Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కారులో వెళుతూనే వినయ్ ....... కృష్ణకు కాల్ చేసాడు .
కృష్ణ : ఎత్తి రేయ్ ...... అన్నయ్య కనిపించక బుజ్జితల్లితోపాటు అందరూ కంగారుపడుతున్నారు , తరువాత మాట్లాడుతాను .
వినయ్ : ఆ విషయం గురించేరా కాల్ చేసింది - ఇంతకూ కీర్తీ తల్లి ఎక్కడ ఉంది ? .
కృష్ణ : వర్షం పడటానికి ముందే అందరమూ ఇంటికి వచ్చేసాము - బుజ్జితల్లి ఏడుస్తోంది ....... 
వినయ్ : అది చెప్పడానికే వస్తున్నామురా , ఏమి జరిగిందంటే అన్నయ్యతోపాటు సిటీకి వెళ్ళాము .......
కృష్ణ : అన్నయ్య ...... మీదగ్గర ఉన్నారా ? - సిటీకి వెళ్ళారా ఆదన్నమాట ...... హాక్లో హలో .......
వినయ్ : హలో హలో ....... , వర్షం పడితే చాలు టవర్ పోతుంది , రేయ్ తొందరగా అన్నయ్య ఇంటికి పోనివ్వు .........
సూరి : నిమిషంలో ........

అక్కడ 
కృష్ణ : కట్ అయ్యింది , వర్షం పడితేచాలు ........ , బుజ్జితల్లీ బుజ్జితల్లీ ...... మీ అంకుల్ సిటీకి వెళ్లారట వచ్చేస్తున్నారు .
చెల్లెమ్మ : హమ్మయ్యా అంటూ కన్నీళ్లను తుడుచుకుని , ఆదన్నమాట సంగతి వారి బుజ్జితల్లికోసం స్పెషల్ గిఫ్ట్ తేవడానికి వెళ్లారు , అందరమూ కంగారుపడిపోయాము అంటూ బుజ్జితల్లి బుజ్జికన్నీళ్లను తుడిచి గిలిగింతలుపెట్టి నవ్వించి ముద్దుచేస్తూ ఎత్తుకుని , అంతే కంగారుపడుతున్న నా దేవత చేతిని మరొకచేతితో అందుకుని గుమ్మం దగ్గరికి చేరింది - వెనుకే అందరూ చేరారు - బయట వర్షం అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
చెల్లెమ్మ : శ్రీవారూ ....... కారు రాగానే , బుజ్జితల్లి - అక్కయ్య వర్షంలోనే పరిగెత్తేలా ఉన్నారు తొందరగా గొడుగులు తీసుకురండి .
దేవత : పో చెల్లీ ...... సిగ్గేస్తోంది .
నర్స్ : అవునవును గొడుగులు తీసుకురండి , ఇద్దరికీ కాదు కాదు పెళ్లికూతురితోపాటు ముగ్గురికి జలుబు చేస్తే ట్రీట్మెంట్ నేనే చేయాల్సి వస్తుంది - అసలే కొద్దిసేపట్లో శోభనం కూడా .......
చెల్లెమ్మ : పోండి నాకూ సిగ్గేస్తోంది . కొన్నిగంటలు అన్నయ్యను చూడకపోయేసరికి ఎంత విలవిలలాడిపోయారో నాకు తెలుసు అక్కయ్యా - రానివ్వనివ్వండి మనిద్దరి శోభనం ఒకే రాత్రి జరిగేలా కథ నేను నడుపుతాను .
దేవత : ష్ ష్ ష్ ...... అంటూ చెల్లి నోటిని మూసేసి సిగ్గులోలికిపోతున్నారు .
కృష్ణ : అవునవును అంటూ జలుబు చేస్తుందేమో అంటూ బుజ్జిబుజ్జినవ్వుల బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి , పరుగున లోపలికివెళ్లి ఉన్న గొడుగులన్నీ తీసుకొచ్చి బయటకువెళ్లి ఓపెన్ చేసి రెడీగా ఉంచాడు బుజ్జితల్లితోపాటు వెళ్ళడానికి .......
నర్స్ : శోభనం అనగానే పెళ్ళికొడుకు ఉత్సాహం చూడండి . మీ జలుబు పోగొట్టి శోభనం జరిపించడానికే ఇక్కడ ఆగిపోయానేమో అనిచెప్పి నవ్వులు పూయించారు .
**********

