Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
వెనక్కు తిరిగిచూడగానే షాక్ ...... , నిన్న అర్ధరాత్రి చీకటిలో భూత్ బంగ్లా కాంపౌండ్ గోడను జంప్ చేసిన టెర్రరిస్టు - వాడి వెనుక కొద్ది డిస్టన్స్ లో మరొకడు ..... మఫ్తీలో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ల ముందే దర్జాగా నడుచుకుంటూ లోపలికి అంటే మురళి గోవర్ధన్ ఇంటివైపు వెళ్లిపోతున్నారు . 
నా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది . తెరుకోవడానికి కొన్ని క్షణాల సమయమే పట్టింది - దూరంగా వెళ్లిపోతుండటం చూసి వెనుకే వెళ్ళాను - భయం వేస్తున్నా పెద్దమ్మను తలుచుకుని కొద్ది గ్యాప్ లో ఏమీ ఎరుగనట్లు వెనుకే నడిచాను - మొబైల్ తీసి వీడియో మోడ్ లో ఉంచి షర్ట్ జేబులో రికార్డ్ అయ్యేలా ఉంచుకున్నాను - మఫ్తీలో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లకు చెబుదామా ...... ? వద్దు వద్దు చీకటిలో సరిగ్గా కనిపించలేదు - వీళ్లేనా కాదో కంఫర్మ్ చేసుకున్నాక చెప్పాలి లేకపోతే అందరికీ డేంజర్ అనుకుని వెనుకే ఫాలో అయ్యాను .

వాళ్లిద్దరూ అదే డిస్టన్స్ లో ఏరియా చివరి ఇంటికి అంటే గోవర్ధన్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఇంట్లోకి తప్పుచేసినవాళ్ళల్లా చుట్టూ చూసి వెళ్ళిపోయి డోర్స్ వేసేసుకున్నారు - నా అనుమానం మరింత పెరగడంతో పెద్దమ్మను తలుచుకుని ధైర్యం చేసి సౌండ్ చెయ్యకుండా కాంపౌండ్ గోడను దూకి ముందు ఉన్న డోర్ - విండోస్ దగ్గరకు వెళితే పూర్తిగా క్లోజ్ చేసి ఉండటం - మరింతమంది లోపల ఉన్నట్లు మాటలు వినిపించడంతో లోపలకు ఖచ్చితంగా చూడాల్సిందేనని బిల్డింగ్ సైడ్ గా భయపడుతూనే లోపలికివెళ్ళాను - నా లక్ కొద్దీ ఒక కిటికీ తెరిచి ఉండటంతో లోపలికిచూస్తే డబల్ షాక్ చెమటలు పట్టేసాయి - లోపల ఏకంగా పదిమందిదాకా ఉండటమే కాకుండా ఒక్కొక్కడూ చూడటానికే భయంకరంగా ఎప్పుడు ఎలా ఇక్కడకు వచ్చారో ఒక్కొక్కరి చేతులలో పెద్ద పెద్ద గన్స్ ఉండటం , పదే పదే అటాక్స్ గురించి మాట్లాడుకోవడం విని వెంటనే నేను కిందకు వొంగి మొబైల్లో రికార్డ్ చేసాను . 
వాళ్ళ బాష సగం సగం అర్థమవుతోంది - మన స్థావరాన్నే కనిపెడతారా ...... ఇందుకే కదా మరొక స్థావరాన్ని కూడా ఏర్పరుచుకున్నది దానిని ఈ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎప్పటికీ కనుక్కోలేరు .
ఒక టెర్రరిస్ట్ :  మరొక స్థావరం ఉందా ...... ? సూపర్ ...... ఎక్కడ భయ్యా ...... ? .
