Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
సిస్టర్స్ కంగారుపడుతూ నాదగ్గరికి వచ్చారు . అన్నయ్యా ..... ముహూర్తం దగ్గరపడుతోంది ఏమి జరుగబోతోందో ఏమో .......
ఏమైంది సిస్టర్స్ ....... ముహూర్తానికి ఇంకా రెండు గంటలు ఉందికదా ......
సిస్టర్స్ : అంతలోపు పెళ్లికూతురిని హీరోలా వెళ్లి తీసుకువచ్చేదేవరు ? - పెద్దయ్య ఏమో కదలలేని పరిస్థితి - ఆ మాన్స్టర్ ధైర్యం చేస్తాడో లేడో .......
నాకేమీ అర్థం కావడం లేదు సిస్టర్స్ .......
సిస్టర్స్ : చెప్పానుకదా అన్నయ్యా ...... చుట్టుప్రక్కల ఉన్న పాతికకు పై గ్రామాలలో ఒక వింత ఆచారం ఉంది , ఇప్పటికీ తప్పకుండా పాటిస్తున్నారు , ఏమిటంటే ...... పెళ్లికి ముందురోజు కానీ ఇలా పెళ్లిరోజు కానీ పెళ్ళికొడుకు ఇంటిలోని మగాడు ..... పెళ్లికూతురు గ్రామానికి ఇంటికి వెళ్లి అడ్డుపడిన వారితో పోరాడి పెళ్లికూతురిని సేఫ్ గా కళ్యాణ మండపానికి తీసుకురావాలి , ఇదీ తరతరాలుగా మన గ్రామాల ఆనవాయితీ ........
అలా అక్కడ ఎవరైనా అడ్డుపడతారా ? .
సిస్టర్స్ : ఈ ప్రాసెస్ లో ఒకప్పుడు రక్తం ఏరులై పారి జరిగిన పెళ్లిళ్లు కూడా ఉన్నాయి అన్నయ్యా ....... , స్నేహపూర్వకంగా మొదలై మాటా మాటతో అలా జరిగేవట .......

