Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
సరిపడా నిద్రపట్టినట్లు మెలకువచ్చి లవ్ యు అక్కయ్యా ...... అంటూ అక్కయ్య ఓడిలోనే కళ్ళుతెరిచాను . 
ఎదురుగా రెడ్ కలర్ పట్టుచీరలో దివినుండి దిగివచ్చిన దేవతలా నా దేవత ...... మిస్సెస్ కమిషనర్ తోపాటు చిరునవ్వులు చిందిస్తున్నారు .
అంతులేని ఆనందంతో కన్నార్పకుండా చూస్తూ లేచి కూర్చుని గాలిలో తేలిపోతున్నట్లుగా - ఎదురుగా దేవత - ప్రక్కనే దేవకన్య - చుట్టూ బుజ్జిదేవకన్యలు ........ అక్కయ్య ఒడిలో పడుకుని నేరుగా స్వర్గానికి చేరుకున్నానా ......? అంటూ సంతోషపు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి చూస్తున్నాను . 
నా మాటలకు దేవత మొదట సిగ్గుపడి ఆ వెంటనే చిరుకోపంతో చూస్తున్నారు .
అక్కయ్య - చెల్లెళ్లు - మిస్సెస్ కమిషనర్ - బామ్మల ....... నవ్వులు ఆగడం లేదు .

చెల్లెళ్లు : గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ....... అన్నయ్యా అన్నయ్యా ....... , స్వర్గం - దేవత - దేవకన్య - బుజ్జిదేవకన్యలు ( సంతోషపు నవ్వులు ) ఏమోకానీ ఒకటిమాత్రం నిజం మనం ఇప్పుడు గాలిలో తేలిపోతున్నాము చూడండి అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి టోటల్ విండోస్ ఓపెన్ చేశారు .
విండోస్ నుండి అప్పుడే సూర్యోదయం అవుతున్న సూర్యకిరణాలు - ఆకాశం - మేఘాలు కనిపించడంతో ....... చుట్టూ చూసి , చెల్లెళ్ళూ ....... విమానం ? అంటూ షాక్ లో ఉండిపోయాను .
చెల్లెళ్లు : విమానంలోనే వెళుతున్నాము అన్నయ్యా ....... ప్యాసెంజర్స్ విమానం కాదు , మా అన్నయ్యను అదే అదే బుజ్జిదేవుడి కోసం ప్రెసిడెంట్ సర్ పంపించిన స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ , ఎంత లగ్జరీగా ఉందో లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ....... అంటూ మళ్లీ ముద్దులుపెట్టారు .
దేవత : చెల్లెళ్ళూ ....... మీ అన్నయ్య , మాలానే ప్రెసిడెంట్ ను కలవడానికి వెళుతున్న డూప్లికేట్ బుజ్జిదేవుడు కాబట్టి బుజ్జిహీరో అని పిలవండి , బుజ్జిదేవుడు అంటే అతడు మాత్రమే ....... అంటూ కాస్త కోపంతో చెప్పారు .

కమిషనర్ సర్ : మీతోసహా డూప్లికేట్ అన్నారు కదూ ....... , ఉండండి ఇదేవిషయాన్ని బుజ్జిదేవుడికి చెబుతాను , బుజ్జిదేవుడు బాధపడటం మీకు ఇష్టం అనుకుంటాను , బుజ్జిదేవుడి నుండి కన్నీళ్లు తెప్పించేలా ఉన్నారే ...... 
దేవత : నో నో నో సర్ అంటూ లేచి ఇంకెప్పుడూ ఇలా అనం అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నారు .
షాక్ లో ఉన్న నా బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్య కూడా లేచి గుంజీలు తీస్తున్నారు .
దేవత : చెల్లీ ...... మాట్లాడినది నేనుకూడా ......
అక్కయ్య : మా దేవత మాట్లాడితే ఒకటి - దేవత చెల్లి మాట్లాడితే ఒకటినా అక్కయ్యా ........
బుజ్జిచెల్లెళ్ళు కూడా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లెళ్లు ఇరువైపులా చేరి గుంజీలు తీస్తున్నారు .