నేను నిన్న చూసినవాళ్ళల్లో ఒకడు మెయిన్ టెర్రరిస్ట్ అయినట్లు , అవును మరొక స్థావరం ఉంది - వైజాగ్ పోర్ట్ లో ఇండియన్ ఫ్లాగ్ తో ఉన్న షిప్ మనం సెకండ్ స్థావరం ....... ఇలానే ఇండియా తీరరేఖ వెంబడి ప్రతీ పోర్ట్ లో మన షిప్స్ ఉన్నాయి  - బయట సెక్యూరిటీ ఎక్కువగా ఉంది , అయినప్పటికీ అర్ధరాత్రిలోపు ప్రతీ సిటీలో జన కూడళ్లలో బాంబ్స్ సెట్ చేసేయ్యాలి అని పైనుండి ప్రతీ సిటీలో ఉన్న మనవాళ్లకు ఆర్డర్స్ వచ్చేసాయి  - రేపు ఇండియా మొత్తం బాంబులతో అట్టుడుకిపోవాలి ప్రపంచానికి మనమంటే వణుకుపుట్టాలి .
మరొక టెర్రరిస్ట్ : yes yes ..... , అయితే పదండి వెళదాము .
మెయిన్ టెర్రరిస్ట్ : ఫైనల్ ఆర్డర్స్ వచ్చేన్తవరకూ wait చెయ్యాలి - కొద్దిసేపట్లో వస్తాయి .
టెర్రరిస్ట్స్ అందరూ సంతోషంతో కౌగిలించుకుని సంబరాలు చేసుకోవడం చూసి వణుకు వచ్చేసింది .

టోటల్ ఇండియా మొత్తం బ్లాస్ట్స్ ...... వెంటనే SI సర్ కు చెప్పాలి అని వొళ్ళంతా చెమట - గగుర్పాటుతో నెమ్మదిగా కాంపాండ్ గోడను జంప్ చేసాను - వీళ్ళు బయటకు వెళ్లనేకూడదు అనుకుని వణుకుతున్న చేతులతో వీడియో ఆఫ్ చేసి SI సర్ కు కాల్ చేసాను .
ఒక్క రింగుకే ఎత్తి హలో హలో హీరో ..... కాదు కాదు చిన్నహీరో ...... కాల్ చేస్తావని నాకు తెలుసు నీ కాల్ కోసమే ఎదురుచూస్తున్నాను - any గుడ్ న్యూస్ అబౌట్ టెర్రరిస్ట్స్ - స్టేట్ సెంట్రల్ మొత్తం అలర్ట్ చేసినా అటాక్స్ జరుగుతాయని హెచ్చరిస్తూనే ఉంది IB ......
Ye..... yes సర్ yes yes అంటూ తడబడుతూ చెప్పాను - సర్ సర్ ....... చాలా భయమేస్తోంది గన్స్ - బాంబ్స్ - అటాక్స్ ........
SI సర్ : కూల్ కూల్ చిన్న హీరో ...... ఎక్కడ ఉన్నావు ? , ఎవరినైనా చూశావా ..... ? .
Yes yes సర్ ...... ఒక్కడు కాదు ఏకంగా 10 - 15 మంది టెర్రరిస్టులు ఒక ఇంటిలో దాక్కున్నారు , ప్రతీ ఒక్కడి చేతిలో పెద్ద పెద్ద గన్స్ , త్వరగా పట్టుకోవాలి సర్ అర్ధరాత్రిలోపు బాంబ్స్ ఫిక్స్ చెయ్యాలని - రేపు పేల్చాలని మాట్లాడుకుంటున్నారు .
SI సర్ : అలా జరగనే కూడదు హీరో ...... , Yes yes నువ్వు కాల్ చేస్తావని తెలిసే ఫోటోలలో ఉన్న స్లీపింగ్ సెల్స్ అందరూ దొరికినా అరెస్ట్ చెయ్యకుండా ఫాలో అవుతున్నాము - వాళ్ళను అరెస్ట్ చేసి ఉంటే వీళ్ళు మరింత అలర్ట్ అయిపోయేవాళ్ళు , మనకు కావాల్సినది మెయిన్ టెర్రరిస్ట్స్ - వీరిని వారినీ ఒకేసారి పట్టుకోవాలి ఇంతకూ ఆ టెర్రరిస్ట్స్ దాక్కున్న ఇల్లు ఎక్కడ హీరో .......
