Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
సంతోషంగా చిరునవ్వులు చిందిస్తున్న దేవత వెంటనే మూడీగా మారి స్టాఫ్ రూమ్ లోకివెళ్లి చైర్లో కూర్చున్నారు .
మేడం ...... అంతలోనే ఏమయ్యింది .
దేవత : బుజ్జిహీరో ...... కూర్చో చెబుతాను . " LIFE & TIME " Novel ను నేను మొదలుపెట్టినది నిజమే కానీ నా మనసుకు నచ్చినట్లుగా రాయలేకపోతున్నానని సగం లోనే ఆపేసాను - ఇప్పుడేమో నాకు తెలియకుండా ఎవరో పుణ్యాత్ములు కాలేజ్ తరుపున సబ్మిట్ చేశారు - సగం పూర్తయినది సబ్మిట్ చేశానాని మేనేజ్మెంట్ ఆగ్రహానికి ఎలాగో లోనవుతాను - నాపై కోప్పడతారని నాకు బాధ లేదు మహేష్ ..... - నా వలన మేనేజ్మెంట్ పరువు పోబోతోందని బాధ .......
మేడం ...... మీరు మంచివారు - స్వఛ్చమైనవారు , మీ వలన ఎవ్వరూ ఇబ్బందులకు లోనుకారని నా నమ్మకం - మంచివారికి మంచే జరుగుతుంది అందులోనూ మీరు దేవతలాంటివారు . 
దేవత : దేవతనా ...... అంటూ మురిసిపోతూనే మరొకవైపు చిరుకోపం ప్రదర్శిస్తున్నారు .
అవును మీరు దివి నుండి దిగివచ్చిన బ్యూటిఫుల్ గాడెస్ ....... మిమ్మల్ని చూస్తూ నిమిషాలు - గంటలు - రోజులు - వారాలు - నెలలు - సంవత్సరాలైనా ఉండిపోవచ్చు .
దేవత : నవ్వుకుని , ఏంటి బుజ్జిహీరో గారు కవిత్వం మొదలుపెట్టారు అని నా చెవిని సున్నితంగా మెలితిప్పారు .
స్స్స్ స్స్స్ ...... అంటూ నవ్వుతూనే ఉన్నాను .

అంతలో సెక్యూరిటీ వచ్చారు స్టాఫ్ రూమ్ లాక్ చెయ్యడానికి .......
దేవత : నొప్పివేసిందా బుజ్జిహీరో sorry sorry .......
నో నో నో ....... మీరు sorry చెప్పే సందర్భం రాకూడదని చెప్పానుకదా మేడం ......
దేవత : అలానే బుజ్జిహీరో గారూ ....... , స్కూల్ లో చివరగా మిగిలినది మనిద్దరమే , వెళదాము పదా ..... ఎలాగో మేనేజ్మెంట్ నమ్మకాన్ని పోగొట్టాను అంటూ ఐటమ్స్ అన్నింటినీ తీసుకున్నారు .
నో నో నో మేడం ....... , అలా ఎప్పటికీ జరగనే జరగదు అంటూ అన్నింటినీ తీసుకుని మేడం లాకార్లో ఉంచి లాక్ చేసి కీస్ ఇచ్చాను - మేడం ఇప్పుడు వెళదాము .
దేవత : అంత నమ్మకం ఏమిటి బుజ్జిహీరో .......
మీరు మళ్లీ మొదటికి వచ్చారు - కొద్దిసేపటి ముందే చెప్పాను మీరు దివి నుండి .....
దేవత : ok ok ok దివి నుండి దిగివచ్చిన దేవతను అంటావు అంతే కదా .......
నో నో నో దివి నుండి దిగివచ్చిన బ్యూటిఫుల్ దేవత ....... 
దేవత : అవునా అవునా నిన్నూ అంటూ కొట్టడానికి రాబోతే పరుగుతీసాను .
దేవతకు ఆయాసం వచ్చి ఆగిపోవడం చూసి , కొట్టండి అంటూ ప్రక్కనవెళ్లి నిలబడ్డాను . 
దేవత : నిన్నూ అంటూ కొట్టబోయి ఆగి నవ్వుతూ భుజం చుట్టూ చేతినివేశారు . అబ్బో ....... చాలా హైట్ ఉన్నావే ......
దేవత దేవత ....... నా భుజం పై చేతినివేశారు అంటూ సంతోషం పట్టలేక యాహూ అంటూ కేకవేశాను - స్కూల్ మొత్తం నిర్మానుష్యన్గా ఉండటం వలన రెండుమూడుసార్లు రీసౌండ్ రావడంతో దేవత ఆశ్చర్యపోయారు .

