Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కృష్ణ మొబైల్ మ్రోగడంతో తీసి చూసి , సర్ ...... అక్కయ్య చేస్తోంది ఖచ్చితంగా బుజ్జితల్లినే చేయించి ఉంటుంది తాతయ్యను అడుగుతుంది అని మరింత కంగారుపడిపోతున్నాడు .
భుజంపై చేతినివేసి మాట్లాడమని ధైర్యం చెప్పాను .
కృష్ణ : సరే సర్ అంటూ ఎత్తాడు . " మావయ్యా ...... " స్పీకర్ మూసి బుజ్జితల్లే సర్ ...... , బుజ్జితల్లీ ...... అమ్మకు ఇవ్వు - తాతయ్యనా ...... తాతయ్య తాతయ్య ఇక్కడే నాదగ్గరే ఉన్నారు - మాట్లాడాలా ...... ? అదీ అదీ పనిలో ఉన్నారు బుజ్జితల్లీ ....... అమ్మకు ఇవ్వు బంగారూ ....... , అక్కయ్యా ...... మీరు టిఫిన్ తినండి ఆలస్యం అవుతుంది వచ్చేస్తాము కదా ....... , సరే సరే వీలైనంత తొందరగా వచ్చేస్తాము అని కట్ చేసి హమ్మయ్యా ...... అనుకున్నాడు . 
మంచిపనిచేశావు కృష్ణా ...... లేకపోతే పెద్దయ్యను చూసేంతవరకూ కంగారుపడతారు . 
కృష్ణ : అదే భయంగా ఉంది సర్ ....... అక్కయ్య - బుజ్జితల్లి - అమ్మ - ఊరి జనం .... చెప్పనేలేదు కదూ మా ఊరి పెద్ద మా నాన్నగారే సర్ , నాన్నగారి మాటంటే అందరికీ గౌరవం , సర్పంచి కూడా నాన్నగారు చెప్పినట్లే వింటారు .
అందరి ఆశీస్సులు ఉండటం వల్లనే మీ నాన్నగారికి ఏమీకాలేదు . ఆయన ఇక్కడ హాస్పిటల్లో ఉండటం కంటే అంతమంది ఆత్మీయుల మధ్యనే త్వరగా కోలుకుంటారు .

10 గంటల సమయంలో నర్స్ బయటకువచ్చి సర్ ...... మిమ్మల్ని పిలుస్తున్నారు .
లోపలికివెళ్లాము .
పెద్దయ్య : నాన్నా కృష్ణా ....... హాస్పిటల్ నాకు పడదని తెలుసుకదా , మత్తు మొత్తం పోయినట్లుంది - నన్ను తొందరగా నా బుజ్జితల్లి దగ్గరకు తీసుకెళ్లు చూడు చేతులు - కాళ్ళు కదిలిస్తున్నాను అని పిల్లాడిలా బ్రతిమాలుతున్నారు - లేవడానికి ప్రయత్నిస్తున్నారు .
నాకు - కృష్ణకు మరియు నర్సుకు కూడా నవ్వు వచ్చేసింది . పెద్దయ్యా ....... ఒక్క నిమిషం ఆగండి డాక్టర్ ను పిలుచుకునివస్తాను , వారు పర్లేదు అంటే మరుక్షణమే తీసుకెళ్లిపోతాము ( బుజ్జితల్లి ఎవరో చూడకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళేది లేదు ) .
నర్స్ : సర్ ..... ఆగండి నేను పిలుచుకునివస్తాను అని వెళ్ళి డాక్టర్ తోపాటు వచ్చారు .

డాక్టర్ గారిని ఆడిగేలోపు ...... , డాక్టర్ డాక్టర్ ...... నేను బానే ఉన్నాను , నొప్పులేమీ లేవు - నన్ను ఇంటికి పంపించేయ్యండి ఇక్కడ భయం వేస్తోంది అంటూ అటూ ఇటూ కదులుతున్నారు పెద్దయ్య .
కృష్ణ : నాన్నగారూ ....... సైలెంట్ గా ఉండండి , ఆ విషయం చెప్పాల్సినది డాక్టర్ గారు . డాక్టర్ గారూ ...... 
డాక్టర్ : త్వరగానే కోలుకున్నారు పెద్దయ్యా ...... . పొలం పనులు చేసినవాళ్ళు కదా చూస్తేనే తెలిసిపోతోంది - పేషెంట్ కు ఎక్కడ ఇష్టమో అక్కడికే తీసుకెళ్లండి .
కృష్ణ : డాక్టర్ గారూ .......
డాక్టర్ : కంగారుపడాల్సిన అవసరమే లేదు , కావాల్సినది రెస్ట్ తీసుకోవడం అదేదో ఆయన ఇష్టప్రకారం ఇంటిలోనే తీసుకోవచ్చు , అలా అయితేనే ఆత్మీయుల మధ్యన మరింత త్వరగా కోలుకుంటారు - మందులు రాసిస్తాను , డ్రెస్సింగ్ కోసం రెండు రోజులకొకసారి పిలుచుకునివస్తే సరిపోతుంది - డిశ్చార్జ్ చేస్తున్నట్లు సంతకం చేశారు . 

