Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అలారం చప్పుడుకు అందరికీ మెలకువవచ్చింది . సమయం చూస్తే 4:30 ...... , అమ్మో ఇంకా చాలా questions చదువుకోవాలి అంటూ లైట్స్ అన్నింటినీ ఆన్ చేసుకుని చదవడం మొదలెట్టారు ఫ్రెండ్స్ ......
మమ్మీ - డాడీ ఎక్కడ ఉన్నారో అంటూ జాలీ చేసాడు వినయ్ , ఫ్రెండ్స్ ...... మళ్లీ ఔట్ ఆఫ్ కవరేజ్ అని వస్తోంది .
గోవర్ధన్ : కంగారుపడకురా సేఫ్ గా హైద్రాబాద్ చేరుకుని , పెళ్లి మండపం కు చేరుకుని ఉంటారులే , నువ్వు చదువుకో ...... 
సగం మంది ఫ్రెండ్స్ : రేయ్ మేము ఇంటికివెళ్లి ఫ్రెష్ అయ్యి చదువుకుంటాము అనిచెప్పి వెళ్లిపోయారు - 5 గంటలకు వినయ్ తప్ప అందరూ వెళ్లిపోయారు .
సూర్యోదయం లోపు వస్తానని అక్కయ్యకు మాటిచ్చాను ఇప్పుడెలా - లేదు లేదు వినయ్ ను ఒంటరిగా వదిలి వెళ్లలేను అంటూ చదువుకుంటూ కూర్చున్నాను .

అంతలో నాన్నా వినయ్ వినయ్ అంటూ వినయ్ పేరెంట్స్ వచ్చేసారు .
మమ్మీ మమ్మీ ...... అంటూ వినయ్ పరుగునవెళ్లి మేడం గారిని హత్తుకున్నాడు .
సర్ : నువ్వు కాల్ చేసిన రెండు సార్లూ ...... ఫ్లైట్ లోనే ఉన్నాము వినయ్ , టెర్రర్ అటాక్స్ గురించి తెలియగానే నెక్స్ట్ ఫ్లైట్ కు బుక్ చేసుకుని వచ్చేసాము . పెళ్లి కూడా పోస్టుపోన్ అయ్యింది . ఏంటి డోర్ తెరిచే ఉంది .
ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే ఇంటికి వెళ్లారు సర్ .......
సర్ : తోడుగా ఉన్నందుకు థాంక్స్ , ఇక వెళ్లు .......
నాకు కావాల్సినది కూడా అదే సర్ థాంక్యూ థాంక్యూ సర్ అంటూ మనసులో అనుకుని బుక్స్ తీసుకుని బయటకు అక్కడి నుండి ఔట్ హౌస్ కు పరుగుతీసాను .  బయట అక్కడక్కడా కొత్తమనుషులు కనిపించారు . ఔట్ హోసే చేరుకుని బుక్స్ బెడ్ పై ఉంచి బట్టలన్నీ విప్పేసి బాత్రూమ్లోకి చేరాను - అర గంటలో ఫ్రెష్ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకుని , బుక్స్ మొబైల్ తీసుకుని బయటకు పరుగుపెట్టాను .
భూత్ బంగ్లాలో రాత్రి ఏమీ జరగనట్లు ఎప్పటిలా నిర్మానుష్యన్గా ఉంది - కానీ బయట మాత్రం కొద్దిసేపటి ముందు చూసిన కొత్తవాళ్ళు భూత్ బంగ్లాకు అటూ ఇటూ తిరుగుతున్నారు - ఖచ్చితంగా వాళ్ళు మఫ్తీలో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అని నాకే సులభంగా అర్థమైపోయింది .
వెంటనే మొబైల్ తీసి SI సర్ కు కాల్ చేసాను . 
SI సర్ : Hi హలో హీరో ...... నేనే కాల్ చెయ్యాలని అనుకుంటున్నాను నువ్వే చేసావు - ఎంత దైర్యమైన పనిచేశావు - అసలు అంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నా ఆ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళడానికి నాకే భయమేసింది - ఒంటరిగా ఎలావెళ్ళావు . 
నా ప్రాణమైన వాళ్లకోసం తప్పలేదు సర్ , ఆ టెర్రరిస్ట్స్ దగ్గర గన్స్ ఉండటం చూసి నా వాళ్లకు ఏమైనా జరుగుతుందేమోనన్న భయంతో నా దైవాన్ని తలుచుకుని లోపలికి వెళ్ళిపోయాను - చూసి షాక్ అయిపోయాను .
