Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
థాంక్యూ బుజ్జిహీరో - లవ్ యు తమ్ముడూ - లవ్ యు soooo మచ్ అన్నయ్యా ....... అంటూ కిందకుదిగారు దేవత - అక్కయ్య - చెల్లెళ్లు ...... , చూసార హాసినీ ...... మీ మమ్మీ , మీ డాడీని వదలనే వదలడం లేదు చీకటి పడింది కదా అంటూ దేవత - అక్కయ్య నవ్వుకున్నారు , అక్కయ్యా - చెల్లీ ...... లోపలికి లాక్కునివెళ్లేంత కసితో ఉన్నట్లున్నారు .

కమిషనర్ సర్ : శ్రీమతిగారూ ....... కంట్రోల్ రూమ్ దాకా వెళ్ళిరావాలి వధులుతారా ? .
మిస్సెస్ కమిషనర్ ఇప్పుడా ప్చ్ ...... అనేంతలో , ఇప్పుడా నో నో నో కమిషనర్ సర్ పాపం మాఅక్కయ్య చూడండి ఎంతో ఆశతో ఉన్నారు .
మిస్సెస్ కమిషనర్ : అవునవును ...... , పోండి చెల్లెళ్ళూ సిగ్గేస్తోంది .
దేవత - అక్కయ్య : నిన్న కొత్తగా రుచి చూయించి ఆశలు కల్పించి ఇలా మాంచి చలిలో వదిలివెళ్లడం న్యాయమా సర్ ....... అంటూ నవ్వుకుంటున్నారు .
మిస్సెస్ కమిషనర్ సర్ గుండెల్లో తలదాచుకుని అవునన్నట్లు సిగ్గులోలికిపోతున్నారు .
కమిషనర్ సర్ నవ్వుకుని , శ్రీమతిగారూ ....... soooo sorry తప్పకుండా వెళ్లాల్సిందే - మనం రేపు ఢిల్లీ వెళుతున్నాము కదా సిటీ కంట్రోల్ ను కిందిస్థాయి సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పగించాలి - బిరియానీ రెడీ అని మెసేజ్ రాగానే కోస్టల్ సిటీస్ నుండి వచ్చిన ఆఫీసర్స్ ను వదిలి వచ్చేసాను , వారిని కలవాలి - ఎంత సమయం పడుతుందో చెప్పలేను కాబట్టి ఈ ముద్దుతో సర్దుకుని హాయిగా నిద్రపోండి అంటూ పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టి సెక్యూరిటీ అధికారి వెహికల్లో వెళ్లిపోయారు .
మిస్సెస్ కమిషనర్ : ప్చ్ ...... అంటూ వెహికల్ మెయిన్ గేట్ దాటిపోయేంతవరకూ ఆశతో చూస్తున్నారు .
దేవత - అక్కయ్య : ముద్దునే తలుచుకుంటూ ........ అంటూ నవ్వుకుని , గుడ్ నైట్ అక్కయ్యా ...... మాకూ కాస్త పని ఉంది .
మిస్సెస్ కమిషనర్ : ఈ మొగుళ్లు ఎప్పుడూ ఇంతేలే కానీ , చెల్లెళ్ళూ ....... అందరికీ ఆ ఇంటిలో సరిపోదు కాబట్టి అందరమూ మన పెద్ద ఇంట్లోనే పడుకుందాము రండి - కావాలంటే తెల్లవారుఘాముననే రెడీ అవ్వడానికి వెళ్ళవచ్చు - గుర్తుందికదా 5 గంటలకు ఫ్లైట్ ...... , తల్లీ హాసినీ ..... మీఅన్నయ్యను - ఫ్రెండ్స్ ను లోపలికి పిలుచుకునివెళ్లు , బామ్మలూ రండి రండి ..... , చెల్లెళ్ళూ - తల్లులూ ...... మీకోసం - మీ ప్రాణమైన అన్నయ్య కోసం టాప్ ఫ్లోర్లో ఉన్న పెద్ద రూంమొత్తం బెడ్స్ వేయించారు మోస్ట్ లగ్జరీగా మార్పించారు మీ సర్ ..... , ఎలాగైనా ఎంతమందైనా హాయిగా పడుకోవచ్చు .