అంతలోనే రోవర్ వేగంగా వచ్చి ఆగింది . 
డాడీ డాడీ ....... అంటూ చెల్లెమ్మ చెప్పినట్లుగానే బుజ్జితల్లి బయటకు పరుగుతీసింది - కృష్ణ అలర్ట్ అయ్యి గొడుగుపట్టి వెనుకే వెళ్ళాడు . 
దేవత కళ్ళల్లో ఆరాటం చూసి అక్కయ్యా ....... తీసుకెళ్లడానికి నేనున్నాను కదా , ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అమాంతం గట్టిగా కౌగిలించుకుని మీ మనసులోని స్వచ్ఛమైన ప్రేమను తెలిసేలా చేసేయ్యండి అంటూ ఒక చేతితో నా దేవతను మరొకచేతితో గొడుగుపట్టుకుని వర్షంలో పిలుచుకునివెళ్లింది చెల్లెమ్మ .
నర్స్ : స్వీట్ ఆఫ్ యు అక్కాచెల్లెళ్ళూ ....... , ఏమైనా చెయ్యండి వర్షంలో మాత్రం తడవకండి క్లైమేట్ చాలా కూల్ గా మారిపోయింది , క్షణాలు తడిచినా డేంజర్ .......
చెల్లెమ్మ - దేవత : అలానే కేరింగ్ డాక్టర్ అంటూ ముసిముసినవ్వులతో బుజ్జితల్లి - కృష్ణ వెనుకే కారు దగ్గరికి వెళ్లారు .

ఆపాటికే కారులోనుండి కేవలం తమ్ముళ్లు మాత్రమే దిగడంతో , బుజ్జితల్లి ...... డాడీ డాడీ అంటూ కారులోపల తెగ వెతికేస్తోంది - కారులో కనిపించకపోయేసరికి బుజ్జికన్నీళ్ళతో మమ్మీ - అత్తయ్యా ....... అంటూ తడుస్తూనే పరుగునవచ్చి హత్తుకుని ఏడుస్తోంది .
చెల్లెమ్మ : కారులో అన్నయ్య లేరా ...... ? , కృష్ణా ...... ? .
దేవత కళ్ళల్లో కంగారు - కన్నీళ్లు .........
కృష్ణ : రేయ్ వినయ్ - సూరీ ....... అన్నయ్య ఎక్కడ ? - రేయ్ ....... అన్నయ్యతోపాటు వెళ్ళాము అని చెప్పారు , అన్నయ్యతోపాటు వస్తున్నాము అని చెప్పారుకాదరా ..........
వినయ్ : అన్నయ్యతోపాటు వెళ్లినమాట నిజమే కానీ ........
కృష్ణ : కానీ ఏంట్రా .........
సూరి : అన్నయ్య వెళ్లిపోయారురా ....... , ఇక ఎప్పటికీ రాను అనిచెప్పి వెళ్లిపోయారు . 
అంతే అందరి కళ్ళల్లో కన్నీళ్లు ఆగనేలేదు . 
వినయ్ : బుజ్జితల్లిని , అక్కయ్యను , పెళ్లికూతురుని ....... వదిలి వెళ్లడం అన్నయ్యకు కష్టమైనా ....... , అన్నయ్య ఇంటిలో ఉంటే ఆ గురుమూర్తి గాడు ...... మీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడతారని - అధివిని తట్టుకునే శక్తి లేదని భారంగా వెళ్లారు - అన్నయ్య వెళ్ళడానికి ముఖ్యమైన కారణం అక్కయ్య ........ , అవును మహి అక్కయ్యా ....... మీరు బెంగళూరు వెళ్ళిపోయే క్షణం అన్నయ్య హృదయం ఆగిపోతుంది అన్నారు అని జరిగినదంతా వివరించారు .
దేవత : చెల్లీ .........
చెల్లెమ్మ : అవును అక్కయ్యా ...... , ఆలస్యం చాలా చాలా ఆలస్యం చేసాము .
కృష్ణ : రేయ్ అన్నయ్య ఎక్కడికి వెళ్లారు - ఎటువైపు వెళ్లారు అని కన్నీళ్లతోనే అడిగాడు .
తమ్ముళ్లు : బస్టాండ్ వైపుకు నడుచుకుంటూ వెళ్లారు - మీకు దూరంగా ఈ చుట్టుప్రక్కలే ఉంటాను అనిచెప్పారు .
నర్స్ : ఈ కూలెస్ట్ రైన్ లో నడుచుకుంటూ ...... చాలా చాలా డేంజర్ చెల్లెళ్ళూ - సర్ కు అయితే మరింత డేంజర్ ....... కట్టుకు ఏమాత్రం వాటర్ తగిలినా వొళ్ళంతా మరింత కూల్ అయిపోయి స్పృహకోల్పోతారు .
దేవత - చెల్లెమ్మ : భయంతో వణికిపోతున్నారు .
దేవత ...... చెల్లెమ్మ చేతిని గట్టిగా పట్టేసుకుని వణకడం చూసి , కృష్ణా ....... అన్నయ్య ఎక్కడ ఉన్నా తీసుకొద్దాము అంటూ ఏడుస్తున్న బుజ్జితల్లిని ఎత్తుకుని దేవతతోపాటు కారులో కూర్చున్నారు - అక్కక్య్యా ...... మీరూ రండి అంటూ నర్సును కూర్చోబెట్టుకున్నారు .
కృష్ణ ముందుకూర్చుని రేయ్ ...... ఇంకా చూస్తున్నారే పదండి అన్నయ్య కనిపించాకే ఇంటికి ........
సూరి : అలాగే రా అంటూ సూరి డ్రైవింగ్ సీట్లో - వినయ్ ...... కృష్ణగాడిమీద కూర్చున్నాడు .

