Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
నేనైతే ఫస్ట్ ఫోన్ చెయ్యాలి అని వినయ్ కు కాల్ చేసాను . కంఫర్మేషన్ కొరకు వినయ్ ....... రేపు హోమ్ వర్క్ ఏమిటి అని అడిగాను .
వినయ్ : రేపటికి హోమ్ వర్క్ లేదు మహేష్ - రేపటి నుండి exams కదా ....... , అయినా స్కూల్ కు రాకుండా ఎక్కడికి వెళ్ళావు ? , నువ్వు రాలేదని మురళి ...... మా అందరి పేరెంట్స్ కు చెప్పేసాడు - బాడీగార్డ్ గా ఉండకుండా ఎక్కడకు వెళ్ళాడు అని అందరూ కోపంగా ఉన్నారు - తొందరగా వచ్చెయ్యి .......
అతిముఖ్యమైన పనిలో ఉన్నాను ఫ్రెండ్ , మరికాస్త ఆలస్యం అవుతుంది .
వినయ్ : మరింత ఆలస్యం అవుతుందా ...... ? .
ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ....... 
వినయ్ : నువ్వొచ్చాక ఏమి జరుగబోతోందో ఏమో ....... 
I డిజర్వ్ ఇట్ వినయ్ - మీ పేరెంట్స్ తిట్టినా కొట్టినా హ్యాపీనే ....... , మాటిచ్చి మిమ్మల్ని ఒకరోజంతా వదిలి వెళ్ళాను . ఇంతకూ ఫస్ట్ exam ఏమిటి వినయ్ ......
వినయ్ : ప్రతీసారీ లాంగ్వేజ్ ఉండేవి - ఈసారికి మాత్రం మాథ్స్ తో స్టార్ట్ అవుతున్నాయి .
నిజమే ....... ఇక్కడ తమ్ముడూ - చెల్లెళ్లు కూడా మాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు .......
వినయ్ : ఎవరు ? .
లేదులే ఇక్కడ ....... , పని పూర్తవగానే వచ్చేస్తాను బై ఫ్రెండ్ అని కట్ చేసాను .

అక్కడ మేడం వాళ్ళు అందరూ కోపంతో ఉన్నారు అని మూడీగా ఉన్నాను .
అక్కయ్య : తమ్ముడూ ....... ఏమయ్యింది .
నథింగ్ నథింగ్ అక్కయ్యా ...... , రేపు స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతోనే మాథ్స్ exam తో స్టార్ట్ అవుతున్నాయి ఏమీ ప్రిపేర్ కాలేదు అంటూ బ్యాగు నుండి మాథ్స్ బుక్స్ తీసాను - అయినా పర్లేదు మాథ్స్ అంతా ఇక్కడ ఉంది అని మైండ్ చూయించి నవ్వాను .
అక్కయ్య : మరి ఆలస్యమయ్యినందుకు పనిష్మెంట్ ముద్దులు .......
అవొకటి ఉన్నాయి కదూ ....... , అక్కయ్యా ...... ప్రస్తుతానికి ఆ పనిష్మెంట్ ముద్దులేవో మీరే ...... , నేను ప్రాక్టీస్ చేసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ అంటూ తియనైన కోపంతో చూస్తున్న అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : ఐస్ లా కరిగిపోయి నా చేతిని చుట్టేసి 1 2 3 ...... అని కౌంట్ చేస్తూ ముద్దులుపెడుతున్నారు .
ప్రతీ ముద్దుకూ తియ్యదనం - ఉత్సాహంతో చకచకా పూర్తిచేస్తున్నాను . మా అక్కయ్యా ముద్దుల్లో ఏదో మ్యాజిక్ ఉంది ప్రాబ్లమ్స్ అన్నీ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి .
అక్కయ్య : ముసిముసినవ్వులు నవ్వుకుని , 25 26 .......