కృష్ణ : థాంక్యూ డాక్టర్ గారూ ........
డాక్టర్ : థాంక్స్ మీ నాన్నగారిని సేవ్ చేసినవారికి చెప్పండి - ట్రీట్మెంట్ చేసినందుకు మేము ఫీజ్ తీసుకున్నాము కదా ........
డాక్టర్ గారూ ...... అవన్నీ అయిపోయాయి - ఇప్పుడు మళ్లీ మొదటికి వస్తారు కృష్ణా ....... స్టార్ట్ చెయ్యకు .
కృష్ణ : అలాగే సర్ అంటూ పెదాలపై నవ్వుతూ ...... , నాన్నగారూ ...... సంతోషమే కదా , మీ ఇష్టప్రకారమే ఇంటికి వెళదాము - అంబులెన్స్ ను సెట్ చేస్తాను .
పెద్దయ్య : అంబులెన్స్ లో వెళితే మీ అక్కయ్య - అమ్మ - మన బుజ్జితల్లి భయపడిపోతారు , బండి తెచ్చావుకదా వెనుక కూర్చుంటాను .
భలేవారు పెద్దయ్యా ....... ఇంకేమైనా ఉందా , కృష్ణా ...... మందుల రిసిప్ట్ ఇవ్వు , మందులు తీసుకుని క్యాబ్ తీసుకొస్తాను - అంతలోపు నాన్నగారిని వీల్ చైర్ లో బయటకు తీసుకురా ........
కృష్ణ : అలాగే సర్ అంటూ రిసిప్ట్ ఇచ్చాడు . 
హాస్పిటల్లోని మెడికల్ షాప్ లో మెడిసిన్ తీసుకుని , బయటకువెళ్లి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను .
కృష్ణ : చూడండి సర్ ...... వీల్ చైర్ వద్దు నడుస్తాను అన్నారు . బ్రతిమిలాడి వీల్ చైర్లో తీసుకురావాల్సి వచ్చింది .
పెద్దయ్యా ...... త్వరగా కోలుకోవాలంటే తప్పదు అని జాగ్రత్తగా వెహికల్లో కూర్చోబెట్టాను . 
పెద్దయ్య : అదికాదు బాబూ ...... ఇంటిదగ్గర చాలా పనులున్నాయి . ఇంతకీ చెప్పనేలేదు కదూ మావాడి పెళ్లి , ఈపాటికి పెళ్ళికొడుకుని చేయాల్సింది ....... అందరూ కంగారుపడుతుంటారు .
కృష్ణ : పర్లేదు నాన్నగారూ ...... కావాలంటే పెళ్లిని పోస్ట్ ఫోన్ చేయిద్దాము - మీరు కోలుకోవడం ముఖ్యం - అమ్మ అక్కయ్య నుండి ఈపాటికి 100 పైనే కాల్స్ వచ్చాయి - వస్తున్నాము అని మెసేజ్ పెడుతున్నాను కానీ మాట్లాడే ధైర్యం లేదు .
పెద్దయ్య : వద్దు వద్దు కృష్ణా ...... , నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా , అయినా నాకేమైంది - కట్లు విప్పి పెళ్ళిపనులు చెయ్యడానికి రెడీగా ఉన్నాను - మనసులో ఏమీ పెట్టుకోకు , నిన్ను ఎంత ప్రేమించింది ఆ పిల్ల నా కోడలు , నా వలన పెళ్లి ఆపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు , మన ఇంటికీ మంచిదికాదు - ఏదీ మొబైల్ ఇవ్వు అని కాల్ చేశారు , అయ్యో ....... వచ్చేస్తున్నాము తల్లీ ...... మీరు మొదలుపెట్టండి 15 నిమిషాలలో అక్కడ ఉంటాము . కృష్ణా ....... ఏర్పాట్లన్నీ రెడీ పదా వెళదాము .
( బుజ్జితల్లి - పెళ్లి ....... యాహూ ...... నా దేవత దగ్గరకే వెళుతున్నాము ) కృష్ణా ...... బైక్ ఎక్కడ నేను ఫాలో అవుతాను .
కృష్ణ : నో నో నో సర్ ...... , బండి ఎక్కడికీ వెల్లదు మీరు కారులో కూర్చోండి అని ముగ్గురమూ బయలుదేరాము .

