Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#7
ముఖ్యమైన పాత్రల వంశవృక్షం, టూకీగా:


యూరెనస్ + గాయా → క్రోనస్, రేయా, థేమిస్ (పెద్ద)
క్రోనస్ + రేయా → జూస్, హేరా, పొసైడన్, హేడిస్, డిమిటర్, హేస్టియా
జూస్ + హేరా → ఎరీస్, హెఫీస్టస్ (లేదా, హేరా → హెఫీస్టస్?)
జూస్ + మేటిస్ → ఎథీనా
జూస్ + లేతో → అప్పాలో, ఆర్టిమిస్
జూస్ + మయియా → హెర్మీస్
జూస్ + సెమిలీ → డయొనీసన్
జూస్ + డయోన్ → ఏఫ్రొడిటి? లేదా యురేనస్ వృషణాల నుండి → ఏఫ్రొడైటి? (లేదా, జూస్ + డయోన్ → ఏఫ్రొడైటి?)
జూస్ + ఇతరులతో → పెర్సిఫొనీ (Persephone), పెర్సియస్ (Perseus), హెరాక్లిస్ (Heracles), ట్రోయ్‍కి చెందిన హెలెన్ (Helen), మినోస్ (Minos) కాకుండా తొమ్మిది మంది మ్యూజ్‍లు (Muses). (ఈ మ్యూజ్‍లు కళలకి, విద్యలకి అధిపత్నులు.)

థెమిస్
[Image: themis.jpg]

థెమిస్
క్రోనస్-రేయాల పుత్రిక. ఈమె ధర్మపరిపాలనకి అధినేత్రి. ఈమె కుడి చేతిలో దుష్టశిక్షణకి ఒక కత్తి, ఎడమ చేతిలో నిష్పక్షపాత ధర్మపాలనకి గురుతుగా ఒక త్రాసు ఉంటాయి. ఈమె కళ్ళకి కట్టిన గుడ్డ తీర్పు కొరకు వచ్చిన ప్రత్యర్థుల సాంఘిక స్థాయికి అతీతంగా ఆమె తీర్పు ఉంటుందని సూచిస్తుంది.
జాస్ అంతటివాడు తనకి వచ్చిన ధర్మసందేహాలని తీర్చుకుందుకి ఈమెని సంప్రదిస్తూ ఉంటాడు.
గ్రీసు చరిత్రలో మరొక థేమిస్ ఉంది ఈ ‘పెద్ద’ థెమిస్ యూరెనస్-గాయాల కూతురు. ఈమెకి భవిష్యత్తు చూడగలిగే శక్తి ఉంది. ఈ శక్తిని ఆమె తన పెరింటిగత్తె అయిన ‘చిన్న’ థెమిస్‍కి ధారపోసిందని ఒక ఐతిహ్యం ఉంది.

జూస్‍ని పోలిన వ్యక్తి ఇంద్రుడు అని అనుకున్నాం కదా. హిందూ పురాణాలలోని దత్తాత్రేయ పురాణం ప్రకారం బ్రహ్మ మానసపుత్రులలో ఒకడైన మరీచి కొడుకు కశ్యపుడు. ఇతను (బ్రహ్మ మానసపుత్రులలో మరొకడైన) దక్షప్రజాపతి యొక్క ఎనమండుగురు కూతుళ్ళని పెళ్లి చేసుకుంటాడు. వీరిలో పెద్ద కూతురు అదితికి పుట్టిన వారిలో ఆదిత్యులు పన్నెండుమంది, వసువులు ఎనమండుగురు, రుద్రులు పదకొండుమంది, అశ్వినీ దేవతలు ఇద్దరు. జూస్ పన్నెండుగురు ఒలింపియనులలో ఒకడైతే, ఇంద్రుడు పన్నెండుగురు ఆదిత్యులలో (అనగా, అదితి కొడుకులలో) ఒకడు.

ఋగ్వేదం (1.164.33) ప్రకారం ఇంద్రుడు ద్యయుస్‍కి (ఆకాశం), పృధ్వికి (భూదేవి) పుట్టిన కొడుకు.

[+] 1 user Likes WriterX's post
Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 08:26 PM



Users browsing this thread: 1 Guest(s)