చెల్లెళ్లు : 26 27 ...... కిస్సెస్ ...... , మా మమ్మీ డాడీ కూడా ఒకేసారి ఇన్ని కిస్సెస్ ఎప్పుడూ పెట్టలేదు . అక్కయ్యా ...... మాకు మాకు ప్లీజ్ ప్లీజ్ సొల్యూషన్స్ రావడం లేదు అంటూ చుట్టూ చేరారు .
అక్కయ్య మరింత సంతోషంతో లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ ...... అంటూ ముద్దులుపెట్టారు .
చెల్లెళ్లు : ఆ వచ్చేసింది , అన్నయ్యా ...... మీరు చెప్పినది నిజమే , అక్కయ్య ముద్దుల్లో మ్యాజిక్ ఉంది .
ఆవును అందుకే నాకు రావడం లేదు , ముద్దులన్నీ మీరే ....... , ఈప్రాబ్లం ఏంటి ఎంత ఆలోచించినా రావడం లేదు - అందుకేనేమో మాథ్స్ టీచర్ కూడా మాకే హోమ్ వర్క్ ఇచ్చారు - ఆరోజు ఎవ్వరూ ఈ ప్రాబ్లమ్ చేసుకునిరాలేదు .
అక్కయ్య : చూసి , గాల్లోనే సొల్యూషన్ చెప్పేసారు .
టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ చూసి నోరుతెరిచి షాక్ లో ఉండిపోయాను .
పిల్లలతోపాటు అక్కయ్యకూడా నవ్వుతున్నారు .
తేరుకుని అక్కయ్యా ...... , మాథ్స్ టీచర్ కు కూడా రాని ప్రాబ్లమ్ ....... చిటికెలో గాల్లోనే సాల్వ్ చేసేసారు .......
అక్కయ్య : ఇది నాకు జిజుబి తమ్ముడూ ...... అంటూ హత్తుకుని ముద్దుపెట్టారు - నీకు తెలుసా ...... నా 10th క్లాస్ మెయిన్ exam లో ఇదే ప్రాబ్లమ్ వచ్చింది - నేను చెబుతుంటే exam రాసేవాళ్ళు...... .
అయితే రేపు కూడా ఖచ్చితంగా వస్తుంది అన్నమాట అని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసేస్తున్నాను .
అక్కయ్య : wow తమ్ముడూ ....... సూపర్ అంటూ మళ్లీ ముద్దులు స్టార్ట్ చేశారు .
పిల్లలు : అక్కయ్యా ....... అన్నయ్యకు మాత్రమేనా ? , మా ప్రాబ్లమ్స్ కూడా స్టక్ అయ్యాయిక్కడ అంటూ బుజ్జిబుజ్జికోపాలు .......
Sorry sorry అంటూ ముద్దులుపెడుతూ కష్టమైనవాటిని సాల్వ్ చేస్తున్నారు .

అంతలో కాలింగ్ బెల్ మ్రోగడం - పట్టుచీరలలో వచ్చిన మేడమ్స్ ను చూసి మమ్మీ మమ్మీ ...... డోర్ తెరిచే ఉందికదా డిస్టర్బ్ చెయ్యడం అవసరమా ...... ? .
మేడమ్స్ : sorry sorry ...... 
దేవత - బామ్మలు - అక్కయ్య ...... వెళ్లి చిరునవ్వులతో లోపలికి ఆహ్వానించారు .
పిల్లలు : అక్కయ్యా - అన్నయ్యా ....... , మమ్మీ వాళ్ళు వస్తారులే , మీరు ...... మాదగ్గరే కూర్చోండి .
మేడమ్స్ : అమ్మో ...... ఇంత బుద్ధిగా చదువుకోవడం మేమెప్పుడో చూడలేదు .
పిల్లలు : ఇక నుండీ exams అయ్యేంతవరకూ రోజూ అక్కయ్య దగ్గరికి వచ్చే చదువుకుంటాము మమ్మీ ......
