Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అలా దేవతను చూస్తుంటే నా బుజ్జి హృదయం చలించిపోయి నాకళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి . కన్నీళ్లను తుడుచుకుని హబ్బా హబ్బా హబ్బా ....... ఏమికొట్టారు మేడం పిచ్చా కొట్టుడు కొట్టారు మేడం వాడిని - నేను హ్యాండిల్ చేస్తాను అని ఊరికే అనలేదు మేడం మీరు , ఒక్కొక్క దెబ్బకు ఎగిరిగిరిపడ్డాడు వెధవ - నాకైతే పిచ్చకోపం వచ్చేసింది , మీరుకానీ కొట్టకపోయుంటే దేవతలాంటి మిమ్మల్ని అంటున్న ఒక్కొక్క మాటకు నా చేతిలో అయిపోయేవాడు , పైనుండి కిందకు ఎత్తిపడేసేవాడిని నాగురించి తెలియదు .
దేవత : బాధపడుతూనే ...... నేను కొట్టలేదు మహేష్ .......
మేడం ........
దేవత : నిజంగా నేను కొట్టలేదు మహేష్ - వాడిని తాకడం ఇష్టం లేక ఆగిపోయాను - ఎందుకు ఎగిరిగిరిపడ్డాడో నాకే ఆశ్చర్యం వేసింది .
( మరి పెద్దమ్మ కొడితే అలానే ఉంటుంది అని లోలోపలే నవ్వుకున్నాను ) మీరు కొడితే ఎలా ఉంటుందో నాకు తెలియదా మేడం ఒకటికి ఐదుసార్లు రుచిచూసాను అంటూ బుగ్గపై చేతినివేసుకుని రుద్దుకున్నాను .
దేవత : అంత గట్టిగా కొట్టానా ...... ? , sorry sorry మహేష్ అంటూ నవ్వుతూనే కన్నీరు కార్చారు .

దేవత బుగ్గలపైనుండి జాలువారిన కన్నీటిని నా చేతి దోసిళ్ళతో అందుకుని హమ్మయ్యా ....... అనుకున్నాను .
దేవత : ఏమైంది బుజ్జిహీరో ........
మీ కన్నీటి చుక్క నేలను తాకితే ఇంకేమైనా ఉందా ....... , తోటి దేవత కన్నీటిని కార్పించారా అంటూ భూతల్లి కోపాగ్నికి గురికావాల్సి వస్తుంది . 
దేవత : మహేష్ ...... నిన్నూ అంటూ నవ్వుతూ దెబ్బల వర్షం కురిపిస్తున్నారు .

