Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఎవరు వీళ్లంతా లోపలికి వచ్చేసారు అంటూ గదిలోనుండి ఒకడు కోపంతో వచ్చాడు .
కృష్ణవేణి : మావయ్యా ....... వీరు , కృష్ణ అక్కయ్య - కీర్తి - అక్కయ్య ఫ్రెండ్స్ ...... - నాన్న చెప్పే ఉంటారుకదా వస్తారని .......
వీళ్లేనా ...... సరే సరే మంచిది అంటూ కోపంతో వెనక్కు చూస్తూ చూస్తూ వెళ్ళిపోయాడు .
బుజ్జితల్లి : అత్తయ్యా ...... అతడి చూపు సరిగ్గా లేదు , భయమేస్తోంది .
సిస్టర్స్ : అవునవును ఏదో తేడాగా కన్నింగ్ గా కనిపిస్తున్నాడు .
కృష్ణవేణి : అవునుకదా ..... , అతనంటే నాకూ నచ్చదు - మా దూరపు చుట్టం అప్పుడప్పుడూ వస్తూ ఉంటాడు - పెళ్లి కుదిరింది అని నాన్నగారు చెప్పడం ఆలస్యం , పిలవకుండానే వచ్చేశాడు - పెళ్లయ్యాక పంపించేస్తారులే నాన్నగారు ..... , భవనం మొత్తం చూయించి వంట గదిలోకి తీసుకెళ్లారు . 

బుజ్జితల్లి : అత్తయ్యా ...... అక్కడ మల్లీశ్వరి అంటీ హీరో కూడా ఉన్నారు .
మల్లీశ్వరి గారు సిగ్గుపడ్డారు .
కృష్ణవేణి : అలానే కీర్తీ ...... ఇద్దరికి క్యారెజీ పంపిద్దాము అని వంటలన్నింటినీ ఒక్కొక్క బాక్స్ లో ఉంచారు .
దేవత : చెల్లీ ...... ఇంత ఫుడ్ దేవుడు కూడా తినలేరు .
కృష్ణవేణి : మన ఇంటి దేవుడే కదా అక్కయ్యా ..... , తింటారులే అని సంతోషంతో నవ్వుకున్నారు .
మల్లీశ్వరి గారు : నేను ఇచ్చేసి వస్తాను .......
బుజ్జితల్లి : నేనూ వస్తాను అంటీ .......
కృష్ణవేణి : ప్చ్ ...... , కీర్తీ ...... మన దేవుడు అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు , మా బంగారం కదూ ప్లీజ్ ప్లీజ్ ...... నాకు తినిపించాలని ఉంది .
బుజ్జితల్లి : sorry అత్తయ్యా .......
కృష్ణవేణి : మా బంగారు కీర్తీ ...... నాకు sorry ఎప్పుడూ చెప్పాల్సిన అవసరం లేదు - లవ్ యు అంటూ ముద్దుపెట్టింది .
బుజ్జితల్లి : లవ్ యు టూ అత్తయ్యా ....... 
కృష్ణవేణి : మల్లీశ్వరి అక్కయ్యా ...... , నాన్నగారే స్వయంగా ఇచ్చేసి వస్తారు అని పిలిచి క్యారెజీ ఇచ్చి , నాన్నగారూ ....... వారు తిన్నాకనే కీర్తీ తినేది కాబట్టి .....
మావయ్య గారు : అర్థమైంది తల్లీ ...... వీడియో కాల్ చేస్తాను కదా ......
కృష్ణవేణి : లవ్ యు నాన్నగారూ ...... , అక్కయ్యలూ ...... నా గదిలోకి వెళదాము రండి అని ఫస్ట్ ఫ్లోర్ గదిలోకివెళ్లారు . 
*********

బైక్స్ మాత్రమే పారాడుతున్న ఆ మట్టిరోడ్డులో ఒక కారు అదికూడా నేరుగా మాదగ్గరికే వచ్చి ఆగింది . కారులోనుండి చిరునవ్వులు చిందిస్తూ పెద్దవారు దిగి బాబూ మహేష్ ...... సాదరంగా ఇంటికి తీసుకెళ్ళాల్సినది కట్టుబాట్ల వలన తప్పడం లేదు క్షమించండి - ఇంతకూ నేనెవరో చెప్పనేలేదు కదూ ...... , పెళ్లికూతురి తండ్రిని .......