మేడమ్స్ : హమ్మయ్యా ....... ఇకనుండీ సీరియల్స్ ఏమాత్రం డిస్టర్బ్ కావు - exams వరకూ మాత్రమే కాదు తరువాత కూడా మీ అక్కయ్య దగ్గరే వచ్చి చదువుకోండి .......
బామ్మలు - దేవత - అక్కయ్య నవ్వుకున్నారు .
మేడమ్స్ : దేవకన్యలాంటి చిట్టితల్లికి ఇన్నాళ్లూ లోపం ఉంచాడు దేవుడు అంటూ బుగ్గలను ఆప్యాయంగా స్పృశించారు .
సర్ వలన ..... అక్కయ్య ఇంత సంతోషంగా ఉంది మేడం .......
SI సర్ మేడం : నువ్వేమో ....... మీ సర్ వలన అంటావు - మీ సర్ ఏమో బుజ్జిహీరో వలన అంటారు సరిపోయింది అని ఆనందించారు .
దేవత : మేడం ....... సర్ ? .
SI సర్ మేడం : కాల్ చేసాను , ఇంటెలిజెన్స్ నుండి సమాచారం వచ్చిందట దేశం అంతా టెర్రర్ అటాక్స్ జరుగుతాయని , విజయవాడకు రమ్మని ఆర్డర్స్ రావడంతో అటునుండి ఆటే వెళ్లిపోయారు - మళ్లీ వచ్చేది రేపు ఉదయమే ........
మళ్లీ బాంబులు పేలుతాయా అంటూ పిల్లలందరూ వాళ్ళ మమ్మీలను - అక్కయ్యను హత్తుకున్నారు భయంతో , నేను ...... బామ్మను హత్తుకున్నాను .
మేడమ్స్ : అవును ఈ సంవత్సరంలో చాలాచోట్ల బాంబులు పేలి చాలామంది చనిపోయారు - ఈసారైనా ప్రాణ నష్టం జరగకుండా మీ డాడీ వాళ్ళు ముందే కనిపెట్టాలని ప్రార్థిద్దాము . 
పిల్లలు : మీరు ప్రార్థించండి , అన్నయ్య - మేము చదువుకుంటాము అని అక్కయ్యను లాక్కునివచ్చి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు .
మేడమ్స్ : ఉమ్మా ఉమ్మా ...... 
దేవత : మేడమ్స్ రండి అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు . 

7: 30 కు వంటలు పూర్తవ్వడంతో అందరమూ డైనింగ్ టేబుల్ పైకి చేరాము .
మేడమ్స్ : అవంతికా - అమ్మలూ ....... పాత్రలన్నింటినీ డైనింగ్ టేబుల్ పైకి చేర్చి , అందరమూ కలిసి తిందాము .......
దేవత : మీ ఇష్టం మేడమ్స్ అంటూ మొదట పిల్లలైన మాకు వడ్డించి ఒకరికొకరు వడ్డించుకున్నారు . చిరునవ్వులు చిందిస్తూ - సంతోషంతో మాట్లాడుతూ అక్కయ్య కోరిక తీర్చేలా చేశారు దేవత .

అక్కయ్యా ....... 8:30 ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళతా .......
అక్కయ్య : నా చేతిని హత్తుకుని , వెళ్ళొస్తాము అనిచెప్పు తమ్ముడూ ....... , కన్నీళ్లు కార్చను అని మాటిచ్చాను కాబట్టి కార్చడం లేదు .
అక్కయ్యా ....... ఉదయం వస్తానుకదా .......
దేవత : వస్తాము అని మాటివ్వు బుజ్జిహీరో ........
అక్కయ్యతోపాటు నేనూ నవ్వుకున్నాను .
పిల్లలు : మమ్మీ ...... మేము , అక్కయ్యతో మరికొంతసేపు చదువుకుంటాము .
SI సర్ మేడం : చదువుకుంటాము అంటే మంచిదేకదా ...... , అంతవరకూ ఇక్కడే ఉందాము .