SI సర్ : అక్కడ చూసిన నేను - ఇక్కడ ఎంటైర్ సెక్యూరిటీ ఆఫీసర్లు అలానే షాక్ అయ్యాము  - నువ్వు కనిపెట్టిన వాటితో టెర్రరిస్టులు వైజాగ్ మొత్తాన్ని అల్లకల్లోలం చేసేవాళ్ళు తెలుసా - అంతటి అపాయాన్ని ఆపిన నిన్ను వెంటనే కలవాలి ఎక్కడ ఉన్నావో చెప్పు నిమిషాల్లో నీ ముందు ఉంటాను .
నో నో నో సర్ , ఇందుకే ఇందుకే చెప్పలేదు , నాకు exams ఉన్నాయి - నా పరిస్థితులు కూడా వేరు , మంచి జరిగింది అధిచాలు నాకు - కానీ మీరు చేసినది చేస్తున్నది ఏమీ బాగోలేదు సర్ , మీరు మఫ్తీలో పెట్టిన సెక్యూరిటీ ఆఫీసర్ల వలన ఆ టెర్రరిస్టులు బయటకు వచ్చేలా లేరు , మఫ్తీలో అంటే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలి కానీ పిల్లాడిని అయిన నాకే క్షణాల్లో తెలిసిపోయింది , కలిసి కలిసి అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు ఇక మీ ఇష్టం - నేను అర్జెంట్ గా వెళ్ళాలి అని కట్ చేసేసాను . బయట ఆటో రెడీగా ఉండటంతో సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ కు బయలుదేరాను .

ఆటో కు పే చేసి అక్కయ్య ఇంటి దగ్గరకు పరుగుపెట్టాను . డోర్ తెరిచే ఉండటంతో అక్కయ్య - దేవత నాకోసమే ఎదురుచూస్తుంటారని అనుకుని అడుగులో అడుగువేసుకుంటూ డోర్ ప్రక్కన చేరుకున్నాను . 
లోపలికి తొంగిచూస్తే సోఫాలో అక్కయ్య - బామ్మ నిద్రమత్తులో జోగుడుతూ ఒకరి భుజాలపై మరొకరు వాలిపోయారు . 
నవ్వుకుని అతినెమ్మదిగా లోపలికివెళ్లి ఇద్దరి వెనుక చేరి , రెండుచేతులతో ఇద్దరి కళ్ళనూ మూసాను . 
తమ్ముడూ - బుజ్జిహీరో ........ 
కనిపెట్టేసారన్నమాట ప్చ్ ...... , గుడ్ మార్నింగ్ అక్కయ్యా - గుడ్ మార్నింగ్ బామ్మా ...... అంటూ ఇద్దరి బుగ్గలపై చెరొకముద్దుపెట్టాను .
గుడ్ మార్నింగ్ తమ్ముడూ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తూ లేచివచ్చి హత్తుకుని , మాట ప్రకారం సూర్యోదయం లోపు వచ్చేసావన్నమాట అంటూ ముద్దులుపెట్టారు .
అక్కయ్యా ...... పడుకున్నారా లేక ...... ? .
బామ్మ : నీకోసం ఇక్కడే వేచి చూడమన్నా చూస్తుంది నా చిట్టి తల్లి ...... , నేనే లాక్కునివెళ్లి ఒడిలో పడుకోబెట్టుకున్నాను . 5 గంటలకు అలారం పెట్టికానీ నిద్రపోలేదు , అలారం మ్రోగగానే పరుగునవచ్చి ఏ క్షణమైనా వస్థావని నీకోసం డోర్ పూర్తిగా తెరిచి సోఫాలోనే జోగుడుతోంది అని నవ్వుతూ చెప్పారు .
లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ....... 
అక్కయ్య : తమ్ముడూ ...... నీ దేవత - ఈ అక్కయ్య కోసం చలిలోనే వచ్చావన్నమాట ఉండు వేడివేడిగా పాలు తీసుకొస్తాను .
బామ్మ : చిట్టితల్లీ ...... రాత్రంతా తమ్ముడూ - అక్కయ్యా ..... అంటూ కలవరిస్తూనే ఉన్నావు , తమ్ముడిని వదిలి ఎక్కడికి వెళతావు , సోఫాలో కూర్చోండి నేను తీసుకొస్తాను అని మాఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి వెళ్లారు .
అక్కయ్యా ...... రివిజన్ చెయ్యాలి , మీరు ముద్దులు పెడుతూ ఉంటే మరింత త్వరగా పూర్తిచేసేస్తాను .
అక్కయ్య : లవ్ టు లవ్ టు తమ్ముడూ ..... , ఇలాంటి అదృష్టాన్ని వదులుకుంటానా చెప్పు అంటూ సోఫాలో కూర్చున్నాము .
అక్కయ్య ముద్దులకు పెదాలపై చిరునవ్వులతో చదువుతూ రూమ్స్ వైపు చూస్తున్నాను . 