దేవత - అక్కయ్య : సర్ వెల్లుపోయారు కాబట్టి మా అందరినీ ఆహ్వానిస్తున్నారు లేకపోతే మా అందరినీ ఆ చిన్న ఇంట్లోనే అడ్జస్ట్ అవ్వమని డోర్స్ వేసేసుకునేవాళ్ళు కదా అక్కయ్యా .......
మిస్సెస్ కమిషనర్ : ఆదైతే నిజమే చెల్లెళ్ళూ ...... అంటూ ఇద్దరినీ కౌగిలించుకుని సిగ్గుపడుతున్నారు .
దేవత - అక్కయ్య : అమ్మో అమ్మో ...... సరేలే ఇప్పటికే సర్ వెళ్లిపోయారని విరహంతో ఉన్నారు - మరింత కవ్వించడం బాగోదు - అక్కయ్యా ...... కరెక్షన్ పేపర్స్ తీసుకొస్తాను వన్ మినిట్ .......
అక్కయ్య : అక్కయ్యా ...... నేనూ వస్తాను అంటూ చేతిని అందుకున్నారు .

హాసిని : అన్నయ్యా - ఫ్రెండ్స్ ....... రండి , డాడీ ......ఎలా రెడీ చేయించారో చూద్దాము .
చెల్లెళ్ళూ ....... ఒకసారివెళ్లి డ్యూటీ పరిస్థితి చూసి వచ్చేస్తాను .
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ........
అక్కయ్య : గుమ్మం దగ్గరవరకూ వెళ్లి , అక్కయ్యా ఒక్కనిమిషం అంటూ 0పరుగునవచ్చారు - బుగ్గలను అందుకుని మేము పేపర్స్ తీసుకుని పైకివెళ్ళేలోపు వచ్చేయ్యాలి సరేనా .......
మాక్సిమం ట్రై చేస్తాను అక్కయ్యా ....... , ఉదయం నుండీ లేను కదా అక్కడ పరిస్థితి ఎలా ఉందో - మురళి ఎంత కోపంతో ఉన్నాడో .......
మిస్సెస్ కమిషనర్ : ఎంత ఆలస్యమైనా పర్లేదు ఇక్కడికే రావాలి బుజ్జిహీరో ...... , లేకపోతే మీసర్ రాగానే మేమంతా అక్కడికే వచ్చేస్తాము .
అక్కయ్య - చెల్లెళ్లు : అవునవును .......
ఎలాగైనా వచ్చేస్తాను మేడం - అక్కయ్యా - చెల్లెళ్ళూ .......
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ...... , త్వరగా వెళ్లు మరి ......
మీరందరూ లోపలకువెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నాక వెళతాను - బామ్మలూ , చెల్లెళ్ళూ ....... చలివేస్తోంది లోపలకు వెళ్ళండి .
లవ్ యు sooooo మచ్ తమ్ముడూ - అన్నయ్యా ...... అంటూ అక్కయ్య - చెల్లెళ్లు హత్తుకుని ముద్దులుపెట్టారు .

అక్కయ్య ...... దేవతతోపాటువెళ్లి పేపర్స్ తీసుకుని చిన్న ఇంటికి తాళం వేసివచ్చారు .
దేవత : బుజ్జిహీరో ...... తొందరగా వచ్చెయ్యి - డ్రెస్ వేసుకుని ఉంటే బాగుండేది చలి ఎక్కువగా ఉందికదా ఓణీ ఇచ్చేదానిని .......
అక్కయ్య : నా ఓణీ ఉంది కదా అక్కయ్యా అంటూ దేవత చీరకొంగులోకివెళ్లి ఓణీని తీసి నాకు చుట్టారు .