లొకేషన్ పంపిస్తున్నాను సర్ - ఇక్కడ జనాలు పిల్లవాళ్ళు ఎక్కువగా తిరుగుతున్నారు . 
SI సర్ : ఎవ్వరికీ ఏ హానీ జరగకుండా అటాక్ చేస్తాము హీరో .......
సర్ ..... లొకేషన్ పంపించాను తొందరగా రండి - వాళ్ళు మాట్లాడుకున్నది జరిగితే అల్లకల్లోలమే ....... 
SI సర్ : హీరో ...... దగ్గరలోనే ఉన్నాము బయలుదేరిపోయాము - నిమిషాలలో అక్కడ ఉంటాము - నువ్వు జాగ్రత్త అలానే సేఫ్ పాయింట్ చూసుకుని ఎవడైనా బయటకు వస్తాడేమో కంట కనిపెట్టాలి .
ఆ సంగతి నేను చూసుకుంటాను సర్ ....... 
SI సర్ : ప్రౌడ్ ఆఫ్ యు హీరో ....... , అందరినీ అలర్ట్ చెయ్యాలి - సో నీకు మళ్లీ కాల్ చేస్తాను నువ్వు జాగ్రత్త హీరో అని పదే పదే చెప్పారు .
Yes సర్ .........

టెర్రరిస్ట్ ఇంటివైపు చూస్తూనే ఎదురుగా ఉన్న గోవర్ధన్ ఇంటికి వెళ్లి ఫ్రెండ్ ఫ్రెండ్ అని పిలిచాను . 
మేడం : మహేష్ ...... అక్కడే ఆగిపోయావే లోపలికి రా - పైన తన రూంలో ఫ్రెష్ అవుతున్నాడు వెళ్లు ........
థాంక్యూ మేడం అంటూ లోపలికివెళ్లి మెయిన్ డోర్ ప్రక్కనే తాళాలు ఉండటం చూసి వెంటనే మెయిన్ డోర్ కు తాళాలు వేసి జేబులో పెట్టుకున్నాను . టెర్రరిస్ట్ ఇంటివైపు తొంగి తొంగి చూస్తూ పరుగున పైనున్న గోవర్ధన్ రూమ్ కు వెళ్ళాను .
గోవర్ధన్ : What a సర్ప్రైజ్ మహేష్ ....... , ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు - ఏమిటి విషయం ........
ఫ్రెండ్ ఫ్రెండ్ కొద్దిసేపట్లో ఒక అద్భుతం జరగబోతోంది అంటూ బాల్కనీలోకి పిలుచుకునివెళ్లి , మోకాళ్లపై కూర్చుని తననూ కూర్చోమనిచెప్పి మొబైల్లో వీడియో తీస్తున్నాను .
గోవర్ధన్ : అద్భుతమా ....... అంటూ ఉత్సాహంతో చూస్తున్నాడు . ఎటువంటి అద్భుతం మహేష్ ........ ? .
జస్ట్ wait for few మినిట్స్ my ఫ్రెండ్ , you won't డిసప్పాయింట్ ........ , చెప్పినట్లుగానే 10 నిమిషాలకు మన సెక్యూరిటీ అధికారి వెహికల్స్ కాకుండా పెద్ద పెద్ద ఆర్మీ వెహికల్స్ నుండి టాప్ టు బాటమ్ ఫుల్లీ బులెట్ ప్రూఫ్ కవర్డ్ ఆర్మీ డ్రెస్సెస్ లో బెటాలియన్ బెటాలియన్ గన్స్ తో కిందకుదిగారు - వారందరినీ SI సర్ లీడ్ చేస్తుండటం చూసి చాలా ఆనందం వేసింది - స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్లు ...... అటువైపుకు ఎవ్వరూ రాకుండా క్లియర్ చేస్తున్నారు .