అయ్యో అంకుల్ క్షమించండి అంటూ కారుమీదనుండి దిగి చేతులు కలిపాను .
అంకుల్ : ఆ తోట ఎవరిది ? , లోపల భోజన ఏర్పాట్లు చెయ్యండి త్వరగా - కీర్తీ తల్లి మరియు నా బంగారుతల్లి కలిసి క్యారెజీ రెడీ చేసి పంపించారు రా బాబూ తోట లోపలికి .......
తోటమాలి : అయ్యగారూ మీరా ...... రండి అంటూ గౌరవిస్తూ లోపలికి పిలుచుకునివెళ్లాడు .
అంకుల్ తోపాటు వచ్చిన ఇద్దరు ..... ఒక చెట్టు నీడలో కూర్చోవడానికి అన్నీ ఏర్పాట్లూ చేశారు .
అంకుల్ : బాబూ ఇద్దరూ కూర్చోండి అంటూ అరటి ఆకు పరిచి అన్నీ వంటలనూ వడ్డించారు .
అంకుల్ - అన్నలూ ...... మీరూ కూర్చోండి , లంచ్ టైం అయ్యింది కదా .......
అన్నలు : లేదు లేదు మేము బయట ఉంటాము అని వెళ్లిపోయారు .
అంకుల్ ....... మీరూ కూర్చోండి అని అరటి ఆకు పరిచి వడ్డించాను .
అంకుల్ : మీరు భోజనం చేయడం చూస్తేనేకానీ అక్కడ కీర్తీ - నా కూతురు తినరని కూర్చున్నారు , ముందు వీడియో కాల్ చేస్తాను - కీర్తితల్లీ ...... పచ్చని తోటలో మీ అంకుల్ కు నేనే స్వయంగా వడ్డించాను , మీ అంకుల్ ...... నాకు వడ్డించారు .
బుజ్జితల్లి : అంకుల్ ఉమ్మా ....... , అన్నీ వంటలనూ అత్తయ్యే స్వయంగా చేశారు ఎలా ఉన్నాయి .
సూపర్ బుజ్జితల్లీ ...... , చెల్లెమ్మా ...... వంటలు అద్భుతంగా ఉన్నాయి .
కృష్ణవేణి : థాంక్స్ అన్నయ్యా ...... , చెల్లెమ్మా ...... అని ఆప్యాయంగా పిలిచారు చాలా చాలా సంతోషంగా ఉంది అని బుజ్జితల్లికి ముద్దుపెట్టింది .
బుజ్జితల్లీ ...... , తింటున్నాము కదా ..... మీరూ తినండి .
బుజ్జితల్లి : అత్తయ్యా ...... ఆకలేస్తోంది .
దేవత : మీ అంకుల్ తింటేనే కానీ ఆకలి వెయ్యలేదన్నమాట ఈ బుజ్జి రాక్షసికి ......
బుజ్జితల్లి : చూడండి అత్తయ్యా ...... ఉదయం నుండీ బుజ్జి రాక్షసి అంటోంది మమ్మీ ........
అందరూ నవ్వుకున్నారు .
కృష్ణవేణి : మీ మమ్మీకి ...... బుజ్జి దేవతవూ నువ్వే - బుజ్జి రాక్షసీవీ నువ్వే కదా అంటూ ముద్దుచేస్తూ కింద డైనింగ్ టేబుల్ పై చేరి , అందరికీ వడ్డించింది .
దేవత : చెల్లీ ...... మనమంతా ఒక ఫ్యామిలీ - ఒకరికొకరం వడ్డించుకుందాము కూర్చో , అత్తయ్యగారూ కూర్చోండి - అక్కడ మావయ్యగారు బాగా తింటున్నారులే అంటూ కూర్చోబెట్టుకున్నారు . 