ఆఅహ్హ్ ...... మా అక్కయ్య అంత కేరింగ్ - వెచ్చగా ఉంది , లవ్ యు అక్కయ్యా - మేడం ....... , లోపలికివెళ్లండి ........
అక్కయ్య : తమ్ముడూ ...... తొందరగా వచ్చెయ్యి అంటూ నా చేతిని గుండెలపై హత్తుకుని ముద్దుపెట్టి వదిలారు .
మా ప్రాణమైన వారందరికీ వచ్చి గుడ్ నైట్ చెబుతాను .
చెల్లెళ్లు : అక్కయ్యలూ ...... మనం తొందరగా లోపలికివెళ్లి డోర్ వేసుకుంటే , అన్నయ్య అంత త్వరగా వెళ్లివస్తారు .
అవునవును అంటూ అక్కయ్య - దేవత ...... చెల్లెళ్లతోపాటు లోపలికివెళ్లి , బుజ్జిహీరో ...... మెసేజ్ పెట్టు క్షణంలో డోర్ తీస్తాము అనిచెప్పి క్లోజ్ చేసుకున్నారు .
అటూ ఇటూ నిర్మానుష్యన్గా ( సర్కిల్స్ - రోడ్లలోనే జనాలు తిరగడం లేదు ) ఉండటం చూసి నిర్భయంగా లోపలికి నడిచాను .

అక్కయ్య ఓణీ నుండి వస్తున్న ఒంటి సువాసన వలన అక్కయ్య ప్రక్కనే ఉన్నారా అన్న ఫీల్ కలుగుతోంది . లవ్ యు అక్కయ్యా ...... అంటూ పెదాలపై తియ్యదనంతో ఓణీ సువాసనను మరింత పీలుస్తూ వెచ్చగా మురళీ ఇంటికి చేరుకున్నాను - 9:45 కే ఫ్రెండ్స్ అందరూ నిద్రపోయినట్లు అన్నీ బిల్డింగ్స్ లైట్స్ స్విచ్ ఆఫ్ అయిఉన్నాయి .
Hi తమ్ముడూ మహేష్ ...... అంటూ గేట్స్ తెరిచాడు సెక్యూరిటీ అన్నయ్య .
అన్నా అన్నా ...... సౌండ్ సౌండ్ అంటూ ఆపాను . అన్నయ్యా ...... మురళి - మేడం ఎవరైనా ఆడిగారా ? .
సెక్యూరిటీ : నాకు తెలిసి లేదు తమ్ముడూ ...... , ఉదయం నుండీ మురళి - మేడం గారు అయితే బయటకు వచ్చినట్లే నేను చూడలేదు , కానీ సర్ మాత్రం కంగారు - బాధ - కన్నీళ్ళతో అటూ ఇటూ తిరగడం మాత్రం చూసాను . మరింత ఆశ్చర్యం ఏమిటంటే లగ్జరీ కార్లలో తిరిగే సర్ కారులో వెళ్లి ఆటోలో వచ్చారు - లోపల మూడు కార్లలో ఒక్క కారు కూడా లేదు కానీ ముగ్గురూ లోపలే ఉన్నారు .
అది ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే అన్నా ...... , కారు లేకుండా సర్ - మేడం గేట్ కూడా దాటడం చూడలేదు .
సెక్యూరిటీ : అవునుకదా ...... మరి కార్లు ఏమైనట్లు , కొద్దిసేపటిముందు సర్ ...... ఆటో దిగి లోపలికి కన్నీళ్ళతో వెళ్లడం మరిచిపోలేకపోతున్నాను , వెళుతూ వెళుతూ ఇంత డబ్బుని ఇచ్చివెళ్లారు , మురళి - మేడం ...... కాస్త కోపం ప్రదర్శిస్తారు కానీ సర్ ..... చాలా మంచివారు , జీతం డబ్బులుకాకుండా extraa డబ్బులు ఇచ్చేవారు కానీ పర్సులో ఉన్నదంతా ఇచ్చేసి బాధపడుతూ లోపలికివెళ్లిపోయారు - ఉదయం తిరిగి ఇచ్చేస్తాను .