కమిషనర్ సర్ : బుజ్జిదేవుడిని ఇక బాధపెట్టము అంటారు మళ్లీ కొద్దిసేపటికే ఇలా మాట్లాడుతారు - ఇలానే ప్రెసిడెంట్ గారితో నోరుజారితే ...... ఇంకేమైనా ఉందా ? - ప్రతీసారీ మిమ్మల్ని ఒప్పించడం నావల్ల కాదని బుజ్జిదేవుడికి చెప్పేస్తాను - రెండు గంటల్లో ఢిల్లీలో ల్యాండ్ అవ్వబోతున్నాము ఇప్పటికీ మీరు మనసులో అలానే ఫీల్ అవుతున్నారని బుజ్జిదేవుడికి తెలిస్తే ఎంత బాధపడతాడో మీకే తెలుస్తుంది - బుజ్జిహీరోను డూప్లికేట్ అనండి పర్లేదు కానీ మిమ్మల్ని మీరు ....... మీరు మనసులో ఏమీ పెట్టుకోకుండా సంతోషంతో ప్రెసిడెంట్ సర్ ను కలవడం , కలిసినప్పుడు మీ ఆనందాలను చూసి అంతులేని ఆనoధానుభూతులకు లోనవ్వాలనికదా బుజ్జిదేవుడి స్వచ్ఛమైన కోరిక ....... ,  అదికూడా తీర్చలేకపోతే ఎలా ...... ? , పైలట్ ....... బుజ్జిదేవుడి మనసులోని స్వచ్ఛమైన కోరిక తీరేలా లేదు ఫ్లైట్ వైజాగ్ వైపుకు తిప్పండి ఇంటికివెళ్లిపోయి బుజ్జిదేవుడిని బాధపెడదాము పదండి పదండి ........

సూపర్ సర్ అంటూ దేవత - అక్కయ్య వెనకనుండి సైగలుచేసాను .
చెల్లెళ్లు చూసి నవ్వుకుంటూ వచ్చి నా బుగ్గలపై ముద్దులుపెట్టి మళ్లీ దేవత - అక్కయ్య దగ్గరికి చేరారు .
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ ...... రాష్ట్రపతి భవన్ దగ్గరికివెళ్లి బుజ్జిదేవుడిని బాధపెట్టడం కంటే ఇప్పుడే వెనుతిరగడం బెటర్ ...... , రాత్రే బిరియానీ తినకముందు ఇక ఇలా మాట్లాడము అని ప్రామిస్ చేసి తెల్లవారగానే ...... ప్చ్ బ్యాడ్ tooo బ్యాడ్ చెల్లెళ్ళూ .......
కమిషనర్ సర్ : నువ్వు చెప్పింది నిజం శ్రీమతీ ...... పైలట్ పైలట్ ......
దేవత : అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ సోఫాలో కూర్చుని మిస్సెస్ కమిషనర్ చేతిని చుట్టేసి , sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా ....... , బుజ్జిదేవుడి కంట కన్నీరు తెప్పించడం అంటే మా శ్వాస ఆగినదానితో సమానం .......
దేవ ....... మేడం అలా అనకండి అంటూ బెడ్ దిగి అక్కయ్యదగ్గరికి వెళ్ళాను .
బామ్మలు : చూశావా బుజ్జితల్లీ ...... బుజ్జిహీరోనే ఇంతలా బాధపడితే ఇక బుజ్జిదేవుడు ఎంత బాధపడతాడో .......
దేవత : ఇదే చివరిసారి ప్రామిస్ ప్రామిస్ ........
దేవ ....... మేడం ...... స్టాప్ స్టాప్ కావాలంటే నాపై ప్రామిస్ చెయ్యండి , నాకేమైనా పర్లేదు ....... మా దేవతకు ఏమీ కాకూడదు .
మిస్సెస్ కమిషనర్ : చూశావా చెల్లీ ...... ప్రామిస్ తప్పుతావని బుజ్జిహీరోకు కూడా తెలుసు .......