కృష్ణవేణి ....... టేబుల్ పై ఉన్న బుజ్జితల్లి ముందు కూర్చుని ప్రేమతో తినిపించి తిన్నారు .

అంకుల్ ఇంటికి చేరుకున్నాక , దేవతవాళ్ళు కొద్దిసేపు రెస్ట్ తీసుకుని , చెల్లీ ...... ముహూర్తానికి అన్నింటినీ రెడీ చెయ్యాలి ఇక వెళ్ళొస్తాము అని దేవత చెప్పారు .
కృష్ణవేణి : మా కీర్తిని కలవాలంటే ఉదయం వరకూ ఆగాలి అంటూ ప్రేమతో హత్తుకుని ముద్దులుపెడుతూనే ఉన్నారు . 
అత్తయ్యగారు అందరికీ సాంప్రదాయబద్ధంగా పట్టుచీర - పసుపు కుంకుమ అందించి సంతోషంతో పంపించారు .
బుజ్జితల్లి : మా అత్తయ్య కోసం ఉదయం ఆశతో ఎదురుచూస్తుంటాము అని ముద్దులుపెట్టి బయలుదేరారు .
కృష్ణవేణి ఏకంగా రోడ్డుమీదకువచ్చి కనుచూపుమేరవరకూ టాటా చెప్పి ఎక్కువ సంతోషం - చిరు బాధతో తన తల్లితోపాటు లోపలికివెళ్లింది .

సిస్టర్స్ : బుజ్జితల్లీ ....... , మీ కాబోయే అత్తయ్య నచ్చిందా ? .
బుజ్జితల్లి : అంకుల్ తరువాత - మమ్మీ తరువాత అత్తయ్యనే అంతగా నచ్చారు . 
దేవత : ఈ మమ్మీ కంటే అంకుల్ అంటేనే ఎక్కువ ఇష్టం అన్నమాట ........
బుజ్జితల్లి : అవును మమ్మీ అంటూ దేవత పెదాలపై ముద్దుపెట్టి ఐస్ చేసేసింది .
దేవత : సరి సరి .......
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
20 నిమిషాలలో పొలిమేర చేరుకున్నారు . అదిగో కార్ అంకుల్ ఎక్కడ ఎక్కడ అంటూ చుట్టూ చూస్తోంది బుజ్జితల్లి ........

పొలిమేర తోరణం దాటగానే ఐదుగురు ముసుగువ్యక్తులు కారుకు అడ్డుగా నిలబడి కత్తులు తీసి కారుని చుట్టుముట్టారు .
కారులో అందరూ భయపడిపోతున్నారు .
మల్లీశ్వరి అలర్ట్ అయిపోయి మిర్రర్స్ క్లోజ్ చేసి వేగం పెంచేంతలో ...... , రోడ్డుకు అడ్డుగా వెనుకా ముందూ పెద్ద పెద్ద రాళ్లు వెయ్యడంతో , ముందుకూ వెనుకకూ వెళ్లలేని పరిస్థితి .
సిస్టర్స్ ...... సర్ సర్ అంటూ - మల్లీశ్వరి ...... ఏమండీ ఏమండీ అంటూ - దేవత ...... మహేష్ గారూ మహేష్ గారూ అంటూ - బుజ్జితల్లి ...... అంకుల్ అంకుల్ అంటూ కేకలువేస్తున్నారు , మిర్రర్స్ క్లోజ్ చెయ్యడం వలన కేకలు వినిపించడం లేదు.

చంపేస్తాము అంటూ గొంతుపై కత్తులు ఉంచుకుని సైగలు చేస్తూ కారు చుట్టూ - ఇంజిన్ మీదకు చేరి మిర్రర్స్ పగలగొడుతున్నారు . లాభం లేకపోవడంతో ఒకడు రాయి అందుకుని వెనుక డోర్ అద్దాన్ని కొట్టగానే మిగిలిపోయింది .
బుజ్జితల్లి భయంతో డాడీ డాడీ అంటూ గట్టిగా కేకలువేసింది పగిలిన మిర్రర్ ద్వారా వినిపించగానే ...... తోటను వీక్షిస్తున్న ఇద్దరమూ పరుగునవచ్చాము .
