Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహి గారూ - చెల్లెమ్మా ....... నెక్స్ట్ ముహూర్తానికి గంట సమయం మాత్రమే ఉంది - ముహూర్తపు పూజా కార్యక్రమాలు ఏవీ మిస్ కాకుండా పరిపూర్ణమైన వివాహతంతు జరగాలి పదండి వెళదాము అని బుజ్జితల్లిని ఎత్తుకున్నాను .
బుజ్జితల్లి : డాడీ ...... కట్టుకు తగులుతుంది జాగ్రత్త .
నొప్పి ఏమీలేదు బుజ్జితల్లీ ......
దేవత - చెల్లెమ్మ : నాన్నగారూ - నాన్నగారూ .......
పెద్దయ్య - చెల్లెమ్మ నాన్నగారు - సర్పంచ్ గారు ...... కంగారుపడుతూ లోపలికివచ్చారు , వెనుకే పెద్దమ్మ - చెల్లెమ్మ అమ్మకూడా వచ్చారు .
దేవత - చెల్లెమ్మ : చూడండి నాన్నగారూ ...... ఇంకా బ్లడ్ కూడా పూర్తవ్వలేదు వెళ్లిపోదాము అని గోల చేస్తున్నారు .
I am perfectly alright పెద్దయ్యా - అంకుల్ ...... , ఈ కత్తిపోటు వారం రోజుల్లో నయమైపోతుంది - పెళ్లికి వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ ముహూర్తం ...... మనకు అనుకూలంగా ఉండవు పదండి వెళదాము ప్లీజ్ ప్లీజ్ .......
అంకుల్ : బాబూ ...... క్షమించు , పెళ్లిలో సహాయపడతాడు అని అనుకుంటే గుంట కాడ నక్కలా ఇలా చేస్తాడనుకోలేదు అంటూ కన్నీళ్ళతో పాదాలను తాకపోయాడు .
అంకుల్ ....... ఏంటిది మీరు ఆశీర్వదించాలి కానీ అంటూ ఆపాను . చెల్లికి ఏమీకాలేదు అధిచాలు నాకు ......
బుజ్జితల్లి : తాతయ్యా ....... డా .... అంకుల్ , వాడికి తగిన శాస్తి చేశారులే .......
చెల్లెమ్మ : అన్నయ్యా ...... అంటూ కౌగిలించుకుని వెంటనే నో నో నో అంటూ వెనక్కువెళ్లిపోయింది .
బుజ్జితల్లి : అత్తయ్యా ....... నన్నుకూడా ఎత్తుకోండి - నా బుజ్జిపాదాలు తగులుతాయని భయం భయంగా ఉంది .
చెల్లెమ్మ ....... ప్రాణంలా ఎత్తుకుంది .

చెల్లెమ్మా - బుజ్జితల్లీ ...... చూడు పెద్దమ్మ - అంటీ కూడా కన్నీళ్లు కారుస్తున్నారు , ఇలా జరుగకూడదు అనే మిమ్మల్ని మాత్రమే పంపించినది . ఇక్కడ ఆలస్యం చేసే ఒక్కొక్క నిమిషం ఇంకెంతమంది కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తానో ..... , ప్లీజ్ ప్లీజ్ వెళ్లిపోదాము అంటూ బ్లడ్ ప్యాకెట్ ను చేతిలోకితీసుకుని లేచి నిలబడ్డాను - డాక్టర్ డాక్టర్ ...... అంటూ కేకవేశాను .
నర్స్ ఆశ్చర్యపోయి పరుగునవెళ్లి డాక్టర్ ను పిలుచుకునివచ్చింది .
థాంక్యూ నర్స్ ...... , డాక్టర్ గారూ ...... చెల్లెమ్మ పెళ్లి వెంటనే డిశ్చార్జ్ చెయ్యండి ప్లీజ్ ....... , అర్థం చేసుకోండి .
డాక్టర్ : పెళ్లికూతురి సారీలో ఉన్న చెల్లివైపు చూసి , ఒక అన్నయ్యగా మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను కానీ జాగ్రత్త అనిచెప్పి డిశ్చార్జ్ చేశారు .
థాంక్యూ థాంక్యూ డాక్టర్ గారూ ..... - బుజ్జితల్లీ ...... లెట్స్ గో అండ్ సెలెబ్రేట్ అంటూ చేతులు చాపాను .
బుజ్జితల్లి : నో నో నో అంటూ కట్టు చూయించింది .
లవ్ యు sooooo మచ్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను . 
దేవత : మహేష్ గారూ ...... బ్లడ్ ప్యాకెట్ నాకివ్వండి అని అందుకుని ఎత్తిపట్టుకుని జాగ్రత్త జాగ్రత్త అంటూనే ఉన్నారు .