దేవత : 5:30 అవుతోంది , ఇప్పటికే ఆలస్యం అయ్యింది , బామ్మ కంగారుపడుతుంటారు పదా వెళదాము .
అవునవును మేడం మా బామ్మ కూడానూ ....... , బస్సులో వెళ్ళేటప్పటికి మరింత ఆలస్యం అవుతుందేమో కాల్ చేసి చెప్పండి .
దేవత : గుడ్ ఐడియా గుర్తుచేసినందుకు థాంక్స్ అని బామ్మకు కాల్ చేసి విషయం చెప్పారు .
బామ్మ : బుజ్జితల్లీ ...... తోడుగా .......
దేవత : తోడుగా ఒక బుజ్జిహీరో ఉన్నాడులే బామ్మా ....... , నాపై ఈగ వాలనివ్వడు కాదు కాదు వదిలి ఒక్క క్షణం కూడా వెళ్ళడు .
బామ్మ : నీ హీరో అన్నమాట ...... నాకింకేమీ భయం లేదు ఎంత ఆలస్యమైనా .....
దేవత : నా హీరో కాదు బామ్మా ...... , నా స్టూడెంట్ బుజ్జిహీరో ...... అనేంతలో కట్ చేసేసారు . నిన్ను హీరో అనుకుంటోంది మహేష్ .....
థాంక్స్ మేడం ...... నాపై నమ్మకం ఉంచినందుకు .......
దేవత : ఈగ కూడా వాలనివ్వడు అంటే , ఈగలా ఎప్పుడూ నువ్వే తిరుగుతుంటావుకదా వాటికి అవకాశం ఇవ్వకుండా అని నవ్వుకున్నారు . 
నిజమే ...... , అయినా సరే అంటూ బుంగమూతిపెట్టుకున్నాను .
దేవత : నవ్వుకుని , sorry ....... నేను sorry చెప్పడం ఇష్టం లేదు కదూ , ఇప్పుడెలా బుజ్జిహీరో అలక పోగొట్టడం - అంతలోనే అటువైపుగా ఐస్ క్రీమ్ బండి వెళుతుండటం చూసి రెండు తీసుకుని , బుజ్జిహీరో గారూ అంటూ అందించారు .
దేవత నా దేవత ...... నాకు ఐస్ క్రీమ్ ఇప్పించారు యాహూ అంటూ కేకవేసి అందుకుని చప్పరించి సూపర్ మేడం థాంక్యూ అంటూ బస్ స్టాండ్ చేరుకున్నాము.

బస్సు వచ్చి చాలాసేపు అయినట్లు బస్టాండ్ లో చాలామందే ఉన్నారు . దేవతను ఎవ్వరూ టచ్ చేయకూడదని దేవత వెనుక నిలబడి ఐస్ క్రీమ్ తింటున్నాను . 
అంతలో నాకు కుడివైపు ఉన్న వాడు నేను బస్సు వస్తోందని ఎడమవైపుకు తిరగగానే నా దేవత జుట్టు సువాసనను పీల్చి రిబ్బన్ ను లాగేసాడు . 
లూస్ అయిన కురులను చూసుకుని వెనుక ఉన్నది నేనే కాబట్టి ఐస్ క్రీమ్ పడేసి కోపంతో చెంప చెళ్లుమనిపించారు - నిన్ను బుజ్జిహీరో అనడం నా తప్పు అంటూ బస్సు ఆగగానే వెళ్లి ఎక్కారు .
దేవత చెంప చెళ్లుమనిపించడం చూడగానే వాడు పరుగు పెట్టేంతలో కాలు అడ్డుపెట్టి కిందపడేలా చేసాను . ఇస్తావా ..... అందరితో కొట్టించాలా - పిల్లాడిని కాబట్టి నా మాటలే వింటారు అంటూ కింద పడినవాడి చెంపలు వాయించాను .
Sorry sorry ఇంకెప్పుడూ చెయ్యను అంటూ పిడికిలి తెరిచాడు . 
దేవత రిబ్బన్ అందుకుని , ఇంకొకసారి ఇలా చేశావో అంటూ కాలితో తన్ని కదులుతున్న బస్సులో ఎక్కాను . బస్సు మొత్తం నిండిపోయింది - లేడీస్ సీట్స్ దగ్గర తప్ప వెనుకంతా నిలుచున్నారు - ఈ కోపం చాలా ఇంకా ఏమైనా కావాలారా ఏమి కోరుకోవాలో కూడా తెలియదు - పెద్దమ్మ అయితే కోరిక కొరగానే తీర్చేస్తారు అంటూ దేవత ఎక్కడ కూర్చున్నారో చూస్తున్నాను . 