కారుపై కత్తులతో దాడి చేస్తుండటం చూసి గగుర్పాటుకు లోనయ్యాను . రేయ్ రేయ్ అంటూ పగిలిన మిర్రర్ ద్వారా కత్తి దూర్చిన వాడిని వెనక్కు లాగేసాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ...... అంటూ భయపడిపోతోంది .
అలా నా బుజ్జితల్లిని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది .
రేయ్ ....... మా వాడినే కొడతావా అంటూ ఐదుగురూ కత్తులతో నా ముందుకు చేరారు .
బుజ్జితల్లి : డాడీ జాగ్రత్త .......
అన్నయ్యా ..... జాగ్రత్త అంటూ సూరి వొఇసులో కూడా భయం కనిపిస్తోంది . హలో హలో సర్పంచ్ గారూ ....... ఎవరో ఐదుగురు ముసుగుల్లో అక్కయ్యా వాళ్లపై దాడిచేస్తున్నారు కత్తులు కత్తులతో తొందరగా వచ్చెయ్యండి .
ముసుగుల్లో ముందున్నవాడు ...... రేయ్ ముందు వీడిని వేసేయ్యండ్రా అంటూ కత్తితో వేగంగా వచ్చాడు .
సూరి : అన్నయ్యపైకి కత్తులతో వస్తున్నారు , నాకు భయమేస్తోంది తొందరగా తొందరగా .......
నావైపు వచ్చినవాడి కత్తిపట్టుకున్న చేతిని పట్టుకుని చెవిపై బలంగా ఒక దెబ్బవేశాను - అంతే గింగిరాలు తిరుగుతూ నెలకు అతుక్కుపోయాడు . హమ్మా హబ్బా ...... అంటున్నాడు కానీ ఉలుకులేదు - చెవిలోనుండి రక్తం కారిపోతోంది .
సూరి : సర్పం....చ్ గా.....రూ ...... అంటూ ధీర్ఘం తీసాడు - తేరుకుని సర్పంచ్ గారూ భయమే లేదు నెమ్మదిగా రండి అంటూ విజిల్ వేసి , అన్నయ్యా ...... నాకూ భయం పోయింది - కీర్తి తల్లీ ...... మాంచి యాక్షన్ మూవీ ఎంజాయ్ చేయబోతున్నారు అంటూ రోడ్డుప్రక్కన పడిన రెండు కర్రలను తీసుకొచ్చి ఒకటి అందించాడు . 
థాంక్స్ తమ్ముడూ ...... అంటూ కత్తులతో నలుగురూ మావైపుకు రాకముందే , నా బుజ్జితల్లినే కత్తులతో భయపెడతారా అంటూ ఒక్కొక్కడి దిమ్మతిరిగేలా పొడవాటి కర్రలతో ఒక్కొక్కడి చెవులపై - ఆ వెంటనే తొడలపై బలంగా దెబ్బలువేశాను .
వెనుక నెలకు అతుక్కుపోయినవాడు లేవడం చూసి , లేచినవాడిని లేచినట్లుగా కొడుతున్నాడు సూరి ....... 
బుజ్జితల్లి చూసి నవ్వడం చూసి , లవ్ యు బుజ్జితల్లీ ...... నేనున్నాను కదా - రావడానికి ఆలస్యం అయ్యింది అంతే ........
బుజ్జితల్లి : డాడీ ...... వెనుక ......
కత్తికి కర్రను అడ్డుపెట్టి , వెనుక నుండి కాదురా మగాడిలా ముందునుండి అటాక్ చెయ్యాలి అంటూ షర్ట్ లాగి వీపుపై ఆపకుండా దెబ్బలు వేస్తున్నాను . 
వాడు నొప్పితో వేసిన కేకలు బహుశా రెండు ఊళ్లకు వినిపించాయేమో .......
ఎవడురా వీడు ఇలా కొడుతున్నాడు అంటూ చెవులలోనుండి కారుతున్న రక్తాన్ని చూసి వణుకుతున్నారు . 
