్రక్కనే సెక్యూరిటీ అధికారి వెహికల్ ఆగింది .
చెల్లెళ్లు : డాడీ - అంకుల్ ...... గుడ్ మార్నింగ్ .
విశ్వ సర్ : గుడ్ మార్నింగ్ ఏంజెల్స్ - మీరు లోపలికి వెళితే మీ అన్నయ్యతో సీక్రెట్ గా మాట్లాడాలి .
చెల్లెళ్లు : అన్నయ్యతో అయితే ok - లోపలికి వెళ్లారు .
విశ్వ సర్ : నవ్వుకుని , బుజ్జిహీరో ....... నువ్వు అప్పజెప్పిన మూడు పనులను ఫినిష్ చేసుకునివచ్చాను . మీ అక్కయ్య కోసం బ్యూటిఫుల్ WELCOME గ్యాదరింగ్ - మనం లేని కాలేజ్ లో అనుక్షణం తోడుగా ఉండే కరణం మల్లీశ్వరి లాంటి లేడీ & ఫైనల్లీ ఫైనల్లీ ....... ఈరోజు లంచ్ టైం లో బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ ...... సాయంత్రానికి బిల్డింగ్ కీస్ నీ చేతిలో ఉంటాయి .
థాంక్యూ థాంక్యూ కమిషనర్ సర్ అంటూ కౌగిలించుకున్నాను . యాహూ యాహూ ....... అంటూ గెంతులేస్తున్నాను .
అన్నయ్య ...... సంతోషంతో గెంతులేస్తున్నారు అంటే గుడ్ సీక్రెట్ అన్నమాట అంటూ చెల్లెళ్లు చప్పట్లు కొడుతున్నారు .
విశ్వ సర్ : మొత్తం వినేసారన్నమాట .......
చెల్లెళ్లు : నో డాడీ - అంకుల్ , అంత దూరం నుండి ఎలా వినిపిస్తుంది , జస్ట్ గుడ్ సీక్రెట్ or .......
గుడ్ సీక్రెట్ చెల్లెళ్ళూ ....... , ఎంత సంతోషం కలుగుతోందో తెలుసా అంటూ చెల్లెళ్లను ఒకేసారి హత్తుకుని ముద్దులవర్షం కురిపించాను .
చెల్లెళ్లు : మా అన్నయ్య హ్యాపీ అయితే చాలు మాకు , లవ్ యు లవ్ యు అన్నయ్యా .......
చెల్లెళ్ళూ ...... ఇలావెళ్లి అలా వచ్చేస్తాను అంటూ మళ్లీ ముద్దులుపెట్టి , యాహూ యాహూ ....... అంటూ ఏరియా కె బిగ్గెస్ట్ బిల్డింగ్ వైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ పరుగులుతీసాను .