అక్కయ్య : నీ దేవత కోసమే కదా ...... , ఆ గదిలో ఉన్నారు , ఎందుకో తెలియదు అర్ధరాత్రి వరకూ కోపంతోనే ఉండి ఆలస్యంగా పడుకున్నారు , అందుకే ఇంకా లేవలేదు . 
అవునా అక్కయ్యా ...... కోపం ఎవరిపై అయి ఉంటుంది , నాపైనే అయితే బాగుంటుంది అని ఇద్దరమూ నవ్వుకున్నాము . దేవతను పడుకోనిద్దాము ........

మా బుజ్జిహీరోకు బూస్ట్ - మా చిట్టి తల్లికి కాఫీ .......
అక్కయ్య : బామ్మా ...... తమ్ముడు ఏది తాగితే అదే నాకూ కావాలి ప్లీజ్ ప్లీజ్ ......
బామ్మ : ప్లీజ్ ప్లీజ్ కాదు ఆర్డర్ వేస్తేనే అంటూ అక్కయ్య బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టారు .
అక్కయ్య : లవ్ యు బామ్మా ...... , బామ్మా ...... బూస్ట్ ......
బామ్మ : అదీ అలా అంటూ కురులపై ముద్దుపెట్టి వెళ్లారు .
అక్కయ్యా ...... మీరు తాగండి అని అందించాను . 
అక్కయ్య : ఊహూ ఊహూ ..... , సరే సరే నువ్వు చదుకుంటూ ఉండు నేను తాగిస్తాను అని తాగించి , అక్కయ్య కూడా తాగారు . 
లవ్ యు అక్కయ్యా ....... 
బామ్మ : నా చిట్టితల్లికి కూడా బూస్ట్ ...... , ఇద్దరూ తాగుతున్నారా ..... ? ఉమ్మా ఉమ్మా ....... , బుజ్జిహీరో ...... చదుకుంటూ ఉండు టిఫిన్ చేసేస్తాను .
అక్కయ్య : బామ్మా ...... నేనూ ......
బామ్మ : దెబ్బలు పడతాయి , వారం రోజుల వరకూ వంట గదిలోకి రానివ్వద్దు అని మీ అక్కయ్య ఆర్డర్ ...... , అవును బుజ్జిహీరో - చిట్టితల్లీ ...... టిఫిన్ కు ఏమి చేయమంటారు ? .
మాఅక్కయ్యకు - నా తమ్ముడికి ...... ఏమి ఇష్టమో అదే నాకు - నాకు ఇష్టం ఇష్టం అనిచెప్పి నవ్వుకున్నాము .
బామ్మ : సరిపోయింది ...... , ఇలా అయితే కష్టం - ప్లీజ్ ప్లీజ్ ఎవరో ఒకరు చెప్పండి .
ఇద్దరమూ గుసగుసలాడుకుని బామ్మా - బామ్మా ...... అక్కయ్యకు - దేవతకు ఏమిష్టమో అదే ఇష్టం .......
బామ్మ : ఆనందబాస్పాలతో లవ్ యు చిట్టితల్లీ - లవ్ యు బుజ్జిహీరో అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సంతోషంతో వెళ్లారు .
అక్కయ్య : ప్రాబ్లమ్ solved - all హ్యాపీ అంటూ నన్ను చుట్టేసి ప్రాణమైన ముద్దుపెట్టారు . తమ్ముడూ ...... నువ్వు చదువుకో నీ దేవత టిఫిన్ సమయానికి లేస్తారులే ........

అర గంట తరువాత గదిలోనుండి షవర్ సౌండ్ వినిపించింది .
అక్కయ్య : తమ్ముడూ ...... ఓహ్ అప్పుడే అటువైపు చూస్తున్నావన్నమాట - అంత ఓపిక పట్టలేకపోతే బాత్రూం లోపలికివెళ్లి నీ దేవతను చూసి రావచ్చుకదా .......
అంతేకదా అని వంట గదిలోనుండి బామ్మ మాటలు వినిపించాయి .
నిన్న దేవత షవర్ లో ఉన్నప్పుడు ఎటువంటి జలదరింపు ఫీలింగ్ కలిగిందో మళ్లీ అలానే అనిపించి గుండె వేగంగా కొట్టుకుంటోంది .
అక్కయ్య : తమ్ముడూ ...... నీ హృదయం వెంటనే వెళ్లి చూడమని చెబుతోంది కదూ ....... 
లేదు లేదు అక్కయ్యా ...... అంటూ అదురుతూనే అక్కయ్యవైపు చూడకుండా కేవలం బుక్ వైపే చూస్తున్నాను .
