Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
పెద్దయ్య - సర్పంచ్ గారూ , పెద్దయ్య - సర్పంచ్ గారూ ...... అంటూ నినాదాలు చేస్తూ ఇద్దరినీ అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు .
పెద్దయ్యకు వారి పరిస్థితి తెలిసినప్పటికీ ఆ సంతోషంలో అందరితోపాటు ఆనందిస్తున్నారు . వినయ్ - గోవర్ధన్ - సర్పంచ్ గారు ....... పెద్దయ్యను జాగ్రత్తగా చూసుకుంటున్నారు .
తాతయ్య సంతోషాలను చూసి బుజ్జితల్లి ..... నా బుగ్గపై ముద్దులుపెట్టి ఆనందిస్తుండటం చూసి మురిసిపోతున్నాను .
పెద్దయ్య ఇక చాలు అనడంతో జాగ్రత్తగా దించి , బుజ్జితల్లిని హత్తుకునే పెద్దయ్యను నడిపించుకుంటూ వెళ్లి కారు వెనుక సీట్లో కూర్చోబెట్టాము . 
పెద్దయ్యా ....... ఇంటికి తీసుకెళ్లమంటారా లేక .......
పెద్దయ్య మనసంతా ఇక్కడే ఉండటం గమనించి , ok ok అర్థమైంది రోడ్డు వెంబడి మిమ్మల్ని నేను ముందుకు తీసుకెళతాను అని చెప్పాను .
పెద్దయ్య : చాలా సంతోషం బాబూ ...... , ఇన్నాళ్లకు ఊరికి మంచి జరుగుతుంటే కనులారా తిలకించకపోతే ఎలా ...... ? , ఎవరో ఆ మహానుభావుడు కానీ నిజంగా దేవుడే ....... - రేయ్ సర్పంచ్ గా ఎవరురా ఆ దేవుడు ....... , వినయ్ - గోవర్ధన్ మీకు కూడా తెలుసా ...... ? .
ముగ్గురివైపు నో నో నో అని సైగలుచేసాను .
తమ్ముళ్లు : ఆ ఆ తెలుసు పెద్దయ్యా ...... , మీరు చెప్పినట్లు నిజంగా దేవుడే ...... , మనకు మంచి జరగడం ముఖ్యం , ఇన్నాళ్లూ ...... ఊరికోసం సర్వం త్యాగం చేసిన పెద్దయ్య - సర్పంచ్ లకే ఆ గౌరవం దక్కాలని అజ్ఞాతంలోనే ఉండిపోయిన దేవుడు అంటూ నాకు దండాలు పెట్టి వెంటనే పైకి నమస్కరించారు .

అంతలో గోవర్ధన్ ఒకరితో వచ్చి మహేష్ అన్నయ్యా ...... వీడికి డ్రైవింగ్ వచ్చు , పెద్దయ్యను రోడ్డు వెంబడి చూయిస్తూ ముందుకు తీసుకెళతాడు .
తమ్ముడూ ....... ఊరికోసం ఇంతచేస్తున్న పెద్దయ్యకోసం ఈ మాత్రం చేసే అదృష్టం నాకు ఇవ్వరన్నమాట , సరే మీ ఇష్టం అని నవ్వుతూ బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టాను .
బుజ్జితల్లి : నేను అప్పటి నుండీ ఎన్ని ముద్దులుపెట్టాను - మీరు మాత్రం ఇప్పటికి కనికరించారు సంతోషం అంటూ బుజ్జి బుంగమూతి పెట్టుకుంది .
అమ్మో అమ్మో ...... అలకే ఇంకేమైనా ఉందా sorry లవ్ యు లవ్ యు అంటూ ముద్దులతో ముంచెత్తాను .
బుజ్జితల్లి : ఇప్పుడు ఇప్పుడు డబల్ హ్యాపీ అంటూ గట్టిగా చుట్టేసింది .
బుజ్జితల్లీ ...... చలివేస్తోందా ...... ? .
బుజ్జితల్లి : స్వేటర్ వేయించారు - వెచ్చగా ఉండేలా ఎత్తుకున్నారు - ప్రాణమైన ముద్దులు పెడుతున్నారు . హాయిగా వెచ్చగా ఉంది అంకుల్ ...... అంటూ గట్టిగా ముద్దుపెట్టింది - అంకుల్ ...... నాకు ఆ పెద్ద మెషీన్ ఎలా తిరుగుతోందో చూడాలని ఉంది .
తప్పకుండా తీసుకెళతాను బుజ్జితల్లీ ...... , పెద్దయ్యా ...... ఏదైనా అవసరమైతే కేకవెయ్యండి వచ్చేస్తాను - నిద్రవస్తే ఇదిగో ఈ బటన్ ప్రెస్ చెయ్యండి , వెనుక సీట్ ..... బెడ్ లా మారిపోతుంది , తమ్ముడూ ...... AC ని రూమ్ టెంపరేచర్ కు సెట్ చెయ్యి .......
అలాగే అన్నయ్యా .......
వినయ్ : అన్నయ్యా ....... కీర్తీ తల్లికి మెషీన్ బాగా కనిపించేలా పెద్ద పెద్ద లైట్స్ వేయిస్తాను .
థాంక్స్ తమ్ముడూ .........
వినయ్ : నా అదృష్టం అన్నయ్యా ...... అంటూ గోవర్ధన్ తోపాటు వెళ్ళాడు .