దేవత : నో నో నో నాట్ థిస్ టైం ....... , ఇప్పుడుకూడా అలా మాట్లాడేదానిని కాదు - అంతా ఈ బుజ్జిహీరో వల్లనే ...... , వాడు చేసే అల్లరికి కౌంటర్ ఇవ్వబోయి ఆతృతలో అలా మాట్లాడేసాను అంతే అంటూ నవ్వుతూ నా చేతిపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ........
అందరూ గట్టిగా నవ్వేస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : తల్లీ కృతీ .... - బుజ్జితల్లులూ ...... మీ అన్నయ్యకు నొప్పివేస్తున్నా ఊరికే ఉన్నారు .
చెల్లెళ్లు : దేవత గిల్లితే అన్నయ్యకు మహదానందం కదా అన్నయ్యా .......
లవ్ యు soooooo మచ్ చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : మాకు తెలుసు అన్నయ్యా ........ 
లవ్ యు తమ్ముడూ అంటూ సైడ్ నుండి గట్టిగా చుట్టేసి ఆనందిస్తున్నారు అక్కయ్య ........

కమిషనర్ సర్ : అయితే తప్పంతా బుజ్జిదేవుడిది అన్నమాట - అయితే దెబ్బలుపడాల్సిందే ........ 
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదేవుడిని కొట్టే ధైర్యం ఎవరుచేస్తారు ? , చూసారా చుట్టూ బుజ్జి బౌన్సర్స్ .........
కమిషనర్ సర్ : అయితే నేను ఏమాత్రం involve అవ్వను ....... అంటూ నోటికి తాళం వేసి చేతులుకట్టుకుని కూర్చున్నారు .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదేవుడిని కొట్టబోతే మనకే దెబ్బలుపడేలా ఉన్నాయి .......
చెల్లెళ్లు : అక్కయ్యతోపాటు నవ్వుకుని , లవ్ యు డాడీ - మమ్మీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
మిస్సెస్ కమిషనర్ : నాకు మరింత భయం ...... , చెల్లీ అవంతికా కాదు కాదు తమన్నా ...... ఏదో మాట్లాడబోయి ఆగిపోయావు , మీ సర్ చెప్పారుకదా ....... బుజ్జిహీరోను డూప్లికేట్ అనొచ్చు అని .......
దేవత : అధికాదు అక్కయ్యా ........
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదేవుడి స్థానంలో ఆ దేవుడే వచ్చినా accept చెయ్యను అంటావు అంతేకదా ...... , ఈ ఒక్కసారికి ప్లీజ్ ప్లీజ్ మా అందమైన తమన్నా కదూ - బంగారు దేవత కదూ ........ అంటూ బుజ్జగిస్తున్నారు .
ప్లీజ్ ప్లీజ్ మేడం ....... , ఎంతకాదన్నా మీ స్టూడెంట్ ను కదా అంటూ మోకాళ్లపై కూర్చుని బ్రతిమాలుతున్నాను - నాతోపాటు చెల్లెళ్ళుకూడా కూర్చున్నారు ప్లీజ్ ప్లీజ్ దేవతా అంటూ ......
దేవత ఒక్కసారిగా నవ్వేసి , లేవండి లేవండి ....... మీరు మోకాళ్లపై కూర్చుంటే మీ అక్కయ్య నా ముద్దుల చెల్లి బాధపడుతుంది అంటూ నా చేతిని అందుకునిలేపి ప్రక్కనే సోఫాలో కూర్చోబెట్టుకున్నారు , చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ....... హ్యాపీనా కూర్చోండి .
దేవత ప్రక్కన అంటూ తెగ మురిసిపోతున్నాను .
అక్కయ్య : ఎంజాయ్ తమ్ముడూ అంటూ నాకు మరొకవైపు కూర్చుని హత్తుకున్నారు .
చెల్లెళ్లు : మమ్మీ - మేడం ....... మీరు లేచి మరొక సోఫాలో కూర్చోండి , మా అన్నయ్య ప్రక్కన కూర్చోవాలి .
దేవత ...... నావైపు రుసరుసలాడుతూ చూస్తున్నారు .
Sorry sorry మేడం అంటూ లోలోపలే నవ్వుతున్నాను .