అంకుల్ : అదిగో పెళ్ళికొడుకు బావ వచ్చాడు . బాబూ ...... నువ్వు రెడీ కదా ? .
మాన్స్టర్ : ఎక్కడికి రా ....... ? .
సర్పంచ్ గారు : అదే బాబూ ...... మీ మావయ్యగారికి ఆక్సిడెంట్ అయ్యిందికదా , పెళ్లికూతురుని తీసుకురావాల్సిన ఆ ఇంటి ఏకైక మగాడివి నువ్వేకదా .......
మాన్స్టర్ : అనుకున్నాను అనుకున్నాను , ఏమిటీ ....... నేను ఒంటరిగా ఆ ఊరుకువెళ్లి , మొరటు నాకొడుకులు అయిన పల్లెటూరి ఆంబోతులతో పొట్లాడి పెళ్లికూతురుని తీసుకురావాలా ...... ? , భలే ఫిట్టింగ్ పెట్టారే ...... - నేనొచ్చినది టిఫిన్ చెయ్యడానికి అంతే ....... - ఆకలివేస్తోంది కాబట్టి ఇక్కడికి వచ్చాను , ఇలా నన్ను ఇరికిస్తారు అని తెలిసి ఉంటే పెళ్ళికే వచ్చేవాడిని కాదు .
సర్పంచ్ గారు : అల్లుడూ అలా అనకండి , ఇక ఆ ఇంటికి మీరేకదా వారసుడు ......
మాన్స్టర్ : వారసుడు అబ్బో ...... ఏదో పెద్ద ఆస్తిని ఇస్తున్నట్లు చెబుతున్నారే ....... , నేను ...... నేను అల్లుడు ఏమిటి ముసలోడా .......
ఊరిజనమంతా రేయ్ రేయ్ ...... అంటూ కోపంతో ముందుకొచ్చారు .
సర్పంచ్ గారు : ఆగండి ఆగండి ..... ఏదో తెలియక .......
మాన్స్టర్ : తెలిసే అన్నాను , అంత ప్రేమ ఉంటే నువ్వే వెళ్లరా ముసలోడా .......
జనం : మరొక్కసారి ఆ మాట అంటే ........
సర్పంచ్ గారు : శాంతించండి ....... , చూడు బాబూ ...... ఆచారం ఒప్పుకోదు లేకపోతే పెద్దయ్య కోసం స్కూల్ పిల్లాడు కూడా ముందుకువస్తాడు - అంతటి అదృష్టం నీకు లభిస్తోంది .
అంకుల్ : బాబూ ....... ముందులా కాదు , అన్నీ ఏర్పాట్లూ చేసేసాను , నువ్వు కారులో వెళ్లడం - ఇంటిలోకి దర్జాగా ఎంటర్ అవ్వడం - ఫ్రెండ్లీ గా అడ్డుపడిన మా అల్లుడిని అలా ప్రక్కకు లాగేసి రెడీగా ఉన్న నా కూతురిని తీసుకురావడమే - నాకు తెలిసి నా దూరపు బంధువు అల్లుడు అడ్డుకూడా రాడు ఇదిగో కాల్ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ బాబూ ........
మాన్స్టర్ : ఆహా ...... ఏమి యాక్టింగ్ చేస్తున్నారురా ఒక్కొక్కడు ఒకడేమో అల్లుడు అంటాడు మరొకడేమో బాబూ అని , అమ్మవారి గుడిలో పోతుని బలిచ్చేలా పంపిస్తున్నారు , బెంగళూరు నుండి పెళ్లికి రావడమే తప్పు టిఫిన్ వద్దు ఏమీ వద్దు అంటూనే భోజనాల దగ్గరికివెళ్లి టిఫిన్ కట్టుకుని పరుగున వెళ్ళిపోయాడు .
అందరూ ఆశ్చర్యపోయి పిరికిపంద అంటూ గుసగుసలాడుతున్నారు - సర్పంచ్ గారిని ముసలోడు అన్నందుకు కోపంతో ఊగిపోతున్నారు .
దేవత కుటుంబం ఏమీచెయ్యలేక తలదించుకుని బాధపడుతున్నారు . బుజ్జితల్లి అయితే కన్నీళ్ళతో డాడీ డాడీ ...... మావయ్య అంటూ బాధపడుతోంది .
సిస్టర్స్ ........ నేను ఒప్పిస్తాను , ఇక్కడ జరిగేది అప్డేట్ ఇవ్వండి అని బుజ్జితల్లితోపాటు వెనుకే వెళ్ళాను .

చూస్తే రోడ్డులో ఎక్కడా కనిపించడం లేదు .
బుజ్జితల్లి : డాడీ ...... మాన్స్టర్ ......
ఏకంగా భుజానికి బ్యాగు తగిలించుకుని ఆటో స్టాండ్ వైపుకు వెళుతున్నాడు .
బ్రదర్ బ్రదర్ అంటూ కేకలువేస్తూ పరుగుతీసాను .
బుజ్జితల్లి : ఆ మాన్స్టర్ ను ...... మా డాడీ , బ్రదర్ అని పిలవడం నాకు నచ్చలేదు డాడీ .......
మావయ్య పెళ్ళికోసం ఈ ఒక్కసారికి బుజ్జితల్లీ ....... అంటూ నచ్చేజెప్పి , ప్రక్కన చేరుకుని బ్రదర్ బ్రదర్ .......
మాన్స్టర్ : రేయ్ ఏంట్రా పనివాడివి , నన్ను ...... బ్రదర్ అని పిలుస్తున్నావు .
బుజ్జితల్లి : కళ్ళల్లో అగ్నిగోళాలతో చూస్తూ , మావయ్యకోసం అని చెప్పిన మాటలు గుర్తొచ్చినట్లు వాడిని చూడటమే ఇష్టం లేనట్లు వెనుకకు తిరిగింది .
మాన్స్టర్ : అయినా ఏంటి ఈ పిల్ల దెయ్యం ...... ఎప్పుడూ నీతోనే ఉంటుంది .
బ్రదర్ ...... ఇప్పుడు మ్యాటర్ అధికాదు - ప్లీజ్ ప్లీజ్ ...... కారులో పిలుచుకునివెళ్లి మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేస్తాను రండి వెళదాము - పాపం వాళ్లిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు , పెళ్లి ఆగిపోతే తట్టుకోలేరు ........
మాన్స్టర్ : ఆ ముసలోడిని ముసలోడు అన్నందుకు ఊరంతా ఏకమై నా మీదకు దూసుకొచ్చారుకదా - ఈ పెళ్లి ఆగిపోవాలి అప్పుడు ఊరు ఊరంతా బాధపడాలి - ఇక్కడే ఉండి చూడలేకపోయినా వాళ్ళ ఆర్తనాదాలు నాకు కచ్చితంగా వినిపిస్తాయి.
తప్పు తప్పు బ్రదర్ ....... , అందరూ మంచివాళ్ళు - వాళ్ళను బాధపెట్టడం మంచిదికాదు .
మాన్స్టర్ : ఎంతమందిని బాధపెడితే బెంగళూరులో సెటిల్ అయ్యుంటాను - సొంత అన్నాదమ్ముళ్ల ఆస్థులనే లాక్కుని రోడ్డుకీడ్చాను , వీళ్లేంత ....... అంటూ రాక్షస నవ్వు నవ్వుతున్నాడు .
బ్రదర్ బ్రదర్ ....... రెండు అందమైన జీవితాలు .......
మాన్స్టర్ : అందమైన జీవితాలు అయితే నాకేంటి ....... , పెళ్లికూతురు దగ్గరికి వెళ్లడం అంటే పద్మవ్యూహం లోకి ఎంటర్ అవ్వడమే , వెళ్లడమే కానీ బయటకు రాలేము , ఆటో ...... బస్టాండ్ కు పోనివ్వు ........
బ్రదర్ బ్రదర్ ....... అంటూ ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.