పిల్లలు : లవ్ యు మమ్మీ .......
థాంక్స్ చెల్లెళ్ళూ - తమ్ముడూ ...... ఇప్పుడు హ్యాపీగా వెళతాము అని బయటకువచ్చాము .

లేడీ సెక్యూరిటీ అధికారి మేడం : బుజ్జిహీరో ...... నేను డ్రాప్ చేస్తాను .
నో నో నో మేడం ....... మీరు , పిల్లలతో - అక్కయ్యతో ఉండండి మేము ఆటోలో ....... అదిగో ఆటో - ఆటో అంటూ కేకవేశాను .
అక్కయ్యా - చెల్లీ ...... ఉదయం కలుద్దాము అని ఆటో ఎక్కబోయాము .
అక్కయ్య : తమ్ముడూ - అక్కయ్యా ....... గుడ్ నైట్ కిస్సెస్ ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు కదూ .......
పెదాలపై చిరునవ్వులతో అక్కయ్య దగ్గరకుచేరి , గుడ్ నైట్ అక్కయ్యా - చెల్లీ ...... అంటూ ఒకేసారి ముద్దులుపెట్టాము . అక్కయ్యా - బామ్మా ...... జాగ్రత్త .
అక్కయ్య వెళ్లి బామ్మ గుండెలపై చేరారు . బామ్మ గుడ్ నైట్ కిస్ పెట్టి బామ్మా దగ్గర చేర్చారు .
పిల్లలు : అంతేలే అన్నయ్యా - మేడం ...... అక్కయ్యకు మాత్రమే గుడ్ నైట్ ? .
దేవత చిరునవ్వులు చిందిస్తూ sorry sorry అంటూ వెళ్లి నలుగురికీ గోది నైట్ కిస్సెస్ పెట్టారు .
గుడ్ నైట్ చెల్లెళ్ళూ - తమ్ముడూ ......
పిల్లలు : మమ్మీ వాళ్ళు ఉన్నారని మాకు ముద్దులుపెట్టడానికి భయపడుతున్నారు కదా అన్నయ్యా ...... అయితే మేమే ముద్దులు పెడతాము , గుడ్ నైట్ అన్నయ్యా ......... 
థాంక్స్ చెప్పేసి అక్కయ్య వైపు చూస్తూనే బయలుదేరాము .

దేవత : బుజ్జిహీరో ...... నేను రేపు 8:30 కల్లా స్కూల్లో ఉండాలి - 8 కల్లా చెల్లిదగ్గర ఉండాలి అంటే 7 గంటలకే ఇంటినుండి బయలుదేరాలి అర్థమైందా అర్థమైందా అర్థమైందా ........
బామ్మకు అర్థమైనట్లు తియ్యదనంతో నవ్వుతున్నారు .
ఆ ఆ ఇప్పటికి బల్బ్ వెలిగింది మేడం , 6:30 కల్లా మన బస్టాప్ లో ఉంటాను మేడం ........
దేవత : Thats my స్టూడెంట్ అని హైఫై కొట్టబోయి ఆగిపోయారు - వారిలోవారే ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు - నాకేమీ భయమేసి నిన్ను రమ్మడం లేదు గుర్తుపెట్టుకో బుజ్జిహీరో ........
బామ్మతోపాటు నవ్వుకుని , అంటే నాకు భయం మేడం , అందుకే మీతోపాటు రావాలని ఆశపడుతున్నాను ప్లీజ్ ప్లీజ్ ........
దేవత : Ok ok గ్రాంటెడ్ ....... అని నవ్వుతూనే ఉన్నారు . వెంటనే కోపంతో ఏంటి బుజ్జిహీరో మీదమీదకు వస్తున్నావు అంటూ చేతిపై గిల్లేసారు .
నేను కాదు మేడం ........
దేవత చూసి , ఏంటి బామ్మా ...... బుజ్జిహీరోని పదే పదే నావైపుకు తోస్తున్నావు .