అంకుల్ : డాక్టర్ గారూ ...... , తప్పుగా మాట్లాడితే క్షమించండి - దయచేసి మీరూ మాతోపాటు రాగలరా ...... 
పెద్దయ్య : ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారూ ...... , మీకు ఏలోటూ లేకుండా చూసుకుంటాము . 
చుట్టూ అందరూ ఆశతో చూస్తున్నారు .
ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ చేరింది .
దేవత : మహేష్ గారూ ...... నొప్పివేస్తోందా ? అంటూ గాయం పై మరొక చేతిని వేసి సున్నితంగా స్పృశించారు .
బుజ్జితల్లి : డా ....... అంకుల్ .
చెల్లెమ్మ : అన్నయ్యా .......
తియ్యనైన జలదరింత - పెదాలపై చిరునవ్వు ....... , మహిగారూ - బుజ్జితల్లీ - చెల్లెమ్మా ........ కన్నీళ్లు కాదు , ఇన్ని సంవత్సరాలూ ....... అనాధగా పెరిగిన నాపై ఇంతమంది ప్రేమ కురిపిస్తుంటేనూ ఆనందబాస్పాలు ఆగడం లేదు , ఇక అయితే డోంట్ కేర్ పదండి వెళదాము .
దేవత - చెల్లెమ్మ : మా ప్రేమకే ఇలా అయిపోతున్నారు - ఇక బయట ఉన్న ఊరి జనమందరి ప్రేమకు ఎంత ఆనందిస్తారో .......
సర్పంచ్ గారూ ...... ఏదైతే జరుగకూడదు అనిచెప్పానో ఇప్పుడు అదే ......
సర్పంచ్ గారు : నిన్ను అలా అనేసరికి తట్టుకోలేకపోయాము మహేష్ - నిన్ను ఒక్క మాట అన్నా ఊరుకోము - నేను కొద్దిగానే చెప్పినది , ఇదిగో వీడే తెలీనట్లు నటించి మొత్తం చెప్పేసాడు .
పెద్దయ్య : మా ఇంటికోసం మాత్రమే వచ్చిన దేవుడు కాదు - ఊరికోసం వచ్చిన దేవుడు బాబూ నువ్వు అంటూ దండం పెట్టారు .
బుజ్జితల్లీ ...... స్టార్ట్ చేసేసారు .
దేవత : నాన్నగారు ఒక్కరు దండం పెడితేనే ఇలా అయిపోతున్నారు - బయటకువెలితే ....... 
అమ్మో ...... అయిపోతాను - డాక్టర్ గారూ ...... బయటకు వెళ్ళడానికి వేరే మార్గమేమైనా ఉందా ? .
దేవత - చెల్లెమ్మ - బుజ్జితల్లి నవ్వేశారు ......
హమ్మయ్యా నవ్వేసారా ..... , ఇక ఇలానే కంటిన్యూ చెయ్యండి .

డాక్టర్ : బయట జనమంతా వీరికోసమా వచ్చినది .
బుజ్జితల్లి : Yes డాక్టర్ సర్ - మా డా ...... అంకుల్ కోసమే ...... , మా ఊరి దేవుడు.
బుజ్జితల్లీ ........
బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుంది బుజ్జితల్లి .
డాక్టర్ : రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను - కానీ ఈ విషయం తెలిసాక ఒక ఊరికే దేవుడైన మీకోసం తప్పకుండా వస్తాను - నర్స్ ...... కావాల్సినవన్నింటినీ తీసుకుని బయలుదేరు - మనం పెళ్లికి వెళ్లబోతున్నాము - పెద్దయ్యే కదా ...... పెద్దయ్యా ...... మీరు పెళ్ళిపనులు చూసుకోండి , నా సొంత కారులో మీ వెనుకే వస్తాను అని వెళ్లారు . 