బుజ్జితల్లీ ...... అంటూ కన్నీరు కార్చాను .
బుజ్జితల్లి : డాడీ ....... అంటూ బాధపడుతూనే కన్నీళ్లను తుడిచింది .
బుజ్జితల్లీ ...... పెళ్లి ఘనంగా జరిపిస్తానని కృష్ణకు - దేవతకు మాటిచ్చాను , బాధ తన్నుకొస్తోంది , ఈ ముఖాన్ని ఎలా చూయించను ......
బుజ్జితల్లి : ఆ మాన్స్టర్ పోతేపోనివ్వు డాడీ ...... , మీరు ..... మా ఇంటి దేవుడు కదా అంటే ఇంటిలో ఉన్నట్లే కదా - మనం వెళ్లి అత్తయ్యను తీసుకొద్దాము .
అలా తీసుకురావచ్చా బుజ్జితల్లీ .......
ఎప్పుడు వచ్చాడో సూరి , అవును అన్నయ్యా ...... కీర్తి చెప్పినది కరెక్ట్ , పిల్లలు ......  దేవుళ్ళతో సమానం అంటారు - ఒక్క క్షణంలో క్యాబ్ తీసుకొస్తాను .
క్యాబ్ కాదు రేంజ్ రోవర్ తీసుకురా సూరీ అంటూ కీస్ విసిరాను . అమ్మా దుర్గమ్మా ...... తప్పో ఒప్పో ఎటువంటి అడ్డంకులూ రాకుండా మీరే చూసుకోవాలి అని బయలుదేరాము .

తమ్ముడూ ....... అతడు బస్టాండ్ చేరేలోపు బెంగళూరు బస్సు ఎక్కేలోపు పెళ్లికూతురుని తీసుకురావాలి .
తమ్ముడు సూరి : సరే అన్నయ్యా అంటూ గేర్ మార్చి వేగంగా పోనిచ్చాడు . 
బుజ్జితల్లి : డాడీ ....... ఇక ఆ మాన్స్టర్ తో పని ఏముంది ? , వెళితే వెళ్ళనివ్వండి .
అధికాదు బుజ్జితల్లీ ....... తరతరాలుగా ఆచరిస్తున్న సాంప్రదాయం నా వలన ..... , అదికూడా నా ప్రాణమైన వాళ్ళు తలలు దించుకుని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రానే కూడదు .
తమ్ముడు : అన్నయ్యా ....... , కీర్తీ చెప్పింది కదా మీరు ఇంటి దేవుడని ఇంటి దేవుడే కాదు ఊరి దేవుడు ........
బుజ్జితల్లి : అవును డాడీ అంటూ గట్టిగా హత్తుకుంది .
ఈ విషయం తెలిసింది ఊరిలో కొద్దిమందికే కదా తమ్ముడూ ....... 
తమ్ముడు : అందుకే అన్నయ్యా ...... , సర్పంచ్ గారు చెబుతాను అంటే మీరే వద్దన్నారు - ఇప్పుడు చూడండి , ఇప్పటికైనా సమయం మించిపోలేదు తిరిగొచ్చాక నేను చెప్పిస్తానులే సర్పంచ్ గారి ద్వారా ........
ఒట్టు వేశారు కదా తమ్ముడూ ..... , ఎలా చెబుతారు ? .
తమ్ముడు : అవునుకదా ...... , ప్చ్ ఇలా లాక్ చేసేసారన్నమాట .......
నవ్వుకుని , నా ప్రాణమైన బుజ్జితల్లికి ముద్దులుపెడుతూనే మరింత ఫాస్ట్ అన్నాను.