గోవర్ధన్ : మహే......ష్ ...... ఏమిజరగబోతోంది అంటూ ఆశ్చర్యపోతూ లెవబోతుంటే .......
గోవర్ధన్ డేంజర్ అంటూ కిందకు లాగాను - పైకి మాత్రం లేవకు - బుల్లెట్ల వర్షం .......
గోవర్ధన్ : కింద మమ్మీ డాడీ ఉన్నారు , బయటకు వెళతారేమో ........ అని కంగారుపడ్డాడు .
వెళ్లనే వెళ్ళరు అంటూ తాళాలు తన జేబులో ఉంచాను .
గోవర్ధన్ : సూపర్ మహేష్ ....... , అయినా నీకెలా తెలుసు ? .
ముందు జరగబోయేది ఇలా దాచుకుని ఎంజాయ్ చెయ్యి మై ఫ్రెండ్ ........

అంతలో టెర్రరిస్ట్ ఇంటి కిటికీలోనుండి ఒక సోల్జర్ పై బుల్లెట్ల వర్షం కురిసింది . అటాక్ అటాక్ అంటూ అందరూ అలర్ట్ అయిపోయారు . 
ఛాతీపై బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉండటం వలన చేతుల నుండి మాత్రమే బ్లడ్ కారడం చూసి వెంటనే వెహికల్లోకి ఎక్కించారు .
SI సర్ కు కోపం వచ్చినట్లు కిటికీలవైపు ఫైరింగ్ చేస్తూనే ఇంటిని చుట్టుముట్టండి అంటూ సైగచేసి , వాకీలో కమాన్ కమాన్ ల్యాండ్ ల్యాండ్ ...... ఫైరింగ్ at us ఫైరింగ్ at us .......
ఎటునుండి వచ్చాయో రెండు ఆర్మీ హెలికాఫ్టర్స్ ...... ఫస్ట్ ఫ్లోర్ కిటికీల నుండి ఫైరింగ్ చేస్తున్న వాళ్లపైకి బుల్లెట్ల వర్షం కురిపించి టాప్ ఫ్లోర్లో కొంతమంది సోల్జర్స్ ల్యాండ్ అయ్యారు .
ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా , ఆలస్యం చేస్తే లోపలవాళ్ళు అలర్ట్ అవుతారని , సోల్జర్స్ వైపు లోపలికి అంటూ చూయించి , ప్రాణాలకు సైతం తెగించి కాంపౌండ్ దూకి మెయిన్ డోర్ ను చిన్నపాటి బాంబుతో పగలగొట్టి షూట్ చేస్తూ లోపలికి దూసుకువెళ్లిపోయారు - పైనుండి సోల్జర్స్ ఇంటిలోకి దిగినట్లు తెలుస్తోంది .

సర్ ధైర్యాన్ని చూసి నాకే భయం వేసింది - సూపర్ సర్ ....... ఒక్క ప్రాణం కూడా పోకూడదు అన్న మీ ఆలోచనకు హాట్సాఫ్ ....... - పెద్దమ్మా ...... సర్ కు ఏమీకాకూడదు అని ప్రార్థించాను - సర్ కు ...... మేడం , పిల్లలు ఉన్నారుకదా , అందులోనూ నా తమ్ముడు - చెల్లి ......
మెసేజ్ : మా బుజ్జిహీరో కోరిక కొరడమూ ...... ఈ పెద్దమ్మ తీర్చకపోవడమూనా ...... ? .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా .........