యాహూ ....... మేడం నవ్వారు - నన్ను కొట్టారు అంటూ వెనక్కువెళ్లి లంచ్ బ్యాగ్ తీసుకొచ్చి ఓపెన్ చేసి పప్పన్నం గల బాక్స్ ను దేవతకు అందించాను తినమని ......
దేవత : ఆకలివెయ్యడం లేదు మహేష్ ....... నువ్వు తిను , మరికొద్దిగంటల్లో నాకిష్టమైన టీచింగ్ నుండి దూరం చేసేస్తున్నారు . 
అలా ఎవరన్నారు మేడం ....... , ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు - మీ కంట కన్నీరు చూసి పంచభూతాలు శాంతిగా ఉంటాయా ..... ? - ఒక బ్యాడ్ వెధవ ఏదో అన్నాడని అన్నం కాదనుకుంటే ఎలా చెప్పండి .
దేవత : నాకు తినాలనిపించడం లేదు మహేష్ - please please నువ్వు తిను .......
మీరు తినకుండా బాధపడుతూ ఉండటం చూస్తూ నేను ....... , ఉండండి బామ్మకు కాల్ చేస్తాను .
బుజ్జిహీరో .........
బామ్మ ఇంకా లైన్లోనే ఉన్నారన్నమాట అని స్పీకర్ ఆన్ చేసాను .
బామ్మ : బుజ్జితల్లీ .......
నవ్వుకుని , బుజ్జితల్లినా ....... ? .
దేవత : మహేష్ ...... , మా బామ్మ ఇప్పటికీ బుజ్జితల్లీ అని ప్రాణంలా ముద్దుగా పిలుస్తారు అని నవ్వారు .
బామ్మా ....... మేడం - మీబుజ్జితల్లి తినడం లేదు .
బామ్మ : బుజ్జితల్లీ ....... అంతా విన్నాను - గుణపాఠం చెప్పావుకదా ఇంకేమిటి - మన దైవం పెద్దమ్మ అనిచెప్పానుకదా భక్తితో ప్రార్థిద్దాము ముందు భోజనం చెయ్యి తల్లీ ....... - నువ్వు తినకపోతే నీ ప్రియాతిప్రియమైన శిష్యుడు ........
దేవత : తిన బుద్ధి కావడం లేదు బామ్మా ....... సాయంత్రం లోపు బుక్ సబ్మిట్ చెయ్యాలి - నా నవల పూర్తయినా బాగుండేది .
బామ్మ : బుజ్జితల్లీ నువ్వు తినకపోతే నేను తినను .
నేనూ తినను బామ్మా .........
బామ్మ : నాకు తెలుసు బుజ్జిహీరో ......... 
దేవత : బుజ్జిహీరో ........ ? .
అదీ అదీ ....... ఫోర్త్ - ఫిఫ్ట్ పీరియడ్స్ లో మేము ఫుల్ క్లోజ్ అయిపోయాము మేడం.
దేవత : క్లాస్ వినకుండా నువ్వు చేస్తున్నది ఇదా ........
Sorry sorry sorry ....... మేడం అంటూ గుంజీలు తియ్యడం చూసి దేవత నవ్వుకున్నారు .
హమ్మయ్యా ...... నవ్వేసారా ? , అయితే తినండి అని బాక్స్ అందించాను - please please మేడం మీరు తినకపోతే ఇద్దరం తినము మీ ఇష్టం అని చేతులుకట్టుకుని ప్రక్క బెంచ్ పై కూర్చున్నాను .
దేవత : అధికాదు బామ్మా ....... జాబ్ పోతే నెల నెలా బ్యాంకుకు కట్టాల్సిన ఇంట్రెస్ట్ ........
బామ్మ : నువ్వు తప్పు చెయ్యనప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు బుజ్జితల్లీ - మన బుజ్జిహీరో చెప్పినది విన్నావా లేదా ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు - నా బంగారం కదూ పాపం మన బుజ్జిహీరోకు ఆకలివేస్తోందేమో నాకు కూడా ....... ఇక నీ ఇష్టం , నేను కూడా ఫుడ్ ముందు కూర్చుని చేతులు కట్టుకున్నాను .
దేవత : ఒకరే అనుకుంటే ఇద్దరు ...... నీవల్లనే , తినండి అని చిరుకోపం - చిరునవ్వుతో గబగబా తింటున్నారు .
చూసి నవ్వుకుని , బామ్మా ....... ఇక మీరు తినవచ్చు - మేడం ...... తినేదేదో కాస్త నెమ్మదిగా తినవచ్చు కదా చూడండి వెక్కిళ్ళు వచ్చేసాయి అంటూ నీళ్లు అందించాను .
బామ్మ : లవ్ యు బుజ్జిహీరో ........ నేను లేని లోటును పూరిస్తున్నావు - హ్యాపీగా తింటాను . 
నేనుకూడా బామ్మా ....... అని దేవతతోపాటు తిన్నాను . బామ్మా ....... దేవతతో నా దేవతతో కలిసి తినే అదృష్టం కలిగింది .
బామ్మ : ఎంజాయ్ బుజ్జిహీరో ....... - ప్చ్ ...... కనులారా వీక్షించలేకపోతున్నాను - నువ్వు హ్యాపీ అయితే నేను డబల్ హ్యాపీ .........
దేవత : ఏమిటి ? గుసగుసలాడుతున్నారు .
ఏమీ లేదు ఏమీ లేదు మేడం మీరు తినండి .

బామ్మా ....... మేడం కడుపునిండా తిన్నారు .
బామ్మ : లవ్ యు sooooo మచ్ బుజ్జిహీరో - అక్కడ లేను కానీ ఉండి ఉంటే ప్రాణంలా గుండెలపైకి తీసుకుని ముద్దుపెట్టేదానిని .
రైట్ నౌ నేను అలానే ఫీల్ అవుతున్నాను బామ్మా - లవ్ యు లవ్ యు sooooo మచ్ .
దేవత : రెండు గంటల్లోనే ఒకరంటే మరొకరు ప్రాణం అయిపోయారు .......

అంతలో బెల్ మ్రోగడంతో ఒక్కొక్కరుగా క్లాస్మేట్స్ లోపలికివచ్చారు . 
దేవత బాక్స్ ను శుభ్రం చేసి ఇస్తాను అంటే , నో నో నో మేడం ....... నేనున్నాను కదా అని బ్యాగులో ఉంచుకుని బయటకువచ్చాము .
బామ్మ : బుజ్జితల్లీ ....... జరిగిన దాని గురించి ఏమీ ఆలోచించకుండా మిగిలిన మూడు క్లాస్ లు మామూలుగానే పూర్తి చెయ్యి సరేనా ....... 
దేవత : సరే బామ్మా ........