సర్ వాళ్లకేమి తక్కువ అన్నా ...... , పిల్లలకు ఏమైనా use అయ్యేది తీసుకెళ్లండి .
సెక్యూరిటీ : అలాగే తమ్ముడూ ...... నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను - పిల్లలు ఎప్పటినుండో కంప్యూటర్ అడుగుతున్నారు .
కంప్యూటర్ కాదు కానీ లాప్టాప్ ఇప్పించండి మరింత use అవుతుంది - ఈ డబ్బుతో RAM - ROM కెపాసిటీ తక్కువగల లాప్టాప్ వస్తుంది . ఈ డబ్బుతోకూడా అంటూ పర్స్ తీసిచూస్తే ఒక్కరూపాయికూడా లేదు - పెదాలపై చిరునవ్వులతో పర్సు జేబులో పెట్టుకుని పెద్దమ్మను తలుచుకుని మళ్లీ పర్స్ తీసి డబ్బుల కట్టను అన్నకు అందించాను - అన్నా ...... పిల్లలకు తెలుసులే వాళ్ళను షాప్ కు పిలుచుకునివెళ్లి కోరిక లాప్టాప్ కొనివ్వండి .
సెక్యూరిటీ : తమ్ముడూ మహేష్ ........
ఉంచుకో అన్నా ...... మనం మనం సహాయం చేసుకోకుంటే ఎలా ..... ? , సరి సరే ...... నేను కొత్తగా వచ్చిన సెక్యూరిటీ అధికారి కమిషనర్ ఇంటిలో ఉంటాను - నా గురించి అడిగితే ఒక్కకాల్ చెయ్యండి వచ్చేస్తాను .
అలాగే తమ్ముడూ అంటూ ఉద్వేగానికి లోనయ్యి కౌగిలించుకుని , సెక్యూరిటీ రూంలోకివెళ్లాడు .

థాంక్యూ సో మచ్ పెద్దమ్మా ........ సెక్యూరిటీ అన్న సంతోషం వెలకట్టలేనిది .
మెసేజ్ ........
పెదాలపై చిరునవ్వుతో మొబైల్ తీసి చూసాను - అంతే కంగారుపడుతూ వెనక్కుతిరిగి మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నాను - లాక్ చేసి ఉండటంతో గేట్ ఎక్కి దూకి పరుగున మురళి ఇంటి డోర్ దగ్గరకువెళ్లి , మేడం - సర్ - మురళి సర్ అంటూ గట్టిగట్టిగా కొట్టాను .
ఆ సౌండ్ కు సెక్యూరిటీ ...... సెక్యూరిటీ రూంలోనుండి వచ్చి , ఎవర్రా అది అని కేకలువేశాడు .
అన్నా ...... నేను మహేష్ ని ......
సెక్యూరిటీ : తమ్ముడూ మహేష్ ఏమైంది ? అంటూ వచ్చాడు .
అన్నా ...... తొందరగా డోర్స్ బద్ధలుకొట్టాలి . 
సెక్యూరిటీ : తమ్ముడూ ...... ఏమంటున్నావు ? .

అంతలో డోర్ తెరుచుకుంది . సర్ - మేడం ...... చెంపలన్నీ కన్నీళ్ళ గుర్తులు , తుడుచుకుని తలుపులు తీసినట్లు తెలిసిపోతోంది .
సర్ - మేడం : సెక్యూరిటీ - మహేష్ ...... అంటూ కోప్పడుతున్నారు .
