Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జితల్లి : అంకుల్ ఆకలివేస్తోంది కదూ .......
లేదు లేదు బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : అంకుల్ మీరు అపద్ధం చెబుతున్నారు , మీ కళ్ళు - స్పర్శ ద్వారా నాకు తెలిసిపోతోంది , నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు నిజం చెప్పండి అని ముద్దుపెట్టింది .
అవును బుజ్జితల్లీ ....... ఉదయం కూడా తినలేదు - బ్లడ్ కూడా ఇచ్చానుకదా బాగా ఆకలివేస్తోంది - బయట నుండి అధిరిపోయినట్లు వంటల ఘుమఘుమలు కూడానూ ........ అని దీనంగా ముఖం పెట్టి అడిగాను .
బుజ్జితల్లి : sorry అంకుల్ ...... - తాతయ్యను రక్షించే క్రమంలో మీగురించి ఒక్కక్షణం కూడా ఆలోచించనేలేదన్నమాట - లవ్ యు లవ్ యు sooooo మచ్ అంకుల్ . అంతే మమ్మీ - అమ్మమ్మా - మావయ్యా ...... అంటూ బుజ్జికోపంతో గట్టిగా కేకలువేసింది .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ కీర్తీ ........ అంటూ ముగ్గురూ పరుగునవచ్చారు . 
బుజ్జితల్లి : ఇంటి దేవుడు అని పిలవడం కాదు ........
ష్ ష్ ష్ బుజ్జితల్లీ ...... అంటూ నవ్వుతూ బుజ్జి నోటిని చేతితో మూస్తున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ఆగండి please please అంటూ నా చేతిపై - చేతిని తియ్యగానే బుగ్గపై ముద్దుపెట్టింది లవ్ యు అంటూ . మమ్మీ - అమ్మమ్మా ...... తాతయ్యకోసం హాస్పిటల్లో ఉన్నారు - బ్లడ్ ఇచ్చారు - తాతయ్యను జాగ్రత్తగా తీసుకొచ్చి ఫంక్షన్ జరిగేలా చూసారు , బ్లడ్ ఇచ్చాక ఎంత నీరసమైపోతారో తెలుసుకదా ....... , పాపం అంకుల్ బ్లడ్ ఇచ్చిన తరువాత టిఫిన్ కూడా తినలేదు కాదు కాదు మనమే కనీసం అడగనేలేదు - ఇప్పుడు భోజనం కూడా ........
బుజ్జితల్లీ ........
బుజ్జితల్లి : ఆగమని చెప్పానుకదా అంకుల్ నోటిపై వేలుని వేసుకోండి .
అమ్మో ......భయమేస్తోంది అంటూ నోటికి తాళం వేసాను . 
దేవత - పెద్దమ్మ - కృష్ణ ...... ముగ్గురూ నవ్వుకుని హడావిడిగా బయటకువెళ్లి పెద్దపెద్ద పాత్రల నుండి ప్లేట్స్ లో వడ్డించుకునివచ్చారు . 
పెద్దమ్మ : sorry బాబూ ...... ఆయన దెబ్బలు చూసి - ఈ హడావిడిలో మరిచేపోయాము .
కృష్ణ : బుజ్జితల్లీ ....... మాపై మరింత కోప్పడాల్సింది - బ్లడ్ ఇచ్చిన అన్నయ్య గురించి ఆలోచించనేలేదు - మోకాళ్లపై కూర్చుని అన్నయ్యా ...... మీవల్లనే ఈ సంతోషాలు , భోజనం చెయ్యండి .
కృష్ణా ...... నాన్నగారు భోజనం చేశారా ? .
కృష్ణ : మందులు వేసుకోవాలికదా పూజ జరిగేటప్పుడే తిని పడుకున్నారు .
గుడ్ కృష్ణా .......
కృష్ణ : ఇప్పుడు కూడా మా గురించే ఆలోచిస్తున్నారా అన్నయ్యా ....... , నిజంగా మీరు దేవుడు .
మళ్లీ మొదలెట్టావా ..... ? .
దేవత : నవ్వుకుని , మహేష్ గారూ ...... అమ్మ చెప్పింది కదా మీ ఇల్లే అనుకోబాబూ అని ఆకలివేస్తే మాకు ఆర్డర్ అయినా వెయ్యాలి లేకపోతే దర్జాగా వెళ్లి తినాలి , ఇలా చెయ్యడం ఏమైనా బాగుందా ...... ? - మీ బుజ్జితల్లితో తిట్టిస్తారా ...... ? .
Sorry sorry మేడం ....... , పెదాలపై చిరునవ్వుతో కృష్ణ నుండి అందుకున్నాను . కృష్ణా - మేడం - పెద్దమ్మా ....... ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీరూ భోజనం చెయ్యండి .
పెద్దమ్మ : కృష్ణ చెప్పినట్లు అనుక్షణం మా గురించే ఆలోచిస్తున్నారు - బాబూ ....... నువ్వు అతిథివి కావు ఇంటి మనిషివి కాదు కాదు మా దేవుడివి , ఇంట్లో ఎక్కడికైనా వెళ్లే అధికారం నీకుంది - బుజ్జితల్లిలా మాపై కోప్పడే అధికారం కూడా ఉంది .
పెద్దమ్మా ....... , ఏ జన్మలో చేసుకున్న అదృష్టమే బుజ్జితల్లికి ...... నేనంటే ఇష్టమయ్యాను - పెద్దవారంటే నాకు అపారమైన గౌరవం , మేడం గారికి కూడా తెలుసు ........
దేవత : ఆ ఆ తెలుసు తెలుసు అని ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
నేనూ నవ్వుకుని బుజ్జితల్లీ తిను , నువ్వూ తినలేదు కదా ........
బుజ్జితల్లి : మీరే తినిపించండి .
మేడం ...... తినిపించడానికి స్పూన్ అని అడిగాను తలదించుకుని .......
బుజ్జితల్లి : మమ్మీ నో ........ , అంకుల్ మీరు తింటున్న చేతితోనే తినిపించండి .
బుజ్జితల్లీ ....... ఎంగిలి , మమ్మీకి కోపం వచ్చేస్తుంది .
బుజ్జితల్లి : అయినా పర్లేదు కోప్పడితే కోప్పడనివ్వండి - మా అంకుల్ దేవుడు కదా దేవుడి చేతితో తినాలంటే అదృష్టం ఉండాలి . మమ్మీ - మావయ్య ....... ఎలా చూస్తున్నారు చూడు ఈ అదృష్టం కోసం .
అప్పటివరకూ ఆశతో చూస్తున్నట్లు దేవత తలదించుకున్నారు . కృష్ణకు ప్లేట్ ఇచ్చి మరొక ప్లేట్ లో వడ్డించుకునివచ్చి మాతోపాటు కలిసితిన్నారు .