అంతలోనే ...... బాబూ , నీ కోసమే మీ మేడం ప్రక్కన సీట్ పెట్టుకున్నాను రా అంటూ రోజూ ప్రయాణించే అంటీ పిలవడంతో , పెదాలపై చిరునవ్వులతో వెళ్లి కూర్చోబోతే ........
దేవత కోపంతో చూడటంతో అలాగే నిలుచుండిపోయాను . 
మేడం ...... అంటూ రిబ్బన్ చూయించాను . 
దేవత : నాకు తెలుసు నువ్వే అని అంటూ లాక్కున్నారు మరింత కోపంతో ........
మేడం ...... నేనుకాదు , బస్టాండ్ లో వాడు అని చెబుతున్నా వినడం లేదు .
అంటీ : బాబూ ...... త్వరగా కూర్చో బ్యాగ్ బరువుగా ఉందికదా ......
థాంక్స్ అంటీ అంటూ బ్యాగుని మధ్యలో ఉంచి కూర్చోబోతే , మళ్లీ కోపంతో చూసారు దేవత .......

అంతలో రెండు మూడు వరుసలు వెనుక సీట్లోనుండి ఏడుపు వినిపించడంతో చూస్తే , ఒక అక్కయ్య ప్రక్కన ఇద్దరు - వెనుక ఇద్దరు చేరి ఎక్కడెక్కడో చూస్తూ డర్టీ కామెంట్స్ చేస్తూ టచ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు . అక్కయ్య కళ్ళల్లోనుండి కన్నీళ్లను చూసి చలించిపోయాను - కోపంతో వెనక్కు వెళ్ళిచూస్తే అక్కయ్య బ్లైండ్ మరింత కోపం వచ్చేసింది . చుట్టూ చూస్తే కొంతమంది నవ్వుకుంటున్నారు మరికొంతమంది తమకు ఏమీ పట్టనట్లు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు - మరింత కోపం వచ్చి , కోప్పడితే ఈ వెధవలు నన్నే కుమ్మేస్తారని తెలివిగా ఆలోచించి అక్కయ్యా అక్కయ్యా ....... ఇక్కడ కూర్చున్నారా ? , మీకోసం బస్సంతా  వెతుకుతున్నాను , రేయ్ ఎవర్రా మీరు మా అక్కయ్య ప్రక్కన కూర్చున్నారు - అక్కయ్యా ...... ఏంటి ఏడుస్తున్నారు - వీళ్ళేమైనా అన్నారా ..... ? అంటూ నలుగురి చెంపలు వాయించాను .
వెధవలు : ఇంత లేవు మమ్మల్నే కొడతావా ....... అంటూ కొట్టడానికి లేచారు . 
అంటీ అంటీ మేడం మేడం ....... నన్ను కొడుతున్నారు అంటూ కేకలువేశాను .
బాబూ బాబూ అంటూ ఇద్దరూముగ్గురు అంటీలు - జరిగింది చూసినట్లు మహేష్ మహేష్ అంటూ మేడం కూడా వచ్చారు .
అంటీ ...... మా అక్కయ్యను టీజ్ చెయ్యడమే కాకుండా నన్ను కొట్టడానికి వస్తున్నారు - చుట్టూ ఉన్న ఈ ఆడంగులు సినిమా చూసినట్లు చూస్తున్నారు .
అంటీ : లేడీస్ అందరూ వచ్చెయ్యండి అని పిలవడం ఆలస్యం ముందు కూర్చున్నవాళ్ళంతా వచ్చేసారు . అంటీ - మేడం వాళ్లనే కొట్టబోయి అంతమందినీ చూసి భయంతో పరిగెత్తబోతున్న నలుగురినీ పట్టుకుని కుమ్మేసారు . బాబూ ఏమి చేద్దాము .
ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లకు పట్టిద్దాము అంటీ - మేడం ......
నలుగురు అంటీలు ....... నలుగురినీ కింద పడేసి కాళ్ళు వాళ్లపై ఉంచి కూర్చున్నారు . సర్కిల్ రాగానే కండక్టర్ విజిల్ వేసి కిందకుదిగి ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లను పిలుచుకుని రావడంతో బట్టలూడదీసి తీసుకెళ్లారు ఇంకా మారరేమిట్రా మీరు అంటూ ....... 
అంటీ - మేడం ....... చుట్టూ ఉన్న వీళ్లపైన కూడా కంప్లైంట్ ఇవ్వాల్సింది - వీడు వాడు వాడు చూసి నవ్వుతున్నారు అంటీ ....... 
అంటీ వాళ్ళు : ఛి ఛీ తు తు ...... మీరూ మగాళ్లేనా , ఇంటికి వెళ్లి మీ పెళ్లాల - అమ్మల చీరలు కట్టుకోండి - చిన్న పిల్లాడు దైర్యంగా ఎదిరించాడు . దేశంలో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నది అలాంటి నలుగురి వెధవల వలన కాదు - జరుగుతున్నా చూసీ చూడనట్లు పట్టించుకోకుండా లేక ఇలా చూసి ఆనందించే మీ వల్లనే మీదీ ఒక బ్రతుకేనా ........ 
అంటీ ....... సరిగ్గా చెప్పారు . అక్కయ్యా అక్కయ్యా ...... ఏడవకండి అంటీ వాళ్ళు వాళ్ళను రక్తం వచ్చేలా కొట్టారు - మరే అమ్మాయిపైన చేతులు వేయకుండా వేళ్ళు విరిచేశారు - కన్నీళ్లు తుడుచుకోండి - మీ కన్నీళ్లు భూతల్లిని చేరితే భూతల్లి ఆగ్రహానికి అందరూ బలైపోతాము .
అక్కయ్య : కన్నీళ్లను తుడుచుకుని , తడుముతూ నా చేతులను అందుకుని థాంక్స్ తమ్ముడూ అన్నారు .
అక్కయ్యకు అండగా నిలవడం - జాగ్రత్తగా కాపాడుకోవడం తమ్ముళ్ల బాధ్యత , మీరు ఎక్కడ దిగాలి . 
అక్కయ్య : నెక్స్ట్ స్టాప్ తమ్ముడూ .......
బ్యాగులో బుక్స్ ఉన్నాయి అంటే కాలేజ్ కు వెళుతున్నారా అక్కయ్యా .......
అక్కయ్య : అవును తమ్ముడూ ...... బ్లైండ్ కాలేజ్ కు వెళతాను . రోజూ కాలేజ్ బస్ మా అందరినీ ఇంటివరకూ వదులుతుంది - బస్ రిపేర్ వలన సిటీ బస్సులో వెళుతున్నాను , రేపు రిపేర్ పూర్తవుతుందని చెప్పారు - ఎక్కినప్పటి నుండీ వాళ్ళు ఏడిపిస్తున్నారు - టచ్ కూడా చేశారు అంటూ ఏడుస్తూ చెప్పారు .
అంటీ - మేడం ఓదారుస్తున్నారు .
మేడం please కూర్చోండి అంటూ లేచి ప్రక్కకువచ్చాను .
దేవత కూర్చుని అక్కయ్య కన్నీళ్లను తుడిచి , ఇక ఏ భయం లేదు చెల్లీ ......  తమ్ముడు - అంటీ వాళ్ళు - నేను ఉన్నాము కదా ......
అంటీవాళ్ళు మళ్లీ కోపంతో చుట్టూ ఉన్న ఆడంగులను ఆడేసుకున్నారు .
Sorry sorry అంటూ తలలు దించుకున్నారు . 
అంటీ : మీ sorry ల వలన పైసా ఉపయోగం లేదు - మీ ఇంట్లోవాళ్లకు ఇలానే జరిగితే ఊరుకుంటారా ..... ? , కాస్తయినా మారండి అనిచెప్పి వెళ్లి కూర్చున్నారు .