మేడం గారూ - సర్ ...... చాలా దాహంగా ఉంది , ఔట్ హౌస్ లో చుక్క నీరు లేదు అంటూ వాళ్ళను ప్రక్కకుజరిపి సోఫాలదగ్గరికి పరుగుతీసాను . టీపాయ్ పై కనిపించకపోవడంతో సోఫాల వెనుక వెళ్ళిచూస్తే నిండుగా వాటర్ ఉన్న రెండు గ్లాస్ లు ఉన్నాయి . రెండుచేతులతో తీసుకుని హమ్మయ్యా ...... వీటితో నా దాహం తీరిపోతుంది అంటూ తాగేంతలో ...... 
మహేష్ మహేష్ ...... అంటూ సర్ - మేడం పరిగెత్తుకుంటూ వచ్చి గ్లాసులను కిందపడి పగిలిపోయేలా చేశారు .
దాహం వేస్తోంది నీళ్లు తాగడం తప్పా సర్ .......
సర్ : ఆ నీళ్లు నువ్వు దాహం తీర్చుకోవడానికి కాదు మహేష్ ......
మరి మీరు ప్రాణాలు తీసుకోవడానికా సర్ - మేడం ........
ఇద్దరితోపాటు సెక్యూరిటీ షాక్ లో ఉండిపోయాడు .

ఎంత బాధ - కష్టం కలిగి ఉంటే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారో అర్థం చేసుకోగలను , మీకు చెప్పేటంత వయసు - అనుభవం నాకు లేదు కానీ మేడం నేను నాతోపాటు అనాధలు అంతకంటెక్కువ కష్టాలు - బాధలు - అవమానాలు భరిస్తూనే ఉంటారు . నేనూ ...... వాటన్నింటినీ అనుభవించి మీముందు ఇలా దైర్యంగా ఉండటానికి మేడం గారూ ఒక కారణం - నేను ఇక్కడికి వచ్చినరోజు వరకూ నా డ్రెస్ ను చూసి అందరూ అసహ్యించుకున్న వాళ్ళు - పని అడిగినా తోసేసిన వాళ్లే ..... కానీ మీరు కూడు , గుడ్డ , పని ఇచ్చి ఆదుకున్నారు . అనాధలా పెరగడం ఎంత కష్టమో మీకు తెలియదు - మీరు ప్రాణాలు తీసుకుని పైన నుద్రపోతున్న నా ఫ్రెండ్ ను అనాధను చేసేస్తారా ...... ? మేడం - సర్ ........ , మీరు ఔనన్నా నేను ఒప్పుకోను - మురళి సర్ చిన్న కష్టానికే విలవిలలాడిపోతాడు - తన తల్లిదండ్రులు ఉన్నారులే అని హ్యాపీగా జీవిస్తున్నాడు . రాత్రికిరాత్రి క్షణికావేశంలో మీరు తీసుకున్న నిర్ణయం ఆ సంతోషమైన జీవితాన్ని మాయం చేసి అనాధలా మార్చేస్తుంది - అనాధ కష్టాలు ఏమిటో ఇన్నిరోజులూ నన్ను చూసే ఉంటారు కదా .......
మేడం : లేదు లేదు మహేష్ - నాన్నా మురళీ sorry లవ్ యు లవ్ యు అంటూ పరుగున పైకివెళ్లారు .

సర్ ....... కష్టాలు అందరికీ వస్తాయి - ఎవరికష్టం వారికి పెద్దది - ప్లీజ్ ప్లీజ్ సర్ ...... నా ఫ్రెండ్ ను మాత్రం నాలా అనాధను చెయ్యకండి అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాను .
సెక్యూరిటీ : సర్ సర్ ...... మిమ్మల్ని ఎప్పుడూ దర్జాగా ఉండటం చూసాను - ఈరోజు ఉదయం నుండీ బాధతో ఉండటం చూస్తున్నాను - నాకు అడిగే అర్హత లేదు కానీ మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను - ఏమైంది సర్ ........