నవ్వుకుని , కృష్ణా ....... వంటలు భలే రుచిగా ఉన్నాయి - పెళ్లికి కూడా ఈ వంటవారేనా ...... ? .
కృష్ణ : తింటూనే ....... , లేదు అన్నయ్యా ..... వంట చేసినది ఊరిలో ఉన్న పెద్దయ్య - వయసైపోయింది అయినాకూడా కృష్ణా ...... మీ ఇంటి సంబరంలో వంట చేసే అదృష్టం ఇవ్వాలి లేకపోతే ఊరుకునేది లేదు అనడంతో ఈరోజు మన ఊరు వాళ్లే కాబట్టి వద్దు వద్దు ఇబ్బందిపడతారు అన్నాకూడా ఉత్సాహంతో చేశారు - పెళ్లికి జనం డబల్ అవుతారు ఇబ్బందిపడతారు , సిటీ నుండి పిలిపిస్తాను అన్నారు  నాన్నగారు - అక్కయ్య వచ్చేన్తవరకూ పెళ్ళిపనులు మొదలుపెట్టకూడదు అని అనుకున్నాము , అక్కయ్య - బుజ్జితల్లి అంటే అంత ప్రాణం అందరికీ మీకు తెలియంది కాదు - అందుకే ఏదీ ఆర్రేంజ్ చెయ్యలేదు , ఇకపైనా అన్నింటినీ ........