నిమిషాల్లోనే మాన్స్టర్ వెళుతున్న ఆటోను చేజ్ చేసి హైవే దాటుకుని గుంతల రోడ్డులోనే రోవర్ ను డాన్స్ చేయిస్తూ 15 నిమిషాలలో పెళ్లికూతురు గ్రామం చేరుకున్నాడు .
తమ్ముడు : ఈ గ్రామానికి కూడా వీరే పెద్దయ్య అనుకుంటాను అన్నయ్యా ........ , చూసారా ఊరుఊరంతా పెళ్లికి కదిలినట్లు ఇళ్లకు తాళాలు వేసేశారు .
అవును తమ్ముడూ ...... మన గ్రామంలోలానే ప్రతీ ఇంటికీ పెళ్లికళ వచ్చినట్లు తోరణాలు - లైట్స్ వేశారు . మరి నా బుజ్జితల్లి మావయ్య - అత్తయ్య పెళ్లినా మాజాకానా ........
బుజ్జితల్లి : లవ్ యు డాడీ అంటూ సిగుపడుతున్నట్లు నా భుజంపై తలదాచుకుంది.

తమ్ముడు : అన్నయ్యా ...... ఏంటి మెయిన్ గేట్ పూర్తిగా క్లోజ్ చేసేసారు అంటూ పెళ్లికూతురు ఇంటిముందు ఆపాడు .
బుజ్జితల్లి : అవును డాడీ , చాలా సైలెంట్ గా ఉంది , భయమేస్తోంది ...... అయినా డాడీ ఉండగా నాకు భయమేల ....... అంటూ ముద్దుపెట్టింది .
సూరీ ...... కారు తిప్పి ఉంచు , ఇలా లోపలికివెళ్లి అలా పెళ్లికూతురుని తీసుకొచ్చేస్తాము అని బుజ్జితల్లికి ముద్దులుపెడుతూ కిందకుదిగివెళ్లి ఫుల్లీ కవర్డ్ మెయిన్ గేట్ ను తట్టాను .
బుజ్జితల్లి అయితే బుజ్జిబుజ్జినవ్వులు నవ్వి , అత్తయ్యా అత్తయ్యా ....... అంటూ కేకలువేస్తోంది . 
నా బుజ్జితల్లికోసం తన అత్తయ్యే స్వయంగా పరుగునవచ్చి మెయిన్ గేట్ ఓపెన్ చేస్తుందేమో ....... అనేంతలో గేట్ తెరుచుకుంది .

ఇంటిలోపలనుండి తలుపులు కొడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి .
ఎవరు కావాలి అని కొత్తబట్టలు వేసుకున్న వ్యక్తి అడిగాడు . మళ్లీ లోపలనుండి తలుపులుకొడుతున్న శబ్దం ........
బ్రదర్ ...... మీరేనా అంకుల్ అల్లుడుగారు , పెళ్లికూతురుని తీసుకువెళ్లాడానికి ఆ ఇంటి బుజ్జితల్లినే స్వయంగా వచ్చింది అంటూ చేతిని చాపాను .
ఆ వ్యక్తి : అవునా చాలా చాలా సంతోషం ........ , అయితే షేక్ హ్యాండ్ కాదు హగ్ చేసుకోవాలి అంటూ ముందుకువచ్చి కౌగిలించుకున్నారు - ఈసారి మరింత గట్టిగా తలుపులు కొడుతున్న శబ్దం ........
బ్రదర్ ...... లోపల ఎవరో ........ , కసుక్కున కత్తి దిగింది కడుపులో ........
అమ్మా ........ 