బామ్మ : చిలిపినవ్వులతో , నాకు సరిపోవడం లేదు ......
దేవత : సరిపోవడం లేదా ..... ? , మేమిద్దరం కూర్చున్నంత స్పేస్ లో మీరు కూర్చున్నారు .
బామ్మ : అయినా నాకు సరిపోవడం లేదు అంటూ మళ్లీ తోసి నావైపు కన్నుకొట్టారు.
నాకేమీ అర్థం కావడం లేదు - కానీ రెండువైపులా వీస్తున్న చల్లని గాలులనుండి దేవత వెచ్చనైన స్పర్శ ఒక కొత్త అనుభూతిని కలిగించడంతో హాయిగా అనిపించి నాలో నేనే ఆనందిస్తున్నాను .
దేవత : బామ్మా ....... పడిపోతాను .
బామ్మ : పడిపోకుండా నీ బుజ్జిహీరోను పట్టుకో ఎవరు కాదన్నారు అని మళ్ళీ తోసారు .
దేవత : ఆఅహ్హ్ ...... అంటూ నా చేతిని పట్టుకున్నారు .
నా నోటి నుండి కూడా ఆటోమేటిక్ గా ఆఅహ్హ్ ...... మూలుగు ఎగదన్నింది .
బామ్మ : అంతే అలా పట్టుకో ....... అంటూ దేవత చూడకుండా నా బుగ్గపై ముద్దుపెట్టారు .

దేవత : బుజ్జిహీరో ...... పర్లేదు కదా ......
సో సో soooo హ్యాపీ మేడం , దివి నుండి దిగివచ్చిన దేవత పట్టుకుంటే అంతకంటే అదృష్టం .......
దేవత : చాలు చాలు బుజ్జిహీరో చాలు ...... , కొద్దిగా గ్యాప్ ఇస్తే పొగిడేస్తావు ..... అంటూనే ఎంజాయ్ చేస్తున్నారు . 
మీ నవ్వు చూస్తుంటే , మీకు ఇష్టమే అనిపిస్తోంది మేడం ........
దేవత : లేదు లేదు లేదు ....... లేదు అంతే అని మళ్ళీ గిల్లేసారు . 
బామ్మ ఐదు అని ఐదు వేళ్ళు చూయించారు . మేడం మేడం ....... గిళ్లేముందు కాస్త ముందూ వెనుకా ఆలోచించుకోండి ప్లీజ్ ప్లీజ్ ......
దేవత : నోవే నాఇష్టం అని మళ్ళీ గిల్లారు .
స్స్స్ అయ్యో ....... బామ్మా బామ్మా ప్లీజ్ ప్లీజ్ .......
బామ్మ : తల అడ్డంగా ఊపుతున్నారు .

దేవత : అవును బుజ్జిహీరో ...... ఉదయమే అడగాలని ఈ హడావిడిలో మరిచిపోయాను . ఉదయం మా ఏరియా మెయిన్ గేట్ నుండి బయటకు వచ్చావేమిటి ? .
అదీ అదీ ...... నా దే ..... మా మేడం ను రాత్రంతా చూడలేదు కదా అని ఏకంగా లోపలికే వెళ్ళిపోయాను .
దేవత : సెక్యూరిటీ వదిలారా ...... ? .
వాళ్ళు వదలడం ఏమిటి , గోడ దూకి వచ్చేసాను .
బామ్మ : అంత పెద్ద గోడను ........
మా మేడం ను చూడటం కోసం ఎవరెస్టు అయినా ఎక్కి దూకేస్తాను బామ్మా - ఆఫ్ట్రాల్ ఆ చిన్న గోడ ఎంత ........
దేవత : నిన్నూ ....... దెబ్బలు తగిలి ఉంటే , ఇంకెప్పుడూ అలా చెయ్యకు , ఎనీవే థాంక్స్ అంటూ మురిసిపోతున్నారు , అమ్మో ...... నవ్వానని తెలిస్తే మళ్లీ దూకుతావేమో ఎప్పుడూ ఎప్పుడూ అలాచెయ్యకు అని బుగ్గపై గిల్లేసారు .