మిస్సెస్ కమిషనర్ : ఎంతచూసినా ప్రయోజనం లేదు చెల్లీ ...... , వాళ్లకు అమ్మ - దేవత కంటే వాళ్ళ అన్నయ్య అంటేనే ప్రాణం , లాగెయ్యకముందే లేచి వెళ్లడం మనకే గౌరవం అంటూ తియ్యనైనకోపంతో నవ్వుకుంటూ లేచి ఎదురుగా అక్కయ్యను హత్తుకుని పడుకున్న బెడ్ పైకి చేరారు . 
చెల్లెళ్లు : లవ్ యు మమ్మీ - లవ్ యు దేవతా ...... అంటూ నవ్వుకుంటూ అక్కయ్య - నాప్రక్కన చేరారు . అన్నయ్యా ...... మీ దేవత కోపాన్ని ఎంజాయ్ చెయ్యండి అంటూ ముద్దులుపెట్టారు .

దేవత : అక్కయ్యా ...... బాత్రూం కు వెళ్ళొస్తాను అంటూ లేచివెళ్లారు .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... నిద్ర బాగాపట్టిందా ? - హాయిగా నిద్రపోయారా ? .
అక్కయ్య ఒడిలో అక్కయ్యను చుట్టేసి - ప్రాణమైన చెల్లెళ్లు ...... జొకోడితే అమ్మ - పెద్దమ్మ ఒడిలో నిద్రపోయినంత హాయిగా నిద్రపోయాను , లవ్ యు చెల్లెళ్ళూ - లవ్ యు అక్కయ్యా ...... అంటూ చేతులు అందుకుని ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు - అక్కయ్య ....... తియ్యనైనకోపాలతో కొరుక్కుతినేలా చూస్తున్నారు .
Sorry లవ్ యు లవ్ యు అంటూ చెల్లెళ్లు - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , హమ్మయ్యా ...... బ్రతికిపోయాను - అక్కయ్యా ...... సర్ చెప్పినట్లు ఇంకా రెండు గంటలు ఉందికదా మరికొద్దిసేపు అలాగే నిద్రపోవాలని ఉంది అంటూ అక్కయ్యను చుట్టేసాను .
బామ్మలు : ఒక్కసారి అలా పడుకున్నందుకే మీ అక్కయ్యను స్వర్గంలో విహరిమ్పచేశావు మళ్ళీనా ...... పాపం ఒంట్లో సారం అంతా లాగేసావు .
అక్కయ్య : బామ్మా బామ్మా ...... అంటూ సిగ్గుపడుతూనే నన్ను ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై పెదాలను తాకించారు .
మిస్సెస్ కమిషనర్ నవ్వులు ఆగడం లేదు - చెల్లీ ...... వన్ మోర్ టైం ఎంజాయ్ .....

దేవత - మిస్సెస్ కమిషనర్ ...... కొత్తపట్టుచీరలలో , చెల్లెళ్లు ...... ప్రెట్టి డ్రెస్సెస్ లో , బామ్మలు కొత్త సారీలలో రెడీ అయ్యారు - మరి మీరేంటి అక్కయ్యా ...... నిన్నటి లంగావోణీలోనే ఉన్నారు , ఇంతకూ ఇంట్లో పడుకున్న నేను ఇక్కడికి ఎలా వచ్చాను ? .
మిస్సెస్ కమిషనర్ : అంతేనా ...... ఇంకేమైనా ప్రశ్నలున్నాయా ? బుజ్జిదేవుడా ....?.
ష్ ష్ ష్ ...... మమ్మీ ......
మిస్సెస్ కమిషనర్ : మీ దేవత లేదులే ........
చెల్లెళ్లు : అయితే ok ....... , అన్నయ్యా ...... మేము - అన్నయ్య కలిసి మిమ్మల్ని ఫ్లైట్ లోకి చేర్చాము . అన్నయ్యా ...... నమ్మడం లేదు కదూ .......
నా చెల్లెళ్లు ఏమిచెబితే అది నమ్ముతాను అంత ప్రాణం నా చెల్లెళ్లు అంటే - అక్కయ్యకూడా ఔననే సైగచేస్తున్నారు కానీ బరువున్నానుకదా ........ , సెకండ్ ఫ్లోర్ నుండి ఫ్లైట్లోకి ........