అద్దం పగిలిన సౌండ్ - ఫస్ట్ ఫ్లోర్ విండో నుండి అన్నయ్యా అన్నయ్యా ....... రావద్దు వెళ్లిపోండి మిమ్మల్ని చంపేస్తారు అంటూ పెళ్లికూతురు కేకలువేసింది .
అవును రాకుండా ఉండాల్సింది అంటూ కత్తిని బయటకు లాగి మెయిన్ గేట్ బయటకు తోసేశాడు కౌగిలించుకున్న వ్యక్తి .......
బుజ్జితల్లి : ఎగజిమ్మిన రక్తాన్ని చూసి , డాడీ ..... అంతే స్పృహకోల్పోయి నా గుండెలపై చేరింది .
అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ ఏడుస్తోంది పెళ్లికూతురు .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ........ , స్స్స్ స్స్స్ ....... అంటూ మరొకచేతితో రక్తం రాకుండా అడ్డుపెట్టుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ సూరి పరుగునవచ్చి పడిపోకుండా పట్టుకున్నాడు . 

పొడిచిన వ్యక్తి : ఒక పెళ్లి ఆపడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందనుకోలేదు - చివరికి ప్రాణాలు కూడా తీయాల్సి వస్తోంది .
పెళ్లికూతురు : మావయ్యా మావయ్యా ....... అన్నయ్యను ఏమీ చెయ్యకండి , మీరు చెప్పినట్లుగానే చేస్తాను ప్లీజ్ ప్లీజ్ ...... అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతోంది - అన్నయ్యా ....... వెళ్లిపోండి - అన్నయ్యను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లండి .
పొడిచిన వ్యక్తి : వీడి ప్రాణాలు పోతేనేగానీ ఈ పెళ్లి ఆగేలా లేదు - ఇక చచ్చినట్లు నిన్ను నాకే ఇచ్చి పెళ్లిచేస్తారు - ఇంత ఆస్తిని ఎవడైనా వధులుకుంటాడా ..... ? . ఇంతకూ ఎవర్రా నువ్వు ఎన్ని ప్లాన్ లు వేసి ఆపడానికి ప్రయత్నించినా పెళ్లికూతురుని తీసుకెళ్లడానికి వచ్చేశావు , ఆ ముసలినాకొడుకుని లారీతో గుడ్ధించాను అయినా బ్రతికిపోయాడు ఒకడు రక్షించడం వలన - నిన్న ఇంటికివచ్చిన ఆ ఇంటి వాళ్ళను రౌడీలతో అటాక్ చేయించాను మళ్లీ ఒకడి వల్లనే నా ప్లాన్ బెడిసికొట్టింది - ఇక లాభం లేదు అనుకుని ఆ ఇంటి నుండి ఇక్కడకు రాగల ఏకైకవ్యక్తి ఆ ఇంటి అల్లుడే అని తెలుసుకుని వివరాలు సేకరించి తెల్లవారుఘామున బస్సు దిగగానే కలిసి వస్తే చంపేస్తాను అని భయపెట్టి పంపించాను అయినా నువ్వు వచ్చావు - నీ ప్రాణాలు తీస్తేనేకానీ పెళ్లి ఆగదు అంటే ఇక తప్పదు అంటూ మళ్లీ పొడవడానికి వచ్చాడు .
బుజ్జితల్లిని హత్తుకుని , ముందుకువచ్చినవాడిని కాలితో ఒక్క తన్ను తన్నాను . 
హబ్బా ....... అంటూ అంతదూరం వెళ్లి పడ్డాడు . రేయ్ ....... వీడిని చంపేయ్యండి రా అని కేకవేయ్యడంతో ట్రాక్టర్ - స్తంభాల వెనుకున్నవాళ్ళు వచ్చారు .........
సూరి : అన్నయ్యా ....... , సర్పంచ్ గారికి కాల్ చేస్తాను .
నో ........ , పెళ్లి ఆగిపోతుంది - ఎట్టి పరిస్థితుల్లోనూ ...... నా ప్రాణాలు పోయినా సరే తమ్ముడి పెళ్లి అడగకూడదు అని ఆపాను ..........
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 04-12-2021, 05:45 PM



Users browsing this thread: 48 Guest(s)