స్స్స్ .......
దేవత : ఎక్కేటప్పుడు గుర్తుకురావాలి అందుకు .......
బామ్మా ....... దీనిని కూడా కౌంట్ చేశారా ? .
బామ్మ : లేదు లేదు బంగారూ ...... , నా బుజ్జిహీరో కోసం గిల్లింది కాబట్టి కౌంట్ లోకి రాదు . లవ్ యు బుజ్జితల్లీ ...... అంటూ నన్ను దేవతవైపు తోస్తూ దేవత బుగ్గపై ముద్దుపెట్టారు .
ఏరియా మెయిన్ గేట్ చేరుకునేసరికి 9 గంటలు అయ్యింది . మేడం ...... మీరు ఆటోలో లోపలికి వెళ్ళండి - నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోతాను .
దేవత : నో నో నో ఇప్పటికే .......
మేడం ...... నాకు అలవాటే , చలి ఎక్కువగా ఉంది మీరు నేరుగా ఇంటిదగ్గర దిగండి అంటూ ఆటో దిగి రైట్ రైట్ అంటూ తోసాను .

ఆటో లోపలికి వెళ్ళాక వెనుకే లోపలికివెళ్ళాను .
బామ్మ ...... దేవత వెనుకే ఇంట్లోకి వెళుతూ తొందరగా వచ్చెయ్యి అని సైగ చేశారు .
బ్యాగు ఉంచేసి - మేడమ్స్ , మురళి కోప బాణాలను స్వీకరించి , ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను బామ్మా ...... అని చెప్పి - మనసులో అనుకుని మురళి ఇంటికి చేరాను . 
మెయిన్ గేట్ ఎంటర్ అవ్వగానే లోపల ఫ్రెండ్స్ అందరూ గుమికూడి డిస్కస్ చేసుకుంటున్నట్లు - ఒక ప్రాబ్లమ్ పై మల్లగుల్లాలు పడుతున్నట్లు అనిపించి గుంపులోకి వెళ్ళిచూసాను .
సేమ్ ప్రాబ్లమ్ ....... నేనుకూడా ఇలానే కంగారుపడుతుంటే అక్కయ్య చిటికెలో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ ........
ఫ్రెండ్స్ : రేయ్ రేపు తప్పకుండా ఇదే వస్తుందిరా 8 మార్క్స్ కు ...... , ఎవ్వరికీ సాల్వ్ చెయ్యడం రావడం లేదు చివరికి మన పేరెంట్స్ కు కూడానూ ...... ఇక అంతే 8 మార్క్స్ పోయినట్లే ........
ఫ్రెండ్స్ నాకొచ్చుకదా ఎందుకు టెన్షన్ అన్నాను .
అంతే అందరూ ...... వచ్చా వచ్చా వచ్చా అంటూ షాకింగ్ గా చూస్తున్నారు .
వినయ్ : మహేష్ ఎప్పుడొచ్చావు ? , అది తరువాత విషయం ...... గంట నుండీ ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం అందరి పేరెంట్స్ దగ్గరికీ వెళ్ళాము కానీ నో use ....... పేరెంట్స్ అందరూ లోపలే ఉన్నారు .
ఫ్రెండ్స్ మాట్లాడుతుండగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసాను .
గోవర్ధన్ : ఆన్సర్ కరెక్టే రా ..... , మహేష్ సాల్వ్ చేసేసాడు , 8 మార్క్స్ మనచేతిలో ఉన్నట్లే ...... థాంక్యూ మహేష్ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు .
మురళి అందుకుని చూసి , నెమ్మదిగా థాంక్స్ చెప్పాడు .

మహేష్ అని వినిపించినట్లు ఫ్రెండ్స్ పేరెంట్స్ కోపంతో బయటకువచ్చారు .