చెల్లెళ్లు : అయితే మా అన్నయ్య ...... వారి ప్రాణమైన అక్కయ్య ఒడిలో హాయిగా నిద్రపోయాక ఏమిజరిగిందో పూసగుచ్చినట్లు చెప్పాల్సిందే ........
" అక్కయ్యను గట్టిగా చుట్టేసి ఘాడమైన నిదేవులోఉన్న మా మంచి అన్నయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , పెద్దమ్మచే ఉంచబడిన డ్రెస్సెస్ - టవల్ అందుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాత్రూమ్స్లో రెడీ అయ్యి మీరు లేచారేమోనని అన్నయ్యా - అక్కయ్యా ....... అంటూ పరుగునవచ్చి , ఇంకా నిద్రపోతుండటం చూసి సైలెంట్ అయిపోయాము . అక్కయ్యా అక్కయ్యా ....... ఫ్లైట్ టైం అవుతోంది ఇప్పుడెలా ?.
అక్కయ్య : పాపం తమ్ముడు కాసేపుకూడా నిద్రపోలేదు చెల్లెళ్ళూ ...... , లేపడం ఇష్టం లేదు .
చెల్లెళ్లు : నో నో నో లేపకండి , పోనీ అన్నయ్య లేచేంతవరకూ మా ఒడిలో పడుకోబెట్టుకుంటాము - మీరువెళ్లి రెడీ అవ్వండి . 
అక్కయ్య : చెల్లెళ్ళూ ...... తమ్ముడిని వదిలి ఇక్కడనుండి లేవబుద్ది కావడం లేదు అంటూ ప్రాణమైన ముద్దుపెట్టారు . 
అంతలో మమ్మీ వచ్చి , నువ్వు వదిలినా ...... నీ తమ్ముడు వదిలేలా లేడులే చెల్లీ ...... , చూడు నీ నడుముచుట్టూ ఎలా లంకె వేశాడో ...... అని చేతులు తియ్యడానికి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది అంటే నమ్మండి .
మన దేవత వచ్చి , అక్కయ్య కురులపై ముద్దుపెట్టి రెడీ అయ్యారు .
అంతలో బామ్మలు వచ్చి , చిట్టితల్లీ ...... మేము , మా ఒడిలో పడుకోబెట్టుకుంటాము నువ్వెళ్ళి రెడీ అవ్వు ...... 
మాకే ఆ అదృష్టం లేదు ఇప్పుడు మీరు వచ్చారా బామ్మలూ ....... , అన్నయ్య ...... అక్కయ్యను - అక్కయ్య ...... అన్నయ్యను వదిలితేనే కదా ........
మిస్సెస్ కమిషనర్ : ఫ్లైట్ టైం అవుతోంది చెల్లీ ...... , అక్కాతమ్ముళ్ళు స్నానం చెయ్యాలికదా .......
అక్కయ్య : అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... నాకు ఇలానే ఉండిపోవాలని ఉంది . చూడండి ఎంత ముద్దుగా నిద్రపోతున్నాడో మన బుజ్జిదేవుడు .......
ఆ మాటకు దేవత వచ్చి ముద్దుపెట్టిన చోటనే చిరుకోపంతో మొట్టికాయవేశారు .
అక్కయ్య : బుజ్జిహీరో బుజ్జిహీరో ...... అంటూ నవ్వుకున్నారు . 
మా అక్కయ్య కోరిక మేము తీరుస్తాముకదా ...... , డాడీ డాడీ ....... ప్లీజ్ ప్లీజ్ ఏమిచేస్తారో తెలియదు నెక్స్ట్ ఫ్లైట్ కు టికెట్స్ బుక్ చెయ్యండి అని లాక్కునివచ్చాము .
డాడీ : ఎందుకన్నది కావ్యను చూస్తే సగం అర్థమైపోతోంది - మిగతా సగం అర్థం కావాలి .
డాడీకి మొత్తం వివరించాము .