సర్పంచ్ గారు నా ప్రక్కనే నడుస్తూ ....... , బాబూ ...... మాకోసం .....
సర్పంచ్ గారూ ....... మళ్లీ మొదలెట్టకండి , అన్నింటికీ మీరు అర్హులు - ఎంజాయ్ చెయ్యండి , ఇదిమాత్రమే కాదు రోజుకొకటి మీ చేతులమీదుగా పూర్తవుతూనే ఉంటాయి , మన గ్రామం దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా మారేంతవరకూ అలుపులేకుండా శ్రమిద్దాము .
బుజ్జితల్లి : లవ్ యు sooooo మచ్ అంకుల్ .......
సర్పంచ్ గారు : మన గ్రామం - ఆదర్శవంతమైన గ్రామంలా ....... బాబూ అంటూ మళ్లీ దండం పెట్టబోతే .......
బుజ్జితల్లి : మళ్లీ మొదలెట్టారా సర్పంచ్ గారూ ....... , నేను ...... మీకంటే చిన్నవాడిని ఆశీర్వదించాలి కానీ దండం పెట్టకూడదు .
ఇద్దరమూ స్వీట్ షాక్ లో ఉండిపోయాము . బుజ్జితల్లి బుజ్జిబుజ్జినవ్వులను చూసి లవ్ యు లవ్ యు బంగారుతల్లీ అంటూ ముద్దులవర్షం కురిపించాను .

అంతలో బిగ్గెస్ట్ మెషీన్ పై నలువైపులా లైట్స్ వెలిగాయి . 
బుజ్జితల్లి : Wow అంటూ హత్తుకుని నవ్వుతోంది .
తిరుగుతున్న రోలర్ లోకి ఇసుక - కంకర - సిమెంట్ - వాటర్ తగుపాళ్ళల్లో వేసి రెండు నిమిషాలపాటు బాగా తిప్పి మిక్స్ అయ్యాక ఆ మిశ్రమం రోడ్డులా ఎలా రూపాంతరం జరుగుతోందో వీక్షిస్తోంది నా బుజ్జితల్లి . 
మెషీన్స్ - కూలీలు చకచకా పనిచేయడం వలన కళ్ళముందే రోడ్డు నిర్మాణం దూసుకుపోతోంది . కాంట్రాక్టర్ గారు 10 కిలోమీటర్ల వెంబడి ఒక్కదగ్గర కూడా రెస్ట్ తీసుకోకుండా పనులు జరుగుతున్న ప్రతీ చోటకూ వెళ్లి పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు - వారు కోరినవన్నింటినీ వెను వెంటనే తెప్పిస్తున్నాను - కూలీలు అలసిపోకుండా రాత్రంతా భోజన ఏర్పాట్లూ ఒకవైపున జరుగుతూనే ఉన్నాయి .

బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ చిందిస్తూనే షర్ట్ ను గట్టిగా పట్టుకుని నిద్రపోయింది . ప్రాణమైన ముద్దులుపెట్టి జోకొడుతూనే ....... మొబైల్ తీసి నా దేవతకు కాల్ చేసాను . 
హలో మహేష్ గారూ ....... అంటూ దేవత వాయిస్ వినిపించగానే ఆ చల్లని రాత్రిలో వొళ్ళంతా వెచ్చని జలదరింపులు కలిగి పెదాలపై తియ్యదనం పరిమళించింది . 
దేవత : హలో హలో మహేష్ గారూ ....... ఉన్నారా ..... ? .
హలో sorry sorry మహిగారూ ...... ఈ సమయంలో డిస్టర్బ్ చేసినందుకు , మీ కీర్తీ .......
దేవత : స్టాప్ స్టాప్ స్టాప్ ....... మీ కీర్తీ తల్లి " మీ " పిలుపు అది విన్నదంటే కోపం వచ్చేస్తుంది . 
నవ్వుకుని , మహి గారూ ...... కీర్తి తల్లి పడుకుంది - ఇంటికి తీసుకునిరానా ...... ? .
దేవత : ఎందుకు మహేష్ గారూ ...... , ఉదయం లేవగానే చూసి నన్ను కొట్టించడానికా ....... , కొట్టడమే కాదు కొరికినా కొరికేస్తుంది - అంకుల్ తోనే ఉంటాను పడుకుంటాను అని చెప్పే వెళ్ళింది , నాకు బాగా నిద్రవస్తోంది - రేపు పెళ్ళిపనులు చాలానే ఉన్నాయి గుడ్ నైట్ ........
గుడ్ నైట్ goddess ....... అంటూ సిగ్గు - నవ్వు కలగలిసి ఆనందిస్తూ కట్ చేసాను , నా దగ్గరే పడుకుంటానని మమ్మీకి - నా దేవతకు చెప్పేసి వచ్చావన్నమాట ఉమ్మా ఉమ్మా లవ్ యు soooo మచ్ అంటూ జోకొట్టాను . కారులో వెచ్చగా పడుకుందువుకానీ తాతయ్య కూడా ఉంటారు అని అటువైపుకువెళ్లి సీట్ ను బెడ్ లా మార్చి పడుకోబెట్టబోతే ........ , షర్ట్ ను చిరిగిపోయేలా పట్టేసుకుంది నిద్రలోనే , ఎంత బుజ్జిచేతులను సున్నితంగా తియ్యబోతే అంత గట్టిగా పట్టేసుకుంటోంది .
పెద్దయ్య నవ్వుకుని , కీర్తీ అంతే బాబూ ....... తనకు ఇష్టమైతే ఇలానే ...... , ఎత్తుకుని ఉండటం కష్టమైతే కాస్త బలం వేసి చేతులను తీసేసి పడుకోబెట్టు .......
నా బుజ్జితల్లిని ఒక్క రాత్రి కాదు జీవితాంతం ఎత్తుకోమన్నా సంతోషంగా ఎత్తుకుంటాను అని ముద్దుపెట్టి పనులు జరుగుతున్న చోటకు ముద్దులతో జోకొడుతూ వెళ్ళాను .

12 గంటల సమయంలో తమ్ముళ్లు వచ్చి , అన్నయ్యా ....... రేపు మ్యారేజ్ ఆర్గనైజర్స్ వస్తారు , చాలా పనులుంటాయి మీరు వెళ్లి పడుకోండి , అవసరమైతే మేము లేపుతాము కదా .......
థాంక్స్ తమ్ముళ్లూ ........ , కూలీలకు సమయానికి రిఫ్రెష్మెంట్స్ అందాలి , ఇదిగో నా కార్డ్ ఉంచుకోండి పిన్ నెంబర్ ........
వినయ్ : అన్నయ్యా ....... ఉదయం వరకూ అవసరమైనవన్నీ రెడీ , మీరు వెళ్లి హాయిగా పడుకోండి . మీరు ..... మాకోసం వేయిస్తున్న రోడ్డులో దర్జాగా ఇంటికివెళదాము అంటూ కారువరకూ వచ్చారు .
పెద్దయ్యా ..... మీరూ కాసేపు పడుకోవచ్చుకదా ...... 
పెద్దయ్య : జరుగుతున్నదంతా చూస్తూ కలుగుతున్న ఆనందానికి నిద్రపట్టడం లేదు బాబూ ....... , మధ్యాహ్నం బాగా నిద్రపోయానులే - నువ్వు నిద్రపో బాబూ ....... అంటూ బుజ్జితల్లి బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
ఎంజాయ్ పెద్దయ్యా ....... , రేపు పెళ్ళిపనులు చూసుకోవడానికి మేంఉన్నాము కదా అని ప్రక్కనే నిలువునా వాలిపోయి , బుజ్జితల్లిని గుండెలపై జోకొడుతూ కళ్ళుమూసుకున్నాను . దేవత అందమైన నవ్వులు కళ్ళల్లో మెదలగానే సంతోషమైన నిద్రపట్టేసింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 04-12-2021, 05:38 PM



Users browsing this thread: 6 Guest(s)