రేయ్ ఎవర్రా మీరు , త్వరగా రండి అక్కడ బోలెడన్ని పెళ్ళిపనులు ఉన్నాయి - మీలాంటి వాళ్ళు ఉంటారనే అనాధనైన నేను చాలీ చాలని ఫుడ్ తింటూ కష్టపడి పెరిగాను - బాడీ పెంచాను కుమ్మడానికి ........ చూస్తారా ..... ? .
బుజ్జితల్లి : చూస్తాము చూస్తాము .......
సిస్టర్స్ : మేము కూడా ......
లేడీస్ సిగ్గు - బుజ్జితల్లీ sorry .......
బుజ్జితల్లి : లవ్ యు డాడీ ...... అంటూ నవ్వుతూనే ఉంది .
రేయ్ త్వరగా రండి రా ....... , నా ...... మేడం గారి బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకోవాలి అని నేనే ముందుకువెళ్లి ఒక్కొక్కడి తాట తీసాను - రేయ్ .....ముందు మీ ముఖాలు చూడాలి ముసుగులు తియ్యండి అంటూ ఇద్దరిని పట్టుకున్నాను .
ఎంత ఫాస్ట్ గా వచ్చారో ఏమిటో చేతుల్లో కర్రలతో ఏకంగా రెండు వైపుల నుండీ రెండు గ్రామాల ప్రజలంతా ట్రాక్టర్లలో కర్రలూపుకుంటూ వచ్చేసారు - వారిలో వెనుక పెద్దయ్య కూడా ట్రాక్టర్ నుండి దిగటం చూసి పెద్దయ్యా పెద్దయ్యా ...... అంటూ వెళ్లి పట్టుకున్నాను .
ఈ గ్యాప్ లో రేయ్ దొరికితే ప్రాణాలు పోయినట్లే పరిగెత్తండి రా అంటూ ఇరువైపులా ఉన్న తోటల్లోకి కంచెలు దూకిమరీ పరుగుతీశారు ఐదుగురూ .......
సర్పంచ్ గారు : వదలకండి వెళ్లి పట్టుకోండి అని చెప్పగానే ...... , తోటల్లోకి వెనుకే పరుగుతీశారు కొంతమంది .

పెద్దయ్యా ...... రక్తం రక్తం పాదాలంతా రక్తం , సూరీ ...... కారు తియ్యి ......
సూరి : అలాగే అన్నయ్యా ...... అంటూ క్యాబ్ తీసుకొచ్చాడు .
పెద్దయ్యను కూర్చోబెట్టి ఎక్కబోతే ...... , డాడీ డాడీ ...... పరుగున వచ్చిన బుజ్జితల్లిని ఎత్తుకుని , మల్లీశ్వరి గారూ ....... వెనుకే రండి అని కూర్చోగానే సిటీ వైపు వేగంగా పోనిచ్చాడు .
ట్రీట్మెంట్ తీసుకున్న సేమ్ హాస్పిటల్ కు తీసుకెళ్లాము . స్ట్రెచర్ పై పడుకోబెట్టి సేమ్ ఆపరేషన్ రూమ్ కు తీసుకెళ్లాము - వెనుకే దేవత వాళ్ళు వచ్చారు - బుజ్జితల్లీ మేడం గారూ ...... ఏమీకాదు , మనకోసం ట్రాక్టర్లో వచ్చారుకదా ఎక్కేటప్పుడు - దిగేటప్పుడు ఏదో తగిలి రక్తం కారి ఉంటుంది .

కొద్దిసేపటి తరువాత డాక్టర్ వచ్చి అదే విషయం చెప్పారు . ఫ్రాక్చర్స్ ఏమీ కాలేదు సర్ - రెండు చోట్ల కుట్లు ఊడిపోవడం వలన రక్తం వచ్చింది - వెళ్లి చూడొచ్చు - వారం రోజులపాటు ఇంటి నుండి బయటకు కదులకూడదు .
మేడం ....... రండి అంటూ లోపలికి పిలుచుకునివెళ్ళాను .