డాడీ : ఓస్ ఇంతేనా ....... , మనం ప్రయాణించబోతున్నది ప్యాసెంజర్స్ అందరితో కలిసి సాదా సీదా ఫ్లైట్లో కాదు ఏంజెల్స్ ...... , మీ అన్నయ్య బుజ్జిదేవుడు - మీ మేడం - మీ అక్కయ్య మరియు మీ డాడీ కోసమని ప్రెసిడెంట్ ఆఫీస్ స్వయంగా మోస్ట్ లగ్జరీయోస్ స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ నిన్న రాత్రే పంపించారు , ఫ్లైట్ చూసేకదా నేను కంట్రోల్ ఆఫీస్ కు వెళ్లినది - మీ అన్నయ్య తగు నిద్రతో ఆవలిస్తూ లేచినప్పుడే మీ అన్నయ్య , అక్కయ్య ...... ఫ్లైట్లో ఫ్రెష్ అవ్వవచ్చు ok నా ...... ? .
యాహూ ....... అంటూ కేకలువెయ్యబోయి నోటికి తాళం వేసేసుకున్నాము అన్నయ్యా ....... "

ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు మొదటిసారే ఇంతటి లగ్జరీయస్ ఫ్లైట్లో ప్రయాణించేలా చేసినందుకు లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యా యాహూ యాహూ ....... అంటూ కేకలువేసి ముద్దులవర్షం కురిపించారు.
లవ్ యు టూ చెల్లెళ్ళూ ....... , థాంక్యూ కమిషనర్ సర్ .......
కమిషనర్ సర్ : నేనూ - మీ మేడం కూడా ఫ్లైట్ ఎక్కడం ఇదే తొలిసారి బుజ్జిహీరో ....... , ఒక చిన్న సెక్యూరిటీ అధికారి స్టేషన్లో ఒక టేబుల్లో కూర్చుని డ్యూటీ చెయ్యాల్సిన నన్ను ఏకంగా సిటీకే బాస్ ను చేసి ఇప్పుడు ఏకంగా ప్రెసిడెంట్ ను కలిసేలా చేసావు , కౌగిలించుకుని అమాంతం పైకెత్తి తిప్పాలన్నంత ఆనందం కలుగుతోంది కానీ నీ చెల్లెళ్లు ........
చెల్లెళ్లు : డాడీ అక్కడే ఆగిపోండి ఇంకా మాకే ముద్దులుపెట్టనేలేదు .

చెల్లెళ్ళూ - కమిషనర్ సర్ ....... , బుజ్జిహీరో ఏమో మిమ్మల్ని - మీరేమో బుజ్జిహీరోను తెగ పొగిడేస్తున్నారు , ఆ పొగడ్తలన్నీ చెందాల్సినవి చేరాల్సినవి ఎక్కడో ఉన్న బుజ్జిదేవుడికి ........ , మళ్లీ చెబుతున్నాను బుజ్జిదేవుడు ఎవరెస్ట్ ..... ఈ బుజ్జిహీరో ....... చిన్న కొండ మాత్రమే అదికూడా అల్లరి కొండ ......
చెల్లెళ్లు - అక్కయ్య నవ్వుకున్నారు .

ఏమి ముద్దులు చెల్లెళ్ళూ ....... అని అడిగి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : ఆహా ...... ఏమీ ఎరుగనట్లు ఎలా అడుగుతున్నారో ....... , ముద్దుల గురించి రాత్రి ఒక డీల్ కు వచ్చాముకదా అక్కయ్యా .......
ముద్దుల డీల్ ఏమిటి చెల్లెళ్ళూ ........
అంతే చెల్లెళ్ళంతా నావైపు రుసరుసలాడుతూ చూస్తున్నారు .
చెల్లెళ్ళూ ....... why angry అంటూ బుజ్జి బుగ్గలపై స్పృశిస్తూ బుజ్జగిస్తున్నాను .
హమ్మయ్యా ....... యాహూ అట్లాస్ట్ ప్రాణమైన అన్నయ్యపై చెల్లెళ్లు కోప్పడటం చూస్తున్నాను నా జన్మ ధన్యం అయ్యింది అన్నారు మిస్సెస్ కమిషనర్ .
అందరూ నవ్వుతున్నారు .