దేవత : తమ్ముడు పెళ్లి అంటే ఏ అక్క అయినా నెల రోజులముందే ఉంటుంది నాలా గెస్ట్ లా ఒకరోజుముందు రాదు అని బాధపడుతోంది .
కృష్ణ : అక్కయ్యా ....... బాధపడకండి , నాన్నగారు లేవగానే సిటీకి వెళ్లి ఒక్కరోజులో అన్నీ సెట్ చేసేస్తాను .
బుజ్జితల్లి : అంకుల్ ....... మమ్మీ రెండు నెలల ముందే రావాలని ఆశపడింది కానీ ఆ మాన్స్టర్ పంపించనేలేదు - మమ్మల్ని ఒంటరిగా వదిలి నెలలు నెలలు ఎక్కడికో వెళ్ళిపోతాడు .
దేవత కన్నీళ్ళతో వంట గదిలోకి వెళ్లిపోయారు . 
ఈ కన్నీళ్లు అలవాటైపోయాయి బాబూ అంటూ పెద్దమ్మ బాధపడుతూ దేవత దగ్గరికి వెళ్లారు .
దేవత కన్నీళ్లను చూసి నా కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి . 

వెంటనే దేవత బయటకువచ్చి అనుకున్నాను మీరు తినడం ఆపేస్తారని , ప్లేట్ ను కిందపెడితే నాకు కోపం వచ్చేస్తుంది మహేష్ గారూ , మీకు కావాల్సినది నేను తినడమే కదా ఇదిగో తింటున్నాను అని మరొక సోఫాలో కూర్చుని తిన్నారు . బుజ్జితల్లీ ....... మీ అంకుల్ కు తినిపించు అని నవ్వుతూ చెప్పారు .
బుజ్జితల్లి : అంకుల్ ...... తినకపోతే నీరసం వచ్చేస్తుంది అని బుజ్జిచేతులతో తినిపించి ముద్దుపెట్టింది . 
కన్నీళ్లను తుడుచుకుని తింటూ బుజ్జితల్లికి తినిపించాను .

పెద్దమ్మ : బుజ్జితల్లి చెప్పినట్లు బ్లడ్ ఇచ్చినవాళ్లు కొద్దిసేపైనా రెస్ట్ తీసుకోవాలి , మాకు ఇబ్బంది కలిగించకుండా ఇంతవరకూ పండుగలా జరిగేలా చూసారు - ఇక రేపటివరకూ మీరు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు , పైకి వెళ్లిపోండి - బుజ్జితల్లీ తీసుకెళ్లు .
బుజ్జితల్లి : ఆ సంగతి నాకు వదిలెయ్యండి అమ్మమ్మా ....... - అంకుల్ కు జోకొడుతూ హాయిగా నిద్రపుచ్చుతాను అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . అంకుల్ వెళదామా ....... ? .
Ok బుజ్జితల్లీ ...... అంటూ ప్రాణంలా హత్తుకుని పైకిలేచాను .

అంతలో పెద్దయ్య ...... నాన్నా కృష్ణా కృష్ణా ...... అంటూ ఇబ్బందిపడి నడుస్తూ లోపలికివచ్చారు .
నాన్నగారూ - పెద్దయ్యా ...... అంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే వెళ్లి పెద్దయ్యను రెండువైపులా పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి సోఫాలో కూర్చోబెట్టాము .
కృష్ణ : నాన్నగారూ ....... పిలవచ్చు కదా .......
పెద్దయ్య : ఇంట్లోకి కూడా నడవకపోతే , పెళ్ళికోసం ఏర్పాట్లుపూర్తిచేయడానికి ఇప్పుడు సిటీకి ఎలా వెళతాను చెప్పండి 
కృష్ణ : నాన్నగారూ ....... మీరు కోలుకునేంతవరకూ ఎక్కడికీ వెళ్లకూడదు , ఎక్కువగా నడవకూడదు , రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారుకదా ........
అవును పెద్దయ్యా ....... 
పెద్దయ్య : ఇలాంటివి ఎన్ని చూడలేదు కృష్ణా ...... , బాబూ ..... పెళ్లికి ఒక్కరోజే ఉందికదా ఈరోజే అన్నీ చూసుకోవాలి లేకపోతే కష్టం . నేనేకదా చెయ్యాల్సినది కష్టమైనా తప్పదుమరి .......
కృష్ణ : నాన్నగారూ ....... నేనున్నాను కదా , సిటీకి వెళ్లి .......
పెద్దయ్య : ఒక్కసారి పెళ్ళికొడుకుని చేశాక పొలిమేర దాటకూడదు నాన్నా .......
పెద్దమ్మ - దేవత : అవునవును , వెళ్లకూడదు కృష్ణా - తమ్ముడూ ..... ప్రమాదం అంటూ ఇద్దరూ కృష్ణ చేతులను పట్టుకున్నారు .
కృష్ణ : మరెలా అక్కయ్యా - అమ్మా ...... , నాన్నగారిని ఈ పరిస్థితులలో పంపించడం అంతకంటే ప్రమాదం . నేనే వెళతాను - నాకేమి జరిగినా .......
దేవత : తమ్ముడూ ....... కొడతాను అంటూ గట్టిగా చేతిని చుట్టేశారు .
కృష్ణ : అయితే ఇప్పుడెలా అక్కయ్యా ....... , అందుకే పెళ్లిని పోస్ట్ .......