ఫ్రెండ్స్ : మమ్మీ - డాడీ ....... మహేష్ వలన exam స్టార్ట్ కాకముందే 8 మార్క్స్ వచ్చినట్లే అంటూ అందరూ కలిసి అమాంతం పైకెత్తడం చూసి .......
సర్స్ - మేడమ్స్ కూల్ అయినట్లు ....... , మహేష్ ....... ఇంకెప్పుడూ మా పిల్లలను వదిలి ఎక్కడికీ వెల్లకు - అది ఎంత ముఖ్యమైనా సరే - ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ...... అనిచెప్పి వెళ్లిపోయారు .
ఫ్రెండ్స్ : మహేష్ ....... ఇప్పటివరకూ మా పేరెంట్స్ ఎంత కోపంగా ఉన్నారో తెలుసా ....... ? , నిన్ను తిడతారు - కొడతారేమో అనుకున్నాము , ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ మాత్రమే నిన్ను కాపాడింది థాంక్యూ థాంక్యూ మహేష్ ...... , ఇదే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని మన క్లాస్మేట్స్ కూడా కాల్ చేశారు - వెంటనే వాళ్లకు కూడా కాల్ చెయ్యాలి పాపం ...... , ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చెయ్యాలి .
నన్ను కాపాడినది ప్రాబ్లమ్ కాదు మా అక్కయ్య ....... , ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్యివస్తాను అని ఔట్ హౌస్లోకి పరుగుపెట్టాను - బ్యాగుని బెడ్ పైకి చేర్చి అక్కయ్యకు కాల్ చెయ్యడానికి మొబైల్ తీస్తే స్విచ్ ఆఫ్ ....... , ఛార్జింగ్ పెట్టాను .
కాల్స్ వచ్చినట్లు నోటిఫికేషన్ మెసేజెస్ వచ్చాయి - కాల్స్ అన్నీ అక్కయ్య నుండే ...... , వెంటనే కాల్ చేసాను .
అక్కయ్య : తమ్ముడూ ....... క్షేమంగా చేరావన్నమాట - ఇప్పటివరకూ అక్కయ్యతో మాట్లాడాను . 
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ....... , మీవల్లనే ఒక పెద్ద గండం నుండి బయటపడ్డాను అని వివరించాను .
అక్కయ్య : అంతటి ప్రమాదం నుండి సేవ్ చేసినాకూడా కేవలం లవ్ యు మాత్రమేనా తమ్ముడూ ........
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... మా అక్కయ్యకు బోలెడన్ని ముద్దులు ......
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ...... , ఇవే ముద్దులు రేపు ఉదయం వచ్చినప్పుడు కూడా ఇవ్వాలి .
లవ్ టు లవ్ టు అక్కయ్యా ....... ఈ ముద్దులకు డబల్ ముద్దులు ఇస్తాను మా అక్కయ్యకు ......
అక్కయ్య : యాహూ ...... 
నవ్వుకుని , అక్కయ్యా ....... స్నానం చేయాలి .
అక్కయ్య : అవునవును నాకోసం మా బుజ్జిహీరో ఉదయం నుండీ రాత్రివరకూ నాతోనే ఉన్నాడు . వెళ్లి ఫ్రెష్ అవ్వు తమ్ముడూ ...... 
అక్కయ్యా ...... బామ్మ ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను .
అక్కయ్య : నీ దేవత ఇంటికి కాదా ....... ? , బామ్మ అంతా చెప్పారులే , soooo బ్యూటిఫుల్ ....... ఇంకా వింటూనే ఉండాలనిపించింది తమ్ముడూ .......
ఎందుకో తెలియదు అక్కయ్యా ....... , దేవతను చూస్తూనే దేవతతోనే ఉండిపోవాలని ఆశ ...... 
అక్కయ్య : తథాస్తు తమ్ముడూ .......
లవ్ యు అక్కయ్యా ....... , మా అక్కయ్య - మీ అక్కయ్య ....... ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అదొక్కటే నా కోరిక .......