కన్నీళ్ళతో సోఫాలో కూర్చున్నారు సర్ ....... - నా బిడ్డను అనాధకాకుండా సేవ్ చేశారు - సర్వం కోల్పోయాను ...... రేపు తెల్లవారగానే బ్యాంక్ వాళ్ళు మానాన్నగారు చివరి శ్వాసను వదిలిన ఈ ఇంటిని వేలం వేయడానికి వస్తున్నారు - ఇప్పటివరకూ ఏ ఒక్కరినీ మోసం చెయ్యకుండా మా తరతరాల నుండి మా నాన్నగారు ...... కష్టపడి అట్టడుగు స్థాయి నుండి ఒక స్థాయికి చేర్చిన కంపెనీని మరింత బిల్డ్ చేసి గౌరవంతో బ్రతికాను , సర్వం కోల్పోయి అందరిముందు కట్టుబట్టలతో బయటకు వెళ్లడం కంటే చావే నయం అనుకున్నాము - మా బిడ్డ పరిస్థితి ఆలోచించలేదు .
సర్ ....... వయసుకు మించి మాట్లాడుతున్నాను మన్నించండి - సర్ ...... డబ్బుంటేనే జీవితం కాదు - ఇన్నేళ్లు హ్యాపీగా జీవించారు హై జీవితాన్ని చూసేశారు - ఇప్పుడు కిందిస్థాయి జీవితాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా ఆస్వాదించండి - మీ నాన్నగారు ...... మీకు ఎలాగైతే లగ్జరీ లైఫ్ ఇచ్చారో ఇకనుండీ మీరు కష్టపడి మీ కొడుకుకు నా ఫ్రెండ్ కు అలాంటి లైఫ్ ఇవ్వండి - వేలం వేసిన మీ ఇంటిని మళ్లీ దక్కించుకుని గర్వపడుతూ ఎంటర్ అవ్వండి .
సర్ : ఇంత చిన్నవయసులోనే చాలా చాలా పరిణితితో చెప్పావు మహేష్ ..... , కష్టపడటం నాకు ఇష్టమే మహేష్ కానీ దారుణంగా మోసపోయాను - నమ్మినవాళ్లే నన్ను మోసం చేసేసారు - నమ్మకస్థులుగా ఉంటారని నా స్నేహితులను పార్ట్నర్స్ గా పెట్టుకుంటే మందు మైకంలో నాతో సంతకాలు పెట్టించుకుని కంపెనీతోపాటు ఆస్థులన్నీ రాయించుకోవడమే కాక లాభాలన్నీ వాళ్ళ పేర్లపై రాయించుకుని నష్టాలను మాత్రం నాపేరున మార్చి ముంబైకు చెక్కేశారు అంటూ బాధపడుతున్నారు - నా వలన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వేల మధ్యతరగతి కుటుంబాలు ఈ విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్నా చేసుకుంటారు - ప్రాణాలతో ఉండి ఆ పాపం మూటకట్టుకోవడం కంటే ప్రాణాలోదలడమే ఉత్తమం అనుకున్నాము అంటూఒక ఫైల్ ను టీపాయ్ పై ఉంచి పాయిజన్ బాటిల్ ను పగలగొట్టారు - నాన్నా మురళీ క్షమించు మళ్లీ ఇలాచెయ్యము .

జల్సాల వలన ఆస్తిని పోగొట్టుకున్నారని తప్పుగా అర్థం చేసుకున్నాను sorry సర్ - మోసపోయారన్నమాట అంటే మిమ్మల్ని ...... మీ పార్ట్నర్స్ మోసం చేసి ఆత్మహత్య చేసుకునేలా చేసారన్నమాట - దైవం పెద్దమ్మ వలన సమయానికి వచ్చాను - మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది .
పైనుండి మేడం వచ్చారు .
సర్ : మురళి .......
మేడం : డిస్టర్బ్ చెయ్యలేదండీ నిద్రపోతున్నాడు . 