నాన్నగారూ ....... 
తాతయ్యా .......
బుజ్జితల్లిని బెడ్ పై కూర్చోబెట్టాను .
పెద్దయ్య : బుజ్జితల్లీ - తల్లీ - బాబూ ...... మీకేమీ కాలేదు కదా ......
దేవత : దేవుడే తోడుగా ఉంటే ఏమౌతుంది నాన్నగారూ ....... 
బుజ్జితల్లి : తాతయ్యా ...... నొప్పిగా ఉందా ..... ? .
పెద్దయ్య : కొద్దిగా ఉంది బుజ్జి తల్లీ ...... , మిమ్మల్ని చూసాను కదా పోయింది , మా దేవుడు బాబూ నువ్వు - నువ్వు తోడుగా వెల్లకపోయుంటే .......
ఆ మాట ఊహించడంతోనే , నా గుండె చప్పుడు ఆగిపోయేది పెద్దయ్యా ...... అంటూ బుజ్జితల్లి బుజ్జిచేతిపై ముద్దుపెట్టాను .

సర్పంచ్ గారు - పెళ్లికూతురు నాన్నగారు అంకుల్ ....... లోపలికివచ్చి పరిస్థితి తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు .
సర్పంచ్ గారూ ...... వాళ్ళు దొరికారా ? .
సర్పంచ్ గారు : తోటల వెనకున్న కొండల్లోకి వెళ్లిపోవడం వలన ఒక్కడూ దొరకలేదు మహేష్ .......

ఇంటి నుండి మరియు చెల్లెమ్మ కృష్ణవేణి నుండి దేవతకు కాల్స్ రావడంతో మాట్లాడి ధైర్యం చెప్పారు .
డాక్టర్ గారు వచ్చి , సర్ ...... బయట జనమంతా వీరికోసమేనా ..... ? .
అవును డాక్టర్ .......
డాక్టర్ : వచ్చే పోయే పేషెంట్స్ కు ఇబ్బందిగా ఉంది , ప్రాబ్లమ్ ఏమీ లేదు నడవకుండా ఉంటే డిశ్చార్జ్ అయ్యి వెళ్లొచ్చు అమౌంట్ పే చేసి .......
పెద్దయ్య : బాబూ మహేష్ ...... , నీ మాట వినలేదు క్షమించు - ఇక నువ్వు చెప్పినట్లుగానే వింటాను , ఇంటికి వెళదాము .......
పెద్దయ్యా .......
డాక్టర్ : Nothing to worry ...... ఇంటికి వెళ్ళవచ్చు .
పెద్దయ్య : బుజ్జితల్లీ ...... నువ్వైనా చెప్పు - మీ అంకుల్ చెప్పినట్లుగానే వింటాను .
సరే పెద్దయ్యా ...... కదలకుండా ఉండాలి , పే చేసి వస్తాను వెళదాము .
అంకుల్ - సర్పంచ్ గారు : మేము పే చేస్తాము మహేష్ , పెద్దయ్యను జాగ్రత్తగా తీసుకురా .......
బుజ్జితల్లీ ...... మమ్మీతోనే ఉండు అనిచెప్పి , సూరి సహాయంతో పెద్దయ్యను వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకొచ్చాము .
పెద్దయ్య నినాదాలతో హాస్పిటల్ దద్దరిల్లిపోయింది . క్యాబ్ లో మేము - రోవర్లో దేవతవాళ్ళు ....... బుజ్జితల్లి పరుగున నా గుండెలపైకి చేరిపోయింది - గ్రామానికి బయలుదేరాము . గ్రామం పొలిమేరలో తమ్ముడు కృష్ణ కంగారుపడుతున్నాడు - కారులో ఎక్కించుకుని నేరుగా ఇంటికి చేరుకున్నాము . పెద్దయ్యా ..... కాసేపు రెస్ట్ తీసుకోండి తరువాత వచ్చి పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళతాము అని లోపలికివదిలాము . బుజ్జితల్లీ ...... తాతయ్య దగ్గర ఉండు - తాతయ్యను పిలుచుకుని వెళ్ళేటప్పుడు నీ ఇష్టం అని ముద్దుపెట్టి ప్రక్కనే కూర్చోబెట్టి , కృష్ణా జాగ్రత్త అనిచెప్పి గుడి దగ్గరికి చేరుకున్నాను .