అక్కయ్య నవ్వులు ఆగడం లేదు . తమ్ముడూ వణుకుతూనే ఉన్నారు కూల్ కూల్ నిన్ను డిస్టర్బ్ చెయ్యనులే కాంసెంట్రేట్ తో చదువుకో అని ముద్దులుపెడుతూనే ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

అక్కడి నుండి అర గంట తరువాత సరిగ్గా 7:30 గంటలకు , నా బుజ్జిహీరో దేవతకు - నా చిట్టితల్లి అక్కయ్యకు ఇష్టమైన టిఫిన్ రెడీ అంటూ బామ్మ , గదిలోనుండి దేవత ఒకేసారి వచ్చారు .
దేవత బయటకు రావడం రావడం నన్ను చూసి , నా కోరిక నెరవేరినట్లు నావైపు కోపంతో చూస్తూ నావైపుకే వస్తున్నారు .
కన్నార్పకుండా చూస్తూ లేచి , మేడం మేడం ....... పింక్ కాటన్ సారీ లో దివినుండి దిగివచ్చిన దేవతలా ఉన్నారు తెలుసా ...... ? , సో సో sooooo బ్యూటిఫుల్ ....... , మీ కప్ బోర్డ్ నుండి నేనే సెలెక్ట్ చేసాను - యాహూ ....... అనేంతలో .........
దేవత ఏకంగా మాదగ్గరికి చేరుకుని కళ్ళల్లో అగ్ని గోళాలతో చెంప చెళ్లుమనిపించారు .
పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది .
దేవత : కోపంతో ....... , దేవత ఏమిటి దేవత ...... మేడం అని పిలవాలి , మా ఇంటికి వెళ్లి నా కప్ బోర్డ్ ఓపెన్ చేసి నా బట్టలు తీసుకురావడానికి నువ్వెవరు - నీకే అర్హత ఉంది , నేను తీసుకురమ్మని చెప్పానా ...... ? - నీకు చనువు ఇవ్వడం నాదే తప్పు ...... , నిన్ను చూస్తుంటేనే నాకు కోపం వచ్చేస్తోంది నా కప్ బోర్డ్ మరియు ....... అంటూ మళ్లీ గట్టిగా కొట్టారు కోపంతో .......
మొదటి చెంప దెబ్బకు పెదాలపై చిరునవ్వులు వచ్చాయి - ఈ చెంప దెబ్బకు మాత్రం కన్నీళ్లు ధారలా కారసాగాయి .
దేవత : ఏదో పిల్లాడివని ఆప్యాయత చూయిస్తే ...... , చెయ్యకూడనివి చేస్తున్నావు , నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది - నా ముందు ఏమాత్రం ఉండకు వెళ్లిపో ....... - get out ..... 
మేడం ...... , అలాచెయ్యడం తప్పే దానికి తిట్టండి కొట్టండి కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేను .
దేవత : ఇదే ఇదే నేను చేసిన తప్పు ...... , చెల్లీ ...... ఉంటే మహేష్ అయినా ఉండాలి లేక నేనైనా ఉండాలి . చెల్లీ ...... ఈ అక్కయ్య కంటే నీకు నీ తమ్ముడే ఎక్కువ ఇష్టం అని నాకు తెలుసు - నువ్వు చెప్పు నన్ను వెళ్లమంటావా ...... ? .
నా వైపు ప్రాణంలా చూస్తున్న అక్కయ్యవైపు నో అంటూ సైగచేసాను కన్నీళ్ళతో .......
అక్కయ్య కళ్ళల్లోనుండి నాకంటే ఎక్కువ కన్నీళ్లు ....... , అంతులేని బాధతో అక్కయ్యా ...... నాకు నా తమ్ముడి కంటే మా అక్కయ్య అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ వెళ్లి దేవత గుండెలపైకి చేరారు .
నో నో నో అంతమాట అనకండి మేడం ...... , నేనే వెళతాను .
అక్కయ్యకు ఏమి మాట్లాడాలో తెలియక అక్కయ్య కౌగిలిలోనుండే నా కళ్ళల్లోకి ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు కన్నీళ్ళతో .......
కన్నీళ్ళతో దేవతవైపు చూస్తూనే వెనక్కు అడుగువేశాను .
బామ్మ : అప్పటివరకూ కన్నీళ్ల షాక్ లో ఉన్నట్లు తేరుకుని బుజ్జితల్లీ ....... నేనే ......
బామ్మా ........ ఊహూ అంటూ వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే భారమైన బుజ్జి హృదయంతో బయటకు వెళ్ళాను ............
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 23-10-2021, 09:44 AM



Users browsing this thread: 1 Guest(s)