కృష్ణ : రేయ్ ...... అన్నయ్య అలా బాధపడేటప్పుడే మాకు కాల్ చెయ్యాల్సినది కదరా .......
వినయ్ : అన్నయ్య ప్రామిస్ వేయించుకున్నారురా ....... , మీరు కారులో వెళ్ళండి మేము నడుచుకుంటూ వెళతాము అనిచెప్పాము , ఈ కారు నా బుజ్జితల్లిది అని పంపించారు .
బుజ్జితల్లి : డాడీ డాడీ డాడీ ....... అంటూ చెల్లెమ్మ ఓడిలో కలవారిస్తూనే ఉంది - ఇక దేవత పరిస్థితి చెప్పనవసరం లేదు .
చెల్లెమ్మ : అక్కయ్యా ....... మాటిచ్చానుకదా , ఇద్దరి శోభనం ఒకేసారి అని అంటూ బుజ్జితల్లితోపాటు దేవతను కూడా గుండెలపైకి తీసుకుని ఓదారుస్తోంది .
కృష్ణ : ఇంతకీ ఎక్కడ వదిలారు - తొందరగా అక్కడికి తీసుకెళ్లండి .
సూరి : మన క్రాసింగ్ లో రా ....... నిమిషాల్లో తీసుకెళతాను అని పెద్ద వర్షంలోనే జాగ్రత్తగా పోనిచ్చాడు .

క్రాసింగ్ లో హైవేపై టర్న్ అవుతుండగా ....... 
స్టాప్ - స్టాప్ అంటూ బుజ్జితల్లి - దేవత ఒకేసారి కేకలువేసి విండో మిర్రర్స్ నుండి బయటకు తొంగిచూస్తున్నారు డాడీ డాడీ - మహేష్ గారు ....... అంటూ .
కృష్ణ : రేయ్ ఆపు ఆపు ......
సూరి సడెన్ బ్రేక్ వేశాడు .
బుజ్జితల్లి : డాడీ ఇక్కడే ఉన్నట్లున్నారు అనిపిస్తోంది మావయ్యా .......
దేవత : అవును చెల్లీ ...... నా మనసుకూ అదే అనిపిస్తోంది .
నర్స్ : ఇక్కడనా ....... చుట్టూ ఎక్కడా ఒక్క షెడ్డు కూడా లేనేలేదు ఇక్కడ ఉండే ఛాన్స్ ఏమాత్రం లేదు .
బుజ్జితల్లి : మావయ్యా అంకుల్ ....... డోర్ తెరవండి డోర్ తెరవండి .......
చెల్లెమ్మ : బుజ్జితల్లి - అక్కయ్య ఇద్దరూ చెబుతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు కృష్ణా .......
కృష్ణ : మీరు లోపలే ఉండండి అని తమ్ముళ్లు ముగ్గురూ గొడుగులుపట్టుకుని దిగి చుట్టూ చూస్తున్నారు - అంతపెద్దవర్షంలో ఏమీ కనిపించడం లేదు .

బుజ్జితల్లి కిందకుదిగి డాడీ డాడీ ...... అంటూ వర్షంలోనే పరుగుతీసింది . 
బుజ్జితల్లీ ...... కృష్ణా .......
కృష్ణ పరుగునవెళ్లి గొడుగుపట్టి వెనుకే వెళ్ళాడు . 
రోడ్డు శిలాఫలకం దగ్గర షాక్ ...... , బుజ్జితల్లీ - మహీ బుజ్జితల్లీ - మహీ ...... అంటూ కలవరిస్తూనే స్పృహకోల్పోయి గజగజావణుకుతున్న నన్నుచూసి డాడీ డాడీ - అన్నయ్యా ...... అంటూ కేకలువేశారు . రేయ్ ...... రండిరా అని పిలవడంతో తమ్ముళ్ళిద్దరూ పరుగునవచ్చి కంగారుపడుతూనే ముగ్గురూ జాగ్రత్తగా ఎత్తుకునివెళ్లి దేవత - చెల్లెమ్మ ఒడిలో పడుకోబెట్టి , వెనుకే ఏడుస్తూ వచ్చిన బుజ్జితల్లిని లోపల నుంచోబెట్టారు .