స్కూల్ గ్రౌండ్ ఎంట్రన్స్ లో గ్రాండ్ వెల్కమ్ డెకరేషన్ చేస్తున్నారు - ఎంట్రన్స్ దగ్గర నుండీ ఫుల్లీ కవర్డ్ వెడ్డింగ్ హాల్ వరకూ శ్రీమంతుడు మూవీలో శృతికోసం మహేష్ బాబు అటెండ్ అయిన వెడ్డింగ్ సెట్టింగ్స్ లా రెండువైపులా ఫ్లవర్స్ - మొక్కలు మరియు విద్యుత్ కాంతులు వెలిగేలా సెట్ చేస్తున్నారు .
సర్ రండి అంటూ మేనేజర్ సెట్టింగ్స్ ద్వారా లోపలికి పిలుచుకునివెళ్లారు - ఎకరం విస్తీర్ణంలో పెళ్ళిమండపం సెట్ చూసి wow అన్నాను .
మేనేజర్ : మరొక రెండు గంటల్లో మొత్తం పూర్తిచేసేస్తాము సర్ ...... , ఇటువైపు అంటూ కుడివైపుకు తీసుకెళ్లి భోజనాలకోసం ఏర్పాటుచేసిన హాల్ ను మరియు మండపానికి ఎడమవైపుకు తీసుకెళ్లి బోలెడన్ని టెంట్స్ చూయించారు - సర్ ఇవి పెళ్లికూతురు మరియు బంధువులకోసం ........ ప్రతీ టెంట్ లో సకల సౌకర్యాలూ ఉండబోతున్నాయి - ఇంకా ........
చాలు చాలు మేనేజర్ గారూ ...... , నేను ఎక్సపెక్ట్ చేసినదానికంటే అద్భుతం ...... థాంక్యూ soooo మచ్ ......
మేనేజర్ : మీరు డబ్బు ఇచ్చారు - మేము మా వర్క్ చేస్తున్నాము సర్ ....... 
వర్క్ లో సిన్సియారిటీకి థాంక్స్ చెబుతున్నాను మేనేజర్ గారూ ....... , చీకటి పడేలోపు పూర్తయిపోతుంది కదా ........
మేనేజర్ : అంతలోపే సర్ ...... , గయ్స్ కమాన్ కమాన్ ...... గంటలో పూర్తిచేయాలి.

స్కూల్ బిల్డింగ్ పనులతోపాటు టెంపరరీ స్కూల్ బిల్డింగ్ పనులు శరవేగంగా జరుగుతుండటం చూసి కాంట్రాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాను . 
కాంట్రాక్టర్ గారు : మహేష్ ...... , పెద్దయ్యకు ఎలా ఉంది అని అడిగారు .
కుట్లు ఊడిపోయి రక్తం బాగా పోయింది - వారం రోజులు ఎక్కడికీ వెళ్లకూడదు అనిచెప్పారు డాక్టర్ ........
కాంట్రాక్టర్ గారు : ఎవరో అటాక్ చేస్తున్నారని తెలియగానే తెగ కంగారుపడిపోయి ట్రాక్టర్ లో మొదట పెద్దయ్యనే ఎక్కారు మహేష్ - నువ్వంటే ఎంత ఇష్టమో తెలిసింది .
నా అదృష్టం కాంట్రాక్టర్ గారూ ..... , ప్రోగ్రెస్ ఏమిటి ? .
కాంట్రాక్టర్ గారు : టెంపరరీ స్కూల్ రెండు మూడురోజుల్లో పూర్తిచేసేస్తాము మహేష్ ....... - హాస్పిటల్ బిల్డింగ్ కట్టడం కోసం స్థలాన్ని ఇవ్వడానికి చాలామంది ఊరిప్రజలు ముందుకువస్తున్నారు - అందరూ ఒక నిర్ణయం తీసుకున్న మరుక్షణమే హాస్పిటల్ పనులు కూడా మొదలుపెట్టేయ్యొచ్చు .