కింద నుండి SI సర్ - పైనుండి సోల్జర్స్ ..... అటాక్ చేస్తున్నట్లు 5 - 10 నిమిషాలపాటు లోపలనుండి భయంకరంగా ఫైరింగ్ - హాహాకారాలు వినిపిస్తున్నాయి . ప్రతీ కేకకూ గుండె ధడ ధడా అంటోంది - చెమటలు పట్టేస్తున్నాయి .
గోవర్ధన్ : రేయ్ మహేష్ ...... నాకు భయమేస్తోంది - అంత దైర్యంగా ఎలా రికార్డ్ చేస్తున్నావు .
నాకు ధైర్యమా ...... నా గుండె చూశావా ఎంత వేగంగా కొట్టుకుంటోందో ........

15 నిమిషాల తరువాత ఫైరింగ్ - కేకలు ఆగిపోయాయి . లోపలనుండి హాల్ ...... క్లియర్ - bedrooms ...... క్లియర్ - కిచెన్ ..... క్లియర్ - టాప్ ఫ్లోర్ క్లియర్ క్లియర్ క్లియర్ అంటూ సోల్జర్స్ ఒక్కొక్కరే బయటకువచ్చి హైఫై - కౌగిలించుకుంటున్నారు .
సర్ సర్ సర్ ....... ఇంకా బయటకు రావడం లేదు ఏమిటి అంటూ రికార్డ్ చేస్తూనే కంగారుపడుతూ లేచి నిలబడ్డాను . 
Atlast atlast ....... చిన్న గాయం కూడా లేకుండా నేను చూసిన మెయిన్ టెర్రరిస్టును లాక్కుంటూ బయటకువచ్చి , జీరో జీరో casualities సర్ - మన ఒక్క సోల్జర్ కు మాత్రం చేతికి బుల్లెట్స్ తగిలాయి సర్ హాస్పిటల్ కు పంపించాము . Yes సర్ yes సర్ ....... ఒక టెర్రరిస్టును మాత్రమే ప్రాణాలతో దొరికాడు మిగతావాళ్ళంతా స్పాట్ డెడ్ సర్ ........ థాంక్యూ సర్ .......

సర్ ను చూసి యాహూ ....... థాంక్యూ థాంక్యూ soooo మచ్ పెద్దమ్మా అంటూ సంతోషించాను . 
అంబులెన్స్ రావడం వితిన్ మినిట్స్ లో కుక్కచావు చచ్చిన టెర్రరిస్టు బాడీలను తీసుకుని వెళ్లిపోయారు - వెనుకే ఆర్మీ వెహికల్స్ లో సర్ , సోల్జర్స్ విజయ సంకేతాలతో టెర్రరిస్టుని తీసుకుని వెళ్లారు - స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ బిల్డింగ్ ను సీల్ చేసి చుట్టూ కాపలాగా నిలబడ్డారు - ఆర్మీ ...... ఏరియా లోని ప్రతీ ఇంటినీ సెర్చ్ చేస్తున్నారు .

గోవర్ధన్ నాన్నా గోవర్ధన్ అంటూ కేకలు వినిపించడంతో , మమ్మీ డాడీ అంటూ కిందకు పరుగులుతీశాడు - yes మమ్మీ ...... కీస్ నా దగ్గరే ఉన్నాయి అంటూ ఓపెన్ చేసాడు . మేడం ....... గోవర్ధన్ ను హత్తుకున్నారు . 
ఆర్మీ లోపలికివచ్చి అణువణువూ చెక్ చేసి క్లియర్ అంటూ వెళ్లిపోయారు .

Expect చేసినట్లుగానే SI సర్ నుండి కాల్ ........ , హీరో ....... నీకేమీ కాలేదు కదా ........
నాకేమీ కాలేదు సర్ ...... ,
SI సర్ : హమ్మయ్యా .......
అయినా మీరేంటి 10 - 15 మంది టెర్రరిస్టులు ఉన్నారని చెప్పినా , అటాక్ చేస్తున్నా ...... ఏమాత్రం భయం లేకుండా అలా లోపలికి దూసుకువెళ్లారు .