Hi మహేష్ అంటూ సెక్యూరిటీ అన్న విష్ చేసాడు .
Hi అన్నా ...... ఇప్పుడే డ్యూటీ ఎక్కినట్లున్నారు .
సెక్యూరిటీ : అవును తమ్ముడూ ....... , థాంక్యూ సో మచ్ తమ్ముడూ అంటూ రెండుచేతులతో దండం పెట్టాడు .
అన్నా ..... ఏమిటిది అంటూ ఆపాను . 
సెక్యూరిటీ : నువ్వు ...... సర్ వాళ్లకు పెద్ద సహాయం చేసావు - సర్ వాళ్ళు ...... నా కష్టాలన్నింటినీ తీర్చేశారు మరియు పిల్లల చదువు పూర్తయ్యేంతవరకూ ఎంత ఖర్చైనా భరిస్తాము అని మాటిచ్చారు .
చాలా సంతోషం అన్నా ...... , మరి దండం పెట్టాల్సినది నాకు కాదు అంకుల్ వాళ్లకు ....... , మీతోపాటు మన సెక్యూరిటీ - డ్రైవర్స్ అందరికీ సహాయం చేసారు .
లేదు లేదు దండం పెట్టాల్సినది దేవుడికే కదా - మా అందరి బుజ్జిదేవుడివి నువ్వు - నీ వల్లనే మాకు జ్ఞానోదయం అయ్యింది - ఒకరికి మంచి చేస్తే మనకూ మంచి జరుగుతుంది అని తెలిసేలా చేసావు అన్నారు అంకుల్ .......
లేదు లేదు అంకుల్ ...... ప్రతీ సెక్యూరిటీ - డ్రైవర్ పెదాలపై చిరునవ్వులు పూయించారు .
అంటీ : నీవల్లనే కదా మహేష్ .......
అంటీ మీరు కూడానా ...... ? .
అంటీ : పొగడ్తలు మా బుజ్జిదేవుడికి నచ్చవు అన్నమాట సరే సరే ......
నవ్వుకుని , అంటీ ....... ఒక రిక్వెస్ట్ - స్కూల్ కు చెల్లెళ్లతోపాటు వెళ్లాలని ఆశగా ఉంది , మీరు పర్మిషన్ ఇస్తే ....... ఔట్ హౌస్ లో స్నానం చేసి వెళ్లాలనుకుంటున్నాను .
అంటీ : మహేష్ ...... ఇకనుండీ నువ్వు పనివాడివి కాదు - మాకు మురళి ఎంతో నువ్వూ అంతే - ఔట్ హౌస్ లో ఉన్న మా మహేష్ వస్తువులన్నింటినీ మురళి ప్రక్కగదిలోకి ఎప్పుడో మార్పించేసాము - మురళి స్నానం చేస్తున్నాడు నువ్వూ లోపలికివచ్చి స్నానం చేసేస్తే వేడివేడిగా టిఫిన్ చేసి వెళ్లొచ్చు .
అంటీ ...... ఔట్ హౌస్ లో .......
అంకుల్ : ఔట్ హౌస్ ఎప్పుడో ఎంప్టీ చేసి లాక్ చేసేసాము మహేష్ ....... , లోపలికి రావాల్సిందే ......
ఇలా లాక్ చేసేసారన్నమాట అంటూ ఆనందించాను . థాంక్యూ అంటీ - అంకుల్ ...... స్నానం అయితే ok కానీ టిఫిన్ - చెల్లెళ్లు అక్కడ wait చేస్తున్నారు అంటీ ......
అంకుల్ : నీకోసం ప్రత్యేకంగా నీకోసం వంట గదిలోకి అడుగుపెట్టని మీ అంటీ స్వయంగా వంట చేసింది మహేష్ ...... , ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అనుకుంటున్నావేమో ...... వంట రుచి చూసే మీ అంటీని పెళ్లిచేసుకున్నాను కాదనకు .......
అయితే ఒకపనిచేద్దాము అంకుల్ - మీరు ఇబ్బంది అనుకోకపోతే క్యారెజ్ ఇవ్వండి చెల్లెళ్లతోపాటు కలిసి తింటాను .
అంటీ : Ok ..... , మా మహేష్ తోపాటు మహేష్ ప్రాణమైన చెల్లెళ్లు కూడా తింటారు అంటే మరింత హ్యాపీ అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు .
మమ్మీ ....... మహేష్ వచ్చాడా ? అంటూ పైనుండి మురళి మాటలు వినిపించాయి .
అంటీ : నీ స్నానం అయ్యుంటే మహేష్ ను నువ్వే పైకి తీసుకెళ్లి రూమ్ చూయించు .
లవ్ టు మమ్మీ అంటూ టవల్ లోనే హుషారుగా వచ్చి , మహేష్ కమాన్ అంటూ పైకి పిలుచుకునివెళ్లాడు . మహేష్ ...... ఇది నీ రూమ్ - ప్రక్కనే నా రూమ్ , త్వరగా రెడీ అవ్వు టైం అవుతోంది కదా ........
కంగారుపడుతూనే లోపలికివెళ్లి చుట్టూ చూసాను - అన్ని వసతులతో ఆర్రేంజ్ చేసి ఉండటం చూసి ఆనందించాను . పెద్దమ్మ పెద్దమ్మ అంటూ చుట్టూ చూసి ఔట్ హౌస్ లో ఎలా అయితే టేబుల్ పై పూజించానో అలానే ఉంచి ఉండటం చూసి అంటీకి థాంక్స్ చెప్పుకున్నాను - పెద్దమ్మను మొక్కుకున్నాను పెద్దమ్మా ...... అక్కయ్య WELCOME గ్యాదరింగ్ చూసి అక్కయ్య ఆనందాలు అంబరాన్ని అంటాలి - అలా జరిగేలా మీరు చూస్తారులే , గోడపై గడియారం చూసి అమ్మో అంటూ నా బ్యాగులోని టవల్ అందుకుని బాత్రూమ్లోకి వెళ్లి , కాలకృత్యాలు తీర్చుకునిబీ- స్నానం చేసి - స్కూల్ డ్రెస్ వేసుకుని కిందకువచ్చాను . 
మహేష్ ...... స్కూల్లో కలుద్దాము - మమ్మీ డాడీ అంతా చెప్పారులే ఎంజాయ్ అంటూ క్యారెజీ అందించాడు మురళి .......
మురళీ ....... ఏంటి ఇంత బరువుంది .
అంకుల్ : మరొకటి కూడా క్యారేజీ కడుతోంది మహేష్ ...... మీ అంటీ ......
అమ్మో ...... అంటీ - అంకుల్ బై , మై ఫ్రెండ్ స్కూల్లో కలుద్దాము అనిచెప్పి తుర్రుమన్నాను .
సెక్యూరిటీ చూసి క్యారేజీ అందుకోబోతే ...... , పర్లేదు అన్నా ...... దగ్గరే కదా అంటూ తీసుకునివెళ్ళాను .

అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ దేవత ఇంటి దగ్గర నుండే చెల్లెళ్లు స్కూల్ డ్రెస్సెస్ లో పరుగునవచ్చి నా చేతిలోని క్యారెజీ అందుకున్నారు .
చెల్లెళ్ళూ ....... నాకంటే ముందుగానే రెడీ అయ్యారే .......
Sometimes హ్యాపెన్స్ అన్నయ్యా అంటూ చెల్లెళ్లు నవ్వుకుని , అన్నయ్యా ...... ఏంటీ క్యారేజ్ - ఎవరిచ్చారు - ఇంత బరువుగా ఉంది .
అవునవును బరువుగా ఉంది నాకివ్వండి ........
చెల్లెళ్లు : పర్లేదు అన్నయ్యా అంటూ బరువున్నా ఇష్టంతో కొత్త బిల్డింగ్ వైపు నడిచారు .
లవ్ యు చెల్లెళ్ళూ ...... అంటూ జరిగినది వివరించాను .
చెల్లెళ్లు : మూడుపూటలకు అయ్యేంత క్యారెజీ అంటూ నవ్వుకుని , లోపలికి తీసుకెళ్లారు .

అంతలో కొత్త సారీ లో దేవత - కొత్త డ్రెస్సులో అక్కయ్య ...... ఇంటికి తాళం వేసి , చేతుల్లో చేతిని వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ వస్తున్నారు .
అక్కయ్య : తమ్ముడూ ....... ఎలా ఉన్నాము ? .
బ్యూటిఫుల్ ...... దేవత - దేవకన్యల్లా ఉన్నారు అంటూ కన్నార్పకుండా చూస్తున్నాను .
అక్కయ్యతోపాటు దేవత అందమైన సిగ్గులతో ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు - బుజ్జిహీరో ....... ఇప్పుడు సమయం లేదు అంటూ లోపలికివెళ్లారు . అక్కయ్య నా చేతిని అందుకుని , నా తమ్ముడిని కలిసాక రోజూ కొత్త డ్రెస్సులే అంటూ ముద్దులుకురిపిస్తూ లోపలికి నడిచారు .
పెద్దమ్మవలన అక్కయ్యా అని చెప్పబోయి ఆగిపోయాను - అక్కయ్య ...... మొత్తం ప్రేమ నాకు - చెల్లెళ్లకు - దేవతకు మాత్రమే సొంతం అంటూ నవ్వుకున్నాను . లవ్ యు అక్కయ్యా ...... మా అక్కయ్య సంతోషమే మా సంతోషం .

అన్నయ్యా - అక్కయ్యా ...... అంటూ పిలుచుకునివెళ్లి దేవతతోపాటు డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టి కూర్చున్నారు . బామ్మలు వండిన టిఫిన్ మరియు అంటీ క్యారేజీ వడ్డించారు . 
దేవత : బుజ్జిహీరో ...... చెప్పానా ..... ? , మీ కొత్త అంటీ నీకోసం ఏమైనా చేసేలా ఉన్నారని .......
ఆనందిస్తూ తిని , బామ్మలు - మిస్సెస్ కమిషనర్ కు ముద్దులతో బై బై చెప్పి స్కూల్ బ్యాగ్స్ తో బయటకువచ్చిచూస్తే స్వీట్ సర్ప్రైజ్ .........
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 12-02-2022, 05:38 PM



Users browsing this thread: 4 Guest(s)