అయితే పెద్దయ్య - సర్పంచ్ గారిని కలవండి మరి .......
కాంట్రాక్టర్ గారు : వాళ్లేమో నీ ఇష్టం అంటున్నారు - నువ్వువచ్చేవరకూ ఆగమని చెప్పారు ....... - నువ్వేమో ...... వాళ్ళ ఇష్టం అంటావు .
కరెక్ట్ గా చెప్పారు కాంట్రాక్టర్ గారూ ....... , వాళ్ళ ఇష్టమే నా ఇష్టం - తొందరగా మీరే నిర్ణయం తీసుకుని మొదలుపెట్టేయ్యండి - అత్యాధునికమైన సౌకర్యాలు ఉండాలి , చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే కాదు - వైద్య ఖర్చులు భరించలేని సిటీ ప్రజలు కూడా ఇక్కడికే రావాలి , ఎంత ఖర్చయినా వెనక్కు చూడకండి .
కాంట్రాక్టర్ : సూపర్ మహేష్ ....... , ఈ ధైర్యం ఇచ్చారు ఇక చూసుకోండి అని సంతోషించారు .

అన్నయ్యా అన్నయ్యా ...... ఇక్కడ ఉన్నారా అంటూ తమ్ముళ్లు వినయ్ - గోవర్ధన్ పరుగునవచ్చారు .
తమ్ముళ్లూ ...... ఎక్కడికి వెళ్లిపోయారు , మధ్యాహ్నం వచ్చేస్తాము అనిచెప్పివెళ్లి సాయంత్రానికి వచ్చారు , మీరు ప్రక్కన లేకపోతే ఎలా చెప్పండి .
తమ్ముళ్లు : Sorry అన్నయ్యా ....... , ఓనర్ ఏదో పనిమీద రాజమండ్రి వెళ్లారట , నేరుగా అక్కడికే వెళ్లి పనిపూర్తిచేసుకువచ్చాము .
రాజమండ్రి వెళ్లి వచ్చారా ....... ? .
తమ్ముళ్లు : మరి మా ఊరి దేవుడు పని అప్పజెప్పాక రాజమండ్రి ఏమిటి ఢిల్లీ వరకైనా వెళ్లిపోతాము . అన్నయ్యా ..... విషయం తెలుసుకుని కొన్న రేటుకే ఇవ్వడానికి ఒప్పుకున్నారు - రేపు ఉదయం వైజాగ్ వస్తాను మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అనిచెప్పారు .
Wow గుడ్ తమ్ముళ్లూ ....... , అంతలోపు పెళ్లికూడా పూర్తయిపోతుంది , థాంక్యూ తమ్ముళ్లూ .......
తమ్ముళ్లు : మీరు థాంక్స్ చెప్పడం సర్పంచ్ గారు వింటే ఇంకేమైనా ఉందా .......
కాంట్రాక్టర్ గారు : అవునవును నిజమే అంటూ నవ్వుకున్నారు .
తమ్ముళ్లు : అన్నయ్యా ...... ఉదయం నుండీ చెయ్యాల్సిన పనులన్నీ ఇప్పుడు చకచకా చేసేస్తాము ఆర్డర్ వెయ్యండి . 
అన్నీ పూర్తయిపోతున్నాయి తమ్ముళ్లూ ...... , ఊరిజనమంతా కలిసిపోయి పూర్తి చేసేస్తున్నారు .
తమ్ముళ్లు : అంతా మీరిచ్చిన ఉత్సాహమే అన్నయ్యా ...... , ఇంత గ్రాండ్ గా మ్యారేజ్ ఇప్పటివరకూ చూడలేదు అన్నయ్యా - మూవీ సెట్టింగ్ లా ఉంది - బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అయినందుకు మరింత సంతోషం వేస్తోంది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 04-12-2021, 05:41 PM



Users browsing this thread: 49 Guest(s)