SI సర్ : వాళ్ళ వలన ఇక ఏ ఒక్కరి ప్రాణాలూ పోకూడదు అని నిర్ణయించుకుని లోపలికి వెళ్ళిపోయాను .
థాంక్ గాడ్ ...... , మీకేమీ కాలేదు - ఎంత భయపడ్డానో తెలుసా సర్ ....... 
SI సర్ : అంటే నువ్వు అక్కడే ఉన్నావన్నమాట , ప్చ్ ....... కలవాల్సింది .
నన్ను కలవడం ముఖ్యం కాదు సర్ ...... , టెర్రరిస్టు వెంట్రుకలు పట్టుకుని జరజరా లాక్కునివచ్చారు చూడండి సూపర్ అంతే ....... 
SI సర్ : వాడితోపాటు సిటీ నలుమూలలలో ఆర్డర్స్ కోసం ఎదురుచూస్తున్న స్లీపింగ్ సెల్స్ అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసాము - వాళ్ళందరినీ టార్చర్ పెట్టైనా సరే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎక్కడా అటాక్స్ జరగకుండా చూడాలి - టెర్రరిస్ట్ స్లీపింగ్ సెల్స్ అందరినీ టాప్ సీక్రెట్ ప్లేస్ కు తీసుకెళుతున్నాము - అంటే దగ్గరలోనే ఉండి మొత్తం చూశావన్నమాట ........
మీడియా ఎందుకు రాలేదు సర్ ....... ? , వచ్చి ఉంటే దేశం మొత్తం మీ ధైర్య సాహసాలు చూసి గర్వపడేవారు .
SI సర్ : నో నో నో హీరో ....... , మీడియా రాకుండా నేనే పకడ్బందీగా కట్టడి చేసాను - ఇక్కడ టెర్రరిస్టులపై అటాక్ చేసి చంపిన విషయం దాక్కున్న మిగతా టెర్రరిస్టులకు తెలిస్తే అలర్ట్ అయిపోయి ఏమైనా చెయ్యవచ్చు - వాళ్లకు విషయం తెలిసేలోపు వీడినుండి సమాచారం సేకరించి ముందుగా మనమే అటాక్ చేసి నిర్వీర్యం చెయ్యాలి .
సూపర్ సూపర్ సర్ ........ , ప్రాణాలకు తెగించి కూడా పబ్లిసిటీ ఆశించడం లేదు హాట్సాఫ్ సర్ ........
SI సర్ : అది ఒక చిన్న హీరో నుండే నేర్చుకున్నాను అంటూ నవ్వేశారు - ఇప్పటికైనా Ok అను హీరో ....... ప్రతీ ఒక్కరికీ నీగురించి నువ్వు చేసినది తెలియాలి .
నో నో నో సర్ ...... , రేపు నా ఫేవరేట్ అండ్ ప్రాణమైన exam - టెర్రరిస్ట్ నుండి పూర్తి సమాచారం సేకరిస్తారని చెప్పాక ఇక నన్ను డిస్టర్బ్ చెయ్యరు - హాయిగా చదువుకోవచ్చు అని నేననుకుంటుంటేనూ ........ మీరేమో దేశం మొత్తం నో నో నో ........ నో అంటే నో బై బై సర్ ...... మీరు టార్చర్ లో - నేను స్టడీస్ లో మునిగిపోదాము .
SI సర్ : ప్రౌడ్ ఆఫ్ యు హీరో ....... , All the best for టుమారో exam గుడ్ నైట్ ........
All the best for your టార్చర్ సర్ ...... గుడ్ నైట్ అని కట్ చేసాను - ( అయినా మీకు అప్పుడే గుడ్ నైట్ కాదులే ...... , వాడు పోర్ట్ లో ఉన్న షిప్ గురించి సమాచారం ఇవ్వగానే మళ్లీ పరుగులు తీస్తారు ) .