పెద్దయ్యను ఏ మెయిన్ రోడ్డులోనైతే వైజాగ్ హాస్పిటల్ కు చేర్చానో అదే రోడ్డులో వెనక్కువచ్చి ఆక్సిడెంట్ అయిన ప్లేస్ కు 100 అడుగుల దూరంలో రైట్ సైడ్ మట్టి రోడ్డు ద్వారా లోపలికి పోనివ్వమని డ్రైవర్ కు చెప్పాడు కృష్ణ .
కృష్ణా ....... అదిగో అక్కడే మీ నాన్నగారిని చూసాను - మొబైల్ అక్కడే పడి ఉంటుంది . 
కృష్ణ : డ్రైవర్ ...... అక్కడికి పోనివ్వండి .
పెద్దయ్య : కృష్ణా ...... నాకు మళ్లీ చూడాలని లేదు - నువ్వు వెళ్లు - బండిని కూడా అక్కడే వదిలేసెయ్యి - ఇక జీవితంలో ఆ బండిని చూడకూడదు .
కృష్ణ : అలాగే నాన్నగారూ అంటూ కిందకుదిగాడు .
వెనుకే వెళ్లి ఆ ప్రాంతమంతా వెతికినా - రింగ్ చేసినా ఉపయోగం లేకపోయింది . వదిలెయ్యండి సర్ వెళదాము , ఈ బుల్లెట్ బండి అంటే నాన్నగారికి చాలా ఇష్టం - ఎప్పుడూ ఇలా జరగలేదు అని బాధపడుతూ కారులోకి చేరాము .

పెద్దయ్యా ....... బుల్లెట్ ను బాగా నడుపుతారని కృష్ణ చెప్పాడు , ఇంతకీ ఎలా జరిగింది .
పెద్దయ్య : ఉదయం 5 గంటలకు నా బిడ్డ - మనవరాలు బెంగళూరు నుండి వస్తున్నారని తెలిసి తీసుకెళ్లడానికి సంతోషంగా బస్ స్టాండ్ కు బయలుదేరాను . మట్టి రోడ్డు నుండి ఇక్కడ టర్న్ అవ్వగానే రాంగ్ రూట్ లో వస్తున్న లారీని తప్పించబోయి చివరన ఢీకొట్టాను - ఎలా కిందపడ్డానో తెలియదు , దేవుడిలా వచ్చి పెద్దయ్యా పెద్దయ్యా అంటూ నన్ను పలకరించి కాపాడటమే గుర్తు అంటూ మళ్లీ దండం పెట్టారు .
పెద్దయ్యా ....... కృష్ణ ...... నువ్వుకూడానా ? , మొదలెట్టేశారా ..... ?  అంటూ నవ్వుకున్నాము . 

పెద్దయ్యా - కృష్ణా ....... మిమ్మల్ని రక్షించిన బస్సులోనే మీ అమ్మాయి మహి - బుజ్జితల్లి కీర్తీ బెంగళూరు నుండి వచ్చారు .
పెద్దయ్య : మహి - కీర్తీ ....... మీకెలా? , అంటే ట్రైన్ మిస్ అవ్వడంతో బెంగళూరు నుండి మా వాళ్ళను క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు కూడా మీరేనా ? .
షాక్ - మీకెలా తెలుసు పెద్దయ్యా ....... 
పెద్దయ్య : నా కూతురు కాల్ చేసిన ప్రతీసారీ చెప్పింది మీ గురించి , నాన్నగారూ ..... మీరేమీ కంగారుపడకండి దేవుడి లాంటి వ్యక్తి తోడుగా వస్తున్నారని .
మరొక స్వీట్ షాక్ , పెద్దయ్యా ....... మహి గారు నిజంగానే దేవుడు అన్నారా ...... ? లేక మీరు ........
కృష్ణ : నాతో కూడా చెప్పారు సర్ - దేవుడు అనలేదు కానీ ఇంచుమించు అదే అర్థం వచ్చేలా చెప్పారు . అప్పటికి కానీ మాకు కంగారు తగ్గలేదు - అంతదూరం నుండి ఒంటరిగా అంటే చాలా చాలా భయం వేసింది . అక్కయ్య - మా ప్రాణమైన బుజ్జితల్లిని క్షేమంగా తీసుకొచ్చినందుకు గానూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ ....... , సర్ ...... ఇదే మా చిన్న ఊరు - ఊరు చిన్నదే అయినా ప్రేమ , ఆప్యాయతలలో చాలా చాలా పెద్దది . మేమిద్దరు దేవుడు అని దండాలు పెడితేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యారు - నాన్నగారిని కాపాడారని తెలిస్తే ఊరంతా ....... చెప్పను మరొకనిమిషంలో మీరే చూస్తారుకదా అని పెద్దయ్యతోపాటు నవ్వుతున్నాడు . అంతలోనే క్యాబ్ పెళ్లి పందిరి - తోరణాలు - షామియానా మరియు చిరునవ్వులు చిందిస్తున్న జనాలు గల ఇంటి ముందు ఆగింది .
పెద్దయ్య : కృష్ణా ...... ఆక్సిడెంట్ అని చెప్పకు తట్టుకోలేరు , బుల్లెట్ నుండి కిందపడ్డాను అని చెప్పు - బాబూ ...... నువ్వుకూడా .......
నిజం చెప్పి అంతమందిని బాధపెట్టడం నాకూ ఇష్టం లేదు పెద్దయ్యా - జరిగినదేదో జరిగిపోయింది , మంచి నిర్ణయం తీసుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2021, 12:09 PM



Users browsing this thread: 50 Guest(s)