కృష్ణా ...... పోస్ట్ ఫోన్ అన్నమాటను అని అందరినీ బాధపెట్టకు - పెళ్ళిపనులు పూర్తిచేయడానికి నేను లేనూ ........
బాబూ - అన్నయ్యా ....... నో నో నో మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం .
అంటే నేను ఈ ఇంటివాడిని కాదన్నమాట - ఈ ఇల్లు మీదే , మా ఇంటి దేవుడు , మాపై అధికారం చాలాయించవచ్చు అన్నది ఉత్తిత్తినే అన్నమాట . నా బుజ్జితల్లి వలన మీరంతా ...... నా ఫ్యామిలీ అని ఉదయమే ఫిక్స్ అయిపోయాను - మీరు ఔనన్నా కాదన్నా ఇంటి నుండి గెట్ ఔట్ ........
దేవత - పెద్దమ్మ :లేదు లేదు ఆ మాటను ........
నవ్వుకుని , లేదులే పెద్దమ్మా - మేడం ...... ఊరికే అన్నాను . మీరు ఔనన్నా - కాదన్నా ...... పెళ్లి ఏర్పాట్లన్నీ చెయ్యబోతున్నాను అంతే ......
బుజ్జితల్లి : అంకుల్ కు తోడుగా నేను కూడా ........
హైఫై హైఫై బుజ్జితల్లీ ...... లవ్ యు లవ్ యు soooo మచ్ అంటూ ముద్దులుపెట్టాను . బుజ్జితల్లీ ....... లెట్స్ గో ....... , కృష్ణా - పెద్దయ్యా ...... పెళ్ళికొడుకు శాస్త్రం కాకుండా ఏదీ ఆర్రేంజ్ చెయ్యలేదు కదా ఇక మా ఇద్దరికీ వదిలెయ్యండి అని మళ్ళీ హైఫై కట్టుకున్నాను .
దేవత : నేను కూ ......... అని ఎందుకో ఆగిపోయి మావైపు ఆశతో చూస్తున్నారు .
మేడం ........ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ? .
దేవత : లేదు లేదు , థాంక్యూ soooo మచ్ మహేష్ గారూ అంటూ ఆనందబాస్పాలతో నమస్కరించారు .
పెద్దమ్మ : బాబూ ...... నువ్వు రెస్ట్ .......
పెళ్లి పనుల ఉత్సాహం ఉంటే ఇంకా రెస్ట్ ఏమిటి పెద్దమ్మా ........
పెద్దమ్మ : నువ్వు నిజంగా మా దేవుడే బాబూ .......
బుజ్జితల్లీ ....... ఇక్కడే ఉంటే ఇలానే దేవుడు దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు మనం వెళదాము పదా ....... అంటూ ముద్దుపెట్టాను .

కృష్ణ : అన్నయ్యా ....... అంటూ ఉద్వేగానికి లోనౌతూ బుజ్జితల్లితోపాటు కౌగిలించుకున్నాడు . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా ....... - మేమంతా మీకు ఋణపడిపోయాము . మీకు తోడుగా మీరు చెప్పినవన్నీ చెయ్యడానికి మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు అని డబ్బు ఇచ్చాడు .
అయితే మంచిదే కదా ....... , వద్దు ఆనబోయి బాగోదు అని డబ్బు అందుకున్నాను.
కృష్ణ : నిమిషంలో వస్తారు అన్నయ్యా ......
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2021, 12:11 PM



Users browsing this thread: Kacha, 8 Guest(s)