పెద్దయ్యా వాళ్ళు : బాబూ జాగ్రత్త ..... పట్టుకోవాలా చెప్పు .
బుజ్జితల్లీ ...... సూరి బయటే ఉన్నాడా ? , సూరీ అంటూ కేకవేశాను . సూరితోపాటు గోవర్ధన్ - వినయ్ ...... ముగ్గురూ పరుగున లోపలికివచ్చారు .
తమ్ముళ్లూ ....... మీ ఫ్రెండ్ ను ఒంటరిగా వదిలి అందరూ వచ్చేసారన్నమాట .......
దేవత : నా ఫ్రెండ్స్ వున్నారు మహేష్ సర్ ....... , కానీ కంగారు మాత్రం పడుతూ ఉంటాడు .
చెల్లెమ్మా ........
చెల్లెమ్మ : ఇప్పుడే కాల్ చేస్తాను అన్నయ్యా ...... , అయ్యో మొబైల్ అక్కడే ఉండిపోయింది అని తన తండ్రి మొబైల్ అందుకుని కాల్ చేసి అన్నయ్య ........
కృష్ణా ...... నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను నువ్వు ఏమాత్రం కంగారుపడకు - మరికొద్దిసేపట్లో అక్కడ ఉంటాము .
కృష్ణ : అన్నయ్యా ...... మీరు బాగుండాలి అంతకంటే మరొకటి వద్దు - వచ్చేస్తున్నారా ...... పూర్తిగా కోలుకునేంతవరకూ .......
మీ అక్కయ్య - మా చెల్లెమ్మ ....... ఇద్దరూ తమ రక్తంతో ఊపిరిపోశారు , ఇక నాకేమీ కాదు - అమృతంలా ....... నా ఆయుష్షును అమాంతం పెంచేస్తోంది - నాకు తెలిసి కుట్లు కూడా నయమైపోయి ఉంటాయి .
దేవత : చాలు చాలు మహేష్ గారూ ........
అవును చాలు చాలు ...... , ముందు పెళ్ళిమండపానికి వెళ్ళాలి అని సూరి భుజంపై చేతినివేసి నడిచాను .
దేవత - చెల్లెమ్మ - జాగ్రత్త మహేష్ గారూ - జాగ్రత్త అన్నయ్యా .......
లవ్ ...... థాంక్యూ మహిగారూ - లవ్ యు చెల్లెమ్మా ....... 
దేవత : ప్చ్ ...... అంటూనే కోపంతో భుజంపై గిల్లేసారు .
స్స్స్ ...... 
అందరూ కంగారుపడ్డారు - చెల్లెమ్మ మాత్రం నవ్వుతోంది . 
పెద్దయ్యా ....... గాయం కాదు - వెనుక అందమైన తూనీగ కుట్టింది అంటూ దేవతవైపు చూస్తే సిగ్గుపడుతున్నారు .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ...... మీ డాడీ కి ఏమీకాలేదులే కంగారుపడకు - ఆ అందమైన తూనీగ ఎవరోకాదు మీ మమ్మీనే ........
బుజ్జితల్లి : బుజ్జి ఆనందంతో లవ్ యు లవ్ యు మమ్మీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
అక్కయ్యా ....... బ్లడ్ ప్యాకెట్ నాకివ్వండి నేను పట్టుకుంటాను అని వినయ్ అందుకున్నాడు .
దేవత : వినయ్ ...... జాగ్రత్తగా ఎత్తిపట్టుకో - ఒక అడుగు కంటే ఎక్కువ డిస్టన్స్ ఉండకూడదు .
వినయ్ : సరే అక్కయ్యా ........

చెల్లెమ్మ ప్రక్కనే నా అడుగులను జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్న దేవతనే చూస్తూ పెదాలపై తియ్యదనంతో ICU నుండి నెమ్మదిగా బయటకు అడుగులువేశాను . 
చెల్లెమ్మ : అన్నయ్యా ...... హాయిగా ఉందికదూ ? .
చాలా అంటే చాలా చెల్లెమ్మా .......  
దేవత : ఏమి హాయి చెల్లీ ....... 
నో నో నో చెల్లెమ్మా ....... అంటూ బుద్ధిగా తలదించుకుని నడిచాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ....... ఇంత భయమా ? అంటూ నవ్వుతోంది .
బుజ్జితల్లి : చాలా అంటే చాలా అత్తయ్యా ....... , నావల్ల అయితే కావడం లేదు .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ...... ఇప్పుడు నీ ప్రార్థనాలతోపాటు నా ప్రార్థనలు కూడా కలిసాయి కదా ఈ బుజ్జితల్లి కోరిక అతిత్వరలోనే తీరుతుందిలే ........
బుజ్జితల్లి : లవ్ యు అత్తయ్యా ఉమ్మా ఉమ్మా .......
దేవత : ఏ కోరిక చెల్లీ ...... - ఈ బుజ్జిదెయ్యం ఏమి కోరుకుంది .
బుజ్జితల్లి : ఊహూ అంటూ తల అడ్డంగా ఊపితోంది .
నా బుజ్జితల్లి కోరికనా ...... , ఆర్డర్ వెయ్యి బుజ్జితల్లీ ...... చిటికెలో తీరేలా ప్రయత్నిస్తాను .
చెల్లెమ్మ : చెప్పకుండా తీరడమంటే కష్టం కదా బుజ్జితల్లీ ...... , చెప్పొచ్చుకదా ...... , సరే నీ ఇష్టం ......
బుజ్జితల్లి : ఒకరు చెబితే తీరాల్సిన కోరిక కాదు అత్తయ్యా - డా ..... అంకుల్ , మనసారా ....... దానికదే జరిగినప్పుడే కిక్కు ......
చెల్లెమ్మ : Wow ......, బ్యూటిఫుల్ బుజ్జితల్లీ ...... , ఆ మధురమైన ఘాట్టాన్ని చూడటానికి వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాను .
దేవత : నాకేమీ అర్థం కావడం లేదు బుజ్జితల్లీ - చెల్లీ ......
నాకు కూడా ........
చెల్లెమ్మ : మా అక్కయ్య మనసులో ఉన్నదే అతిత్వరలో జరిగితే అంతకంటే ఆనందం మరొకటి లేదు .
దేవత సిగ్గుపడటం చూసి ముచ్చటేసింది కానీ ఎందుకు సిగ్గుపడుతున్నారో అర్థం కాలేదు . 

హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరికి చేరుకోగానే ....... , బయటున్న ఊరిజనం చూసి మహేష్ మహేష్ మహేష్ ....... అంటూ దద్దరిల్లిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
దేవత : మూవీ స్టార్ట్ అయ్యింది మహేష్ గారూ ...... , మీకోసమే మీరు ఊ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారు .
బుజ్జితల్లి ఆనందాలకు అవధులు లేనట్లు , చెల్లి గుండెలపైనుండి సూరి మీదకు చేరి , నా బుగ్గపై ముద్దుపెట్టింది .
లవ్ యు బుజ్జితల్లీ ...... , పెద్దయ్యా - సర్పంచ్ గారూ ........ 
అభిమానాన్ని ఆపలేము మహేష్ అంటూ అంకుల్ తోపాటు ముగ్గురూ నవ్వుకున్నారు .

సూరి : రేయ్ గోవర్ధన్ ...... నా ప్లేస్ లోకి రా , బండి తీసుకొస్తాను .
గోవర్ధన్ భుజంపై చేతిని చేర్చగానే ...... , వాడి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి - హాస్పిటల్ లోపలనే అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ సంతోషంతో కేకలువేస్తున్నాడు .
తమ్ముడూ తమ్ముడూ ........
వినయ్ తోపాటు సూరి కూడా అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ కేకలువేస్తూ బుజ్జితల్లిని ఎత్తుకుని పార్కింగ్ వైపుకు వెళ్ళాడు .
తమ్ముళ్లూ ....... ఇంతవరకూ సైలెంట్ గా ఉన్నారుకదా ....... , అంతలోనే ఏమైంది - ప్లీజ్ ప్లీజ్ ఇది హాస్పిటల్ .......
దేవత - చెల్లెమ్మ - పెద్దమ్మ - అంటీ ....... నవ్వుతున్నారు .
గోవర్ధన్ - వినయ్ ...... ఆగండి , బయటకువెళితే ఏమిజరుగుతుందో నాకుతెలుసు , సూరి ...... కారు తీసుకొచ్చేవరకూ బయటకు అడుగుపెట్టనే పెట్టను .
దేవత - చెల్లెమ్మ : అంతమంది అభిమానులను నిరాశపరచడం ఊరిదేవుడికి భావ్యమా ....... అంటూ నవ్వుతున్నారు .
మీరు నవ్వుతున్నారు ఆ సంతోషం చాలు నాకు అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను .
నో నో నో ....... చేతిని కదల్చకండి అంటూ ఇద్దరూ ముందుకువచ్చి , నా చేతిని అందుకుని నెమ్మదిగా కిందకు చేర్చారు .
బ్లడ్ అయితే ఇక అవసరం లేదు కానీ చెల్లెమ్మ రక్తం కాబట్టి మొత్తం ఎక్కించుకుంటాను .
చెల్లెమ్మ : మా అన్నయ్య కాదు కాదు మా దేవుడు బంగారం లవ్ యు అన్నయ్యా ...... అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .

సర్పంచ్ గారు : బాబూ మహేష్ ...... బయటకు రావా అయితే ......
రానంటే రాను , దండాలతో భయపెట్టేస్తారు - అవి చెందాల్సినది మీ ఇద్దరికి మాత్రమే ........
పెద్దయ్య - సర్పంచ్ : ఇద్దరూ ఆనందబాస్పాలతో దండాలుపెట్టారు .
మొదలెట్టేశారు , హమ్మయ్యా అదిగో కారు వచ్చింది మహి గారూ - చెల్లెమ్మా - పెద్దమ్మా - అంటీ పదండి అంటూ బయటకు నడిచి ముందూ వెనుకా డోర్స్ తీసాను.
అంతే నినాదాలు మరింత జోరందుకున్నాయి , ఎలాఉన్నారు నొప్పిగా లేదు కదా , ఆకత్తిపోటు మాకు అయ్యుంటే బాగుండేది ...... మా దేవుడికి అంటూ బాధపడుతున్నారు .
 ప్చ్ ...... అయిపోయాను .
అందరూ నవ్వుకున్నారు .
వినయ్ : అన్నయ్యా ...... మేంఉన్నాము కదా ....
ఈ అదృష్టం నాకు మాత్రమే చెందాలి తమ్ముళ్లూ ...... sorry .
లవ్ యు అన్నయ్యా ...... అంటూ ఎడమవైపు హత్తుకుని , అక్కయ్యా ...... మీరు ముందు కూర్చుని బ్లడ్ ప్యాకెట్ పట్టుకోండి - అత్తయ్యగారూ ...... మీరు ముందు కూర్చోండి , అమ్మా ...... మీరు వెనుక కూర్చోండి .
పెద్దయ్య - సర్పంచ్ గారు - తమ్ముళ్ళిద్దరూ ...... చెల్లెమ్మ వాళ్ళ కారులో కూర్చోవడం చూసి , చెల్లి సహాయంతో దేవత ప్రక్కన గ్యాప్ ఇచ్చి కూర్చున్నాను - ఆ వెనుకే చెల్లి కూర్చుని డోర్ వేసింది . 
నినాదాలు అయితే పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు .

సూరీ ...... ప్రతీ క్షణం ముఖ్యమైనది , ఎక్కడా ఆగకుండా వేగంగా మండపానికి తీసుకెళ్లు .
దేవత : ఇలానే బనీను మొత్తం రక్తంతో ........
సూరీ ...... ఇంటిదగ్గర ఆపు - ఫాస్ట్ ఫాస్ట్ ........
చెల్లెమ్మ : నో నో నో ...... నెమ్మదిగానే పోనివ్వండి .
దేవత : లవ్ యు చెల్లీ ....... 
అలాగే ...... అంటూ పోనిచ్చాడు . వెనుకే పెద్దయ్యా వాళ్ళు ఆ వెనుకే బస్సులో ట్రాక్టర్లలో నినాదాలు హోరెత్తిస్తూనే ఫాలో అయ్యారు .
మహీ గారూ ...... చెయ్యి నొప్పివేస్తుంది అక్కడ పైన కొక్కేనికి తగిలించండి సరిపోతుంది .
దేవత : మా దేవుడికి ఇలా అయినా సేవ చేసుకోనివ్వండి మహేష్ గారూ - ఇది మా అదృష్టం .......
మీరుకూడా ఆపడం లేదు ...... కానివ్వండి కానివ్వండి .
దేవతతోపాటు చెల్లెమ్మ నవ్వుకుని , అన్నయ్యా ...... కాస్త అక్కయ్యవైపు జరగొచ్చు కదా - నాకు ప్లేస్ లేదు .
ప్లీజ్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో చెల్లీ .......
చెల్లెమ్మ : అక్కయ్యను టచ్ చెయ్యడానికి కూడా ఇంత భయమా ...... ? .
పెద్దమ్మ : పర్లేదులే బాబూ జరుగు .......
నో నో నో పెద్దమ్మా ...... అంటూ లెంపలేసుకున్నాను .
దేవత : బెంగళూరు టు వైజాగ్ వరకూ రాసుకుపూసుకు కూర్చుని .........
మహిగారూ నేనా ...... , అంత ధైర్యం ఉందా నాకు ........
దేవత : కత్తిపోటు లేకపోయుంటే దెబ్బలు పడేవి అంటూ నవ్వుకుంటూ మెయిన్ రోడ్ నుండి ఊరి సిమెంట్ రోడ్డులో ఇంటికి చేరుకున్నాము - మన దేవుడు వేసిన రోడ్డు మన దేవుడికే ఉపయోగపడింది - ఇంతకు ముందులా ఉండి ఉంటే .......
సూరి : చాలా చాలా కష్టమైపోయేది అక్కయ్యా ....... - గుంతల కుదుపులకు వేసిన కుట్లు కూడా ఊడిపోయేవి - అన్నయ్యా ......థాంక్యూ అంటూ సెల్యూట్ చేసాడు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-12-2021, 09:41 AM



Users browsing this thread: 82 Guest(s)