అక్కయ్య : టచ్ చేసావు తమ్ముడూ ....... , ఇలానే మాట్లాడుతుంటే మరింత ఆలస్యం అవుతుంది వెళ్లు వెళ్లు .......
ఉమ్మా అక్కయ్యా ...... అని కట్ చేసి స్నానానికి వెళ్ళాను .

ఫ్రెష్ అయ్యి దేవత దగ్గరికి వెళ్ళడానికి ఉత్సాహంగా బయటకువస్తే .......
మాథ్స్ కదా ఫ్రెండ్స్ అందరూ ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు . మహేష్ మహేష్ ..... మరొక ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా రావడం లేదు అని లాక్కునివెళ్లారు . మహేష్ ....... మన క్లాస్మేట్స్ అంతా నిన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు తెలుసా ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ తో .......
ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తూ నేనూ ప్రాక్టీస్ చేస్తూ 11 గంటలు అయిపోయింది . ప్రాక్టీస్ satisfy అయినట్లు నిద్రకూడా రావడంతో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు .
11 గంటలు అయ్యింది , దేవత - బామ్మ నిద్రపోయి ఉంటారేమోనన్న అనుమానంతోనే ఇంటికి వెళ్ళాను . 
ఇంటి బయట లోపల లైట్స్ వెలుగుతుబడటం - బామ్మ ..... నాకోసం గుమ్మం దగ్గరే ఎదురుచూస్తుండటం దూరం నుండే చూసి పరుగునవెళ్లి గుండెలపైకి చేరాను - sorry బామ్మా ..... ఫ్రెండ్స్ తోపాటు ప్రాక్టీస్ చేస్తూ ఆలస్యం అయ్యింది .
బామ్మ : నా బంగారుకొండ కోసం ఎంతసేపైనా ఎదురుచూస్తాను - రేపు exam ఉందికదా నిద్రపోవాలి పదా అంటూ లోపల గొళ్ళెం పెట్టి దేవత గదిలోకి తీసుకెళ్లారు .
బామ్మా ...... మళ్లీ బెడ్స్ కలిపేసి ఉన్నాయి ఏంటి ? .
బామ్మ : నిన్న నువ్వేనా దూరం జరిపినది , ఎందుకు జరిపావు ? .
అమ్మో ....... నిద్రలో నేను ప్రక్కనున్న వారిపై కాళ్ళు వేస్తాను బామ్మా - దేవతపైన వేస్తే ఇంకేమైనా ఉందా ...... ? .
బామ్మ : నీ దేవతపై కాళ్ళు వేసి హాయిగా పడుకునే అర్హత మా బుజ్జిహీరోకు కాకుండా ఎవరికి ఉంది , రా నా ఒడిలో హాయిగా పడుకుందువు .......
లేదంటే లేదు ....... , రెండు రాత్రులూ ..... మీరు పడుకోనేలేదు , నేను ...... ఇక్కడ - మీరు దేవత ప్రక్కన ఇది ఫైనల్ అంతే ....... , నేను విననంటే వినను - ఉదయమే చాలాకోపం వచ్చింది .
బామ్మ : నా బంగారం సరే అంటూ గుడ్ నైట్ కిస్ పెట్టి వెళ్లి దేవత ప్రక్కన పడుకున్నారు .
బామ్మ నో అన్నా - తియ్యదనంతో కోప్పడినా ...... సింగల్ బెడ్ ను నెమ్మదిగా దూరంగా జరిపి , అమ్మో ...... నాకు భయం అంటూ ముసిముసినవ్వులతో లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాను . అక్కయ్యకు కాల్ చేస్తాను అనిచెప్పాను కదా , వద్దులే ఇప్పటికే ఆలస్యం అయ్యింది డిస్టర్బ్ చెయ్యకూడదు అని దేవతను చూస్తూ పడుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 23-10-2021, 09:39 AM



Users browsing this thread: 29 Guest(s)