నర్స్ ....... కంగారుపడుతూ చెక్ చేసి , కుట్లు ఊడిపోలేదు హాస్పిటల్ కు అవసరం లేదు తొందరగా ఇంటికి తీసుకెళ్లండి ఫస్ట్ ఎయిడ్ కిట్ అక్కడే ఉంది , సర్ కు వెచ్చదనం అవసరం ...... - ఎంతసేపటి నుండి తడిచిపోయారో - ఎలా వణుకుతున్నారో చూడండి ........
దేవత ....... నా అరి పాదాలపై - చెల్లెమ్మ నర్స్ ....... అరి చేతులపై రుద్దుతున్నారు .
వినయ్ : మిమ్మల్ని వదిలివెళ్లడం ఇష్టం లేనట్లు శిలాఫలకంపై ఉన్న కీర్తీ తల్లి పేరుని స్పృశిస్తూనే ఇలా .......
బుజ్జితల్లి : డాడీ డాడీ ....... అంటూ బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తోంది .

10 నిమిషాలలో ఇంటికి చేరుకుని తమ్ముళ్లు ముగ్గురూ జాగ్రత్తగా ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చారు . 
పెద్దయ్య - పెద్దమ్మ చూడగానే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు ....... , తల్లులూ - కృష్ణా ..... ఏమైంది అంటూ ఏడుస్తున్న బుజ్జితల్లిని ఎత్తుకుని ఓదారుస్తున్నారు .
చెల్లెమ్మ : కృష్ణా ...... అన్నయ్యను పైన శోభనం గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టండి - చూసానుకదా ఆ గది అయితేనే వెచ్చగా ఉంటుంది - క్యాండీల్స్ సెట్ చేశారు కదా వెలిగిస్తే వెచ్చగా ఉంటుంది . 
నర్స్ : ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుకుని , తడిచిన కట్టు మార్చాలి - పాప చూస్తే తట్టుకోలేదు ఇక్కడే ఉండటం మంచిది .
పెద్దయ్య - పెద్దమ్మ : మేమిక్కడే ఉండి చూసుకుంటాము .
నర్స్ : గుడ్ ...... , కీర్తీ ...... మీ డాడీ కి ఏమీకాదు నేనున్నానుకదా అని కురులపై ముద్దుపెట్టి పైకివచ్చారు .

అప్పటికే తమ్ముళ్లు పూలతో అలంకరించిన బెడ్ పై పడుకోబెట్టి గది బయటకువచ్చి కంగారుపడుతూ నిలబడ్డారు - దేవత నా తడిచిన తలను తుడుస్తోంది - చెల్లెమ్మ ...... గది వెచ్చదనం కోసం చుట్టూ క్యాండిల్స్ వెలిగిస్తోంది .
నర్స్ : అంత వర్షంలోనూ ఒకవైపు ఉరుములు మెరుపులు అయినా సర్ కలవరింతలు - మూలుగులు ...... మీకు వినిపించాయి అంటే ఇద్దరికీ ఎంత ప్రాణమో అర్థమవుతోంది అంటూ నా షర్ట్ విప్పి కుట్లు ఊడి ఉండకూడదు కుట్లు ఊడి ఉండకూడదు అని నెమ్మదిగా కట్టు విప్పుతున్నారు - దేవత చెల్లెమ్మ చూడటం వాళ్ళ వళ్ల కానట్లు కన్నీళ్ళతో బాధపడుతుండటం చూసి , చెల్లెళ్ళూ ..... మీరు తట్టుకోలేరు కిందకువెళ్లి గదిని మరింత వేడిగా ఉంచేలా ...... మరియు సర్ కు ఫ్రూట్ జ్యూస్ ....... 
చెల్లెమ్మ : దేవతను బయటకు పిలుచుకునివెళ్లింది .
నర్స్ : చెల్లెళ్ళూ ....... కాస్త సర్ బట్టలన్నీ విప్పేసి వెళ్ళండి - తడి బట్టలతో ఎక్కువసేపు ఉండటం మంచిదికాదు . 
దేవత : మాకు సిగ్గు అంటూ పరుగున వెళ్లిపోయారు . 
అక్కయ్యా అక్కయ్యా ....... అంటూ తమ్ముళ్లు కిందకువెళ్లారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-12-2021, 09:43 AM



Users browsing this thread: 57 Guest(s)