మేడం మేడం ....... ఈ విషయం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తెలియనివ్వకండి తెలిస్తే బాధపడతాడు - నా ఫ్రెండ్ ఏడవడం నేను చూడలేను .
మేడం : నేను - మురళీ ...... నువ్వు చిన్నపిల్లాడు అనికూడా చూడకుండా కటువుగా ప్రవర్తించాము అయినాకూడా మురళికోసం నువ్వు బాధపడుతున్నావు - నీది గొప్పమనసు మహేష్ ...... - ఉదయం మురళికి ఎలాగో తెలవకుమానదు .
ఫ్రెండ్ కోప్పడినా - కొట్టినా ...... ఫ్రెండు ఫ్రెండే , ప్రతీ ఫ్రెండూ అవసరమే - ఇక పాయిజన్ విషయం జీవితంలో తెలియదు మేడం ....... - మీరుణం తీర్చుకునే అవకాశం ఆ దైవం వలన నాకు లభించింది - మీరు వెళ్లి నా ఫ్రెండ్ తోపాటు పడుకోండి , తెల్లవారాక జరిగే మ్యాజిక్ చూడండి అంటూ ఫైల్ అందుకున్నాను - సర్ ఫైల్ లోని మ్యాటర్ గురించి నాకు తెలియదు , మిమ్మల్ని మోసం చేసిన పార్ట్నర్స్ గురించి తెలుసుకోవాలని తీసుకున్నాను ఎందుకంటే మన సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ సర్ కు మనమంటే ఒక లైకింగ్ .......
సర్ : అవునా మహేష్ ...... నా మాటలను నమ్మినట్లు ...... , పూర్తి సమాచారం ఉంది మహేష్ అని బదులిచ్చారు .
థాంక్యూ సర్ ....... , సర్ ...... ఇక మీ పార్ట్నర్స్ సంగతి నాకు వదిలెయ్యండి వెళ్లి నా స్నేహితుడు ప్రక్కన పడుకోండి , ఇంతకూ మరొక పాయిజన్ బాటిల్ లేదుకదా ........
సర్ : లేదు లేదు మహేష్ .......
ఎందుకైనా మంచిది సెక్యూరిటీ అన్నా ఇక్కడే పడుకోండి . సర్ ...... అన్న లోపల ఉండటం మీకు .......
మేడం : ఈరోజుతో పూర్తిగా మారిపోయాము మహేష్ ...... , యజమాని - పనివాడు , రాజు - పేద అందరూ సమానమే ....... , చావుదాక వస్తేనేకానీ మాకీవిషయం తెలియరాలేదు .
మేడం గారూ ....... ఆ విషయం మరిచిపోండి అనిచెప్పానుకదా ....... , వెళ్లి కమిషనర్ సర్ ను కలుస్తాను - గుడ్ నైట్ ........
మహేష్ - మహేష్ ....... అని ఆప్యాయంగా పిలిచి కన్నీళ్ళతో కౌగిలించుకున్నారు . నిమిషమైనా వదలకపోవడంతో ...... సర్ - మేడం ...... మీరు ఇలా నన్ను ఆప్యాయతతో ఆలస్యం చేసేకొద్దీ మిమ్మల్ని మోసం చేసిన మీ పార్ట్నర్స్ మరింత మిస్ అయ్యే అవకాశం ఉంది , పైగా సెక్యూరిటీ అధికారి కంట్రోల్ ఆఫీస్ కు వెళ్లిన సర్ దగ్గరికి వెళ్ళాలి చలి చంపేస్తోంది .
సర్ : డ్రైవర్ కారు ..... తియ్యి అనబోయి బాధతో తలదించుకున్నారు . 
సర్ ....... తెల్లవారులోపు మీకు సంబంధించినవన్నీ మీ చెంతకు చేరుతాయి అనిచెప్పి బయలుదేరాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 28-01-2022, 10:23 AM



Users browsing this thread: 20 Guest(s)