అక్కయ్యా ....... స్టాప్ వచ్చింది అంటూ విజిల్ వేసాను . బ్యాగు వేసుకుని వెళ్లి అక్కయ్యా ...... నా చేతిని పట్టుకోండి ఇంటివరకూ తీసుకెళతాను .
అక్కయ్య : పర్లేదు తమ్ముడూ ...... నువ్వు వెళ్ళాలి కదా ......
నేను ....... వీళ్ళలా కాదు , మా బామ్మ - మీ ప్రక్కన కూర్చున్న మేడం నన్ను బుజ్జిహీరో అని పిలుస్తారు , నాకు భయమన్నదే లేదు చీకటి పడినా సరే - ఈ వయసులోనే చాలా కష్టాలు పడి ఇక్కడ ఉన్నాను - నా గురించి ఆలోచించకండి రండి - నడుచుకుంటూనే ఇంటికి వెళ్లిపోగలను - మేడం ...... మీరు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి , మన స్టాప్ లో దిగగానే కాల్ చెయ్యండి అనిచెప్పి , జాగ్రత్తగా అక్కయ్య బస్సు దిగేలా చేసాను , అక్కయ్యా ..... ఎలా వెళ్ళాలి ? .
అక్కయ్య : గుర్తులు చెప్పారు .
ఆ ఆ కనిపిస్తోంది అక్కడ టర్న్ అవ్వాలన్నమాట .......
ఆటో అని దేవత మాటలు వినిపించడంతో వెనక్కు చూస్తే దేవత .......
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 23-10-2021, 09:36 AM



Users browsing this thread: 33 Guest(s)