చెల్లెళ్లు : నో నో నో మా అన్నయ్యపై మేము కోప్పడటం ఏమిటి అంటూ ముద్దులవర్షం కురిపిస్తున్నారు . అన్నయ్యా ....... మమ్మీకి ఇలా మాట్లాడే అవకాశం మీరే ఇచ్చేలా చేశారు .
నేనా చెల్లెళ్ళూ ....... ? , అవునవును నేనే చేసిఉంటాను - లేకపోతే మా బంగారాలకు కోపం ఊరికనే వస్తుందా ..... ? , sorry లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ - ఇంతకీ ఏమిచేసాను చెల్లెళ్ళూ ........
దేవత : సరిపోయారు ....... , అన్నయ్యకు చెల్లెళ్లు బిల్డప్ ఇవ్వడం - చెల్లెళ్లకు అన్నయ్య బిల్డప్ ఇవ్వడం ........
అక్కయ్య : అవును అక్కయ్యా ...... అంటూనే మా అందరి వైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
చెల్లెళ్లు : రాత్రి ఏమిచేసారో అప్పుడే మరిచిపోయారా అన్నయ్యా ........
ఏమిచేశాడు ఏమిచేశాడు తల్లులూ - బుజ్జితల్లులూ ........ , చిట్టితల్లీ - చెల్లీ ....... ఒడిలో పడుకోబెట్టుకోవడమే కాకుండా రాత్రి నీ తమ్ముడితో మరేదో ......... అని అక్కయ్య చెవిలో గుసగుసలాడారు బామ్మలు - మిస్సెస్ కమిషనర్ .
అక్కయ్య : అందరి నోళ్ళను చేతులతో మూసి , తప్పు తప్పు ....... మొదట అక్కయ్య తరువాతనే నేను .
మిస్సెస్ కమిషనర్ : ప్చ్ ....... పో చెల్లీ ....... వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నావు - మీ అక్కయ్య ఎప్పుడు నిజం తెలుసుకోవాలి ఎప్పుడు బుజ్జిదేవుడిని కౌగిలిలోకి తీసుకుని ..........
అక్కయ్య : ష్ ష్ ష్ ...... అక్కయ్యా ...... , మనసులో అనుకుని బయటకు మాట్లాడేస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : అలాగైనా నీ అక్కయ్య తెలుసుకుంటే మంచిది కాదా .......
దేవత : ఏమి తెలుసుకుంటే మంచిది అక్కయ్యా ........ ? .
అక్కయ్య : నో నో నో అక్కయ్యా ....... అంటూ మిస్సెస్ కమిషనర్ నోటిని మూసేస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : అదీ అదీ ....... అంటూ అక్కయ్యను విడిపించుకుని వెళ్లి దేవత ప్రక్కన చేరారు .
అక్కయ్య : అక్కయ్యా నో ........
దేవత : చెప్పండి అక్కయ్యా .......
మిస్సెస్ కమిషనర్ : నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది అవంతికా కాదు కాదు బ్యూటీ తమన్నా ....... , ఏదైనా మా అక్కయ్యనే ఫస్ట్ పొందాలి - ఆస్వాదించాలి అని అంటోంది నీ చెల్లి కావ్య కాదు కాదు కృతి ...... , నువ్వంటే అంత ప్రాణం నీ చెల్లికి .......
దేవత : లవ్ యు చెల్లీ ...... అంటూ లేచి వచ్చి అక్కయ్య బుగ్గలను ప్రాణంలా అందుకుని ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టారు .
ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు . మళ్లీ ఒకసారి ఓకేఒక్కసారి చూడాలని అనుకునేంతలో .........
అక్కయ్యలూ అక్కయ్యలూ ....... వన్స్ మోర్ వన్స్ మోర్ ప్లీజ్ అంటూ సర్ మొబైల్ చూయించారు పిక్ కోసం ........
లవ్ యు చెల్లెళ్ళూ ...... 
దేవత పెదాలపై తియ్యదనంతో అక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
Wow సూపర్ ........ ఆనందించాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 28-01-2022, 10:25 AM



Users browsing this thread: 28 Guest(s)