మహేష్ మహేష్ ....... అని కేకలువేస్తూ గోవర్ధన్ పైకివచ్చాడు . మహేష్ ...... ఎదురింట్లో ఉన్నది టెర్రరిస్టులు అని మమ్మీ డాడీ వాళ్లకూడా ఎంత భయపడ్డారో తెలుసా ..... ? , మెయిన్ గేట్ కు లాక్ వేసి మంచిపనిచేశావు థాంక్యూ సో మచ్ - అవునూ ఇంతకూ వాళ్ళు టెర్రరిస్టులు అని అటాక్ జరగబోతోందని నీకెలా తెలిసింది ? .
అదీ అదీ ...... మినీ గ్రౌండ్ దగ్గర మనం చదువుతుండగా అటూ ఇటూ పదే పదే తిరుగుతున్నవారు ఎవరోకాదు , మఫ్తీలో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు - చివరగా నేను వచ్చేటప్పుడు మాట్లాడుకుంటుంటే విన్నాను - సరిగ్గా అదే జరిగింది .
అంతలో నా మొబైల్ కు మరియు టేబుల్ పైనున్న గోవర్ధన్ మొబైల్ కు ఒకేసారి మెసేజ్ లు రావడంతో చూస్తే ఫ్రెండ్స్ నుండి ...... " అటాక్ గురించి మరియు ఆర్మీ ప్రతీ ఇంటిని సోదా చేస్తున్నందువలన ఎవరి ఇంట్లో వాళ్ళు చదువుకోవడం సేఫ్ " .
గోవర్ధన్ : మహేష్ ....... మన ఫ్రెండ్స్ అంతా అటాక్ గురించి విన్నారు కానీ మనం లైవ్ లో చూసాము - నీ వల్లనే థాంక్యూ అంటూ కౌగిలించుకున్నాడు . 
మరి అప్పుడు నాతోపాటు భయపడ్డావు .......
గోవర్ధన్ : అటాక్ చూసి అప్పుడు భయం వేసింది , ఇప్పుడు థ్రిల్లింగ్ గా ఉంది అంటూ ఎక్సైట్ ఫీల్ అవుతున్నాడు - మహేష్ ....... ఇప్పుడు బయటకు వెళ్లడం సేఫ్ కాదు ఇక్కడే చదువుకో ........
నో నో నో మై ఫ్రెండ్ - బాక్స్ ...... ఔట్ హౌస్ లో ఉన్నాయి - రివిజన్ చూసుకోవాలికదా పర్లేదులే జాగ్రత్తగా వెళతాను .
గోవర్ధన్ : Ok అంటూ మెయిన్ గేట్ వరకూ వదిలాడు .
గుడ్ నైట్ చెప్పేసి కొన్ని అడుగులువేశానో లేదో ...... , సెక్యూరిటీ ఆఫీసర్లు ఆపి మొత్తం చెక్ చేసి బయట ఉండకూడదు తొందరగా ఇంటికివెళ్లు ఇంతకూ ఇల్లు ఎక్కడ ? .
దగ్గరలోనే సర్ .......
సెక్యూరిటీ అధికారి : పదా ఇంటివరకూ వదులుతాను లేకపోతే ప్రతీ అడుగుకూ ఒక సెక్యూరిటీ అధికారి - ఆర్మీ ఆపుతారు , చూశావా ...... ఒక్కరుకూడా బయట తిరగడం లేదు .
బుక్స్ దేవత ఇంటిలోనే ఉన్నాయికాబట్టి నేరుగా అక్కడికే తీసుకెళ్ళాను . ఇదే సర్ ........
సెక్యూరిటీ అధికారి : మళ్లీ బయటకు రావద్దు అనిచెప్పి వెళ్లిపోయారు .
తాళాలు తెరిచి లోపలికివెళ్లి లాక్ చేసేసుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-11-2021, 10:38 AM



Users browsing this thread: 30 Guest(s)