లంచ్ తరువాత ఫస్ట్ పీరియడ్ 2nd క్లాస్ ...... ఇద్దరమూ వెళ్ళాము .
పెద్దమ్మా ...... సబ్మిట్ చెయ్యడానికి ఒకరోజైనా సమయం ఉండి ఉంటే నేనే వెళ్లి ......
మెసేజ్ : " గప్ చుప్ అంతే " .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా ...... - అలాగే దేవత కూడా జరిగింది మరిచిపోయి హ్యాపీగా ఉండాలి పెద్దమ్మా .......
మెసేజ్ : " మా బుజ్జిహీరో కోరుకోవడమూ - ఈ పెద్దమ్మ తీర్చకపోవడమూనా " .
ఒక్కసారి క్లాస్ లోకి ఎంటర్ అయ్యాక దేవత తనకు ఇష్టమైన ప్లే వే పద్ధతిలో పిల్లలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ రెండు పీరియడ్ లు పూర్తిచేసి ఆఫ్టర్ లంచ్ ఇంటర్వెల్ కు స్టాఫ్ రూమ్ కు వెళ్లారు .
నేను బయటే ఆగడం చూసి లోపలికి రమ్మన్నారు . 
యాహూ ....... పర్లేదు మేడం , మీరు వెళ్ళండి నేను తోకలా ఇక్కడే ఉంటాను కదా ........
దేవత : sorry చెప్పాను కదా మహేష్ ........
నాకు మీ sorry కంటే కోపం ఇష్టం ........
దేవత : నిన్నూ ....... అని బుగ్గపై గిల్లేసి లోపలికివెళ్లారు .

లోపల టీచర్స్ అందరూ హెడ్ మాస్టర్ దెబ్బల గురించే డిస్కస్ చేస్తున్నారు - ఎవరు కొట్టారో కానీ భలే కొట్టారు ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయాయట ........
దేవత పెదాలపై చిరునవ్వులు .........
మన కంప్లైంట్స్ అన్నీ మేనేజ్మెంట్ కు చేరకుండా చూస్తున్నాడు ఆ మాత్రం పడాల్సిందే - కొలుకోవడానికి నెలలు పడతాయట అని నవ్వుకున్నారు .

క్లాస్ బెల్ మ్రోగడంతో దేవత చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి , మహేష్ మహేష్ ...... hi fi hi fi ......
మీరు ...... నాతో ....... hi fi అంటూ అక్కడికక్కడే సంతోషం పట్టలేక మాస్ స్టెప్పులు వేసాను .
దేవత : సంతోషంతో నవ్వుతూ స్టాప్ స్టాప్ స్టాప్ ....... అంటూ ముందుకు నడిచారు .
దేవత దగ్గరికి పరుగుతీసి హైఫై చూయించాను .
దేవత : ఈ హైఫై దేనికో తెలుసా ....... , హెడ్ మాస్టర్ కు దెబ్బలు తగిలాయని భలే జరిగింది అని స్టాఫ్ అంతా ఫుల్ హ్యాపీ ........
అంటే వాడు చాలా చాలా చాలా బ్యాడ్ వెధవ అన్నమాట అని చివరి పీరియడ్ పూర్తిచేశారు .

లాంగ్ బెల్ కొట్టగానే ....... , స్టూడెంట్స్ అందరిలో ఎంత ఉత్సాహం వచ్చిందో దేవత ముఖంలో అంత విచారం వ్యక్తమయ్యింది . బాధపడుతూ స్టాఫ్ రూమ్ చేరుకుని ఈరోజుతో స్కూల్ తో బంధం తెగిపోయింది బుజ్జిహీరో ...... అంటూ లాకర్ నుండి తమ ఐటమ్స్ అన్నీ తీసుకుని బయటకువచ్చారు .
ఈపాటికి కాల్ రావాల్సి ఉందే ........ 
దేవత మొబైల్ మ్రోగింది . దేవత పెదాలపై చిరునవ్వులు ........ - మహేష్ మహేష్ ........ మేనేజ్మెంట్ నుండి , నేను రాసిన " LIFE & TIME " నావెల్ ను ఎవరో స్కూల్ తరుపున సబ్మిట్ చేశారట - నువ్వు చెప్పినట్లే జరిగింది అని నా చేతిని అందుకుని ఊపుతూ ఆనందిస్తున్నారు . అయినా నేను రాసినది సగమే కదా అని ఆలోచనలో పడ్డారు .
యాహూ ........ గుడ్ గ్రేట్ సూపర్ మైండ్ బ్లోయింగ్ న్యూస్ మేడం ........ అంటూ దేవతతోపాటు ఆనందించాను . కానీ నాకు కావాల్సినది దేవత కోపం కదా ...... వెంటనే కోప్పడేలా చెయ్యాలి అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 02-10-2021, 10:51 AM



Users browsing this thread: Renangipraveen, 2 Guest(s)